PhonePe Blogs Main Featured Image

Trust & Safety

KYC ముసుగులో ఐడెంటిటీ చోరీ: సురక్షితంగా ఉండటం ఎలా ?

PhonePe Regional|3 min read|21 July, 2025

URL copied to clipboard

మీరు బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలలో అకౌంట్‌ను క్రియేట్ చేసేటప్పుడు, వారు మీ ఐడెంటిటీని వెరిఫై చేయాలని మిమ్మల్ని కోరుతారు. ఆధార్, PAN లేదా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ ఆమోదించిన ఇతర డాక్యుమెంట్లను సమర్పించే KYC ప్రక్రియ రూపంలో ఇది జరుగుతుంది.

ప్రస్తుతం, ఆర్థిక సంస్థలు ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియను “డిజిటల్ KYC” రూపంలో నిర్వహిస్తున్నాయి. డిజిటల్ KYC అంటే కస్టమర్ లైవ్‌ ఫోటోలు, వారి డాక్యుమెంట్లు లేదా వారి దగ్గర ఉన్న ఆధార్ ప్రూఫ్‌ను క్యాప్చర్ చేసి, పరిశీలించడం, ఇందులో ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ ఉండదు.

KYC మోసంతో ఐడెంటిటీని ఎలా దొంగిలిస్తారు?

KYC ఐడెంటిటీ దొంగతనంలో, మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు లేదా నకిలీ ఐడెంటిటీలను క్రియేట్ చేసి, వాటిని ఉపయోగించి KYC ప్రక్రియను మోసపూరితంగా పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, వారు మీ అకౌంట్లను అనధికారికంగా యాక్సెస్ చేస్తారు లేదా మీ KYCని ఉపయోగించి కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేయడం, మీ పేరు మీద లోన్లు, క్రెడిట్ కార్డ్‌లను తీసుకోవడం వంటివి చేస్తారు, ఇవి క్రమంగా మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి, మీ పరువు పోయేలా చేస్తాయి.

నేటి డిజిటల్ ప్రపంచంలో ఐడెంటిటీ దొంగతనం ఒక పెద్ద ముప్పుగా మారింది, ముఖ్యంగా మోసగాళ్లు KYC ప్రక్రియలను పూర్తి చేయడం కోసం, అలానే మీ అకౌంట్లను నియంత్రించడం కోసం దొంగిలించిన లేదా నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగిస్తే ఈ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ఐడెంటిటీ దొంగతనం పలు విధానాల్లో జరుగుతుంది

ఉదాహరణ 1: మోసగాళ్లు వివిధ ఫిషింగ్‌ పద్ధతుల్లో మీ వ్యక్తిగత ఐడెంటిటీ సమాచారాన్ని దొంగిలించవచ్చు. వారు తరచుగా ఈ సమాచారాన్ని దుర్వినియోగించి మీ అకౌంట్లను యాక్సెస్ చేసి అనధికార లావాదేవీలకు పాల్పడతారు.

ఒక మోసగాడు అర్జున్‌ను సంప్రదించి, ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆకర్షణీయమైన రాబడిని తెప్పిస్తానని హామీ ఇచ్చాడు. అయితే, ఆ ప్రక్రియను ముందుకు కొనసాగించడం కోసం, అర్జున్ వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని కోరాడు. మోసగాడిని నమ్మిన అర్జున్‌, తన ఇన్వెస్ట్‌మెంట్లు సురక్షితంగా మేనేజ్ అవుతాయని నమ్మి, తన అకౌంట్‌ క్రెడెన్షియల్స్‌ను, OTPని షేర్ చేశాడు. ఈ దొంగిలించిన సమాచారంతో అర్జున్ అకౌంట్‌ను మోసగాడు యాక్సెస్ చేసి, అనధికార లావాదేవీలు చేశాడు.

ఉదాహరణ 2: మీ అకౌంట్‌ను మోసగాళ్లు యాక్సెస్ చేయడం కోసం KYC ప్రక్రియను పూర్తి చేయమని మిమ్మల్ని కోరవచ్చు. మీరు దాన్ని పూర్తి చేస్తే, మీ సమాచారం వారికి అందుబాటులోకి వస్తుంది, ఆ తర్వాత వారు మీ అకౌంట్‌ను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకుని దుర్వినియోగిస్తారు.

ప్రభుత్వ సబ్సిడీ పథకం కింద వర్తించే ప్రయోజనాలను పొందడంలో సహాయం చేస్తానని చెప్పుకుంటూ తిరిగే ఒక మోసగాడు రోహిణీని సంప్రదించాడు. సబ్సిడీ పొందాలంటే అకౌంట్‌ను క్రియేట్ చేసి, KYC వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని ఆమెను నమ్మించాడు. ఆ మోసగాడిని నమ్మి, రోహిణీ తన వ్యక్తిగత వివరాలను సమర్పించారు. రోహిణి KYC సమాచారం మోసగాడికి అందుబాటులోకి వచ్చిన తర్వాత, వాడు అకౌంట్‌ను పూర్తిగా స్వాధీనంలోకి తీసుకుని, ఆ అకౌంట్‌తో అనధికార లావాదేవీలు చేశాడు, దీంతో రోహిణీకి ఆర్థికంగా నష్టం వాటిల్లింది.

ఉదాహరణ 3: మోసగాళ్లు మీది కాని అకౌంట్‌‌కు KYC ప్రక్రియను పూర్తి చేయమని మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఆ తర్వాత, మీకు తెలియకుండానే ఆ అకౌంట్‌ను ఉపయోగించి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడతారు.

డేవిడ్‌ను ఒక మోసగాడు సంప్రదించి, లోన్‌ పొందడంలో సహాయం చేస్తానని నమ్మబలికాడు. మోసగాడు డేవిడ్ పేరు మీద కాకుండా, మోసగాడి పేరు మీద ఇప్పటికే క్రియేట్ చేసిన అకౌంట్‌లో KYC ప్రక్రియను పూర్తి చేయమని డేవిడ్‌ను కోరాడు. ఇవన్నీ లోన్‌కు అప్లై చేసేటప్పుడు చట్టబద్ధంగా పాటించాల్సిన అంశాలే అని నమ్మిన డేవిడ్‌, మోసగాడు ఏది అడిగితే అది చేశాడు. తన వ్యక్తిగత వివరాలను KYC కోసం సమర్పించాడు, తనకు తెలియకుండానే తన అకౌంట్‌పై పూర్తి నియంత్రణను మోసగాడికి ఇచ్చాడు. ఆ తర్వాత మోసగాడు మోసపూరిత లోన్‌ లావాదేవీల కోసం అకౌంట్‌ను దుర్వినియోగపర్చాడు, దీని వల్ల డేవిడ్‌కు తెలియకుండానే, అతి పెద్ద ప్రమాదంలో పడ్డాడు.

KYC మోసం, అకౌంట్‌ స్వాధీనాన్ని సూచించే ప్రమాద హెచ్చరికలు

  • మీరు అభ్యర్థించకుండానే అకౌంట్‌ ఓపెన్ చేయడం గురించి ఊహించని కాల్‌లు లేదా ఇమెయిల్‌లు రావడం.
  • మీరు ఆథరైజ్ చేయని లావాదేవీలకు సంబంధించిన అలెర్ట్‌లు లేదా SMS నోటిఫికేషన్లు రావడం.
  • మీరు ఎప్పుడూ అప్లై చేయని క్రెడిట్ కార్డ్‌లు లేదా బిల్లులు రావడం.
  • మీ బ్యాంక్ లేదా ఆర్థిక అకౌంట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది తలెత్తడం.
  • నమ్మశక్యం కాని ఆఫర్‌లు, అవి ప్రజలను మోసగించి వారి ఐడెంటిటీని దొంగిలిస్తాయి.

ఐడెంటిటీ చోరీ, KYC మోసం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే మార్గాలు

  • మీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచండి: ఫోన్, ఇమెయిల్ లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా సున్నితమైన డాక్యుమెంట్లు లేదా OTPలను ఎప్పుడూ షేర్ చేయవద్దు.
  • ఫిషింగ్ ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండండి: అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి లేదా నమ్మదగని వెబ్‌సైట్‌లలో సమాచారాన్ని షేర్ చేయకండి.
  • మీ అకౌంట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి: ఏదైనా అనధికార యాక్సెస్ జరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లు, క్రెడిట్ రిపోర్ట్‌లు, అకౌంట్‌ యాక్టివిటీలను ఎప్పటికప్పుడు చెక్ చేయండి.
  • బలమైన అథెంటికేషన్‌ను ఉపయోగించండి: సాధ్యమైన చోట టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2FA)ను ఎనేబుల్ చేయండి.
  • కమ్యూనికేషన్‌ను వెరిఫై చేయండి: ఏవైనా ఆర్థిక సంస్థలు అనుకోకుండా మిమ్మల్ని సంప్రదిస్తే, మీరు అధికారిక కాంటాక్ట్‌ వివరాలను ఉపయోగించి, వారి ఐడెంటిటీని వెరిఫై చేయండి.
  • డాక్యుమెంట్లు దుర్వినియోగానికి గురైతే వెంటనే సమాచారమివ్వండి: మీ ఐడి ప్రూఫ్‌లను ఎవరైనా దుర్వినియోగిస్తే, సంబంధిత అధికారులకు, సంస్థలకు సమాచారమివ్వండి.
  • అధికారిక KYC ఛానెళ్లను మాత్రమే ఉపయోగించండి: అధికారిక వెబ్‌సైట్లు లేదా వెరిఫై చేసిన ఏజెంట్ల ద్వారానే KYCని పూర్తి చేయండి.

ఏదైనా PhonePe అకౌంట్‌లో మీ ఐడెంటిటీ సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగిస్తే ఏమి చేయాలి?

PhonePeలో మోసం జరిగిందని లేదా మీరు స్కామ్‌కు గురయ్యారని మీకు అనుమానం కలిగితే, కింది మార్గాల్లో సమస్యను తెలపండి, దీని వల్ల త్వరగా చర్య తీసుకోగలుగుతారు:

  1. PhonePe కస్టమర్ కేర్ నంబర్ 80–68727374 లేదా 022–68727374కు కాల్ చేసి, PhonePe కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. కస్టమర్ కేర్ ఏజెంట్ మీ కోసం టికెట్‌ క్రియేట్ చేసి, మీకు మరింత సహాయం చేస్తారు.
  2. సోషల్‌ మీడియా మోసపూరిత ఘటనల గురించి మీరు PhonePe అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో తెలపవచ్చు:
  3. ఫిర్యాదు పరిష్కార విభాగం మీ వద్ద ఇప్పటికే ఫిర్యాదుకు సంబంధించిన టికెట్ ఉంటే, మీరు ఈ లింక్‌ను: https://grievance.phonepe.com/ ఓపెన్ చేసి, టికెట్ ఐడితో ఫిర్యాదు చేయవచ్చు.

అధికారులకు సమాచారం ఇవ్వండి

  • సైబర్ క్రైమ్ సెల్‌: సైబర్ క్రైమ్ పోర్టల్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా 1930కు కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వొచ్చు.
  • టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌ (DOT): ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్ లేదా ఏదైనా మోసపూరిత అభ్యర్థన వచ్చినా సంచార్ సాథీ పోర్టల్‌కు వెళ్లి, ఛక్షు సౌకర్యం ద్వారా వాటి గురించి మీరు ఫిర్యాదు చేయవచ్చు.

Keep Reading