Investments
ఆస్తిని వృద్ధి చేసుకుని కోటీశ్వరులుగా మారడానికి గల సులభమైన మార్గాన్ని తెలుసుకోండి.
PhonePe Regional|2 min read|02 August, 2021
చిన్నవయస్సులోనే కొద్ది మొత్తాలతో మొదలుపెట్టి ఇన్వెస్ట్ చేయడం ద్వారా, కాలం గడుస్తున్న కొద్దీ పెద్ద మొత్తంలో సంపాదించండి.
కోటీశ్వరులుగా మారాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ అందరూ ఆ కలను సాకారం చేసుకోలేరు. దాన్ని సాధించడానికి షార్ట్‌కట్‌లేవీ లేవు, కానీ రెగ్యులర్‌గా ఓపికతో క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ కలను సాకారం చేసుకోవచ్చు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొద్ది మొత్తాలతో ఓపికగా ఇన్వెస్ట్ చేస్తూ, చక్రవడ్డీతో ఆ మొత్తాన్ని పెంచుకోండి.
చక్రవడ్డీ అంటే ఏమిటి?
ఇది చాలా సింపుల్. మీరు ₹100లను 8% వడ్డీరేటుతో సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి, సంవత్సరం పూర్తయ్యాక మీరు 8 రూపాయలు అందుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ₹108లను మళ్లీ అదే 8% వడ్డీరేటుతో మరో సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేస్తే, మీకు ₹8.64 వస్తాయి. అదనంగా వచ్చిన ఈ 64 పైసలు అనేవి మీ వడ్డీ మీద వడ్డీగా వచ్చినవి — దీన్నే చక్రవడ్డీ అంటారు.
మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తూ ఓపికగా ఉంటారో, అంత ‘చక్రవడ్డీ’ని మీరు పొందుతారు, అలాగే కాలం గడుస్తున్న కొద్దీ, అది మరింత పెద్ద మొత్తంగా మారుతుంది — మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం కంటే చాలా ఎక్కువగా వృద్ధి చెందుతుంది.
మీరు ఎంత ఆదా చేయాలి, ఎలా ప్రారంభించాలి?
ఒకవేళ మీకు 30 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (చిన్న వయస్సులో ప్రారంభించడం ద్వారా) మీద ఆసక్తి ఉంటే, మీకు నెలకు కేవలం ₹1300 అవసరమవుతాయి, అలాగే ప్రతి ఏడాది ఈ నెలవారీ ఇన్వెస్ట్‌మెంట్‌ను 10% పెంచుతూ ఉండాలి.
ఒకవేళ మీరు 30 ఏళ్ల కంటే ముందే కోటీశ్వరులుగా మారాలనుకుంటే మీరు ఎక్కువ మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.
కోటీశ్వరులుగా మారాలనుకున్న మీ ప్రయాణంలో మీరు నెలకు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనేది ఈ కింది టేబుల్‌లో వివరంగా ఇవ్వబడింది.
కాబట్టి, మీ ఇన్వెస్ట్‌మెంట్‌ల నుండి సంవత్సరానికి 10% రిటర్న్ ఆశిస్తున్నట్లయితే, 25 ఏళ్లలో మీరు 1 కోటి మొత్తాన్ని సంపాదించడానికి మీరు ప్రతి నెలకు ₹3,200లతో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. అదేవిధంగా, మీరు ఇన్వెస్ట్‌మెంట్ మీద 12% రిటర్న్ ఆశిస్తూ, 20 ఏళ్లలో ఈ మైలురాయిని చేరడానికి, నెలకు ₹5,400లతో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలి.
కోటీశ్వరులుగా మారే మీ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా?
ప్రారంభించడానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే:
సరైన ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్ట్‌లను ఎంచుకోండి: మీ రిస్క్ అనుకూలతను బట్టి ఈక్విటీ, డెట్ లాంటి వివిధ ఆస్తుల కేటగిరీలకు చెందిన ప్రోడక్ట్‌లలో సరైన వాటిని ఎంచుకొని ప్రారంభించాలి. ఒకవేళ ఇది కష్టంగా అనిపిస్తే, మీ రిస్క్ అనుకూలతకు తగినట్లుగా మా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ల నుండి ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
నెలవారీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని నిర్ణయించుకోండి: ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్ట్ లేదా మీరు ఎంచుకున్న వివిధ రకాల (అగ్రెసివ్, మోడరేట్, కన్జర్వేటివ్) ప్రోడక్ట్‌లు, మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న సంవత్సరాల సంఖ్య ఆధారంగా మీ నెలవారీ ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్‌ను నిర్ణయించుకోవచ్చు.
క్రమశిక్షణతో కూడిన విధానాన్ని పాటించండి: (a) ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ, (b) ప్రతి ఏడాది మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను 10% పెంచుతూ ఒక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని మీరు పాటించాలి.
ఓపికగా ఉండండి: అన్నింటికంటే ముఖ్యంగా, స్వల్ప-కాలిక హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను తప్పనిసరిగా స్థిరంగా ఉంచుకునేంత ఓపికగా ఉండాలి.
ఆలస్యం చేయకండి! మీ వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గురించి ఆలోచించి, నేడే మీరు కోటీశ్వరులుగా మారే ప్రయాణాన్ని ప్రారంభించండి.
*మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి, ఇన్వెస్ట్ చేయడానికి ముందు దయచేసి స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్‌లు అన్నింటినీ తప్పకుండా చదవండి.