PhonePe Blogs Main Featured Image

Trust & Safety

నకిలీ యాప్‌లను APK స్కామ్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేయకుండా సురక్షితంగా ఉండటం ఎలా?

PhonePe Regional|3 min read|17 December, 2025

URL copied to clipboard

ఈ రోజుల్లో  పేమెంట్లు, బ్యాంకింగ్ యాప్​లు, గుర్తింపు డాక్యుమెంట్​లు, మనం చేసే పనికి సంబంధించిన టూల్స్/యాప్​లు ఇంకా వ్యక్తిగత సంభాషణలు మనకు అవసరమైన ప్రతిదీ మన స్మార్ట్‌ఫోన్‌లలో ఉంటున్నాయి. ఒకే డివైస్​​లో ఇంత సమాచారం ఉన్నందున, సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్​లు, హానికరమైన APK ఫైళ్లను ఉపయోగించి మోసాలకు పాల్పడటంలో ఆశ్చర్యం లేదు.

ఈ స్కామ్‌లు తరచుగా చాలా చిన్న విషయాలతో మొదలవుతాయి: వాట్సాప్ లేదా టెలిగ్రామ్​లో ఒక లింక్, ‘చలాన్’ కట్టలేదని చెప్పే SMS, లేదా OTT సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రీమియం సేవలకు “ఫ్రీ అప్‌గ్రేడ్” ఆఫర్ చేసే మెసేజ్. మీరు ఒక్కసారి దానిపై ట్యాప్ చేస్తే చాలు, మీకు తెలియని వ్యక్తికి మీ ఫోన్ నియంత్రణ అప్పగించినట్లే.

APK డౌన్‌లోడ్‌లు ఎందుకు ప్రమాదకరం?

APK (ఆండ్రాయిడ్ ప్యాకేజీ ఫైల్) అనేది ఆండ్రాయిడ్ ఫోన్‌లలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగించే ఫైల్. ఇది Google Play Store, Apple App Store లేదా Indus App Store వంటి అధికారిక యాప్ స్టోర్ వెలుపల నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కొన్నిసార్లు సరైన కారణాల కోసం ఉపయోగించినప్పటికీ, ఈ ఫైళ్లు అధీకృత యాప్ స్టోర్‌లలోని యాప్‌లకు వర్తింపజేసే భద్రతా తనిఖీలను దాటవేస్తాయి.

ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?

మోసగాళ్లు సాధారణంగా ఈ స్పష్టమైన క్రమాన్ని అనుసరిస్తారు:

  • ముందుగా, వారు రివార్డు, లోన్ లేదా పెనాల్టీ మాఫీని వాగ్దానం చేస్తూ లింక్ లేదా SMSని పంపుతారు.
  • ఆ లింక్‌ని క్లిక్ చేస్తే, అధికారిక యాప్‌ స్టోర్‌కు వెళ్లకుండా, నేరుగా ఒక నకిలీ యాప్ (APK) డౌన్‌లోడ్ అవుతుంది.
  • ఆ యాప్ మీ ఫోన్‌లో అనవసరమైన అనుమతులను అడుగుతుంది (SMS, కాంటాక్ట్​లు, నోటిఫికేషన్‌లు మొదలైనవి చూడటానికి).
  • నకిలీ యాప్ కనిపించేలా ఏమీ చేయదు లేదా క్రాష్ అవుతుంది – అదే సమయంలో మాల్‌వేర్  నిశ్శబ్దంగా పనిచేస్తుంది.
  • దీని ద్వారా, మోసగాళ్ళు మీ OTPని దొంగిలిస్తారు, మీ స్క్రీన్‌పై నిఘా పెట్టి, స్క్రీన్​పై వచ్చే అలెర్ట్​లని డిలీట్ చేసి, అలానే బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని దొంగిలిస్తారు.

అనధికార లావాదేవీలు లేదా అకౌంట్​లు ఖాళీ అయిన తర్వాత మాత్రమే యూజర్ దానిని గుర్తిస్తారు.

ఈ ప్రమాదం ఎంత పెద్దది?

2024లో భారతదేశంలో దాదాపు 36 లక్షల సైబర్-మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి, వాటి నష్టం ₹22,845 కోట్లు అని అంచనా. రిపోర్ట్ చేయబడిన సైబర్ భద్రతా సంఘటనలు 2022లో దాదాపు 10.29 లక్షల నుండి 2024లో దాదాపు 22.68 లక్షలకు రెట్టింపు అయ్యాయి.*

ప్రమాదంలో ఎవరు ఉన్నారు?

ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవచ్చు, కానీ సాధారణంగా బాధితులుగా అయ్యే వారు:

  • ఎక్కువ యాప్​లను ఉపయోగించి, తరచుగా లావాదేవీలు చేసే ఉద్యోగులు.
  • అధికారికంగా కనిపించే ఏ మెసేజ్ అయినా నమ్మే అవకాశం ఉన్న వృద్ధులు లేదా టెక్నాలజీ గురించి తక్కువ తెలిసిన యూజర్​లు.
  • సోర్స్​ని చెక్ చేయకుండా “ఫ్రీ” యాప్​లు లేదా గేమ్ అప్‌గ్రేడ్​ల కోసం వెతికే యువత.

గమనించవలసిన హెచ్చరిక సంకేతాలు

  • Indus Appstore వంటి అధికారిక యాప్ స్టోర్​కు బదులుగా SMS లేదా వాట్సాప్ లేదా మరేదైనా థర్డ్ పార్టీ యాప్ ద్వారా డౌన్‌లోడ్ లింక్ రావడం.
  • యాప్‌కు సంబంధం లేని అనుమతులను అడగడం (ఉదాహరణకు: మీ కాంటాక్ట్‌లు లేదా మెసేజ్​లను చదవడానికి అనుమతి అడుగుతున్న ఫ్లాష్‌లైట్ యాప్).
  • తప్పుగా రాసినట్లు, కొత్తగా లేదా అనుమానాస్పదంగా కనిపించే డెవలపర్ పేర్లు
  • నమ్మశక్యం కాని ఆఫర్‌లు లేదా మెసేజ్‌లు (“ఫ్రీ ప్రీమియం”, “తక్షణ లోన్ అప్రూవల్”, పెళ్లి ఆహ్వానం, మొదలైనవి).
  • యాప్ అతి తక్కువ డౌన్‌లోడ్‌లు, సాధారణ బ్రాండింగ్ లేదా తక్కువ యూజర్ రివ్యూలను కలిగి ఉండటం.

మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎలా?

  • అధికారిక స్టోర్​ల (Indus App Store/Google Play/Apple App Store) నుండి మాత్రమే యాప్​లను ఇన్‌స్టాల్ చేయండి.
  • మీరు ఏమి డౌన్‌లోడ్ చేస్తున్నారో ఖచ్చితంగా తెలియకపోతే “తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి”ని డిసేబుల్ చేసి ఉంచండి.
  • అనుకోకుండా వచ్చే చలాన్‌లు, రీఫండ్‌లు, రివార్డ్‌లు లేదా లోన్‌లకు సంబంధించిన లింక్‌లు/ఫైల్‌లను ట్యాప్ చేయకుండా ఉండండి.
  • యాప్​లు అడిగే అనుమతులు ఎనేబుల్ చేసే ముందు వాటిని సమీక్షించండి.
  • హానికరంగా అనిపించే ప్రవర్తన కోసం స్కాన్ చేయడానికి నమ్మదగిన మొబైల్ సెక్యూరిటీ టూల్​ను ఉపయోగించండి.

మీరు నకిలీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే ఏమి చేయాలి?

  • వెంటనే ఆ యాప్​ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
  • తాత్కాలికంగా మొబైల్ డేటా మరియు Wi-Fiని ఆఫ్ చేయండి.
  • బ్యాంకింగ్, ఇమెయిల్ & పేమెంట్ యాప్​లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను మార్చండి.
  • మీ బ్యాంక్/పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్​ను సంప్రదించి, మానిటరింగ్​ను ఎనేబుల్ చేయమని లేదా కార్యాచరణను ఫ్రీజ్ చేయమని కోరండి.

ఎలా రిపోర్ట్ చేయాలి

మీరు స్కామ్ బారిన పడ్డారని అనుమానిస్తే, వెంటనే రిపోర్ట్ చేయండి:

PhonePeలో రిపోర్ట్ చేయడం:

  • PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి.
  • కస్టమర్ కేర్: PhonePeకు 80–68727374 లేదా 022–68727374 నంబర్లకు కాల్ చేయండి.
  • సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి:
  • ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.

అధికారులకు రిపోర్ట్ చేయండి:

  •  సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్​లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా  1930కు కాల్ చేయండి.
  • టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సాప్ మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.

చివరి మాట

డిజిటల్ పేమెంట్​లు, యాప్​లు జాగ్రత్తగా ఉపయోగిస్తే సురక్షితంగా ఉంటాయి. APK/నకిలీ యాప్​ల ఆధారిత మోసాలు మనం భయం వల్ల లేదా ఉత్సాహం వల్ల సరిగ్గా వెరిఫై చేయకుండా తొందరపాటుతో వ్యవహరించడం వల్లే ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యమైన ఆర్థిక నష్టం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి, యాప్​ల సోర్స్​ని, డెవలపర్ ఇమెయిల్​ని అడిగే అనుమతులను అలానే ఏ లింక్‌లైనా ప్రామాణికతను నిర్ధారించుకోవడానికి కొద్ది సమయం తీసుకోవాలి. తెలియని లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండటం అనేది చాలా ముఖ్యమైన నివారణ చర్య.

అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్‌లను ప్రశ్నించండి. బాధ్యతాయుతంగా డౌన్‌లోడ్ చేసుకోండి.

ముఖ్యమైన రిమైండర్ —  PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్​లను విస్మరించండి. మీకు మోసానికి గురైనట్టు అనుమానమైతే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.


*సోర్స్ : ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్

Keep Reading