ఈ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 (ఎప్పటికప్పుడు ఉండవచ్చు), వర్తించే విధంగా నిబంధనలు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ద్వారా సవరించబడిన వివిధ శాసనాలలో ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించిన సవరించిన నిబంధనల ప్రకారం గల ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ కంప్యూటర్ సిస్టమ్ ద్వారా రూపొందించబడింది. కాబట్టి దీనికి ఎటువంటి భౌతిక లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
దయచేసి PhonePe యాప్ ద్వారా ఈ కార్యాచరణను యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి ముందు ఆటోపే (“ఆటోపే నిబంధనలు”) నియమ, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. ఈ ఆటోపే నిబంధనలు మీకు, ఆఫీస్-2, ఫ్లోర్ 5, వింగ్ A, బ్లాక్ A, సలార్పురియా సాఫ్ట్‌జోన్, బెల్లందూర్ విలేజ్, వర్తుర్ హోబ్లి, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు సౌత్, బెంగళూరు, కర్ణాటక, ఇండియా, 560103లో రిజిస్టర్డ్ ఆఫీస్‌ని కలిగి ఉన్న PhonePe ప్రైవేట్ లిమిటెడ్ (“PhonePe”)కు మధ్య కట్టుబడి ఉండే చట్టపరమైన ఒప్పందం. కింద పేర్కొన్న ఆటోపే నిబంధనలను మీరు చదివినట్లు మీరు అంగీకరిస్తున్నారు. అలాగే ధృవీకరిస్తున్నారు. మీరు ఈ ఆటోపే నిబంధనలకు అంగీకరించకపోతే లేదా ఈ ఆటోపే నిబంధనలకు కట్టుబడ కూడదనుకుంటే, మీరు ఈ ఫంక్షనాలిటీని పొందకూడదని/ ఉపయోగించకూడదని ఎంచుకోవచ్చు.
ఈ ఆటోపే నిబంధనలు PhonePe ద్వారా ప్రారంభించబడిన కార్యాచరణను నియంత్రిస్తాయి, దీనిలో PhonePe యూజర్(లు) PhonePe యాప్‌లో అర్హత కలిగిన మర్చంట్ (ల) కోసం, PhonePe యూజర్ (ల) తరపున అటువంటి ఫ్రీక్వెన్సీ సెట్‌పై పేమెంట్(లు) చేయడానికి PhonePeకి ముందస్తు అధికారం ఇవ్వడం ద్వారా లేదా ఈ ఆటోపే నిబంధనలకు అనుగుణంగా PhonePe యూజర్లు ఎంచుకోవడం ద్వారా ఆటోమేటిక్ పేమెంట్(లు)ని (క్రింద నిర్వచించినట్లు) సెటప్ చేయవచ్చు.
- నిర్వచనాలు
- “చర్యలు” అంటే ఈ ఆటోపే నిబంధనలలోని సెక్షన్ V కింద నిర్వచించిన చర్యలను సూచిస్తాయి, వీటిని మేండేట్‌కు సంబంధించి, అలాగే ఆ సమయంలో PhonePe యూజర్ చేపట్టవచ్చు/ అభ్యర్థించవచ్చు.
- “ఆటో టాప్-అప్ మాండేట్” అంటే UPI-లైట్ సౌకర్యం బ్యాలెన్స్‌ను ఆటోమేటిక్ టాప్-అప్ కోసం, గరిష్టంగా అనుమతించదగిన టాప్-అప్ పరిమితి వరకు UPI లైట్ సౌకర్యం కోసం ఒక మేండేట్ (క్రింద నిర్వచించినట్లుగా) UPI సౌకర్యం బ్యాలెన్స్ కనీస బ్యాలెన్స్ థ్రెషోల్డ్‌కు చేరుకున్నప్పుడు RBI, NPCI మరియు/లేదా ఇతర నియంత్రణ అధికారులచే సూచించబడుతుంది.
- “ఆటోమేటెడ్ పేమెంట్స్” లేదా “ఆటోమేటెడ్ లావాదేవీ(లు)” అంటే, PhonePe యూజర్, ఒక మేండేట్ ప్రకారం, అర్హత కలిగిన మర్చంట్ (ల) కోసం సెట్ చేసిన నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఆధారంగా PhonePe ద్వారా ప్రారంభించబడిన అటువంటి పేమెంట్(లు) అని అర్థం.
- “అర్హత కలిగిన మర్చంట్లు” అంటే ఈ ఆటోపే నిబంధనలకు అనుగుణంగా PhonePe వినియోగదారు(ల) నుండి ఆటోమేటెడ్ పేమెంట్లను ఆమోదించడానికి PhonePeతో ప్రారంభించబడిన మర్చంట్లు, సర్వీస్ ప్రొవైడర్(లు), బిల్లర్(లు)ల అర్హత కలిగిన వర్గాలను సూచిస్తుంది.
- “మేండేట్” అంటే ఈ ఆటోపే నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన మర్చంట్(ల)కి ఆటోమేటిక్ పేమెంట్(ల) కోసం PhonePe యాప్ ద్వారా PhonePe యూజర్ అందించిన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ / ఆథరైజేషన్ అని అర్థం.
- “మేండేట్ ఎగ్జిక్యూషన్” అంటే, నిర్దిష్ట ఆటోపే పేమెంట్ కోసం, PhonePe ద్వారా మీరు ఎంచుకున్న పేమెంట్ పద్ధతిని అనుసరించి, మీ జారీచేసేవారి బ్యాంక్ మాండేట్‌కు సంబంధించి అధీకృత మొత్తాన్ని విజయవంతంగా మినహాయించడం.
- “మేండేట్ పరిమితి(తులు)” అంటే మేండేట్‌కు సంబంధించి అటువంటి పరిమితి(తులు) అంటే ఇది (i) ఆటోమేటెడ్ పేమెంట్ ముందస్తు స్థిర విలువ లేదా (ii) ఆటోమేటెడ్ పేమెంట్ వేరియబుల్ విలువ కావచ్చు RBI / NPCI ద్వారా (కాలానుగుణంగా నవీకరించబడినట్లుగా) సెట్ చేయబడిన గరిష్ట / మొత్తం అనుమతించదగిన పరిమితి.
- “మాండేట్ రిజిస్ట్రేషన్” అంటే PhonePe యూజర్ అందించాల్సిన మేండేట్‌కు సంబంధించి అవసరమైన వివరాలు / ఇన్పుట్లు, (i) మేండేట్‌కు సంబంధించి పరామితులు, (ii) మేండేట్‌కు సంబంధించి ప్రారంభ తేదీ, ముగింపు తేదీ , (iii) మేండేట్ పరిమితులు, (iv) మేండేట్ ఫ్రీక్వెన్సీ
- మేండేట్ సెట్ అప్
PhonePe యాప్ ద్వారా మీ జారీదారు బ్యాంక్ విజయవంతమైన ధ్రువీకరణ / ప్రమాణీకరణ తర్వాత మాత్రమే మేండేట్ సెటప్ చేయబడుతుంది. మేండేట్ సెటప్ చేయడానికి, మీరు నిర్దిష్ట ఆటోమేటిక్ పేమెంట్‌కు సంబంధించి మాండేట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివరాలను పంచుకోవాలి. ఇంకా, మీరు మేండేట్ సెటప్‌తో కొనసాగడానికి ఈ ఫంక్షనాలిటీ కింద PhonePe ద్వారా ప్రారంభించబడిన అటువంటి పెమెంట్ పద్ధతు(లు) /పేమెంట్ సాధనం(లు) ఎంచుకోవచ్చు.
విజయవంతమైన మేండేట్ రిజిస్ట్రేషన్ తర్వాత, మీరు సెట్ చేసిన మేండేట్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఒక మేండేట్ అమలు చేయబడుతుంది. అటువంటి అధీకృత మొత్తం మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ / క్రెడిట్ పరిమితి (సందర్భంగా) నుండి తీసివేయబడుతుంది. అలాగే నియమించబడిన చెల్లింపుదారునికి / అటువంటి ఆటోమెటిక్ పేమెంట్‌కు సంబంధించి లబ్ధిదారునికి బదిలీ చేయబడుతుంది.
PhonePe తిరస్కరణ, వైఫల్యం లేదా మేండేట్ లేదా మేండేట్ అమలు పెండింగ్ స్థితికి సంబంధించి ఏదైనా బాధ్యతను ఇందుమూలముగా నిరాకరిస్తుంది, అలాగే ఈ విషయంలో మీ జారీచేసే బ్యాంక్ చేపట్టిన అటువంటి ధృవీకరణ (లు) / ప్రమాణీకరణకు సంబంధించి ఎటువంటి పాత్ర లేదా బాధ్యత ఉండదని కూడా తెలుపుతోంది. - UPI-లైట్ కోసం ఆటో-టాప్ మేండేట్
మీరు PhonePe యాప్ ద్వారా ప్రారంభించబడిన UPI లైట్ సౌకర్యాన్ని ఎంచుకుంటే, ఈ ఆటోపే నిబంధనలకు అనుగుణంగా, UPI లైట్ సౌకర్యం కోసం ఆటో టాప్-అప్ కోసం వర్తించే మేండేట్ పరిమితి(తుల) ప్రకారం, మీరు ఆటో-టాప్-అప్ మేండేట్‌ను సెటప్ చేసే ఎంపికను కలిగి ఉంటారు.
ఉదా: UPI లైట్ సౌకర్యం బ్యాలెన్స్ INR 200 కంటే తక్కువగా ఉంటే, PhonePe యూజర్ దాని UPI లైట్ సౌకర్యానికి ఆటోమేటిక్‌గా INR 300 చేర్చడానికి ఆటో-టాప్-అప్ మేండేట్ సెట్ చేయవచ్చు. దీని ప్రకారం, బ్యాలెన్స్ INR 200 కంటే తక్కువకు చేరుకున్న ప్రతిసారీ INR 300 అటువంటి PhonePe యూజర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుండి డెబిట్ చేయబడుతుంది. - మేండేట్ అమలు చేయడం
మీరు ఎంచుకున్న పేమెంట్ పరికరం / పద్ధతి ఆధారంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్లో తగినంత నిధులను కలిగి ఉంటే మరియు/లేదా అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి(లు) (సందర్భంగా) కలిగి ఉంటే మాత్రమే మీ మేండేట్(లు), మేండేట్ సెటప్ సమయంలో ప్రాసెస్ చేయబడతాయి. మీరు అలా చేయడంలో విఫలమైతే, మీ మేండేట్ అమలు చేయడం విఫలమవుతుంది.
PhonePe ద్వారా మేండేట్ ప్రాసెస్ చేసిన తర్వాత, మీ అర్హత కలిగిన మర్చంట్ ద్వారా, ఆటోమేటిక్ పేమెంట్‌కు సంబంధించి తుది పేమెంట్ స్థితి గురించి నిర్ధారణ పొందడానికి మీ కోసం ఆటోమేటిక్ పేమెంట్ తేదీ నుండి 2 (రెండు) నుండి 10 (పది) రోజుల వరకు పట్టవచ్చని దయచేసి గమనించండి.
మీ ఆటోమేటిక్ పేమెంట్‌కు సంబంధించి మీ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్‌కు అసలు డెబిట్, క్రెడిట్ పరిమితి (సందర్భంగా), అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో విజయవంతమైన మేండేట్ అమలును పోస్ట్ చేయడానికి ముందు, మేండేట్ / మేండేట్ అమలు చేయడానికి సంబంధించి ఇతర వివరాలతో పాటు, వర్తించే చట్టం(లు)/ నోటిఫికేషన్(లు)/ మార్గదర్శకాలు(ల) (ఎప్పటికప్పుడు సవరించిన విధంగా) కింద నియంత్రణ సంస్థలు సూచించిన పద్ధతిలో మీకు తెలియజేయబడుతుంది. - మేండేట్‌కు సంబంధించిన చర్య(లు):
మీరు మేండేట్ చెల్లుబాటు సమయంలో PhonePe యాప్ ద్వారా మీ మేండేట్‌ను (ఆటో టాప్-అప్ మాండేట్‌తో సహా) నిర్వహించడానికి సంబంధించి క్రింది చర్య(లు) చేపట్టవచ్చు, అనగా, (i) మేండేట్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు సెట్ చేసిన మేండేట్ పరిమితి(తుల)ని సవరించండం, ii) మేండేట్ పాజ్ మరియు/లేదా అన్-పాజ్ చేయడం, iii) ఆటోమేటిక్ పేమెంట్‌కు సంబంధించి మీ జారీచేసే బ్యాంకు ద్వారా రిడెంప్షన్ ట్రిగ్గర్ను చేపట్టడానికి ముందు మేండేట్‌ను ఉపసంహరించుకోవడం/ రద్దు చేసుకోవడం.
మేండేట్‌కు సంబంధించి మీ చర్య(లు) మీ జారీ చేసే బ్యాంక్ ద్వారా అదనపు ధృవీకరణ లేదా అధికారానికి లోబడి ఉండవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. మీ చర్య(లు) ఈ ఆటోపే నిబంధనలకు అనుగుణంగా, అలాగే వర్తించే చట్టం(ల)కు అనుగుణంగా ఉంటుందని, అలాగే మీరు RBI / NPCI లేదా మీ జారీదారు బ్యాంక్ (సందర్భంగా) సూచించిన విధంగా చర్య(ల)కి అనుబంధించబడిన అటువంటి సమయ పరిమితి(ల)కి కట్టుబడి ఉంటారని మీరు అంగీకరిస్తున్నారు. - ఛార్జీ(లు)
మేండేట్‌కు సంబంధించి ఛార్జీలు / ఫీజు(లు) విధించవచ్చు. అటువంటి వర్తించే ఛార్జీలు / ఫీజు(లు) PhonePe ద్వారా ప్రదర్శించబడతాయి. అలాగే వాటికి సంబంధించి అటువంటి ఛార్జీలు/ఫీజు(లు)ని చెల్లించడానికి మీరు అంగీకరిస్తున్నారు. - భారం బాధ్యత
మీరు ఈ క్రింది వాటిని అంగీకరిస్తున్నారు. అలాగే గుర్తిస్తున్నారు:- PhonePe అనేది ఆటోమేటిక్ పేమెంట్(ల) కోసం మీ జారీదారు బ్యాంక్ ద్వారా ప్రారంభించబడిన మేండేట్ (ల) కోసం పేమెంట్లను సులభతరం చేస్తుంది. అలాగే నియమించబడిన చెల్లింపుదారు / లబ్ధిదారునికి చెల్లించాల్సిన పేమెంట్ లావాదేవీలో పార్టీ కాదు.
- PhonePe యూజర్ సెట్ చేసిన మేండేట్(లు), అలాగే PhonePe యాప్ ద్వారా మేండేట్ రిజిస్ట్రేషన్ కోసం షేర్ చేసిన వివరాల ఆధారంగా PhonePe యాప్ ద్వారా అన్ని మేండేట్(ల) అమలు చేయబడతాయి. మీ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్/క్రెడిట్ లిమిట్ (సందర్భంగా) మరియు/లేదా నిర్దిష్ట ఆటోమేటిక్ పేమెంట్ కోసం ఏదైనా రెట్టింపు పేమెంట్ నుండి తీసివేయబడిన మొత్తం(ల) ధృవీకరణకు PhonePe బాధ్యత వహించదు. PhonePe యాప్ ద్వారా ఈ ఫంక్షనాలిటీ కింద ప్రతి మేండేట్ కోసం అందించిన/అధీకృత వివరాలను ధృవీకరించడం మీ బాధ్యత.
- నియమించబడిన చెల్లింపుదారు / లబ్ధిదారుని నుండి ఆటోమేటిక్ పేమెంట్(ల)కి సంబంధించి మీరు చేపట్టిన వస్తువు(లు), సేవ(ల)కి సంబంధించి ఏవైనా సమస్యలు, ఆందోళనలు లేదా వివాదం(దాల)కు PhonePe ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో వస్తువు(లు)/సేవ(ల) నుండి ఉత్పన్నమయ్యే మీ సమస్య(ల)కి సంబంధించి మీరు నేరుగా అర్హతగల మర్చంట్(ల)ని సంప్రదించవచ్చు.
- విజయవంతమైన మేండేట్ అమలు కోసం మీ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్/క్రెడిట్ లిమిట్ (అదే విధంగా ఉండవచ్చు)లో తగినంత బ్యాలెన్స్ నిర్వహించడానికి మీరు అంగీకరిస్తున్నారు. అలాగే గుర్తిస్తున్నారు. మీ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్/క్రెడిట్ లిమిట్లో (సందర్భంగా) తగినన్ని నిధులు అందుబాటులో లేనందున మేండేట్ అమలు చేయడంలో ఏదైనా వైఫల్యం లేదా తిరస్కరణకు సంబంధించి ఏవైనా బాధ్యతలకు PhonePe భారం మోయదు.
- ఈ ఫంక్షనాలిటీ కింద PhonePe యాప్ ద్వారా ప్రారంభించబడిన మీ చర్య(లు), మేండేట్(లు), మేండేట్ అమలు చేయడాని క్రమం తప్పకుండా సమీక్షించడం మీ బాధ్యత. ఆటోమేటిక్ పేమెంట్(ల)కు సంబంధించి మీ జారీచేసే బ్యాంక్/అర్హత కలిగిన మర్చంట్ విధించిన అనధికార ఛార్జీలు, జరిమానాలు, లేట్ ఫీజు(ల)కు లేదా ఆటోమేటిక్ పేమెంట్‌కు సంబంధించి, మీరు సెట్ చేసిన మేండేట్ రిజిస్ట్రేషన్/మేండేట్ పరిమితికి సంబంధించి ఏవైనా వ్యత్యాసాలకు PhonePe బాధ్యత వహించదు.
- ఈ ఫీచర్ కింద ఎనేబుల్ చేయబడిన ఆటోమేటిక్ పేమెంట్ కోసం సంబంధిత మార్గదర్శకాలు / వర్తించే చట్టం(ల) ప్రకారం RBI / NPCI నిర్దేశించిన మేండేట్ పరిమితి(లు)కి అనుగుణంగా, అలాగే దానికి కట్టుబడి ఉండేలా మీరు అంగీకరిస్తున్నారు.
- సాధారణం
- ఈ ఆటోపే నిబంధనలకు సంబంధించి ఉత్పన్నమయ్యే ఏదైనా అన్ని నష్టాలు, నష్టాలు, చర్యలు, క్లెయిమ్‌లు, బాధ్యతలు (చట్టపరమైన ఖర్చులతో సహా) నుండి PhonePe, దాని అనుబంధ సంస్థలు, ఉద్యోగులు, డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, ప్రతినిధులు, నష్టపరిహారం చెల్లించడానికి, కట్టుబడడానికి మీరు అంగీకరిస్తున్నారు. .
- ఎలాంటి సందర్భంలోనైనా, పరిమితి లేకుండా, లాభాలు లేదా ఆదాయాల నష్టం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాల నష్టం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టంతో సహా ఏవైనా పరోక్ష, పర్యవసానమైన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలకు, అవి, ఈ ఆటోపే నిబంధనలకు సంబంధించి కాంట్రాక్ట్, నిర్లక్ష్యం, టార్ట్ లేదా ఇతరత్రా, అందించిన సమాచారాన్ని ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వల్ల ఉత్పన్నమైనా, అయితే కారణమైనప్పటికీ ఒప్పందం, టార్ట్, నిర్లక్ష్యం, వారంటీ లేదా మరేదైనా ఈ ఆటోపే నిబంధనలకు సంబంధించి PhonePe బాధ్యత వహించదు.
- ఈ ఆటోపే నిబంధనలు, దాని చట్టాల విరుద్ధమైన సూత్రాలకు సంబంధం లేకుండా భారత చట్టాలచే నిర్వహించబడతాయి. ఈ ఆటోపే నిబంధనలకు సంబంధించి మీకు, PhonePeకి మధ్య ఏదైనా క్లెయిమ్ లేదా వివాదాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఉత్పన్నమైతే, అది ప్రత్యేకంగా బెంగళూరులో ఉన్న న్యాయస్థానం ద్వారా నిర్ణయించబడుతుంది.
- ఈ ఆటోపే నిబంధనలకు అనుగుణంగా అందుబాటులో ఉంచబడిన ఈ కార్యాచరణ యొక్క ఖచ్చితత్వం, వాస్తవికతకు సంబంధించి, వ్యక్తీకరించబడిన లేదా సూచించబడిన అన్ని వారెంటీలను PhonePe నిరాకరిస్తుంది.
- PhonePe వినియోగ నిబంధనలు, PhonePe గోప్యతా విధానం సూచన ద్వారా ఈ ఆటోపే నిబంధనలలో చేర్చబడినట్లు పరిగణించబడుతుంది. ఈ నిబంధనలు, PhonePe వినియోగ నిబంధనల మధ్య ఏదైనా వైరుధ్యం ఏర్పడితే, ఈ ఆటోపే నిబంధనల ద్వారా ప్రారంభించబడిన ఈ కార్యాచరణకు సంబంధించి ఈ ఆటోపే నిబంధనలు ప్రబలంగా వర్తిస్తాయి.