
Trust & Safety
మీ ఫోన్ పోయిందా? అయితే, మీ సేవింగ్స్‌ను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి
nidhiswadi|4 min read|03 July, 2025
రాత్రి 11 గంటలు అయింది. మీ స్నేహితుడు మిమ్మల్ని ఇంట్లో దింపాడు, మీరు వాడికి వీడ్కోలు చెప్పి, మీ డోర్ ఓపెన్ చేసి, లోపలకు అడుగు పెడుతుండగా, మీ ఫోన్ జేబులో లేదని గుర్తించారు! ఒక్కసారిగా మీ గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
మీ మనసంతా భయంతో నిండిపోయినప్పుడు, మీ ఫోన్‌ను ఎక్కడ పెట్టారో మీకు సరిగ్గా గుర్తుండదు. బహుశా దాన్ని సినిమా థియేటర్‌లో మర్చిపోయి ఉండవచ్చు. లేదంటే షాపింగ్ చేస్తున్నప్పుడు చేజారిపోయి ఉండవచ్చు. లేదా ఎవరైనా దాన్ని మీ జేబులో నుండి దొంగిలించి ఉండవచ్చు!
మీ ఆలోచన అంతా మీ ఫోన్‌లోని మొత్తం డేటా గురించే – అంటే మీరు లాగిన్ అయిన పేమెంట్, బ్యాంకింగ్ యాప్‌లు, మీ నోట్స్ యాప్‌లోని మీ పాస్‌వర్డ్‌ల గురించే ఆలోచిస్తూ కంగారు పడతారు.
మీరు భయపడటంలో తప్పు లేదు. కానీ, ఆ సమయంలో మీ చేతిలో ఉన్న కొన్ని క్షణాలే మీ సేవింగ్స్‌ను కాపాడటంలో చాలా కీలకమవుతాయి.
మొబైల్ దొంగతనంలోని అసలు వాస్తవాలు
మీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు – అది మీ వాలెట్, మీ బ్యాంక్, మీ గుర్తింపు. ఈ విషయం దొంగలకు తెలుసు. వారు మీ ఫోన్‌ను వేరొకరికి అమ్మేసి, వేగంగా డబ్బు సంపాదించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే, దాన్ని అన్‌లాక్ చేసిన తర్వాత ఇంకా చాలా విషయాలను యాక్సెస్ చేయొచ్చని వాళ్లకి తెలుసు.
పరికరం దొంగతనం తర్వాత ఆర్థిక మోసాలు ఎలా జరుగుతాయో, అలానే వాటిని మీరు ఎలా అడ్డుకోవచ్చో ఈ బ్లాగ్ వివరిస్తుంది.
పరికరాన్ని దొంగిలించిన తర్వాత ఆర్థిక మోసాలు జరిగే విధానం
పరికరాన్ని దొంగిలించిన తర్వాత జరిగే అన్ని ఆర్థిక మోసాల వెనుక తరచుగా ఆధునిక డిజిటల్ ఎకోసిస్టమ్‌లోని సున్నితమైన అంశాలే ప్రధాన కారణంగా నిలుస్తాయి. వాటిని అడ్డుపెట్టుకునే మోసగాళ్లు లాభపడతారు, అవేంటో కింద వివరించాము:
- ఆటో-లాగ్ చేసిన పేమెంట్ యాప్‌లు, అంటే UPI, డిజిటల్ వాలెట్లు లేదా బ్యాంకింగ్ యాప్‌లు వంటి పేమెంట్ యాప్‌లు, ఎలాంటి రీ-ఆథెంటికేషన్ లేకుండానే లావాదేవీలు చేయడానికి దొంగలకు అవకాశాన్ని కల్పిస్తాయి, ప్రత్యేకించి పరికరానికి బలమైన స్క్రీన్ లాక్ లేదా బయోమెట్రిక్ లేదా పిన్ ఆధారిత భద్రత వంటి యాప్‌కు ప్రత్యేకంగా సెట్ చేసిన ప్రొటెక్షన్ లేనప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతాయి.
- బ్రౌజర్లు లేదా యాప్‌లలో సేవ్ చేసిన కార్డ్ వివరాలు అనధికార కొనుగోళ్లను మరింత సులభతరం చేస్తాయి, ఎందుకంటే ఇదివరకే సేవ్ చేసిన పేమెంట్ సమాచారాన్ని అతి తక్కువ కష్టంతోనే దొంగలు యాక్సెస్ చేయవచ్చు.
- బలహీనమైన స్క్రీన్ లాక్‌లు లేదా అవి పూర్తిగా లేకపోవడం వల్ల పరికరాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు, అయితే ఒక్కో యాప్‌కు ప్రత్యేకంగా సెట్ చేసిన ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల సున్నితమైన యాప్‌లను దొంగలు యాక్సెస్ చేయగలుగుతారు.
- అంతేగాక, దొంగలు బాధితుడి ఫోన్ నంబర్‌ను కొత్త సిమ్‌కు బదిలీ చేయమని టెలికాం ప్రొవైడర్లను ఒప్పించేందుకు అవకాశముంది, దీంతో సిమ్ స్వాప్ దాడులకు తెగబడతారు, ఈ విధంగా లావాదేవీ వెరిఫికేషన్ కోసం ఉద్దేశించిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTPలు) తాము కూడా తెలుసుకోగలరు. ఇలాంటి స్కామ్ గురించి మరింత సమాచారం కోసం, మీరు ఈ బ్లాగ్‌ను చదవండి.
- ఫిషింగ్ దాడి అనేది మరొక సాధారణ వ్యూహం, ఇందులో మోసగాళ్లు దొంగిలించిన పరికరాన్ని ఓపెన్ చేసి బాధితుడి కాంటాక్ట్‌లు లేదా ఇమెయిల్‌ను యాక్సెస్ చేస్తారు, బాధితుని లాగా నటిస్తూ, వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి సున్నితమైన సమాచారం లేదా డబ్బులను పొందడానికి ప్రయత్నిస్తారు. ఫిషింగ్ గురించి మరింత బాగా అర్థం చేసుకోవడం కోసం, మీరు ఈ బ్లాగ్‌ను చదవండి.
ఈ మోసపూరిత పద్ధతుల్లో మోసగాళ్లు టెక్నాలజీతో పాటు, మనిషిలో సహజంగా ఉండే బలహీనమైన భావోద్వేగాలను ఉపయోగించుకుంటారు, అందుకే పరికరం దొంగతనానికి గురైతే, భారీ ఆర్థిక నష్టానికి అది ఆరంభం అవుతుంది.
దొంగతనం నిరోధక చర్యలను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం
భారతదేశంలో, పరికరం దొంగతనానికి గురైన తర్వాత జరిగే ఆర్థిక మోసాల కేసులు పెరిగాయి, తరచుగా బలహీనమైన స్క్రీన్ లాక్‌లు లేదా పర్యవేక్షణ లేని అకౌంట్లు వంటి సాధారణ పొరపాట్ల వల్లనే మోసాలు జరిగాయని తెలుస్తోంది, అందుకే దొంగతనం నిరోధక చర్యలను తెలుసుకుని, అమలు చేయడం వల్ల యూజర్లు తమ పరికరాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు, ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చు, అలానే నష్టాలను నివారించడం కోసం వేగంగా చర్య తీసుకోవచ్చు, ఈ విధంగా చేయడం వల్ల డిజిటల్, ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవచ్చు.
మీ పరికరాన్ని రక్షించుకునే విధానం
పరికరం దొంగతనానికి గురైన తర్వాత మీ ఆర్థిక సమాచారాన్ని రక్షించుకోవడం కోసం, కింది ముందస్తు చర్యలను అనుసరించండి:
- మీ పరికరాన్ని బలమైన లాక్‌లతో భద్రపర్చండి: క్లిష్టమైన పాస్‌వర్డ్‌లు, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ (వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు) ఉపయోగించండి, అలానే మీ పరికరం యాక్టివ్‌గా లేనప్పుడు/దాన్ని వినియోగించనప్పుడు, మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఆటో-లాక్‌ను ఎనేబుల్ చేయండి. “1234” వంటి ఊహించదగిన పిన్‌లను అస్సలు వాడకండి.
- యాప్-లెవెల్ లాక్‌లను సెటప్ చేయండి: పరికరాన్ని అన్‌లాక్ చేసినప్పటికీ యాప్‌లను ఎవరూ ఓపెన్ చేయకుండా భద్రపర్చడం కోసం బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లలో (ఉదా., PhonePe ప్రొఫైల్ > Security/భద్రత > బయోమెట్రిక్, స్క్రీన్ లాక్) అదనపు పిన్‌లు లేదా బయోమెట్రిక్‌లను ఎనేబుల్ చేయండి.
- సున్నితమైన సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సేవ్ చేయడాన్ని ఆపివేయండి: ఎన్‌క్రిప్షన్ లేకుండా బ్రౌజర్లు లేదా యాప్‌లలో కార్డ్ వివరాలు లేదా UPI ఐడిలను ఆటోమేటిక్‌గా సేవ్ చేయడాన్ని నివారించండి. నిల్వ చేసిన సమాచారాన్ని భద్రంగా కాపాడటం కోసం విశ్వసనీయమైన పాస్‌వర్డ్ మేనేజర్లను ఉపయోగించండి.
- రిమోట్ ట్రాకింగ్, డేటా తొలగింపును ఎనేబుల్ చేయండి: మీ పరికరాన్ని రిమోట్‌గా ట్రాక్ చేయడానికి, లాక్ వేయడానికి లేదా డేటాను తొలగించడానికి “Find My Device/నా పరికరాన్ని కనుగొనండి” (ఆండ్రాయిడ్) లేదా “Find My iPhone/నా ఐఫోన్‌ను కనుగొనండి” (iOS)ని యాక్టివేట్ చేయండి.
- సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండండి: భద్రతా లోపాలను సరిచేయడం కోసం మీ పరికరం ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.
- పరికరం పోయిందని వెంటనే సమాచారమివ్వండి: మీ సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేయడం కోసం మీ టెలికాం ప్రొవైడర్‌ను సంప్రదించండి, అలానే అకౌంట్లను సస్పెండ్ చేయమని బ్యాంక్‌లు లేదా వాలెట్ ప్రొవైడర్లకు తెలపండి.
- బ్యాంక్ అకౌంట్లను పర్యవేక్షించండి: లావాదేవీలకు SMS/ఇమెయిల్ అలెర్ట్‌లను సెటప్ చేయండి, అలానే ప్రతిరోజూ అకౌంట్లను చెక్ చేయండి. అనధికారిక లావాదేవీలు జరిగితే వెంటనే వాటి గురించి సమాచారమివ్వండి.
- డివైజ్ బైండింగ్ ఫీచర్లను ఉపయోగించండి: UPI యాప్‌లను (ఉదా., PhonePe, Google Pay) ఖచ్చితంగా డివైజ్-బౌండ్ చేయండి, సిమ్ మార్చినా కూడా రీ-వెరిఫికేషన్ చేసేలా చూసుకోండి.
మీ PhonePe అకౌంట్‌ను బ్లాక్ చేసి, ఆ తర్వాత ఎలా యాక్సెస్ చేయాలి?
మీ పరికరం దొంగతనానికి గురైతే, దాని అనధికారిక యాక్సెస్‌ను నివారించడం కోసం మీ PhonePe అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయండి:
- అకౌంట్‌ను బ్లాక్ చేయండి:
- కస్టమర్ కేర్ ద్వారా: దొంగతనం గురించి సమాచారమిచ్చి, అకౌంట్ నిలిపివేతను అభ్యర్థించడం కోసం 80-68727374 లేదా 022-68727374కు కాల్ చేసి, PhonePe సహాయ విభాగాన్ని సంప్రదించండి.
- వెబ్‌ఫారమ్ ద్వారా: PhonePe సహాయ విభాగం ఫారమ్ నింపి, సమస్యను వివరిస్తూ టికెట్‌ను సమర్పించండి.
- సోషల్ మీడియా ద్వారా: సంఘటన గురించి సమాచారం ఇవ్వడం కోసం ట్విట్టర్‌లో @PhonePeSupport లేదా ఫేస్‌బుక్‌లో అధికారిక PhonePe పేజీని సంప్రదించండి.
- సైబర్ క్రైమ్ సెల్ ద్వారా: మోసం జరిగిందనే అనుమానం ఉంటే, cybercrime.gov.inకు వెళ్లి ఫిర్యాదు చేయండి లేదా 1930కు కాల్ చేయండి.
- తిరిగి యాక్సెస్ పొందండి:
- PhonePe సహాయ విభాగాన్ని సంప్రదించండి: మీరు కొత్త పరికరం లేదా సిమ్‌ను తీసుకున్న తర్వాత, మీ గుర్తింపును (ఉదా. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ లేదా KYC వివరాలు) వెరిఫై చేయడం కోసం కాల్ చేయండి లేదా వెబ్‌ఫారమ్‌ను ఉపయోగించండి
- అకౌంట్‌ను రీ-వెరిఫై చేయడం: మీ అకౌంట్‌ను కొత్త పరికరంతో తిరిగి లింక్ చేయడం కోసం PhonePe సూచనలను పాటించండి, దీనికి OTP వెరిఫికేషన్ చేయాలి లేదా KYCని మళ్లీ సమర్పించాలి.
- లావాదేవీలను చెక్ చేయండి: యాక్సెస్‌ను తిరిగి పొందిన తర్వాత, PhonePe యాప్‌లో మీ లావాదేవీ చరిత్రను సమీక్షించండి (Help/సహాయం > Transaction History/లావాదేవీ చరిత్ర), అలానే ఏదైనా అనధికారిక కార్యాచరణ గురించి సమాచారం ఇవ్వడం కోసం Help/సహాయం > Have an issue with the transaction/లావాదేవీతో సమస్య ఉందిని క్లిక్ చేయండి.
- ఫిర్యాదుల పరిష్కారం: సమస్య ఇంకా కొనసాగుతుంటే, దాన్ని ఎస్కలేట్ చేయడం కోసం మీ టికెట్ ఐడితో grievance.phonepe.comకు లాగిన్ అవ్వండి.

బోనస్ రిసోర్స్‌లు
- పలు రకాల ఇతర మోసాల గురించి, అలానే వాటి నుండి ఎలా రక్షణ పొందాలో తెలుసుకోవడం కోసం, మీరు ఇది చదివండి.
- మోసాలు ఎలా జరుగుతాయి, అలానే మా కస్టమర్‌ను రక్షించడం కోసం మేము తీసుకునే చర్యలను మా ‘నమ్మకం, భద్రత’ విభాగాధిపతి వివరించిన ఈ వీడియోను చూడండి.
మీరు ఈ స్కామ్‌కు గురైన బాధితుడైతే ఎలా సమాచారమివ్వాలి?
PhonePeలో మోసం బారిన పడినప్పుడు, మీరు వెంటనే ఆ సమస్యను కింది మార్గాల్లో లేవనెత్తవచ్చు:
- PhonePe యాప్: Help/సహాయం విభాగానికి వెళ్లి, “లావాదేవీతో సమస్య ఉంది” ఆప్షన్ కింద మీ సమస్యను తెలపండి.
- PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు సమస్యను లేవనెత్తడానికి PhonePe కస్టమర్ కేర్ నంబర్ 80–68727374 / 022–68727374కు కాల్ చేయవచ్చు, ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ మీ కోసం టికెట్‌ను క్రియేట్ చేసి, మీ సమస్యకు పరిష్కారం చూపుతారు.
- వెబ్‌ఫామ్‌లో సబ్‌మిట్ చేయడం : మీరు PhonePe వెబ్‌ఫామ్ https://support.phonepe.com/కు వెళ్లి కూడా టికెట్‌ను లేవనెత్తవచ్చు.
- సోషల్ మీడియా: మీరు ఈ కింద పేర్కొన్న PhonePe సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మోసపూరిత ఘటనలను రిపోర్ట్ చేయవచ్చు
- ట్విటర్ — https://twitter.com/PhonePeSupport
- ఫేస్‌బుక్ — https://www.facebook.com/OfficialPhonePe
- ఫిర్యాదు పరిష్కారం: ఇదివరకే చేసిన ఫిర్యాదును పరిష్కరించమని కోరడానికి, మీరు https://grievance.phonepe.com/లోకి లాగిన్ అయ్యి, గతంలో పంపిన టికెట్ ఐడిని షేర్ చేయవచ్చు.
- సైబర్ సెల్: చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్లి ఈ మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు లేదా సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి మీ సమస్యను తెలపవచ్చు.
ముఖ్య గమనిక — PhonePe ఎన్నడూ గోప్యమైన లేదా వ్యక్తిగతమైన సమాచారం కోరదు. phonepe.com డొమైన్ నుండి రాకుంటే, PhonePeనుండి పంపుతున్నామని చెప్పే మెయిళ్లను పట్టించుకోవద్దు. మోసం చోటు చేసుకున్నట్టు మీకు ఎక్కడైనా అనుమానం ఏర్పడితే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.
Author
