PhonePe Blogs Main Featured Image

Trust & Safety

జంప్డ్ డిపాజిట్ స్కామ్​లు: మీ UPI పిన్ ఎప్పుడు ఎంటర్ చేయాలో తెలుసుకోండి

PhonePe Regional|3 min read|25 February, 2026

URL copied to clipboard

మీ అకౌంట్ నుండి ఏదైనా లావాదేవీ ద్వారా డబ్బు బయటకు వెళ్లడానికి మీ UPI పిన్ అనేది ఆఖరి గేట్‌వే లాంటిది. మీరు దీన్ని ఎంటర్ చేసిన ప్రతిసారీ, మీ అకౌంట్ నుండి డబ్బు పంపడానికి మీరు అనుమతిని ఇస్తున్నారని అర్థం – అందుకే మీరు దేనిని ఆమోదిస్తున్నారో ఒక నిమిషం ఆగి వెరిఫై చేయడం చాలా ముఖ్యం. అయితే రోజువారీ లావాదేవీల హడావిడిలో, ఈ చిన్న దశను తరచుగా విస్మరిస్తుంటారు, దీనివల్ల యూజర్లు అధునాతన సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌ల బారిన పడే అవకాశం ఉంది. అటువంటి ఒక స్కామే జంప్డ్ డిపాజిట్ స్కామ్.

ఇది ఎలా పనిచేస్తుంది మరియు మీరు ఎలా సురక్షితంగా ఉండవచ్చో ఇక్కడ వివరంగా ఉంది.

అసలు జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏమిటి?

మోసగాళ్లు బాధితులను తప్పుదోవ పట్టించి, తమకు డబ్బు వస్తోందని నమ్మించి, తెలియకుండానే UPI ద్వారా పేమెంట్ అభ్యర్థనను ఆమోదించేలా చేయడాన్ని జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటారు. ఈ పేరులోని “జంప్డ్” అనే పదం, మీరు మోసగాడి మాటలు నమ్మి మోసపోయిన తర్వాత మీ అకౌంట్ నుండి డబ్బు ఎంత వేగంగా బయటకు వెళ్తుందో తెలియజేస్తుంది. వారు మీ ఫండ్స్‌ను కేవలం సెకన్లలో డజనుకు పైగా విభిన్న బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేస్తారు లేదా “జంప్” చేస్తారు, దీనివల్ల ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో గుర్తించడం దాదాపు అసాధ్యం అవుతుంది.

మీ OTPని దొంగిలించడానికి ప్రయత్నించే ఇతర స్కామ్‌లలా కాకుండా, ఇది మీతోనే మీ UPI పిన్ ఎంటర్ చేయించేలా మిమ్మల్ని బురిడీ కొట్టిస్తుంది.

ఈ ఉచ్చు ఎలా బిగిస్తారు

  1. చిన్న క్రెడిట్: మీ అకౌంట్‌లో ₹10 లేదా ₹50 వంటి చాలా చిన్న అమౌంట్ డిపాజిట్ అయినట్లు మీకు ఒక నోటిఫికేషన్ లేదా SMS వస్తుంది.
  2. దిగులుగా ఉన్నట్లు వచ్చే కాల్: కొన్ని నిమిషాల తర్వాత, మీకు ఒక కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి చాలా కంగారుగా లేదా ఏడుస్తున్నట్లు మాట్లాడుతుంటారు. వారు పొరపాటున మీ నంబర్‌కు డబ్బు పంపారని, మెడికల్ ఎమర్జెన్సీ లేదా బిల్లు చెల్లించడం కోసం ఆ డబ్బు తమకు చాలా అర్జంటుగా తిరిగి కావాలని బ్రతిమాలుతారు.
  3. దృష్టి మరల్చడం: మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు, వారు మిమ్మల్ని “మీ యాప్ లేదా SMS తెరిచి మీ అకౌంట్​లో డబ్బు జమ అయిందో లేదో చెక్ చేయమని” అడుగుతారు. మోసగాడు మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్న కల్పిత కథను బట్టి, ఆ మెసేజ్‌లో  “XYZ బ్యాంక్ నుండి రీఫండ్”, “ABC స్టోర్ నుండి క్యాష్‌బ్యాక్” లేదా “కంపెనీ పేరోల్ నుండి డిపాజిట్”  అని ఉండవచ్చు.
  4. అథరైజేషన్: ఆ తర్వాత స్కామర్ ఒక థర్డ్-పార్టీ యాప్ ద్వారా జనరేట్ చేసిన లింక్ లేదా ఫేక్ QR కోడ్ ఉపయోగించి ₹5,000 వంటి పెద్ద మొత్తానికి ఒక నకిలీ QR కోడ్‌ను పంపిస్తారు, ఇది మీరు స్టోర్‌లో పేమెంట్ చేసేటప్పుడు లేదా ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు చూసే దానిలాగే ఉంటుంది. వారికి సహాయం చేయాలనే హడావిడిలో, మీరు ఆ డిపాజిట్‌ను వెరిఫై చేస్తున్నామని లేదా పొరపాటున వచ్చిన ఆ ₹50 తిరిగి పంపుతున్నామని అనుకుని పిన్ ఎంటర్ చేయవచ్చు. మీరు పిన్ ఎంటర్ చేసిన మరుక్షణమే, మీ అకౌంట్ నుండి చాలా పెద్ద అమౌంట్ డెబిట్ అవుతుంది.

ఈ స్కామ్ వెనుక ఉన్న సైకాలజీ

హేతుబద్ధమైన ఆలోచనను పక్కన పెట్టి, ప్రాథమిక మానవ మానసిక అంశాలను ఈ మోసగాళ్లు ఎలా వాడుకుంటారో నిపుణులు వివరిస్తున్నారు:

  • నమ్మకాన్ని కలిగించడం: మోసగాళ్లు ముందుగా మీ అకౌంట్‌లోకి చిన్న అమౌంట్ బదిలీ చేయడం ద్వారా నమ్మకాన్ని ఏర్పరుచుకుంటారు. యూజర్ అకౌంట్‌లోకి డబ్బు పంపడం ద్వారా మోసగాళ్లు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు.
  • కుతూహలం మరియు నమ్మకాన్ని వాడుకోవడం: కుతూహలం, నమ్మకం మరియు డిజిటల్ పేమెంట్స్ పట్ల అవగాహన లేకపోవడాన్ని ఈ స్కామ్ ఆసరాగా చేసుకుంటుంది. ఊహించని విధంగా డిపాజిట్ రావడం వల్ల బాధితుడు దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు అలానే పొరపాటున వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలనే బాధ్యతగా భావిస్తాడు.
  • అత్యవసర పరిస్థితి సృష్టించడం: వారు భావోద్వేగ వ్యూహాలను ఉపయోగిస్తారు,మీకు ఆలోచించడానికి సమయం ఇవ్వకుండా చర్యలోకి తీసుకురావడానికి,ఉదాహరణకు “ఆసుపత్రికి డబ్బు అవసరం” వంటి తప్పుడు కథ చెప్తారు.
  • అవగాహన లేకపోవడం: తమ బ్యాలెన్స్‌ని వెరిఫై చేయడానికి లేదా డబ్బును అందుకోడానికి కూడా UPI పిన్ ఎంటర్ చేయడం అవసరమని చాలా మంది పొరపాటున నమ్ముతుంటారు, కానీ నిజానికి అది పేమెంట్ చేయడానికి మాత్రమే వాడతారు.

జంప్డ్ డిపాజిట్ స్కామ్స్ నుండి మీ డబ్బును ఎలా కాపాడుకోవాలి

  • వేచి చూడండి: మీకు అకస్మాత్తుగా ఏదైనా డిపాజిట్ వచ్చి, ఆ వెంటనే కంగారుగా కాల్ వస్తే, తొందరపడకండి. మోసపూరిత పేమెంట్ లింకులు తరచుగా 5-10 నిమిషాల్లో ఎక్స్‌పైర్ అయిపోతాయి. మీరు మీ యాప్‌ను ఓపెన్ చేసే ముందు ఒక 15 నిమిషాలు ఆగితే, ఆ ఉచ్చు అప్పటికే తొలగిపోయే అవకాశం ఉంటుంది.
  • లావాదేవీ వివరాలను వెరిఫై చేయండి: మీరు అంత సమయం వేచి ఉండలేకపోతే, అమౌంట్ మరియు రిసీవర్ వివరాలతో సహా లావాదేవీ వివరాలను పూర్తిగా చెక్ చేయండి. ఏదైనా UPI అభ్యర్థనను అంగీకరించేటప్పుడు లేదా ఆమోదించేటప్పుడు, లావాదేవీ వివరాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. అలాగే, అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని గుర్తుంచుకోండి.
  • బ్యాంక్​కు వెళ్లమని చెప్పండి: ఎవరైనా నిజంగా పొరపాటున మీకు డబ్బు పంపినట్లయితే, “తప్పు క్రెడిట్” రివర్సల్ ప్రక్రియ కోసం వారి బ్యాంక్​ను సంప్రదించమని వారికి చెప్పండి. పొరపాట్లను సరిదిద్దడానికి ఇది అధికారికమైన, సురక్షితమైన మార్గం. తెలియని వ్యక్తి నుండి వచ్చే UPI అభ్యర్థన ద్వారా మీరు దానిని తిరిగి పంపాల్సిన అవసరం లేదు.
  • మీ స్క్రీన్‌ను చెక్ చేయండి: పిన్ స్క్రీన్ పైభాగంలో ఎల్లప్పుడూ “చెల్లించడం” లేదా “పంపించడం” అనే పదాల కోసం చూడండి. మీకు ఆ పదాలు కనిపిస్తే, వెంటనే ఆగిపోండి.
  • అధికారిక UPI యాప్​లు: మల్టీ-లేయర్ సెక్యూరిటీని అందించే బ్యాంకుల అధికారిక UPI యాప్​లు లేదా PhonePe వంటి పేరున్న ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.
  • పేమెంట్ నోటిఫికేషన్‌లను ఎనేబుల్ చేయండి: అన్ని బ్యాంకింగ్ లావాదేవీల కోసం SMS, ఇమెయిల్ నోటిఫికేషన్‌లను ఎనేబుల్ చేసి ఉంచండి, తద్వారా మీరు ఏదైనా అనధికారిక కార్యకలాపాన్ని తక్షణమే గుర్తించవచ్చు.

మీరు గుర్తుంచుకోవాల్సిన నియమం

డబ్బును అందుకోడానికి మీరు ఎప్పుడూ మీ UPI పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అది రీఫండ్ అయినా, క్యాష్‌బ్యాక్ అయినా, గిఫ్ట్ అయినా లేదా “పొరపాటున” జరిగిన బదిలీ అయినా, ఒక స్క్రీన్ మీ పిన్ అడుగుతోంది అంటే మీ అకౌంట్ నుండి డబ్బు బయటకు వెళ్తోందని అర్థం.

మీరు మోసానికి గురైతే ఏమి చేయాలి

మీరు స్కామ్ బారిన పడ్డారని అనుమానం వస్తే, వెంటనే రిపోర్ట్ చేయండి. ప్రతి సెకను కీలకమే.

PhonePeలో రిపోర్ట్ చేయడం:

  • PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి.
  • కస్టమర్ కేర్: PhonePeకు 80–68727374 లేదా 022–68727374 నంబర్లకు కాల్ చేయండి.
  • సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి:
  • ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.

అధికారులకు రిపోర్ట్ చేయండి:

  •  సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్​లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా  1930కు కాల్ చేయండి.
  • టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సాప్ మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.

ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్​లను విస్మరించండి. మీకు మోసానికి గురైనట్టు అనుమానమైతే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading