< Back
ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ – నియమ, నిబంధనలు (“NPS నియమ, నిబంధనలు”) అనేవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ – 2021లోని రూల్ 3 ప్రకారం ప్రచురించిన కంప్యూటర్-జనరేటెడ్ ఎలక్ట్రానిక్ రికార్డ్, దీన్ని ఎప్పటికప్పుడు సవరించిన విధంగా, ఇంకా సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000తో కలిపి చదవాలి, అలాగే దీనిపై ఎలాంటి నేరుగా చేసిన లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
ఇందులో ఉపయోగించిన అన్ని క్యాపిటలైజ్డ్ పదాలకు కింది సెక్షన్ Bలో (నిర్వచనాలు) వాటికి కేటాయించిన అర్థాలు ఉంటాయి.
A. పరిచయం
- ఈ NPS నియమ, నిబంధనలు అనేవి PhonePe ప్లాట్ఫామ్లో PhonePe లిమిటెడ్ (గతంలో ‘PhonePe ప్రైవేట్ లిమిటెడ్’ అని పిలిచేవారు) (“PhonePe”) అందించే సర్వీస్‌లకు సంబంధించి మీ యాక్సెస్, వినియోగాన్ని నియంత్రిస్తాయి.
- NPS సర్వీస్‌లను పొందడానికి తదుపరి చర్యలు తీసుకునే ముందు ఈ NPS నియమ, నిబంధనలను జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఈ NPS నియమ, నిబంధనలలో మీ చట్టపరమైన హక్కులు, పరిహారాలు, బాధ్యతల గురించి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ నియమ, నిబంధనలు మీకు (“మీరు”), PhonePeకు మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి.
- PFRDA ఎనేబుల్ చేసిన NPS ఆన్‌బోర్డింగ్ ప్రయాణాన్ని పొందడం కోసం PhonePe ప్లాట్ఫామ్లో NPS సర్వీస్‌లను యాక్సెస్ చేయడం, నావిగేట్ చేయడం లేదా ప్రారంభించడం ద్వారా, PFRDA మరియు/లేదా ఏవైనా NPS పార్టిసిపెంట్లు ఎప్పటికప్పుడు నిర్దేశించిన ఏవైనా వర్తించే నియమాలతో పాటు, ఈ NPS నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండటానికి మీరు అంగీకరిస్తున్నారు.
- NPS సర్వీస్‌లను పొందడం కోసం PhonePe ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడం ద్వారా లేదా NPS సర్వీస్‌లను పొందడం కోసం PhonePe ప్లాట్ఫామ్లో మీ సమాచారాన్ని రిజిస్టర్ చేయడం ద్వారా, ఈ NPS నియమ, నిబంధనలతో పాటు, మీరు సాధారణ PhonePe నియమ, నిబంధనలకు (“సాధారణ నియమ, నిబంధనలు”) కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు. ఈ NPS నియమ, నిబంధనలు, అలాగే సాధారణ నియమ, నిబంధనల మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే, ఆ వ్యత్యాసం వర్తించే పరిధి మేరకు, అలాగే ఇందులో కవర్ చేసిన సర్వీస్‌లకు సంబంధించి మాత్రమే NPS నియమ, నిబంధనలు అమలులో ఉంటాయి.
- PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు PhonePe గోప్యతా విధానంలో వివరించిన విధంగా మీ సమాచారాన్ని ఉపయోగించడానికి సమ్మతిస్తున్నారు. మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసినప్పుడు PhonePe మీ వ్యక్తిగత సమాచారం విషయంలో ఎలా వ్యవహరిస్తుందో ఈ గోప్యతా విధానం వివరిస్తుంది.
B. నిర్వచనాలు
- “API” అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్;
- “API గేట్‌వే” అంటే NPS పార్టిసిపెంట్ల మధ్య ప్రామాణీకరించిన API-ఆధారిత అనుసంధానాల ద్వారా, ప్రధానంగా అభ్యర్థనలు, ప్రతిస్పందనల రూపంలో, సురక్షితమైన డేటా ఎక్స్ఛేంజ్ను, అలాగే సమాచారాన్ని రూటింగ్ చేయడాన్ని (చేరవేసే ప్రక్రియను) సులభతరం చేయడానికి NBSL యాజమాన్యంలో ఉన్న, నిర్వహిస్తున్న టెక్నాలజీ మౌలిక సదుపాయాలు లేదా ప్రసార, అనుసంధాన లేయర్;
- “NBSL” అంటే NPCI BHIM సర్వీసెస్ లిమిటెడ్;
- “NPS” అంటే PFRDA యాక్ట్ కింద నిర్వచించిన ప్రకారం నేషనల్ పెన్షన్ సిస్టమ్;
- “NPS పార్టిసిపెంట్లు” అంటే పెన్షన్ ఏజెంట్‌గా వ్యవహరించే PhonePe, PoP, API గేట్‌వే;
- “NPS సర్వీస్‌లు” అంటే PFRDA అనుమతించిన విధంగా PhonePe అందించే NPS ఆన్‌బోర్డింగ్ సదుపాయాన్ని కల్పించే సర్వీస్‌లు;
- “పెన్షన్ ఏజెంట్” అంటే NPSలోకి సబ్స్క్రైబర్ల ఆన్‌బోర్డింగ్‌ను సులభతరం చేయడంతో సహా , NPSను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, నిర్దిష్ట ఒప్పందం కింద PoP నియమించిన, అలాగే PFRDA ఎప్పటికప్పుడు నిర్దేశించిన వ్యక్తి;
- “PFRDA” అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ;
- “PFRDA యాక్ట్” అంటే ఎప్పటికప్పుడు సవరించిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ – 2013;
- “PhonePe ప్లాట్‌ఫామ్” అంటే PhonePe మరియు/లేదా దాని అనుబంధ సంస్థలు రూపొందించిన, వాటి యాజమాన్యంలో ఉన్న మరియు/లేదా నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్/సాఫ్ట్వేర్ అప్లికేషన్/ప్లాట్‌ఫామ్/వెబ్సైట్;
- “పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్” / “PoP” అంటే PFRDA యాక్ట్ కింద పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్గా PFRDAలో రిజిస్టర్ అయిన, అలాగే సబ్స్క్రైబర్ల నుండి ఫండ్లు, సూచనలు, పేమెంట్లను పొంది, పంపడంతో పాటు, సబ్స్క్రైబర్లకు ఫండ్ల పేమెంట్లు చేసే ప్రయోజనాల నిమిత్తం, ఇతర అంశాలతో పాటు, CRAతో ఎలక్ట్రానిక్ అనుసంధాన సామర్థ్యం కలిగిన మధ్యవర్తి. ఈ NPS నియమ, నిబంధనల ప్రయోజనాల నిమిత్తం, PoPలో యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, HDFC బ్యాంక్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటాయి;
C. నియమ, నిబంధనలు
- NPS సర్వీస్‌లను యాక్సెస్ చేయాలని ఎంచుకోవడం ద్వారా, వర్తించే చట్టాల ప్రకారం NPSను PFRDA నియంత్రిస్తుందని, అలాగే PhonePe అనేది PFRDA నియంత్రణా శాసనాల ప్రకారం మధ్యవర్తి, పెన్షన్ డిస్ట్రిబ్యూటర్ లేదా నియంత్రిత సంస్థ కాదని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. PFRDA అనుమతించిన విధంగా ఆన్‌బోర్డింగ్ సర్వీస్‌లను అందించడం కోసం, PFRDA మార్గదర్శకాలకు అనుగుణంగా, సంబంధిత PoP(లు) కింద పెన్షన్ ఏజెంట్‌గా పరిగణించే ఫెసిలిటేటర్‌గా మాత్రమే PhonePe వ్యవహరిస్తుంది.
- PFRDA నియంత్రణా శాసనాలకు అనుగుణంగా, సంబంధిత PoP(ల) అధికారం, పర్యవేక్షణ కింద, అలాగే సంబంధిత PoP(ల) నిర్దేశాలు, అధికారిక అనుమతుల ప్రకారం మాత్రమే PhonePe తప్పనిసరిగా వ్యవహరిస్తుందని, అంతేగాక ఇతర NPS పార్టిసిపెంట్ల మధ్య లావాదేవీల నెరవేర్పు, చట్టబద్ధత, పూర్తి చేయడంపై PhonePeకు ఎటువంటి నియంత్రణ లేదని, అలాగే దానికి బాధ్యత వహించదని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు. సబ్స్క్రైబర్లకు ఆన్‌బోర్డింగ్ సదుపాయాన్ని కల్పించడానికి, సబ్స్క్రైబర్ల సమాచారాన్ని సేకరించి, దాన్ని PoPకి పంపడానికి, ఆన్‌బోర్డింగ్ సమయంలో సబ్స్క్రైబర్లకు ఫ్రంట్-ఎండ్ యూజర్ సహాయాన్ని (స్క్రీన్‌పై సూచనలు ఇస్తూ సహాయం) అందించే నిమిత్తం మౌలిక సదుపాయాలను కల్పించడం వరకు మాత్రమే PhonePe పాత్ర పరిమితమవుతుంది.
- PoP అనేది NPS కింద సబ్స్క్రైబర్ల ఆన్‌బోర్డింగ్, కస్టమర్ డ్యూ డిలిజెన్స్ (నిశిత పరిశీలన), సర్వీస్‌లను అందించే ప్రధాన నియంత్రిత మధ్యవర్తి. NPS కోసం ఏవైనా అప్లికేషన్లను ఆమోదించడం లేదా తిరస్కరించడంలో PhonePe తన విచక్షణాధికారాన్ని ఉపయోగించదు. కస్టమర్‌ను గుర్తించడం, KYC నిబంధనల అమలు, కస్టమర్ డ్యూ డిలిజెన్స్, రిస్క్ అసెస్మెంట్, PRAN జనరేషన్, ఫండ్ నిర్వహణ లేదా సెటిల్మెంట్ విధులను PhonePe నిర్వహించదు.
- API గేట్‌వే ద్వారా NPS పార్టిసిపెంట్లతో కలిసి NPS సర్వీస్‌లను PhonePe అందిస్తుంది. PhonePe అందించే NPS సర్వీస్‌లు అనేవి NPS పార్టిసిపెంట్లకు చెందిన పలు బయటి వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు. దీని ప్రకారం, PhonePe నియంత్రణలో లేని సదరు బయటి వ్యవస్థలు లేదా మౌలిక సదుపాయాల వల్ల ఉత్పన్నమయ్యే టెక్నికల్ లేదా నిర్వహణాపరమైన సమస్యల కారణంగా జరిగే ఏదైనా ఆలస్యం, వైఫల్యం, అంతరాయం లేదా ఆన్‌బోర్డింగ్ విజయవంతం కాకపోవడానికి PhonePe బాధ్యత వహించదు.
- NPSకి సంబంధించి కింది వాటితో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా ఏవైనా సర్వీస్‌లను అందించడానికి PhonePe బాధ్యత వహించదు: (a) API గేట్‌వే లభ్యత మరియు/లేదా కార్యాచరణ; (b) సంబంధిత PoP(లు) అందించిన ఏదైనా సమాచార ఖచ్చితత్వం మరియు/లేదా సంపూర్ణత; (c) విజయవంతమైన PRAN జనరేషన్ మరియు పూర్తి ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడం; (d) PhonePe అందుబాటులోకి తీసుకొచ్చే ఆన్‌బోర్డింగ్ సర్వీస్‌లకు సంబంధించి తప్ప, NPSకి సంబంధించి ఏదైనా కస్టమర్ సహాయ విభాగ సర్వీస్‌లు; (e) ఏదైనా కారణంతో లేదా ఏ కారణం లేకుండానే సంబంధిత PoP(లు) ఏదైనా సర్వీస్‌ను రద్దు చేయటం.
- NPS ఆన్‌బోర్డింగ్ ప్రయాణంలోకి సజావుగా ప్రవేశించడాన్ని ఎనేబుల్ చేసే టెక్నాలజీ ఫెసిలిటేటర్‌గా, ఫ్రంట్-ఎండ్ ఇంటర్ఫేస్గా మాత్రమే PhonePe పనిచేస్తుంది. PhonePe ఒక పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్గా, సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీగా లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌గా వ్యవహరించదు.
- PhonePe ప్లాట్ఫామ్లో NPS సర్వీస్‌లను ఉపయోగించుకోవడానికి, మీరు కింది వాటిని స్పష్టంగా ప్రకటించి, వాటికి హామీ ఇస్తున్నారు:
- మీరు భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి;
- అకౌంట్ ప్రారంభించే సమయానికి మీ వయస్సు 18 నుండి 85 సంవత్సరాల మధ్య ఉంది;
- పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్-PoPలో KYCని సంపూర్ణంగా పూర్తి చేసిన సేవింగ్స్ అకౌంట్ మీకు ఉంది; అలాగే
- భారతీయ కాంట్రాక్ట్ యాక్ట్ – 1872 కింద చట్టబద్ధంగా కట్టుబడే ఒప్పందం చేసుకునే సామర్థ్యం మీకు ఉంది.
- ప్లాట్ఫామ్లో NPS ప్రయాణంలో ముందుకు కొనసాగడం ద్వారా, మీ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఆన్‌బోర్డింగ్ ప్రయాణంలో అందించిన ఇతర సమాచారాన్ని సంబంధిత PoP కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (“CBS”) నుండి అర్హత ఉన్న, బ్యాంక్-వెరిఫై చేసిన KYC అకౌంట్లను పొందే నిమిత్తం API గేట్‌వే ద్వారా సంబంధిత PoPకి సురక్షితంగా పంపడానికి మీరు PhonePeకి మీ సమ్మతిని ఇస్తున్నారు.
- NPSకి సంబంధించి PhonePe ప్లాట్ఫామ్లో హోస్ట్ చేసిన సమాచారాన్ని సంబంధిత PoPలు అందిస్తాయి, అలాగే PhonePe సదరు సమాచారాన్ని కేవలం ‘ఉన్నది ఉన్నట్లుగా’ మాత్రమే చూపుతుంది. సంబంధిత PoPలు అందించిన సమాచారం ఆధారంగా NPSకి సంబంధించి PhonePe ప్లాట్ఫామ్లో హోస్ట్ చేసిన ఏ సమాచారాన్నైనా మీకు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే PhonePe ఎప్పటికప్పుడు మార్చవచ్చు. NPSకి సంబంధించి PhonePe ప్లాట్ఫామ్లో హోస్ట్ చేసిన ఏదైనా సమాచారంపై ఆధారపడాలని మీరు ఎంచుకోవడం ద్వారా, సదరు సమాచారంపై మీరు ఆధారపడటం వల్ల కలిగే పరిణామాలకు సంబంధించి, PhonePeపై మీకు ఉండే ఏవైనా, ఇంకా అన్ని రకాల క్లెయిమ్‌లు, చట్టపరమైన చర్యలు ప్రారంభించే హక్కులు మరియు/లేదా పరిహార హక్కులను (చట్టం కింద లేదా ఇతరత్రా మార్గాల్లో) మీరు స్పష్టంగా వదులుకుంటున్నారని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు. NPSకి సంబంధించిన ఏదైనా సమాచార ఖచ్చితత్వం, పరిపూర్ణత లేదా వినియోగం వల్ల లేదా దానికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏవైనా పరిణామాలకు PhonePe ఎలాంటి బాధ్యత వహించదు, అలాగే స్పష్టంగా వాటిని నిరాకరిస్తుంది. పైన ఏది పేర్కొన్నప్పటికీ, గత పనితీరుకు సంబంధించి PhonePe ప్లాట్ఫామ్లో చూపే ఏదైనా సమాచారాన్ని కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇచ్చినది, ఇది ఎటువంటి ఆర్థిక, పెట్టుబడి లేదా చట్టపరమైన సలహా కాదు.
- PRAN జనరేషన్, ఆన్‌బోర్డింగ్ ఛార్జీలు, ప్రారంభ కాంట్రిబ్యూషన్ మరియు/లేదా తదుపరి కాంట్రిబ్యూషన్ల పేమెంట్ అనేది మీకు, సంబంధిత PoP(ల) మధ్య జరిగే ఒక స్వతంత్ర లావాదేవీ అని, అలాగే PRAN జనరేషన్, NPS సర్వీస్‌లకు సంబంధించి ఏవైనా ఇతర చర్యలకు PhonePe బాధ్యత వహించదని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు. ఆన్‌బోర్డింగ్ ఫీజులు, ఇంకా ప్రారంభ కాంట్రిబ్యూషన్ల కోసం చెల్లించిన ఏవైనా అమౌంట్లు నేరుగా సంబంధిత PoP(ల)కు కేటాయించిన అకౌంట్‌కు వెళ్తాయి, అంతేగాక PhonePe ఏ సమయంలోనూ మీ ఫండ్లను ఉంచుకోదు, క్లియర్ చేయదు లేదా సెటిల్ చేయదు.
- PRAN జనరేషన్, అకౌంట్ నిర్వహణ, KYC వ్యాలిడేషన్, ఫండ్ మేనేజ్మెంట్ లేదా స్కీమ్ పనితీరుకు సంబంధించిన ఫిర్యాదులను PFRDA నియంత్రణా శాసనాల ప్రకారం నడిచేటటువంటి, చట్టబద్ధంగా నిర్దేశించిన NPS ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం ద్వారా లేదా నేరుగా సంబంధిత PoP(లు) మరియు/లేదా CRA వద్ద లేవనెత్తాలి. NPS సర్వీస్‌లను పొందే క్రమంలో PhonePe ప్లాట్‌ఫామ్ యూజర్ ఇంటర్ఫేస్కు సంబంధించి ఏవైనా టెక్నికల్ సమస్యలు ఎదురైతే, మీరు PhonePe కస్టమర్ సహాయ విభాగాన్ని సంప్రదించవచ్చు.
- వర్తించే చట్టం అనుమతించిన మేరకు, NPS సర్వీస్‌లు, అప్డేట్లు, సమాచారం/ప్రచార ఇమెయిల్‌లు మరియు/లేదా ప్రొడక్ట్ ప్రకటనలకు సంబంధించి PhonePe లేదా దాని థర్డ్ పార్టీ వెండర్లు/బిజినెస్ పార్ట్నర్లు/మార్కెటింగ్ అనుబంధ సంస్థల నుండి ఇమెయిల్‌లు, టెలిఫోన్ మరియు/లేదా SMS ద్వారా సమాచారాన్ని పొందడానికి మీరు అంగీకరిస్తున్నారు. వర్తించే చట్టం అనుమతించిన మేరకు, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌ను టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (“TRAI”) చేసిన రూల్స్, నియంత్రణా శాసనాలతో సహా, వర్తించే చట్టం కింద డు నాట్ డిస్టర్బ్ (“DND”) / నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (“NCPR”) జాబితాలో రిజిస్టర్ చేసినప్పటికీ, ఆ నంబర్‌పై ప్రతి సమాచారాన్నీ పొందడానికి మీరు అంగీకరించి, సమ్మతిస్తున్నారు. ఈ ప్రయోజనం నిమిత్తం, మీ సమాచారాన్ని దాని గ్రూప్ కంపెనీలు, PhonePe థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఎవరైనా ఆథరైజ్డ్ ఏజెంట్లకు పంపడానికి/వెల్లడించడానికి మీరు PhonePeకు మరింత అధికారం ఇస్తున్నారు.
- ప్రతి సమాచారాన్నీ సరిగ్గా పంపేలా చూడటానికి PhonePe సహేతుకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కాంటాక్ట్ సమాచారంపై విధించిన ఏవైనా పరిమితులు, ఫోన్ నంబర్ అనేది DND జాబితాలో రిజిస్టర్ కావడం, ఇమెయిల్ డేటా స్టోరేజ్ తగినంత లేకపోవడం, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల తరఫున తలెత్తిన ఎర్రర్లు తదితర సమస్యల వల్ల సమాచారాన్ని పంపడంలో వైఫల్యం(లు) సంభవించవచ్చు. పైన పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకుని, ఏవైనా సమాచారాలు అందకపోవడానికి PhonePeను బాధ్యులను చేయకూడదు లేదా బాధ్యత వహించదు.
- PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌లకు సంబంధించిన (ఆ హక్కులు రిజిస్టర్ చేసినవైనా కాకపోయినా), అలాగే PhonePe ప్లాట్‌ఫామ్, NPS సర్వీస్‌లలో ఉన్న ఏవైనా మేధోసంపత్తి హక్కులతో సహా, వాటిలోని అన్ని చట్టపరమైన హక్కులు, టైటిల్ (యాజమాన్య హక్కు), ప్రయోజనం PhonePeకి మాత్రమే సొంతమని మీరు అంగీకరించి, సమ్మతిస్తున్నారు. గోప్యమైనది అని PhonePe గుర్తించిన సమాచారం NPS సర్వీస్‌లలో ఉండవచ్చని, అయితే PhonePe నుండి పొందిన ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా సదరు సమాచారాన్ని వెల్లడించకూడదని మీరు స్పష్టంగా అంగీకరిస్తున్నారు. PhonePe ప్లాట్‌ఫామ్ “రూపురేఖలు” ( ఉదా. టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజ్‌లు, లోగోలు, బటన్ ఐకాన్లు), అలాగే ఫొటోగ్రాఫ్‌లు, ఎడిటోరియల్ కంటెంట్, నోటీసులు, సాఫ్ట్వేర్, ఇతర మెటీరియల్‌తో సహా దాని లోని కంటెంట్ అంతా కూడా, సందర్భాన్ని బట్టి, PhonePe మరియు/లేదా దాని థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు/వారి లైసెన్సర్ల యాజమాన్యంలోనిది/లైసెన్స్ పొందినది, అలాగే వర్తించే కాపీరైట్, ట్రేడ్‌మార్క్, ఇతర చట్టాల కింద తగిన విధంగా వారి నుండి రక్షణ పొందుతోంది. PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, అలాగే వాటిని ఉపయోగించుకోవడానికి PhonePe మీకు పరిమితమైన లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది. అయితే ఈ లైసెన్స్ అనేది మరొక వ్యక్తి, విక్రేత లేదా ఏదైనా ఇతర థర్డ్ పార్టీ ప్రయోజనం నిమిత్తం లేదా ఏదైనా సోర్స్ కోడ్‌ను కనుగొనడానికి, విక్రయించడానికి, కేటాయించడానికి, సబ్‌లైసెన్స్ ఇవ్వడానికి, సెక్యూరిటీ ప్రయోజనాన్ని మంజూరు చేయడానికి లేదా NPS సర్వీస్‌లలోని ఏదైనా హక్కును బదిలీ చేయడానికి కావాల్సిన పనిని కల్పించడం, సవరించడం, రివర్స్ ఇంజనీర్, రివర్స్ అసెంబుల్ లేదా ఇతరత్రా ప్రయత్నాల కోసం ఎలాంటి సమాచారాన్ని డౌన్లోడ్ చేయడం లేదా కాపీ చేయడానికి అనుమతించదు. మీరు దేన్నైనా అనధికారికంగా వినియోగిస్తే మీకు మంజూరైన అనుమతి లేదా లైసెన్స్ ముగుస్తుంది.
- PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు కింది చర్యలకు పాల్పడకూడదని అంగీకరిస్తున్నారు: (i) క్రయ, విక్రయాల ప్రయోజనం నిమిత్తం PhonePe ప్లాట్‌ఫామ్ లేదా దాని కంటెంట్‌ను ఉపయోగించడం; (ii) ఎలాంటి ఊహాజనిత, నకిలీ, లేదా మోసపూరిత లావాదేవీలు చేయడం లేదా డిమాండ్‌ను ఊహించి ఏదైనా లావాదేవీని చేయడం; (iii) PhonePe నుండి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా ప్రయోజనం నిమిత్తం రోబో, స్పైడర్, స్క్రాపర్ లేదా ఇతర ఆటోమేటిక్‌గా పనిచేసే సాధనాలు లేదా ఏదైనా మాన్యువల్ ప్రక్రియను ఉపయోగించి PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏదైనా కంటెంట్ లేదా సమాచారాన్ని యాక్సెస్ చేయడం, పర్యవేక్షించడం లేదా కాపీ చేయడం; (iv) PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏవైనా మినహాయింపు హెడర్లలోని (ఆంక్షలు విధించిన) పరిమితులను ఉల్లంఘించడం లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌కు యాక్సెస్‌ను అడ్డుకోవడం లేదా పరిమితం చేయడానికి ఉపయోగించే ఇతర చర్యలను దాటవేయడం, పరిమితం చేయడం లేదా తప్పించుకోవడం; (v) PhonePe విచక్షణ మేరకు, PhonePe మౌలిక సదుపాయాలపై అసమంజసమైన లేదా అసమానమైన పెద్ద భారాన్ని మోపే లేదా మోపే అవకాశం ఉన్న ఏదైనా చర్యను తీసుకోవడం; (vi) PhonePe నుండి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేకుండా ఏ ప్రయోజనం కోసమైనా PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏ భాగాన్నైనా (ఏదైనా ప్రొడక్ట్/సర్వీస్ కొనుగోలు పాత్(లింక్)తో సహా, అలాగని దీనికే పరిమితం కాకుండా) డీప్-లింక్ చేయడం; లేదా (vii) PhonePe నుండి పొందిన ముందస్తు రాతపూర్వక అధికారం లేకుండా PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏ భాగాన్నైనా ఇతర వెబ్సైట్లో “ఫ్రేమ్”, “మిర్రర్” చేయడం లేదా వేరే రూపంలో చేర్చడం; లేదా (viii) ఏవైనా మోసపూరిత అప్లికేషన్లను ప్రారంభించడం లేదా PhonePe/సంబంధిత PoP(లు) లేదా ఏవైనా థర్డ్ పార్టీ(ల)తో/పై ఏదైనా మోసానికి పాల్పడటానికి PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం; అలాగే (ix) PhonePe మరియు/లేదా సంబంధిత PoP(ల)కు ఏదైనా తప్పులున్న, అసంపూర్ణమైన లేదా నకిలీ సమాచారం/డేటాను అందించడం.
- NPS సర్వీస్‌లు అనేవి “ఉన్నవి ఉన్నట్లుగా”, “అందుబాటులో ఎలా ఉంటే అలా” ప్రాతిపదికన అందుతాయి. సిస్టమ్ అప్‌టైమ్ (పనితీరు) గురించి, అలాగే అంతరాయం లేకుండా లభిస్తుందని లేదా లోపం లేకుండా ప్రసారమవుతుందని (బదిలీ అవుతుందని) PhonePe ఎటువంటి స్పష్టమైన లేదా ఆ అర్థం వచ్చేలా చెప్పేటటువంటి హామీలను ఇవ్వదు.
- NPS సర్వీస్‌లను వినియోగించడం లేదా వినియోగించలేకపోవడం వల్ల, అంటే ఒప్పందం, నిర్లక్ష్యం, హక్కుల అతిక్రమణ లేదా వేరే విధంగా జరిగినప్పటికీ ఉత్పన్నమయ్యే లాభాలు లేదా రాబడుల నష్టం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాలు కోల్పోవడం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టంతో సహా ఎలాంటి పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షార్హమైన నష్టాలకు PhonePe బాధ్యత వహించదు, ఇది ఏ విధంగా సంభవించినప్పటికీ, అలాగే ఒప్పందం, హక్కుల అతిక్రమణ, నిర్లక్ష్యం, వారెంటీ లేదా వేరే విధంగా ఉత్పన్నమైనప్పటికీ, PhonePeపై పడే బాధ్యత ఏదైనా ఉంటే, అది ఏ సందర్భంలోనూ యాభై రూపాయలకు (రూ. 50) మించకూడదు.
- NPS పార్టిసిపెంట్లకు అవసరమైన వ్యక్తిగత సమాచారంతో సహా, పైన పేర్కొన్న సమాచారాన్ని పంపడం మరియు/లేదా వెల్లడించడం వల్ల ఉత్పన్నమయ్యే లేదా ఈ NPS నియమ, నిబంధనల ఉల్లంఘన వల్ల లేదా దానికి సంబంధించి వారు ఎదుర్కొనే, గురయ్యే లేదా లోబడి ఉండాల్సిన ఏదైనా, అలాగే అన్ని క్లెయిమ్‌లు, బాధ్యతలు, డిమాండ్లు, నష్టాలు, ఖర్చులు, వ్యయాలు (సహేతుకమైన అటార్నీ ఫీజులతో సహా), రెగ్యులేటరీ చర్యలు, జరిమానాలు, పెనాల్టీలు లేదా నష్టపరిహారాల నుండి PhonePe, దాని అనుబంధ సంస్థలు, దాని/వాటి సంబంధిత డైరెక్టర్లు, వాటాదారులు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లకు ఎలాంటి నష్టం కలగకుండా కాపాడటానికి మీరు బేషరతుగా, స్పష్టంగా అంగీకరిస్తున్నారు.
- ఈ NPS నియమ, నిబంధనలు అనేవి PFRDA యాక్ట్ మరియు/లేదా దాని కింద ఉన్న నియంత్రణా శాసనాలతో సహా భారతీయ చట్టాల ప్రకారం అమలవుతాయి, అలాగే వాటి ప్రకారం అర్థం చేసుకోవాలి. ఈ NPS నియమ, నిబంధనల వల్ల లేదా దానికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏదైనా చట్టపరమైన అభియోగం, చర్య లేదా ప్రొసీడింగ్ అనేవి కర్ణాటకలోని బెంగళూరులో సమర్థాధికార పరిధి ఉన్న న్యాయస్థానాల ప్రత్యేక అధికార పరిధిలోకి మాత్రమే వస్తాయి.
- చట్టబద్ధమైన సవరణలు, PFRDA ఆదేశాలు లేదా కార్యాచరణ మెరుగుదలలకు అనుగుణంగా ఈ NPS నియమ, నిబంధనలను ఏ సమయంలోనైనా మార్చే, సవరించే లేదా అప్డేట్ చేసే హక్కు PhonePeకు ఉంది. సదరు అప్డేట్ చేసిన తర్వాత కూడా NPS సర్వీస్‌లను నిరంతరం వినియోగిస్తుంటే ఆ సవరించిన నియమాలకు కట్టుబడి ఉండటానికి మీరు సమ్మతించినట్లుగా పరిగణించడమవుతుంది.
- ఈ నియమ, నిబంధనలలోని ఏదైనా నిబంధన అనేది వర్తించే చట్టాల కింద అతిక్రమించినదిగా లేదా ఉల్లంఘించినదిగా లేదా చట్టవిరుద్ధంగా, చెల్లనిదిగా లేదా అమలు చేయలేనిదిగా మారినా, సదరు ఉల్లంఘన, చట్టవిరుద్ధత, చెల్లుబాటు కాకపోవడం లేదా అమలు చేయలేకపోవడం అనేది మొత్తం నియమ, నిబంధనలను చెల్లనివిగా మార్చదని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు. సదరు నిబంధనను చెల్లుబాటు అయ్యేదిగా, చట్టబద్ధమైనదిగా, అమలు చేయదగినదిగా మార్చేందుకు అవసరమైన మేరకు సవరించినట్లుగా పరిగణించడమవుతుంది, అయితే సదరు మార్పు ఏదీ దాన్ని చెల్లుబాటు అయ్యేదిగా, చట్టబద్ధమైనదిగా, అమలు చేయదగినదిగా చేయలేకపోతే, ఆ చెల్లనిదిగా మారిన నిబంధనను నియమ, నిబంధనల నుండి తొలగించినట్లుగా పరిగణించడమవుతుంది, అయితే ఇలా తొలగించడం వల్ల ఈ నియమ, నిబంధనల నిబంధనలు లేదా ఒడంబడికల చెల్లుబాటు, చట్టబద్ధత, అమలు సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం పడదు, అలాగే పార్టీల హక్కులు, బాధ్యతలు తదనుగుణంగా అన్వయించి, అమలు చేయడమవుతుంది.
- ఈ అగ్రిమెంట్‌ను (ఈ అగ్రిమెంట్‌లోని అన్ని హక్కులు, టైటిళ్లు (యాజమాన్య హక్కులు), లాభాలు, ప్రయోజనాలు, బాధ్యతలు, విధులతో సహా) లేదా దానిలోని ఏదైనా భాగాన్ని తన అనుబంధ సంస్థలలో దేనికైనా, ప్రయోజనం పొందేందుకు అర్హులైన ఏ ప్రతినిధికైనా (వారసులకు) కేటాయించే హక్కు PhonePeకు ఉంటుంది. ఈ అగ్రిమెంట్ కింద ఉండే కొన్ని PhonePe హక్కులు, బాధ్యతలను స్వతంత్ర కాంట్రాక్టర్లు లేదా ఇతర థర్డ్ పార్టీలకు PhonePe అప్పగించవచ్చు. మా ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మీరు ఈ అగ్రిమెంట్‌ను, పూర్తిగా లేదా పాక్షికంగా, ఏ వ్యక్తికి లేదా సంస్థకు కేటాయించకూడదు, ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం మాకే ఉంటుంది.
- మీకు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, సర్వీస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఆపివేసే లేదా నిలిపివేసే హక్కు PhonePeకు ఉంది. NPS సర్వీస్‌లలో ఏదైనా మార్చినా లేదా వాటిని నిలిపివేసినా, దానికి సంబంధించి PhonePe మీకు ఏ విధంగానూ బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు.