Privacy Policy

న్యూస్‌లెటర్ – సబ్‌స్క్రిప్షన్ నియమ, నిబంధనలు

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াবাংলাहिन्दीಕನ್ನಡଓଡ଼ିଆ
< Back

ఈ డాక్యుమెంట్‌ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 (“చట్టం”), అలాగే ఎప్పటికప్పుడు దీనికి చేసే సవరణలు, వాటి ప్రకారం వర్తించే నిబంధనలు, ఇంకా చట్టం ప్రకారం సవరించిన వివిధ చట్టాలలో ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించి సవరించిన నిబంధనల ప్రకారం రూపొందించిన ఎలక్ట్రానిక్ రికార్డ్. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను కంప్యూటర్ సిస్టమ్ సహాయంతో తయారు చేశారు. దీనిపై ఎలాంటి ఫిజికల్ లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.

దయచేసి న్యూస్‌లెటర్‌(ఈ కిందన దీని నిర్వచనాన్ని ఇచ్చాము)ను సబ్‌స్క్రైబ్ చేయడానికి, అలాగే యాక్సెస్ చేసుకోవడానికి ముందు ఈ నియమ, నిబంధనలు (“నియమాలు”)ను జాగ్రత్తగా చదవండి. ఈ నియమాలు, న్యూస్‌లెటర్‌కు మీకున్న యాక్సెస్‌ను మరియు/లేదా మీ సబ్‌స్క్రిప్షన్‌ను నియంత్రిస్తాయి, అలాగే ఆఫీస్-2, ఫ్లోర్ 5, వింగ్ ఎ, బ్లాక్ ఎ, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్‌,  గ్రీన్ గ్లెన్ లేఅవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక – 560103, భారత్‌ అనే అడ్రస్‌లో తన కార్యాలయాన్ని రిజిస్టర్ చేసుకున్న PhonePe ప్రైవేట్ లిమిటెడ్‌‌కు, మీకు మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి.

ఈ నియమాల ప్రకారం ‘PhonePe’కు సంబంధించిన రెఫరెన్స్‌లు అన్నీ దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్‌లు, ఉప సంస్థలు, గ్రూప్ కంపెనీలు, వాటికి చెందిన అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, ప్రతినిధులు, ఏజెంట్లకూ వర్తిస్తాయి, అలానే వీటన్నింటినీ సూచిస్తాయి. మీరు ఈ నియమాలను చదివారని అంగీకరించి, ఆమోదం తెలుపుతున్నారు. ఒకవేళ మీరు ఈ నియమాలను అంగీకరించకూడదని లేదా కట్టుబడి ఉండకూడదని అనుకున్నట్లయితే, మీరు న్యూస్‌లెటర్‌ను ఏ రూపంలోనూ యాక్సెస్ చేయకూడదు లేదా సబ్‌స్క్రైబ్ చేయకూడదు. PhonePe ప్లాట్‌ఫామ్‌(ఈ కింద దీనికి నిర్వచనాన్ని ఇచ్చాము)లో అందుబాటులో ఉన్న అన్ని ఇతర వెబ్‌సైట్ విధానాలు, సాధారణ నియమాలు లేదా ఉత్పత్తికి సంబంధించిన నియమ, నిబంధనలు, అలాగే కాలానుగుణంగా సవరించినవి కూడా, మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్న/యాక్సెస్ చేస్తున్న ప్రకారంగా  మీకు వర్తిస్తాయని కూడా అర్థం చేసుకున్నారు. PhonePe వెబ్‌సైట్(లు), PhonePe మొబైల్ అప్లికేషన్(లు), PhonePe యాజమాన్యంలో ఉన్న/హోస్ట్ చేసిన/ఆపరేట్ చేసిన/సమర్తిస్తున్న ఏవైనా ఇతర పరికరాలు/ప్రాపర్టీలు (సమిష్టిగా వీటిని “PhonePe ప్లాట్‌ఫామ్” అని పిలుస్తారు)లో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేసి మేము ఈ నియమాలను ఎప్పుడైనా సవరించవచ్చు. ఈ నియమాల అప్‌డేట్ చేసిన వెర్షన్లు పోస్ట్ చేసిన వెంటనే అమలులోకి వస్తాయి. అటువంటి అప్‌డేట్‌లు/మార్పుల గురించి తెలుసుకునేందుకు ఈ నియమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది, అలానే అలాంటి అప్‌డేట్లు/మార్పులను మేము పోస్ట్ చేసిన తర్వాత కూడా మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం ఉపయోగించినట్లయితే ఆ అప్‌డేట్‌లు/మార్పులన్నింటినీ మీరు అంగీకరిస్తున్నట్లుగానే పరిగణిస్తాము. ఈ నియమాలకు అదనంగా మీరు ప్రతిపాదించిన లేదా వీటికి విరుద్ధంగా ఉన్న ఏవైనా నియమ, నిబంధనలను PhonePe పూర్తిగా తిరస్కరిస్తుంది, అలాగే అవి అమలు కావు లేదా ఎటువంటి ప్రభావాన్నీ చూపవు. మీరు ఈ నియమాలను అంగీకరించిన తర్వాత, న్యూస్‌లెటర్‌ను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి, పాల్గొనడానికి మీకు వ్యక్తిగతంగా, ప్రత్యేకం కాని, బదిలీ చేయలేని, పరిమిత అధికారాన్ని మేము మంజూరు చేస్తాము.

  1. నిర్వచనం
    •  “న్యూస్‌లెటర్” అంటే వార్తలను విశ్లేషించి, రాతపూర్వకంగా తెలియచేసే నివేదిక, దీన్ని నిర్దిష్ట కాలవ్యవధిలో విడుదల చేస్తారు, నిర్దిష్ట ఆసక్తి ఉన్న వ్యక్తులకు అవసరమైన సమాచారాన్ని ఇది అందిస్తుంది, అంటే తరచుగా భవిష్యత్తులో జరగబోయే అంశాలకు సంబంధించిన విషయాలను తెలుపుతుంది, సాధారణంగా ఇది ప్రత్యేక పాఠకులకు ఉద్దేశించినది, అలాగే దీన్ని సబ్‌స్క్రైబర్లకు వినియోగిస్తారు.
    • “మేము”, “మా”, “మాది” అంటే PhonePe అని పరిగణించాలి.
    • “మీరు”, “మీది” అంటే PhonePe యూజర్/కస్టమర్ అని అర్థం.
  1. అర్హత
    • న్యూస్‌లెటర్‌ను యాక్సెస్ చేయడం/ఉపయోగించడం మరియు/లేదా సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా, మీరు ఈ కింద పేర్కొన్న అంశాలకు తగినట్లుగా ఉంటున్నారని, వీటిని పాటిస్తున్నారని హామీ ఇస్తున్నారు:
      • మీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు, అలాగే చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని కుదుర్చుకునే సామర్థ్యం మీకు ఉంది.
      • మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న, అలాగే కాలానుగుణంగా సవరించిన ఈ నియమాలను, అన్ని ఇతర వెబ్‌సైట్ పాలసీలను, జనరల్/ఉత్పత్తికి సంబంధించిన నియమాలను అన్ని వేళలా తప్పకుండా పాటించాలి.
      • PhonePeను యాక్సెస్ చేసే విషయంలో మీపై ఏ రూపంలోనూ నిషేధం లేదు లేదా చట్టపరమైన ఆంక్షలు లేవు.
      • మీరు వేరే వ్యక్తి/సంస్థలాగా నటించడం లేదు. 
      • మీరు పేర్కొన్న మొత్తం సమాచారం, వివరాలు, సమర్పించిన డాక్యుమెంట్లు వాస్తవమైనవని, అవి మీకు చెందినవని, అలాగే మీరు వాటిని ఎల్లప్పుడూ PhonePe ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్ చేస్తారని అంగీకరిస్తున్నారు.
    • పైన పేర్కొన్న నిబంధనలను మీరు తప్పుగా వ్యక్తపర్చినట్లయితే, PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీ అకౌంట్‌ను వెంటనే క్లోజ్ చేసే హక్కు PhonePeకు ఉంది, అలానే అవసరమని భావించిన మేరకు మీపైన ఏవైనా ఇతర చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు.
  2. సబ్‌స్క్రిప్షన్
    న్యూస్‌లెటర్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే, ముందుగా మీ సుముఖతను వ్యక్తం చేయడానికి మీ ఇమెయిల్ చిరునామాను సమర్పించాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ సమయంలో మేము అడగబోయే సమాచారంలో మీ యూజర్‌నేమ్, పేరు, వయస్సు, నివాస స్థలం, ఫోన్ నంబర్ కూడా ఉండవచ్చు. మీరు ఈ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్నట్లయితే మీరు ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలను చెల్లించక్కర్లేదని స్పష్టం చేయడమైనది.
  1. న్యూస్‌లెటర్‌ను పొందేందుకు అనుసరించాల్సిన నిర్దిష్ట నిబంధనలు
    న్యూస్‌లెటర్‌కు సంబంధించి, మీరు ఈ కింది విషయాలను అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:
    • మా న్యూస్‌లెటర్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, మీరు మా నుంచి ఈమెయిల్ పొందడానికి అంగీకరిస్తున్నారు. తాజా పరిణామాలు, వార్తా కథనాలు, బిజినెస్ ఈవెంట్లు, అభిప్రాయాలు, సమాచార గణాంకాలు, ట్రెండింగ్‌లో ఉన్న చర్చల గురించి మీకు తెలియజేయడమే మా న్యూస్‌లెటర్ లక్ష్యం. మా న్యూస్‌లెటర్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అన్నది పూర్తిగా మీ ఇష్టం. కాకపోతే, న్యూస్‌లెటర్‌ను ఎప్పుడెప్పుడు, ఎన్నిసార్లు పంపాలన్నది పూర్తిగా మా సొంత అభీష్టానుసారం ఉంటుంది. న్యూస్‌లెటర్‌ను సవరించడానికి లేదా నిలిపివేయడానికి మరియు/లేదా మీ సబ్‌స్క్రిప్షన్‌ను ఎప్పుడైనా నిలిపివేయడానికి లేదా రద్దు చేయడానికి మాకు పూర్తి హక్కు ఉంటుంది.
    • న్యూస్‌లెటర్‌ను కేవలం మీ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందిస్తున్నాము. సహజంగానే దీనిలో సమగ్రంగా, పూర్తి వివరంగా సమాచారం ఉండదు. మేము ఎల్లప్పుడూ, మా పూర్తి సామర్థ్యం మేరకు, న్యూస్‌లెటర్‌లో తాజా, సంబంధిత సమాచారాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాము, అయితే, న్యూస్‌లెటర్‌లోని సమాచారం, కరెన్సీ గురించిన వివరాలు ఖచ్చితమైనవని, సంపూర్ణమైనవని, అలాగే ఆ సమాచారం వల్ల కలిగే దృక్కోణాలకు సంబంధించి మేము హామీ ఇవ్వము. ఎందుకంటే, ఎటువంటి నోటీసు లేకుండానే అవి ఎప్పుడైనా మారవచ్చు. న్యూస్‌లెటర్‌లో, అందులోని అభిప్రాయాలతో సహా, మార్కెట్ పనితీరు డేటా రూపంలో లేదా ఏదైనా నిర్దిష్ట వ్యక్తికి ఏ రకమైన సెక్యూరిటీ, సెక్యూరిటీల పోర్ట్‌ఫోలియో, ఇన్వెస్ట్‌మెంట్ ఉత్పత్తులు లేదా ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహం అనుకూలమని సూచించే విధంగా పెట్టుబడి సలహాలు ఏవీ ఉండవు. అంతేగాక, ఈ న్యూస్‌లెటర్‌ను షేర్లు, స్టాక్‌లు, బాండ్‌లు, నోట్‌లు, ప్రయోజనాలు, యూనిట్‌ ట్రస్ట్‌లు, మ్యూచువల్ ఫండ్లు లేదా ఇతర సెక్యూరిటీలు, పెట్టుబడులు, లోన్లు, అడ్వాన్స్‌లు, క్రెడిట్‌లు లేదా ఏదైనా అధికార పరిధిలో డిపాజిట్లను అమ్మడం, కొనడం, ఇవ్వడం, తీసుకోవడం, జారీ చేయడం, కేటాయించడం లేదా బదిలీ చేయడం లేదా వీటికి సంబంధించి ఏదైనా సలహా ఇవ్వడం వంటి ఆఫర్‌గా లేదా విన్నపంగా పరిగణించకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఎల్లప్పుడూ నిపుణుల సలహాను తీసుకోవాలని, ఇంకా న్యూస్‌లెటర్‌లోని విషయాలను స్వయంగా మీరే ధృవీకరించుకోవాలని మీకు సలహా ఇస్తున్నాము. న్యూస్‌లెటర్‌లో ఉన్న సమాచారాన్ని పూర్తిగా మీ సొంత నిర్ణయం మేరకే మీరు ఉపయోగిస్తున్నారని భావిస్తాము, అంతేకాక అలా ఉపయోగించడం వల్ల ఉత్పన్నమయ్యే ఏవైనా ప్రతికూల పరిణామాలకు మేము బాధ్యత వహించము. న్యూస్‌లెటర్‌లో అందించిన మెటీరియల్‌ను నిర్దిష్ట లక్ష్యాలు, పరిస్థితులు లేదా ఎవరైనా వ్యక్తిగత యూజర్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించలేదు. 
    • మీరు (నేరుగా లేదా ఏదైనా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించి) న్యూస్‌లెటర్‌లోని అన్ని పేజీలను లేదా పేజీలోని ఏదైనా భాగాన్ని క్రమం తప్పకుండా లేదా క్రమపద్ధతిలో డౌన్‌లోడ్ చేసి, అలాగే స్టోర్ చేసి ఎలక్ట్రానిక్ లేదా నిర్మాణాత్మక మాన్యువల్ రూపంలో డేటాబేస్‌ను క్రియేట్ చేయకూడదు. PhonePe జారీ చేసిన ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా న్యూస్‌లెటర్‌లోని ఏదైనా భాగాన్ని మళ్లీ రూపొందించడం లేదా మరే ఇతర వెబ్‌సైట్‌కు పంపడం లేదా స్టోర్ చేయడం లేదా దాని పేజీలు లేదా దానిలోని ఒక భాగాన్ని ఏదైనా ఎలక్ట్రానిక్ లేదా నాన్-ఎలక్ట్రానిక్ రూపంలో అందరికీ పంపడం లేదా ఏదైనా పబ్లిక్ లేదా ప్రైవేట్ ఎలక్ట్రానిక్ రిట్రీవల్ సిస్టమ్‌లో చేర్చడం వంటివి చేయకూడదు. ఏదైనా ఇతర వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ లేదా బ్లాగ్‌లో ఉపయోగించడం కోసం న్యూస్‌లెటర్‌లోని కంటెంట్‌ను చూపడం, పోస్ట్ చేయడం, ఫ్రేమ్ చేయడం లేదా స్క్రాప్ (కంటెంట్‌లో ఏదైనా భాగాన్ని చెరిపేయడం) చేయడం వంటివి చేయకూడదని కూడా మీరు అంగీకరిస్తున్నారు. న్యూస్‌లెటర్‌ లేదా దానిలోని కంటెంట్లకు సంబంధించిన ఫ్రేమింగ్ లేదా స్క్రేపింగ్ లేదా మరియు/లేదా వెబ్ క్రాలర్, స్పైరింగ్ లేదా ఇతర ఆటోమేటిక్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా న్యూస్‌లెటర్‌లో అందుబాటులో ఉన్న లేదా దాని ద్వారా పొందిన ఏదైనా కంటెంట్‌ను యాక్సెస్ చేయడం, కాపీ చేయడం, ఇండెక్స్ చేయడం, ప్రాసెస్ చేయడం మరియు/లేదా స్టోర్ చేయడాన్ని నిషేధించడమైనది.
    • న్యూస్‌లెటర్‌లోని కంటెంట్‌లో ఒక వ్యక్తి స్వతంత్ర ఆలోచనలు, అలాగే పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారంతో థర్డ్ పార్టీలు అందించిన వివరాలను కలపగా వచ్చిన సమాచారం ఉంటాయి. మీ వ్యక్తిగత, చట్టబద్ధమైన, వాణిజ్యేతర వినియోగం మినహా, ఇక్కడ పేర్కొన్న వాటి కోసం మీరు వీటిని ఉపయోగించకూడదు: (i) PhonePe జారీ చేసిన ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా అటువంటి కంటెంట్‌లను కాపీ చేయడం, మళ్లీ రూపొందించడం, సవరించడం లేదా ప్రసారం చేయడం; (ii) ఏదైనా వాణిజ్య ప్రయోజనాల కోసం సహా, న్యూస్‌లెటర్‌లోని ఏదైనా భాగాన్ని అమ్మడం లేదా దోపిడీ చేయడం; (iii) దీన్ని ఆధారంగా చేసుకుని ఏదైనా కంటెంట్‌ను సృష్టించడం. ఏదైనా న్యూస్‌లెటర్‌ కాపీ లేదా దానిలోని కంటెంట్లను, భవిష్యత్తులో ఎప్పుడైనా చదువుకోవచ్చనే ఉద్దేశంతో, మీ పర్సనల్ డిస్క్‌లో లేదా మీకు చెందిన ఏదైనా ఇతర స్టోరేజ్ మీడియంలో దాచుకుని, వాణిజ్యేతర వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
    • న్యూస్‌లెటర్‌, రిసోర్స్‌లలో ఉన్న హైపర్‌లింక్‌లు(ఏవైనా ఉంటే)ను థర్డ్ పార్టీలు అందించాయి. వీటిని సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇచ్చాము, అంతే తప్ప అటువంటి లింక్ చేసిన వెబ్‌సైట్లను మేము ప్రమోట్ చేయట్లేదు లేదా ధృవీకరించట్లేదు. అటువంటి వెబ్‌సైట్లు లేదా మూలాధారాలలోని కంటెంట్‌పై మాకు ఎలాంటి నియంత్రణ లేదని మీరు అంగీకరిస్తున్నారు, అలాగే దానిలోని కంటెంట్‌కు లేదా ఆ లింక్‌లకు సంబంధించిన వెబ్‌సైట్లను యాక్సెస్ చేయడం వల్ల సంభవించే ఏదైనా నష్టం లేదా ముప్పునకు లేదా పరిణామాలకు మేము బాధ్యత వహించమని మీరు అంగీకరిస్తున్నారు. అటువంటి లింక్‌కు సంబంధించిన ఏదైనా వెబ్‌సైట్‌ను మీరు యాక్సెస్ చేయాలనుకున్నా మరియు/లేదా వినియోగించాలనుకున్నా అది పూర్తిగా మీ సొంత నిర్ణయం మేరకే చేస్తున్నారని, ఇంకా అందులో పేర్కొన్న యాక్సెస్ మరియు/లేదా వినియోగ నియమ, నిబంధనలకు లోబడి ఉంటున్నారని మీరు అంగీకరిస్తున్నారు. అటువంటి లింక్‌కు సంబంధించిన ఏదైనా వెబ్‌సైట్ గోప్యతా విధానాలకు మేము బాధ్యత వహించము. మీరు ఏదైనా థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌కి వెళ్లిన తర్వాత, వారు మీ నుండి సేకరించే ఏదైనా వ్యక్తిగత డేటాను వారు ఎలా నిర్వహిస్తారో తెలుసుకోవడానికి థర్డ్ పార్టీ వెబ్‌సైట్ పర్సనల్ డేటా పాలసీని మీరు చెక్ చేయాలి. మేము ఏదైనా థర్డ్ పార్టీ కంటెంట్‌కు (ఏదైనా కంప్యూటర్ వైరస్‌లు లేదా ఇతర డిసేబుల్ ఫీచర్‌లతో సహా, అలాగే వీటికే పరిమితం కాకుండా) బాధ్యత వహించము లేదా అటువంటి థర్డ్ పార్టీ కంటెంట్‌ను పర్యవేక్షించాల్సిన బాధ్యత మాకు లేదు.
    • మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించని లేదా మీ గుర్తింపును బయట పెట్టని పద్ధతులలో, మీకు సంబంధించిన, ఇంకా మీ యాక్సెస్/వినియోగానికి సంబంధించిన డెమోగ్రాఫిక్ డేటాను సేకరించడానికి, వినియోగించడానికి, అలాగే పంపిణీ చేయడానికి మాకు హక్కు ఉంది.
  1. మేధో సంపత్తి హక్కులు
    • న్యూస్‌లెటర్‌లో ట్రేడ్‌మార్క్‌లు, సర్వీస్ మార్క్‌లు, పేర్లు, టైటిళ్లు, లోగోలు, ఇమేజ్‌లు, డిజైన్‌లు, కాపీరైట్లు, అలాగే PhonePe (“PhonePe IP/మేధో సంపత్తి హక్కులు”) లేదా థర్డ్ పార్టీలు (“థర్డ్ పార్టీ IP/మేధో సంపత్తి హక్కులు”) సొంతం చేసుకున్న, రిజిస్టర్ చేసిన, అలాగే ఉపయోగిస్తున్న ఇతర యాజమాన్యాలకు చెందిన మెటీరియల్  ఉండవచ్చు. PhonePe IP, థర్డ్ పార్టీ IPలపై PhonePe లేదా థర్డ్ పార్టీకి, వీటిలో ఏదైతే దానికి, మాత్రమే సర్వ హక్కులూ ఉన్నాయని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు, అలాగే అలాంటి మేధో సంపత్తిని అనధికారికంగా ఉపయోగించండాన్ని పూర్తిగా నిషేధించారు. 
    • న్యూస్‌లెటర్‌లో ఉన్న ఏదైనా అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని, అంటే అది ఇచ్చిన అర్థం బట్టి లేదా మరేదైనా కారణంతో, PhonePe IP మరియు/లేదా థర్డ్ పార్టీ IPకి సంబంధించిన ఏదైనా హక్కు, లైసెన్స్ లేదా టైటిల్‌ను మంజూరు చేసినట్లుగా భావించకూడదు. అలాగే, న్యూస్‌లెటర్ హోస్ట్ చేసిన డొమైన్ పేరు పూర్తిగా PhonePeకు చెందిన ఆస్తి, ఆ పేరును మీ సొంత వినియోగం కోసం ఉపయోగించకూడదు లేదా మరే విధంగానూ పొందకూడదు.
  1. దేనికీ ప్రాతినిధ్యం వహించట్లేదు లేదా వారెంటీలు ఇవ్వట్లేదు
    • న్యూస్‌లెటర్‌ తరఫున PhonePe ఏ రూపంలోనూ ప్రాతినిథ్యం వహించదు, అలాగే దానికి వారెంటీలు, బాధ్యతలు తీసుకుంటామని, హామీలు, గ్యారెంటీలను ఇవ్వదు.
    • న్యూస్‌లెటర్‌, అంతేగాక న్యూస్‌లెటర్‌లో భాగంగా ఇచ్చిన మొత్తం కంటెంట్‌తో సహా, అలాగే దీనికే పరిమితం కాకుండా, ‘ఇప్పుడు ఎలా ఉంటే అలా’, ‘ఇప్పుడు అందుబాటులో ఉన్నట్లుగానే’ ఏ రకమైన వారెంటీ లేకుండా అందించబడుతుంది, అంటే వారెంటీని వ్యక్తీకరించిన, ఆ అర్థం వచ్చేలా ఉన్న దానితో సహా, వీటికి మాత్రమే పరిమితం కాకుండా, టైటిల్ సూచించిన వారెంటీలు, ఉల్లంఘించలేని, బిజినెస్ చేసుకోవచ్చని, ఏదైనా ఉద్దేశానికి తగినది అని, డేటాలో జోక్యం చేసుకోరని, లభిస్తుందని, ఖచ్చితంగా ఉంటుందని లేదా న్యూస్‌లెటర్‌లో తప్పులు లేవని, ఇంకా ఏదైనా పనితీరు లేదా వాణిజ్య వినియోగం ప్రకారంగా సూచించే ఏవైనా వారెంటీలు సహా, వీటన్నిటినీ  స్పష్టంగా  నిరాకరిస్తున్నాము. PhonePe, దాని డైరెక్టర్‌లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్‌లు, భాగస్వాములు, అలాగే కంటెంట్ ప్రొవైడర్‌లు ఇక్కడ పేర్కొన్న విషయాలకు హామీ ఇవ్వరు: (i) న్యూస్‌లెటర్‌లో లోపాలు లేదా తప్పులను సరిచేస్తాము; లేదా (ii) న్యూస్‌లెటర్‌ను ఉపయోగించడం వల్ల వచ్చే ఫలితాలు మీ అవసరాలను తీరుస్తాయి.
  2. నష్టపరిహారం, బాధ్యతలకు ఉన్న పరిమితులు
    • మీరు ఏదైనా క్లెయిమ్ లేదా డిమాండ్ నుండి లేదా హేతుబద్ధమైన న్యాయవాదుల ఫీజు, ఏదైనా థర్డ్ పార్టీ చేసిన లేదా మీరు ఈ నియమాలు, ప్రైవసీ పాలసీలను మీరు ఉల్లంఘించడం వల్ల, లేదా ఏదైనా చట్టం, నిబంధనలు లేదా నియంత్రణా నిబంధనలు లేదా థర్డ్ పార్టీ హక్కులను విధించడం వల్ల లేదా ఉత్పన్నమైన పెనాల్టీ ఫీజులను చెల్లించాల్సి వచ్చినప్పుడు మీరు ఆ నష్టపరిహారం నుంచి PhonePeను ఖచ్చితంగా విముక్తి చేయాలి, అలాగే ఆ నష్టానికి PhonePe కారణం కాదని చెప్పాలి.
    • ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక, గుణపాఠం నేర్పే, యాదృచ్ఛిక, పరిహార, శిక్ష విధించగలిగే, అలాగే  న్యూస్‌లెటర్‌, దాని కంటెంట్‌ కారణంగా తలెత్తిన పర్యవసానమైన లేదా సారూప్యమైన నష్టాలతో సహా, కానీ వీటికి మాత్రమే పరిమితం కాకుండా, లాభాల్లో నష్టం, వినియోగాన్ని కోల్పోవడం, వ్యాపార అంతరాయం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక నష్టాలు, ఒప్పందం, నిర్లక్ష్యం లేదా ఇతర అన్యాయంపై తీసుకున్న చర్యలో భాగంగానైనా తలెత్తిన ఏ రకమైన నష్టాలు, అలాగే బాధ్యతలకు మీకు మరియు/లేదా ఏ ఇతర పార్టీకి PhonePe బాధ్యత వహించదు.
    • మీరు న్యూస్‌లెటర్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేదా వినియోగించడం వల్ల తలెత్తే అన్ని క్లెయిమ్‌ల నుంచి PhonePeను ఖచ్చితంగా విముక్తి చేయాలి. న్యూస్‌లెటర్‌పై మీకు అసంతృప్తి లేదా మరేదైనా ఫిర్యాదు ఉన్నట్లయితే, న్యూస్‌లెటర్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే మీకున్న ఏకైక, ప్రత్యేకమైన హక్కు, పరిష్కారం.
  1. పాలక చట్టం – అధికార పరిధి
    ఈ నియమాలు భారతదేశ చట్టాల ప్రకారం నిర్వహించబడతాయి. అలాగే, ఈ నియమాలు లేదా వాటికి సంబంధించి ఉత్పన్నమయ్యే అన్ని అంశాలపై భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులోని న్యాయస్థానాలకు ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది. ఇంకా మీరు ఆ  న్యాయస్థానాల ప్రత్యేక అధికార పరిధిని సంపూర్ణంగా గౌరవించేందుకు అంగీకరిస్తున్నారు.