PhonePe | Logo
Company
  • About Us
  • Careers
  • Press
  • Blog
Our Solutions
For Businesses
For Consumers
menu
Offline PaymentsAccept payments & get notified
menu
Offline Partner ProgramEnable in-store payments and grow your earnings
menu
Payment GatewayAccept online payments
menu
Payment AggregatorPayments made easy
menu
Payment Gateway PartnerRefer and earn commissions
menu
Payment LinksCreate links to collect payments
menu
Merchant LendingAccess business loans
menu
PhonePe AdsAdvertise on PhonePe apps
See Allright-arrow
menu
InsuranceSecure your financial future
menu
InvestmentsManage and grow wealth
menu
Consumer LendingPersonal loans made simple
menu
GoldInvest in digital gold
menu
PhonePe SBI Card
Credit Cards
Unlock rewards, simplify spending
menu
PhonePe HDFC Bank
Credit Cards
Unlock rewards, simplify spending
menu
Travel & CommuteBook and pay for travel in seconds
menu
Wish Credit CardZero fee, max cashback
menu
Secured LendingSecure personal loans
Investor Relations
Contact Us
Trust & Safety
PhonePe | Hamburger Menu
✕
Home
Company
  • About Us
  • Careers
  • Press
  • Blog
Our Solutions
For Businessesarrow
icon
Offline Payments
icon
Offline Partner Program
icon
Payment Gateway
icon
Payment Aggregator
icon
Payment Gateway Partner
icon
Payment Links
icon
Merchant Lending
icon
PhonePe Ads
See all

For Consumersarrow
icon
Insurance
icon
Investments
icon
Consumer Lending
icon
Gold
icon
PhonePe SBI Card
Credit Cards
icon
PhonePe HDFC Bank
Credit Cards
icon
Travel & Commute
icon
Wish Credit Card
icon
Secured Lending
Investor Relations
Contact Us
Trust & Safety
Privacy Policy

PhonePe వాలెట్/eGV ఉపయోగ నిబంధనలు

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াবাংলাहिन्दीಕನ್ನಡଓଡ଼ିଆ
< Back
  • వాలెట్
  • గిఫ్ట్‌ PPI/eGV
  • నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC)

ఈ డాక్యుమెంట్‌ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం రూపొందిన ఒక ఎలక్ట్రానిక్ రికార్డు, దీనిలో కాలానుగుణంగా జరిగే ఏవైనా సవరణలు, వర్తించే నియమాలు, అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం సవరించిన వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించి సవరించిన నిబంధనలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డు కంప్యూటర్ సిస్టమ్‌తో జనరేట్ చేసినది, అలానే దీనిపై ఎటువంటి ఫిజికల్‌ లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.

PhonePe వాలెట్‌కు రిజిస్టర్ చేసుకునే ముందు (కింద నిర్వచించిన మేరకు), దాన్ని యాక్సెస్ చేసే ముందు లేదా వినియోగించే ముందు దయచేసి వినియోగ నియమాలను జాగ్రత్తగా చదవండి. ఈ నియమ, నిబంధనలు (ఇకపై “వాలెట్‌ వినియోగ నియమాలు” అని పిలుస్తారు) అనేవి స్మాల్‌ PPIలు, పూర్తి-KYC PPIలు లేదా PhonePe లిమిటెడ్ (గతంలో ‘PhonePe ప్రైవేట్ లిమిటెడ్’ అని పిలిచేవారు) అందిస్తున్న PhonePe వాలెట్‌ కింద ఎప్పటికప్పుడు యాడ్ అయ్యే ఇతర సర్వీస్‌ల వినియోగాన్ని నియంత్రిస్తాయి, PhonePe లిమిటెడ్ రిజిస్టర్డ్ కార్యాలయం అనేది ఆఫీసు-2, ఫ్లోర్ 5, వింగ్ A, బ్లాక్ A, సాలార్‌పూరియా సాఫ్ట్‌జోన్, బెల్లందూర్‌ విలేజ్, వర్తూర్ హోబ్లి, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు సౌత్, బెంగళూరు, కర్ణాటక, భారతదేశం, 560103 చిరునామాలో (“PhonePe”) ఉంది. వీటికి సంబంధించి, ‘పేమెంట్‌, సెటిల్‌మెంట్ చట్టం, 2007’, అలానే RBI ఎప్పటికప్పుడు జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (“RBI”) నుండి PhonePe అధికారం పొందింది.

PhonePe వాలెట్‌కు రిజిస్టర్ చేసుకుని/వినియోగాన్ని కొనసాగించడం ద్వారా సాధారణ PhonePe నియమ, నిబంధనలు (“సాధారణ నియమ, నిబంధనలు”), PhonePe ప్రైవసీ పాలసీ (“ప్రైవసీ పాలసీ”), ఆధార్ నియమాలు, PhonePe ఫిర్యాదుల పరిష్కార పాలసీ (వీటన్నిటినీ కలిపి, “ఒప్పందం” అని పిలుస్తారు)ని అంగీకరించడంతో పాటు, ఈ వాలెట్‌ వినియోగ నియమాలకు కట్టుబడి ఉండటానికి మీరు మీ సమ్మతిని తెలియజేస్తున్నారు. PhonePe వాలెట్‌కు రిజిస్టర్ చేసుకోవడం మరియు/లేదా PhonePe వాలెట్‌ను వినియోగించడం ద్వారా, మీరు PhonePeతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నారు, అలానే ఈ ఒప్పందం మీకు, PhonePeకు మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన ఒడంబడికను ఏర్పాటు చేస్తుంది. వాలెట్‌ వినియోగ నియమాల నిమిత్తం, సందర్భానికి తగ్గట్లుగా, “మీరు”, “యూజర్”, “మీ” అనే పదాలు PhonePeలో PhonePe వాలెట్‌కు రిజిస్టర్ చేసుకున్న PPI హోల్డర్‌ను సూచిస్తాయి, అలానే “మేము”, “మా”, “జారీ చేసే వారు” అనే పదాలు PhonePeను సూచిస్తాయి. ఒకవేళ మీరు ఒప్పందం నియమ, నిబంధనలను అంగీకరించకూడదనుకుంటే లేదా ఒప్పందం నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండకూడదనుకుంటే, మీరు PhonePe వాలెట్‌కు రిజిస్టర్ చేసుకోకూడదు, లేదా మీకు ఇప్పటికే PhonePe వాలెట్‌ ఉంటే, మీరు వెంటనే PhonePe వాలెట్‌ను క్లోజ్ చేయాలని కోరవచ్చు, అప్పుడు, వర్తించే మేరకు, వాలెట్‌ క్లోజ్ అయినప్పటి నుండి ఈ వాలెట్‌ వినియోగ నియమాలు వర్తించవు. మీ సౌలభ్యం కోసం, PhonePe ప్లాట్‌ఫామ్‌ను (కింద నిర్వచనం ఇచ్చాము) యాక్సెస్ చేయడానికి ఉపయోగించిన మీ లాగిన్ క్రెడెన్షియల్స్‌తో మీరు PhonePe వాలెట్‌కు లాగిన్ అవ్వవచ్చు, దాన్ని యాక్సెస్ చేయవచ్చు, లావాదేవీలు జరపవచ్చు. మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ (కింద నిర్వచనం ఇచ్చాము) నుండి లాగ్ అవుట్ చేస్తే, మీరు మీ PhonePe వాలెట్‌ నుండి లాగ్ అవుట్ అవుతారు.

PhonePe వెబ్‌సైట్(లు), మొబైల్ అప్లికేషన్ మరియు/లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో (ఇకపై వీటన్నింటిని కలిపి “PhonePe ప్లాట్‌ఫామ్‌” అని పిలుస్తారు) మేము అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేసి, ఎప్పుడైనా నియమ, నిబంధనలను సవరించవచ్చు. అప్‌డేట్ చేసిన వాలెట్‌ వినియోగ నియమాల వెర్షన్‌ను పోస్ట్ చేసిన వెంటనే అవి అమల్లోకి వస్తాయి. అప్‌డేట్‌లు/సవరణల కోసం ఈ వాలెట్‌ వినియోగ నియమాలను/ ఒప్పందాన్ని క్రమం తప్పకుండా సమీక్షించడం మీ బాధ్యత. మార్పులను పోస్ట్ చేసిన తర్వాత మీరు PhonePe వాలెట్‌ను యాక్సెస్ చేస్తూ/ఉపయోగిస్తూ ఉంటే, అదనపు నియమాలు లేదా ఈ నియమాల్లోని ఏవైనా భాగాల తొలగింపు, మార్పులు మొదలైన వాటితో సహా సవరణలను మీరు అంగీకరిస్తున్నారని అర్థం. మీరు ఈ వాలెట్‌ వినియోగ నియమాలకు/ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంత కాలం, సర్వీస్‌లను పొందేందుకు మేము మీకు వ్యక్తిగత, నాన్-ఎక్స్‌క్లూజివ్, బదిలీ చేయలేని, పరిమిత అధికారాన్ని మంజూరు చేస్తాము.

వాలెట్

arrow icon

నిర్వచనం

“PhonePe వాలెట్”: RBI నిర్వచించిన నియమాలు, విధానాల ప్రకారం PhonePe జారీ చేసిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్, ఇది కనీస వివరాల ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (“స్మాల్‌ PPI”) లేదా నాన్ ఫేస్-టు-ఫేస్ ఆధార్ OTP ఆధారిత ఫుల్‌ KYC PPI (“E-KYC PPI”)తో సహా ఫుల్‌ KYC ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (“ఫుల్‌ KYC PPI”)ను సూచిస్తుంది.

“రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తులు (PEPలు)”: విదేశం ద్వారా ప్రముఖ ప్రజా విధులను పొందిన వ్యక్తులు లేదా అప్పగింతను పొందిన వ్యక్తులు, వీరిలో దేశాధినేతలు/ప్రభుత్వ అధినేతలు, సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ ప్రభుత్వ లేదా న్యాయ లేదా సైనిక అధికారులు, ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ల సీనియర్ ప్రతినిధులు, ముఖ్యమైన రాజకీయ పార్టీ అధికారులు ఉంటారు.

“మర్చంట్‌”: వస్తువులు మరియు/లేదా సర్వీస్‌లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌‌‌లో కొనుగోలు చేసేందుకు PhonePe వాలెట్‌ను పేమెంట్ పద్ధతిగా అంగీకరించే ఏదైనా ఎస్టాబ్లిష్‌మెంట్ మరియు/లేదా సంస్థ అని అర్థం. అదేవిధంగా, “కొనుగోలుదారు” అనే పదం, ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో మర్చంట్లు అందించిన ఏవైనా వస్తువులు లేదా సర్వీస్‌లను కొనుగోలు చేసి, అలాంటి వస్తువులు/సర్వీస్‌లకు PhonePe వాలెట్‌‌తో పేమెంట్‌ చేసే వ్యక్తిని సూచిస్తుంది.

“PhonePe – (P-SSO)లో ఒక్కసారే సైన్ ఇన్‌ చేయడం” అనేది మీకు అందించిన PhonePe లాగిన్ సర్వీస్‌ను సూచిస్తుంది, ఇది మీ సురక్షితమైన, మీకు మాత్రమే అందించిన క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించి PhonePe అప్లికేషన్‌లో అందిస్తున్న అన్ని సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది.

అర్హత

PhonePe వాలెట్‌కు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా, మీకు కింది అర్హతలు ఉన్నాయని మీరు తెలుపుతున్నారు –

  • చెల్లుబాటు అయ్యే PhonePe అకౌంట్‌ను కలిగి ఉన్న భారతీయ నివాసి. 
  • ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఉన్న అర్థం ప్రకారం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సహజమైన లేదా చట్టబద్ధమైన వ్యక్తి.
  • మీరు చట్టపరంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని కుదుర్చుకోగలరు.
  • ఒప్పందం కింద అవసరమైన అంశాల ప్రకారం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మీకు హక్కు, అధికారం, సామర్థ్యం ఉన్నాయి.
  • భారతదేశ చట్టాల ప్రకారం PhonePe లేదా PhonePe ఎంటిటీల సర్వీస్‌లను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడంపై మిమ్మల్ని నిషేధించలేదు లేదా చట్టపరంగా నిరోధానికి గురి కాలేదు.

మీరు ఏదైనా వ్యక్తి లేదా సంస్థగా నటించకూడదు లేదా మీ వయస్సు లేదా ఏ వ్యక్తి లేదా సంస్థతోనైనా అనుబంధాన్ని తప్పుగా పేర్కొనకూడదు. ఇందులో పేర్కొన్న షరతులను తప్పుగా సూచించినట్లయితే, PhonePe వాలెట్‌ను వినియోగించడానికి మీరు కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసే హక్కు PhonePeకు ఉంటుంది.

మీరు PEP లేదా PEP బంధువు అయిన సందర్భాల్లో లేదా మీ PEP స్టేటస్ మారినప్పుడు లేదా మీరు PEPకి సంబంధించిన వ్యక్తిగా మారినప్పుడు PhonePeకు వెంటనే తెలియజేయడానికి మీరు అంగీకరిస్తున్నారు, అలానే దీనికి బాధ్యత వహిస్తారు. వర్తించే చట్టాలు, PhonePe పాలసీకి అనుగుణంగా తగిన చర్యలు తీసుకున్నారని నిర్ధారించుకోవడానికి మీరు వెంటనే రాతపూర్వకంగా PhonePeకు తెలియజేయాలి. ఒక PEPగా మీరు సంబంధిత రెగ్యులేటర్లు (నియంత్రణా సంస్థలు) నిర్ణయించిన అదనపు కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అవసరాలకు లోబడి ఉంటారని మీరు అర్థం చేసుకున్నారు. ఒక PEPగా, పైన పేర్కొన్న అన్ని అదనపు కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అవసరాలను పూర్తిగా పాటించడానికి, అలాగే మీ PhonePe వాలెట్‌ వినియోగం నిరంతరాయంగా ఉంటుందని నిర్ధారించడానికి PhonePe మీకు తెలియజేసే, PEPకి వర్తించే అన్ని నిరంతర సమ్మతి అవసరాలను పూర్తి చేయడానికి PhonePeతో సహకరించడానికి మీరు ఇందుమూలంగా అంగీకరిస్తున్నారు.

మీ PEP స్టేటస్‌ను ప్రకటించడానికి, దయచేసి ఈ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసి, నింపండి, అలానే యాప్ ద్వారా మా కస్టమర్ సహాయ విభాగాన్ని సంప్రదించండి లేదా 080-68727374 / 022-68727374కు కాల్ చేసి, ఇన్‌బౌండ్ సహాయ విభాగ బృందానికి కాల్ చేయండి.

PhonePe వాలెట్‌ జారీ అనేది అదనపు డ్యూ డిలిజెన్స్‌కు లోబడి ఉండవచ్చు, ఇందులో PhonePe వాలెట్‌ అప్లికేషన్‌లో భాగంగా మీరు అందించిన లాగిన్ వివరాలను అంతర్గతంగా లేదా ఇతర బిజినెస్ పార్ట్‌నర్‌లు / సర్వీస్ ప్రొవైడర్లు ఉపయోగించి సమీక్షించడం, వ్యాలిడేట్ చేయడం, రెగ్యులేటర్ల సూచనల మేరకు ఆంక్షలను చెక్ చేయడం, మా రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రక్రియలు నిర్వహించడం ఉండవచ్చు, కానీ వీటికే పరిమితం కాదు, మీకు PhonePe వాలెట్‌ జారీ చేయడానికి సంబంధించి PhonePeకు పూర్తి అధికారం ఉంటుంది. అందువల్ల, అవసరమైన డేటాను పంపినంత మాత్రాన మీరు PhonePe వాలెట్‌ హోల్డర్ కావడానికి అర్హులు కారు.

PhonePe వాలెట్‌ అప్లికేషన్, జారీ చేయడం

  • ఆర్థిక సంస్థలు తమ క్లయింట్ల గుర్తింపును నిర్ధారించడానికి, అలానే అటువంటి క్లయింట్లు మనీ లాండరింగ్ లేదా టెర్రరిస్ట్ ఫండింగ్‌లో పాలుపంచుకునే ప్రమాదం ఉందో లేదో నిర్ధారించడానికి KYC లేదా “మీ కస్టమర్‌ను తెలుసుకోండి” ప్రక్రియలను నిర్వహిస్తాయి. బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు తమ క్లయింట్ల KYCని తప్పనిసరిగా అడగాలని RBI నిర్దేశించింది. PhonePe వాలెట్‌ను ఒక సర్వీస్‌గా మీరు పొందడం కోసం, మీ అప్లికేషన్‌ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మీకు సంబంధించిన డాక్యుమెంట్లు, సమాచారాన్ని మేము సేకరించవచ్చు, అలానే అటువంటి సమాచార సేకరణ, వినియోగం అనేవి PhonePe ప్రైవసీ పాలసీ, PhonePe అంతర్గత పాలసీలు, రెగ్యులేటరీ ఆదేశాలు, నోటిఫికేషన్‌లకు లోబడి ఉంటాయి, ఇందులో ఏవైనా రెగ్యులేటర్లు/అధికారులు నిర్దేశించిన విధానాలు ఉంటాయి, కానీ వీటికే పరిమితం కాదు.
  • అప్లికేషన్, ఆన్‌బోర్డింగ్ లేదా మీ PhonePe వాలెట్‌ అప్‌డేట్‌లో భాగంగా, అలానే మీరు చేసుకున్న అప్లికేషన్‌లో భాగంగా మీరు ఏ థర్డ్‌ పార్టీ సర్వీస్‌లను వినియోగిస్తున్నారో, ఆ థర్డ్ పార్టీ నియమ, నిబంధనలను కూడా మీరు అంగీకరించాల్సి రావచ్చు. ఉదాహరణకు, మీరు మీ డేటా/సమాచారాన్ని మాకు పంపడానికి భారత విశిష్ట గుర్తింపు అథారిటీ ( UIDAI) లేదా ఏదైనా ఇతర అథారిటీకి అధికారం ఇస్తే, వారి నియమ, నిబంధనలను కూడా మీరు అంగీకరించాల్సి రావచ్చు.
  • PhonePeకు మీరు సమర్పించిన మీ వివరాలు, మీ ఇంటి వివరాలు, ట్యాక్స్ స్టేటస్, PEP సమాచారం, అలానే మీ KYC డాక్యుమెంట్లకు మాత్రమే పరిమితం కాకుండా, ఇతర సమాచారం కోసం అందించిన డాక్యుమెంట్లు/సమాచారం, ఇంకా డిక్లరేషన్‌లకు మీరే బాధ్యత వహించాలి. తప్పు డాక్యుమెంట్లు/సమాచారం, డిక్లరేషన్లకు PhonePe బాధ్యత వహించదు. మీ PhonePe వాలెట్‌ యాక్టివేషన్‌ను తిరస్కరించే, డీయాక్టివేట్ చేసే హక్కు లేదా అటువంటి ఇతర చర్య తీసుకునే హక్కు, అలానే ప్రస్తుత ఆదేశాల ప్రకారం లీగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు (LEAలు), రెగ్యులేటర్(లు)/అధికారులకు అటువంటి సంఘటనను నివేదించే హక్కు కూడా PhonePeకు మాత్రమే ఉంటుంది.
  • PhonePe వాలెట్‌ను మీకు జారీ చేయడానికి ముందు మీరు అందించిన డేటా/సమాచారాన్ని మేము సమీక్షించవచ్చు, అలానే రిస్క్ మేనేజ్‌మెంట్‌తో సహా తగిన డ్యూ-డిలిజెన్స్‌ను చేపట్టవచ్చు. ఇది RBI లేదా ఏదైనా ఇతర రెగ్యులేటర్/అథారిటీ జారీ చేసిన ప్రస్తుత రెగ్యులేటరీ ఆదేశాలు, అంటే RBI జారీ చేసిన “మీ కస్టమర్‌ను తెలుసుకోండి” మార్గనిర్దేశాలు, 2016 (“KYC ఆదేశాలు”), మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (“PMLA”), మనీ-లాండరింగ్ (రికార్డుల నిర్వహణ) నిరోధక నిబంధనలు, 2005,  ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌లకు సంబంధించి RBI జారీ చేసిన ప్రధాన ఆదేశాలు, 2021, ఇంకా PhonePe వాలెట్‌కు వర్తించేలా రెగ్యులేటర్ ఎప్పటికప్పుడు నోటిఫై చేసే ఇతర ఆదేశాల ప్రకారం ఉంటుంది. డ్యూ డిలిజెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మీకు సంబంధించి పబ్లిక్‌లోని అందుబాటులో ఉన్న ఇతర వనరుల నుండి లేదా మా బిజినెస్ పార్ట్‌నర్లు లేదా సర్వీస్ ప్రొవైడర్లు నుండి కూడా మేము డేటాను పొందవచ్చు.
  • PhonePe వాలెట్‌ అప్లికేషన్, అప్‌గ్రేడ్ లేదా రిస్క్ అసెస్‌మెంట్‌లో భాగంగా మీ KYC సమాచారం/డేటాను సేకరించడానికి మేము అసోసియేట్‌లను లేదా ఏజెంట్‌లను నియమించవచ్చు.
  • మీరు కనీస KYC (సెల్ఫ్-డిక్లరేషన్(స్వీయ ప్రకటన)) ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీ ‘కనీస KYC’ అకౌంట్ ఓపెన్ అవుతుంది, అలానే మీరు స్మాల్‌ PPI PhonePe వాలెట్‌ను ఉపయోగించడానికి అర్హత పొందుతారు. అయితే, పూర్తి స్థాయి PhonePe వాలెట్‌ అనుభవాన్ని పొందడానికి, మీరు తప్పనిసరిగా ‘ఫుల్‌ KYC’  ప్రక్రియను పూర్తి చేయాలి. కనీస KYC అకౌంట్ ను e-KYC PPI/ఫుల్‌ KYC అకౌంట్ కు అప్‌గ్రేడ్ చేయడం లేదా నేరుగా e-KYC PPI/ఫుల్‌ KYC అకౌంట్‌ను ఓపెన్ చేయడం అనేది మీ ఇష్టం, అది పూర్తిగా మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వర్తించే చట్టాలు, PhonePe పాలసీలకు అనుగుణంగా కనీస KYC PPI/ ఫుల్‌ KYC PPI/e-KYC PPI కోసం మీరు పంపిన అభ్యర్థనను PhonePe తన సొంత అభీష్టానుసారం, ఎటువంటి కారణాలు చెప్పకుండానే అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు, అయితే ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు దీనిపై ఎలాంటి వివాదం లేవనెత్తకూడదు.
  • మీరు ఏ సమయంలోనైనా కేవలం ఒక్క PhonePe వాలెట్‌ను మాత్రమే ఓపెన్ చేసేలా/కలిగి ఉండేలా చూసుకోవాలి, అలానే ఈ నిబంధనను మీరు పాటించని పక్షంలో, PhonePe తగినదని భావించే ఏదైనా చర్యను తీసుకుంటుందని మీరు అర్థం చేసుకున్నారు.

PhonePe వాలెట్‌లు

PhonePe అకౌంట్ హోల్డర్లకు స్మాల్ PPI, ఫుల్‌ KYC PPIని (e-KYC PPIతో సహా) PhonePe జారీ చేస్తుంది. ఈ విభాగం అనేది RBI జారీ చేసిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై మాస్టర్ డైరెక్షన్స్, 2021 (“MD-PPIs, 2021”), అలానే తదుపరి అప్‌డేట్‌ల కింద RBI జారీ చేసిన రెగ్యులేటరీ ఆదేశాలకు అనుగుణంగా మేము జారీ చేసిన వివిధ కేటగిరీల PhonePe వాలెట్లను సూచిస్తుంది.

  • స్మాల్ PPI లేదా కనీస వివరాల PPI (నగదు లోడింగ్ సౌకర్యం లేనిది)

స్మాల్ PPI (నగదు లోడింగ్ సౌకర్యం లేనిది) కేటగిరీ కింద జారీ చేసిన PhonePe వాలెట్లను ఇక్కడ పేర్కొన్న ఫీచర్లు, పరిమితులు ఉన్న MD-PPIs 2021లోని పేరా 9.1 (ii) ప్రకారం నిర్వహిస్తారు.

  • ఈ PhonePe వాలెట్‌ను పొందడానికి, మీకు భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు జారీ చేసిన, యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్‌ ఉండాలి, దీన్ని OTPతో వెరిఫై చేస్తారు, మీరు మీ పేరు, KYC డైరెక్షన్స్‌ జాబితాలో ఉన్న ఏదైనా ‘మ్యాండేటరీ డాక్యుమెంట్’ లేదా ‘అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్’ (“OVD”) ప్రత్యేక గుర్తింపు/ఐడెంటిఫికేషన్ నంబర్‌ను మీరే స్వయంగా ప్రకటించి అందించాలి. మీ అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా, ఆమోదించదగిన డాక్యుమెంట్ల జాబితాను PhonePe మీకు అందిస్తుంది.
  • మీ PhonePe వాలెట్‌‌ను మీరు రీలోడ్ చేసుకోవచ్చు, ఇది ఎలక్ట్రానిక్ రూపంలో జారీ అవుతుంది. రెగ్యులేటర్ ఎప్పటికప్పుడు అనుమతించిన, అలానే PhonePe అంతర్గత పాలసీల ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్ మరియు/లేదా క్రెడిట్ కార్డ్‌తో లోడింగ్‌కు అనుమతి లభిస్తుంది. అయితే ఆయా PhonePe వాలెట్‌లోకి నగదు జమ చేయడానికి అనుమతి లేదు.
  • మీ PhonePe వాలెట్‌కు లోడింగ్ పరిమితులు వర్తిస్తాయి, నెలవారీ పరిమితి ₹10,000/- ,ఇంకా వార్షిక పరిమితి (ఆర్థిక సంవత్సరం ఆధారంగా లెక్కించబడుతుంది) ₹1,20,000/-. అలానే, మీ PhonePe వాలెట్‌ బ్యాలెన్స్ ఏ సమయంలోనైనా ₹10,000/- (“స్మాల్ PPI పరిమితి”)కు పరిమితం అవుతుంది, మీ వాలెట్‌లోని నిధులు స్మాల్ PPI పరిమితికి చేరుకున్నట్లయితే మీ PhonePe వాలెట్‌లో ఎటువంటి నిధులను క్రెడిట్ చేయడానికి అనుమతి ఉండదు, అయితే రద్దు అయిన లావాదేవీల రీఫండ్స్ విషయంలో వీటికి మినహాయింపు ఉంటుంది, అప్పుడు అటువంటి క్రెడిట్ అయిన అమౌంట్‌ అనేది PhonePe వాలెట్‌లోని బ్యాలెన్స్‌ను ₹10,000/- పరిమితి కంటే పెంచవచ్చు.
  • మీరు ఏవైనా నిధులను బదిలీ చేయడానికి లేదా ఏదైనా నగదును విత్‌డ్రా చేయడానికి మీ స్మాల్ PPI PhonePe వాలెట్‌ బ్యాలెన్స్‌ను ఉపయోగించలేరు.
  • వస్తువులు, సర్వీస్‌లను కొనుగోలు చేయడానికి మాత్రమే మీరు స్మాల్ PPI PhonePe వాలెట్‌ బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోగలరు.
  • మర్చంట్ / మర్చంట్ ప్లాట్‌ఫామ్‌కు మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు అందుబాటులో ఉండే పేమెంట్ ఎంపికలలో PhonePe వాలెట్‌ ఒకటి కావచ్చు, అలానే PhonePe వాలెట్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన ప్రోడక్ట్‌లు లేదా పొందిన సర్వీస్‌లకు మేము ఎటువంటి బాధ్యత వహించము, ఇంకా దానికి సంబంధించిన ఏదైనా లయబిలిటీని స్పష్టంగా నిరాకరించడమవుతుంది. ఆర్డర్ విలువ PhonePe వాలెట్‌లో అందుబాటులో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువగా ఉంటే మీరు నేరుగా మీ PhonePeకు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుండి చెల్లించవచ్చు.
  • PhonePe వాలెట్‌ జారీ సమయంలో, SMS/ఇ-మెయిల్/నియమ, నిబంధనలకు సంబంధించిన లింక్‌ ద్వారా లేదా ఏదైనా ఇతర మార్గాల్లో వాలెట్‌ ఫీచర్లను PhonePe తెలియజేస్తుంది.
  • మీ PhonePe వాలెట్‌కు లాగిన్ అవ్వడానికి, అలానే యాక్సెస్ చేయడానికి మీరు మీ P-SSOని తప్పకుండా ఉపయోగించాలి. మీ PhonePe వాలెట్‌‌లోని బ్యాలెన్స్‌ను ఉపయోగించడానికి, యాప్‌లో అందించిన సూచనల ప్రకారం మీరు మీ P-SSOని అథెంటికేట్ చేయాల్సి (ధృవీకరించాల్సి) రావచ్చు. మీ PhonePe అకౌంట్‌ను మీరు యాక్సెస్ చేయడానికి అదనపు భద్రతా చర్యలను పూర్తి చేయాలని మేము కోరవచ్చు/వాటిని మేము అందించవచ్చు.
  • PhonePe వాలెట్‌లో మీరు చేయాలనుకుంటున్న లావాదేవీలపై పరిమితిని నిర్ణయించే ఎంపికను కూడా PhonePe మీకు ఇస్తుంది, అలానే మీరు ఏ సమయంలోనైనా మీ PhonePe యాప్‌కు లాగిన్ అయ్యి, మీరు దాన్ని మార్చుకోవచ్చు.
  • ఇక్కడ పేర్కొన్న ఫీచర్లు, పరిమితులు అనేవి PhonePe అంతర్గత రిస్క్ అసెస్‌మెంట్‌కు లోబడి ఉంటాయి, అలానే లోడ్ చేయగల అమౌంట్, ఖర్చు పరిమితులను మేము తగ్గించవచ్చు, మీరు నిధులను తాజాగా లోడ్‌ చేసిన తర్వాత మీ PhonePe వాలెట్‌పై కూలింగ్ పీరియడన్‌ను అప్లై చేయవచ్చు, నిర్దిష్ట మర్చంట్‌ల వద్ద కొనుగోలు చేయడాన్ని (నిర్దిష్ట మర్చంట్‌లకు పేమెంట్‌ చేయడాన్ని) నియంత్రించవచ్చు, మీ PhonePe వాలెట్‌ను మీరు యాక్సెస్ చేయకుండా మిమ్మల్ని నియంత్రించవచ్చు లేదా లీగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు (“LEA”) లేదా ఇతర రెగ్యులేటర్లు/అధికారులకు మీ అకౌంట్‌ గురించి నివేదించవచ్చు. పైన పేర్కొన్న చర్యను మేము తీసుకున్నప్పుడు, దాన్ని మేము మీకు తెలియజేయవచ్చు లేదా తెలియజేయకపోవచ్చు అని మీరు అర్థం చేసుకున్నారు. మా యూజర్లు, మర్చంట్లు కోసం మీ PhonePe వాలెట్లు, అలానే ఎకోసిస్టమ్‌ను సురక్షితంగా ఉంచడానికి మేము నిర్వహించే ట్రాన్సాక్షనల్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఇది ఓ భాగం.
  • ఒకవేళ మీకు డిసెంబర్ 24, 2019కి ముందే PhonePe వాలెట్‌ ఉండి, దాని స్టేటస్‌ “ఇన్‌యాక్టివ్”గా ఉంటే, మీరు ప్రారంభించిన మీ వాలెట్‌ అకౌంట్ యాక్టివేషన్‌ మేరకు మీ PhonePe వాలెట్‌ అనేది PhonePe వాలెట్‌ స్మాల్ PPI కేటగిరీకి మైగ్రేట్ అవుతుంది, అలానే ఇక్కడ తెలిపిన ఫీచర్లు, పరిమితులు దానికి వర్తిస్తాయి. మైగ్రేషన్ సమయంలో, వర్తించే మేరకు, మీరు KYCని అప్‌డేట్ చేయాల్సి రావచ్చు.
  • ఒకవేళ మీరు మీ స్మాల్ PPI PhonePe వాలెట్‌ను క్లోజ్‌ చేయాలని ఎంచుకుంటే, అలానే దానిలో స్టోర్ చేసిన వాల్యూ (నిల్వ విలువ) ఉన్నట్లయితే, ఆ నిధులను ఏ అకౌంట్‌ నుండి లోడ్ చేశారో, ఆ అకౌంట్‌కు మేము తిరిగి పంపుతాము. ఏదైనా కారణం వల్ల స్టోర్డ్ వాల్యూను సోర్స్ అకౌంట్ కు తిరిగి బదిలీ చేయలేకపోతే, మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో టికెట్ ను పంపి, PhonePe ప్లాట్‌ఫామ్‌లో వివరించిన ప్రక్రియను అనుసరించాలి. మీ స్మాల్ PPI PhonePe వాలెట్‌ క్లోజర్‌లో భాగంగా నిధులు బదిలీ చేయాల్సిన మీ బ్యాంక్ అకౌంట్ మరియు/లేదా బ్యాక్ టు సోర్స్ ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించిన సంబంధిత సమాచారం/డాక్యుమెంట్ల కోసం (ఏవైనా KYC డాక్యుమెంట్లతో సహా) వాయిస్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి PhonePeకు అర్హత ఉంటుందని మీరు ఇందుమూలంగా అంగీకరించి, అర్థం చేసుకుంటున్నారు.
  • ఫుల్‌ KYC PPI

ఈ కేటగిరీ కింద జారీ అయిన ఫుల్‌ KYC PPI PhonePe వాలెట్లు రెండు రకాలు.

  • “ఫుల్‌ KYC వాలెట్”ను ఇక్కడ పేర్కొన్న ఫీచర్లు, పరిమితులతో పాటుగా MD-PPIs, 2021లోని పేరాగ్రాఫ్ 9.2 ప్రకారం నిర్వహిస్తారు.
  • నాన్-ఫేస్-టు-ఫేస్ ఆధార్ OTP ఆధారిత ఫుల్‌ KYC వాలెట్‌ (“e-KYC PPI”)ను ఇక్కడ పేర్కొన్న ఫీచర్లు, పరిమితులతో పాటుగా జూన్ 12, 2025న అప్‌డేట్‌ అయిన MD-KYCలోని పేరాగ్రాఫ్ 17 ప్రకారం నిర్వహిస్తారు.
  • PhonePe అనుమతించిన విధంగా, మీరు PhonePeలో స్మాల్ PPI లేదా ఫుల్‌ KYC PPI లేదా e-KYC PPIని ఓపెన్‌ చేయడాన్ని ఎంచుకోవచ్చు. మీకు అప్పటికే స్మాల్ PPI ఉంటే, మీ అభీష్టానుసారం, అలానే PhonePe అనుమతి మేరకు, PhonePe నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అందించి మీ స్మాల్ PPI PhonePe వాలెట్‌ను e-KYC PPI లేదా ఫుల్‌ KYC వాలెట్ గా మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
  • ఫుల్‌ KYC వాలెట్:

మీరు ఫుల్‌ KYC వాలెట్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు కావచ్చు, లేదా మీ ప్రస్తుత స్మాల్ PPI లేదా e-KYC PPIని ఫుల్‌ KYC వాలెట్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు, అయితే దీనికి మీరు కింది నియమాలకు కట్టుబడి ఉండాలని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:

  • ఈ PhonePe వాలెట్‌ను పొందడానికి, మీకు భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు జారీ చేసిన యాక్టివ్ మొబైల్ నంబర్‌ ఉండాలి, అలానే చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్, PAN ఉండాలి, ఇంకా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయిన KYC మార్గదర్శకాలు, రెగ్యులేటరీ ఆదేశాల ఆధారంగా PhonePe నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం KYC ప్రక్రియను చేయించుకోవాలి.
  • KYCకి కావాల్సిన అంశాలను రెగ్యులేటర్(లు) నిర్దేశిస్తుంది, అలానే అవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి, వీటిలో రెగ్యులేటర్ అనుమతించిన వివిధ సోర్స్‌ల నుండి మీ KYC డేటాను పొందడం ఉండవచ్చు. అటువంటి సందర్భంలో, ఆ డేటాను పొందడానికి మీరు PhonePeకు అధికారం ఇవ్వాలి, అలానే మీ KYC సర్వీస్ ప్రొవైడర్ నియమ, నిబంధనలకు, వారి డేటా షేరింగ్ నియమాలకు అంగీకారం తెలపాలి. ఉదాహరణకు, KYC ప్రక్రియలో భాగంగా e-KYC ప్రక్రియ లేదా UIDAI ఆఫ్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా, అలానే KYC కోసం మేము అలాంటి నియమాలను ఎనేబుల్ చేయడానికి లోబడి, ఏదైనా ఇతర అభివృద్ధి చెందుతున్న, అనుమతించదగిన సోర్స్ ద్వారా మీ KYC డాక్యుమెంట్లను మాకు పంపడానికి మిమ్మల్ని మేము ఎనేబుల్ చేయవచ్చు.
  • PhonePe ఎప్పటికప్పుడు అనుమతించిన విధంగా, కింది ప్రక్రియను అనుసరించి, ఫుల్‌ KYC PPI PhonePe వాలెట్‌ను ఓపెన్‌ చేయడానికి లేదా అప్‌గ్రేడ్ చేయడానికి మీరు అర్హత పొందుతారు:
  • మీ ఆధార్ & PAN వెరిఫికేషన్: మీ ఆధార్ & PAN వెరిఫికేషన్‌లను (“ఆధార్‌-PAN వెరిఫికేషన్‌”) పూర్తి చేయండి. ఆధార్-PAN వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, అవసరమైన మేరకు మీ అదనపు వ్యక్తిగత వివరాలను అందించాల్సి ఉంటుంది.
  • వీడియో వెరిఫికేషన్: ఫుల్‌ KYC ప్రక్రియను పూర్తి చేయడంలోని రెండవ దశలో భాగంగా, మీరు వీడియో వెరిఫికేషన్‌ చేయించుకోవాలి, ఇందులో మీకు, PhonePe ప్రతినిధికి మధ్య వీడియో కాల్ ఉంటుంది. ఈ వీడియో వెరిఫికేషన్ కాల్‌లో, మీరు కొన్ని వివరాలను తెలపాలి, అలానే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. వీడియో కాల్ సమయంలో, ఏదైనా కాల్ డ్రాప్ / డిస్‌కనెక్షన్ జరిగితే, కొత్త వీడియో సెషన్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. దయచేసి మీ ఆధార్-PAN వెరిఫికేషన్ పూర్తయిన 3 పని దినాల్లోపు ఈ వీడియో వెరిఫికేషన్‌ను మీరు పూర్తి చేసేలా చూసుకోండి. అలా చేయలేకపోతే, KYC మార్గదర్శకాల ప్రకారం మీరు KYC ప్రక్రియను మళ్ళీ చేయాల్సి ఉంటుంది.
  • KYC ప్రక్రియలో భాగంగా అవసరమైన మీ KYC డాక్యుమెంట్లు, సమాచారాన్ని అందించినంత మాత్రాన మీరు ఫుల్‌ KYC PPIని పొందేందుకు అర్హత సాధించకపోవచ్చు, ఎందుకంటే మీకు ఫుల్‌ KYC PPIని జారీ చేయడానికి ముందు మీరు అందించిన డేటాను KYC మార్గదర్శకాలు, PhonePe పాలసీల ప్రకారం వ్యాలిడేట్‌ చేసి, సమీక్షించడమవుతుంది. పైన పేర్కొన్న విధంగా KYC ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ కేటగిరీ కింద PhonePe వాలెట్‌ జారీ అవుతుంది.
  • మీ ఫుల్‌ KYC PPIని రీలోడ్‌ చేసుకోవచ్చు, అయితే ఇది ఎలక్ట్రానిక్ రూపంలో జారీ అవుతుంది. PhonePe అందుబాటులో ఉంచే ఆప్షన్లను ఉపయోగించి లోడ్ చేసేందుకు అనుమతి ఉంటుంది, ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ , డెబిట్/క్రెడిట్ కార్డ్, అలానే రెగ్యులేటర్ ఎప్పటికప్పుడు అనుమతించిన, PhonePe అంతర్గత పాలసీల ప్రకారం ఇతర ఇన్‌స్ట్రుమెంట్‌లు ఉంటాయి. ఫుల్‌ KYC PPIల్లోకి నగదును లోడ్‌ చేయడానికి లేదా దాని నుండి నగదును విత్‌డ్రా చేయడానికి PhonePe సహకరించదు.
  • రెగ్యులేటరీ అనుమతించదగిన పరిమితులు లేదా మా అంతర్గత రిస్క్ పాలసీల ఆధారంగా వర్తించే ఏవైనా పరిమితులకు లోబడి మీరు ఫుల్‌ KYC PPIకి డబ్బును లోడ్ చేయగలుగుతారు. అయితే, మీ ఫుల్‌ KYC వాలెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ ఏ సమయంలోనైనా ₹2,00,000/- (రెండు లక్షల రూపాయలు) మించకూడదు. UPI లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్‌తో ఫుల్‌ KYC వాలెట్‌లోకి డబ్బును లోడ్ చేయవచ్చు. అలానే, PhonePe అప్లికేషన్‌లో లేదా PhonePe వాలెట్‌ ద్వారా మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లలో చేసిన మీ లావాదేవీల రద్దు, రిటర్న్‌ల వల్ల వచ్చే రీఫండ్స్ అనేవి మీ ఫుల్‌ KYC PPIకే తిరిగి ప్రాసెస్ అవుతాయి.
  • ఏదైనా మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను కొనుగోలు చేయడానికి ఫుల్‌ KYC PPIని ఉపయోగించవచ్చు. పేమెంట్ చేసే సమయంలో ఫుల్‌ KYC PPIని పేమెంట్ పద్ధతిగా ఎంచుకుని, దీన్ని ఉపయోగించవచ్చు.
  • PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీరు సంబంధిత లబ్ధిదారుని బ్యాంక్ అకౌంట్ వివరాలు, PPIల వివరాలు మొదలైనవాటిని అందించి, మీ ఫుల్‌ KYC PPI నుండి నిధుల బదిలీల కోసం లబ్ధిదారులను మీరు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోగలుగుతారు. అటువంటి ముందస్తుగా రిజిస్టర్ చేసిన లబ్ధిదారుల విషయంలో, నిధుల బదిలీ పరిమితి అనేది ఒక్కో లబ్ధిదారునికి నెలకు ₹2,00,000/- మించకూడదు. మీ రిస్క్ ప్రొఫైల్, ఇతర కార్యాచరణ రిస్క్‌లు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని, ఇక్కడ పేర్కొన్న పరిమితిలోపు నగదు పరిమితులను PhonePe సెట్ చేయవచ్చు. ఇతర అన్ని కేసుల్లో నిధుల బదిలీ పరిమితులు అనేవి ఒక్కో పంపినవారికి నెలకు ₹10,000/-కి పరిమితం అవుతుంది.
  • మర్చంట్ / మర్చంట్ ప్లాట్‌ఫామ్‌కు పేమెంట్ చేసేటప్పుడు మీకు అందుబాటులో ఉండే పేమెంట్ ఎంపికలలో ఫుల్‌ KYC PPI PhonePe వాలెట్‌ ఒకటి, ఫుల్‌ KYC PPIని ఉపయోగించి కొనుగోలు చేసిన ప్రోడక్ట్‌లకు మేము ఎటువంటి బాధ్యత వహించము, అలానే దానికి సంబంధించిన ఏదైనా లయబిలిటీని స్పష్టంగా నిరాకరించడమవుతుంది. యూజర్, కింది సందర్భాల్లో, నేరుగా తన PhonePe లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుండి కూడా పేమెంట్‌ చేయవచ్చు:
  • ఆర్డర్ విలువ అనేది ఫుల్‌ KYC PPIలో అందుబాటులో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువగా ఉంటే; లేదా
  • ఫుల్‌ KYC వాలెట్‌ను ఉపయోగించి యూజర్‌ చేసిన కొనుగోళ్ల (ఏవైనా ఉంటే) విషయంలో, అతని/ఆమె పరిమితిని మించిపోయినప్పుడు.
  • మీ ఫుల్‌ KYC PPIకి లాగిన్‌ చేయడానికి, అలానే యాక్సెస్ చేయడానికి మీరు మీ P-SSOని తప్పకుండా ఉపయోగించాలి. మీ PhonePe అకౌంట్‌ను మీరు యాక్సెస్ చేయడానికి అదనపు భద్రతా చర్యలను పూర్తి చేయాలని మేము కోరవచ్చు/వాటిని మేము అందించవచ్చు.
  • ఫుల్‌ KYC PPIలో మీరు చేయాలనుకుంటున్న లావాదేవీలపై పరిమితిని నిర్ణయించే ఎంపికను కూడా PhonePe మీకు ఇస్తుంది, మీరు ఏ సమయంలోనైనా మీ PhonePe యాప్‌కు లాగిన్‌ అయ్యి, దాన్ని మార్చుకోవచ్చు.
  • మీరు మీ బ్యాంక్ అకౌంట్ లను అప్‌డేట్ చేసేటప్పుడు, అలానే లబ్ధిదారులను యాడ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే PhonePe అకౌంట్ / PhonePe వాలెట్‌లో మీరు తప్పు వివరాలను సమర్పిస్తే, దానికి PhonePe బాధ్యత వహించదు. ఇక్కడ పేర్కొన్న ఫీచర్లు, పరిమితులు అనేవి PhonePe అంతర్గత రిస్క్ అసెస్‌మెంట్‌కు లోబడి ఉంటాయి, అలానే లోడ్‌ చేయగల అమౌంట్‌ & ఖర్చు పరిమితులను మేము తగ్గించవచ్చు, మీరు నిధులను తాజాగా లోడ్ చేసిన తర్వాత, మీ ఫుల్‌ KYC PPIపై కూలింగ్ పీరియడ్ అప్లై చేయవచ్చు, నిర్దిష్ట మర్చంట్‌ల వద్ద కొనుగోలు (నిర్దిష్ట మర్చంట్‌లకు పేమెంట్‌) చేయడాన్ని నియంత్రించవచ్చు, మీ ఫుల్‌ KYC PPIకి మీ యాక్సెస్‌ను నియంత్రించవచ్చు లేదా LEAలకు లేదా ఇతర రెగ్యులేటర్లు/అధికారులకు మీ అకౌంట్‌ గురించి నివేదించవచ్చు. పైన పేర్కొన్న చర్యను మేము మీకు తెలియజేయవచ్చు లేదా తెలియజేయకపోవచ్చు అని మీరు అర్థం చేసుకున్నారు. మా యూజర్లు, మర్చంట్ల కోసం మీ PhonePe వాలెట్‌ & ఎకోసిస్టమ్‌ను సురక్షితంగా ఉంచడానికి మేము నిర్వహించే ట్రాన్సాక్షనల్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఇది ఓ భాగం.
  • PPIని మీకు జారీ చేసినప్పుడుతో సహా, ముందస్తుగా నిర్ణయించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించడానికి మీకు ఒక ఎంపికను ఇవ్వడమవుతుంది. మీ ఫుల్ KYC PPIని క్లోజ్ చేసిన, అటువంటి PPIల గడువు ముగిసిన సందర్భాలలో ‘బ్యాక్ టు సోర్స్’ బదిలీ విఫలమైనప్పుడు, PPIలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఈ అకౌంట్ కు బదిలీ అవుతుంది.
  • మీ PhonePe యాప్‌లో అందుబాటులో ఉన్న అభ్యర్థనను పంపి లేదా PhonePe పేర్కొన్న ఏదైనా ఇతర ప్రక్రియను అనుసరించి, మీరు ఎప్పుడైనా మీ ఫుల్‌ KYC PPIని క్లోజ్‌ చేయవచ్చు. క్లోజ్‌ చేసే సమయంలో ఉన్న మిగిలిన బ్యాలెన్స్‌ (ఏదైనా ఉంటే) ‘బ్యాక్ టు సోర్స్’కు (అంటే ఫుల్‌ KYC PPIకి ఎక్కడి నుండి పేమెంట్‌ అయిందో అదే సోర్స్‌కు) బదిలీ అవుతుంది. ఏదైనా కారణం వల్ల స్టోర్ చేసిన వాల్యూని సోర్స్ అకౌంట్ కు తిరిగి బదిలీ చేయలేకపోతే, లేదా ముందస్తుగా నిర్ణయించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించకపోతే, మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో టికెట్​ను రైజ్ చేయాలి, అలానే PhonePe ప్లాట్‌ఫామ్‌లో వివరించిన ప్రక్రియను అనుసరించాలి. మీ ఫుల్‌ KYC PPI క్లోజర్‌లో (మూసివేతలో) భాగంగా నిధులు బదిలీ చేయాల్సిన మీ బ్యాంక్ అకౌంట్ మరియు/లేదా ‘బ్యాక్ టు సోర్స్’ ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించిన సంబంధిత సమాచారం/డాక్యుమెంట్ల కోసం (ఏవైనా KYC డాక్యుమెంట్లతో సహా) వాయిస్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి PhonePeకు అర్హత ఉంటుందని మీరు ఇందుమూలంగా అంగీకరించి, అర్థం చేసుకున్నారు.

నాన్-ఫేస్-టు-ఫేస్ ఆధార్ OTP ఆధారిత ఫుల్‌ KYC వాలెట్/ e-KYC PPI

ఇక్కడ పేర్కొన్న ఫీచర్లు, పరిమితులతో నాన్-ఫేస్-టు-ఫేస్ ఆధార్ OTP ఆధారిత ఫుల్‌ KYC వాలెట్‌ (“నాన్‌ F2F ఫుల్‌ KYC వాలెట్” లేదా “e-KYC PPI”) జారీ అవుతుంది. ఈ వాలెట్‌ నియమ, నిబంధనలకు లోబడి, PhonePe ఎప్పటికప్పుడు అనుమతించిన విధంగా మీరు e-KYC PPI కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు కావచ్చు. మీకు అప్పటికే స్మాల్ PPI ఉంటే, మీ అభీష్టానుసారం, PhonePe ఎప్పటికప్పుడు అనుమతించిన విధంగా, మీరు మీ స్మాల్ PPIని e-KYC PPIకి అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అప్లై  చేసుకోవచ్చు.

  • e-KYC PPI కోసం అప్లై చేయడానికి, లేదా మీ ప్రస్తుత స్మాల్ PPIని e-KYC PPIకి అప్‌గ్రేడ్ చేయడానికి, మీరు కింది నియమాలకు కట్టుబడి ఉండాలని అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:
  • మీకు భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు జారీ చేసిన యాక్టివ్ మొబైల్ నంబర్‌ ఉండాలి, అలానే e-KYC PPIని ఓపెన్ చేయడానికి అవసరమైన OTP అథెంటికేషన్ (ధృవీకరణ) కోసం మీరు మీ సమ్మతిని అందించాలి;
  • మీ PhonePe అకౌంట్ తో లింక్ అయిన మొబైల్ నంబర్, అలానే మీ ఆధార్ నంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఒక్కటేనని మీరు నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఆ మొబైల్ నంబర్లు ఒకటే కాకపోతే, మీ ఆధార్‌తో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు అవసరమైన చర్యలు తీసుకోవాలి, అలా చేయడంలో విఫలమైతే మీరు e-KYC PPIకి అప్లై చేసుకోవడానికి అర్హులు కారు;
  • మీకు ఇప్పటికే CKYC ఐడి ఉంటే, CKYCRలో మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ మొబైల్ నంబర్ ఒకేలా లేని పక్షంలో, CKYCRతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి అవసరమైన చర్యలను మీరు తీసుకోవాలి, అలా చేయలేకపోతే మీరు e-KYC PPIకి అప్లై  చేసుకోవడానికి అర్హులు కారు;
  • మీరు KYC మార్గదర్శకాలు, అలానే రెగ్యులేటరీ ఆదేశాల ఆధారంగా PhonePe నిర్వచించిన ప్రక్రియ ప్రకారం KYC ప్రక్రియను చేయాలి; ఇంకా 
  • e-KYC PPIకి అప్లై చేసే సమయంలో, మీరు నాన్-ఫేస్-టు-ఫేస్ OTP ఆధారిత eKYC అథెంటికేషన్‌ను ఉపయోగించి మరే ఇతర ఎంటిటీతోనూ అకౌంట్‌ను ఓపెన్ చేయలేదని, అలానే మరొక ఎంటిటీతో e-KYC PPIని ఓపెన్ చేయరని మీరు నిర్ధారించాలి.
  • e-KYC PPIకి KYCని పూర్తి చేయడానికి కావాల్సిన అంశాలను RBI నిర్వచిస్తుంది, అలానే ఎప్పటికప్పుడు అవి అప్‌డేట్ అవుతాయి, ఇంకా రెగ్యులేటరీ ఆదేశాల ఆధారంగా PhonePe నిర్వచించిన ‘ఆధార్ OTP ఆధారిత KYC’కి అవసరమైన ప్రక్రియను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • మీ e-KYC PPIకి లోడింగ్ పరిమితులు వర్తిస్తాయి, మొత్తం బ్యాలెన్స్ ₹1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) మాత్రమే ఉండాలి. పైన పేర్కొన్న వాటితో పాటు, ఒక ఆర్థిక సంవత్సరంలో మీ e-KYC PPIకి అయ్యే మొత్తం క్రెడిట్‌లపై ₹2,00,000 (రెండు లక్షల రూపాయలు మాత్రమే) పరిమితిని విధించడమైంది. మీరు మీ PhonePe వాలెట్‌పై విధించిన పరిమితులను పెంచుకోవాలనుకుంటే, పైన సూచించిన విధంగా ఫుల్‌ KYC PPIకి అప్లై  చేయడానికి అవసరమైన దశలను మీరు పూర్తి చేయాలి.
  • PhonePe ప్లాట్‌ఫామ్‌లో సంబంధిత లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ వివరాలు, PPIల వివరాలు మొదలైనవాటిని అందించి, మీ e-KYC PPI నుండి నిధుల బదిలీల కోసం మీరు లబ్ధిదారులను ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ముందస్తుగా రిజిస్టర్ చేసిన ఆయా లబ్ధిదారుల విషయంలో, నిధుల బదిలీ పరిమితి అనేది ఒక్కో లబ్ధిదారునికి నెలకు ₹2,00,000/- (e-KYC PPIపై ఉన్న మొత్తం పరిమితులకు లోబడి) మించకూడదు. మీ రిస్క్ ప్రొఫైల్, ఇతర కార్యాచరణ రిస్క్‌లు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని, ఈ గరిష్ఠ పరిమితి లోపే PhonePe పరిమితులను సెట్ చేయవచ్చు. ఇతర సందర్భాలు అన్నింటికీ నిధుల బదిలీ పరిమితులు అనేవి నెలకు ₹10,000/-కి పరిమితం అయ్యాయి.
  • PPI జారీ చేసే సమయంతో సహా, ముందస్తుగా నిర్ణయించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించడానికి మీకు ఒక ఆప్షన్ ఇవ్వడమవుతుంది. PPIని క్లోజ్ చేసిన సందర్భంలో, ‘బ్యాక్ టు సోర్స్’ బదిలీ విఫలమైనప్పుడు, PPIలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఈ అకౌంట్ కు బదిలీ అవుతుంది.
  • మీ e-KYC PPI జారీ చేసిన తేదీ నుండి గరిష్టంగా 365 రోజుల పాటు మీ e-KYC PPI చెల్లుబాటు అవుతుంది. ఆ కాలవ్యవధిలో, ఈ వాలెట్‌ వినియోగ నియమాల కింద పేర్కొన్న విధంగా వీడియో KYC మొదలైనవాటిని పూర్తి చేయడంతో సహా, అవసరమైన చర్యలను పూర్తి చేసి, మీరు ఫుల్‌ KYC PPIకి అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
  • e-KYC PPI జారీ చేసిన తేదీ నుండి 365 రోజుల్లోపు మీ e-KYC PPIని ఫుల్‌ KYC PPIకి అప్‌గ్రేడ్ చేయడానికి అవసరమైన చర్యలను పూర్తి చేయడంలో మీరు విఫలమైతే లేదా మీరు మీ e-KYC PPIని క్లోజ్ చేయాలని ఎంచుకుంటే, మీ e-KYC PPI వెంటనే క్లోజ్ అవుతుంది, అలానే  క్లోజ్ చేసే సమయంలో ఏదైనా మిగిలిన బ్యాలెన్స్‌ ఉంటే అది ‘బ్యాక్ టు సోర్స్’కు (అంటే e-KYC PPIకి ఎక్కడి నుండి అమౌంట్ లోడ్ అయిందో, ఆ పేమెంట్ సోర్స్‌కు) లేదా మీరు ముందుగా నిర్ణయించిన అకౌంట్ ను అందిస్తే, దానికి బదిలీ అవుతుంది. ఏదైనా కారణం వల్ల స్టోర్డ్ వాల్యూను సోర్స్అకౌంట్ కు తిరిగి బదిలీ చేయలేకపోతే, లేదా ముందస్తుగా నిర్ణయించిన అకౌంట్ వివరాలు అందుబాటులో లేకపోతే, మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో టికెట్ ను రైజ్ చేయాలి, అలానే PhonePe ప్లాట్‌ఫామ్‌లో వివరించిన ప్రక్రియను అనుసరించాలి. మీ e-KYC PPI క్లోజర్‌లో భాగంగా నిధులు బదిలీ చేయాల్సిన మీ బ్యాంక్ అకౌంట్ మరియు/లేదా ‘బ్యాక్ టు సోర్స్’ ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించిన సంబంధిత సమాచారం/డాక్యుమెంట్ల కోసం (ఏవైనా KYC డాక్యుమెంట్లతో సహా) వాయిస్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి PhonePeకు అర్హత ఉంటుందని మీరు ఇందుమూలంగా అంగీకరించి, అర్థం చేసుకున్నారు.
  • ఇక్కడ పేర్కొన్న ఫీచర్లు, పరిమితులు అనేవి PhonePe అంతర్గత రిస్క్ అసెస్‌మెంట్‌కు లోబడి ఉంటాయి, అలానే లోడ్ చేయగల అమౌంట్‌, ఖర్చు పరిమితులను మేము తగ్గించవచ్చు, మీరు నిధులను తాజాగా లోడ్ చేసిన తర్వాత మీ e-KYC PPIపై కూలింగ్ పీరియడ్‌ను అప్లై చేయవచ్చు, అలానే నిర్దిష్ట మర్చంట్ల నుండి కొనుగోలు చేయడాన్ని (వారికి పేమెంట్లు చేయడాన్ని) నియంత్రించవచ్చు, స్మాల్ PPIని మీరు యాక్సెస్ చేయడాన్ని మేము నియంత్రించవచ్చు లేదా LEAలకు లేదా ఇతర ప్రభుత్వ అధికారులకు మీ అకౌంట్‌ గురించి నివేదించవచ్చు. పైన పేర్కొన్న చర్యను మేము మీకు తెలియజేయవచ్చు లేదా తెలియజేయకపోవచ్చు అని మీరు అర్థం చేసుకున్నారు. మా యూజర్లు, మర్చంట్ల కోసం మీ PhonePe వాలెట్లు, ఎకోసిస్టమ్‌ను సురక్షితంగా ఉంచడానికి మేము నిర్వహించే ట్రాన్సాక్షనల్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఇది ఓ భాగం.

వర్తించే మేరకు, మీరు e-KYC PPI లేదా ఫుల్‌ KYC PPIకి అప్లై చేయడం / దాన్ని వినియోగించడం ద్వారా, ఒప్పందంలో పేర్కొన్న అన్ని KYC సంబంధిత నియమ & నిబంధనలకు కట్టుబడి ఉండటానికి మీరు ఇందుమూలంగా మీ సమ్మతిని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా MD-PPIs, 2021, KYC ఆదేశాలు, అలానే PhonePe అంతర్గత పాలసీల ప్రకారం PhonePe వాలెట్‌ సర్వీస్‌లకు సంబంధించి మీ గుర్తింపు వెరిఫికేషన్‌ ప్రయోజనాల కోసం KYCని పూర్తి చేయడానికి అవసరమైన డ్యూ డిలిజెన్స్ చర్యలను నిర్వహించడానికి PhonePeకు సమ్మతిని తెలియజేస్తున్నారు. దానికి అనుగుణంగా, మీరు కింది వాటిని అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:

  • PhonePe వాలెట్‌కు మీరు చేసుకున్న అప్లికేషన్ మరియు/లేదా వినియోగానికి సంబంధించి గుర్తింపు వెరిఫికేషన్‌ కోసం మీరు ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని PhonePeకు స్వచ్ఛందంగా, అలానే  మీ సొంత అభీష్టానుసారం సమర్పిస్తున్నారు. అటువంటి సమాచారంలో మీ పేరు, చిరునామా, తండ్రి/తల్లి/జీవిత భాగస్వామి పేరు, మీకు జారీ అయిన PAN, ఆధార్ నంబర్ / ఆధార్ VID వంటి ఏదైనా అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు మరియు / లేదా CKYC నంబర్, అలానే PhonePe వాలెట్‌కు మీరు చేసుకున్న అప్లికేషన్ మరియు/లేదా వినియోగానికి సంబంధించి PhonePeకు అవసరమైన ఇతర డాక్యుమెంట్లు, సమాచారం ఉండవచ్చని మీరు అర్థం చేసుకున్నారు.
  • మీ రిజిస్టర్డ్ ఆధార్/PAN వివరాలు మొదలైన వాటితో సహా, సమాచారంలో ఏవైనా మార్పులు ఉంటే, అటువంటి మార్పులను మీరు (మార్పు జరిగిన 30 రోజులలోపు), యాప్‌లోని సహాయ విభాగం ద్వారా మా కస్టమర్ సహాయ విభాగ బృందాన్ని సంప్రదించి లేదా 080-68727374 / 022-68727374కు కాల్ చేసి, ఇన్‌బౌండ్ సహాయ విభాగ బృందంతో మాట్లాడి, రాతపూర్వకంగా PhonePeకు వెంటనే అప్‌డేట్ ఇవ్వాలి.
  • అథెంటికేషన్ కోసం, అలానే మీకు PhonePe వాలెట్‌ సర్వీస్‌లను అందించడం కోసం మీరు PhonePeకు పంపిన వివరాల ఆధారంగా, UIDAI మరియు/లేదా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) నుండి మీ గుర్తింపు, డెమోగ్రాఫిక్ వివరాలను (మీ కస్టమర్‌ను తెలుసుకోండి, అంటే KYC వివరాలు) సేకరించడానికి/పొందడానికి/తీసుకోవడానికి, అలానే వెరిఫై చేయడానికి/చెక్ చేయడానికి మీరు PhonePeకు అధికారం ఇస్తున్నారని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. దాని కోసం, మీరు కింది వాటికి మీ సమ్మతిని తెలుపుతున్నారు:
  • PhonePe వాలెట్‌ సర్వీస్‌లకు సంబంధించి కేవలం గుర్తింపు వెరిఫికేషన్ కోసం మాత్రమే, PhonePe లేదా ఏదైనా అనుమతించిన ఏజెన్సీ/ అథారిటీ ద్వారా ఆధార్ అథెంటికేషన్ కోసం UIDAIకు, అలానే PAN వెరిఫికేషన్ కోసం NSDLకు మీ వివరాలను తెలపడం;
  • PhonePe ద్వారా UIDAI నుండి మీ గుర్తింపు, డెమోగ్రాఫిక్ సమాచారాన్ని సేకరించడం; 
  • వర్తించే చట్టాల ప్రకారం సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా(“CERSAI”)తో సహా ఏదైనా ఇతర రెగ్యులేటరీ అథారిటీకి మీ అథెంటికేషన్ స్టేటస్‌ / గుర్తింపు / డెమోగ్రాఫిక్ సమాచారాన్ని సమర్పించడం;
  • CKYCR డేటాబేస్ నుండి మీ గుర్తింపు, చిరునామా వెరిఫికేషన్ ప్రయోజనం కోసం, సెంట్రల్ KYC రిజిస్ట్రీ (“CKYCR”) నుండి మీ KYC రికార్డులను డౌన్‌లోడ్ చేయడం;
  • మీ KYC రికార్డులను వ్యాలిడేట్‌ చేసి, CKYCRలో మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయడం.
  • UIDAI / దాని ద్వారా అధికారం పొందిన ఏదైనా ఏజెన్సీ మరియు/లేదా PhonePe నుండి మీ రిజిస్టర్డ్ నంబర్/ఇమెయిల్ అడ్రస్‌కు SMS/ఇమెయిల్‌ను పొందడం.
  • తప్పనిసరిగా ఆధార్-PAN వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి కావాల్సిన వివరాలతో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, మీరు చేసుకున్న అప్లికేషన్‌కు సంబంధించి PhonePeకు కావాల్సిన రూపం, పద్ధతిలో మీరు ఏదైనా/అన్ని డాక్యుమెంట్లను, అలానే సమాచారాన్ని పంపుతారు/సమర్పిస్తారు.
  • మీరు స్వచ్ఛందంగా, అలానే మీ సొంత అభీష్టానుసారం మీ సమ్మతిని అందిస్తున్నారని, ఇంకా UIDAI మార్గదర్శకాల కింద లేదా ఎప్పటికప్పుడు సవరించే ఏదైనా వర్తించే చట్టం కింద మీ గుర్తింపును ఎస్టాబ్లిష్ చేయడానికి (నిరూపించడానికి), అలానే అథెంటికేషన్ ప్రయోజనం కోసం మీ ఆధార్ సమాచారాన్ని PhonePe, UIDAIకి పంపడానికి నిర్ణయించుకుంటున్నారని మీరు నిర్ధారిస్తున్నారు. ఈ ప్రయోజనం నిమిత్తమే PhonePe, UIDAIకు మీ ఆధార్ నంబర్ / VIDని పంపడానికి ఎంచుకోవడం ద్వారా ఆధార్ నియమాలు మీకు వర్తిస్తాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు, అలానే సమ్మతిస్తున్నారు. ఒకవేళ మీరు ఆధార్ నియమాలును అంగీకరించకపోతే, లేదా వాటికి కట్టుబడి ఉండాలని అనుకోకపోతే, మీరు మీ ఆధార్ నంబర్ / VIDని పంపకూడదని ఎంచుకోవచ్చు, అలానే వర్తించే మేరకు తక్కువ పరిమితులతో PhonePe వాలెట్‌ను ఓపెన్ చేయవచ్చు / ఉపయోగించవచ్చు.
  • PhonePe నుండి PhonePe వాలెట్‌ సర్వీస్‌లను పొందడం కోసం, వర్తించే చట్టం ప్రకారం అనుమతించిన విధంగా, మీ ఆధార్ వివరాలను KYC డాక్యుమెంటేషన్, ఆధార్-PAN వెరిఫికేషన్, అలానే డ్యూ డిలిజెన్స్ కోసం ఉపయోగించడమవుతుంది.
  • మీరు ఆధార్-PAN వెరిఫికేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి, అలానే UIDAI ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలి.
  • ఏవైనా రెగ్యులేటరీ బాడీలు/ జ్యుడీషియల్ లేదా క్వాజీ-జ్యుడీషియల్ బాడీలు / ఆడిటర్లు/ LEA/ మీడియేటర్లు లేదా ఆర్బిట్రేటర్‌లకు సమర్పించడంతో సహా, సాక్ష్యంగా ఉపయోగించుకునే ప్రయోజనాల నిమిత్తం ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ రికార్డుతో సహా, మీ రికార్డులు/సమాచారంలో దేన్నైనా PhonePe ఉపయోగించవచ్చని మీరు అర్థం చేసుకుని, నిర్ధారిస్తున్నారు, అలానే దీనికి మీరు ఇందుమూలంగా మీ సమ్మతిని అందిస్తున్నారు.
  • ఒకవేళ మీరు మీ KYC డాక్యుమెంట్లకు సంబంధించిన మీ సమ్మతిని ఉపసంహరించుకోవాలని అనుకుంటే, మీరు యాప్‌లోని సహాయ విభాగం ద్వారా మా కస్టమర్ సహాయ విభాగ బృందాన్ని సంప్రదించవచ్చు లేదా 080-68727374 / 022-68727374కు కాల్ చేసి ఇన్‌బౌండ్ సహాయ విభాగ బృందంతో మాట్లాడవచ్చు, అలానే సమ్మతిని ఉపసంహరించే, ఇంకా మీ PhonePe వాలెట్‌‌ను క్లోజ్ చేసే ప్రక్రియను ప్రారంభించవచ్చు. RBI నియంత్రణలో ఉన్న ఎంటిటీగా, చట్టబద్ధమైన నిలుపుదల గడువుల ప్రకారం కస్టమర్ డేటా రికార్డులను PhonePe తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉందని మీరు మరింతగా అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు, అలానే  సమ్మతిస్తున్నారు.
  • ఏదైనా KYC డాక్యుమెంట్ లేదా UIDAI / NSDL/ దాని అధీకృత ఏజెన్సీల ద్వారా PhonePe పొందిన వివరాలతో సహా, మీరు అందించిన వివరాలు సరిపోలకపోతే లేదా వాటి మధ్య ఏవైనా వ్యత్యాసాలు గమనించినట్లయితే, మీకు సర్వీస్‌లను అందించడానికి లేదా కొనసాగించడానికి PhonePe బాధ్యత వహించదు, అలానే మీ అప్లికేషన్‌ను తిరస్కరించడానికి, లేదా మీ అకౌంట్ / సర్వీస్‌లను నిలిపివేయడానికి/ నియంత్రించడానికి లేదా తన సొంత అభీష్టానుసారం తగినదిగా భావించే ఇతర చర్యను తీసుకోవడానికి ఎంచుకోవచ్చు.
  • ఏవైనా కారణాల వల్ల మీ ఆధార్-PAN వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే, దానికి PhonePeను ఏ విధంగానూ బాధ్యులను చేయకూడదు, ఏ రూపంలోనూ బాధ్యత వహించదు. అటువంటి ఆధార్-PAN వెరిఫికేషన్/ ఫుల్‌ KYC ప్రక్రియను PhonePe సంతృప్తి చెందేలా పూర్తి చేసే వరకు మీకు PhonePe వాలెట్‌ సర్వీస్‌లను అందించడానికి PhonePe బాధ్యత వహించదు.
  • ఏవైనా కారణాల వల్ల (టెక్నికల్, సిస్టమాటిక్ లేదా సర్వర్ ఎర్రర్లు/సమస్యలు, లేదా ఆధార్-PAN వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టేటప్పుడు తలెత్తిన ఏదైనా ఇతర సమస్యతో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా) మీకు సంభవించే ఏదైనా నష్టం, డ్యామేజ్‌కు సంబంధించి, మీరు లేదా మీ తరపున ఎవరైనా సలహా ఇచ్చినప్పటికీ, PhonePe ఎటువంటి బాధ్యత తీసుకోదు లేదా ఎటువంటి హామీని ఇవ్వదు.
  • ఈ ఆధార్-PAN వెరిఫికేషన్ అథెంటికేషన్ ప్రక్రియకు సంబంధించి, UIDAI నుండి సహా, మీ నుండి లేదా మీ తరపున వేరే వారి నుండి మాకు అందిన మీకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారం అన్ని రకాలుగా (మీ ప్రస్తుత చిరునామాతో సహా) మీ గురించిన నిజమైన, సరైన, తాజా సమాచారాన్ని ప్రతిబింబిస్తాయి, అలానే ఆధార్ అథెంటికేషన్ నిర్వహించడం కోసం PhonePe / UIDAI / దాని అధీకృత ఏజెన్సీలకు కావాల్సిన ఏ కీలకమైన సమాచారాన్ని మీరు దాచిపెట్టలేదని నిర్ధారిస్తున్నారు.
  • ఏదైనా KYC డాక్యుమెంట్‌తో సహా, మీరు అందించిన ఏవైనా వివరాలు అనేవి UIDAI / NSDL / CERSAI / అధీకృత ఏజెన్సీల ద్వారా PhonePe పొందిన ఏవైనా వివరాలతో సరిపోలకపోతే, లేదా వాటి మధ్య ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయని PhonePe గమనించినట్లయితే, మీకు ఏవైనా సర్వీస్‌లను అందించడానికి లేదా కొనసాగించడానికి PhonePe బాధ్యత వహించదు, అలానే PhonePe వాలెట్‌ కోసం మీరు చేసుకున్న అప్లికేషన్‌ను తిరస్కరించడానికి, లేదా మీ PhonePe అకౌంట్ / సర్వీస్‌లను నిలిపివేయడానికి/ నియంత్రించడానికి లేదా తన సొంత అభీష్టానుసారం తగినదిగా భావించే ఇతర చర్యను తీసుకోవడానికి నిర్ణయించుకోవచ్చని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
  • మొత్తం వీడియో KYC ప్రక్రియకు సంబంధించిన వీడియో, ఆడియో, మీ జియోలొకేషన్‌ను, KYC ప్రక్రియ సమయంలో మేము సేకరించే ఇతర వివరాలతో పాటుగా రికార్డ్ చేసి, స్టోర్ చేయడానికి మీరు PhonePeకు మీ సమ్మతిని అందిస్తున్నారు. ప్రైవసీ పాలసీ ప్రకారం, అలానే KYC ఆదేశాలు, PMLA కింద అవసరమైన అంశాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి PhonePe అటువంటి సమాచారాన్ని ఇతర PhonePe ఎంటిటీలకు పంపవచ్చని మీరు అర్థం చేసుకుని, దీనికి అంగీకారం తెలుపుతున్నారు.
  • మీరు భౌతికంగా భారతదేశంలో ఉన్నారని, KYC ఆదేశాలు ప్రకారం PhonePe మిమ్మల్ని ఖచ్చితంగా, ఎలాంటి అనుమానాలు లేకుండా గుర్తించడానికి వీలు కల్పించే లైవ్ ఆడియో-వీడియో కాల్‌లో పాల్గొనడానికి సరిపోయే నాణ్యమైన, నిలకడగా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్నారని మీరు నిర్ధారిస్తున్నారు.
  • మీరు వీడియో కాల్‌లోని ఏ భాగాన్ని రికార్డ్ చేయకూడదు మరియు/లేదా ఏ రూపంలోనూ ఉపయోగించకూడదు. మీరు PhonePe మరియు/లేదా దాని ప్రతినిధులతో అసభ్యంగా ప్రవర్తించడం, ఏ రూపంలోనూ దుర్భాషలాడటం వంటి చర్యలకు పాల్పడకూడదు, అలా చేస్తే, మేము మీపై తగిన చర్య తీసుకోవచ్చు.
  • వీడియో కాల్‌కు మీరు మాత్రమే హాజరు కావాలి. వీడియో కాల్‌లో PhonePe ప్రతినిధి అడిగే తప్పనిసరి ప్రశ్నలకు, ఎవరి ప్రోద్బలం లేకుండా, మీరు నిజాయితీగా, ఇంకా సరైన రీతిలో సమాధానం ఇవ్వాలి.
  • తక్కువ బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్ ఉన్న/అవాంతరాలు లేని, మంచి లైటింగ్ ఉన్న వాతావరణంలో మీరు ఉండాలి. వీడియో కాల్ స్పష్టంగా లేదని, మోసపూరితమైనదని, అస్పష్టంగా ఉందని, అస్థిరంగా ఉందని, అనుమానాస్పదంగా ఉందని PhonePe భావించినట్లయితే మరియు/లేదా ఏవైనా కారణాల వల్ల దానితో సంతృప్తి చెందకపోతే తన సొంత అభీష్టానుసారం KYCని PhonePe తిరస్కరించవచ్చు.
  • PhonePe తన సొంత అభీష్టానుసారం, అవసరమైన మేరకు అదనపు సమాచారం/డాక్యుమెంట్లను మరియు/లేదా మరొక వీడియో కాల్‌కు హాజరు కావాలని మిమ్మల్ని అడగవచ్చు.
  • KYC డాక్యుమెంట్లు మరియు/లేదా KYCని అంగీకరించడం / తిరస్కరించడం అనేది వెరిఫికేషన్ ప్రక్రియకు, అలానే మీరు అందించిన సమాచారానికి లోబడి, PhonePe అభీష్టానుసారం ఉంటుంది.

సెంట్రల్ KYC (CKYC): వర్తించే RBI మార్గదర్శకాలు, ఇతర వర్తించే చట్టాలకు అనుగుణంగా, CKYCR డేటాబేస్ నుండి మీ గుర్తింపును, చిరునామాను వెరిఫై చేసే ఉద్దేశం కోసం మాత్రమే, CKYCRలోని మీ KYC రికార్డులను డౌన్‌లోడ్ చేయడానికి, వ్యాలిడేట్‌ చేయడానికి మరియు / లేదా అప్‌డేట్ చేయడానికి (వర్తించే విధంగా) వీలుగా మీ సమాచారాన్ని CERSAIకి సమర్పించేందుకు మీరు PhonePeకు మీ సమ్మతిని అందిస్తున్నారు. మీరు PhonePeతో మీ KYCని పూర్తి చేసినప్పుడు/ అప్‌డేట్ చేసినప్పుడు, PhonePe మీ KYC రికార్డులను CKYCRలోని CERSAI (సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా)కి తప్పకుండా సమర్పిస్తుంది. ఒకసారి రిజిస్ట్రీ నుండి CKYCR ఐడి జనరేట్ అయిన తర్వాత, మేము తగినదని భావించే ఏదైనా కమ్యూనికేషన్ పద్ధతి ద్వారా, అంటే SMS లేదా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతిలో దాన్ని మీకు తెలియజేస్తాము. వ్యాలిడేషన్‌ కోసం CKYCRలో ఉన్న మీ ప్రస్తుత KYC రికార్డులను కూడా PhonePe తీసుకొస్తుంది. ఇంకా, PhonePeకు మీరు అందించిన KYC వివరాలను CERSAI వద్ద అందుబాటులో ఉన్న రికార్డులతో అప్‌డేట్ చేస్తే, CERSAI వద్ద ఉన్న మీ వివరాలు PhonePeకు మీరు అందించిన వివరాలతో అప్‌డేట్ చేసినట్లుగా భావించడమవుతుంది.

స్టేటస్: మీ ఫుల్‌ KYC స్టేటస్‌ను చెక్‌ చేయడం కోసం, PhonePe ప్లాట్‌ఫామ్‌కు లాగిన్ అయ్యి, వాలెట్‌ పేజీని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ VKYC ఆమోదం పొందినట్లయితే, అది PhonePe వాలెట్‌ అప్‌గ్రేడ్ అయినట్లుగా చూపుతుంది.

ఛార్జీలు: ఏదైనా KYCని నిర్వహించడం కోసం, యూజర్ల నుండి PhonePe ఎలాంటి ఛార్జీని వసూలు చేయదు.

పైన పేర్కొన్న e-KYC అథెంటికేషన్ ప్రక్రియ అనేది ఎప్పటికప్పుడు సవరించిన KYC ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందని దయచేసి గమనించండి. PhonePe వినియోగ నియమాలపై ఏవైనా తదుపరి వివరాలు కావాలన్నా లేదా సందేహాలున్నా, మీరు యాప్ సహాయ విభాగం ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా 080-68727374 / 022-68727374కు కాల్ చేసి, ఇన్‌బౌండ్ సహాయ విభాగ బృందంతో మాట్లాడవచ్చు.

వాలెట్‌ ఇంటర్‌ఆపరేబిలిటీ: మీరు మీ ఫుల్‌ KYC/ e-KYCని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, మీ ఫుల్‌ KYC/e-KYC వాలెట్‌కు సంబంధించి ఒక హ్యాండిల్‌ను క్రియేట్ చేసి, లింక్ చేయవచ్చు, దీన్ని ఉపయోగించి మీరు UPI రైల్స్‌పై మర్చంట్ పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్స్, అలానే RBI అనుమతించిన ఇతర లావాదేవీల వంటి వాలెట్‌ ఇంటర్‌ఆపరేబుల్ లావాదేవీలను చేపట్టవచ్చు. PhonePe తన అభీష్టానుసారం, అటువంటి వాలెట్‌ వినియోగానికి సంబంధించి లావాదేవీ పరిమితులు/ కూల్ ఆఫ్ పీరియడ్‌లు మొదలైనవి సహా, ఏవైనా ఆంక్షలు/ నిషేధాలను కూడా విధించవచ్చు, అయితే ఇవి మేము తగినవని భావించిన మేరకు మరియు/లేదా మా రిస్క్ అసెస్‌మెంట్ ప్రకారం ఉంటాయి. వాలెట్‌ ఇంటర్‌ఆపరేబిలిటీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ ప్రచురించిన FAQలలో కూడా మీరు చూడవచ్చు.

గిఫ్ట్‌ PPI/eGV

arrow icon
  • ఈ కేటగిరీ కింద PhonePe జారీ చేసిన నాన్-రీలోడబుల్ గిఫ్ట్ ఇన్‌స్ట్రుమెంట్ (“eGV”) నిర్వహణ అనేది ఇక్కడ పేర్కొన్న ఫీచర్లు, అలానే పరిమితులతో పాటుగా MD-PPIs, 2021లోని పేరాగ్రాఫ్ 10.1 ప్రకారం జరుగుతుంది. PhonePe యూజర్‌గా, మీరు PhonePe యాప్ నుండి eGVలను కొనుగోలు చేయవచ్చు/గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు లేదా eGVని గిఫ్ట్‌గా పొందవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా, మా సొంత అభీష్టానుసారం మేము మీకు eGVలను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఈ ‘గిఫ్ట్ PPI నియమాల’ ప్రయోజనాల నిమిత్తం, ‘మీరు’ అనే పదం సందర్భానుసారంగా eGVని కొనుగోలు చేసినవారిని మరియు/లేదా రిడీమ్‌ చేసుకునేవారిని సూచిస్తుంది.
  • కొనుగోలు: eGVలను కేవలం ₹10,000/- వరకు డినామినేషన్లలో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. మా అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధారంగా eGV గరిష్ఠ అమౌంట్‌పై కూడా PhonePe పరిమితి విధించవచ్చు. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా RBI అనుమతించిన, అలానే PhonePe సపోర్ట్‌ చేసిన ఏదైనా ఇతర ఇన్‌స్ట్రుమెంట్‌ను ఉపయోగించి మీరు eGVని కొనుగోలు చేయవచ్చు. PhonePe వాలెట్‌ (ఫుల్‌ KYC వాలెట్‌తో సహా) లేదా మరొక eGV బ్యాలెన్స్‌ను ఉపయోగించి eGVలను కొనుగోలు చేయడం కుదరదు. సాధారణంగా eGVలు వెంటనే డెలివరీ అవుతాయి. కానీ కొన్నిసార్లు, డెలివరీ 24 గంటల వరకు ఆలస్యం కావచ్చు. ఈ కాలవ్యవధిలో eGV డెలివరీ కాకపోతే, ఆ సమస్యను వెంటనే మా దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని కోరుతున్నాము, దీంతో మేము దాన్ని పరిష్కరించగలము. మా అంతర్గత పాలసీలను బట్టి eGVలను కొనుగోలు పరిమితితో లేదా కనీస విలువను కొనుగోలు చేయాలనే పరిమితితో అందించవచ్చు. ఏదైనా eGV కొనుగోలు కోసం PhonePeకు అవసరమైన ఇతర సమాచారాన్ని అందించడానికి కూడా మీరు అంగీకరిస్తున్నారు.
  • పరిమితి: ఉపయోగించని eGV బ్యాలెన్స్‌లతో సహా, దాని బ్యాలెన్స్‌ అనేది eGVల గడువు, వాటి చెల్లుబాటు గడువు ముగిసిన వెంటనే ముగుస్తుంది. eGVలను రీలోడ్ చేయడం, తిరిగి అమ్మడం, దాని సమాన విలువను పొందేందుకు బదిలీ చేయడం లేదా నగదు కోసం రిడీమ్‌ చేయడం కుదరదు. ప్రస్తుతానికి, నగదుతో eGVలను కొనుగోలు చేయలేము. మీ PhonePe అకౌంట్ లో ఉపయోగించని eGV బ్యాలెన్స్‌లను మరొక PhonePe అకౌంట్ కు బదిలీ చేయడం కుదరదు. ఏదైనా eGV లేదా eGV బ్యాలెన్స్‌పై PhonePe ఎటువంటి వడ్డీని చెల్లించదు.
  • రిడీమ్‌ చేసుకోవడం: మీరు కొనుగోలు చేసిన eGVలను, వాటి వివరాలు తెలిసిన మరొక వ్యక్తి లేదా మీరు ఆ eGVని ఎవరికి గిఫ్ట్‌గా ఇచ్చారో ఆ వ్యక్తి క్లెయిమ్ చేయవచ్చు. రిడీమ్‌ చేసే వ్యక్తి PhonePeలో రిజిస్టర్ కాని వారైతే, PhonePe అకౌంట్‌కు eGV బ్యాలెన్స్‌ను క్లెయిమ్ చేయడానికి ముందు అతను/ఆమె తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకసారి క్లెయిమ్ చేసిన తర్వాత, PhonePe ప్లాట్‌ఫామ్‌లోని అర్హత కలిగిన మర్చంట్లు వద్ద లావాదేవీల కోసం మాత్రమే eGV రిడీమ్‌ చేయవచ్చు. కొనుగోలు అమౌంట్‌ను యూజర్ eGV బ్యాలెన్స్ నుండి డెబిట్‌ చేస్తారు. ఏదైనా ఉపయోగించని eGV బ్యాలెన్స్ అనేది యూజర్ PhonePe అకౌంట్ తో ముడిపడి ఉంటుంది, అలానే మొత్తం బ్యాలెన్స్‌లో పలు eGVలు ఉన్న సందర్భంలో, త్వరగా ముగిసే గడువు తేదీల క్రమంలో eGVలు అప్లై అవుతాయి. కొనుగోలు విలువ యూజర్ eGV బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉంటే, మిగిలిన అమౌంట్ ను  అందుబాటులో ఉన్న ఇతర ఇన్‌స్ట్రుమెంట్లలో దేనితోనైనా చెల్లించాలి. అలానే, eGVతో PhonePe అప్లికేషన్‌లో లేదా మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లలో మీరు చేసిన లావాదేవీలు రద్దు అయినా, లేదా రిటర్న్‌ చేసినా, వాటి వల్ల వచ్చే రీఫండ్‌లు అనేవి తిరిగి సంబంధిత eGVకే ప్రాసెస్ అవుతాయి. మా అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధారంగా లావాదేవీ ప్రమాదకరమైనది లేదా అనుమానాస్పదమైనది అని తేలితే, eGV రిడీమ్‌ గరిష్ఠ అమౌంట్‌పై PhonePe మరింత పరిమితిని విధించవచ్చు.
  • eGVలు అనేవి RBI నిబంధనలకు లోబడి ఉండే ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ అని మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నారు, అలానే eGV కొనుగోలుదారు/ రిడీమ్‌ చేసేవారి KYC వివరాలను మరియు/లేదా eGV కొనుగోలుకు సంబంధించిన ఏదైనా ఇతర సమాచారాన్ని మరియు/లేదా eGVని ఉపయోగించి PhonePe అకౌంట్ లో చేసిన లావాదేవీలు లేదా అనుబంధ లావాదేవీలకు సంబంధించిన ఇతర సమాచారాన్ని RBI లేదా అటువంటి చట్టబద్ధమైన అధికారులు/ రెగ్యులేటర్లకు పంపాల్సిన బాధ్యత PhonePeకు ఉండవచ్చు. అటువంటి ఏదైనా సమాచారం కోసం మేము మీతో సహా eGV కొనుగోలుదారు/రిడీమ్‌ చేసేవారిని కూడా సంప్రదించవచ్చు అలానే ఈ విషయంలో PhonePeకు తగిన విధంగా సహకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.
  • eGVలు మీకు జారీ అవుతాయి, అలానే మీ అభీష్టానుసారం వేరే వ్యక్తికైనా మీరు eGVని పంపవచ్చు, అయితే ఆ వేరే వ్యక్తి కూడా ఒప్పంద నియమాలకు లోబడి ఉండాలి. eGV పోయినా, దొంగతనానికి గురైనా, పాడైపోయినా లేదా అనుమతి లేకుండా ఉపయోగించినా PhonePe బాధ్యత వహించదు. ఏదైనా మోసం జరిగినా లేదా జరిగిందనే అనుమానం వచ్చినా, సంబంధిత కస్టమర్ అకౌంట్లను క్లోజ్ చేయడంతో సహా, నోటీసు ఇవ్వకుండానే తగిన చర్య తీసుకునే హక్కు, అలానే మోసపూరితంగా పొందిన eGVను రిడీమ్‌ చేసినా మరియు/లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌లో (అవసరమైన మేరకు) కొనుగోళ్లు చేయడానికి ఉపయోగించినా, ఆ పేమెంట్‍‌ అమౌంట్‌ను ప్రత్యామ్నాయ పేమెంట్ మార్గాల్లో వెనక్కి పొందే హక్కు PhonePeకు ఉంటుంది. PhonePe రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అనేది eGVల కొనుగోళ్లతో పాటు, PhonePe ప్లాట్‌ఫామ్‌లో రిడీమ్‌ చేయడాన్నీ కవర్ చేస్తుంది. మా రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (యాంటీ-ఫ్రాడ్ రూల్స్/పాలసీలతో సహా) ప్రకారం అనుమానాస్పదంగా అనిపించే లావాదేవీలను PhonePe అనుమతించకపోవచ్చు. మోసపూరితంగా పొందిన / కొనుగోలు చేసిన eGVలను రద్దు చేయడానికి, అలానే మా రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ప్రకారం సముచితమని భావించే విధంగా అనుమానాస్పద అకౌంట్లపై ఆంక్షలు విధించే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుంది.
  • PhonePe రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా eGVలు మీకు ఇన్సెంటివ్ లేదా రివార్డ్‌గా కూడా జారీ కావచ్చు, అలానే eGV రూపంలో మీకు అటువంటి రివార్డ్‌లను మా అభీష్టానుసారమే ప్రదానం చేసే హక్కు సంపూర్ణంగా మాకు మాత్రమే ఉంటుంది.
  • పరిమితి, గడువు పరిమితులు
    • జారీ చేసిన తేదీ నుండి 1 సంవత్సరం లేదా 18 నెలల వరకు (వినియోగ సందర్భాల ఆధారంగా) eGVలు చెల్లుబాటు అవుతాయి, అలానే ఒక్కో eGV ₹10,000 గరిష్ఠ పరిమితికి లోబడి ఉంటుంది. eGV వ్యాలిడిటీ/గడువు కాలవ్యవధిని, దాన్ని జారీ చేసే సమయంలోనే మీకు తెలియజేయడమవుతుంది.
    • eGVల రీవ్యాలిడేషన్‌ కోసం మీరు అభ్యర్థించవచ్చు, ఈ అభ్యర్థనను మా పాలసీ, మూల్యాంకనం ప్రకారం నిర్వహించడమవుతుంది.
    • వర్తించే మొత్తం పరిమితి లోపే, అదనపు అమౌంట్ పరిమితులను విధించే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుంది.
    • PhonePe ఎప్పటికప్పుడు నిర్ణయించే అంతర్గత పాలసీ ప్రకారం eGVల రూపంలో ఆఫర్లు, సంబంధిత ప్రయోజనాలను అందించే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుంది. ఏదైనా లావాదేవీ రద్దు అయితే, ఆ లావాదేవీపై ఇచ్చిన క్యాష్‌బ్యాక్/ రివార్డ్ (eGV రూపంలో) eGVగానే కొనసాగుతుంది, దాన్ని మీ బ్యాంక్ అకౌంట్ కు విత్‌డ్రా చేయడం కుదరదు. దీన్ని PhonePe ప్లాట్‌ఫామ్‌లో వినియోగించవచ్చు.
    • క్యాష్‌బ్యాక్‌ను తీసివేయగా, మిగిలిన రీఫండ్ అమౌంట్‌ అనేది పేమెంట్ చేయడానికి ఏ సోర్స్‌ను ఉపయోగించారో, అదే సోర్స్‌కు తిరిగి క్రెడిట్ అవుతుంది.
    • PhonePe యాప్‌లో అనుమతించిన లావాదేవీలకు, అలానే PhonePe పార్ట్‌నర్ ప్లాట్‌ఫామ్‌లు/స్టోర్‌లలో పేమెంట్స్ చేయడానికి eGVలను (క్యాష్‌బ్యాక్‌గా జారీ చేసిన eGVలతో సహా) ఉపయోగించవచ్చు.
    • లింక్ చేసిన ఏదైనా బ్యాంక్ అకౌంట్ కు eGVని విత్‌డ్రా చేయడం లేదా ఇతర కస్టమర్లకు బదిలీ చేయడం కుదరదు.
    • PhonePeలో విస్తారంగా అందిస్తున్న అన్ని ఆఫర్‌ల ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరానికి (అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) eGV రూపంలో గరిష్ఠంగా INR 9,999 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
    • సంబంధిత eGV(ల) గడువు ముగిసిన మూడు సంవత్సరాల తర్వాత ఏ సమయంలోనైనా, eGVలో మిగిలిన ఏదైనా బ్యాలెన్స్‌‌ను తన లాభ, నష్టాల కింద తీసుకునే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుంది.

సాధారణ నియమ, నిబంధనలు

  • పైన పేర్కొన్న నియమాలతో పాటు, ఈ సాధారణ నియమ, నిబంధనలు కూడా PhonePe వాలెట్‌, eGVకి వర్తిస్తాయి.
  • మీ లాగిన్ క్రెడెన్షియల్స్ పూర్తిగా మీ వ్యక్తిగతమైనవి, మీ లాగిన్ క్రెడెన్షియల్స్‌ను సురక్షితంగా, భద్రంగా ఉండేలా మీరు చూసుకోవాలి. మీ PhonePe వాలెట్‌, eGV భద్రతకు మీరే బాధ్యత వహిస్తారు, అలానే మీ PhonePe  అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగించే పరికరాలతో సహా వివరాలను సురక్షితంగా ఉంచడానికి అన్ని చర్యలను తీసుకోవాలి. మీరు మీ అకౌంట్ యాక్సెస్ క్రెడెన్షియల్స్‌ను ఎవరికీ ఏ రూపంలోనూ, అంటే నోటితో చెప్పడం లేదా రాతపూర్వకంగా వెల్లడించకూడదు, అలానే మరే ఇతర రూపంలోనూ రికార్డ్ చేయకూడదు. ఒకవేళ మీరు పొరపాటున లేదా అజాగ్రత్త వల్ల అటువంటి వివరాలను వెల్లడిస్తే, మీరు వెంటనే PhonePeకు ఆ కార్యాచరణ గురించి నివేదించాలి. అయితే, మీ సురక్షిత అకౌంట్ యాక్సెస్ క్రెడెన్షియల్స్‌తో ఎవరైనా థర్డ్ పార్టీ నిర్వహించే అనధికార లావాదేవీకి PhonePe బాధ్యత వహించదు.
  • జరిగేందుకు అవకాశమున్న ప్రమాదకర/మోసపూరిత/అనుమానాస్పద లావాదేవీల కోసం మీ లావాదేవీ(ల)ను మేము పర్యవేక్షించవచ్చు. మా నిరంతర లావాదేవీల పర్యవేక్షణ ఆధారంగా, లావాదేవీ(లు)ని నిలిపివేయడం, అటువంటి లావాదేవీ(ల)ను బ్లాక్ చేయడం లేదా తిరస్కరించడం, మీ PhonePe వాలెట్‌ లేదా eGV లేదా అకౌంట్‌ను (లేదా దాని యాక్సెస్‌ను) తాత్కాలికంగా బ్లాక్ చేయడం వంటి మేము తగినవిగా భావించే ఏవైనా చర్యలను తీసుకోవచ్చు, అలానే వర్తించే చోట, మీ అకౌంట్ /లావాదేవీని విడుదల చేయడానికి / పునరుద్ధరించడానికి ముందు మీ గురించి, మీ ఫండింగ్ సోర్స్ గురించి మరింత సమాచారం ఇవ్వమని మిమ్మల్ని కోరవచ్చు. ఏదైనా ఉద్యోగి, కంపెనీని తిట్టడం/దురుసుగా ప్రవర్తించడం లేదా మీరు తప్పుగా డిక్లరేషన్ ఇవ్వడం వంటి ఆధారంగా కూడా మీ అకౌంట్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బ్లాక్ చేయవచ్చని మీరు గమనించాలి, అలానే దీనివల్ల మీకు కలిగే ఏదైనా నష్టానికి మేము బాధ్యత వహించము.
  • PhonePe, దాని అంతర్గత పాలసీలు, రెగ్యులేటరీ, చట్టపరమైన మార్గదర్శకాల ఆధారంగా, ఏదైనా అనుమానాస్పద లేదా మోసపూరిత లావాదేవీల విషయంలో సంబంధిత అధికారులకు సమాచారం/ లావాదేవీల గురించి నివేదించవచ్చని మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నారు, అలానే అలాంటి వాటి గురించి మేము తప్పనిసరిగా నివేదించాల్సి ఉంటుంది, కాబట్టి దీని వల్ల మీకు కలిగే ఏదైనా నష్టానికి, ఒకవేళ అటువంటి ఏదైనా లావాదేవీ ఆ తర్వాతి దశలో సాధారణమైనది, చట్టబద్ధమైనది అని తేలినప్పటికీ, మేము బాధ్యత వహించము, 
  • ఏదైనా లావాదేవీని చేస్తున్నప్పుడు, మీ PhonePe వాలెట్‌ / eGV లేదా ఏదైనా లావాదేవీని చేయడానికి మీరు ఉపయోగించే ఇతర ఫండ్ సోర్స్‌లలో తగినంత నిధులు అందుబాటులో ఉన్నాయని మీరు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.
  • మీ లావాదేవీలను విజయవంతంగా పూర్తి చేయడం కోసం, PhonePe అప్లికేషన్‌లో PhonePe అందించే సర్వీస్‌లు ఇంటర్నెట్ కనెక్షన్, సర్వీస్ ప్రొవైడర్లు, పార్ట్‌నర్‌లను ఉపయోగిస్తాయని మీరు అర్థం చేసుకున్నారు, అలానే PhonePe వాలెట్/ eGV సర్వీస్‌లకు ఏదైనా నష్టం లేదా అంతరాయం లేదా మొబైల్ లేదా ఇంటర్నెట్ సపోర్ట్ చేయకపోవడం, మర్చంట్ వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లు స్పందించకపోవడం వల్ల PhonePe వాలెట్/ eGV సర్వీస్‌లు అందుబాటులో లేకపోవడంతో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, వాటి నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా బాధ్యతకు మేము బాధ్యత వహించము.
  • PhonePe వాలెట్/ eGV సర్వీస్‌లను పొందడం కోసం మీరు పంపించే సమాచారం, ఇతర విషయాలతో పాటుగా, అటువంటి సర్వీస్‌ల మెరుగుదల కోసం థర్డ్ పార్టీలకు పంపవచ్చని మీరు అర్థం చేసుకున్నారు, అలానే అటువంటి సందర్భంలో, సర్వీస్ ప్రొవైడర్ల డేటా పాలసీలు కూడా అటువంటి లావాదేవీలకు వర్తిస్తాయి, మీరు వారి పాలసీలను తెలుసుకుని మిమ్మల్ని మీరు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి, అలానే అటువంటి సందర్భంలో డేటా షేరింగ్, వినియోగంపై PhonePeకు ఎటువంటి నియంత్రణ ఉండదనే విషయం మీకు అర్థమైందని, మీరు అంగీకరిస్తున్నారు.
  • ఏదైనా లావాదేవీపై మీ బ్యాంక్/ఆర్థిక సంస్థ ఫీజు(లు) లేదా ఛార్జీ(లు)ని వసూలు చేయవచ్చని మీరు గుర్తించి, అంగీకారం తెలుపుతున్నారు, అలానే అటువంటి ఫీజు(లు)/ ఛార్జీలను గుర్తించడానికి లేదా రీఫండ్ చేయడానికి PhonePe బాధ్యత వహించదు, ఇంకా వాటిని అన్ని పరిస్థితుల్లోనూ మీరే భరించాలి, లేదా అవి మీకు, మీ బ్యాంక్/ ఆర్థిక సంస్థకు మధ్య అంగీకారం కుదిరిన నియమాల ప్రకారం ఉంటాయి.
  • మీ PhonePe వాలెట్‌కు లేదా eGVకి లోడ్‌ చేసిన ఫండ్‌లు, అలానే PhonePe అప్లికేషన్ లేదా పార్ట్‌నర్‌ మర్చంట్లు అందించే సర్వీస్‌ల కోసం ఖర్చు చేసిన నిధుల నిర్వహణ అనేది పూర్తిగా ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది, అలానే ఈ ప్రక్రియలో మీ బ్యాంక్, సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీసులు, టెలికాం ఆపరేటర్ మొదలైన వారితో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, పలు స్టేక్‌హోల్డర్ల భాగస్వామ్యం ఉంటుంది. పలు పాయింట్ల వద్ద వైఫల్యం సంభవించడం వల్ల లావాదేవీ నిర్ధారణలు, అక్‌నాలెడ్జ్‌మెంట్లు ఎల్లప్పుడూ సర్వీస్ డెలివరీని ప్రతిబింబించకపోవచ్చని మీరు అర్థం చేసుకున్నారు. అటువంటి సందర్భాలలో, ఇతర స్టేక్‌హోల్డర్ల అసమర్థత / ప్రక్రియ వైఫల్యాల వల్ల కలిగే ఏదైనా నష్టానికి PhonePe బాధ్యత వహించదు, అలానే అటువంటి సందర్భాలలో PhonePe ఫండ్స్‌ను క్రెడిట్ చేయాలి లేదా మీ నుండి ఫండ్స్‌ను రికవరీ చేయాల్సి ఉంటుంది, అలానే దాని సొంత అభీష్టానుసారం, తదనుగుణంగా మీ PhonePe వాలెట్‌ / eGV లేదా అకౌంట్ పై తగిన పరిమితులు/నియంత్రణలను అప్లై చేస్తుంది, అలానే వర్తించే చట్టం అనుమతించిన మేరకు బాకీ అమౌంట్‌ను (ఏదైనా ఉంటే) వసూలు చేయడానికి తగిన చట్టపరమైన చర్యలను తీసుకోవచ్చు.
  • మీరు మీ PhonePe యాప్‌లో మీ PhonePe వాలెట్‌, eGV లావాదేవీలను చూడవచ్చు, అలానే కనీసం గత 6 నెలల లావాదేవీలను కూడా సమీక్షించవచ్చు.
  • క్లెయిమ్ చేయనివి మినహా, అన్ని కేటగిరీల PhonePe వాలెట్లు, eGVలు స్వభావరీత్యా బదిలీ చేయలేనివి, అలానే మిగిలిన PhonePe వాలెట్/ eGV బ్యాలెన్స్‌లపై ఎటువంటి వడ్డీ రాదు.
  • మీ అకౌంట్ సురక్షితమైనది, అలానే మీ PhonePe వాలెట్‌ / eGVలో ప్రాసెస్‌ అయిన ఏదైనా లావాదేవీని మీరే స్పష్టంగా ఆథరైజ్ చేయాలి లేదా మీ PhonePe వాలెట్/ eGVపై మీరు ఆథరైజ్ చేసిన, PhonePe అనుమతించిన RBI నోటిఫై చేసిన డెబిట్ మ్యాండేట్‌ల ద్వారా ప్రాసెస్ అయి ఉండాలి. 
  • PhonePe ఎప్పటికప్పుడు అనుమతించిన విధంగా మీరు పలు eGVలను కొనుగోలు చేయగలిగినప్పటికీ, మీరు వాలెట్‌ వినియోగ నియమాలు మరియు/లేదా ఒప్పందాన్ని ఉల్లంఘించిన అనుమానాస్పద ఘటన జరిగితే, దాని ప్రాతిపదికన మీ PhonePe వాలెట్‌ / eGVలు లేదా PhonePe అకౌంట్ కు ఉన్న మీ యాక్సెస్‌ను నిలిపివేయవచ్చు/ నియంత్రించవచ్చు.
  • PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీరు క్యాష్‌బ్యాక్(ల) రూపంలో పొందిన ఏదైనా eGV అనేది పేమెంట్ల సమయంలో ఆన్‌లైన్ మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించే PhonePe వాలెట్‌ బ్యాలెన్స్‌లోనే ఉంటుంది.
  • PhonePe వాలెట్/ eGV నిరంతర లభ్యత అనేది వర్తించే చట్టం, MD-PPIs, 2021 కింద కావాల్సిన అంశాలకు లోబడి ఉన్నప్పటికీ, PhonePe వాలెట్/ eGV లేదా దాని యాక్సెస్‌ను, ఏ సమయంలోనైనా, ఏ కారణం చేతనైనా, కింది వాటితో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, నిలిపివేసే/ఆపివేసే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుంది-
    • RBI ఎప్పటికప్పుడు జారీ చేసిన నియమాలు, నిబంధనలు, ఆదేశాలు, దిశానిర్దేశాలు, నోటిఫికేషన్‌లను ఏదో రూపంలో ఉల్లంఘించడం లేదా ఉల్లంఘించారనే అనుమానం కలగడం లేదా ఏదైనా వాలెట్‌ వినియోగ నియమాలు మరియు/లేదా ఒప్పందాన్ని ఏదో రూపంలో ఉల్లంఘించడం;
    • మీ వివరాలు, KYC డాక్యుమెంటేషన్ లేదా మీరు అందించిన సమాచారంలో ఏదైనా అనుమానించదగిన వ్యత్యాసం; లేదా
    • జరిగేందుకు అవకాశమున్న మోసం, విద్రోహ చర్య, ఉద్దేశపూర్వక విధ్వంసం, జాతీయ భద్రతకు ముప్పు లేదా ఏదైనా ఇతర అనివార్య కారణాలను ఎదుర్కోవడానికి; లేదా
    • ఏదైనా ఇతర చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మీ PhonePe వాలెట్/ eGV నిలిపివేత/ఆపివేత/ నియంత్రణ అవసరమని PhonePe తన సొంత అభిప్రాయం ప్రకారం, అభీష్టానుసారం నమ్మడం.
  • PhonePeకు మీరు అందించిన మీ సమాచారంలో ఏవైనా మార్పులు ఉంటే, అటువంటి మార్పులను, మీరు యాప్‌లోని సహాయ విభాగం ద్వారా మా కస్టమర్ సహాయ విభాగ బృందాన్ని సంప్రదించి లేదా 080-68727374 / 022-68727374కు కాల్ చేసి, ఇన్‌బౌండ్ సహాయ విభాగ బృందానికి కాల్ చేసి, రాతపూర్వకంగా PhonePeకు వెంటనే తెలపాలి. మీరు PhonePeలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌ను మార్చాలనుకున్నా, దానికి PhonePe అవకాశం ఇవ్వదు కాబట్టి, మీరు మీ మొబైల్ నంబర్‌ను సరెండర్ చేయాలని లేదా డీయాక్టివేట్ చేయాలని ప్లాన్ చేస్తే, మీ అకౌంట్ ‌ను క్లోజ్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి, దయచేసి ముందుగానే మా కస్టమర్ సహాయ విభాగ బృందాన్ని సంప్రదించండి. క్లోజ్‌ చేయడం పూర్తయిన తర్వాత, మీరు కొత్త అకౌంట్ ‌ను క్రియేట్ చేసే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీరు మీ మొబైల్ పరికరాన్ని పోగొట్టుకుంటే, వెంటనే మమ్మల్ని సంప్రదించండి, దాని వల్ల మేము మీ PhonePe అకౌంట్ , PhonePe వాలెట్‌ మరియు/లేదా eGVపై తగిన చర్యను తీసుకోగలము.
  • రెగ్యులేటర్ నోటిఫై చేసిన మేరకు లేదా చట్టం ప్రకారం తలెత్తిన ఏవైనా ఇతర పరిస్థితుల వల్ల, ఏదైనా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌‌ క్లోజ్ అయినప్పుడు లేదా క్లోజ్ చేసినప్పుడు, దానిలోని మిగిలిన బ్యాలెన్స్‌‌ను (ఏదైనా ఉంటే) రెగ్యులేటర్ సూచనలు/ చట్టం ప్రకారం లేదా PhonePe పాలసీ ప్రకారం నిర్వహించడమవుతుందని మీరు అంగీకరిస్తున్నారు.

రీఫండ్, రద్దు

  • మొబైల్/ DTH రీఛార్జ్, బిల్లు పేమెంట్‌ లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీరు ప్రాసెస్‌ చేసిన ఏదైనా ఇతర పేమెంట్ లేదా PhonePe వాలెట్‌ను (eGVలతో సహా) పేమెంట్ ఎంపికగా స్వీకరించే మర్చంట్ పార్ట్‌నర్లకు PhonePe వాలెట్/eGV‌తో చేసిన అన్ని పేమెంట్లు తుది పేమెంట్లు అవుతాయి, మీరు లేదా మర్చంట్ పార్ట్‌నర్లు చేసిన ఏదైనా ఎర్రర్‌, మర్చిపోయిన అంశాలు, లోపానికి PhonePe బాధ్యత వహించదు. బిల్లు పేమెంట్‌, రీఛార్జ్ లావాదేవీలను ఒకసారి ప్రారంభించిన తర్వాత రీఫండ్, రిటర్న్ లేదా రద్దు చేయడం కుదరదు.
  • మీరు పేమెంట్‌ చేయాలనుకోని మర్చంట్‌కు పేమెంట్ ప్రాసెస్‌ చేసినా లేదా తప్పు అమౌంట్‌ను పేమెంట్ చేసినా (ఉదాహరణకు మీరు తప్పుగా టైప్ చేయడం వల్ల తలెత్తిన ఎర్రర్‌), మీరు పేమెంట్ చేసిన మర్చంట్‌ను నేరుగా సంప్రదించి, అమౌంట్‌ను రీఫండ్ చేయమని వారిని అడగడమే మీకు ఉన్న ఏకైక మార్గం. అటువంటి వివాదాలను నిర్వహించడానికి PhonePe బాధ్యత వహించదు, లేదా మీరు పొరపాటున చేసిన పేమెంట్‌ను మేము రీయింబర్స్ చేయలేము లేదా రివర్స్ చేయలేము.
  • మీరు ఇంతకు ముందు ప్రాసెస్‌ చేసిన లావాదేవీకి సంబంధించిన రీఫండ్‌ మాకు వస్తే, మీరు నిర్దేశిస్తే లేదా సూచిస్తే తప్ప, మేము ఆ ఫండ్స్‌ను PhonePe వాలెట్/eGVతో సహా పేమెంట్‌ సోర్స్‌కు తిరిగి రీఫండ్ చేస్తాము.
  • క్యాష్‌బ్యాక్ ఆఫర్ ద్వారా లోడ్ చేసిన ఏదైనా eGVని ఉపయోగించి పేమెంట్లు చేసిన సందర్భంలో, ఏదైనా కారణం వల్ల పేమెంట్‌ను రద్దు చేస్తే, దానికి సంబంధించి రీఫండ్ అయిన ఏదైనా అమౌంట్‌ అనేది eGVగానే కొనసాగుతుంది, దాన్ని మీ బ్యాంక్ అకౌంట్ కు విత్‌డ్రా చేయడం కుదరదు. అర్హత ఉన్న లావాదేవీల కోసం దీన్ని PhonePe ప్లాట్‌ఫామ్‌లో వినియోగించడాన్ని కొనసాగించవచ్చు.
  • ఇంకా, లావాదేవీ రద్దు అయిన సందర్భంలో, క్యాష్‌బ్యాక్‌ను మినహాయించగా మిగిలిన రీఫండ్ అమౌంట్‌ను (eGV రూపంలో క్రెడిట్ అయినది) ఏ ఫండ్స్ సోర్స్‌తో పేమెంట్ చేశారో దానికే తిరిగి క్రెడిట్ చేయడమవుతుంది.

ఫీజులు, ఛార్జీలు

  • PhonePe జారీ చేసిన PhonePe వాలెట్‌ (ఫుల్‌ KYC వాలెట్‌తో సహా) లేదా eGVలకు ఎటువంటి మెంబర్‌షిప్ ఫీజు ఉండదు.  అకౌంట్‌ను క్రియేట్‌ చేయడానికి లేదా PhonePe వాలెట్‌ను ఓపెన్‌ చేయడానికి లేదా PhonePe సర్వీస్‌లను ఉపయోగించడానికి, స్పష్టంగా పేర్కొంటే తప్ప మిగతా సందర్భాల్లో PhonePe మీ నుండి ఎటువంటి ఫీజును వసూలు చేయదు, .
  • మీ PhonePe వాలెట్‌ను ఉపయోగించి మీరు చేసే నిర్దిష్ట పేమెంట్ లావాదేవీలకు కన్వీనియన్స్ ఫీజును విధించవచ్చు, దీని వివరాలు ఆ లావాదేవీ సమయంలో మీకు కనిపిస్తాయి. మీ లావాదేవీకి అటువంటి ఛార్జీని యాడ్‌ చేసే ముందు మీకు తెలపడమవుతుంది.
  • ఎంచుకున్న ఇన్‌స్ట్రుమెంట్‌ను బట్టి, యూజర్ల నుండి PhonePe వాలెట్‌ లోడింగ్ ఫీజు(ల)ను PhonePe వసూలు చేయవచ్చు, అలానే ఆ ఛార్జీల వివరాలు వారి PhonePe వాలెట్‌ను లోడ్ చేస్తున్నప్పుడు యూజర్లకు ముందుగానే కనిపిస్తాయి. క్రెడిట్‌ కార్డ్‌తో PhonePe వాలెట్‌‌ను లోడ్‌ చేసేటప్పుడు 1.5% – 3% + GST వరకు కన్వీనియన్స్ ఫీజు పడుతుంది. డెబిట్‌ కార్డ్‌తో (Rupay డెబిట్-కార్డ్‌లు కాకుండా) PhonePe వాలెట్‌‌ను లోడ్‌ చేసేటప్పుడు 0.5% – 2% + GST వరకు కన్వీనియన్స్ ఫీజు పడుతుంది. మీరు డబ్బును లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తి చేయడానికి ముందే అప్లికేషన్‌లో ఖచ్చితమైన ఛార్జీలు కనిపిస్తాయి.
  • ఎప్పటికప్పుడు తన ఫీజు(ల) పాలసీని మార్చుకునే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుంది. మా సొంత అభీష్టానుసారం మేము కొత్త సర్వీస్‌లను ప్రవేశపెట్టవచ్చు, అలానే మేము అందిస్తున్న సర్వీస్‌ల్లో కొన్నింటిని లేదా అన్నింటినీ మార్చవచ్చు, అందించే కొత్త/ప్రస్తుత సర్వీస్‌లకు ఫీజులను ప్రవేశపెట్టవచ్చు లేదా ఇప్పటికే ఉన్న సర్వీస్‌లకు ఫీజులను సవరించవచ్చు/ప్రవేశపెట్టవచ్చు. ఫీజు(ల) పాలసీకి సంబంధించిన మార్పులు వెంటనే ఆటోమేటిక్‌గా అమలులోకి వస్తాయి, అలానే వాటిని ఈ వాలెట్‌ వినియోగ నియమాలు/ ఒప్పందానికి మార్పులు చేయడం ద్వారా తెలపడమవుతుంది.

ఆపరేషనల్ చెల్లుబాటు & జప్తు

  • RBI ఎప్పటికప్పుడు జారీ చేసే రెగ్యులేటరీ ఉత్తర్వుల ప్రకారం, అలానే PhonePe అనుమతించిన మేరకు మీ PhonePe వాలెట్/ eGV చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం మీ PhonePe వాలెట్‌ను క్లోజ్‌ చేస్తే తప్ప, మిగతా సందర్భంలో చెల్లుబాటు అవుతుంది. అయితే, జారీ అయిన eGVలకు (ఉపయోగించని eGV బ్యాలెన్స్‌లతో సహా) జారీ/కొనుగోలు చేసిన తేదీ నుండి నిర్దిష్ట చెల్లుబాటు కాలవ్యవధి ఉంటుంది, ఇది జారీ/కొనుగోలు సమయంలో మీకు తెలియజేయడమవుతుంది. పొడిగింపు అభ్యర్థనల ఆధారంగా లేదా PhonePe తన అభీష్టానుసారం నిర్ణయించినట్లుగా eGVల చెల్లుబాటు కాలవ్యవధిని PhonePe పొడిగించవచ్చు.
  • ఒప్పందంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించినా లేదా RBI లేదా భారత ప్రభుత్వం లేదా ఏదైనా ఇతర సంబంధిత సంస్థ జారీ చేసిన ఏదైనా నియమం/పాలసీని లేదా ఏదైనా LEA లేదా ఇతర అథారిటీ జారీ చేసిన ఏదైనా ఉత్తర్వు/ ఆదేశాన్ని ఉల్లంఘించినా మీ PhonePe వాలెట్‌ను రద్దు చేసే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుందని కూడా మీరు గమనించవచ్చు, అలానే అటువంటి సందర్భంలో, మీ PhonePe వాలెట్‌లో ఉన్న ఏదైనా బ్యాలెన్స్‌ను PhonePe ప్లాట్‌ఫామ్‌తో లింక్‌ చేసిన మీ బ్యాంక్ అకౌంట్ కు తిరిగి క్రెడిట్ చేస్తుంది. అటువంటి సందర్భంలో, సంబంధిత అధికారులు/ రెగ్యులేటర్లకు ఏదైనా సమాచారం/ రికార్డులను (మీ అకౌంట్ , KYC, లావాదేవీ మొదలైనవాటికి సంబంధించిన వివరాలతో సహా) PhonePe నివేదించవచ్చు. సంబంధిత సంస్థ/అథారిటీ నుండి క్లియరెన్స్ వచ్చే వరకు, మేము మీ PhonePe వాలెట్/ eGV బ్యాలెన్స్‌ను ఫ్రీజ్ కూడా చేయవచ్చు.
  • ఇక్కడ పేర్కొన్న కారణాల వల్ల మీ PhonePe వాలెట్‌ / eGV గడువు ముగియాల్సిన పరిస్థితి వస్తే, గడువు తేదీకి 45 రోజుల వ్యవధిలో, అంటే సహేతుకమైన కాలవ్యవధిలో, ఇ-మెయిల్/ఫోన్/నోటిఫికేషన్ లేదా అనుమతించదగిన ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతిలో ఈ విషయం గురించి మీకు కమ్యూనికేషన్‌ను పంపి, ఆ రాబోయే గడువు గురించి PhonePe మిమ్మల్ని హెచ్చరిస్తుంది/మీకు తెలుపుతుంది. గడువు ముగిసిన తర్వాత కూడా మీ PhonePe వాలెట్/eGVలో బ్యాలెన్స్‌ మిగిలి ఉంటే, PhonePe వాలెట్/eGV గడువు ముగిసిన తర్వాత ఏ సమయంలోనైనా, అలానే వర్తించే డ్యూ డిలిజెన్స్‌కు లోబడి, eGV చెల్లుబాటును పొడిగించడానికి (కొత్త eGV జారీ చేయమని) లేదా మిగిలిన PhonePe వాలెట్/eGV బ్యాలెన్స్ రీఫండ్‌ను ప్రారంభించడానికి మీరు PhonePeకు అభ్యర్థన చేయవచ్చు, పైన పేర్కొన్న బ్యాలెన్స్‌ను మీరు గతంలో మీ PhonePe వాలెట్/eGVకి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ కు లేదా రీఫండ్‌కు అభ్యర్థనను పంపే సమయంలో మీరు PhonePeకు అందించిన బ్యాంక్ అకౌంట్ ‌కు బదిలీ చేయడమవుతుంది. 
  • PhonePe తన సొంత అభీష్టానుసారం తదుపరి వినియోగం కోసం eGVలను పునరుద్ధరించవచ్చు. మీరు ఏదైనా అనుమానాస్పద లావాదేవీలో మరియు/లేదా మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద వర్తించే నియమాలు, నిబంధనలు, అలానే వాటికి చేసిన ఏవైనా సవరణలతో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ ల వినియోగాన్ని నియంత్రించే RBI జారీ చేసిన నియమాలు & నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించే ఏదైనా లావాదేవీలో పాలుపంచుకున్నట్లయితే లేదా మీ సమాచారం/ KYCలో ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే మీ PhonePe వాలెట్‌ను బ్లాక్‌ చేసే, అలానే ఫండ్స్‌ను సోర్స్అకౌంట్ కు రివర్స్ చేసే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుంది. అటువంటి సందర్భంలో, ఈ విషయాన్ని RBI/ సంబంధిత అధికారులకు PhonePe నివేదించవచ్చు, అలానే దీనికి సంబంధించిన దర్యాప్తులో వెల్లడైన విషయాలు, స్పష్టమైన నివేదికను RBI/ అధికారులు మాకు పంపే వరకు ఆ అకౌంట్‌పై తగిన చర్యను తీసుకోవచ్చు. 
  • గత 12 నెలల్లో మీ PhonePe వాలెట్‌లో ఆర్థిక లావాదేవీలు ఏవీ జరగకపోతే, మీ PhonePe వాలెట్‌‌ ఇన్‌యాక్టివ్ గా ఉందని ఫ్లాగ్ చేస్తాము, అలాంటి పరిస్థితుల్లో, PhonePe ఎప్పటికప్పుడు నిర్వచించిన తగిన డ్యూ-డిలిజెన్స్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు మీ PhonePe వాలెట్‌ను ఆపరేట్ చేయగలరు. మీ PhonePe వాలెట్‌ బ్యాలెన్స్‌ను మేము సురక్షితంగా నిర్వహిస్తాము, అలానే ఏవైనా రీఫండ్స్ పెండింగ్‌లో ఉంటే, వాటిని ఇప్పటికీ మీ PhonePe వాలెట్‌కు క్రెడిట్ చేస్తాము, అంతేగాక ప్రచార కమ్యూనికేషన్‌లతో సహా, మా నుండి అన్ని కమ్యూనికేషన్‌లు మీకు వస్తూనే ఉంటాయి. అయితే, అటువంటి డ్యూ-డిలిజెన్స్‌ను చేయకపోతే, మీ PhonePe వాలెట్‌ లోడింగ్‌తో సహా ఏవైనా లావాదేవీల కోసం మీ ఇన్‌యాక్టివ్‌‌గా ఉన్న PhonePe వాలెట్‌ను మీరు ఉపయోగించలేరు. మీ PhonePe వాలెట్‌ ఇన్‌యాక్టివ్‌గా ఉందని ఫ్లాగ్ అయినా, అటువంటి PhonePe వాలెట్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్ మారినా, PhonePe ఎప్పటికప్పుడు నిర్వచించిన తగిన డ్యూ-డిలిజెన్స్ ప్రక్రియను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. అటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఈ వాలెట్‌ వినియోగ నియమాలలో పేర్కొన్న ప్రక్రియ ప్రకారం మీ PhonePe వాలెట్‌ వెంటనే క్లోజ్‌ అవుతుంది, ఆ తర్వాత మీరు కొత్త PhonePe వాలెట్‌ను ఓపెన్ చేసే ప్రక్రియను ప్రారంభించవచ్చు.

సర్వీస్‌ల నిలిపివేత/ఆపివేత

  • మీ PhonePe యాప్‌లో అందుబాటులో ఉన్న అభ్యర్థనను పంపి లేదా PhonePe పేర్కొన్న ఏదైనా ఇతర ప్రక్రియను అనుసరించి మీరు ఎప్పుడైనా మీ PhonePe వాలెట్‌ను క్లోజ్‌ చేయవచ్చు. క్లోజ్‌ చేసే సమయంలో ఉన్న మిగిలిన బ్యాలెన్స్‌‌ను (ఏదైనా ఉంటే) ‘బ్యాక్‌ టు సోర్స్‌’కు (అంటే PhonePe వాలెట్‌‌కు ఏ పేమెంట్ సోర్స్‌ నుండి అమౌంట్‌ లోడ్ చేశారో, దానికి) బదిలీ చేయడమవుతుంది, అలానే ఏదైనా కారణం వల్ల అది సాధ్యం కాకపోతే, లేదా ఫుల్‌ KYC/ e-KYC PPIలో ముందస్తుగా నిర్ణయించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు అందుబాటులో లేకపోతే, PhonePe యాప్‌లో టికెట్‌ను కస్టమర్ రైజ్ చేయాలి, అలానే యాప్‌లో వివరించిన ప్రక్రియను అనుసరించాలి. ఏవైనా KYC డాక్యుమెంట్లతో సహా, ఫుల్‌ KYC PPIని క్లోజ్‌ చేసిన తర్వాత నిధులు బదిలీ చేయాల్సిన మీ బ్యాంక్ అకౌంట్ మరియు/లేదా ‘బ్యాక్ టు పేమెంట్ సోర్స్’ ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించిన సంబంధిత సమాచారం/డాక్యుమెంట్ల కోసం మీకు కాల్ చేయడానికి PhonePeకు అర్హత ఉంటుందని మీరు ఇందుమూలంగా అంగీకరించి, అర్థం చేసుకున్నారు.
  • మీ PhonePe వాలెట్‌ వెంటనే క్లోజ్‌ అవ్వకుండా, ముందు నిలిచిపోయి, ఆ తర్వాత చివరిగా క్లోజ్‌ అయ్యే కొన్ని ప్రమాదకర సందర్భాలు ఉండవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
  • ఒప్పందాన్ని ఏదో రూపంలో ఉల్లంఘించినా మరియు/లేదా ఈ వాలెట్‌ వినియోగ నియమాల కింద పేర్కొన్న హక్కులలో దేన్ని అయినా ఉల్లంఘించినా, సంబంధిత అకౌంట్ / ప్రోడక్ట్‌/ సర్వీస్‌లు క్లోజ్‌ చేయడం/నిలిపివేయడంతో సహా మీ PhonePe అకౌంట్ , PhonePe వాలెట్‌ మరియు/లేదా eGVపై ఏదైనా చర్య తీసుకునే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుందని మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నారు.
  • రెగ్యులేటరీకి కావాల్సిన అంశాల ప్రకారం మీరు మీ KYC వివరాలను క్రమానుగతంగా నిర్ధారించడం/అప్‌డేట్ చేయాల్సిన, అలానే అటువంటి ఇతర సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉండవచ్చని, అలా అందించలేకపోతే మీ PhonePe వాలెట్‌ డీయాక్టివేషన్‌కు దారితీయవచ్చని మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నారు.
  • మీ PhonePe వాలెట్‌‌ను క్లోజ్‌ చేసిన తర్వాత, మేము మీ PhonePe వాలెట్‌ను పునరుద్ధరించలేము, అలానే రెగ్యులేటరీ ఉత్తర్వుల ప్రకారం లేదా మా అంతర్గత పాలసీల ఆధారంగా కొన్నిసార్లు కొత్త వాలెట్‌ను క్రియేట్‌ చేయడానికి మీకు అనుమతిని ఇవ్వకపోవచ్చు అని కూడా మీరు అర్థం చేసుకున్నారు.
  • రికార్డ్‌ను భద్రంగా దాయడం కోసం, మీ PhonePe వాలెట్‌‌ను నిలిపివేసిన తర్వాత కూడా మీ డేటా, సమాచారాన్ని నిల్వ చేయడానికి మేము బాధ్యత వహిస్తామని కూడా మీరు అర్థం చేసుకున్నారు.

అనధికార లావాదేవీలు, ఫిర్యాదుల పరిష్కారం

  • మీ PhonePe వాలెట్/ eGV నుండి ఏదైనా డెబిట్‌ జరిగినప్పుడు, సంబంధిత లావాదేవీ అలెర్ట్‌లను SMS (లేదా అవసరమైతే ఇమెయిల్) రూపంలో PhonePe మీకు పంపుతుంది. మీ సమ్మతి/ ఆమోదం లేకుండా ప్రాసెస్ పూర్తయిన ఏదైనా లావాదేవీని మీరు మీ అకౌంట్ లో గమనించినట్లయితే, ఫిర్యాదుల పరిష్కార పాలసీ కింద PhonePe మీ కోసం అందుబాటులో ఉంచిన ఎమర్జెన్సీ 24×7 కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేసి/ఇమెయిల్ పంపి/ఫారమ్‌ నింపి, అటువంటి లావాదేవీ గురించి మాకు వెంటనే మీరు నివేదించాలి. అలాంటి దాని గురించి సమాచారం ఇవ్వడంలో ఏదైనా జాప్యం జరిగితే, మీకు మరియు/లేదా PhonePeకు అధిక ముప్పు కలగవచ్చు. 
  • ఒకసారి మీరు ఏదైనా లావాదేవీని అనధికారిక లావాదేవీ అని నివేదించిన తర్వాత, మేము మీ క్లెయిమ్‌ను సమీక్షించే సమయంలో మీ PhonePe వాలెట్/eGVని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. మేము క్లెయిమ్‌పై విచారణ చేస్తున్నప్పుడు, వివాదంలో ఉన్న క్లెయిమ్ చేసిన నిధులను, ఆ సందర్భంలో అవి ఎలా ఉన్నాయో అలానే ఉంచుతాము, అయితే విచారణ ఫలితం మీకు అనుకూలంగా వస్తే, వాటిని మీ PhonePe వాలెట్/eGVకి క్రెడిట్ చేస్తాము. 
  • PhonePe తరఫున ఏదైనా కంట్రిబ్యూటరీ ఫ్రాడ్ (మోసానికి సహకారం అందించడం) / నిర్లక్ష్యం / లోపం వల్ల అనధికార లావాదేవీ ప్రక్రియ అయితే, మేము ఆ ఫండ్స్‌ను మీ PhonePe వాలెట్‌ / eGVకి రీఫండ్ చేస్తాము.
  • మీ నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగిన సందర్భాల్లో, అంటే మీరు పేమెంట్ క్రెడెన్షియల్స్‌ను ఎవరికైనా పంపడం వల్ల జరిగిన అనధికార లావాదేవీ గురించి మాకు నివేదించే వరకు జరిగిన నష్టాన్ని మీరే పూర్తిగా భరించాలి. మీరు మాకు అనధికార లావాదేవీని నివేదించిన తర్వాత మీ PhonePe వాలెట్‌ / eGVపై జరిగే తదుపరి నష్టానికి మీరు బాధ్యత వహించక్కర్లేదు.
  • మీ తరఫున లేదా మా తరఫున జరిగిన తప్పిదం వల్ల కాకుండా, సిస్టమ్‌లో ఇంకెక్కడైనా థర్డ్ పార్టీ ఉల్లంఘన జరిగితే, లావాదేవీ కమ్యూనికేషన్ అందిన తేదీ నుండి 3 (మూడు) రోజుల్లోపు (PhonePe నుండి కమ్యూనికేషన్ వచ్చిన తేదీని మినహాయించి) మీరు ఆ అనధికార లావాదేవీ గురించి నివేదించాలని గుర్తించండి, మీరు నివేదించకపోతే, అటువంటి లావాదేవీకి సంబంధించి ఇక్కడ తెలిపిన విధంగా మీరే స్వయంగా బాధ్యత వహించాలి (a) మీరు నాలుగు నుండి ఏడు రోజుల్లోపు అటువంటి లావాదేవీని నివేదిస్తే, లావాదేవీ విలువ లేదా ₹ 10,000/- (ఒక్కో లావాదేవీకి), ఏది తక్కువైతే అది వర్తిస్తుంది లేదా (b) మీరు ఏడు రోజుల తర్వాత అటువంటి లావాదేవీని నివేదిస్తే మా బోర్డు ఆమోదించిన పాలసీ ప్రకారం నిర్వచించిన లయబిలిటీ వర్తిస్తుంది.
  • ఒకవేళ మేము 90 (తొంభై) రోజుల్లోపు మా విచారణను పూర్తి చేయలేకపోతే, RBI ఉత్తర్వులు, అలానే మా పాలసీల ప్రకారం మేము ఫండ్స్‌ను మీ PhonePe వాలెట్‌ లేదా eGVకి రీఫండ్ చేస్తాము.
  • PhonePe మీ PhonePe వాలెట్‌ / eGVలను నియంత్రించే అన్ని నియమ, నిబంధనలను SMS/లింక్‌లు/నోటిఫికేషన్/ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతి ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తుంది, అలానే ఛార్జీలు, ఫీజుల వివరాలు, మీ PhonePe వాలెట్/PPI గడువు ముగిసే వ్యవధి, నోడల్ ఆఫీసర్ వివరాలను మీ PhonePe వాలెట్/eGV జారీ చేసే సమయంలో మీకు అందిస్తుంది, అలానే వీటన్నిటినీ మీరు సమీక్షించడానికి వీలుగా, ఇవన్నీ PhonePe ప్లాట్‌ఫామ్‌లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.
  • మీరు ఏదైనా ఫిర్యాదు / గ్రీవెన్స్ నివేదించినట్లయితే, మేము మీ సమస్యను సమీక్షిస్తాము, అలానే మీ ఫిర్యాదు / గ్రీవెన్స్ అందిన తేదీ నుండి 48 (నలభై ఎనిమిది) గంటల్లోపు, గరిష్టంగా 30(ముప్పై) రోజులకు మించకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. మరిన్ని వివరాల కోసం మీరు మా ఫిర్యాదు పరిష్కార పాలసీని చూడవచ్చు.

లావాదేవీ పర్యవేక్షణ

  • మీ PhonePe వాలెట్‌ / eGVకి వర్తించే మొత్తం లావాదేవీ పరిమితి(ల) లోపు అనుమతించిన మర్చంట్లు, అనుమతించిన ప్రయోజనాల కోసం మీ PhonePe వాలెట్‌ / eGVని ఉపయోగించడానికి మీకు అనుమతి ఉంటుంది. అయితే, మీ  అకౌంట్‌ను సురక్షితంగా ఉంచడానికి, అలానే మీ లావాదేవీలను భద్రపరచడానికి, ముప్పులను గుర్తించడానికి మీ లావాదేవీలను, అలానే అకౌంట్ కార్యకలాపాలను మేము పర్యవేక్షించవచ్చు, మా పర్యవేక్షణ, రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతుల ఆధారంగా, ముప్పు గురించి మాకు ఉన్న అవగాహన మేరకు, మీ PhonePe వాలెట్/eGVపై పరిమితులు/ఆంక్షలు/నిలిపివేతను విధించాలని నిర్ణయించవచ్చు.
  • పైన పేర్కొన్న వాటి కోసం, మీ PhonePe మొబైల్ అప్లికేషన్‌లో అందించే సర్వీస్‌లతో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, మీ PhonePe  అకౌంట్‌ను సమీక్షించడానికి మీరు మాకు అధికారం ఇచ్చారు, అలానే దీన్ని అర్థం చేసుకున్నారు.
  • మీ PhonePe అకౌంట్ / PhonePe వాలెట్/ eGVలో, అలానే PhonePe అప్లికేషన్‌లో అందించిన ఏవైనా సర్వీస్‌లలో మేము ఏవైనా వ్యత్యాసాలను గమనించినప్పుడు, మీ PhonePe అకౌంట్ వినియోగాన్ని బ్లాక్ చేయాల్సి/నిలిపివేయాల్సి/దానిపై పరిమితి విధించాల్సి/దాన్ని నియంత్రించాల్సి రావచ్చని కూడా మీరు అంగీకరిస్తున్నారు.

PhonePe వాలెట్/eGV నిషేధిత వినియోగం, యూజర్ ప్రవర్తన, బాధ్యతలు

  • మీరు ఏ వ్యక్తి లేదా సంస్థగానూ నటించకూడదు, ఏ వ్యక్తి లేదా సంస్థతోనైనా మీకు ఉన్న అనుబంధాన్ని తప్పుగా క్లెయిమ్ చేయకూడదు లేదా తప్పుగా సూచించకూడదు, లేదా అనుమతి లేకుండా ఇతరుల అకౌంట్లను యాక్సెస్ చేయకూడదు, వేరే వ్యక్తి డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేయకూడదు లేదా ఏదైనా ఇతర మోసపూరిత కార్యకలాపానికి పాల్పడకూడదు.
  • PhonePe, మా అనుబంధ సంస్థలు లేదా ఇతర సభ్యులు లేదా యూజర్లను మోసగించడానికి మీరు PhonePe వాలెట్/ eGVని ఉపయోగించకూడదు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలలో (చట్ట ప్రకారం నిషేధించిన ప్రోడక్ట్‌లతో వ్యవహరించడం లేదా నిషేధించిన సర్వీస్‌ల్లో పాలుపంచుకోవడం సహా, కానీ వీటికే పరిమితం కాకుండా) పాల్గొనకూడదు.
  • మీ PhonePe వాలెట్/ eGVలోకి డబ్బును లోడ్ చేయడానికి మీరు మోసపూరిత నిధులను  ఉపయోగించకూడదు, అలానే మోసపూరిత నిధులను ఉపయోగించి దేన్నైనా (ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లును) కొనుగోలు చేయకూడదు. మనీ లాండరింగ్, ట్యాక్స్‌ ఎగవేత లేదా ఏదైనా ఇతర చట్టవిరుద్ధ/ అనుమానాస్పద కార్యకలాపాల కోసం మీరు PhonePe వాలెట్/ eGVని ఉపయోగించకూడదు.
  • PhonePeకు ఫిర్యాదులు, వివాదాలు, జరిమానాలు, పెనాల్టీలు, ఛార్జీలు లేదా ఏదైనా ఇతర లయబిలిటీని కలిగించే విధంగా లేదా ఇతర వ్యక్తులకు నష్టం కలిగించే విధంగా మీరు PhonePe వాలెట్/eGV బ్యాలెన్స్‌లను ఉపయోగించకూడదు.
  • మీ PhonePe వాలెట్/eGVని ఉపయోగించి లావాదేవీలు చేస్తున్నప్పుడు మీరు తగిన డ్యూ-డిలిజెన్స్‌ను పాటించాలి, ఒకవేళ మీరు ఏదైనా అమౌంట్‌ను పొరపాటున ఏదైనా మర్చంట్‌కు లేదా ఏదైనా ఇతర వ్యక్తికి బదిలీ చేసినట్లయితే, అటువంటి అమౌంట్‌ను ఏ పరిస్థితుల్లోనూ మీకు రీఫండ్ చేయడానికి PhonePe బాధ్యత వహించదు.
  • వెబ్‌సైట్/యాప్‌లో థర్డ్-పార్టీ సైట్‌కు సంబంధించిన ఏదైనా వెబ్-లింక్ ఉన్నంత మాత్రాన, ఆ వెబ్-లింక్‌ను ఎండార్స్‌ చేస్తున్నట్లుగా (బలపరుస్తున్నట్లుగా) పరిగణించకూడదు. అటువంటి ఏదైనా ఇతర వెబ్-లింక్‌ను ఉపయోగించడం లేదా బ్రౌజ్ చేయడం వల్ల, మీరు అటువంటి ప్రతి వెబ్-లింక్‌లోని నియమ, నిబంధనలకు లోబడి ఉండాలి, అంతేగాక ఆ వెబ్‌సైట్/అప్లికేషన్‌ను ఉపయోగించే ముందు మీరు వాటి నియమ, నిబంధనలను సమీక్షించాలి.
  • PhonePe అన్ని కస్టమర్ కమ్యూనికేషన్లను SMS/ ఇమెయిల్/ నోటిఫికేషన్ లేదా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతిలో పంపుతుంది, అలానే వాటిని డెలివరీ చేయమని SMS/ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లకు వాటిని సమర్పించిన తర్వాత, అవి మీకు అందినట్లుగానే భావించబడుతుంది. మీరు అటువంటి అన్ని కమ్యూనికేషన్‌లను సమీక్షించాలి, ఒకవేళ మీకు ఏదైనా సమస్య లేదా సందేహం ఉంటే మాకు తిరిగి నివేదించాలి.
  • PhonePe/ మర్చంట్లు నుండి అన్ని లావాదేవీలు, ప్రచారాలకు సంబంధించిన మెసేజ్‌లను పొందడానికి మీరు అంగీకరిస్తున్నారు. అయితే, మీరు ప్రచారాలకు సంబంధించిన మెసేజ్‌లను పొందకూడదని అనుకుంటే, అటువంటి ఇమెయిల్‌ లోనే ఇచ్చిన ఆప్ట్-అవుట్ (బయటపడటం) ఎంపికను ఎంచుకుని లేదా PhonePe/మర్చంట్ మీకు అందుబాటులో ఉంచిన ఏదైనా ఇతర మాధ్యమం ద్వారా మీ సమ్మతిని వ్యక్తం చేసి అటువంటి మెసేజ్‌లను పొందడాన్ని నిలిపివేయవచ్చు.
  • మీరు PhonePe వాలెట్‌ మరియు/లేదా eGVని సదుద్దేశంతో, వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించాలి, ఇంకా ఏదైనా మర్చంట్ ద్వారా కొనుగోలు చేసిన లేదా సరఫరా చేసిన ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లపై విధించే ఏవైనా ట్యాక్స్‌లు, సుంకాలు లేదా ఇతర ప్రభుత్వ లెవీలు లేదా ఏవైనా ఆర్థిక ఛార్జీలు లేదా లావాదేవీల నుండి ఉత్పన్నమయ్యే ఇతర అంశాలకు చేయాల్సిన పేమెంట్‌కు మీరే పూర్తి బాధ్యత వహించాలి.
  • PhonePe వాలెట్/ eGVని విదేశీ కరెన్సీతో లావాదేవీలు చేయడానికి ఉపయోగించలేదని మీరు నిర్ధారించుకోవాలి. భారతదేశంలో మాత్రమే PhonePe వాలెట్/ eGV జారీ అవుతుంది, అలానే ఇక్కడే చెల్లుబాటు అవుతుంది, భారతదేశంలోని మర్చంట్ల కోసం మాత్రమే ఉపయోగించాలి.
  • PhonePe సర్వీస్‌ల ద్వారా మీరు మర్చంట్ ప్లాట్‌ఫామ్ నుండి ఏవైనా వస్తువులు లేదా ఏవైనా ఇతర సర్వీస్‌లను పొందినప్పుడు, వాటికి సంబంధించి మీకు, మర్చంట్‌కు మధ్య కుదిరిన ఒప్పందంలో మేము ఓ పార్టీ కాదని మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నారు. దాని వెబ్‌సైట్ లేదా యాప్‌కు లింక్ చేసిన ఏ ప్రకటనదారుని లేదా మర్చంట్‌ను మేము బలపర్చము. అంతేకాకుండా, మీరు ఉపయోగించే మర్చంట్‌ సర్వీస్‌ను పర్యవేక్షించాల్సిన బాధ్యత మాకు లేదు; వారెంటీలు లేదా హామీలతో సహా ఒప్పందంలోని (దీనికే పరిమితి కాకుండా) అన్ని లయబిలిటీలకు మర్చంట్‌ మాత్రమే బాధ్యత వహిస్తారు. ఏ మర్చంట్‌తోనైనా తలెత్తిన ఏదైనా వివాదం లేదా ఫిర్యాదును మీకు, మర్చంట్‌కు సంయుక్తంగా వర్తించే నిబంధనల ప్రకారం, మర్చంట్‌తోనే నేరుగా యూజర్‌ పరిష్కరించుకోవాలి. PhonePe సర్వీస్‌లను ఉపయోగించి, మర్చంట్ నుండి కొనుగోలు చేసిన వస్తువులు మరియు/లేదా సర్వీస్‌లలో ఏదైనా లోపానికి మేము బాధ్యత వహించము లేదా బాధ్యత తీసుకోము అని స్పష్టం చేయడమైంది. ఏదైనా వస్తువు మరియు/లేదా సర్వీస్‌ను కొనుగోలు చేసే ముందు దాని నాణ్యత, పరిమాణం, ఫిట్‌నెస్ గురించి మీరు సంతృప్తి చెందితేనే ముందుకు కొనసాగాలని మీకు సూచించడమైంది.

కమ్యూనికేషన్

  • మీరు PhonePe‌కు సైన్‌అప్ చేయడం, PhonePe‌లో లావాదేవీలు చేయడం, లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఏదైనా థర్డ్‌ పార్టీ సర్వీస్‌లు/ప్రోడక్ట్‌లు వినియోగించే సమయంలో ఇచ్చిన మీ కాంటాక్ట్‌ వివరాలను ఉపయోగించి మిమ్మల్ని PhonePe సంప్రదించవచ్చు.
  • మేము మీకు ఇమెయిల్‌లు లేదా SMS లేదా పుష్ నోటిఫికేషన్లు లేదా ఏదైనా ఇతర టెక్నాలజీ ద్వారా కమ్యూనికేషన్ అలెర్ట్‌లను పంపుతాము. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఇమెయిల్ అడ్రస్‌ తప్పు అవ్వడం, నెట్‌వర్క్ అంతరాయాలతో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, మా నియంత్రణలో లేని కారణాల వల్ల కమ్యూనికేషన్‌లలో అంతరాయం కలగవచ్చని కూడా మీరు అంగీకరిస్తున్నారు. ఏదైనా అలెర్ట్ అందకపోవడానికి లేదా కమ్యూనికేషన్ ఆలస్యం కావడం, అపార్థం చేసుకోవడం లేదా వైఫల్యం చెందడం వల్ల మీకు కలిగే ఏదైనా నష్టానికి PhonePe బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు.
  • మాకు పంపిన కాంటాక్ట్‌ వివరాలకు మీరే బాధ్యత వహిస్తారని, అలానే మీ కాంటాక్ట్‌ వివరాల్లో ఏదైనా మారితే, వెంటనే మాకు అప్‌డేట్ ఇస్తారని మీరు అంగీకరిస్తున్నారు. ఏదైనా PhonePe సర్వీస్‌ లేదా ఆఫర్(లు) కోసం మిమ్మల్ని సంప్రదించడానికి, అలానే మీతో కమ్యూనికేట్ చేయడానికి మీరు మాకు అధికారం ఇస్తున్నారు. అలెర్ట్‌లను పంపడానికి లేదా మీతో కమ్యూనికేట్ చేయడానికి మేము థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లను ఉపయోగించవచ్చు. కాల్‌లు, SMS, ఇమెయిల్‌లు, అలానే ఏదైనా ఇతర కమ్యూనికేషన్ పద్ధతిలో మిమ్మల్ని సంప్రదించడం కోసం, DND సెట్టింగ్‌లను దాటవేయడానికి మీరు PhonePe, PhonePe ఎంటిటీలకు అధికారం ఇస్తున్నారు.

వివాదాలు

  • మీ PhonePe వాలెట్/ eGV వినియోగం, అలానే ఆపరేషన్‌ వల్ల తలెత్తిన వివాదాలు ఏవైనా ఉంటే, 30 రోజుల్లోపు మాకు తెలియజేయాలి, ఆ తర్వాత తెలిపితే, అటువంటి ఏదైనా క్లెయిమ్/సంఘటనకు మేము బాధ్యత వహించము. అయితే, మీ నుండి మాకు వివాదం గురించి సమాచారం అందిన తర్వాత, మీ వివాదాన్ని ఒక ప్రత్యేకమైన ట్రాకింగ్ రెఫరెన్స్ ద్వారా మేము గుర్తిస్తాము, అలానే దాన్ని అక్‌నాలెడ్జ్ చేస్తాము.
  • సామరస్యపూర్వకంగా పరిష్కారం కాని ఏవైనా వివాదాలను, కింద పేర్కొన్న ‘పాలక చట్టం, అధికార పరిధి విభాగం’ ప్రకారం పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాము.

నష్టపరిహారం & బాధ్యత పరిమితి

  • ఒప్పందం, హక్కుల అతిక్రమణ లేదా ఇతరత్రా కారణాల వల్ల, PhonePe వాలెట్‌ లేదా eGVని ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే లాభాలు లేదా ఆదాయాల నష్టం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాల నష్టం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టంతో సహా, కానీ వీటికే పరిమితి కాకుండా, పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షార్హమైన నష్టాలకు, అవి ఎలా సంభవించినా, అలానే ఒప్పందం, హక్కుల అతిక్రమణ, నిర్లక్ష్యం, వారెంటీ లేదా ఇతరత్రా కారణాల వల్ల ఉత్పన్నమైనా సరే, PhonePe ఏ సందర్భంలోనూ ఆ నష్టాలకు బాధ్యత వహించదు. ఒకవేళ బాధ్యత ఏదైనా ఉంటే, చర్యకు కారణమైన PhonePe వాలెట్‌ లేదా eGVలను ఉపయోగించి మీరు చెల్లించిన అమౌంట్‌‌ లేదా వంద (₹100) రూపాయలను, వీటిలో ఏది తక్కువైతే ఆ అమౌంట్‌ను మించకూడదు.

వాలెట్‌ వినియోగ నియమాల సవరణ

  • ఈ వాలెట్‌ వినియోగ నియమాలు మన పరస్పర హక్కులు, బాధ్యతలు, విధులను నియంత్రిస్తాయి, అలానే రెగ్యులేటర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల నోటిఫికేషన్లు, దేశ చట్టంలో మార్పులు లేదా PhonePe అంతర్గత పాలసీలు, విధానాలతో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, వాటి ప్రకారం అవసరమైన విధంగా మార్పులకు లోబడి ఉంటాయి.
  • మా ప్రస్తుత పద్ధతులు, విధానాలు, ప్రోడక్ట్‌ ఫీచర్లు, రెగ్యులేటర్లు నోటిఫై చేసిన ఇతర మార్పులు, చట్టంలో మార్పులను ప్రతిబింబించేలా ఈ వాలెట్‌ వినియోగ నియమాలను సవరించవచ్చు. మేము వాలెట్‌ వినియోగ నియమాలను తదనుగుణంగా అప్‌డేట్ చేస్తాము, అలానే మీ PhonePe వాలెట్/eGVని ఉపయోగిస్తున్నప్పుడు మీరు నియమాలను సమీక్షించాల్సి ఉంటుంది. మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం వినియోగిస్తూ, ఆపరేట్ చేస్తూ ఉంటే, ఈ వాలెట్‌ వినియోగ నియమాలు, అలానే ఒప్పందాన్ని మీరు ఆమోదించినట్లుగా భావించడమవుతుంది.
  • మీ PhonePe వాలెట్/eGVలు అనేవి అనుమతులు ఇవ్వగలిగే రెగ్యులేటరీ ఉత్తర్వుల ఆధారంగా జారీ అవుతాయి, అయితే ఆయా ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు జరిగితే, అది మీ PhonePe వాలెట్/eGV జారీ, ఆపరేషన్, వినియోగాన్ని ప్రభావితం చేయవచ్చని, ఇందులో నిలిపివేత/ఆపివేత కూడా ఉండవచ్చని, ఇది పూర్తిగా అటువంటి ఆదేశాల ప్రకారమే నిర్వచించడమైందని, ఈ వాలెట్‌ వినియోగ నియమాల్లో ప్రతిబింబించకపోవచ్చని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.

మేధో సంపత్తి హక్కులు

  • ఈ వాలెట్‌ వినియోగ నియమాల ప్రయోజనం నిమిత్తం, మేధో సంపత్తి హక్కులు అంటే ఎల్లప్పుడూ రిజిస్టర్ చేసిన లేదా చేయని కాపీరైట్‌లు, పేటెంట్లను ఫైల్ చేసే హక్కులతో సహా పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ట్రేడ్ పేర్లు, ట్రేడ్ దుస్తులు, హౌస్ మార్కులు, కలెక్టివ్ మార్కులు, అసోసియేట్ మార్కులు, వాటిని రిజిస్టర్ చేసుకునే హక్కు, ఇండస్ట్రియల్, లేఅవుట్ డిజైన్‌లు, భౌగోళిక సూచికలు, నైతిక హక్కులు, ప్రసార హక్కులు, ప్రదర్శన హక్కులు, పంపిణీ హక్కులు, అమ్మకపు హక్కులు, సంక్షిప్త హక్కులు, అనువాద హక్కులు, పునరుత్పత్తి హక్కులు, పెర్ఫామెన్స్ (చేసి, చూపించే) హక్కులు, కమ్యూనికేట్ చేసే హక్కులు, అనుసరణ హక్కులు, సర్క్యులేటింగ్ హక్కులు, రక్షిత హక్కులు, ఉమ్మడి హక్కులు, పరస్పర హక్కులు, ఉల్లంఘన హక్కులు అని అర్థం. డొమైన్ పేర్లు, ఇంటర్నెట్ లేదా వర్తించే చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర హక్కు ఫలితంగా ఉత్పన్నమయ్యే మేధో సంపత్తి హక్కులన్నీ, అటువంటి డొమైన్ పేరు యజమాని అయిన PhonePe లేదా PhonePe ఎంటిటీల అధీనంలో ఉంటాయి. పైన పేర్కొన్న మేధో సంపత్తి హక్కులలో ఏ భాగం కూడా యూజర్ పేరున బదిలీ కాదని, అలానే PhonePe వాలెట్‌ లేదా eGV లేదా ఈ ఒప్పందాన్ని ఆపరేట్ చేయడం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా మేధో సంపత్తి హక్కులు కూడా, సందర్భానుసారం, మా లేదా మా లైసెన్సర్ల పూర్తి యాజమాన్యం, స్వాధీనం, నియంత్రణలో ఉంటాయని ఇందుమూలంగా పార్టీలు అంగీకరించి, నిర్ధారిస్తున్నాయి.
  • PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఇమేజ్‌​లు, విశదీకరణలు, ఆడియో క్లిప్‌లు, వీడియో క్లిప్‌లతో సహా అన్ని మెటీరియల్స్‌కు PhonePe, PhonePe ఎంటిటీలు లేదా బిజినెస్‌ పార్ట్‌నర్ల కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇతర మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షణ ఉంటుంది. PhonePe ప్లాట్‌ఫామ్‌లోని మెటీరియల్‌ మీ వ్యక్తిగత, వాణిజ్యేతర వినియోగం కోసం మాత్రమే ఉద్దేశించినది. మీరు ఇమెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా, అలానే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ అటువంటి విషయాలను కాపీ చేయకూడదు, మళ్ళీ ఉత్పత్తి చేయకూడదు, తిరిగి ప్రచురించకూడదు, అప్‌లోడ్ చేయకూడదు, పోస్ట్ చేయకూడదు, ప్రసారం చేయకూడదు లేదా పంపిణీ చేయకూడదు, అంతేగాక ఇలా చేసేందుకు యత్నిస్తున్న ఏ ఇతర వ్యక్తికీ మీరు సహాయం చేయకూడదు. యజమాని నుండి ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా, మెటీరియల్‌ను సవరించడం, ఏదైనా ఇతర ప్లాట్‌ఫామ్‌ లేదా నెట్‌వర్క్‌తో అనుసంధానమైన కంప్యూటర్ వ్యవస్థలో మెటీరియల్‌ను వినియోగించడం లేదా వ్యక్తిగత, వాణిజ్యేతర వినియోగానికి కాకుండా ఇతర ప్రయోజనాల కోసం మెటీరియల్‌ను ఉపయోగించడం అనేది కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇతర యాజమాన్య హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది, అలా ఉల్లంఘించడంపై నిషేధం కూడా ఉంది.

పాలక చట్టం / అధికార పరిధులు

  • ఈ ఒప్పందం, దాని కింద ఉన్న హక్కులు, విధులు, పార్టీల మధ్యన ఉన్న సంబంధాలు, ఇంకా ఒప్పందం, ఈ వాలెట్‌ వినియోగ నియమాల కింద లేదా దానికి సంబంధించి ఉత్పన్నమయ్యే, అలానే నిర్మాణం, చెల్లుబాటు, పనితీరు లేదా దాని ప్రకారం నిలుపుదలతో సహా, అన్ని అంశాలు భారత గణతంత్ర చట్టాలకు లోబడి ఉంటాయి, వీటికి అనుగుణంగానే అర్థం చేసుకోవాలి.
  • మీ PhonePe వాలెట్‌ లేదా eGVకి సంబంధించి లేదా వాటిని మీరు వినియోగించడానికి లేదా వినియోగించకపోవడానికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏదైనా వివాదం లేదా భేదాభిప్రాయం పార్టీల మధ్య తలెత్తితే, ఆ వివాదం లేదా భేదాభిప్రాయాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మీరు, PhonePe నియమించిన ఉద్యోగి లేదా ప్రతినిధి వెంటనే, సదుద్దేశంతో చర్చలు జరపాలి.
  • ఏదైనా వివాదం లేదా భేదాభిప్రాయం ఉండటం వల్ల లేదా ప్రారంభం అవ్వడం వల్ల, ఈ ఒప్పందం ప్రకారం లేదా చట్టం ప్రకారం పార్టీలు నిర్వర్తించాల్సిన తమకు సంబంధించిన విధులను వాయిదా వేయకూడదు లేదా ఆలస్యం చేయకూడదు. ఇందులో ఏది ఉన్నప్పటికీ, కొనసాగుతున్న ఉల్లంఘనను నిరోధించడానికి, నిషేధాజ్ఞను లేదా ఏదైనా ఇతర నిర్దిష్ట ఉపశమనాన్ని కోరడానికి లీగల్ ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించే హక్కు పార్టీలకు ఉంటుంది.
  • సామరస్యపూర్వకంగా పరిష్కారించుకోవాలనే ఉద్దేశానికి లోబడి, అలానే ఈ విషయంలో పక్షపాతం లేకుండా, మీ PhonePe వాలెట్‌ లేదా eGVలు లేదా ఇక్కడ కవర్ చేసిన ఇతర అంశాల వినియోగానికి సంబంధించి ఉత్పన్నమయ్యే అన్ని విషయాలపై విచారణ చేపట్టి, తీర్పు చెప్పడానికి కర్ణాటకలోని బెంగళూరు కోర్టులకు ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది.

సాధారణ నిబంధనలు

  • ఈ ఒప్పందాన్ని (ఈ ఒప్పందంలోని మా అన్ని హక్కులు, అధికారాలు, లబ్ధిలు, ప్రయోజనాలు, బాధ్యతలు, విధులతో సహా) లేదా అందులోని ఏదైనా భాగాన్ని దాని అనుబంధ సంస్థలకు, ఇంకా ఎవరైనా చట్టబద్ధమైన వారసుడికి అప్పగించే హక్కు PhonePeకు ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం స్వతంత్ర కాంట్రాక్టర్లు లేదా ఇతర థర్డ్ పార్టీలకు నిర్దిష్ట PhonePe హక్కులు, బాధ్యతలను PhonePe అప్పగించవచ్చు. మా ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మీరు ఈ ఒప్పందాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా, ఏ వ్యక్తికి లేదా సంస్థకు అప్పగించకూడదు, ఈ అనుమతిని మా సొంత అభీష్టానుసారం నిలిపివేయవచ్చు.
  • “ఫోర్స్ మెజ్యూర్ ఈవెంట్‌ (అనివార్య కారణం)” అంటే PhonePe సహేతుకమైన నియంత్రణకు మించిన ఏదైనా సంఘటన అని అర్థం, దీని కింద యుద్ధం, అల్లర్లు, అగ్నిప్రమాదం, వరదలు, దైవ కార్యాలు, పేలుడు, సమ్మెలు, లాకౌట్‌లు, మందగమనం, ఇంధన సరఫరాల సుదీర్ఘ కొరత, మహమ్మారి, కంప్యూటర్ హ్యాకింగ్, కంప్యూటర్ డేటా, ఇంకా స్టోరేజ్ పరికరాలకు అనధికార యాక్సెస్, కంప్యూటర్ క్రాష్‌లు, ఈ ఒప్పందం ప్రకారం PhonePe/ PhonePe ఎంటిటీలు తమ సంబంధిత బాధ్యతలను నిర్వర్తించకుండా నిషేధించే లేదా అడ్డుకునే రాష్ట్ర లేదా ప్రభుత్వ చర్యలు ఉంటాయి, కానీ వాటికే పరిమితం కాదు.

బాధ్యతా నిరాకరణలు

  • ఈ ఒప్పందం ఇంగ్లీష్ వెర్షన్‌కు, అలానే వేరే భాషలోని వెర్షన్‌కు మధ్య ఏదైనా వైరుధ్యం ఉంటే, ఇంగ్లీష్ వెర్షన్ తుదిగా అమలవుతుంది.
  • ఈ ఒప్పందం ప్రకారం మా హక్కులలో దేన్నైనా అమలు చేయడంలో PhonePe వైఫల్యం చెందితే, అది అటువంటి హక్కును వదులుకున్నట్లు కాదు లేదా తర్వాతి కాలంలో మరోసారి ఉల్లంఘించడానికి అనుమతి ఇచ్చినట్లు కాదు లేదా ఇదే విధమైన ఉల్లంఘనకు సంబంధించి మినహాయింపు ఇచ్చినట్లు కాదు. రాతపూర్వకంగా ఇస్తేనే మినహాయింపు అమలులో ఉంటుంది.
  • ఈ ఒప్పందంలోని ఏదైనా నిబంధన చెల్లదని లేదా అమలు చేయలేదని నిర్ధారిస్తే, ఆ పరిమితి మేరకు ఆ నిబంధనను తొలగిస్తాము/ సవరిస్తాము, అయితే మిగిలిన నిబంధనలు చెల్లుబాటు అవుతూనే, అమలవుతూనే ఉంటాయి.
  • హెడ్డింగ్‌లను కేవలం సౌలభ్యం కోసం మాత్రమే ఇచ్చాము, అంతమాత్రాన అవి అటువంటి విభాగం పరిధిని లేదా విస్తృతిని ఏ విధంగానూ నిర్వచించవు, పరిమితం చేయవు, అర్థాన్ని చెప్పవు లేదా వివరించవు.
  • PhonePe, దాని ఎంటిటీలు, బిజినెస్ పార్ట్‌నర్లు, థర్డ్ పార్టీ పార్ట్‌నర్లు PhonePe సర్వీస్‌ల నాణ్యతకు సంబంధించి స్పష్టంగా లేదా పరోక్షంగా ఎటువంటి వారెంటీని ఇవ్వరు, వాటిలో ఇవి ఉంటాయి, కానీ వీటికే పరిమితం కాదు: i) సర్వీస్‌లు మీ అవసరాలను తీరుస్తాయి; ii) సర్వీస్‌లు అంతరాయం లేనివి, సమయానుకూలమైనవి లేదా లోపం లేనివి; లేదా iii) సర్వీస్‌లకు సంబంధించి మీరు పొందిన ఏవైనా ప్రోడక్ట్‌లు, సమాచారం లేదా మెటీరియల్ మీ అవసరాలను తీరుస్తాయి.
  • కింది సందర్భాల్లో, సిస్టమ్‌లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మీరు PhonePe వాలెట్‌ లేదా eGVని ఉపయోగించలేకపోతే, మీరు PhonePe మరియు/లేదా దాని అనుబంధ సంస్థలను బాధ్యులను చేయరని మీరు అంగీకరిస్తున్నారు:
  • సిస్టమ్‌ను నిలిపివేస్తామని PhonePe ముందుగానే ఏదైనా కమ్యూనికేషన్ పద్ధతిలో ప్రకటించినప్పుడు;
  • టెలీకమ్యూనికేషన్స్ పరికరాలు లేదా సిస్టమ్‌లలో వైఫల్యం వల్ల డేటా ట్రాన్స్‌మిషన్‌ విఫలమైనప్పుడు;
  • టైఫూన్, భూకంపం, సునామీ, వరదలు, విద్యుత్ అంతరాయం, యుద్ధం, తీవ్రవాద దాడి, మా సహేతుకమైన నియంత్రణకు మించిన ఇతర అనివార్య సంఘటనల వల్ల సిస్టమ్ ఆపరేషన్లు విఫలమైనప్పుడు; లేదా
  • హ్యాకింగ్, వెబ్‌సైట్ అప్‌గ్రేడ్, బ్యాంక్‌లు/ అధికారులు/ రెగ్యులేటర్ల నుండి వచ్చే ఆదేశాలు, PhonePe నియంత్రణలో లేని ఇతర కారణాల వల్ల సర్వీస్‌లకు అంతరాయం కలిగినప్పుడు లేదా సర్వీస్‌లు ఆలస్యం అయినప్పుడు.
  • ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న వాటికి మినహా, అలానే చట్ట ప్రకారం పూర్తిగా అనుమతి ఉన్న మేరకు, PhonePe వాలెట్‌ లేదా eGV సర్వీస్‌లు అనేవి “ఉన్నవి ఉన్నట్లుగా” , “ఎలా లభిస్తే అలానే”, ఇంకా “అన్ని లోపాలతో” అందుతాయి. అటువంటి వారెంటీలు, ప్రాతినిధ్యాలు, షరతులు, వాగ్ధానాలు, నిబంధనలు అన్నింటికీ, అవి స్పష్టంగా తెలిపినా లేదా పరోక్షంగా తెలిపినా, ఇందుమూలంగా మినహాయింపు ఉంటుంది. PhonePe అందించిన లేదా సాధారణంగా అందుబాటులో ఉన్న సర్వీస్‌లను, ఇతర సమాచార ఖచ్చితత్వాన్ని, పరిపూర్ణతను, వినియోగాన్ని అంచనా వేయాల్సిన బాధ్యత మీదే. మా తరపున ఏదైనా వారెంటీ ఇవ్వడానికి మేము ఎవరికీ అధికారం ఇవ్వము, ఒకవేళ ఎవరైనా అలా ప్రకటించినా దానిపై మీరు ఆధారపడకూడదు.
  • మీకు ఇతర పార్టీలతో వివాదం ఉంటే, అటువంటి వివాదాల నుండి లేదా దానికి సంబంధించి ఏ విధంగానైనా ఉత్పన్నమయ్యే అన్ని రకాల, అన్ని స్వభావాల తెలిసిన, తెలియని క్లెయిమ్‌లు, డిమాండ్లు, నష్టాల (వాస్తవ, పర్యవసాన నష్టాలు) నుండి మీరు PhonePeను (అలానే దాని అనుబంధ సంస్థలు, అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, సర్వీస్ ప్రొవైడర్లు, ఉద్యోగులను) తప్పిస్తున్నారు.
  • ఆన్‌లైన్ లావాదేవీల వల్ల ఉత్పన్నమయ్యే అన్ని ముప్పులు/నష్టాలను మీరే భరిస్తారని, అలానే ఏదైనా వివాదం తలెత్తినప్పుడు, PhonePe వాలెట్‌ లేదా eGV వినియోగం ద్వారా నిర్వహించిన లావాదేవీలను నిర్ణయించే సాక్ష్యంగా PhonePe రికార్డులకు కట్టుబడి ఉంటారని మీరు అంగీకరిస్తున్నారు.

నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC)

arrow icon

ఈ డాక్యుమెంట్‌ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం రూపొందిన ఒక ఎలక్ట్రానిక్ రికార్డు, దీనిలో కాలానుగుణంగా జరిగే ఏవైనా సవరణలు, వర్తించే నియమాలు, అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం సవరించిన వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించి సవరించిన నిబంధనలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డు కంప్యూటర్ సిస్టమ్‌తో జనరేట్ చేసినది, అలానే దీనిపై ఎటువంటి ఫిజికల్‌ లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.

భారతదేశం వ్యాప్తంగా NCMC ఎనేబుల్ చేసిన మెట్రో స్టేషన్లలో మీ PhonePe కో-బ్రాండెడ్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (“కార్డ్ ” లేదా “NCMC కార్డ్”) కోసం అప్లై చేసే, కార్డ్‌ను రీఛార్జ్/టాప్-అప్ చేసే మరియు/లేదా ఉపయోగించే ముందు దయచేసి ఈ నియమ, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. ఈ కార్డ్‌కు PhonePe, L&T మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌‌లు కో-బ్రాండ్‌లు నిలిచాయి, ఇది మీ PhonePe ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్/ వాలెట్‌‌తో (“PPI”తో) లింక్ అయినది. RuPay నెట్‌వర్క్ కిందకి మీ కార్డ్‌ వస్తుంది.

ఈ నియమ, నిబంధనలు అనేవి మీకు, అలానే ఆఫీస్-2, ఫ్లోర్ 5, వింగ్ A, బ్లాక్  A, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, బెల్లందూర్ విలేజ్, వర్తూర్ హోబ్లి, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు సౌత్, బెంగళూరు, కర్ణాటక, భారతదేశం, 560103, భారతదేశం అనే చిరునామాలో రిజిస్టర్ చేసిన ఆఫీస్ ఉన్న PhonePe లిమిటెడ్‌ (గతంలో ‘PhonePe ప్రైవేట్ లిమిటెడ్’ అని పిలిచేవారు) (“PhonePe”/ “మేము”/ “మా”) మధ్య కుదిరిన చట్టపరమైన ఒప్పందాన్ని (“నియమ, నిబంధనలు / ఒప్పందం”) సూచిస్తాయి. ఇక్కడ పేర్కొన్న నియమ & నిబంధనలను మీరు చదివారని అంగీకరించి, గుర్తిస్తున్నారు. మీరు ఈ నియమ, నిబంధనలను అంగీకరించకపోతే లేదా ఈ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండకూడదని అనుకుంటే, మీరు ఈ కార్డ్‌ను ఉపయోగించకూడదు మరియు/లేదా కార్డ్‌ను నేరుగా PhonePeకు లేదా అది జారీ అయిన చోటుకు వెంటనే తిరిగి ఇవ్వండి/పంపండి.

PhonePe ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేసి, మేము ఎప్పుడైనా నియమ, నిబంధనలను సవరించవచ్చు. నియమ, నిబంధనల అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేసిన వెంటనే అవి అమల్లోకి వస్తాయి. కార్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, ఆయా అప్‌డేట్‌లు / మార్పుల కోసం ఈ నియమ, నిబంధనలను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన బాధ్యత పూర్తిగా మీదే. మార్పులను పోస్ట్ చేసిన తర్వాత కూడా మీరు కార్డ్‌ వినియోగాన్ని కొనసాగిస్తే, అదనపు నియమాలు లేదా ఈ నియమాల్లోని ఏవైనా భాగాల తొలగింపు, మార్పులు మొదలైన వాటితో సహా సవరణలను మీరు అంగీకరిస్తున్నారని అర్థం. మీరు ఈ నియమ, నిబంధనలను పాటిస్తున్నంత కాలం, కార్డ్‌ను ఉపయోగించడానికి మేము మీకు వ్యక్తిగత, నాన్-ఎక్స్‌క్లూజివ్ (మీకు మాత్రమే ప్రత్యేకం కాని), బదిలీ చేయలేని, పరిమిత అధికారాన్ని మంజూరు చేస్తాము.

కార్డ్‌ను వినియోగించడానికి ముందుకు కొనసాగడం ద్వారా, మీరు (“యూజర్‌”/ “మీరు”/ “మీ”) ఈ నియమ, నిబంధనలతో పాటు, సాధారణ PhonePe నియమ, నిబంధనలు (“సాధారణ వినియోగ నియమాలు”), అలానే PhonePe “ప్రైవసీ పాలసీ”కి కట్టుబడి ఉండటానికి మీ సమ్మతిని తెలియజేస్తున్నారు. కార్డ్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు PhonePeతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు, అలానే ఇందులో ప్రస్తావించిన ఈ నియమ, నిబంధనలు అనేవి PhonePeతో మీ బైండింగ్ బాధ్యతలను ఏర్పరుస్తాయి. ఈ నియమ, నిబంధనలు అనేవి PhonePe నిర్దేశించిన లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(“NPCI”) లేదా మీ NCMC ఆమోదించిన సంబంధిత మెట్రో స్టేషన్ జారీ చేసిన ఇతర నిబంధనలకు అదనం, అలానే వాటికి విరుద్ధంగా ఉండవు.

కార్డ్ జారీని, వినియోగాన్ని నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (“RBI”), ఏదైనా ఇతర సమర్థాధికారం ఉన్న సంస్థ / చట్టబద్ధమైన లేదా రెగ్యులేటరీ బాడీ(లు) జారీ చేసిన అన్ని సంబంధిత నోటిఫికేషన్లు/ మార్గదర్శకాలు / సర్క్యులర్లకు కట్టుబడి ఉంటారని మీరు హామీ ఇస్తున్నారు. కార్డ్‌ల వినియోగాన్ని నియంత్రించే అమల్లో ఉన్న, ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తున్న వర్తించే నోటిఫికేషన్లు/ మార్గదర్శకాలు / సర్క్యులర్లను మీరు ఉల్లంఘించినట్లయితే, దాని వల్ల కలిగే అన్ని రకాల లయబిలిటీలను PhonePe సంపూర్ణంగా నిరాకరిస్తుంది.

నిర్వచనాలు

అంశం లేదా సందర్భంలో ఏదైనా స్థిరత్వం లేకపోతే తప్ప, కింది జాబితాలో ఉన్న క్యాపిటలైజ్డ్ పదాలకు, https://www.phonepe.com/terms-conditionsలో వేరే నిర్వచనం ఇస్తే తప్ప, కింది అర్థాలు ఉంటాయి: 

  • “వర్తించే చట్టం” అంటే భారతదేశంలోని ఏదైనా లెజిస్లేటివ్ బాడీ ఆమోదించిన వర్తించే అన్ని శాసనాలు, చట్టాలు, ఏదైనా ప్రభుత్వ అథారిటీ చట్టం, ఆర్డినెన్స్‌లు, నియమాలు, ఉప-చట్టాలు, నిబంధనలు, నోటిఫికేషన్లు, మార్గదర్శకాలు, పాలసీలు, దిశానిర్దేశాలు, ఆదేశాలు, ఆర్డర్లు, అలానే వాటికి చేసిన ఏవైనా మార్పులు లేదా మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చిన చట్టాలు;
  • “కార్డ్ నెట్‌వర్క్” అంటే కార్డ్ నెట్‌వర్క్‌లు లేదా అటువంటి సంస్థలు రూపొందించిన సంబంధిత నిబంధనల ప్రకారం కార్డ్ లావాదేవీలను ప్రాసెస్‌ చేసే, సెటిల్ చేసే కార్డ్ నెట్‌వర్క్‌లు.
  • “కార్డ్ బ్యాలెన్స్” అంటే కార్డ్‌లో ఉన్న అమౌంట్.
  • “EDC” లేదా “ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్” లేదా “POS మెషీన్‌” లేదా “పాయింట్-ఆఫ్-సేల్ డివైస్” అనేది NPCI NCMC నెట్‌వర్క్‌లోని PhonePe లేదా మరేదైనా థర్డ్ పార్టీకి చెందిన మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ వద్ద ఉన్న NCMC ఎనేబుల్ చేసిన ఎలక్ట్రానిక్ పాయింట్-ఆఫ్-సేల్ స్వైప్ టెర్మినల్స్‌ను సూచిస్తుంది, ఇవి కొనుగోలు లావాదేవీలకు మీ కార్డ్ బ్యాలెన్స్‌ను డెబిట్ చేయడానికి అనుమతిస్తాయి, అంటే మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రవేశ ద్వారం వద్ద డెబిట్ చేయడానికి లేదా మీ కార్డ్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి;
  • “మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్లు” అంటే ట్రాన్సిట్ మర్చంట్లు అని అర్థం, అంటే RBI మార్గదర్శకాల ప్రకారం మీ కార్డ్‌ వినియోగానికి/రీఛార్జ్‌ చేసుకోవడానికి ఆమోదించే NCMC ఎనేబుల్ చేసిన EDCలు ఉన్న మెట్రో స్టేషన్, బస్సులు, రైలు, టోల్‌లు, పార్కింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లు, అవి ఎక్కడ ఉన్నా సరే, మీరు వేటికైతే పేమెంట్ చేస్తున్నారో వాటినే మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్లు అని అంటారు. 
  • “లావాదేవీ(లు)” అంటే మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వద్ద టికెట్‌ కొనుగోలుకు / కార్డ్‌ను లోడ్ చేయడానికి కార్డ్‌ను వినియోగించడం వల్ల ప్రభావితమయ్యే ఏదైనా లావాదేవీ(లు).
  • “వాలెట్” అంటే PhonePeతో ఉన్న మీ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్/ వాలెట్.

అర్హత, కార్డ్‌ను జారీ చేయడం

  • కార్డ్‌ కోసం అప్లై చేయడానికి, PhonePe ప్లాట్‌ఫామ్‌లో లేదా హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫారమ్‌ను మీరు నింపవలసి ఉంటుంది, దీనికి మీ పేరు, చిరునామా, మొబైల్ ఫోన్ నంబర్, ఇ-మెయిల్ చిరునామా, పుట్టిన తేదీ, మీకు నచ్చిన కమ్యూనికేషన్ భాష మొదలైన వాటితో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, మీ వివరాలు అవసరం.
  • మీరు మీ గుర్తింపు, వయస్సు, చిరునామా లేదా భారతదేశంలోని ఏవైనా చట్టాలు, నిబంధనలను అమలు చేయడానికి కావాల్సిన ఇతర సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తు తప్పుగా ఇవ్వకూడదు, అలానే కార్డ్‌ను తప్పుగా ఉపయోగించకూడదు. దయచేసి మీరు ఇచ్చిన మొత్తం సమాచారం అనేది వాస్తవాల దృష్ట్యా ఖచ్చితమైనదని, అలానే అప్‌డేట్ చేసినదని నిర్ధారించుకోండి.
  • ప్రస్తుతం, హైదరాబాద్ మెట్రో స్టేషన్లలోని ఎంపిక చేసిన అవుట్‌లెట్లలో మాత్రమే ఈ కార్డ్‌ జారీ అవుతోంది.
  • హైదరాబాద్ మెట్రో స్టేషన్‌కు వెళ్లి, కార్డ్‌ను అభ్యర్థించిన తర్వాత, కౌంటర్ వద్ద ఉన్న ఆపరేటర్ మీ మొబైల్ నంబర్‌ను అడుగుతారు, అదే నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (“OTP”) వస్తుంది. మీ మొబైల్ నంబర్‌ను OTPతో విజయవంతంగా వ్యాలిడేట్‌ చేసి, కార్డ్‌ను జారీ చేయడానికి వర్తించే ఫీజును మీరు చెల్లించిన తర్వాత, కార్డ్‌ను మీకు జారీ చేస్తారు. కార్డ్‌ను మీకు వెల్‌కమ్ కిట్‌తో పాటుగా జారీ చేస్తారు, ఇది మీ కార్డ్ ఫీచర్లు, నియమాలతో సహా, కార్డ్‌కు సంబంధించిన అన్ని వివరాలను స్పష్టంగా వివరిస్తుంది.
  • కార్డ్ యాక్టివేషన్ కోసం మీరు OTPని తెలపడం ద్వారా, మీ NCMC కార్డ్‌తో ఆఫ్‌లైన్ లావాదేవీలకు మీరు ఇందుమూలంగా మీ స్పష్టమైన సమ్మతిని తెలియజేస్తున్నారు.
  • మీ కార్డ్ ఎల్లప్పుడూ మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మీరు మీ మొబైల్ నంబర్‌ను మారిస్తే, మీరు కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. PhonePe మీ పాత కార్డ్‌పై టాప్ అప్‌లను బ్లాక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, మీ పాత మొబైల్ నంబర్‌తో లింక్ చేసిన కార్డ్‌లోని కార్డ్ బ్యాలెన్స్‌ను ఇప్పటికీ ఉపయోగించుకోవచ్చు.
  • ఒక మొబైల్ నంబర్‌పై గరిష్టంగా 5 కార్డ్‌లను జారీ చేయవచ్చు.
  • మీకు కార్డ్‌ను జారీ చేసిన తర్వాత, మీరు నగదు, UPI లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కార్డ్ బ్యాలెన్స్‌ను టాప్ అప్ చేసుకోవచ్చు. టాప్-అప్ అమౌంట్‌కు సంబంధించి మీకు SMS అలెర్ట్‌ వస్తుంది.

కార్డ్ ఫీచర్లు

  • కార్డ్‌ను బదిలీ చేయలేరు, జారీ చేసే సమయంలో కార్డ్‌ బ్యాలెన్స్ సున్నా ఉంటుంది. మీరు అందులో డబ్బు లోడ్ చేయాలి.
  • కార్డ్ బ్యాలెన్స్‌పై PhonePe ఎటువంటి వడ్డీని చెల్లించదు.
  • కార్డ్ ఈ నియమ, నిబంధనలకు, అలానే ఎప్పటికప్పుడు PhonePe, NPCI, RBI, కార్డ్ నెట్‌వర్క్ లేదా ఏదైనా ఇతర అథారిటీ నిర్దేశించిన ఏవైనా అదనపు షరతులకు లోబడి ఉంటుంది.
  • కార్డ్‌లు స్వభావరీత్యా రీలోడ్ చేయదగినవి.
  • ఒక మొబైల్ నంబర్‌పై గరిష్టంగా 5 కార్డ్‌లు (గడువు ముగిసిన కార్డ్‌లతో సహా) జారీ చేయవచ్చు. కార్డ్ గడువు ముగిసిన తర్వాత, ఈ పరిమితిని రీవ్యాలిడేట్ చేస్తారు.
  • మీ కార్డ్‌లో ఉండే అవుట్‌స్టాండింగ్ అమౌంట్‌, ఏ సమయంలోనైనా ₹2,000/- మించకూడదు, ఇది అప్పటికి అమల్లో ఉన్న రెగ్యులేటరీ మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది; RBI, NPCI లేదా ఏదైనా ఇతర రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారం, అప్పటికి అమల్లో ఉన్న రెగ్యులేటరీ మార్గదర్శకాలు, దాని అంతర్గత పాలసీల ఆధారంగా ఎప్పటికప్పుడు అటువంటి పరిమితులను తన సొంత అభీష్టానుసారం సవరించే హక్కు PhonePeకు మాత్రమే ఉంటుంది.
  • మీ కార్డ్‌ను టాప్ అప్ చేసేటప్పుడు, కనీస టాప్ అప్ అమౌంట్ అంటూ ఏమీ లేదు.
  • మీ కార్డ్ వ్యాలిడిటీ/గడువు వ్యవధి అనేది 5 సంవత్సరాలు లేదా మీ కార్డ్‌పై ముద్రించిన తేదీ వరకు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత మీ కార్డ్ రెన్యువల్ కాదు, అలానే మీ ప్రస్తుత కార్డ్ గడువు ముగిసిన తర్వాత, మీరు కొత్త కార్డ్‌ను కొనుగోలు చేయాలి.
  • మీ కార్డ్ నుండి క్యాష్-విత్‌డ్రాయల్, రీఫండ్ లేదా నిధుల బదిలీకి అనుమతి లేదు.
  • నగదు లోడింగ్: ఎప్పటికప్పుడు నిర్దేశించే మీ గుర్తింపు వెరిఫికేషన్, అలానే తప్పనిసరిగా అవసరమైన ఏవైనా ఇతర అంశాలకు లోబడి, మీరు ఎంచుకున్న మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ల వద్ద కార్డ్‌కు నగదును లోడ్ చేయవచ్చు, రీలోడ్ చేయవచ్చు. కనిష్ఠ అమౌంట్, గరిష్ఠ అమౌంట్, లోడింగ్‌ పరిమితి, లోడింగ్, రీలోడింగ్ ఫ్రీక్వెన్సీ మొదలైన వాటికి సంబంధించిన పరిమితులు అనేవి PhonePe ఎప్పటికప్పుడు అమలు చేసే ఏవైనా రిస్క్ ఆధారిత పారామితులతో పాటు, ప్రస్తుత రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా PhonePe ఎప్పటికప్పుడు నిర్దేశించిన విధంగా వర్తిస్తాయి. నగదు లోడింగ్ / రీలోడింగ్ సౌకర్యం అనేది సంబంధిత వర్తించే ఫీజు(ల)కు లోబడి ఉంటుంది. మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ నుండి మీరు బయలుదేరే ముందే అమౌంట్‌ లోడింగ్ విజయవంతమైందని, అలానే కార్డ్‌లో దానికి తగిన బ్యాలెన్స్ కనిపిస్తుందని మీరు నిర్ధారించుకోవాలి. లోడ్ చేసిన బ్యాలెన్స్‌లో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నా లేదా నగదును లోడ్‌ చేసే అటువంటి కార్యకలాపాలకు సంబంధించి వివాదాలు ఉన్నా, వాటికి PhonePe బాధ్యత వహించదు.
  • నగదు లోడింగ్ ద్వారా కార్డ్‌లను టాప్ అప్ చేసేటప్పుడు, టాప్ అప్‌కు సంబంధించి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS వచ్చే వరకు మీరు కౌంటర్ వద్ద వేచి ఉండాలి. మీ NCMC కార్డ్‌ను టాప్ అప్ చేసేటప్పుడు, డిపాజిట్‌ చేయమని కౌంటర్ వద్ద ఆపరేటర్‌కు మీరు ఇచ్చిన నగదు, అలానే SMSలోని టాప్ అప్ అమౌంట్ ఒకేలా ఉన్నాయని కూడా మీరు వెరిఫై చేసుకోవాలి.
  • కార్డ్‌ను మీరు మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో మాత్రమే ఉపయోగించగలరు, ప్రతి మర్చంట్ పార్ట్‌నర్‌ వద్ద మీరు ఉపయోగించలేరు. RBI, NPCI ఎప్పటికప్పుడు అనుమతించిన అన్ని వినియోగ సందర్భాల్లో కూడా ఈ కార్డ్‌ను ఉపయోగించవచ్చు.
  • PhonePe తన అభీష్టానుసారం, ఎప్పటికప్పుడు కార్డ్‌పై వివిధ ఫీచర్లు/ఆఫర్లను అందించడానికి వివిధ థర్డ్ పార్టీలతో చేతులు కలపవచ్చు. ఈ ఫీచర్లు అన్నీ మీకు సాధ్యమైనంత ఉత్తమ ప్రయత్నాల ప్రాతిపదికన మాత్రమే అందుతాయి, అలానే సర్వీస్ ప్రొవైడర్లు / మర్చంట్లు / అవుట్‌లెట్‌లు / ఏజెన్సీలు అందించే ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌ల సమర్థత, సామర్థ్యం, ఉపయోగం మరియు/లేదా కొనసాగింపు గురించి PhonePe మరియు/లేదా మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ హామీ ఇవ్వదు. దీనికి సంబంధించి వివాదాలు (ఏవైనా ఉంటే) PhonePe మరియు/లేదా మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో సంబంధం లేకుండా, మీరు నేరుగా సంబంధిత థర్డ్ పార్టీతో పరిష్కరించుకోవాలి.

మీ కార్డ్ వినియోగం, పరిమితులు

మీరు కింది అంశాలను గుర్తించి, వాటికి అంగీకారం తెలుపుతున్నారు:

  • ఈ కార్డ్ భారతదేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది, అలానే మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్లకు INRలో చేయాల్సిన పేమెంట్లకు సంబంధించి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది;
  • కార్డ్‌తో మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వద్ద మీరు చేసే ప్రతి లావాదేవీ గరిష్ట విలువ అనేది INR 500/- మించకూడదు, ఇది అప్పటికి అమల్లో ఉన్న రెగ్యులేటరీ మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది;
  • ఎట్టిపరిస్థితుల్లోనూ కార్డ్‌ బదిలీ కాదు, అలానే ఇది PhonePe ఆస్తి;
  • మీరు ఏ సమయంలోనైనా, అందుబాటులో ఉన్న కార్డ్ బ్యాలెన్స్ మేరకు మాత్రమే కార్డ్‌ను ఉపయోగించగలరు;
  • కార్డ్‌లకు సంబంధించిన ఏదైనా కమ్యూనికేషన్‌ను PhonePe ప్లాట్‌ఫామ్‌ ద్వారా లేదా SMS/ఇమెయిల్ లేదా పుష్ నోటిఫికేషన్‌ల ద్వారా మీకు నేరుగా PhonePe తెలుపుతుంది. 
  • మీరు వర్తించే అన్ని చట్టాలను పాటించాలి, అలానే ఎల్లప్పుడూ వాటికి కట్టుబడి ఉండాలి.
  • కార్డ్‌లకు సంబంధించి అవసరమైన లేదా తప్పకుండా పాటించాల్సిన నియమాల మేరకు, PhonePe తన సొంత అభీష్టానుసారం, ఎక్స్‌టర్నల్‌ సర్వీస్ ప్రొవైడర్/లు లేదా ఏజెంట్ల సర్వీస్‌లను వినియోగించుకోవచ్చు.
  • మీ కార్డ్ వినియోగం అనేది ఈ నియమ, నిబంధనలతో పాటు, కార్డ్‌కు సంబంధించి PhonePe ఎప్పటికప్పుడు అందించే అన్ని పాలసీలు, మార్గదర్శకాలు, అలానే సూచనల ప్రకారం నియంత్రించడమవుతుంది.
  • లావాదేవీని ప్రభావితం చేయడానికి మీరు కార్డ్‌ను ఉపయోగించిన ప్రతిసారీ, లావాదేవీ విలువ ఎంత ఉంటే అంత అమౌంట్ అనేది కార్డ్ బ్యాలెన్స్‌ నుండి డెబిట్ అవుతుందని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
  • మీరు కింది వాటిని నిర్ధారించుకోవాలి: (a) కార్డ్‌ను సురక్షితమైన స్థలంలో పెట్టారు; (b) కార్డ్‌ను మరే ఇతర వ్యక్తి ఉపయోగించడానికి అనుమతించలేదు;
  • కార్డ్ జారీ చేసిన తర్వాత, ఒకవేళ కార్డ్ దుర్వినియోగానికి గురైతే, దానికి మీరు మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి, PhonePeకు ఎలాంటి బాధ్యత ఉండదు.
  • PhonePe,తన అంతర్గత విధానం, ఆర్‌బిఐ నిబంధనలు మొదలైన వాటి ప్రకారం, ఎప్పటికప్పుడు, ఏదైనా నిర్దిష్ట రోజున లేదా ఇతర వ్యవధిలో జరిపే లావాదేవీల సంఖ్యపై ద్రవ్య పరిమితులను విధించవచ్చు లేదా వర్తించే చట్టం, PhonePe అంతర్గత పాలసీలు, ప్రక్రియలకు లోబడి అవసరమైన ఇతర నియంత్రణలను విధించవచ్చు. అటువంటి పరిమితులు/నియంత్రణల ప్రకారం ఏదైనా లావాదేవీని ప్రాసెస్ చేయడానికి నిరాకరించే లేదా తిరస్కరించే హక్కు PhonePeకు ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు.
  • మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వద్ద ఉండే ప్రవేశ/నిష్క్రమణ గేట్ తెరవవడం లేదా టికెట్‌ లేదా రసీదును జారీ చేయడం కోసం కార్డ్‌తో జరిగిన ఆయా లావాదేవీకి సంబంధించిన రికార్డ్ అనేది డెబిట్ అయిన ఛార్జీని వాస్తవానికి మీరే చెల్లించారని చెప్పగలిగే నిర్ణయాత్మక రుజువు.
  • ఏదైనా EDC ఎర్రర్‌ లేదా కమ్యూనికేషన్ లింక్‌లో ఎర్రర్‌ వల్ల వచ్చే అన్ని రీఫండ్‌లు, అమౌంట్ సర్దుబాట్ల ప్రక్రియను మాన్యువల్‌గా పూర్తి చేయడమవుతుంది, అలానే తగిన వెరిఫికేషన్ తర్వాత, వర్తించే సంబంధిత కార్డ్ నెట్‌వర్క్/ NPCI నియమాలు, నిబంధనలకు అనుగుణంగా కార్డ్ బ్యాలెన్స్ క్రెడిట్/ డెబిట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అందుకున్న ఏవైనా డెబిట్లను, ఈ రీఫండ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా, అందుబాటులో ఉన్న కార్డ్ బ్యాలెన్స్ నుండి మాత్రమే డెబిట్లు అవుతాయని మీరు అంగీకరిస్తున్నారు.
  • నాణ్యత, డెలివరీ ఆలస్యం లేదా సర్వీస్‌లు అందకపోవడంతో సహా మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ నుండి మీరు పొందిన సర్వీస్‌లకు సంబంధించిన ఏవైనా వివాదాలకు PhonePe ఏ విధంగానూ బాధ్యత వహించదు లేదా జవాబుదారీగా ఉండదు. కార్డ్ అనేది ట్రాన్సిట్ సౌకర్యాలను పొందడానికి మీకు ఒక సౌకర్యంగా మాత్రమే పనిచేస్తుందని, అలానే సర్వీస్‌ల నాణ్యత, డెలివరీ లేదా ఇతరత్రా వాటి గురించి PhonePe ఎటువంటి వారెంటీని ఇవ్వదని లేదా ఎటువంటి ప్రాతినిధ్యం వహించదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అయితే అటువంటి వివాదాలను మీరు నేరుగా సంబంధిత మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పరిష్కరించుకోవాలి.
  • ఇంకా, క్లెయిమ్ లేదా వివాదం ఉన్నంత మాత్రాన, ఛార్జీలు అన్నింటినీ మీరు చెల్లించాల్సిన మీ బాధ్యత నుండి మీకు విముక్తి లభించదు, అలానే ఏదైనా వివాదం లేదా క్లెయిమ్ ఉన్నప్పటికీ, అటువంటి ఛార్జీలు, బకాయిలను వెంటనే చెల్లించడానికి మీరు అంగీకరిస్తున్నారు.
  • మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని టెర్మినల్/గేట్ పనిచేయకపోయినా లేదా అది కార్డ్‌ను రీడ్ చేయలేకపోయినా, PhonePe ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు లేదా జవాబుదారీగా ఉండదు. ఇటువంటి సందర్భాల్లో, ప్రయాణం/టోల్/పార్కింగ్/ఇతర సర్వీస్‌ కోసం మీరు నగదు మొదలైన ఇతర మార్గాల ద్వారా సంబంధిత మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
  • మునుపటి లావాదేవీ పూర్తి కానట్లయితే, అంటే ఎగ్జిట్ కాకపోవడం, టెయిల్‌గేటింగ్ మొదలైనవి జరిగినప్పుడు, సంబంధిత మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ద్వారా పెనాల్టీ అమౌంట్‌ను కాన్ఫిగర్ చేసి, మీ కార్డ్‌ నుండి వసూలు చేయవచ్చు, ఆ సందర్భంలో, మీ కార్డ్‌లో ఎర్రర్ కోడ్ యాక్టివేట్ అవుతుంది, అలానే ఆయా అమౌంట్లు డెబిట్ కావడం మీకు ఆమోదయోగ్యమని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఆ పెనాల్టీని సంబంధిత ఎగ్జిక్యూటివ్ డెబిట్ చేసి కార్డ్‌లోని ఎర్రర్ కోడ్‌ను క్లియర్ చేస్తారు. ఈ పెనాల్టీలు అనేవి మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిర్వచించిన నిబంధనల ప్రకారం మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ వద్ద కాన్ఫిగర్ అవుతాయి, ఈ విషయంలో PhonePeకు ఎటువంటి పాత్ర ఉండదు, అలాగే దానికి సంబంధించి PhonePe ఎలాంటి బాధ్యత తీసుకోదు.
  • నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (“NFC”) చిప్‌కు ఏదైనా ఫిజికల్‌గా దెబ్బ తగిలితే దానికి PhonePe లేదా మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఏ విధంగానూ బాధ్యత వహించదని, అలానే కార్డ్‌కు జరిగే ఆయా విధ్వంసం లేదా నష్టానికి మీరే పూర్తిగా బాధ్యత వహిస్తారని మీరు ఇందుమూలంగా అంగీకరించి, నిర్ధారిస్తున్నారు. దెబ్బతిన్న లేదా మీరు పోగొట్టుకున్న కార్డ్‌లోని బ్యాలెన్స్‌ను PhonePe ఏ సందర్భంలోనూ మరొక కార్డ్‌కు బదిలీ చేయలేదు. మీ వినియోగం (లేదా వినియోగించకపోవడం) వల్ల కార్డ్ దెబ్బతిన్నప్పుడు, ఆ దెబ్బతినడం అనేది బయటకు కనిపించినా లేదా కనిపించకపోయినా ఇది వర్తిస్తుంది. మీ కార్డ్ పోయినా లేదా దెబ్బతిన్నా మీరు కార్డ్‌ను జారీ చేసేందుకు నిర్దేశించిన ఫీజును చెల్లించి కొత్త కార్డ్‌ను పొందవచ్చు.
  • ఛార్జీ స్లిప్పులు లేదా లావాదేవీ స్లిప్పుల కాపీలను మీకు అందించడానికి PhonePe కట్టుబడి ఉండదు.
  • కార్డ్ బ్యాలెన్స్‌లో తగినంత డబ్బు లేకపోవడం వల్ల పేమెంట్ సూచనలను అమలు చేయకపోవడం వల్ల PhonePeకు ఏదైనా నష్టం కలిగినా లేదా ముప్పు ఉన్నా లేదా మీకు కార్డ్‌ను జారీ చేయడం వల్ల, అలానే దాన్ని మీరు ఉపయోగించడం వల్ల PhonePeకు ఏదైనా ఇతర నష్టం సంభవించినా PhonePeకు నష్టపరిహారం చెల్లించడానికి మీరు బేషరతుగా కట్టుబడి ఉంటారు. PhonePeకు కలిగిన అటువంటి మొత్తం నష్టం లేదా ముప్పును నేరుగా వాలెట్‌ నుండి డెబిట్‌ చేయడానికి PhonePeకు అర్హత ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు.
  • కార్డ్ బ్యాలెన్స్‌లో ఏవైనా అవకతవకలు లేదా తేడాలు ఉన్నా, మీరు 15 రోజుల్లోపు రాతపూర్వకంగా PhonePeకు తెలియజేయాలి. అలా కాకుండా, సంబంధిత లావాదేవీకి సంబంధించి 15 రోజుల్లోపు PhonePeకు సమాచారం అందకపోతే, లావాదేవీలు/ కార్డ్ బ్యాలెన్స్‌లో ఎలాంటి తప్పిదాలు లేవని, అంతా సరిగ్గానే ఉందని భావిస్తుంది.
  • లావాదేవీలు ఆఫ్‌లైన్‌లో జరుగుతుండటం వల్ల, అలానే డెబిట్‌ అయిన అమౌంట్ల గురించి NPCI నుండి రీకాన్సిలియేషన్ (సమన్వయం) జరుగుతున్న సమయంలో మాత్రమే PhonePeకు తెలుస్తుంది కాబట్టి, కార్డ్ బ్యాలెన్స్‌‌ను ఖచ్చితంగా PhonePe ఎప్పటికీ నిర్ధారించలేదని మీరు అర్థం చేసుకున్నారు.
  • మీ కార్డ్ పోగొట్టుకోవడం, పాడైపోవడం లేదా గడువు ముగియడం వంటి ఏ సందర్భంలోనైనా కార్డ్ బ్యాలెన్స్‌ను రీఫండ్ చేయడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదని మీరు అర్థం చేసుకున్నారు.

మీ కార్డ్‌ను రీలోడ్ చేయడం/కార్డ్‌కు నిధులను యాడ్ చేయడం

  • ఎంపిక చేసిన మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వద్ద అందుబాటులో ఉన్న POS మెషీన్‌పై మీరు కార్డ్‌ను ట్యాప్ చేసి (సూచించిన పద్ధతిలో) మీ కార్డ్‌ను రీలోడ్ చేయవచ్చు, అలానే సంబంధిత కార్డ్ టాప్ అప్‌కు పేమెంట్ చేయడానికి UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మొదలైన ఏదైనా ఎంచుకున్న పేమెంట్ పద్ధతిని ఉపయోగించవచ్చు.
  • మీ కార్డ్‌ను టాప్ అప్/రీలోడ్ చేయడానికి మీరు ఎంచుకున్న పేమెంట్ పద్ధతిని బట్టి, వర్తించే మేరకు మీకు కన్వీనియన్స్ ఫీజును విధించవచ్చని మీరు ఇందుమూలంగా అర్థం చేసుకున్నారు.
  • పైన పేర్కొన్న పద్ధతిలో, మీరు ఎంపిక చేసిన మర్చంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ కౌంటర్ల వద్ద నగదును ఉపయోగించి కూడా మీ కార్డ్‌ను లోడ్ చేయవచ్చు.
  • కార్డ్‌కు నిధులను యాడ్ చేసే ప్రక్రియలో లావాదేవీ విఫలమైతే, లావాదేవీ అమౌంట్‌ కస్టమర్‌కు రీఫండ్ అవుతుంది.

రద్దు చేయడం, పంపిణీ చేయకపోవడం, ఆపివేత 

  • కింది సంఘటనలలో ఏవైనా జరిగినప్పుడు, PhonePe ఆ క్షణం నుండే మీ కార్డ్‌ను ఆపివేస్తుంది/బ్లాక్ చేస్తుంది/నిలిపివేస్తుంది:
    • మీ కార్డ్ పోయిందని మీరు PhonePeకు తెలిపినప్పుడు;
    • మీరు ఈ నియమ, నిబంధనలను ఉల్లంఘించినప్పుడు;
    • కార్డ్‌ను రద్దు చేయమని లేదా నిలిపివేయమని మీ నుండి నిర్దిష్ట అభ్యర్థన మాకు అందినప్పుడు;
    • PhonePe నియంత్రణలో లేని సహేతుకమైన కారణాల వల్ల (చట్టం లేదా శాసనం ప్రకారం విధించిన ఆంక్షలతో సహా, కానీ పరిమితం కాకుండా) కార్డ్‌కు సంబంధించి పేమెంట్ల ప్రక్రియను పూర్తి చేయడంలో PhonePe తన సామర్థ్యాన్ని నిలుపుకోలేనప్పుడు లేదా వేరే రూపంలో పేమెంట్ చేయలేకపోయినప్పుడు;
    • ఈ సౌకర్యాన్ని ఏదో రూపంలో దుర్వినియోగం చేస్తున్నారని / సరిగ్గా ఉపయోగించట్లేదని PhonePe భావించినప్పుడు; మరియు
    • ఏదైనా బ్యాంక్‌/కార్డ్ నెట్‌వర్క్ నుండి లేదా ఏదైనా పాలక లేదా పర్యవేక్షణ అధికారి నుండి ఏదైనా ప్రతికూల నివేదిక అందినప్పుడు.
  • PhonePe తన సొంత అభీష్టానుసారం, అలానే ఈ నియమ, నిబంధనలు, వర్తించే చట్టం, అంతర్గత పాలసీలు, విధానాలకు అనుగుణంగా కార్డ్‌ను జారీ చేయకూడదని లేదా కార్డ్‌ లేదా కార్డ్ యూజర్‌ను రద్దు చేయాలని లేదా నిలిపివేయాలని నిర్ణయించవచ్చు.
  • రద్దు చేసిన తర్వాత, భవిష్యత్తులో కార్డ్‌కు చేసే టాప్ అప్‌లను మాత్రమే PhonePe నిరోధించగలదని మీరు ఇందుమూలంగా అంగీకరించి, అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఉన్న కార్డ్ బ్యాలెన్స్‌ వినియోగాన్ని కొనసాగించవచ్చు.
  • ఒకవేళ మీరు మీ కార్డ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకుంటే, పెండింగ్‌లో ఉన్న కార్డ్ బ్యాలెన్స్‌ వినియోగాన్ని కొనసాగించి, అది పూర్తయ్యాక మీ కార్డ్‌ను నాశనం చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
  • ఏదైనా కారణం వల్ల మీ కార్డ్‌ పోయినా, అలానే మీ కార్డ్‌ను రద్దు చేయమని లేదా నిలిపివేయమని మీరు PhonePeకు అభ్యర్థించినా, భవిష్యత్తులో ఆ కార్డ్‌కు టాప్ అప్‌లను మాత్రమే PhonePe నిరోధించగలదు. అయితే ఇప్పటికే ఉన్న కార్డ్ బ్యాలెన్స్ వినియోగాన్ని మీరు కొనసాగించవచ్చు, అలానే రద్దు చేసిన లేదా నిలిపివేసిన తర్వాత కూడా మీ కార్డ్ వినియోగానికి సంబంధించిన SMSలు మీకు వస్తూనే ఉంటాయి.
  • రద్దు నోటీసు: పైన పేర్కొన్న వాటితో సంబంధం లేకుండా, ఆపరేటింగ్ నియమాలు మరియు/లేదా వర్తించే చట్టం లేదా దాని పాలసీల ప్రకారం, అవసరానికి తగ్గట్లుగా, నోటీసు ఇచ్చి లేదా ఇవ్వకుండానే, ఏ కారణం చేతనైనా ఏ సమయంలోనైనా కార్డ్‌ను PhonePe రద్దు చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు.

మేధో సంపత్తి హక్కులు

  • ఈ నియమ, నిబంధనల ప్రయోజనం నిమిత్తం, మేధో సంపత్తి హక్కులు అంటే ఎల్లప్పుడూ రిజిస్టర్ చేసిన లేదా చేయని కాపీరైట్‌లు, పేటెంట్లను ఫైల్ చేసే హక్కులతో సహా పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ట్రేడ్ పేర్లు, ట్రేడ్ దుస్తులు, హౌస్ మార్కులు, కలెక్టివ్ మార్కులు, అసోసియేట్ మార్కులు, అలానే వాటిని రిజిస్టర్ చేసుకునే హక్కు, ఇండస్ట్రియల్, లేఅవుట్ డిజైన్‌లు, భౌగోళిక సూచికలు, నైతిక హక్కులు, ప్రసార హక్కులు, ప్రదర్శన హక్కులు, పంపిణీ హక్కులు, అమ్మకపు హక్కులు, సంక్షిప్త హక్కులు, అనువాద హక్కులు, పునరుత్పత్తి హక్కులు, పెర్ఫామెన్స్ (చేసి, చూపించే) హక్కులు, కమ్యూనికేటింగ్ హక్కులు, అనుసరణ హక్కులు, సర్క్యులేటింగ్ హక్కులు, రక్షిత హక్కులు, ఉమ్మడి హక్కులు, పరస్పర హక్కులు, ఉల్లంఘన హక్కులు అని అర్థం. డొమైన్ పేర్లు, ఇంటర్నెట్ లేదా వర్తించే చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర హక్కు ఫలితంగా ఉత్పన్నమయ్యే మేధో సంపత్తి హక్కులన్నీ, సందర్భానుసారం అటువంటి డొమైన్ పేరు యజమానిగా PhonePe లేదా PhonePe ఎంటిటీల డొమైన్‌ లేదా NPCI లేదా L&T మెట్రో రైల్ (హైదరాబాద్‌) లిమిటెడ్ డొమైన్‌ పేరిట ఉంటాయి.
  • పైన పేర్కొన్న ఏదైనా మేధో సంపత్తి హక్కులలో ఏ భాగం కూడా మీ పేరున బదిలీ కాదని, అలానే కార్డ్‌ వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా మేధో సంపత్తి హక్కులు కూడా, సందర్భానుసారం, PhonePe లేదా NPCI లేదా L&T మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ పూర్తి యాజమాన్యం, స్వాధీనం, నియంత్రణలో ఉంటాయని మీరు అంగీకరించి, నిర్ధారిస్తున్నారు.

బాధ్యతా పరిమితి

ఏ సందర్భంలోనైనా, మీ కార్డ్‌‌ను జారీ చేయడానికి నిరాకరించడం/జారీ చేయలేకపోవడం వల్ల లేదా మీరు కార్డ్‌ను ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వల్ల, అలానే ఒప్పందం, హక్కుల అతిక్రమణ, నిర్లక్ష్యం లేదా ఇతరత్రా ఏ రూపంలోనైనా ఉత్పన్నమయ్యే లాభాలు లేదా ఆదాయాల నష్టం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాల నష్టం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టంతో సహా, వాటికే పరిమితం కాకుండా పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షార్హమైన నష్టాలకు PhonePe ఏ సందర్భంలోనూ బాధ్యత వహించదు. మీ విషయంలో PhonePeకు ఉన్న మొత్తం బాధ్యత ఏదైనా ఉందంటే, అది ఏ సందర్భంలోనూ మీరు కార్డ్‌ను జారీ చేయడానికి చెల్లించిన అమౌంట్‌కు లేదా వంద రూపాయలకు (₹100), వీటిలో ఏది తక్కువైతే ఆ అమౌంట్‌ను మించకూడదు.

నష్టపరిహారం

ఈ నియమ, నిబంధనలు, ప్రైవసీ పాలసీ లేదా సాధారణ వినియోగ నియమాలను మీరు ఉల్లంఘించడం వల్ల లేదా ఏదైనా చట్టం, నియమాలు లేదా నిబంధనలు లేదా థర్డ్ పార్టీ హక్కులను (మేధో సంపత్తి హక్కులతో సహా) మీరు ఉల్లంఘించడం వల్ల, ఏదైనా థర్డ్ పార్టీ చేసే ఏదైనా క్లెయిమ్ లేదా డిమాండ్, లేదా సహేతుకమైన అటార్నీ ఫీజులతో సహా, ఆ థర్డ్ పార్టీ తీసుకునే చర్యలు, లేదా విధించిన పెనాల్టీ నుండి మీరు PhonePe, PhonePe ఎంటిటీలు, దాని యజమాని, లైసెన్సీ, అనుబంధ సంస్థలు, అనుబంధ కంపెనీలు, గ్రూప్ కంపెనీలు (వర్తించే విధంగా), వారి సంబంధిత అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, ఉద్యోగులను పరిరక్షించి, వారికి నష్టపరిహారం చెల్లించాలి, అలానే వారికి హాని కలగకుండా చూసుకోవాలి.

ఫోర్స్‌ మెజ్యూర్‌ (అనివార్య సంఘటన)

అనివార్య సంఘటన అంటే PhonePe సహేతుకమైన నియంత్రణకు మించిన (నియంత్రణలో లేని) ఏదైనా సంఘటన అని అర్థం, ఇందులో యుద్ధం, అల్లర్లు, అగ్నిప్రమాదం, వరదలు, దైవ కార్యాలు, పేలుడు, సమ్మెలు, లాకౌట్‌లు, మందగమనం, ఇంధన సరఫరాల సుదీర్ఘ కొరత, మహమ్మారి, అంటువ్యాధుల వ్యాప్తి, కంప్యూటర్ హ్యాకింగ్, కంప్యూటర్ డేటా, ఇంకా స్టోరేజ్ పరికరాలను అనధికారికంగా ఎవరైనా యాక్సెస్ చేయడం, కంప్యూటర్ క్రాష్‌లు, ఈ నియమ, నిబంధనల ప్రకారం PhonePe తమ సంబంధిత బాధ్యతలను నిర్వర్తించకుండా నిషేధించే లేదా అడ్డుకునే రాష్ట్ర, ప్రభుత్వ, చట్టపరమైన లేదా రెగ్యులేటరీ చర్యలు ఉంటాయి, కానీ వాటికే పరిమితం కాదు. ఇటువంటి అనివార్య సంఘటనలకు PhonePe బాధ్యత వహించదు లేదా జవాబుదారీగా ఉండదు.

వివాదం, పాలక చట్టం & అధికార పరిధి

ఈ ఒప్పందం, దాని కింద ఉన్న హక్కులు, బాధ్యతలు, పార్టీల మధ్య సంబంధాలు, అలానే ఈ నియమ, నిబంధనల కింద లేదా దానికి సంబంధించి ఉత్పన్నమయ్యే అన్ని విషయాలు, అభిప్రాయాల నిర్మాణం, చెల్లుబాటు, పనితీరు లేదా దానికి సంబంధించిన ఆపివేతతో సహా, భారత గణతంత్ర చట్టాలకు లోబడి ఉంటాయి, అలానే వాటికి అనుగుణంగా అర్థం చేసుకోవాలి. సామరస్యపూర్వకమైన పరిష్కారానికి లోబడి, నిష్పక్షపాతంగా, మీ కార్డ్ వినియోగానికి సంబంధించి లేదా ఇక్కడ కవర్ చేసిన ఇతర విషయాల నుండి ఉత్పన్నమయ్యే అన్ని విషయాలపై విచారణ చేపట్టడానికి, అలానే తీర్పు చెప్పడానికి కర్ణాటకలోని బెంగళూరు కోర్టులకు ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది.

కార్డ్‌కు సంబంధించి జరిగిన ఏదైనా సంఘటన లేదా జరగని సంఘటనకు సంబంధించి, 30 రోజుల్లోపు వివాదాలు లేదా భేదాభిప్రాయాలు లేదా సమస్యలు ఏవైనా ఉంటే లేవనెత్తాలి.

బాధ్యతా నిరాకరణలు

ఇక్కడ వివరించినట్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతామని, సంతృప్తికరమైన నాణ్యత ఉంటుందని, నిర్దిష్ట ప్రయోజనం కోసం సరిగ్గా సరిపోతుందని, అలానే అందించిన సర్వీస్‌లు ఉల్లంఘన జరగకుండా అందుతాయని లేదా ఈ నియమ, నిబంధనల కింద అందించిన కార్డ్‌లకు సంబంధించిన అన్ని వారెంటీలను, అంటే స్పష్టంగా లేదా పరోక్షంగా ఇచ్చిన వారెంటీలను PhonePe నిరాకరిస్తుంది. పైన పేర్కొన్న వాటికి లోబడి, ప్రత్యేకంగా అంగీకరించినవి కాకుండా, ఇతర అన్ని వారెంటీలను, అంటే స్పష్టంగా లేదా పరోక్షంగా ఇచ్చిన వారెంటీలను PhonePe నిరాకరిస్తుంది.

వేరుపర్చడం, మినహాయింపు

ఈ నియమ, నిబంధనల్లోని ప్రతి నిబంధనల విభాగాన్ని వేర్వేరుగా చూడాలి, అలానే అవి వేటికవే భిన్నంగా ఉంటాయి, అయితే ఏ సమయంలోనైనా, అటువంటి నిబంధనలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిబంధనలు అనేవి ఏదైనా అధికార పరిధిలోని చట్టాల ప్రకారం, ఏదైనా విషయంలో చట్టవిరుద్ధంగా లేదా అమలు చేయలేనిదిగా మారితే, మిగిలిన నిబంధనల చట్టబద్ధత, చెల్లుబాటు లేదా అమలు చేయగల సామర్థ్యం ఏ విధంగానూ ప్రభావితం కాదు. PhonePe ఏదైనా చర్యను తీసుకోవడం, జాప్యం చేయడం లేదా దేన్నైనా వదిలేయడం వల్ల ఈ నియమ, నిబంధనల కింద దానికి ఉన్న హక్కులు, అధికారాలు, పరిహారాలపై ఎలాంటి ప్రభావం పడదు లేదా తదుపరి దశలో అటువంటి హక్కులు, అధికారాలు లేదా పరిహారాల వినియోగాన్ని ప్రభావితం చేయదు. ఈ నియమ, నిబంధనల కింద ఉండే హక్కులు, పరిహారాలు అనేవి మారుతూ ఉంటాయి, చట్టం ప్రకారం సంక్రమించే ఇతర హక్కులు, పరిహారాలకు మాత్రమే విశిష్టంగా ఉండవు.

వాలెట్‌ నియమ & నిబంధనలు

మీరు ఈ లింక్‌– https://www.phonepe.com/terms-conditions/wallet/లో ఉన్న మీ వాలెట్లకు సంబంధించిన నియమ, నిబంధనలను చదివి, అంగీకరిస్తున్నారు. 

ఫిర్యాదుల పరిష్కారం

మీరు ఏదైనా ఫిర్యాదును / సమస్యను నివేదించినట్లయితే, మేము మీ సమస్యను సమీక్షించి, మీ ఫిర్యాదు / సమస్య అందిన తేదీ నుండి 48 (నలభై ఎనిమిది) గంటల్లోపు, గరిష్టంగా 30 (ముప్పై) రోజులు మించకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. మరిన్ని వివరాల కోసం మీరు మా గ్రీవెన్స్ పాలసీని చూడవచ్చు.

PhonePe Logo

Business Solutions

  • Payment Gateway
  • E-commerce PG
  • UPI Payment Gateway
  • Express Checkout
  • Offline Merchant
  • Offline Payment Partner
  • Advertise on PhonePe
  • SmartSpeaker
  • POS Machine
  • Payment Links
  • Travel and Commute

Insurance

  • Motor Insurance
  • Bike Insurance
  • Car Insurance
  • Health Insurance
  • Life Insurance
  • Term Life Insurance
  • Personal Accident Insurance
  • Travel Insurance
  • International Travel Insurance

Investments

  • 24K Gold
  • Liquid Funds
  • Tax Saving Funds
  • Equity Funds
  • Debt Funds
  • Hybrid Funds

Lending

  • Consumer Lending
  • Merchant Lending
  • Secured Loans

General

  • About Us
  • Careers
  • Investors Relations
  • Contact Us
  • Press
  • Ethics
  • Report Vulnerability
  • Merchant Partners
  • Blog
  • Tech Blog
  • PhonePe Pulse

Legal

  • Terms & Conditions
  • Privacy Policy
  • Grievance Policy
  • How to Pay
  • E-Waste Policy
  • Trust & Safety
  • Global Anti-Corruption Policy
  • PhonePe Account Aggregator Notice

See All Apps

Download PhonePe App Button Icon

PhonePe Group

  • Indus Appstoreexternal link icon
  • Share.Marketexternal link icon

Credit Cards

  • PhonePe HDFC Bank Co-Branded Credit Cards
  • PhonePe SBI Card Co-Branded Credit Cards
  • Wish Credit Card

Certification

Sisa Logoexternal link icon
LinkedIn Logo
Twitter Logo
Fb Logo
YT Logo

*These are company numbers as of September, 2025

© 2026, All rights reserved
PhonePe Logo

Business Solutions

arrow icon
  • Payment Gateway
  • E-commerce PG
  • UPI Payment Gateway
  • Express Checkout
  • Offline Merchant
  • Offline Payment Partner
  • Advertise on PhonePe
  • SmartSpeaker
  • POS Machine
  • Payment Links
  • Travel and Commute

Insurance

arrow icon
  • Motor Insurance
  • Bike Insurance
  • Car Insurance
  • Health Insurance
  • Life Insurance
  • Term Life Insurance
  • Personal Accident Insurance
  • Travel Insurance
  • International Travel Insurance

Investments

arrow icon
  • 24K Gold
  • Liquid Funds
  • Tax Saving Funds
  • Equity Funds
  • Debt Funds
  • Hybrid Funds

Lending

arrow icon
  • Consumer Lending
  • Merchant Lending
  • Secured Loans

General

arrow icon
  • About Us
  • Careers
  • Investors Relations
  • Contact Us
  • Press
  • Ethics
  • Report Vulnerability
  • Merchant Partners
  • Blog
  • Tech Blog
  • PhonePe Pulse

Legal

arrow icon
  • Terms & Conditions
  • Privacy Policy
  • Grievance Policy
  • How to Pay
  • E-Waste Policy
  • Trust & Safety
  • Global Anti-Corruption Policy
  • PhonePe Account Aggregator Notice

PhonePe Group

arrow icon
  • Indus Appstoreexternal link icon
  • Share.Marketexternal link icon

Credit Cards

arrow icon
  • PhonePe HDFC Bank Co-Branded Credit Cards
  • PhonePe SBI Card Co-Branded Credit Cards
  • Wish Credit Card

Certification

Sisa Logo

See All Apps

Download PhonePe App Button Icon
LinkedIn Logo
Twitter Logo
Fb Logo
YT Logo

*These are company numbers as of September, 2025

© 2026, All rights reserved