Privacy Policy

PhonePe గిఫ్ట్ కార్డ్‌లు/రివార్డ్‌ల వినియోగ నియమాలు

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াবাংলাहिन्दीಕನ್ನಡଓଡ଼ିଆ
< Back
  • PhonePe రివార్డ్‌ల ప్రోగ్రామ్
  • రివార్డ్‌ల (క్యాష్‌బ్యాక్) పరిమితి

కంపెనీల చట్టం, 1956 కింద ఏకీకృతం చేయబడిన PhonePe ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ (ఇకపై “PhonePe”గా పిలవబడుతుంది) ఆఫీస్-2, 4,5,6,7 వ అంతస్తులు, A వింగ్, A బ్లాక్, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లే అవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక- 560103, ఇండియా అనే చిరునామాలో రిజిస్టర్ కార్యాలయాన్ని కలిగి ఉంది. ఈ కంపెనీ జారీ చేసిన ఒక సెమీ క్లోజ్‌డ్ ప్రీపెయిడ్ పేమెంట్ సాధనం (ఇకపై “PhonePe గిఫ్ట్ కార్డులు”గా పిలువబడుతుంది) అయినటువంటి PhonePe గిఫ్ట్ కార్డు వినియోగాన్ని నియంత్రించడానికి ఈ నియమ, నిబంధనలు అమలు చేయబడతాయి. ఈ మేరకు PhonePeకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), 9 డిసెంబర్ 2016 తేదీన ఆథరైజేషన్ నంబర్: 98/2016 ప్రకారం అనుమతిని మంజూరు చేసింది.

గిఫ్ట్ కార్డును కొనుగోలు చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నియమ, నిబంధనలను ఒప్పుకొని, వాటిని అంగీకరిస్తున్నారు.

  1. కొనుగోలు:
    గిఫ్ట్ కార్డును రూ. 10,000 విలువ వరకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. వ్యాపార నియమాలు లేదా మోసపూరిత చర్యల నివారణ నియమాల ఆధారంగా PhonePe గిఫ్ట్ కార్డ్ గరిష్ఠ మొత్తాన్ని క్యాష్ చేయవచ్చు. మీరు గిఫ్ట్-రివార్డ్‌‌లు, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి PhonePe గిఫ్ట్ కార్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. గిఫ్ట్ కార్డ్‌లను వాలెట్ లేదా గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించి కొనుగోలు చేయలేరు. సాధారణంగా గిఫ్ట్ కార్డులు తక్షణమే డెలివరీ చేయబడతాయి. కానీ కొన్నిసార్లు సిస్టమ్ సమస్యల వల్ల డెలివరీ 24 గంటల వరకు ఆలస్యం కావచ్చు.
  2. పరిమితులు:
    గిఫ్ట్ కార్డులు, వాటిని జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు చెల్లుతాయి, ఆ తర్వాత వాటి గడువు ముగిసిపోతుంది. వాటిలో ఉపయోగించని గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ గడువు కూడా ముగుస్తుంది. గిఫ్ట్ కార్డ్‌లను రీలోడ్ చేయడం, తిరిగి అమ్మడం, విలువ కోసం బదిలీ చేయడం లేదా నగదు కోసం రిడీం చేయడం వీలు కాదు. ఉపయోగించని గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్‌లు మరొక PhonePe ఖాతాకు బదిలీ చేయబడవు. ఏదైనా గిఫ్ట్ కార్డ్ లేదా గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్‌‌పై PhonePe ఎటువంటి వడ్డీని చెల్లించదు.
  3. రిడీం చేయడం:
    PhonePe ప్లాట్‌‌ఫామ్‌లో అర్హత కలిగిన మర్చెంట్లతో చేసే లావాదేవీలతో మాత్రమే గిఫ్ట్ కార్డ్‌ను రిడీం చేసుకోవచ్చు. కొనుగోలు మొత్తం యూజర్‌ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ నుండి డెబిట్ చేయబడుతుంది. ఉపయోగించని గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ యూజర్‌ PhonePe ఖాతాతో అనుబంధించబడి ఉంటుంది, సమీప గడువు తేదీ ప్రకారం కొనుగోళ్లకు వర్తించబడుతుంది. ఒకవేళ కొనుగోలు ధర అనేది, యూజర్‌ వద్ద ఉన్న గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్‌ను మించి ఉంటే, మిగిలిన మొత్తాన్ని అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్‌లతో చెల్లించాలి. గిఫ్ట్ కార్డులను రిడీం చేయడానికి యూజర్‌ ఫీజులు లేదా ఛార్జీలు విధించబడవు.
  4. మోసం:
    గిఫ్ట్ కార్డ్‌ను కోల్పోయినా, అది దొంగిలించబడినా, ధ్వంసం చేయబడినా లేదా అనుమతి లేకుండా ఉపయోగించబడినా PhonePe ఎలాంటి బాధ్యత వహించదు. మోసపూరితంగా పొందిన గిఫ్ట్ కార్డు రిడీం చేయబడితే/లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌లో కొనుగోళ్లను చేయడానికి ఉపయోగించినట్లయితే కస్టమర్ ఖాతాలను మూసివేయడానికి అలాగే ప్రత్యామ్నాయ చెల్లింపులను స్వీకరించడానికి PhonePeకి హక్కు ఉంటుంది. PhonePe మోస నివారణ విధానాలు PhonePe ప్లాట్‌ఫామ్‌లో గిఫ్ట్ కార్డులు ఇంకా రిడెంప్షన్ రెండింటినీ కవర్ చేస్తాయి. మోస నివారణ విధానాల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తించే లావాదేవీలను PhonePe నిలిపివేయవచ్చు. మోసపూరితంగా పొందిన/కొనుగోలు చేసిన గిఫ్ట్ కార్డులను రద్దు చేసే హక్కును, అలాగే మా మోస నివారణ వ్యవస్థలు ఏవైనా ఖాతాలను అనుమానాస్పదమైనవిగా భావిస్తే వాటిపై పరిమితులను విధించే హక్కును PhonePe కలిగి ఉంది.
  5. ప్రీ-పెయిడ్ ఇ‌‌న్‌స్ట్రుమెంట్:
    గిఫ్ట్ కార్డులు అనేవి RBI నిబంధనలకు లోబడి ఉండే ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇ‌‌న్‌స్ట్రుమెంట్ అని మీరు అర్ధం చేసుకొని వాటిని అంగీకరిస్తున్నారు. RBI మార్గదర్శకాల ప్రకారం, గిఫ్ట్ కార్డ్ కొనుగోలుదారు / రిడీం చేసిన వ్యక్తికి చెందిన KYC వివరాలను మరియు/లేదా ఆ గిఫ్ట్ కార్డుల కొనుగోలుకు సంబంధించి మరియు/లేదా ఆ గిఫ్ట్ కార్డ్ ఉపయోగించి చేపట్టిన లావాదేవీలకు సంబంధించి ఏదైనా ఇతర సమాచారాన్ని RBI లేదా అలాంటి చట్టపరమైన అధికారిక సంస్థలతో పంచుకోవాల్సిన అవసరం PhonePe Pvt. Ltd సంస్థకు రావచ్చు. అటువంటి సమాచారం కోసం PhonePe Pvt. Ltd ఆ గిఫ్ట్ కార్డ్‌కు సంబంధించిన కొనుగోలుదారును/రిడీం చేసిన వ్యక్తిని సంప్రదించవచ్చు.

PhonePe రివార్డ్‌ల ప్రోగ్రామ్

arrow icon

PhonePe అప్పుడప్పుడు యూజర్‌లకు రివార్డ్ రూపంలో ప్రోత్సాహకాలను అందించవచ్చు, వారు దాన్ని తగిన విధంగా రిడీం చేసుకోవచ్చు.

PhonePe వినియోగాన్ని అంగీకరించడం ద్వారా, PhonePe సేవల వినియోగదారు ఈ కింది నియమ, నిబంధనలకు అంగీకరిస్తున్నారు:

  1. ఎప్పటికప్పుడు నిర్ణయించే అంతర్గత విధానాల ప్రకారం, తన వినియోగదారులకు రివార్డ్‌లను అందించే హక్కును PhonePe కలిగి ఉంది.
  2. క్యాష్‌బ్యాక్‌ను అందించడానికి, దాన్ని వినియోగించడానికి వర్తించే PhonePe నియమ, నిబంధనలన్నీ క్యాష్‌బ్యాక్ రివార్డ్‌ల విషయంలో వర్తించడం కొనసాగుతుంది (రెఫరెన్స్: PhonePe నియమ, నిబంధనలలోని “క్యాష్‌‌బ్యాక్/వాలెట్ బ్యాలెన్స్ పరిమితి” విభాగాన్ని చూడండి).
  3. ఎప్పటికప్పుడు PhonePe ద్వారా అనుమానాస్పద లేదా మోసపూరిత కార్యకలాపాలు గుర్తించబడితే ఏ నోటీసు/సమాచారం లేకుండా యూజర్‌ల ఖాతా నుండి (రిడీం చేసే ముందు లేదా చేసిన తర్వాత) రివార్డ్‌లను వెనక్కి తీసుకునే హక్కును PhonePe కలిగి ఉంది.
  4. PhonePe ద్వారా పొందిన రివార్డ్‌ను (స్క్రాచ్ చేయడం ద్వారా) వినియోగదారు క్లెయిమ్ చేయవలసి ఉంటుంది. యూజర్‌కు అటువంటి స్క్రాచ్ కార్డ్‌ను మంజూరు చేయడం/అందించడం జరిగిన తేదీ నుండి ముప్పై (30) క్యాలెండర్ రోజులలోపు ఏవైనా రివార్డ్‌లను వినియోగదారు క్లెయిమ్ చేసుకోకపోతే వాటిని వదులుకున్నట్టుగా భావించబడతాయి/ అవి రద్దు చేయబడతాయి.
  5. ఎలాంటి రివార్డ్‌కు ఏ విధమైన హామీ ఇవ్వబడదు.
  6. మీరు రివార్డ్‌ను గెలుచుకుంటే, రివార్డ్ మొత్తం మీ PhonePe ఖాతాకు PhonePe గిఫ్ట్ వోచర్‌గా జమ చేయబడుతుంది.
  7. మీ నుండి అదనపు సమ్మతి కోరకుండా లేదా మీకు పరిహారం అందించకుండా ప్రచార ప్రయోజనాల కోసం PhonePe మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
  8. తమిళనాడు రాష్ట్రంలో (తమిళనాడు ప్రైజ్ స్కీమ్ (నిషేధం) చట్టం 1979 కారణంగా) మరియు చట్టం ద్వారా నిషేధించబడిన ఇతర రాష్ట్రాలలో ఈ ఆఫర్ అందుబాటులో లేదు.
  9. ఏ ఆఫర్‌లోనైనా వినియోగదారులు పాల్గొనడం అనేది, ఒక్కో ఆఫర్‌కు సంబంధించిన నియమ, నిబంధనలను వారు పూర్తిగా అవగాహన చేసుకుని అంగీకరించారని సూచిస్తుంది.

రివార్డ్‌ల (క్యాష్‌బ్యాక్) పరిమితి

arrow icon

మీకు క్యాష్‌బ్యాక్‌కు అర్హత ఉంటే, దాన్ని PhonePe గిఫ్ట్ వోచర్ రూపంలో స్వీకరించడానికి అంగీకరిస్తున్నారు.

PhonePe గిఫ్ట్ వోచర్‌లు 1 సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతాయి, ఒక్కో గిఫ్ట్ వోచర్‌కు రూ. 10,000 గరిష్ట పరిమితి ఉంటుంది. మీ వోచర్‌ల చెల్లుబాటు వ్యవధిని PhonePe తన విచక్షణ మేరకు పొడిగించే హక్కును కలిగి ఉంటుంది.

మొత్తంగా వర్తించే పరిమితికి అదనంగా ఇతర పరిమితులను విధించే హక్కును PhonePe కలిగి ఉంటుంది.

PhonePe ఎప్పటికప్పుడు నిర్ణయించే అంతర్గత విధానానికి అనుగుణంగా, ఆఫర్లను, సంబంధిత ప్రయోజనాలను అందించే హక్కును PhonePe కలిగి ఉంటుంది.

నా లావాదేవీని రీఫండ్/రద్దు చేస్తే ఏమి జరుగుతుంది?

ఒకవేళ ఏదైనా లావాదేవీని రద్దు చేసినట్లయితే, దానిపై ఇచ్చిన క్యాష్‌బ్యాక్ అనేది, గిఫ్ట్ వోచర్ బ్యాలెన్స్ రూపంలో కొనసాగుతుంది. దానిని మీ బ్యాంక్ ఖాతాకు ఉపసంహరించుకోలేరు. దీనిని PhonePeలో (రీఛార్జ్‌లు, బిల్లు పేమెంట్లు, మొదలైన వాటి కోసం) ఉపయోగించవచ్చు.

రీఫండ్ అయ్యిన మొత్తంలో క్యాష్‌బ్యాక్‌ను మినహాయించి, చెల్లించేటప్పుడు ఉపయోగించిన ఫండ్స్ సోర్సుకు తిరిగి క్రెడిట్ చేయబడుతుంది.

PhonePe పార్ట్‌నర్ ప్లాట్‌ఫామ్‌లు/దుకాణాలలో రీఛార్జ్‌లు, బిల్ పేమెంట్లు అలాగే ఇతర పేమెంట్ల కోసం క్యాష్‌బ్యాక్ గిఫ్ట్ వోచర్‌ను ఉపయోగించవచ్చు.

క్యాష్‌బ్యాక్ గిఫ్ట్ వోచర్‌ను ఏదైనా లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు ఉపసంహరించుకోలేరు, ఇతర కస్టమర్‌లకు బదిలీ చేయలేరు.

PhonePeలో అందుకునే ఆఫర్లన్నిటినీ కలిపి, ఒక యూజర్ ఒక ఆర్థిక సంవత్సరంలో (అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) గరిష్ఠంగా INR 9,999 వరకు మాత్రమే సంపాదించవచ్చు.

ఈ-వోచర్ కోడ్ కనిపించకపోతే, స్క్రీన్‌‌లో దోషం సందేశం కనిపిస్తే ఏమి జరుగుతుంది?

సాంకేతిక లోపం వల్ల ఈ-వోచర్ కోడ్ కనిపించకపోవడం, అందువల్ల ఆఫర్‌ను పొందలేకపోవచ్చు. దయచేసి ఆందోళన చెందకండి. కస్టమర్ కేర్ కేంద్రానికి కాల్ చేసి, స్క్రీన్‌షాట్‌ తీయడం ద్వారా లేదా దానిని బయటికి చదివి, దోష సందేశ వివరాలను పంచుకోండి. సవరించిన కోడ్ లేదా ప్రత్యామ్నాయ కూపన్/సమానమైన ఆఫర్ మీకు అందించబడుతుంది.