PhonePe Blogs Main Featured Image

Trust & Safety

ట్యాక్స్ స్కామ్​ల నుండి సురక్షితంగా ఉండటం ఎలా ?

PhonePe Regional|2 min read|07 August, 2025

URL copied to clipboard

ఐటీఆర్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది! దానితో పేపర్​వర్క్ మాత్రమే కాదు, టాక్స్ స్కామ్​ల బారిన పడే ప్రమాదం కూడా వస్తుంది.

మీ ఫోన్‌కి: “అర్జెంట్: మీకు ₹25,000 టాక్స్ రిఫండ్ సిద్ధంగా ఉంది! 1 గంటలోపు గడువు ముగుస్తుంది, క్లెయిమ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి” అనే SMS వచ్చిందని ఊహించుకోండి. ఇంత పెద్ద మొత్తంలో రిఫండ్ వస్తుందన్న ఆశ, మరియు కేవలం ఒక గంట సమయం మాత్రమే ఉందన్న తొందరపాటు మిమ్మల్ని ఆ లింక్‌పై క్లిక్ చేసేలా చేస్తుంది. కానీ ఇది దాదాపు ఖచ్చితంగా ఫిషింగ్ ప్రయత్నమే. ఇలాంటి లింకులపై క్లిక్ చేయడం వల్ల మీ ఐడెంటిటీ దొంగిలించబడవచ్చు, లేదా ఆర్థికంగా నష్టపోవచ్చు.

సైబర్ నేరస్థులు గందరగోళం, సమీపిస్తున్న గడువులు మరియు టాక్స్ రిఫండ్ల పట్ల ఉండే ఉత్సాహాన్ని ఉపయోగించుకుని, వ్యక్తులను వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడానికి, హానికరమైన లింక్‌లను క్లిక్ చేయడానికి లేదా నకిలీ రుసుములు చెల్లించడానికి మోసగిస్తారు. ఈ స్కామ్ రకాన్ని మరియు దాని నుండి ఎలా సురక్షితంగా ఉండాలో అర్థం చేసుకోవడానికి చదవండి.

టాక్స్ స్కామ్ అంటే ఏమిటి?

టాక్స్ స్కామ్​లలో, సైబర్ నేరగాళ్లు టాక్స్ నిపుణులు, ప్రభుత్వ ఏజెన్సీలు, లేదా రిఫండ్ సేవలు వంటి నమ్మకమైన సంస్థల వలె నటిస్తారు. వారి ప్రధాన లక్ష్యం మీ వ్యక్తిగత డేటా, డబ్బు, లేదా మీ టాక్స్ రిఫండ్​ను దొంగిలించడమే.

టాక్స్ స్కామ్ ఎలా జరుగుతుంది?

భయం, తొందరపాటు లేదా ఆశ చూపించి మోసగాళ్లు మిమ్మల్ని మోసం చేస్తారు. మీ ముఖ్యమైన సమాచారాన్ని లేదా డబ్బును లాక్కోవడానికి వాళ్లు ఈ పద్ధతులు వాడతారు. ఒక సాధారణ స్కామ్ ఎలా జరుగుతుందో చూడండి:

  1. నకిలీ గుర్తింపులతో మోసాలు : మోసగాళ్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుండి వచ్చినట్లుగా , మీ టాక్స్  సలహాదారునిగా లేదా మీకు టాక్స్ రిఫండ్  ఇప్పించే సంస్థల ప్రతినిధులుగా నటిస్తారు.
  2. బహుళ మార్గాల ద్వారా మోసాలు : మోసగాళ్లు మిమ్మల్ని వివిధ మార్గాల ద్వారా సంప్రదిస్తారు. నకిలీ కాలర్ ఐడీలతో ఫోన్ కాల్స్, ప్రభుత్వ సంస్థల పేర్లతో ఉండే నకిలీ డొమైన్‌ల నుంచి ఈమెయిళ్ళు, మరియు అత్యవసర పన్ను సమస్యలు లేదా వాపసుల గురించి చెప్పే SMS లేదా WhatsApp మెసేజ్‌ల ద్వారా వారు మిమ్మల్ని సంప్రదించవచ్చు.
  3. అత్యవసర పరిస్థితిని సృష్టించడం: మోసగాళ్లు మిమ్మల్ని భయపెట్టడానికి లేదా తొందర పెట్టడానికి ఇలాంటి సందేశాలు పంపుతారు:
    • “మీరు ట్యాక్స్​లు చెల్లించాలి, అరెస్ట్ కాకుండా ఉండాలంటే వెంటనే చెల్లించండి.”
    • “మీ టాక్స్ రిఫండ్ గడువు ముగియకముందే ఇప్పుడే క్లెయిమ్ చేసుకోండి.”
    • “మీ పాన్/ఆధార్ ఇన్వెస్టిగేట్ చెయ్యబడుతోంది.”
    • “మీ ఐటీఆర్ లో తప్పులు ఉన్నాయి; వెంటనే మీ వివరాలను సరిచూసుకోండి.”
  4. వ్యక్తిగత వివరాలు కోరడం: ఒకసారి మీరు వారితో మాట్లాడటం మొదలుపెడితే, వారు మీ పాన్, ఆధార్, పుట్టిన తేదీ, బ్యాంక్ ఖాతా నంబర్లు, యూపీఐ ఐడీలు, కార్డ్ వివరాలు లేదా ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను “వెరిఫికేషన్” పేరుతో అడుగుతారు. అంతేకాకుండా, యూపీఐ, గిఫ్ట్ కార్డ్‌లు లేదా వాలెట్ల ద్వారా వెంటనే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయవచ్చు.
  5. పరిణామాలు: మీరు మోసగాడు ఇచ్చిన అన్ని సూచనలను పాటిస్తే, మీరు డబ్బును కోల్పోవచ్చు, మీ గుర్తింపు దొంగిలించబడవచ్చు మరియ ఆ తర్వాత మోసగాడు మిమ్మల్ని పూర్తిగా సంప్రదించడం మానేస్తాడు.

టాక్స్‌ మోసాలను సూచించే ప్రమాద హెచ్చరికలు

  • టాక్స్‌ అధికారుల నుండి ఊహించని కాల్స్, ఇమెయిళ్లు లేదా మెసేజ్‌లు.
  • భయపెట్టే బెదిరింపులు లేదా అవాస్తవ గడువులు.
  • సాధారణం కాని పేమెంట్ పద్ధతులు కోరడం.
  • నిజం కావడానికి వీలులేని మంచి రిఫండ్ ఆఫర్లు.
  • ఓటీపీలు, పిన్‌లు లేదా పాస్‌వర్డ్‌లను అడగడం.

మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి

  1. సరిచూసుకోండి: అధికారిక ట్యాక్స్ సమాచారం కేవలం @gov.in తో ముగిసే ఇమెయిల్ అడ్రస్‌ల నుండి మాత్రమే వస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని SMS లేదా ఫోన్ కాల్స్ ద్వారా అడగదు.
  2. నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌లను వాడండి: టాక్స్​లను incometax.gov.in  వెబ్‌సైట్‌లో లేదా నమ్మకమైన నిపుణుల ద్వారా మాత్రమే ఫైల్ చేయండి. వెరిఫై చేయబడని థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లు లేదా తెలియని లింక్‌లను వాడకండి.
  3. ఓటీపీలు లేదా పాస్‌వర్డ్‌లు చెప్పవద్దు: టాక్స్ అధికారులు ఎప్పుడూ ఓటీపీలు, పిన్‌లు లేదా బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు అడగరు.
  4. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోండి: ముఖ్యంగా టాక్స్ ఫైల్ చేసే సాఫ్ట్‌వేర్ మరియు ఆర్థిక సంబంధిత యాప్‌లలో ఎల్లప్పుడూ తాజా యాంటీవైరస్ మరియు యాంటీ-మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌ను వాడండి.

ఒకవేళ మీరు మోసపోయినట్లయితే

  1. వెంటనే మీ బ్యాంక్‌ని సంప్రదించండి.
  2. https://cybercrime.gov.in. వెబ్‌సైట్‌లో లేదా 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సైబర్‌క్రైమ్ ఫిర్యాదు చేయండి.
  3. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేయండి.
  4.  మీ క్రెడిట్ మరియు ఆర్థిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.

PhonePeలో ట్యాక్స్  మోసాన్ని ఎలా తెలియజేయాలి

ఒకవేళ మిమ్మల్ని PhonePe ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక మోసగాడు లక్ష్యంగా చేసుకుని ఉంటే, ఈ క్రింది విధంగా ఫిర్యాదు చేయవచ్చు:

  • PhonePe యాప్: యాప్‌లో సహాయం > “లావాదేవీలో సమస్య ఉంది”కు వెళ్లి మీ ఫిర్యాదును నమోదు చేయండి.
  • కస్టమర్ కేర్: సహాయం కోసం 80-68727374 / 022-68727374 PhonePe సహాయ విభాగం నంబర్‌కు కాల్ చేయండి.
  • సోషల్ మీడియా: PhonePe యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా మోసాన్ని నివేదించవచ్చు.
  • ఫిర్యాదుల పోర్టల్ : మీ టికెట్ ఐడీని ఉపయోగించి, ఇప్పటికే ఉన్న మీ ఫిర్యాదులను https://grievance.phonepe.com/ వెబ్‌సైట్‌లో ట్రాక్ చేయండి.

అధికారులకు తెలియజేయటం

  • టెలికమ్యూనికేషన్ల శాఖ (DOT):  సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా అనుమానాస్పద సందేశాలు, కాల్‌లు లేదా ఏదైనా మోసం అభ్యర్థనను తెలియజేయండి.

ముఖ్యమైన గమనిక — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి కాకపోతే PhonePe నుండి వచ్చినట్లు చెప్పుకునే అన్ని మెయిల్స్​ను పట్టించుకోకండి. మీరు మోసాన్ని అనుమానించినట్లయితే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading