PhonePe Blogs Main Featured Image

Trust & Safety

థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా జరిగే మోసాలతో తస్మాత్ జాగ్రత్త

PhonePe Regional|2 min read|22 April, 2021

URL copied to clipboard

బ్యాంకు ఖాతా నెంబర్లు, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వివరాలు, UPI పిన్ లేదా OTP లాంటి వ్యక్తిగత వివరాలను పంచుకునేలా యూజర్లను మాయ చేసి, వారి నిధులను తమ సొంత ఖాతాలలోకి బదిలీ చేసుకునే మోసగాళ్లకు సంబంధించిన అనేక రకాల కథలు, కథనాలను మనం నిత్యం వింటూనే ఉన్నాము.

పైన పేర్కొన్నట్టుగా మీరు వ్యక్తిగత వివరాలను పంచుకోకున్నా మోసాలు జరగగలవనే విషయం మీకు తెలుసా? నిజమే, థర్ట్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా మోసాలు జరగవచ్చు!

ఈ థర్డ్ పార్టీ యాప్‌లు అంటే ఏమిటి? మోసగాళ్లు వాటిని ఎలా ఉపయోగించుకుంటారు?

స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లు వందల సంఖ్యలో ఉన్నాయి. సాధారణంగా దూర ప్రదేశం నుంచి ఒక ఫోన్ ద్వారా సమస్యలను సరి చేయడం కోసం ఈ యాప్‌లను ఇంజనీర్లు ఉపయోగిస్తుంటారు. ఈ యాప్‌లు వినియోగదారు ఫోన్‌కు పూర్తి యాక్సెస్‌ను మరియు నియంత్రణను అనుమతిస్తాయి.

దురుద్దేశ్య ప్రయోజనాలకోసం మీ ఫోన్‌ను నియంత్రించడానికి మోసగాళ్లు థర్డ్ పార్టీ స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించుకుంటారు!

గమనిక: థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయమని PhonePe ఎన్నడూ కోరదు. ఎవరో కోరారని మీరు యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి. మీ ఫోన్‌ను నియంత్రించి, వారున్న ప్రదేశం నుంచే మీరు సేవ్ చేసిన కార్డు లేదా ఖాతా వివరాలను చూసేందుకు ఎనీ డెస్క్/టీమ్ వ్యూయర్ లాంటి యాప్‌లను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఏదైనా కార్యకలాపంపై అనుమానం తలెత్తితే, support.phonepe.com లో నివేదించండి.

థర్డ్ పార్టీ యాప్‌లు ఎలా పని చేస్తుందో తెలుసుకోండి:

  • యూజర్లను సంప్రదిస్తున్న మోసగాళ్లు PhonePe యాప్‌లో లేదా ఒక PhonePe లావాదేవీ విషయంలో ఎదుర్కుంటున్న ఏదైనా సమస్యను పరిష్కరిస్తామని చెబుతారు.
  • సమస్యను వెంటనే పరిష్కరించడానికి స్క్రీన్ షేర్, ఏనీ డెస్క్, టీమ్ వ్యూయర్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్ తదితరాలను డౌన్‌లోడ్ చేయాలని యూజర్లను వారు కోరుతారు.
  • యూజర్లను వారి కార్డు, బ్యాంకు వివరాలు, UPI పిన్ లేదా OTPని కోరడానికి బదులు, వారి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును వారి కెమెరా ముందు పెట్టాలని మోసగాళ్లు కోరుతారు. తద్వారా PhonePe ధృవీకరణ వ్యవస్థ కార్డు వివరాలను కచ్చితంగా స్కాన్ చేసుకోగలదు.
  • తమకు సహాయం చేస్తున్నారని యూజర్లు భావిస్తుండగా, మోసగాళ్లు యూజర్ కార్డు నెంబర్, CVV కోడ్‌ను రికార్డు చేసుకుని, SMS ద్వారా తమ సొంత ఖాతాకు నిధులను బదిలీ చేసుకోవడం కోసం OTPని పంపించేందుకు ఉపయోగించుకుంటారు.
  • మీ ఫోన్‌ను యాక్సెస్ చేసుకునేందుకు స్క్రీన్ షేరింగ్ యాప్‌లు అనుమతిస్తాయని గుర్తుంచుకోండి. యూజర్ ఫోన్‌లో అందుకున్న OTPని మోసగాళ్లు చూస్తారు. తమ సొంత ఖాతాకు నిధులను బదిలీ చేసుకునేందుకు దానిని వారు ఉపయోగించుకుంటారు.

పేమెంట్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉంటూ, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా

PhonePe ఎన్నడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను కోరదు. PhonePe ప్రతినిధినని చెప్పుకుంటూ ఎవరైనా అలాంటి వివరాలను ఇవ్వాలని మిమ్మల్ని కోరితే, దయచేసి ఇమెయిల్ ద్వారా అభ్యర్థించాలని వారిని కోరండి. అంతేకాక @phonepe.com డొమైన్ నుంచి వచ్చే ఇమెయిళ్లకు మాత్రమే స్పందించండి.

PhonePe కస్టమర్ సపోర్ట్ నెంబర్ల కోసం గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి వాటిని మీరు శోధించవద్దు. PhonePe వినియోగదారు సేవా విభాగాన్ని సంప్రదించడానికి సరైన మార్గం support.phonepe.com మాత్రమే. PhonePe వినియోగదారు సేవా విభాగం అని చెప్పుకునే ధృవీకరించని నెంబర్లకు కాల్ చేయడం లేదా స్పందించడం చేయవద్దు.

Keep Reading

PhonePe Blog | Translation Badge
PhonePe Blog | Translation Badge