English | हिंदी | ಕನ್ನಡ | বাংলা | தமிழ் | മലയാളം | ગુજરાતી | मराठी | অসমীয়া | ଓଡ଼ିଆ

    PhonePeలో ఆధార్ e-KYC కోసం నియమాలు

    ఆధార్ నెంబర్/VID మరియు మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP అందించడం ద్వారా, కింద తెలిపిన నియమాలకు లోబడి మీ ఆధార్ సమాచారాన్ని ఉపయోగించి మీ e-KYC చేయడానికి మీరు PhonePeకు అనుమతి ఇస్తున్నారు:

  • PhonePe వాలెట్ అప్ గ్రేడింగ్ కోసం e-KYC ఆథెంటికేషన్ కోసం UIDAIకు సమర్పించడానికి మీ ఆధార్ నెంబర్/VID సమాచారాన్ని ఉపయోగించడానికి మీరు PhonePeకు అంగీకారం ఇస్తున్నారు.
  • ఆథెంటికేషన్ విజయవంతమయ్యాక, UIDAI వారు PhonePeతో మాస్క్ చేయబడిన ఆధార్, డెమోగ్రఫిక్ సమాచారం, గుర్తింపు సమాచారం, ఆధార్‌తో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ లాంటి సమాచారాన్ని (మొత్తంగా, “సమాచారం”) షేర్ చేస్తుందని మీరు అర్థం చేసుకుంటున్నారు.
  • మీ PhonePe వాలెట్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో భాగంగా ధృవీకరణ కోసం తాను అందుకున్న అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే PhonePe ఉపయోగిస్తుంది.
  • ఆధార్ e-KYC ప్రక్రియలో భాగంగా సేకరించిన మీ e-KYC సమాచారాన్ని స్టోర్ చేసేందుకు మీరు మాకు ఇచ్చిన అనుమతిని మీరు ఎప్పుడు కావాలన్నా వెనక్కి తీసుకోవచ్చు. మీరు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవడానికి, దయచేసి, యాప్ లోని సపోర్ట్ విభాగం ద్వారా మా టీమ్‌ను సంప్రదించండి లేదా https://support.phonepe.com లో ఒక అభ్యర్థన లేవనెత్తండి.
  • ఆధార్ సమర్పణ అనేది స్వచ్ఛందంగా చేసేది మాత్రమే. మీరు అప్ గ్రేడ్ చేయకుండానే తక్కువ పరిమితులతో PhonePe వాలెట్ ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించుకోవచ్చు.
  • మీరు అందించిన సమాచారం సరైనదిగా లేకున్నా లేదా మీరు అందించిన సమాచారం తప్పు సమాచారం అయినా దానికి PhonePe లేదా దాని అధికారులు ఎలాంటి బాధ్యత వహించరు.
  • ఏదైనా ఫిర్యాదుకు సంబంధించిన సహాయం కోసం, యాప్ లోని సపోర్ట్ విభాగం ద్వారా కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు లేదా https://support.phonepe.comలో మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. లేదా 080-68727374 / 022-68727374 నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా కాల్ స్వీకరణ విభాగాన్ని సంప్రదించవచ్చు.
    నియమ, నిబంధనలు | గోప్యతా పాలసీ | ఫిర్యాదుల పాలసీ