
Trust & Safety
కొత్త రకం మోసం: మిలిటరీ అధికారులలా నటిస్తూ అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు
PhonePe Regional|3 min read|28 July, 2026
అమాయక పౌరులను మోసం చేయడానికి భారత సాయుధ దళాల సిబ్బందిలా నటిస్తున్న సైబర్ నేరగాళ్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగినట్లు మా ట్రస్ట్ & సేఫ్టీ టీమ్ గుర్తించింది. మిలిటరీ సైనికులపై ప్రజలకు ఉండే అపారమైన గౌరవాన్ని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఈ మోసగాళ్లు అమాయకులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసి వారి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ రకమైన మోసాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కాబట్టి, ఈ మోసం వెనుక ఉన్న అసలు ఎత్తుగడలను స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ఒక సాధారణ ఉదాహరణ
ఈ మోసం ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి, కింద వివరించిన సాధారణ ఉదాహరణను చూడండి. ఫర్నిచర్ కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్‌లో పెట్టిన ఒక ప్రకటనను చూసి, మోసగాడు ఒక మిలిటరీ ఆఫీసర్‌లా నటిస్తాడు. తన నకిలీ గుర్తింపును ఉపయోగించి, అమ్మకందారుపై ఒత్తిడి తెచ్చి, హడావుడి పెట్టి, అయోమయానికి గురిచేస్తాడు – చివరికి ఆమె డబ్బులు అందుకోవడానికి బదులుగా, తానే ఎదురు డబ్బులు చెల్లించేలా మోసం చేస్తాడు.

ఈ సోషల్ ఇంజనీరింగ్ దాడి ఎలా పనిచేస్తుందో, అలాగే మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి PhonePe ఎలాంటి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చిందో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకుందాం.
ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది?
ఇది ఒక క్లాసిక్ సోషల్ ఇంజనీరింగ్ దాడి. ఫ్రాడ్‌స్టర్లు బాధితులకు వాయిస్ లేదా వీడియో కాల్స్ చేస్తారు. వారు బాధితులుగా మారే అవకాశం ఉన్నవారిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసి, వారు ఆలోచించే లోపే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు. పైన చూసిన ఉదాహరణలో లాగే, సదరు వ్యక్తిని సైనిక అధికారిగా నమ్మి, అమౌంట్ అందుతుందనే ఆశతో తెలియకుండానే UPI పిన్ ఎంటర్ చేయగానే, కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బులు మోసగాళ్ల అకౌంట్లోకి వెళ్ళిపోతాయి.
మిలిటరీ అధికారిగా నటించి మోసం చేసే విధానం
1. సాధారణ వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే పేమెంట్ ఉచ్చు
- లక్ష్యాలు: ఆన్‌లైన్‌లో వస్తువులు అమ్మేవారు, ఇళ్ళు అద్దెకు ఇవ్వాలనుకునే ఇంటి యజమానులు, డాక్టర్లు, ట్యూషన్ టీచర్లు మరియు రకరకాల సేవలు అందించేవారిని, స్కామర్లు వారి లక్ష్యాలుగా చేసుకుంటారు.
- ఉచ్చు: తాము మిలిటరీ ఆఫీసర్ లేదా జవాన్ (పైన చూసిన ఉదాహరణలో “కెప్టెన్ కుమార్”లాగ) అని పరిచయం చేసుకుంటారు. తమకు అత్యవసరంగా సేవలు లేదా వస్తువులు కావాలని, కానీ “కఠినమైన ఆర్మీ క్యాంప్ నిబంధనల” వల్ల నేరుగా కలవలేమని చెబుతారు.
- మానసిక ఎర: నమ్మకాన్ని కలిగించడం కోసం నకిలీ ఆధార్, నకిలీ ఆర్మీ ఐడి మరియు నకిలీ ఫోటోలు వంటి డాక్యుమెంట్లు షేర్ చేస్తారు. ఆ తర్వాత, మీరు అధికారిక “ప్రభుత్వ మర్చంట్ వాలెట్” ద్వారా అడ్వాన్స్ పేమెంట్ అందుకుంటున్నారని మిమ్మల్ని నమ్మిస్తారు.
- మోసం: “డబ్బులు మీ అకౌంట్‌కు బదిలీ అవ్వడానికి అనుమతించండి” అని చెప్తూ, ఒక పేమెంట్ రిక్వెస్ట్ లేదా QR కోడ్‌ను పంపి, మీ UPI పిన్ ఎంటర్ చేయమని అడుగుతారు. నిజానికి, అక్కడ UPI పిన్ ఎంటర్ చేస్తే మీ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయి, అకౌంట్ ఖాళీ అయిపోతుంది.
2. వ్యాపారాలను లక్ష్యంగా చేసుకునే అడ్వాన్స్ పేమెంట్ ట్రాప్
- లక్ష్యాలు: హోల్‌సేల్ వ్యాపారులు మరియు చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు.
- ఎర : మిలిటరీ ఆఫీసర్‌గా నటిస్తూ, ఆర్మీ క్యాంప్ కోసం పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు మోసగాడు నమ్మిస్తాడు.
- మానసిక ఎర: ఆ తర్వాత, కఠినమైన ఆర్మీ నిబంధనలు ఉన్నాయని చెబుతూ, వ్యాపారి ముందుగా “మర్చంట్ రిజిస్ట్రేషన్ ఫీజు” లేదా “కనీస సెక్యూరిటీ డిపాజిట్” చెల్లించాల్సి ఉంటుందని అంటాడు.
- మోసం: సదరు ఫీజు చెల్లించిన వెంటనే, ఆ మోసగాడు ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమైపోతాడు.
PhonePe వద్ద ఉన్న ఆటోమేటెడ్ డిఫెన్స్ టూల్స్
పైన వివరించినటువంటి మోసాలను ముందే గుర్తించి అడ్డుకోవడానికి PhonePe వద్ద బలమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు ఉన్నాయి. నిజసమయంలో సెక్యూరిటీ అందించే ప్రధాన ఫీచర్ ‘PhonePe Protect’. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT)తో నేరుగా అనుసంధానమై పనిచేసే ఒక ఇన్-హౌస్ AI ఆధారిత సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్. నమోదైన సైబర్ నేరగాళ్ల జాతీయ డేటాబేస్‌తో లబ్ధిదారుని ఫోన్ నంబర్‌ను ఇది సరిచూస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి:
- తక్షణ బ్లాకింగ్: ఒక ఫోన్ నంబర్ వల్ల తీవ్రమైన ప్రమాదం ఉందని PhonePe Protect గుర్తిస్తే, PhonePe ఆ పేమెంట్‌ను వెంటనే ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసి, నిలిపివేస్తుంది.
- ముందస్తు నిరోధక చర్య: ఒక లావాదేవీ అనుమానాస్పదంగా ఉందని PhonePe గుర్తిస్తే, అది కావాలనే ఆ లావాదేవీని తాత్కాలికంగా నిలిపివేసి, స్క్రీన్‌పై సెక్యూరిటీ అలర్ట్‌ను చూపిస్తుంది. యూజర్ పిన్ ఎంటర్ చేసే ముందు, కాల్ ద్వారా తమను ఎవరూ మోసం చేయడం లేదని కన్ఫర్మ్ చేసుకోవాలని కోరుతుంది. అది ఎలా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు:

ఎలా రిపోర్ట్ చేయాలి?
మీరు స్కామ్ బారిన పడ్డారని అనుమానిస్తే, వెంటనే రిపోర్ట్ చేయండి:
PhonePeలో రిపోర్ట్ చేయడం:
- PhonePe గ్రూప్ చాట్: ఒకవేళ ఈ గ్రూప్ మోసపూరితమైనదని మీకు అనుమానం వస్తే, గ్రూప్ ప్రొఫైల్ కింద ఉండే “ఎగ్జిట్” మరియు “రిపోర్ట్” ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు.
- PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి.
- PhonePe కస్టమర్ కేర్: PhonePeకు 80–68727374 లేదా 022–68727374 నంబర్లకు కాల్ చేయండి.
- సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి:
- Twitter: PhonePe Support
- Facebook: PhonePe Official
- ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.
అధికారులకు రిపోర్ట్ చేయండి:
- సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా 1930కు కాల్ చేయండి.
- టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సాప్,టెలిగ్రామ్ మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.
ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్స్‌ను విస్మరించండి. మీరు మోసపోయారని భావిస్తే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.
