PhonePe Blogs Main Featured Image

Design

కోట్లాది మంది భారతీయుల కోసం నిరంతరాయమైన పేమెంట్ అనుభవానికి రూపకల్పన

PhonePe Regional|2 min read|23 April, 2021

URL copied to clipboard

PhonePe ఇటీవల 25 కోట్ల వినియోగదారులనే మైలురాయిని దాటింది. దాంతోపాటే UPI లావాదేవీల విషయంలో అతిపెద్ద సంస్థగా అవతరించింది. 10 కోట్లకు పైగా క్రియాశీలక వినియోగదారులను కలిగి ఉండడంతో మేము ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా లావాదేవీలు జరిపే వినియోగదారుల పునాది కలిగిన సంస్థగా నిలిచాము. సుదూరమైన ప్రయాణం సాదించి భారతదేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని తెలిపేందుకు గర్విస్తున్నాము.

గొప్ప సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉండడంతో పాటు, తేలికైన, అంతర్ దృష్టి కలిగిన ఉత్పత్తిగానూ, కొత్త ఉత్పత్తులు మరియు ఫీచర్లను కలుపుకుని ఉండడమే వినియోగదారులు అనునిత్యం మా ఉత్పత్తిని ఉపయోగించడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. వినియోగదారుల సంతృప్తి మాత్రమే మాకు ప్రధానం కాదు. మా వినియోగదారులకు మా యాప్ ద్వారా చేసే ప్రతి పేమెంట్ అనుభవాన్ని సంతోషకరమైనదిగా చేయాలన్నదే మా ఉద్దేశం. దానికోసం మేము ఏం చేస్తున్నామో తెలుసుకోండి!

భారతదేశంలో డిజిటల్ పేమెంట్ల స్వీకరణ

దేశం నలుమూలలా మాకు పేమెంట్ విధానంగా అంగీకారం లభించింది. మా యాప్ వ్యాప్తి మరియు విస్తృతమైన వినియోగదారుల పునాదికి నిజమైన సాక్ష్యంగా చెప్పాలంటే, మా కస్టమర్లలో 80% మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, ఇంకా దానికన్నా దిగువన ఉన్న ప్రాంతాలకు చెందిన వారే. ఈ వర్గాల్లో డిజిటల్ పేమెంట్లకు ఆదరణ అంతంతమాత్రమే. నమ్మకం, భద్రత, రక్షణ, విశ్వసనీయతల విషయంలో ఉన్న సందేహాలే దీనికి కారణం.

కస్టమర్లతో మేము జరిపిన సంభాషణల సందర్భంగా, మా వినియోగదారుల్లో చాలామంది తొలిసారిగా ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారని తెలిసింది. వారికి పేమెంట్లు చేయడాన్ని సులభతరం చేయడంలో వారికి సహాయపడడం మాత్రమే కాక, డిజిటల్ నిపుణులుగా వారిని తయారు చేసే క్రమంలో వారిని చేయి పట్టుకుని నడిపించడం కూడా చేస్తున్నాము.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని, మేము దీనికి తగిన వ్యవస్థలను, ప్రక్రియలను రూపొందించేందుకు భారీగా పెట్టుబడి పెట్టాము. ఇది మాకు వివిధ వినియోగదారు విభాగాలు, ప్రదేశాలు, సాధనాలు, పేమెంట్ వర్గాల విషయంలో కస్టమర్ల ప్రవర్తన విధానాలను లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడింది. ఈ ప్రయత్నాల ద్వారా, మా యాప్ లో సంతోషకరమైన, ఇబ్బందికరమైన అనుభవాలు రెండింటికీ దారితీసే ముఖ్యమైన లక్షణాలను కూడా గుర్తించాము. ఆ తర్వాత మేము జరిపిన లోతైన పరిశోధన సందర్భంగా ఇబ్బంది కలిగించే అంశాలను పరిష్కరించే క్రమంలో సాంకేతికతకు, డేటాకు ప్రాధాన్యమిచ్చే విధానాన్ని అవలంబించాము.

మా యాప్ మీ భాషను మాట్లాడుతుంది

మా కస్టమర్లలో చాలా మంది యాప్ ను తమ మాతృభాషలో ఉపయోగించడానికే ప్రాధాన్యమిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, మేము 8 భారతీయ భాషల్లో మా సేవలను అందుకోవడంలో సహాయపడుతున్నాము. ప్రాంతీయ భాషలో టెలిఫోన్ సహాయం అందించడంతో పాటు, యాప్, సహాయ విభాగం, చాట్ సహాయం కోసం కూడా ఇప్పుడు భాష ఎంపికను అందిస్తున్నాము. స్థానిక భాషను ప్రవేశపెట్టేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలకు గొప్ప ఆదరణ లభిస్తోంది. చాలామంది కస్టమర్లు ఇప్పుడు మా యాప్ ను తమకు సౌకర్యవంతమైన భాషల్లో ఉపయోగించాలని కోరుకుంటున్నారు.

సహాయం చేసేందుకు మేము సిద్ధం!

UPI పేమెంట్లు ఎలా పని చేస్తాయనే విషయంలో పలు అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది వినియోగదారులు డిజిటల్ పేమెంట్లను ఉపయోగించేందుకు సంకోచిస్తున్నారు. ముఖ్యంగా VPAను రూపొందించడం, మీ UPI పిన్ ను సెట్ చేసుకోవడం, బ్యాంకు ఖాతాలను లింక్ చేయడం లాంటివి వారు ఎదుర్కునే ప్రాథమిక సమస్యల్లో ప్రధానమైనవి. ఈ సమస్యను నివారించి, కస్టమర్లు సులభంగా మా యాప్ లోకి వచ్చేందుకు వీలుగా వారికి సులభంగా అర్థం అయ్యే రీతిలో సహాయ కథనాలను, అవగాహన వీడియోలను మేము వివిధ భాషల్లో రూపొందించాము. యాప్ లో వినియోగదారులకు సహాయపడడం కోసం ఇమేజ్, విజువల్ మీడియా మార్గాలను కూడా మేము నిరంతరం చేర్చుతున్నాము. ఉత్పత్తి, వ్యాపార బృందాలతో మేము భాగస్వామ్యం నెలకొల్పుకొంటున్నాము. మా సహాయ విభాగాన్ని సంప్రదించే రేటును నిరంతరం తగ్గేలా చూసుకుంటున్నాము. అది ఇప్పుడు 0.5% మేరకే పరిమితం కావడం గొప్ప విషయం.

ఆటోమేషన్ తో సమస్యల తక్షణ పరిష్కారం

మేము 90% కస్టమర్ సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం అందిస్తున్నాము. ఈ శాతాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాము. కస్టమర్లు తమ పేమెంట్ సమస్యలను సులభంగా ట్రాక్ చేసి, తక్షణ స్పందనలు అందుకోవడానికి వీలు కల్పించేలా మా సహాయక వ్యవస్థలను ఇప్పటికే యంత్రమయం చేశాము. ఇది కస్టమర్ సేవా విభాగం ప్రతినిధి కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి కస్టమర్లకు వీలు కల్పిస్తుంది. కస్టమర్లకు పరిష్కారాలను అందించే సమయంలో సంపూర్ణ పారదర్శకత ఉండేలా మేము చూసుకుంటున్నాము. నేడు, సుమారు 80% సమస్యలు ఆటోమేట్ చేసిన పోర్టల్ అనుభవాలు మరియు ఫోన్ IVR ద్వారానే పరిష్కరించబడుతున్నాయి. ఇది కస్టమర్ల సంతృప్తి రేటును మెరుగుపరుస్తోంది. దీనిని మరింత మెరుగుపరచగలమని మేము విశ్వసిస్తున్నాము. కస్టమర్లు తాము ఎదుర్కుంటున్న ఏ సమస్యపైన అయినా కొన్ని గంటల్లోనే మా నుంచి స్పందన అందుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

భవిష్యత్తు కోసం నిర్మాణం

మా కస్టమర్ల నుంచి మేము ప్రతినిత్యం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నాము. వారి నుంచి అందుకునే ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేము కొత్త అంశాలను చేర్చుతూ, వారికి కొత్త అనుభవాలు అందించే రూపకల్పనలను ప్రవేశపెడుతున్నాము. ఇది భారతదేశంలోని వినియోగదారులకు అత్యుత్తమ పేమెంట్ అనుభవాన్ని అందిస్తుంది.

Keep Reading