Privacy Policy

నియమ, నిబంధనలు – ఆటోపే

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াবাংলাहिन्दीಕನ್ನಡଓଡ଼ିଆ
< Back

ఈ డాక్యుమెంట్‌ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం – 2000 (ఎప్పటికప్పుడు సవరించిన మేరకు), దాని కింద వర్తించే నియమాలు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం – 2000 ప్రకారం సవరించిన వివిధ శాసనాల్లోని ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించి సవరించిన నిబంధనల ప్రకారం రూపొందిన ఒక ఎలక్ట్రానిక్ రికార్డు. ఈ డాక్యుమెంట్‌ను PhonePe సాధారణ నియమ, నిబంధనలు (“నియమాలు”)తో కలిపి చదవాలి, వీటిలో PhonePe గోప్యతా విధానం (“గోప్యతా విధానం”); అలాగే దీనికి మాత్రమే పరిమితం కాకుండా, PhonePe UPI వినియోగ నియమాలు (“UPI నియమ, నిబంధనలు”), PhonePe ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంచిన ఇతర పాలసీలు/నియమాలు ఉంటాయి, వీటిని ఎప్పటికప్పుడు సవరించవచ్చు. ఇక్కడ ఉపయోగించినప్పటికీ, ప్రత్యేకంగా నిర్వచించని అన్ని క్యాపిటలైజ్డ్ పదాలకు నియమాలు లేదా UPI నియమ, నిబంధనలలో పేర్కొన్న అర్థాలే ఉంటాయి.

PhonePe యాప్‌లో ఈ సదుపాయాన్ని (ఫంక్షనాలిటీని) యాక్సెస్ చేసే లేదా ఉపయోగించే ముందు దయచేసి ఈ నియమ, నిబంధనలు – ఆటోపే (“ఆటోపే నియమాలు”)ను జాగ్రత్తగా చదవండి. ఈ ఆటోపే నియమాలు అనేవి ఈ ఆటోపే నియమాల కింద ఉండే జాబితాలోని ఫీచర్లను ఉపయోగించి చేసిన లావాదేవీలను నియంత్రిస్తాయి. ఈ ఆటోపే నియమాలు అనేవి మీకు, అలాగే ఆఫీసు-2, ఫ్లోర్ 5, వింగ్ A, బ్లాక్ A, సాలార్‌పురియా సాఫ్ట్‌జోన్, బెల్లందూర్ విలేజ్, వర్తూర్ హోబ్లి, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు సౌత్, బెంగళూరు, కర్ణాటక, భారతదేశం, 560103 అనే చిరునామాలోని రిజిస్టర్డ్ కార్యాలయంలో నడుస్తున్న PhonePe లిమిటెడ్‌కు (గతంలో ‘PhonePe ప్రైవేట్ లిమిటెడ్’ అని పిలిచేవారు) (“PhonePe/మేము/మాది/మా”) మధ్య కుదిరిన, కట్టుబడి ఉండాల్సిన చట్టపరమైన ఒప్పందం. కింద పేర్కొన్న ఆటోపే నియమాలను మీరు చదివారని గుర్తించి, అంగీకరిస్తున్నారు. మీరు ఈ ఆటోపే నియమాలను అంగీకరించకపోయినా లేదా ఈ ఆటోపే నియమాలకు కట్టుబడి ఉండటం మీకు ఇష్టం లేకపోయినా, మీరు ఈ సదుపాయాన్ని పొందకూడదని/ఉపయోగించకూడదని నిర్ణయించుకోవచ్చు. మేము PhonePe వెబ్‌సైట్(లు) మరియు/లేదా PhonePe యాప్(ల)లో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేయడం ద్వారా ఎప్పుడైనా ఈ ఆటోపే నియమాలను సవరించవచ్చు. ఈ ఆటోపే నియమాల అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేసిన వెంటనే అవి అమల్లోకి వస్తాయి. అప్‌డేట్లు / మార్పుల కోసం ఈ ఆటోపే నియమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం మీ బాధ్యత. “మీరు”, “మీ”, “మీది”, “ఎండ్ యూజర్”, “కస్టమర్”, “యూజర్” అంటే PhonePe యాప్‌లో పేమెంట్లను పంపడానికి, పొందడానికి PhonePe UPIని ఉపయోగించే వ్యక్తి అని అర్థం. 

ఈ ఆటోపే నియమాలు అనేవి PhonePe ఎనేబుల్ చేసిన సదుపాయాన్ని నియంత్రిస్తాయి, దీనిలో ఈ ఆటోపే నియమాలకు అనుగుణంగా, PhonePe యూజర్ సెట్ చేసిన లేదా ఎంచుకున్న సదరు ఫ్రీక్వెన్సీలో PhonePe యూజర్(ల) తరఫున పేమెంట్(లు) చేయడం కోసం PhonePeకు ముందస్తు అనుమతిని ఇవ్వడం ద్వారా, PhonePe యాప్​లో అర్హులైన మర్చంట్(ల)కు ఆటోమేటెడ్ పేమెంట్(ల)ను (కింద నిర్వచించిన విధంగా) యూజర్(లు) సెటప్ చేయవచ్చు. 

  1. నిర్వచనాలు
    1. “చర్యలు” అంటే ఈ ఆటోపే నియమాల్లోని సెక్షన్ 4 కింద నిర్వచించిన చర్యలు అని అర్థం, అంటే ఏదైనా మ్యాండేట్ చెల్లుబాటు అయ్యే కాలవ్యవధిలో, దానికి సంబంధించి యూజర్ చేపట్టే / అభ్యర్థించే చర్యలు అని అర్థం.
    2. “ఆటో టాప్-అప్ మ్యాండేట్” అంటే UPI Lite సౌకర్యం లేదా PhonePe వాలెట్​తో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా PhonePe యాప్‌లో ఎనేబుల్ చేసిన కొన్ని ఇన్‌స్ట్రుమెంట్లు/ సౌకర్యాలను టాప్-అప్ చేయడం కోసం సెటప్ చేసే ఏదైనా మ్యాండేట్ (కింద నిర్వచించిన విధంగా) అని అర్థం, సదరు ఇన్‌స్ట్రుమెంట్లు/ సౌకర్యాలను ఆటోమేటిక్‌గా టాప్-అప్ చేయడం కోసం, అంటే సదరు ఇన్‌స్ట్రుమెంట్లు/ సౌకర్యాలలోని బ్యాలెన్స్ అనేది కనీస బ్యాలెన్స్ పరిమితికి చేరుకున్నప్పుడు మాత్రమే, గరిష్ఠంగా అనుమతించదగిన టాప్-అప్ పరిమితి (RBI, NPCI మరియు/లేదా ఇతర నియంత్రణా ప్రాధికార సంస్థలు నిర్దేశించిన మేరకు) వరకు టాప్-అప్ జరిగేలా సదరు ఆటోమేటిక్ టాప్-అప్ ట్రిగ్గర్ అవుతుంది.
    3. “ఆటోమేటెడ్ పేమెంట్లు” లేదా “ఆటోపే” అంటే ఏదైనా మ్యాండేట్ కింద యూజర్లు ఎంచుకున్న నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ప్రకారం పేమెంట్లను సెటప్ చేసేందుకు వారికి అనుమతించేలా, UPI ఎకోసిస్టమ్‌లో NPCI సపోర్ట్ ఉన్న, PhonePe ఎనేబుల్ చేసిన సదరు పేమెంట్(లు) అని అర్థం. ఈ పేమెంట్లు అనేవి మ్యాండేట్ రిజిస్ట్రేషన్ సమయంలో యూజర్ ఆమోదించిన ఫ్రీక్వెన్సీ ప్రకారం వన్ టైమ్ (ఒకేసారి) లేదా రికరింగ్ పేమెంట్లు కావచ్చు.
    4. “అర్హత ఉన్న మర్చంట్లు” అంటే ఈ ఆటోపే నియమాలకు అనుగుణంగా యూజర్(ల) నుండి ఆటోమేటెడ్ పేమెంట్లను పొందడం కోసం PhonePe ఎనేబుల్ చేసిన సదరు అర్హత ఉన్న కేటగిరీలోని మర్చంట్లు, సర్వీస్ ప్రొవైడర్(లు), బిల్లర్(లు) అని అర్థం. 
    5. “మ్యాండేట్” అంటే ఈ ఆటోపే నియమాలకు అనుగుణంగా అర్హత ఉన్న మర్చంట్(ల)కు ఆటోమేటెడ్ పేమెంట్(లు) చేయడం కోసం PhonePe యాప్‌లో యూజర్ అందించిన స్టాండింగ్ సూచన / ఆథరైజేషన్ అని అర్థం.
    6. “మ్యాండేట్ ఎగ్జిక్యూషన్” అంటే ఏదైనా నిర్దిష్ట ఆటోపే పేమెంట్ కోసం, PhonePe ఎనేబుల్ చేసిన వాటిలో మీరు ఎంచుకున్న పేమెంట్ పద్ధతి ప్రకారం, మ్యాండేట్‌కు సంబంధించి ఆథరైజ్ చేసిన అమౌంట్‌ను మీ ఇష్యూయర్ విజయవంతంగా డెబిట్ చేయడం అని అర్థం.
    7. “మ్యాండేట్ పరిమితి(లు)” అంటే ఒక మ్యాండేట్‌కు సంబంధించిన సదరు పరిమితి(లు) అని అర్థం, ఇది (i) ముందుగానే నిర్ణయించిన ఆటోమేటెడ్ పేమెంట్ విలువ కావచ్చు, లేదా (ii) మారుతూ ఉండే ఆటోమేటెడ్ పేమెంట్ విలువ కావచ్చు, ఇది RBI / NPCI నిర్ణయించిన (ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే) గరిష్ఠ / మొత్తం అనుమతించదగిన పరిమితికి లోబడి ఉంటుంది.
    8. “మ్యాండేట్ రిజిస్ట్రేషన్” అంటే ఒక మ్యాండేట్‌కు సంబంధించి యూజర్ అందించాల్సిన సదరు వివరాలు / ఇన్‌పుట్‌లు అని అర్థం, వీటిలో (i) మ్యాండేట్‌కు సంబంధించిన పారామీటర్లు, (ii) మ్యాండేట్‌కు సంబంధించిన ప్రారంభ తేదీ, ముగింపు తేదీ, (iii) మ్యాండేట్ పరిమితులు, (iv) మ్యాండేట్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి.
  2. మ్యాండేట్ సెటప్
    PhonePe యాప్ ద్వారా మీరు విజయవంతంగా వ్యాలిడేషన్ / అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే మ్యాండేట్ సెటప్ అవుతుంది. ఏదైనా మ్యాండేట్‌ను సెటప్ చేయడానికి, నిర్దిష్ట ఆటోమేటెడ్ పేమెంట్‌కు సంబంధించిన మ్యాండేట్ రిజిస్ట్రేషన్‌కు చెందిన వివరాలను మీరు తెలపాల్సి ఉంటుంది.
    అలాగే, మ్యాండేట్ సెటప్‌ను కొనసాగించడం కోసం, ఈ సదుపాయం కింద PhonePe ఎనేబుల్ చేసిన సదరు పేమెంట్ అకౌంట్‌ను మీరు ఎంచుకోవచ్చు. మ్యాండేట్ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, మ్యాండేట్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు అంగీకరించిన మ్యాండేట్ ఫ్రీక్వెన్సీ ప్రకారం మ్యాండేట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, అలాగే మీ లింక్ చేసిన పేమెంట్ అకౌంట్ నుండి సదరు ఆథరైజ్ చేసిన అమౌంట్ డెబిట్ అయ్యి, సదరు ఆటోమేటెడ్ పేమెంట్‌కు సంబంధించి అర్హత ఉన్న మర్చంట్‌కు బదిలీ అవుతుంది. ఒకసారి ఏదైనా మ్యాండేట్‌ను విజయవంతంగా రిజిస్టర్ చేసిన తర్వాత, సదరు పేమెంట్ అకౌంట్‌పై రిజిస్టర్ చేసిన మ్యాండేట్లు యాక్టివ్‌గా ఉన్నంత కాలం, VPAతో లింక్ చేసి ఉన్న పేమెంట్ అకౌంట్‌ను అన్‌లింక్ చేయడానికి యూజర్‌కు అనుమతి ఉండదు.
    ఏదైనా మ్యాండేట్ లేదా మ్యాండేట్ ఎగ్జిక్యూషన్ తిరస్కరణ, వైఫల్యం లేదా పెండింగ్ స్టేటస్‌కు సంబంధించిన ఎటువంటి బాధ్యతను అయినా PhonePe ఇందుమూలంగా తోసిపుచ్చుతుంది, అలాగే ఈ విషయంలో మీ ఇష్యూయర్ చేపట్టిన సదరు వ్యాలిడేషన్(లు) / అథెంటికేషన్‌లో ఎలాంటి పాత్రనూ పోషించదు, దానికి సంబంధించి ఎలాంటి బాధ్యతనూ వహించదు.
  3. మ్యాండేట్ ఎగ్జిక్యూషన్
    మ్యాండేట్‌ను సెటప్ చేస్తున్నప్పుడు మీరు ఎంచుకున్న మీ పేమెంట్ అకౌంట్‌లో సరిపడా ఫండ్స్ లేదా పరిమితి మీకు ఉంటే మాత్రమే మీ మ్యాండేట్(లు) ప్రాసెస్ అవుతాయి. మీరు అలా ఉంచలేకపోతే, మీ మ్యాండేట్ ఎగ్జిక్యూషన్ విజయవంతం కాదు.
    మీ ఆటోమేటెడ్ పేమెంట్‌ కోసం లింక్ చేసిన మీ పేమెంట్ అకౌంట్ నుండి అమౌంట్ వాస్తవంగా డెబిట్/డెబిట్లు కావడానికి ముందే మీకు సమాచారం అందుతుంది, అలాగే వర్తించే చట్టాల (ఎప్పటికప్పుడు సవరించిన మేరకు) కింద నియంత్రణా సంస్థలు నిర్దేశించిన పద్ధతిలో అర్హత ఉన్న మర్చంట్, ఇష్యూయర్ విజయవంతంగా మ్యాండేట్‌ను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, మ్యాండేట్ / మ్యాండేట్ ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తాయి.
  4. మ్యాండేట్‌కు సంబంధించి చేపట్టే చర్య(లు):
    మ్యాండేట్‌ చెల్లుబాటు అయ్యే కాలవ్యవధిలో PhonePe యాప్‌లో మీ మ్యాండేట్‌ను (ఆటో టాప్-అప్ మ్యాండేట్‌తో సహా) మేనేజ్ చేయడానికి సంబంధించి మీరు కింది చర్య(ల)ను చేపట్టవచ్చు. ఇక్కడ పేర్కొన్న చర్యలు అనేవి అర్హత ఉన్న మర్చంట్(ల) అనుమతించిన చోట మాత్రమే అందుబాటులో ఉంటాయని, అలాగే వారి నిర్దిష్ట నియమాలు, వర్తించే చట్టాలకు లోబడి ఉంటాయని దయచేసి గమనించండి. (i) మ్యాండేట్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు సెట్ చేసిన మ్యాండేట్ పరిమితి(ల)ని సవరించడం, అయితే మ్యాండేట్ పరిమితిని సవరించడానికి సంబంధించిన సదరు అభ్యర్థనను అర్హత ఉన్న మర్చంట్ మాత్రమే ఎల్లప్పుడూ పంపాలి; (ii) మ్యాండేట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం (పాజ్) మరియు/లేదా తిరిగి ప్రారంభించడం (అన్‌-పాజ్), (iii) ఏదైనా ఆటోమేటెడ్ పేమెంట్‌కు సంబంధించి, రిడెంప్షన్‌ను మీ ఇష్యూయర్ ట్రిగ్గర్ చేయడానికి ముందే మ్యాండేట్‌ను విత్‌డ్రా/రద్దు చేయడం (iv) వర్తించే చట్టాలకు అనుగుణంగా మ్యాండేట్‌ను మరొక TPAPకి తరలించడం (మైగ్రేట్ చేయడం). వర్తించే చట్టాలకు అనుగుణంగా కొన్ని రకాల మ్యాండేట్‌లకు పైన పేర్కొన్న చర్యలు వర్తించవని దయచేసి గమనించండి,
    ఒక మ్యాండేట్‌కు సంబంధించి మీరు చేపట్టే చర్య(ల) అనేది మీ ఇష్యూయర్ అదనపు వ్యాలిడేషన్ లేదా ఆథరైజేషన్‌కు లోబడి ఉండవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. మీ చేపట్టే చర్య(లు) అనేది ఈ ఆటోపే నియమాలకు అనుగుణంగా, అలాగే వర్తించే చట్టం(ల)కు లోబడి ఉండాలని, ఇంకా చర్య(ల)కు సంబంధించి RBI / NPCI లేదా మీ ఇష్యూయర్ (సందర్భాన్ని బట్టి) ఒకవేళ సదరు కాలపరిమితి(ల)ని నిర్దేశిస్తే, మీరు వాటికి కట్టుబడి ఉండాలని స్పష్టంగా అంగీకరిస్తున్నారు.
  5. వన్-టైమ్ మ్యాండేట్లు, రికరింగ్ మ్యాండేట్లు:
    • వన్-టైమ్ మ్యాండేట్లు:
      • ఈ సదుపాయం ద్వారా, ఈ ఆటోపే నియమాల్లోని సెక్షన్ 2కు అనుగుణంగా ఒక మ్యాండేట్‌ను సెటప్ చేసి మీ పేమెంట్ అకౌంట్ నుండి భవిష్యత్తులో జరగబోయే డెబిట్‌ను మీరు ముందుగానే ఆథరైజ్ చేయవచ్చు. వన్-టైమ్ మ్యాండేట్‌లను IPO అప్లికేషన్‌లతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, వివిధ లావాదేవీల కోసం ప్రధానంగా ఉపయోగిస్తారని దయచేసి గమనించండి. మీ సమ్మతి మేరకు, అర్హత ఉన్న మర్చంట్ సదరు మ్యాండేట్‌ను క్రియేట్ చేస్తారు, అలాగే ఇది ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, అయితే మ్యాండేట్ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే, దానికి సమానమైన అమౌంట్‌ మీ పేమెంట్ అకౌంట్‌లో బ్లాక్ అవుతుంది.
      • వర్తించే చట్టాల కింద స్పష్టంగా నిషేధిస్తే తప్ప, మీరు ఏదైనా మ్యాండేట్‌‌ అమౌంట్, ముగింపు తేదీని సదరు మ్యాండేట్ ముగింపు తేదీ, రిడెంప్షన్ తేదీకి ముందే ఎప్పుడైనా సవరించవచ్చు.
      • ముగింపు తేదీకి ముందే మీరు ఎప్పుడైనా మ్యాండేట్‌ను రద్దు చేయవచ్చు. అప్పటిదాకా బ్లాక్ అయిన ఫండ్స్ వెంటనే అన్‌బ్లాక్ అవుతాయి, అలాగే సదరు మ్యాండేట్ రద్దు అవుతుంది.
      • వర్తించే చట్టాల కింద నిర్దేశించిన గరిష్ఠ కాలవ్యవధి వరకు మ్యాండేట్లు చెల్లుబాటు కావచ్చు.
    • రికరింగ్ మ్యాండేట్లు:
      • రికరింగ్ మ్యాండేట్‌లో, ఎంచుకున్న కాలవ్యవధి, నిర్దేశిత ఫ్రీక్వెన్సీతో వన్-టైమ్ ఆథరైజేషన్‌ను పూర్తి చేసి మ్యాండేట్‌ను షెడ్యూల్ చేసే అవకాశం మీకు ఉంటుంది. ఇది మీ పేమెంట్ అకౌంట్ నుండి రికరింగ్ డెబిట్లు చేసేందుకు అనుమతిని ఇస్తుంది. మ్యాండేట్ మీ సమ్మతితో మాత్రమే రిజిస్టర్ అవుతుంది.
      • మ్యాండేట్ సవరణ కోసం అభ్యర్థనను మీరు లేదా అర్హత ఉన్న మర్చంట్ పంపవచ్చు. అయితే కొన్ని రకాల మ్యాండేట్‌లను సవరించే విషయంలో సదరు అభ్యర్థనను అర్హత ఉన్న మర్చంట్ పంపితే మాత్రమే మ్యాండేట్ సవరణ సాధ్యమవుతుందని దయచేసి గమనించండి. అయితే, సవరణను ఆమోదించే తుది అధికారం మీకే ఉంటుంది. 
      • మీరు మ్యాండేట్‌ను కొంత కాలవ్యవధి వరకు తాత్కాలికంగా నిలిపివేయవచ్చు, ఆ కాలవ్యవధిలో మ్యాండేట్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది. తాత్కాలికంగా నిలిపివేసిన మ్యాండేట్‌పై అర్హత ఉన్న మర్చంట్ ఏవైనా లావాదేవీలను ప్రారంభిస్తే, అవి తిరస్కారానికి గురవుతాయి. అదేవిధంగా, తాత్కాలికంగా నిలిపివేసిన మ్యాండేట్‌ను తిరిగి ప్రారంభించే (అన్‌-పాజ్ చేసే) అవకాశం కూడా మీకు ఉంది, అయితే మ్యాండేట్ కాలవ్యవధిలోపు, ఏ తేదీన మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ నిర్దిష్ట ఎగ్జిక్యూషన్ తేదీన తిరిగి ప్రారంభించవచ్చు. అయితే, కొన్ని రకాల మ్యాండేట్‌లను తాత్కాలికంగా నిలిపివేసే విషయంలో, సదరు అభ్యర్థనను అర్హత ఉన్న మర్చంట్ పంపితే మాత్రమే మ్యాండేట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం సాధ్యమవుతుందని దయచేసి గమనించండి.
      • మ్యాండేట్‌ను మీరు, అలాగే అర్హత ఉన్న మర్చంట్ కూడా వెనక్కి తీసుకోవచ్చు, అంటే రద్దు చేయవచ్చు. అయితే, కొన్ని రకాల మ్యాండేట్‌లను రద్దు చేసే విషయంలో, సదరు అభ్యర్థనను అర్హత ఉన్న మర్చంట్ పంపితే మాత్రమే మ్యాండేట్‌లను రద్దు చేయడం సాధ్యమవుతుందని దయచేసి గమనించండి.
      • మ్యాండేట్ రిజిస్ట్రేషన్‌తో పాటు, ఆ వెంటనే మ్యాండేట్ ఎగ్జిక్యూట్ అయితే, తక్షణ ఎగ్జిక్యూట్ కోసం ఎటువంటి ప్రత్యేక ఆథరైజేషన్ చేయక్కర్లేదు. మ్యాండేట్‌ను తొలిసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు విఫలమైతే (మూడు సార్లు మళ్ళీ ప్రయత్నించడంతో కలిపి), మొత్తం మ్యాండేట్ రద్దు అవుతుంది. మ్యాండేట్ రిజిస్ట్రేషన్ అయిన ఐదు నిమిషాల తర్వాత మ్యాండేట్ తొలిసారిగా ఎగ్జిక్యూట్ అవ్వడం ప్రారంభమైతే, యూజర్ UPI పిన్​తో సహా, కావాల్సిన సమాచారాన్ని ఉపయోగించి ఎగ్జిక్యూషన్‌ను ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది.
      • NPCI ఆదేశించిన ప్రకారం, ఏదైనా కారణం వల్ల మ్యాండేట్ ఎగ్జిక్యూషన్ విఫలమైతే, మూడు సార్లు మళ్ళీ ప్రయత్నించడానికి అనుమతి ఉంటుంది. మూడవ ప్రయత్నం కూడా విఫలమైతే, ఆ నిర్దిష్ట తేదీన లావాదేవీని ప్రాసెస్ చేయడానికి సంబంధించిన సదరు మ్యాండేట్ ఎగ్జిక్యూషన్ విఫలమవుతుంది, అయితే, భవిష్యత్తులో మ్యాండేట్ ఎగ్జిక్యూట్ అయ్యేందుకు వీలుగా మ్యాండేట్ చెల్లుబాటు అవుతూనే, యాక్టివ్‌గా ఉంటుంది.
      • మ్యాండేట్‌కు గరిష్ఠ అమౌంట్ పరిమితి అనేది మర్చంట్ కేటగిరీని బట్టి, NPCI/RBI నిర్దేశించిన విధంగా ఉంటుంది. ఈ పరిమితులు, కేటగిరీలను NPCI/RBI ఎప్పటికప్పుడు సవరించవచ్చు.
  6. UPI రిజర్వ్ పే
    UPI రిజర్వ్ పే అనేది ఒక ఫీచర్, ఇది యూజర్‌కు వారి పేమెంట్ అకౌంట్ నుండి భవిష్యత్తులో జరిగే డెబిట్‌ను ముందుగానే ఆథరైజ్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మ్యాండేట్ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే దానికి సమానమైన అమౌంట్‌ మీ పేమెంట్ అకౌంట్‌లో బ్లాక్ అవుతుంది. క్రియేట్ చేసిన మ్యాండేట్ అనేది మ్యాండేట్ రిజిస్ట్రేషన్ సమయంలో బ్లాక్ చేసిన అమౌంట్‌కు సమానమైన పలు ఆటోమేటెడ్ పేమెంట్ల కోసం ఉపయోగించడమవుతుంది.
    పైన పేర్కొన్న క్లాజ్ 2కు అనుగుణంగా మీ కోసం మీరు లేదా మీ తరఫున ఎవరైనా అర్హత ఉన్న మర్చంట్ ఒక మ్యాండేట్‌ను క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ, మీ పేమెంట్ అకౌంట్‌లో సరిపడా ఫండ్/బ్యాలెన్స్ లేనట్లయితే, మ్యాండేట్ క్రియేట్ కాదు.
    వర్తించే చట్టాలకు అనుగుణంగా అర్హత ఉన్న మర్చంట్(లు) నిర్దేశించిన నిర్దిష్ట నియమాల ప్రకారం అనుమతి ఉంటే, ముగింపు తేదీకి ముందే మీరు ఎప్పుడైనా మ్యాండేట్‌ను రద్దు చేయొచ్చని మీరు అర్థం చేసుకున్నారు. మ్యాండేట్‌ కోసం ఉపయోగించిన పేమెంట్ అకౌంట్‌ అనేది క్రెడిట్ లైన్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి క్రెడిట్ ఇన్‌స్ట్రుమెంట్‌ అయిన సందర్భంలో, వర్తించే చట్టాల ప్రకారం, ఒకసారి మ్యాండేట్‌ను ఆథరైజ్ చేసిన తర్వాత దాన్ని స్థిరంగా ఉంచాలని, అలాగే దాన్ని యూజర్ మాన్యువల్‌గా రద్దు చేయలేరని లేదా తొలగించలేరని దయచేసి గమనించండి.
    మ్యాండేట్లు గరిష్ఠంగా 90 రోజుల కాలవ్యవధి వరకు, లేదా ఎప్పటికప్పుడు నిర్దేశించే సదరు ఇతర కాలవ్యవధుల వరకు చెల్లుబాటు కావచ్చు.
    ముగింపు తేదీకి ముందు మ్యాండేట్‌లను ఎప్పుడైనా అర్హత ఉన్న మర్చంట్ రద్దు చేయవచ్చని మీరు అర్థం చేసుకున్నారు. బ్లాక్ అయిన ఫండ్స్ వెంటనే అన్‌బ్లాక్ అవుతాయి, అలాగే సదరు మ్యాండేట్ రద్దు అవుతుంది. మ్యాండేట్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రారంభ తేదీ, ముగింపు తేదీల మధ్య మాత్రమే జరుగుతుంది.
    మ్యాండేట్‌కు గరిష్ఠ అమౌంట్ పరిమితి అనేది మర్చంట్ కేటగిరీని బట్టి, NPCI/RBI నిర్దేశించిన విధంగా ఉంటుంది. ఈ పరిమితులు, కేటగిరీలను NPCI/RBI ఎప్పటికప్పుడు సవరించవచ్చు.
  7. ఆటో టాప్-అప్ మ్యాండేట్:
    PhonePe యాప్‌లో ఎనేబుల్ అయిన UPI Lite సౌకర్యం లేదా PhonePe వాలెట్​ కోసం మీరు ఎంచుకున్నట్లయితే, ఈ ఆటోపే నియమాలకు అనుగుణంగా, UPI Lite సౌకర్యం లేదా PhonePe వాలెట్​‌ను ఆటో టాప్-అప్‌ చేయడానికి వర్తించే మ్యాండేట్ పరిమితి(ల) ప్రకారం ఆటో టాప్-అప్ మ్యాండేట్‌ను సెటప్ చేసే అవకాశం మీకు ఉంటుంది. ఉదాహరణకు: UPI Lite సౌకర్యం బ్యాలెన్స్ INR 200 కంటే తక్కువకు పడిపోతే, తన UPI Lite సౌకర్యానికి ఆటోమేటిక్‌గా INR 300 యాడ్ అయ్యేలా ఆటో టాప్-అప్ మ్యాండేట్‌ను యూజర్ సెట్ చేసుకోవచ్చు. దీని ప్రకారం, బ్యాలెన్స్ INR 200 కంటే తక్కువకు చేరుకున్న ప్రతిసారీ, సదరు PhonePe యూజర్ పేమెంట్ అకౌంట్ నుండి INR 300 డెబిట్ అవుతుంది. అదేవిధంగా, PhonePe వాలెట్ బ్యాలెన్స్ INR 200 కంటే తక్కువకు పడిపోతే, తన PhonePe వాలెట్​లోకి ఆటోమేటిక్‌గా INR 300 యాడ్ అయ్యేలా ఆటో టాప్-అప్ మ్యాండేట్‌ను యూజర్ సెట్ చేసుకోవచ్చు. దీని ప్రకారం, బ్యాలెన్స్ INR 200 కంటే తక్కువకు చేరుకున్న ప్రతిసారీ, సదరు PhonePe యూజర్ పేమెంట్ అకౌంట్ నుండి INR 300 డెబిట్ అవుతుంది.
  8. మ్యాండేట్‌ పోర్టింగ్:
    మ్యాండేట్ పోర్టింగ్ అనేది ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న మీ మ్యాండేట్‌లను ఒక TPAP (సోర్స్ యాప్) నుండి మరొక TPAPకు (డెస్టినేషన్ యాప్‌కు) మార్చుకోవడానికి (మైగ్రేట్ చేయడానికి) మీకు అవకాశం కల్పిస్తుంది, దీంతో సదరు మ్యాండేట్‌ను రద్దు చేసి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది సబ్‌స్క్రిప్షన్‌లు, బిల్లులు, లోన్ రీపేమెంట్లు లేదా ఇన్వెస్ట్‌మెంట్ల కోసం జరగాల్సిన రికరింగ్ పేమెంట్లు కొనసాగేలా చూసుకుంటుంది.
    • మరొక TPAP నుండి PhonePe యాప్‌కు మ్యాండేట్ల బదిలీ (పోర్టింగ్-ఇన్):
      మరొక TPAP నుండి PhonePe యాప్‌కు మ్యాండేట్‌ను బదిలీ చేయడం కోసం మీరు కింద పేర్కొన్న దశలను అనుసరించాలి: –
      • PhonePe యాప్‌లోని సంబంధిత సెక్షన్‌కు వెళ్లి, UPI ఎకోసిస్టమ్‌లో మీ మొబైల్ నంబర్, అలాగే పేమెంట్ అకౌంట్‌తో లింక్ అయిన మీ యాక్టివ్ మ్యాండేట్లు అన్నింటినీ చూసే అవకాశం మీకు ఉంటుంది.
      • NPCI, ఇష్యూయర్ నుండి విజయవంతమైన స్పందన వచ్చిన తర్వాత, మేము యూనిక్ మ్యాండేట్ రెఫరెన్స్ నంబర్ (UMRN), అర్హత ఉన్న మర్చంట్ పేరు, ఫ్రీక్వెన్సీ (నెలవారీ/త్రైమాసిక/తెలిపిన విధంగా), అలాగే గరిష్ఠ అమౌంట్ల జాబితాను మీకు చూపిస్తాము. అప్పుడు, మీరు మరొక TPAP నుండి PhonePe యాప్‌కు బదిలీ చేయాలనుకుంటున్న నిర్దిష్ట మ్యాండేట్(ల)ను ఆ చూపించిన జాబితా నుండి ఎంచుకోవచ్చు.
      • బదిలీ చేసేందుకు మీరు మ్యాండేట్(ల)ను ఎంచుకున్న తర్వాత, మరొక TPAPలో లింక్ చేసిన మీ పేమెంట్ అకౌంట్ అనేది మ్యాండేట్ అవసరాలకు తగ్గట్లుగా ఉందో లేదో అని మేము వ్యాలిడేట్ చేస్తాము.
      • NPCI భద్రతా మార్గదర్శకాల ప్రకారం, PhonePe యాప్‌లో మ్యాండేట్ రిజిస్ట్రేషన్‌ను ఆథరైజ్ చేయడం కోసం మీ UPI పిన్​ను మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్‌ను విజయవంతంగా ఎంటర్ చేసిన తర్వాత, UPI ఎకోసిస్టమ్‌లో UMRN అప్‌డేట్ అవుతుంది, అలాగే మ్యాండేట్ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిందనే డిజిటల్ నిర్ధారణను మేము ఇస్తాము. భవిష్యత్తు మ్యాండేట్ ఎగ్జిక్యూషన్లకు చేసిన మార్పు గురించి అర్హత ఉన్న మర్చంట్‌కు సమాచారం అందుతుంది.
    • పోర్ట్-అవుట్ (PhonePe యాప్ నుండి మరొక TPAPకు బదిలీ):
      PhonePe యాప్‌ మేనేజ్ చేస్తున్న యాక్టివ్ మ్యాండేట్‌ను మరొక TPAPకు (డెస్టినేషన్ యాప్‌కు) మార్చాలని (పోర్ట్-అవుట్ చేయాలని) మీరు ఎంచుకుంటే, ఆ పోర్టింగ్ అభ్యర్థనను డెస్టినేషన్ యాప్‌లోనే పంపాల్సి ఉంటుంది. ఈ పోర్ట్-అవుట్‌కు సంబంధించి NPCI నుండి మాకు ఒక నోటిఫికేషన్/అభ్యర్థన అందుతుంది. డెస్టినేషన్ యాప్‌లో విజయవంతంగా వ్యాలిడేషన్ జరిగిన తర్వాత, అలాగే మీ అథెంటికేషన్ పూర్తయిన తర్వాత, ఆ నిర్దిష్ట UMRNను మేనేజ్ చేసే TPAPగా మా హక్కును మేము వదులుకుంటాము. ఒకసారి పోర్ట్-అవుట్ అయిన తర్వాత, ఆ నిర్దిష్ట మ్యాండేట్‌కు సంబంధించి నోటిఫికేషన్లు, సవరణలు లేదా ఎగ్జిక్యూషన్ సర్వీసులను ఇకపై మేము అందించము. పోర్ట్-అవుట్ పూర్తయిన తర్వాత, ఆ మ్యాండేట్‌కు సంబంధించిన ఎలాంటి సందేహాలకైనా మీరు డెస్టినేషన్ TPAPనే సంప్రదించాల్సి ఉంటుంది.
  9. ఛార్జీ(లు)
    PhonePe తన యూజర్ల నుండి ఆటోపే సౌకర్యం కోసం ఎటువంటి ఫీజును వసూలు చేయదు; అయితే, వర్తించే చట్టాలకు లోబడి, ఎప్పటికప్పుడు ఫీజు పాలసీని మార్చే హక్కు మాకు ఉంది. మేము ఏవైనా కొత్త సర్వీసులకు ఫీజులను (వర్తించే పన్నులతో సహా) విధించవచ్చు లేదా ఇప్పటికే ఉన్న సర్వీసుల ఫీజులను సవరించవచ్చు/కొత్తగా విధించవచ్చు. ఫీజు(ల)కు చేసిన మార్పులను PhonePe యాప్/ వెబ్‌సైట్/ PhonePe ప్లాట్‌ఫామ్‌లో తదనుగుణంగా మీకు చూపిస్తాము, అలాగే సదరు మార్పులను పోస్ట్ చేసిన వెంటనే అవి ఆటోమేటిక్‌గా అమలులోకి వస్తాయి.
  10. యూజర్‌ బాధ్యతలు, కర్తవ్యాలు
    మీరు కింది వాటిని గుర్తించి, వాటికి అంగీకారం తెలుపుతున్నారు:
    1. ఆటోమేటెడ్ పేమెంట్(ల)కు సంబంధించి మీ ఇష్యూయర్ ట్రిగ్గర్ చేసిన మ్యాండేట్(ల)కు చెందిన పేమెంట్లను పూర్తి చేసే ఒక ఫెసిలిటేటర్‌గా మాత్రమే PhonePe వ్యవహరిస్తుంది, అంతేకానీ పేమెంట్ లావాదేవీలో ఎటువంటి పాత్రనూ పోషించదు.
    2. మ్యాండేట్ రిజిస్ట్రేషన్ కోసం మీరు వ్యాలిడేట్ చేసిన మ్యాండేట్(లు), అలాగే PhonePe యాప్‌లో మీరు పంపిన వివరాల ఆధారంగా, అన్ని మ్యాండేట్ ఎగ్జిక్యూషన్‌(లు) PhonePe యాప్‌లోనే జరుగుతాయి. మీ పేమెంట్ అకౌంట్ నుండి డెబిట్ అయిన అమౌంట్(ల)ను ఏ విధంగానైనా వెరిఫై చేయడానికి మరియు/లేదా ఏదైనా నిర్దిష్ట ఆటోమేటెడ్ పేమెంట్‌కు సంబంధించి జరిగిన డబుల్ పేమెంట్‌కు PhonePe బాధ్యత వహించదు. ఈ సదుపాయం కింద ప్రతి మ్యాండేట్ కోసం PhonePe యాప్‌లో ఇచ్చిన/ఆథరైజ్ చేసిన వివరాలను వెరిఫై చేయాల్సిన బాధ్యత మీది మాత్రమే.
    3. మీ మ్యాండేట్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను మెయింటెయిన్, అప్‌డేట్ చేయడానికి మీరే పూర్తిగా బాధ్యత వహించాలని మీరు గుర్తించి, దానికి అంగీకారం తెలుపుతున్నారు. ఒకవేళ మీరు మీ మొబైల్ నంబర్‌ను మార్చినా, డీయాక్టివేట్ చేసినా లేదా వదిలివేసినా, అర్హత ఉన్న మర్చంట్లతో మీరు సెటప్ చేసిన ఎలాంటి ప్రీ-ఆథరైజ్డ్ మ్యాండేట్ అయినా సరే నిరంతరాయంగా ప్రాసెస్ అవుతుంది, అలాగే మీ లింక్ చేసిన ఫైనాన్షియల్ అకౌంట్ల నుండి అమౌంట్ డెబిట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ మొబైల్ నంబర్ చర్న్ లిస్ట్ (MNRL) కింద మీ పాత మొబైల్ నంబర్‌ను టెలికాం ప్రొవైడర్ రీసైకిల్ చేసి ఉండి, అదే నంబర్‌తో PhonePe యాప్‌లో ఎవరైనా కొత్త యూజర్ రిజిస్టర్ అయితే, ఆ యూజర్‌కు మీ హిస్టారికల్ డేటా, వ్యక్తిగత సమాచారం లేదా యాక్టివ్‌ మ్యాండేట్‌లలో దేనికి కూడా యాక్సెస్ ఉండదు. మీరు ఇకపై ఏదైనా మొబైల్ నంబర్‌ను ఉపయోగించనట్లయితే, అలాగే దానితో అనుసంధానమైన ఎలాంటి యాక్టివ్ మ్యాండేట్‌లనైనా నిలిపివేయాలనుకుంటే, ఆ మ్యాండేట్‌లను రద్దు చేయడానికి లేదా సవరించడానికి నేరుగా సంబంధిత అర్హత ఉన్న మర్చంట్లను సంప్రదించాల్సిన పూర్తి బాధ్యత మీదే. మీరు మీ మొబైల్ నంబర్‌ను వదులుకున్న తర్వాత యాక్టివ్ మ్యాండేట్‌ల కింద ప్రాసెస్ అయిన ఎలాంటి డెబిట్‌లకూ PhonePeను బాధ్యులుగా పరిగణించకూడదు.
    4. ఆటోమేటెడ్ పేమెంట్(ల)ను చేసి, అర్హత ఉన్న మర్చంట్ నుండి మీరు పొందిన వస్తువు(లు), సర్వీస్(ల)కు సంబంధించిన ఎలాంటి సమస్యలు, ఆందోళనలు లేదా వివాదం(లు)కైనా PhonePe ఎటువంటి బాధ్యత వహించదు. దీనికి సంబంధించి, వస్తువు(లు) / సర్వీస్(ల) వల్ల తలెత్తే మీ సమస్య(ల) విషయంలో మీరు నేరుగా అర్హత ఉన్న మర్చంట్(ల)ను సంప్రదించవచ్చు.
    5. మ్యాండేట్ ఎగ్జిక్యూషన్ విజయవంతమవ్వడం కోసం మీ పేమెంట్ అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. మీ పేమెంట్ అకౌంట్‌లో తగినంత ఫండ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల మ్యాండేట్ ఎగ్జిక్యూషన్‌లో తలెత్తే ఎలాంటి వైఫల్యానికైనా లేదా తిరస్కారానికైనా సంబంధించిన ఎలాంటి లయబిలిటీలకు PhonePe బాధ్యత వహించదు.
    6. ఈ సదుపాయం కింద PhonePe యాప్‌లో ఎనేబుల్ చేసిన మీ చర్య(లు), మ్యాండేట్(లు), మ్యాండేట్ ఎగ్జిక్యూషన్‌(ల)ను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన బాధ్యత పూర్తిగా మీదే. ఆటోమేటెడ్ పేమెంట్(ల)కు సంబంధించి మీ ఇష్యూయర్ / అర్హత ఉన్న మర్చంట్ విధించిన ఎలాంటి ఆథరైజ్ చేయని ఛార్జీలు, జరిమానాలు, లేట్ ఫీజు(ల)కు, లేదా ఏదైనా ఆటోమేటెడ్ పేమెంట్‌కు సంబంధించి మీరు సెట్ చేసిన మ్యాండేట్ రిజిస్ట్రేషన్ / మ్యాండేట్ పరిమితికి సంబంధించిన ఎలాంటి వ్యత్యాసాలకైనా PhonePe బాధ్యత వహించదు.
    7. ఈ ఫీచర్ కింద ఎనేబుల్ చేసిన ఆటోమేటెడ్ పేమెంట్‌కు సంబంధించిన మార్గదర్శకాలు / వర్తించే చట్టం(ల) కింద RBI / NPCI నిర్దేశించిన మ్యాండేట్ పరిమితి(ల)ని పాటించేందుకు, అలాగే వాటికి కట్టుబడి ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు.
  11. నష్టపరిహారం, బాధ్యత
    1. ఒప్పందం, నిర్లక్ష్యం, అకృత్యం లేదా మరేదైనా కారణంతో సంబంధం లేకుండా, ఈ ఆటోపే నియమాల్లోని జాబితాలో పేర్కొన్న ఫీచర్లను ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వల్ల ఏ విధంగానైనా లాభాలను కోల్పోవడం లేదా రాబడుల నష్టం, వ్యాపారానికి అంతరాయం కలగడం, వ్యాపార అవకాశాలను కోల్పోవడం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టంతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, ఏ విధంగానైనా తలెత్తే ఎలాంటి పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలు లేదా బాధ్యతలకు (చట్టబద్ధమైన వాటితో సహా) PhonePe ఎట్టి పరిస్థితిల్లోనూ బాధ్యత వహించదు. ఒకవేళ PhonePeపై పడే మొత్తం గరిష్ఠ బాధ్యత ఏదైనా ఉంటే, అది ఏ సందర్భంలోనైనా, వివాదానికి కారణమైన చెల్లుబాటు అయ్యే లావాదేవీ అమౌంట్‌కు లేదా వంద రూపాయలకు (INR 100) సమానంగా ఉంటుంది, వీటిలో ఏది తక్కువైతే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
    2. ఈ ఆటోపే నియమాల్లో పేర్కొన్న ఫీచర్లను మీరు ఉపయోగించడం వల్ల లేదా ఈ ఆటోపే నియమాలు, UPI నియమ, నిబంధనలు, గోప్యతా విధానం, నియమాలు, అలాగే ఇతర పాలసీలు/నియమాలను మీరు ఉల్లంఘించడం వల్ల, మరియు/లేదా వర్తించే చట్టాలు లేదా థర్డ్ పార్టీ హక్కుల (మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనతో సహా) ఉల్లంఘన వల్ల ఏదైనా థర్డ్ పార్టీ నుండి వచ్చే ఏదైనా దావా లేదా డిమాండ్ లేదా సమంజసమైన న్యాయవాది ఫీజులతో సహా, న్యాయపరమైన చర్య, మరియు/లేదా విధించే జరిమానాల నుండి మీరు PhonePe, PhonePe సంస్థలు, వాటి యజమానులు, లైసెన్సీలు, (వర్తించే మేరకు), అలాగే వారి సంబంధిత అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, ఉద్యోగులను విముక్తులను చేయాల్సి ఉంటుంది, అలాగే వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి.
  12. సాధారణ నియమాలు
    1. ఈ ఆటోపే నియమాలను భారతదేశ చట్టాల ప్రకారం, అలాగే చట్టాల మధ్య ఉన్న వైరుధ్యాలతో సంబంధం లేకుండా అమలు చేయడమవుతుంది. ఈ ఆటోపే నియమాలకు సంబంధించి మీకూ, PhonePeకు మధ్య పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ తలెత్తే ఏదైనా దావా లేదా వివాదాన్ని బెంగళూరులోని ఆ కేసును విచారించే అర్హత/అధికారం ఉన్న కోర్టు మాత్రమే విచారణ చేపట్టి, తీర్పును నిర్ణయిస్తుంది.
    2. ఈ ఆటోపే నియమాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సదుపాయం ఖచ్చితత్వం, అథెంటిసిటీకి సంబంధించి స్పష్టంగా తెలిపిన లేదా ఆ అర్థం వచ్చేలా ఇచ్చిన అన్ని వారెంటీలను PhonePe నిరాకరిస్తుంది. ఆటోపే ఫీచర్, రిజర్వ్ పే ఫీచర్, PhonePe UPI, PhonePe ప్లాట్‌ఫామ్ నాణ్యత బాగుంటుందని, అవి అందుబాటులో ఉంటాయని, క్రయవిక్రయాలకు అవకాశముంటుందని, నిర్దిష్ట ప్రయోజనానికి సరిగ్గా సరిపోతాయని లేదా థర్డ్-పార్టీ మేధో సంపత్తి హక్కుల అతిక్రమణ జరగలేదని తెలిపే వారెంటీలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, ఎటువంటి వారెంటీలు లేదా ప్రాతినిధ్యాలను PhonePe స్పష్టంగా ఇవ్వదు లేదా ఆ అర్థం వచ్చేలా చెప్పదు. ఈ సర్వీసులు “ఉన్నవి ఉన్నట్లుగా”, “అందుబాటులో ఉన్నవి యధాతథంగా”, అలాగే అన్ని లోపాలతో సహా అందుతాయి. PhonePe అనేది కేవలం లావాదేవీల సౌకర్యాన్ని కల్పించే ఫెసిలిటేటర్ మాత్రమే, అంతేకానీ లావాదేవీలలో ఎలాంటి పాత్రనూ పోషించదు. నిర్దేశిత ప్రక్రియ ప్రకారం లావాదేవీలను ఎగ్జిక్యూట్ చేయడానికి, అలాగే ప్రాసెస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము, అయితే, లావాదేవీల వైఫల్యం, PhonePe UPI లేదా PhonePe ప్లాట్‌ఫామ్ అందుబాటులో లేకపోవడం, ఏ విధంగానైనా ప్రతిస్పందన ఇవ్వకపోవడం, ఆలస్యం కావడం, సిస్టమ్‌ల వైఫల్యాలు మరియు/లేదా లావాదేవీల చట్టబద్ధత వల్ల ఉత్పన్నమయ్యే వాటితో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, ఈ ఆటోపే నియమాలు, PhonePe UPIకి సంబంధించిన అన్ని బాధ్యతలను PhonePe నిరాకరిస్తుంది; PhonePe UPI, PhonePe ప్లాట్‌ఫామ్, PhonePe సర్వీసులు, లావాదేవీలు మొదలైన వాటికి సంబంధించిన ఏదైనా ఫీచర్‌లో ఎర్రర్, వైఫల్యం, అంతరాయం కలగడం లేదా అందుబాటులో లేకపోవడానికి కూడా PhonePe బాధ్యత వహించదు. ఏదైనా లావాదేవీ వల్ల తలెత్తే ఏవైనా సమస్యల కోసం దయచేసి మీ ఇష్యూయర్‌ను సంప్రదించండి. లావాదేవీలన్నీ కేవలం పేమెంట్ పొందే, పేమెంట్ చేసే వారి మధ్య మాత్రమే జరుగుతాయి, వీటికి PhonePe ఎలాంటి బాధ్యత వహించదు.
    3. మేము మెయింటెయిన్ చేసే మీ లావాదేవీ రికార్డులు, ఇతర లాగ్‌లు అనేవి మీరు చేసిన లావాదేవీకి, అలాగే మీరు ఆటోపే మరియు UPI/ PhonePe UPIని ఉపయోగించడానికి తుది రుజువుగా పరిగణించడమవుతుంది, అలాగే మీరు వీటికి తప్పకుండా కట్టుబడి ఉండాలి.
    4. PhonePe UPI వినియోగ నియమాలు; సాధారణ నియమ, నిబంధనలు, అలాగే PhonePe గోప్యతా విధానాలను ఇందులో ప్రస్తావించడం ద్వారా వాటిని కూడా ఈ ఆటోపే నియమాలలో చేర్చినట్లుగానే భావించడమవుతుంది. ఈ ఆటోపే నియమాలకు, అలాగే PhonePe UPI వినియోగ నియమాలకు; సాధారణ నియమ, నిబంధనలు, PhonePe గోప్యతా విధానం మధ్య ఏదైనా వైరుధ్యం తలెత్తితే, ఈ ఆటోపే నియమాల ద్వారా ఎనేబుల్ చేసిన ఈ సదుపాయానికి సంబంధించి ఈ ఆటోపే నియమాలే తుదిగా అమలవుతాయి.