PhonePe Blogs Main Featured Image

Trust & Safety

మీ కుటుంబాన్ని సైబర్ మోసాల నుండి రక్షించుకోవడానికి తీసుకోవలసిన 4 ముఖ్యమైన జాగ్రత్తలు

PhonePe Regional|3 min read|20 January, 2026

URL copied to clipboard

ఈ రోజుల్లో ఎవరైనా నలుగురు కలిసి ఉన్న చోట మోసాల గురించి ప్రస్తావిస్తే, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక కథ ఉంటుంది. డబ్బు పోగొట్టుకున్న పిన్ని గారో, లేదా అనుమానాస్పద ఫోన్ కాల్ రాగానే అది మోసం అని కనిపెట్టి వెంటనే కాల్ కట్ చేసిన బాబాయో కచ్చితంగా ఉంటారు.

మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వాస్తవం ఇది. అయినప్పటికీ, రెగ్యులేటర్లు, లా ఎన్ఫోర్స్మెంట్ మరియు ఇతర కీలక భాగస్వాముల నిరంతర ప్రయత్నాల వల్ల, ఈ ఏడాది మోసాలను అరికట్టడంలో మనం పురోగతి సాధించాము. ప్రభుత్వ తాత్కాలిక గణాంకాల ప్రకారం, భారతదేశంలో FY24లో 1,087 కోట్ల రూపాయల విలువైన 13.42 లక్షల UPI మోసాలు జరగగా, FY25లో అవి 981 కోట్ల రూపాయల విలువైన 12.64 లక్షల సంఘటనలకు తగ్గాయి.

ఈ పురోగతిని కొనసాగించడానికి, మీ కుటుంబాన్ని సైబర్ ముప్పుల నుండి కాపాడుకోవడంలో మీకు సహాయపడే ఒక సమగ్ర మార్గదర్శినితో మేము ఈ ఏడాదిని ప్రారంభిస్తున్నాము.

1. ముప్పును అర్థం చేసుకోండి

 డిజిటల్ మోసాలలో ఫిషింగ్, గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్) మరియు మీ డివైస్​లో మాల్​వేర్​ను ప్రవేశపెట్టడం వంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి. పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంకింగ్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని వెల్లడించేలా వ్యక్తులను మోసం చేయడానికి స్కామర్లు నకిలీ ఇమెయిల్‌లు, మెసేజ్‌లు మరియు ఫోన్ కాల్స్ వంటి తప్పుదారి పట్టించే మార్గాలను ఉపయోగిస్తారు.

2. సాధారణ స్కామ్‌లను గుర్తించండి

కొన్ని మోసపూరిత పద్ధతులు అందరికీ తెలిసినవే, మరికొన్ని మాత్రం కొత్తగా ఉంటాయి. అయితే, ఈ పద్ధతులన్నింటిలోనూ ఒక పోలిక ఉంటుంది – ఈ స్కామ్ తరచుగా ఒక హానికరమైన ఫోన్ కాల్, మెసేజ్ లేదా ఇమెయిల్‌తో మొదలవుతుంది. ఊహించని కమ్యూనికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండేలా మీ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించండి.

ఈ హెచ్చరిక సంకేతాలను గమనించండి:

  • అత్యవసరం లేదా బెదిరింపులు: స్కామర్లు మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి, ఆలోచించకుండా త్వరగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేస్తారు.
  • సున్నితమైన సమాచారం కోసం అభ్యర్థనలు: చట్టబద్ధమైన సంస్థలు ఎప్పుడూ పాస్‌వర్డ్‌లు, CVVలు లేదా OTPలను అడగవు.
  • అనుమానాస్పద లింక్‌లు: ఏదైనా లింక్ క్లిక్ చేసే ముందు, అది అసలైన బ్యాంక్ లేదా సంస్థకు చెందినదేనా అని చూడటానికి దాని URLను ఎల్లప్పుడూ చెక్ చేయండి. మీరు లింక్‌పై క్లిక్ చేయకుండా దాని మీద కర్సర్ ఉంచడం ద్వారా అది మిమ్మల్ని ఏ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుందో చూడవచ్చు.
  • పోలీసులు లేదా మీ బ్యాంక్ వారు ఎప్పుడూ మిమ్మల్ని డబ్బు విత్‌డ్రా చేయమని, మీ పూర్తి PIN చెప్పమని లేదా “వేలిముద్రల తనిఖీ” కోసం నగదు ఇవ్వమని అడగరు.
  • ఫోన్ స్కామ్‌లు: కాల్ చేసిన వ్యక్తి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించినా లేదా క్యాష్ ట్రాన్స్‌ఫర్ ద్వారా “జరిమానాలు” కట్టమని అడిగినా, అది కచ్చితంగా మోసమే. అనవసరమైన కాల్స్‌ను తగ్గించడానికి టెలిఫోన్ ప్రిఫరెన్స్ సర్వీస్‌లో నమోదు చేసుకోవడం గురించి ఆలోచించండి.
  • గుమ్మం వద్దకు వచ్చే వ్యక్తులు: సర్వీసులను ఆఫర్ చేస్తూ ఊహించని విధంగా మీ ఇంటికి వచ్చే వారికి “వద్దు, ధన్యవాదాలు” అని చెప్పడం ఎప్పుడూ సరైనదే. అక్కడికక్కడే ఏ సర్వీసుల పైనా సంతకం చేయవద్దు, ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువ లిఖితపూర్వక కోట్‌లను తీసుకోండి. అత్యవసరమైతే తప్ప వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. మోసగాళ్లు ఈ డేటాను ఉపయోగించి కొత్త గుర్తింపులను సృష్టించవచ్చు లేదా మీ పాస్‌వర్డ్‌ను కనిపెట్టవచ్చు.

3. మీ అకౌంట్లు & డివైస్​లను సురక్షితంగా ఉంచుకోండి

  • బలమైన పాస్‌వర్డ్‌లు: ప్రతి అకౌంట్ కోసం అక్షరాలు, అంకెలు మరియు గుర్తుల ప్రత్యేక కలయికను ఉపయోగించండి.
  • మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (MFA): అదనపు భద్రత కోసం వీలైనప్పుడల్లా తప్పనిసరిగా MFAని ఎనేబుల్ చేయండి.
  • ఆటోమేటిక్ అప్‌డేట్​లు: తెలిసిన సెక్యూరిటీ లోపాలను సరిచేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్‌లు మరియు యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచండి.
  • రెగ్యులర్ బ్యాకప్‌లు: ముఖ్యమైన ఫైల్‌లను ప్రతి నెలా ఎక్స్‌టర్నల్ డ్రైవ్ లేదా నమ్మకమైన క్లౌడ్ సర్వీస్‌లో బ్యాకప్ చేయండి.
  • యాంటీవైరస్/మాల్​వేర్ ప్రొటెక్షన్: క్రమం తప్పకుండా ఎఫెక్టివ్ మాల్​వేర్/యాంటీవైరస్ చెక్ చేస్తూ ఉండండి.

మీ సమాచారం చోరీకి గురైందని మీరు అనుమానించినట్లయితే, వెంటనే మోసాన్ని నివేదించండి.

4. తర్వాతి తరానికి అవగాహన కల్పించండి

పిల్లలకు ఆన్‌లైన్ భద్రత గురించి నేర్పించడం చాలా ముఖ్యం. వీటి గురించి వారితో క్రమం తప్పకుండా మాట్లాడండి:

  • ప్రైవసీ: వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు పంచుకోకూడదో లేదా చాట్‌లలో అపరిచితులతో ఎందుకు మాట్లాడకూడదో వివరించండి.
  • పేరెంటల్ కంట్రోల్స్: అనుచితమైన సైట్‌లను బ్లాక్ చేయడానికి అలానే ఆరోగ్యకరమైన స్క్రీన్ టైమ్ పరిమితులను సెట్ చేయడానికి టూల్స్‌ను ఉపయోగించండి.
  • ఓపెన్ కమ్యూనికేషన్: ఆన్‌లైన్‌లో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే మీ దగ్గరకు వచ్చి చెప్పేలా వారిని ప్రోత్సహించండి.
  • నియంత్రించడం కాదు, అవగాహన కల్పించడం: యాక్సెస్‌ను కేవలం పరిమితం చేయడం కంటే డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో పిల్లలకు సహాయం చేయండి.
  • ఫ్యామిలీ కోడ్ వర్డ్: AI స్కామర్లు పెరుగుతున్న ఈ కాలంలో, AIని ఉపయోగించి మోసగాళ్లు చేసే ఎమోషనల్ మరియు ఫైనాన్షియల్ మోసాల నుండి తప్పించుకోవడానికి కుటుంబంలో ఒక సాధారణ కోడ్ వర్డ్‌ను కలిగి ఉండటం ముఖ్యం.

ఎలా రిపోర్ట్ చేయాలి

మీరు స్కామ్ బారిన పడ్డారని అనుమానిస్తే, వెంటనే రిపోర్ట్ చేయండి:

PhonePeలో రిపోర్ట్ చేయడం:

  • PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి.
  • కస్టమర్ కేర్: PhonePeకు 80–68727374 లేదా 022–68727374 నంబర్లకు కాల్ చేయండి.
  • సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి:
  • ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.

అధికారులకు రిపోర్ట్ చేయండి:

  •  సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్​లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా  1930కు కాల్ చేయండి.
  • టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సాప్ మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.

సురక్షమైన సంస్కృతిని నిర్మించడం

డిజిటల్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. అప్రమత్తంగా ఉండటం, MFA వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు జాగ్రత్తగా ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉండటం ద్వారా, మీరు మీ అంతర్గత వృత్తాన్ని రక్షించుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో మీరు సహాయపడవచ్చు.

ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్​లను విస్మరించండి. మీకు మోసానికి గురైనట్టు అనుమానమైతే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading