PhonePe ప్రైవేట్ లిమిటెడ్ ఎనేబుల్ చేసిన రీఛార్జ్, ఇంకా బిల్లు పేమెంట్ సేవల వినియోగాన్ని ఈ నియమాలు, నిబంధనలు నియంత్రిస్తాయి. PhonePe అనేది 1956 కంపెనీల చట్టం కింద ఏర్పాటు అయింది. దీని రిజిస్టర్డ్ కార్యాలయం ఆఫీస్-2, 4,5,6,7 వ అంతస్తులు, A వింగ్, A బ్లాక్, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, సర్వీస్ రోడ్, గ్రీన్ గ్లెన్ లే అవుట్, బెల్లందూర్, బెంగళూరు, కర్ణాటక- 560103, ఇండియాలో ఉంది (ఇప్పటి నుండి “PhonePe”/ “మేము”/”మాకు”/” మా” అని సూచిస్తారు). పేమెంట్ – సెటిల్‌మెంట్స్ చట్టం, 2007 నిబంధనలు, ఇంకా కాలానుగుణంగా RBI జారీ చేసే నియంత్రణలు, సూచనలకు అనుగుణంగా సెమీ క్లోజ్డ్ PPIలను జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా PhonePeకు ఈ మేరకు అధికారం ఇవ్వబడింది.
PhonePe రీఛార్జ్ & బిల్లు పేమెంట్‌ను వినియోగించుకోవడం ద్వారా, మీరు (“యూజర్”/ “మీరు”/ “మీ”) ఈ వినియోగ నియమాలకు (ఇకపై “బిల్లు పేమెంట్ నియమ,నిబంధనలు”గా పిలుస్తారు), లోబడి ఉంటానని సూచిస్తున్నారు. అలాగే వీటితో పాటు https://www.phonepe.com/terms-conditions/ లింక్ వద్ద ఉన్న సాధారణ PhonePe నియమ నిబంధనలను (“సాధారణ నియమాలు”), ఇంకా https://www.phonepe.com/te/privacy-policy లింక్‌లో ఉన్న ప్రైవసీ పాలసీని అంగీకరిస్తున్నట్లు తెలియచేస్తున్నారు. అవసరమైన సందర్భంలో “వినియోగదారు”/ “మీరు”/”మీ” అంటే కనీసం 18 (పద్దెనిమిది) సంవత్సరాల వయసు కలిగి ఉండి, భారతీయ కాంట్రాక్ట్ చట్టం, 1872 ప్రకారం ఇచ్చిన నిర్వచించిన అర్ధానికి లోబడి, ఒప్పందానికి అర్హత కలిగి విడుదల కాని, దివాళా తీయని, ఈ బిల్లు పేమెంట్ నియమ, నిబంధనలను అంగీకరిస్తూ PhonePeలో రిజిస్టర్ చేసుకున్నటువంటి సహజంగా భారతీయ పౌరుడైన లేదా చట్టబద్ధమైన వ్యక్తి అని అర్థం,
PhonePe రీఛార్జ్ & బిల్లు పేమెంట్ల సౌకర్యం ఆఫర్ కలిగి ఉన్న PhonePe సేవలను వినియోగించుకోవడానికి కొనసాగడం ద్వారా, మీరు PhonePeతో ఒప్పందం చేసుకుంటున్నారు, అలాగే ఈ బిల్లు పేమెంట్ నియమ, నిబంధనలకు, వీటితోపాటు ఇక్కడ సూచించబడిన అన్ని విధానాలు, ఈ ఆఫర్‌కు సంబంధించి PhonePeతో కట్టుబడి ఉండాల్సిన బాధ్యతలను మీకు కల్పిస్తున్నాయి.
యుటీలిటీలు, పేమెంట్ సేవల కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోళ్ల కోసం మీకు యుటిలిటీ సేవలు, పేమెంట్ సేవలను అందిస్తూ, PhonePe వాలెట్, UPI, డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్ (‘పేమెంట్ ఆప్షన్‌లు’)ను పేమెంట్ పద్ధతిగా స్వీకరించే ఏ సంస్థయినా మరియు/లేదా ఎంటిటీ అయినా రీఛార్జ్ & బిల్లు పేమెంట్ కేటగిరీ ప్రయోజనం కోసం అగ్రిగేటర్ లేదా BBPO ద్వారా PhonePe యాప్ ఉపయోగించి మీరు చేసే బిల్లు పేమెంట్ల కోసం ఇకపై, “మర్చెంట్/బిల్లర్‌లు” అనే పదంలో చేర్చుతాము.
మీరు PhonePe యాప్ లేదా ఏ మర్చెంట్ వెబ్‌సైట్/మర్చెంట్ ప్లాట్‌ఫామ్/మర్చెంట్ స్టోర్ ద్వారా రీఛార్జ్ & పేమెంట్ బిల్లు పేమెంట్ సేవలను పొందేందుకు PhonePeను ఉపయోగించి (ఏ రకమైన పేమెంట్ ఆప్షన్‌లతోనైనా) లావాదేవీ జరిపినప్పుడు, సంబంధిత మర్చెంట్స్ నియమ, నిబంధనలతోపాటు ఈ బిల్లు పేమెంట్ నియమ, నిబంధనలు మీకు వర్తిస్తాయి.
మేము ఏ సమయంలోనైనా మా పూర్తి విచక్షణ మేరకు, మీకు ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే ఈ సేవా నియమాలలోని భాగాలను మార్చడం, సవరించడం, చేర్చడం లేదా తీసివేసే హక్కును కలిగి ఉన్నాము. ఈ వినియోగ నియమాల అప్‌డేట్‌లు / మార్పులను కాలానుగుణంగా సమీక్షించాల్సిన బాధ్యత మీదే. మార్పులను పోస్ట్ చేసిన తర్వాత మీరు PhonePeను ఉపయోగిస్తున్నారంటే, మీరు ఈ నియమాలకు చేసిన సవరణలను, చేర్చినటువంటి అదనపు నియమాలను లేదా, ఈ నియమాలలోని తీసివేసిన భాగాలతో సహా అంగీకరిస్తున్నారని దీని అర్థం. మీరు ఈ వినియోగ నియమాలకు లోబడి ఉన్నంత వరకు, రీఛార్జ్ & బిల్లు పేమెంట్లు చేయడం కోసం సదరు PhonePe యాప్‌ను ఉపయోగించుకోవడానికి, అలాగే ఎప్పటికప్పుడు పేమెంట్లు, సభ్యత్వాలు, రీఛార్జ్‌లు, యుటిలిటీ పేమెంట్లు అలాగే పునరావృతమయ్యే ఏ విధమైన ఇతర పేమెంట్ల కోసమైనా PhonePe యాప్ ద్వారా అందించే సేవలను ఉపయోగించుకోవడానికి మేము మీకు పరిమిత హక్కును జారీ చేస్తాము.
PhonePe యాప్‌లోని PhonePe రీఛార్జ్ & బిల్లు పేమెంట్ ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా సదరు నియమ నిబంధనలకు మీరు అంగీకారం తెలియచేశారని పరిగణిస్తాము. కాబట్టి, కొనసాగే ముందు దయచేసి ఈ నియమాలను శ్రద్ధగా చదవండి.
రీఛార్జ్ & బిల్లు పేమెంట్ నియమ, నిబంధనలను పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అంగీకరించడం ద్వారా, మీరు గోప్యతా విధానంతో పాటు PhonePe విధానాలన్నింటికీ అంగీకారం తెలిపి, వాటికి కట్టుబడి ఉంటానని ఒప్పుకుంటున్నారు.
- రీఛార్జ్ & బిల్లు పేమెంట్ కోసం సాధారణ నియమాలు:
- PhonePe అనేది పేమెంట్ల ఫెసిలిటేటర్ మాత్రమేనని, పేమెంట్లకు సంబంధించిన పార్టీ కాదని యూజర్‌లు గమనించగలరు.
- మొబైల్ పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జ్, ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లు పేమెంట్, DTH, ప్రసార సేవ పేమెంట్లకు సభ్యత్వం కోసం, అలానే విద్యుత్తు, LPG లాంటి ఇతర యుటిలిటీ పేమెంట్ల కోసం చెల్లించేందుకు మీకు అనుమతిస్తూ, PhonePe రీఛార్జ్, పేమెంట్ బిల్లు సేవల సౌకర్యాన్ని అందిస్తోంది. ఎప్పటికప్పుడు PhonePe అందించే క్రెడిట్ కార్డ్ పేమెంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్, ఆన్‌లైన్ విరాళం, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్, డేటా కార్డ్ బిల్లు పేమెంట్, మునిసిపల్ ట్యాక్స్ & నీటి ట్యాక్స్ పేమెంట్, స్కూల్ ఫీజు పేమెంట్, టోల్ ట్యాక్స్ రీఛార్జ్ (FasTag), లోన్ రీపేమెంట్, ఇతర సేవలు a) PhonePeతో కాంట్రాక్ట్ ఉన్న యాగ్రిగేటర్స్ ద్వారా లేదా b) సదరు మర్చెంట్, బిల్లు పేమెంట్ల కోసం NPCI వద్ద రిజిస్టర్ చేసుకున్న భారత్ కనెక్ట్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మొబైల్ యాప్‌లోని “రీఛార్జ్ & బిల్లుల పేమెంట్” విభాగంలో అందుబాటులో ఉంటాయి.
- రీఛార్జ్ & బిల్లు పేమెంట్లను సెటప్ చేయడం:
- పేమెంట్/సభ్యత్వం ఫీజు గడువు, బిల్లు విలువ, సభ్యత్వం ప్లాన్, గడువు తేదీ, బకాయి ఉన్న అమౌంట్, గడువు, ఇంకా ఇతర సమాచారాన్ని పొంది మర్చెంట్‌తో మీ అకౌంట్‌కు పేమెంట్‌ను ఎనేబుల్ చేసేందుకు, ప్రత్యేక ఐడెంటిటీ/సభ్యత్వం ఐడెంటిటీ నంబర్ లేదా బిల్లు నంబర్ లేదా రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్, రిజిస్టర్ చేసిన టెలిఫోన్ నంబర్ లేదా ఇతర ఐడెంటిఫయర్(లు) అనేవి మీరు రీఛార్జ్ లేదా బిల్లు పేమెంట్లను చేయడానికి అవసరమవుతాయి.
- పేర్కొన్నటువంటి ప్రయోజనాల కోసం కొనసాగే ప్రాతిపదికన రీఛార్జ్ & బిల్లు పేమెంట్ సేవల కోసం మీకు సదరు మర్చెంట్‌తో ఉన్న అకౌంట్‌కు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు, పొందేందుకు, పంచుకునేందుకు, ఉపయోగించేందుకు, స్టోర్ చేసేందుకు మీరు PhonePeను అంగీకరిస్తున్నారు.
- సరైన బిల్లును, సభ్యత్వం విలువను పొందేందుకు సరైన సమాచారం ఇవ్వడం అనేది అత్యంత ముఖ్యమైన సంగతి అని మీరు అర్థం చేసుకుని, దాని ప్రకారం తప్పులు లేని ఐడెంటిఫయర్ సమాచారాన్ని అందించేలా నిర్ధారించుకుంటారని మీరు నిర్ధారిస్తున్నారు.
- చెల్లించాల్సిన, రీఛార్జ్ చేయాల్సిన లేదా సభ్యత్వం విలువకు సంబంధించిన మొత్తం అనేది మీకూ, మర్చెంట్‌కూ మధ్య గల ఒప్పందం అని, దీనికి సంబంధించిన తప్పులను సరిచూసేందుకు PhonePeకు ఎటువంటి బాధ్యత లేదని మీరు అర్థం చేసుకున్నారు.
- మీ అకౌంట్ సమాచారాన్ని తాజాగా అప్-టు-డేట్‌గా ఉంచుకునేందుకు, అన్ని సమయాల్లోనూ సదరు నియమ నిబంధనలకు మీరు కట్టుబడి ఉంటారని, అలా ఉండని పక్షంలో సదరు అకౌంట్‌ను సస్పెండ్ చేయడం లేదా ఏ రకమైన సేవలనైనా తిరస్కరించేందుకు PhonePeకు అధికారం ఉందని అంగీకరిస్తున్నారు.
- రీఛార్జ్ & బిల్లు పేమెంట్ సేవను అందించేందుకు, సదరు యూజర్ ఐడెంటిఫయర్ డేటా, లొకేషన్/రాష్ట్రం మరియు/లేదా KYC సమాచారం / ఏ ఇతర వ్యక్తిగత సమాచారాన్ని అయినా పన్ను / GST ప్రయోజనాల కోసం సదరు మర్చెంట్ / బిల్లర్‌కు పంచుకోవాల్సి ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు.
- లావాదేవీని ప్రాసెస్ చేసేందుకు మర్చెంట్, థర్డ్ పార్టీ సేవా సంస్థలు, ఆగ్రిగేటర్లతో కమ్యూనికేషన్ జరిపేందుకు మీరు PhonePeకు అధికారం ఇస్తున్నట్లు అంగీకరిస్తున్నారు.
- అలాగే, మీరు స్పష్టంగా అంగీకరించిన విధంగా రిమైండర్ సౌకర్యాన్ని లేదా ఆటోమేటిక్ పేమెంట్ సౌకర్యాన్ని PhonePe సెటప్ చేసేందుకు, ఇంకా రీఛార్జ్ & బిల్లు పేమెంట్ కోసం సదరు మర్చెంట్‌కు ఒకసారి చెల్లించిన తర్వాత అది రీఫండ్ అవదని మీరు అంగీకరిస్తున్నారు.
- పేమెంట్ కోసం ఏ విధమైన డూప్లికేట్ స్టాండింగ్ సూచనలు లేదా ఆలస్యపు పేమెంట్లకు లేదా మీరు చేసే పేమెంట్లపై సదరు మర్చంట్ విధించే ఏ విధమైన అపరాధానికి/ వడ్డీకి పూర్తిగా మీరే బాధ్యులు. PhonePe అనేది సదరు మర్చంట్లకు మీ తరఫున పేమెంట్ల సౌలభ్యాన్ని మాత్రమే అందిస్తోందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించటమైనది.
- ఛార్జీలు:
- PhonePe ప్లాట్‌ఫామ్ ద్వారా PhonePe సర్వీస్‌లను అందించడం కోసం, PhonePe వివిధ ఖర్చులను (మౌలిక సదుపాయాల ఆపరేషన్, నిర్వహణ, వివిధ పద్ధతుల ద్వారా లావాదేవీ(లు)/పేమెంట్లను సులభతరం చేయడం వంటి ఖర్చులతో సహా, కానీ వీటికే పరిమితం కాదు) భరిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు, అందువల్ల PhonePe మీ నుండి ఫీజు(లు) (ప్లాట్‌ఫామ్ ఫీజు, కన్వీనియన్స్ ఫీజు వంటివి) వసూలు చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, ఈ ఫీజులను మీకు ముందుగానే చూపుతారు, అలానే ఇవి మీరు చేస్తున్న సంబంధిత లావాదేవీ/బిల్లు పేమెంట్ విలువ/అమౌంట్ పైన, ఎగువన ఉంటాయి. అటువంటి ఫీజు(ల)ను ఎప్పటికప్పుడు సవరించే హక్కు PhonePeకు ఉంటుంది.
- ఈ నియమాల ప్రకారం ఏదైనా పేమెంట్ చేయడానికి బిల్లర్(లు) మీపై విధించే ఏవైనా ఛార్జీలకు PhonePe బాధ్యత వహించకపోవచ్చు.
- మీరు స్పష్టంగా అంగీకరించిన విధంగా యాక్సెస్ కోసం, థర్డ్ పార్టీ పేమెంట్ కోసం లేదా థర్డ్ పార్టీ పేమెంట్ సభ్యుల నుండి మరియు/ లేదా బిల్లర్ల నుండి అటువంటి ఇతర డేటా ఫీజులు ఉండవచ్చని, దీనికి సంబంధించి PhonePeకు ఎటువంటి బాధ్యత ఉండదని మీరు అంగీకరిస్తున్నారు.
- మీ బాధ్యతలు: సదరు PhonePe రీఛార్జ్ & బిల్లు పేమెంట్ల వినియోగం విషయంలో ఇక్కడ పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండటం అనేది మీ బాధ్యత:
- సదరు లావాదేవీ విజయవంతమైందా లేదా విఫలమైందా అనే దాని గురించిన సమాచారాన్ని లావాదేవీ హిస్టరీ మరియు/ లేదా నోటిఫికేషన్ల విభాగంలో మీరు ధృవీకరించుకోవాలి.
- రీఛార్జ్ & బిల్లు పేమెంట్ల సేవలకు సంబంధించి సదరు మర్చెంట్ విధించిన, మీ అకౌంట్ నుండి డెబిట్ అయ్యే ఛార్జీలకు లేదా మీ బిల్లు / సభ్యత్వం ఫీజుకు చేర్చే ఛార్జీలు వేటికైనా మీరే బాధ్యత వహించాలి.
- మీరు కాలానుగుణంగా చెల్లించాల్సిన బిల్లులు, సభ్యత్వం ఫీజు, రీఛార్జ్ గడువు ముగింపులు మరియు లేదా మీరు ఉపయోగించుకున్నటువంటి ఏ విధమైన యుటిలిటీలు/ సర్వీసులు లేదా రిపీట్ అయ్యే ఛార్జ్ సర్వీసులను ట్రాక్ చేసుకోవడం అనేది మీ బాధ్యత అని దయచేసి గమనించండి. అంతే కాక, దీనికి సంబంధించి బిల్లర్ల నుండి కాలానుగుణంగా పొందే బిల్లులకు సంబంధించిన సాంకేతిక సమస్యలకు లేదా బిల్లులలోని ఏ విధమైన తప్పులు / తేడాలకు PhonePe ఎటువంటి బాధ్యత వహించదు.
- మీ బిల్లు పేమెంట్‌ను షెడ్యూల్ చేసే విషయమై మీకే బాధ్యత ఉంటుంది, సదరు పేమెంట్ పూర్తయ్యేందుకు పట్టే సమయం అనేది ఒక్కో మర్చెంట్‌కు ఒకలా ఉంటుందని, ఈ విషయంలో పేమెంట్ అనేది కేవలం పూర్తిగా మీ సూచనల ప్రకారమే ఆధారపడి ఉంటుందని మీరు అర్ధం చేసుకున్నారు. లావాదేవీకి సంబంధించిన ఆలస్యానికి/రీఫండ్‌లకు లేదా వైఫల్యాలకు మేము బాధ్యత వహించము.
- వినియోగదారు పొరపాట్లు:
- మీరు తప్పు పార్టీకి లేదా తప్పు బిల్లర్‌కు పొరపాటున పేమెంట్ చేస్తే లేదా రెండు సార్లు పేమెంట్ చేస్తే లేదా తప్పు అమౌంట్‌ని పంపితే (ఉదాహరణకు టైప్ చేసేటప్పుడు మీవైపు పొరపాటు దొర్లినప్పుడు), మీరు పేమెంట్‌ను పంపిన సదరు మర్చంట్/ పార్టీని మీరే స్వయంగా సంప్రదించి ఆ అమౌంట్‌ని రీఫండ్ చేయాలని అభ్యర్ధించవలసి ఉంటుంది. మీరు పొరపాటుగా చేసిన పేమెంట్‌ను PhonePe మీకు రీయింబర్స్ లేదా వెనక్కు మళ్లించదు.
- డిస్‌క్లెయిమర్‌లు:
- ఆన్‌లైన్ లావాదేవీల వల్ల తలెత్తే రిస్క్‌లన్నింటికీ మీరే బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు.
- ఇక్కడ పేర్కొన్నటువంటి సేవలతో పాటు వీటికే పరిమితం కాకుండా నాణ్యత విషయమై PhonePe, థర్డ్-పార్టీ భాగస్వాములు ఎటువంటి వారంటీని ఇవ్వరు, ఇస్తామనే అర్ధాన్ని కూడా వ్యక్తం చేయరు లేదా సూచించరు: i) సదరు సేవలు మీ అవసరాలకు తగినట్లు ఉంటాయని; II) సదరు సేవలు నిరంతరాయంగా, సరైన సమయానికి లేదా పొరపాట్లు లేకుండా అందించబడతాయని; లేదా III) సదరు సేవలకు సంబంధించి మీరు పొందిన ఉత్పత్తుల సమాచారం లేదా మెటీరియల్ అనేవి మీ అవసరాలకు సరిపోతాయని.
- ఇక్కడ స్పష్టంగా అందించిన, ఇంకా చట్టం పూర్తిగా అనుమతించిన మేరకు మినహాయించి, సదరు వాలెట్ సేవల ఫీచర్ అనేది “ఉన్నది ఉన్నట్లుగా”, “లభించినంత మేరకు”, “అన్ని లోపాలతో” అందుతుంది. వ్యక్తీకరించినప్పటికీ లేదా సూచించినప్పుటికీ అలాంటి వారంటీలు, ప్రాతినిధ్యాలు, నిబంధనలు, అండర్‌టేకింగ్‌లు, నియమాలను ఈ సందర్భంగా మినహాయిస్తున్నాము. సదరు సేవల ఖచ్చితత్వం, సంపూర్ణత, వినియోగార్హతను, అలానే PhonePe అందించే లేదా సాధారణంగా అందుబాటులో ఉండే ఇతర సమాచారాన్ని అంచనా వేసుకోవడం అనేది మీ బాధ్యత. అలాంటి వారంటీని మా తరఫున చేసేందుకు మేము ఎవరినీ అధికారికం చేయము, మీరు అలాంటి ప్రకటనపై ఆధారపడరాదు.
- భారత్ కనెక్ట్ ఆపరేటింగ్ యూనిట్ ఫిర్యాదు ప్రక్రియ
- పెండింగ్ లావాదేవీలు: బిల్లు పేమెంట్లు/రీఛార్జ్‌ల నిర్ధారణ సాధారణంగా వెంటనే పూర్తవుతుంది. అయితే, అరుదైన సందర్భాల్లో, లావాదేవీ నిర్ధారణను పంపడానికి సర్వీస్ ప్రొవైడర్లకు సాధారణంగా కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. మీ బిల్లు పేమెంట్/రీఛార్జ్ పెండింగ్ స్టేటస్‌లో ఉన్నట్లుగా మీకు కనిపిస్తే, మీ సర్వీస్ ప్రొవైడర్ నుండి నిర్ధారణ కోసం మేము వేచి ఉన్నామని అర్థం, అలానే తుది స్టేటస్‌ను అప్‌డేట్ చేయడానికి వారికి 96 గంటల వరకు పట్టవచ్చు. లావాదేవీ 24 గంటలకు మించి పెండింగ్ స్టేటస్‌లో ఉన్నట్లుగా మీకు కనిపిస్తే, మీరు మాతో టికెట్‌ను రైజ్ చేయవచ్చు, అలానే మేము దాని గురించి సర్వీస్ ప్రొవైడర్‌తో చర్చిస్తాము.
- విజయవంతమైన లావాదేవీలు: బిల్లు పేమెంట్/రీఛార్జ్ విజయవంతమైన తర్వాత కూడా బిల్లు పేమెంట్లు/రీఛార్జ్ అప్‌డేట్ కాకపోతే/సర్వీస్ అందకపోతే, దయచేసి 48 గంటలు వేచి ఉండండి. 48 గంటల తర్వాత కూడా బిల్లు పేమెంట్/రీఛార్జ్ అప్‌డేట్ కాకపోతే/సర్వీస్ అందకపోతే, మీరు ఏదైనా ఫిర్యాదు/సమస్యను మాకు తెలపవచ్చు. మీ సమస్యను మేము సమీక్షించి, మీ ఫిర్యాదు/సమస్య అందిన తేదీ నుండి 48 పని గంటల్లోపు, అలానే 30 పని దినాలు మించకుండా మీ ఫిర్యాదు/సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. మరిన్ని వివరాల కోసం మీరు మా ఫిర్యాదు పరిష్కార పాలసీని చూడవచ్చు.
- రీఫండ్‌లు: మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో ప్రాసెస్ చేసిన లావాదేవీకి సంబంధించిన అన్ని రీఫండ్‌లు (వర్తిస్తే) సోర్స్ అకౌంట్‌కు మాత్రమే రీఫండ్ అవుతాయి. UPIని ఉపయోగించి చేసిన పేమెంట్ల విషయంలో 3 నుండి 5 రోజుల్లోపు, కార్డ్ పేమెంట్లకు 7 నుండి 9 రోజుల్లోపు, అలానే వాలెట్, గిఫ్ట్ కార్డ్ పేమెంట్లకు 24 గంటల్లోపు మీకు రీఫండ్ అందుతుంది.
- ఇతర నియమాలు:
వినియోగదారు రిజిస్ట్రేషన్, గోప్యత, వినియోగదారు బాధ్యతలు, నష్టపరిహారం, పాలక చట్టం, బాధ్యత, మేధోసంపత్తి, రహస్యాలు, సాధారణ నిబంధనలు వంటి వాటితో పాటు ఇతర నియమాలన్నీ సదరు సాధారణ నిబంధనలు సూచించిన మేరకు ఈ సేవా నియమాల్లో చేర్చినట్లుగా భావించారు.