PhonePe Blogs Main Featured Image

Investments

మీ మదుపు యాత్ర అజయ్, శేరు, బాబర్‌ల కథ

PhonePe Regional|2 min read|05 July, 2021

URL copied to clipboard

అజయ్, శేరు, మరియు బాబర్­లు కాలేజ్ క్లాస్ మేట్స్. వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత వారి ముగ్గురికి యాదృచ్చికంగా ఒకే సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి. వారు ఒకే సమయం మరియు ఒకే స్థాయిలో చేరడం వలన వారి జీతాలు కూడా సమానమే.

ఆఫీస్­లో చేరిన మొదటి వారం, వారు ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్­షాప్‌కు హాజరయ్యారు. అక్కడ సిస్టమాటిక్ ఇన్వెస్ట్­మెంట్ ప్లాన్ (SIP) లాంటి కొన్ని అంశాలను, అతి తక్కువ సమయంలో ధనవంతులు కావడం, డబ్బులను రెట్టింపు చేయడం మొదలైన విషయాలను ఆర్థిక సలహాదారు పరిచయం చేశారు.

సరైన మార్గంలో త్వరగా ప్రారంభించండి

వర్క్­షాప్‌లో వివరించిన అన్నిఅంశాలు పూర్తిగా శేరుకు అర్థం కాలేదు. కానీ జీవితంలో త్వరగా మదుపు చేయడం ప్రారంభించి, ఎక్కువ కాలం కొనసాగిస్తే వారు ధనవంతులు అవుతారనే ముఖ్య విషయం అతనికి తెలిసింది. కాబట్టి, నెలకు చిన్న మొత్తంతో అయిన సరే అతను లేక ఆమె కి సాధ్యమైన వెంటనే మదుపు చేయడం ప్రారంభించాలి. దాంతో వెంటనే అతను నెలకు ₹10,000 తో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్­లో SIP ప్రారంభించి, ప్రతి నెల అంతే మొత్తాన్ని SIP లో మదుపు చేయడం కొనసాగించాడు.

అజయ్­కు కాస్త సందేహం కలిగింది. దీంతో ప్రస్తుతానికి కొంత విరామం ఇచ్చి ఆ తర్వాత మదుపు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ, సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత, SIPలో చాలా సులభంగా పొదుపు చేయవచ్చని, అంతే కాకుండా అతను డబ్బులు సంపాదించడానికి అది బాగా సహాయం చేసిందని శేరు, అజయ్­కి చెప్పాడు. తన స్నేహితుడు షేరు చెప్పిన మాటలు విన్న అజయ్ కూడా ₹10,000 SIP తో అదే ఫండ్­లో ఉద్యోగంలో చేరిన సంవత్సరం తరువాత ప్రారంభించాడు.

మరోవైపు, మిగిలిన వారికంటే తాను చాలా తెలివైన వాడినని, చక్కని వాడినని బాబర్ ఎల్లపుడూ అనుకుంటూ ఉండేవాడు. తరచుగా పార్టీలకు వెళుతూ, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. అతనికి గాడ్జెట్లు అంటే చాలా ఇష్టం. తన కోసం మంచి గాడ్జెట్లు కొనడం అతనికి అలవాటుగా ఉండేది. దాని వలన పెట్టుబడులు పెట్టడానికి తక్కువ డబ్బులు మిగిలి ఉండేది.

కానీ ఐదేళ్ల తర్వాత పాటు అటువంటి జీవన శైలితో ఉండడం, అలాగే ఏమాత్రం పెట్టుబడులూ లేకపోవడంతో తన తప్పును తెలుసుకున్న బాబర్, శేరు మరియు అజయ్­లను అనుసరించి అదే ఈక్విటీ ఫండ్­లో ₹10,000 తో SIP ప్రారంభించాడు.

కాలంతో పాటు పెట్టుబడులు పెరుగుతాయి

కాలం గడిచే కొద్ది ఈక్విటీ ఫండ్­లో వారి SIP ఇన్వెస్ట్­మెంట్ పెరగడం వారు చూస్తున్నారు. వారు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా (వారి ఉద్యోగ జీవితం కూడా 20 సంవత్సరాలు పూర్తి అయింది) కాలేజ్ రీ యూనియన్ సమావేశంలో కలుసుకున్నారు. పైన చెప్పిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్­లో వారి SIP ఇన్వెస్ట్­మెంట్ గురించి వారు మాట్లాడుకోవడం ప్రారంభించారు. వారి ఇన్వెస్ట్­మెంట్ విలువను పోల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

వారి మదుపు విలువ ఎలా పోగయిందో ఇక్కడ చూద్దాం:

శేరు ₹1.04 కోట్ల సంపదతో ఉన్నాడు. అజయ్ కోటి రూపాయల స్థాయిని అందుకోనప్పటికీ, దానికి దగ్గరగా ₹ 91 లక్షలతో ఉన్నాడు. సరైన సమయంలో షేరుతో చేసిన చర్చ ఈ SIP ప్రారంభించడానికి అజయ్­కి సహాయం చేసినందుకు శేరుకు కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు బాబర్ వద్ద కేవలం ₹ 52 లక్షలు మాత్రమే ఉంది. అది షేరు సాధించిన దానిలో సగం మాత్రమే. శేరు మరియు అజయ్­లతో పోల్చుకున్నపుడు బాబర్ పేదరికంలో ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది.

ఈ కథ ద్వారా తెలుస్తున్న ముఖ్య విషయం: ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్రమ పద్ధతిలో మదుపు చేయడం ప్రారంభించాలి. ఒకవేళ మీరు ఇప్పటికీ ప్రారంభించకుంటే, ఇదే సరైన సమయం. లేకపోతే, బాబర్ వలె మీరు కూడా అతి తక్కువ సంపాదనతో ముగిస్తారు.

డిస్‌క్లెయిమర్:

నిఫ్టీ 50 TR సూచీ­లో జనవరి 2001 లో ప్రారంభమయ్యి, డిసెంబర్ 2020 వరకు కొనసాగిన ఒక SIP ద్వారా సంవత్సర రాబడి (XIRR) 14.64% వచ్చింది. మనం పై ఉదాహరణలో సంప్రదాయమైన పద్దతిలో వార్షిక రాబడిని 13% గా ఉపయోగించాం. డేటా సేకరణ: ICRA అనలైటిక్స్. గత పనితీరు భవిష్యత్తులో పునరావృతం కాకపోవచ్చు.

మ్యూచువల్ ఫండ్లు అనేవి మార్కెట్ రిస్క్­కు లోబడి ఉంటాయి. మదుపు చేసే ముందు స్కీమ్ సమాచారం డాక్యుమెంట్­ను జాగ్రత్తగా చదవండి.

PhonePe Wealth Broking Private Limited | AMFI — రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ARN- 187821.

Keep Reading