Investments
లిక్విడ్ ఫండ్స్ తో మీ రిటర్న్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించండి
PhonePe Regional|2 min read|19 July, 2021
క్రికెట్ లో, ఒక కఠినమైన బౌలర్ ను ఒక బ్యాట్స్ మేన్ ఎదుర్కునే సమయంలో, వికెట్లు కోల్పోతామేననే భయంతో ఫోర్లు, సిక్సర్లు లాంటి భారీా షాట్లు బాదడం కష్టం కాగలదు. ఇలాంటి పరిస్థితుల్లో, ఒక మంచి బ్యాట్స్ మేన్ సింగిల్స్ తీస్తూ, స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తుంటాడు. తద్వారా చివర్లో ఒత్తిడి పడకుండా చూస్తారు.
తెలివైన, చురుగ్గా కదలగలిగే బ్యాట్స్ మెన్ వికెట్ల మధ్య పరిగెత్తే వేగాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా సింగిళ్లను డబుల్స్ గా మార్చేందుకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అసలు ఉద్దేశమేమిటంటే, ఇలాంటి కష్టమైన బ్యాంటింగ్ పరిస్థితుల్లో మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా వీలైనంత మేర స్కోర్ చేయడమే. ఎందుకంటే చివర్లో ఇవన్నీ ప్రత్యర్థి జట్టుకు ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించడంలో సహాయపడుతుంది. లేదా అవతలి జట్టు మీకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడుతుంది.
మీ పొదుపు లక్ష్యాలను వెంటాడండి
ఇప్పుడు మీ నిధులు మరియు మదుపులను మీరు నిర్వహించే పద్ధతితో దీనిని పోల్చి చూడండి. ఒక నిర్ధిష్ఠ స్కోరు లక్ష్యాన్ని సెట్ చేయడానికైనా లేదా వెంటాడడానికైనా ఒక వ్యక్తిగా బ్యాట్స్ మేన్ అనుసరించే పద్ధతినే మీరు కూడా జీవితంలో సాధించాలనుకుంటున్న లక్ష్యాల కోసం అనుసరించాలి. అది ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ సంపాదించడం కావచ్చు లేదా కారు కొనడం, ఇల్లు కొనడంలేదా ఒక నిర్ధిష్ఠ తేదీ లోపు నిర్ధిష్ఠ మొత్తాన్ని పోగు చేయడం లాంటి ఎలాంటి లక్ష్యాలను సాధించడానికైనా కావచ్చు. అయితే మీ జీవిత లక్ష్యాలకు దగ్గర కావడానికి మీరు డబ్బుపై అత్యుత్తమంగా వీలు పడే ప్రతి ప్రయత్నాన్ని చేస్తున్నారా?
తరచూ, మీరు మీ వద్ద ఉన్న మొత్తం డబ్బుతో చాలా ఎక్కువ రిటర్న్స్ సంపాదించాలని ఆశించలేరు. ఎందుకంటే, అధిక రిటర్న్స్ తీసుకోవడం కోసం అధిక రిస్క్ లు తీసుకోవాల్సి రావచ్చు. లేదా దీర్ఘ కాలానికి మీ డబ్బు లాక్ చేయాల్సి రావచ్చు. ఏ సమయంలో అయినా అందుకోగలిగేలా మీకు కొంత డబ్బు కావాల్సి రావచ్చు. .
లిక్విడ్ ఫండ్స్ ద్వారా సరైన మార్గంలో మదుపు చేయడం
కాబట్టి, సాధారణంగా ఈ డబ్బును మదుపు దారులు ఎక్కడ భద్రపరుస్తారు? దీనికి సాధారణంగా వచ్చే సమాధానం బ్యాంకు పొదుపు ఖాతా అన్నదే. ఇప్పుడు, కఠిన పరిస్థితుల్లోనూ స్కోరును ముందుకు నడిపించే ఒక సీజన్డ్ క్రికెట్ బ్యాట్స్ మేన్ తరహాలో, మీరు పొదుపు ఖాతాలో లభించే 2–3 శాతం వడ్డీని సంపాదించడానికి బదులు ఈ డబ్బుపై కాస్త ఎక్కువ రిటర్న్ తీాసుకునే మదుపుదారు కాగలరా? అది కూడా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఎక్కువ కాలం మీ డబ్బును లాక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా?
మీ సమాధానం లిక్విడ్ ఫండ్సే అవుతుంది.
లిక్విడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిలోనూ సురక్షితమైనవి. బ్యాంకులు, ప్రభుత్వ, గుర్తింపు పొందిన భారీ కార్పొరేషన్లు జారీ చేసిన స్థిరమైన ఆదాయాన్నిచ్చే సెక్యూరిటీలలో మదుపు చేసేవి. అవి స్టాక్ మార్కెట్ లో మదుపు చేయవు.
లిక్విడ్ ఫండ్స్ బ్యాంకు పొదుపు ఖాతాకన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేందుకు ఉద్దేశించినవి. పొదుపు ఖాతాలు అందించే వడ్డీ రేట్లు మరియు లిక్విడ్ ఫండ్స్ అందించే సగటు రిటర్న్స్ మధ్య పోలిక కింద ఇవ్వబడ్డాయి.
లిక్విడ్ ఫండ్స్ కు లాకిన్ కాలం లేదు. ఇవి తక్షణ ఉపసంహరణ సౌకర్యాన్ని అందిస్తుంది. ఉపసంహరణ మొత్తం మీ ఖాతాకు తక్షణమే జమ చేయబడుతుంది. మిగిలిన మొత్తం 2 పని దినాల్లో జమ చేయబడుతుంది.
మీ లిక్విడ్ ఫండ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను మీరు ఉంచాల్సిన అవసరం కూడా మీకు లేదు. లిక్విడ్ ఫండ్స్ అత్యధిక స్థాయి పారదర్శకతను అందిస్తుంది. అంటే ప్రతిరోజూ మీ మదుపు విలువను మీరు ట్రాక్ చేసుకోవచ్చు. వంద రూపాయలతో కూడా మీరు ప్రారంభించవచ్చన్నది మరో ప్రత్యేకాంశం.
కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, స్కోర్ బోర్డును ముందుకు కదిలించే బ్యాట్స్ మేన్ తరహాలో మీరు కూడా ఎక్కువ రిస్క్ లేకుండా, అలాగే మీ డబ్బును లాక్ చేసుకోకుండా మీ రిటర్న్స్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లండి. మీ డబ్బుపై మీరు సంపాదించే ప్రతి అదనపు పాయింట్ మీ జీవిత లక్ష్యాలకు తోడ్పడుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటుంది. మదుపు చేసే ముందు స్కీమ్ కు సంబంధించిన సమాచార డాక్యుమెంట్ ను దయచేసి శ్రద్ధగా చదవండి.