Investments
మీ మదుపు శైలిని అర్థం చేసుకోండి: 20–20నా, వన్డేనా లేదా టెస్టా?
PhonePe Regional|2 min read|21 June, 2021
మీరు క్రికెట్ రంగంలో అత్యుత్తమంగా రాణించాలనుకునే వీరుడైతే,, వివిధ రకాల క్రికెట్ మ్యాచ్ లకు వేర్వేరు రకాల ఆట వ్యూహాలను కలిగి ఉండాల్సిన అవరాన్ని అర్థం చేసుకోవాలి. మీ మదుపు వ్యూహం కూడా ఇదే తరహాలో ఉండాలి.
మీ జట్టుకు మీరు కెప్టెన్ అనుకుందాం. ఆట ప్రారంభంలో మీరు టాస్ గెలిచి, ముందు బ్యాటింగ్ చేయాలని నిర్ణయిస్తారు. మీరు ఆడిన ఒక్కో మ్యాచ్ రకాన్ని బట్టి, ఇతరుల కన్నా మీకు ముఖ్యమైన కొన్ని అంశాలున్నాయి.
కింది పట్టిక చూస్తే మీకే తెలుస్తుంది:
మీరు ఆడే మ్యాచ్ రకాన్ని బట్టి, మీ బ్యాటింగ్ వ్యూహాన్ని తయారు చేసుకోవచ్చు. 20–20 మ్యాచ్ కోసం బ్యాటింగ్ చేసే పక్షంలో, వికెట్ కోల్పోతామనే భయం లేకుండా మీరు అధిక రన్ రేట్ సాధించడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ వన్డే మ్యాచ్ సందర్భంగా అయితే, మీరు రన్ రేట్, చేతిలో ఉన్న వికట్ల మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవాలి. ఇక టెస్టు విషయానికి వస్తే, మీరు వికెట్లు కాపాడుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.
అయితే మీకు ఈ విషయం ఇప్పటికే తెలుసు. మీ పెట్టుబడి శైలి ప్రాధాన్యతకు ఇవన్నీ ఏ రకంగా సంబంధం కలిగి ఉంటాయి?
మీరు మ్యూచువల్ ఫండ్స్ కు కొత్త అయితే, మీ పెట్టుబడికి సరైన రకం మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఇదే విధంగా ఉండవచ్చు. మీరు మదుపు చేసిన మ్యూచువల్ ఫండ్ రకం చాలావరకు మీ పెట్టుబడి అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, స్వల్ప కాలికంకోసం మీరు మదుపు చేస్తున్నప్పడు, మీ దృష్టి తక్కువ రిక్స్ కలిగిన నిలకడైన రిటర్న్స్ అందించే ఫండ్స్ పై ఉండాలి. అయినప్పటికీ, దీర్ఘకాలికం కోసం మదుపు చేస్తున్నప్పుడు అధిక రిటర్న్ లు ఇవ్వగలిగే శక్తి కలిగి ఉంటూనే, స్వల్పకాలంలో కొంత హెచ్చు తగ్గులు కలిగి ఉంటాయి. సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు ఆడుతున్న మ్యాచ్ రకాన్ని బట్టి మీ బ్యాటింగ్ వ్యూహాన్ని మార్చుకుంటున్నట్టే, మీ పెట్టుబడి అవసరాల ఆధారంగా మీ మదుపు ఎంపికలను కూడా చేయాలి.
చిత్రీకరణ కోసం క్విక్ గైడ్ కింద ఇవ్వబడింది.
మీరు చూస్తున్నట్టు, మీ మదుపు కాలం పెరిగినా లేదా రిస్క్ ప్రాధాన్యతలు తక్కువ నుండి ఎక్కువకు మారినా, రిటర్న్ కూడా పెరుగుతుంది. ఫండ్ పనితీరులో అధిక స్వల్పకాలిక హెచ్చు తగ్గులకు మీరు ఓకే అయితే, దీర్ఘకాలికంలో వచ్చే రిటర్న్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, రిస్క్ ఎక్కువైతే, రిటర్న్ లు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి, మీరు మొదటి పెట్టుబడి పెట్టే మయంలో మీ మదుపు లక్ష్యం ప్రకారం మీ మదుపు శైలిని ఎంచుకునేలా చూసుకోండి.
డిస్ క్లెయిమర్: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందు స్కీమ్ సమాచార డాక్యుమెంట్ ను దయచేసి శ్రద్ధగా చదవండి.
PhonePe Wealth Broking Private Limited | AMFI — రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ARN- 187821.