PhonePe Blogs Main Featured Image

Life @ PhonePe

PhonePe లో వేతన సిద్ధాంతం

PhonePe Regional|2 min read|28 December, 2023

URL copied to clipboard

సహకారం మాత్రమే, పోటీ కాదు

ప్రతి ఉద్యోగి PhonePe సంస్థలో హక్కును పొందే విధంగా జనవరి 2021లో PhonePe వాటా హక్కు పథకాన్ని ప్రవేశపెట్టింది. 20 కోట్ల అమెరికా డాలర్లు (USD) విలువ కలిగిన ఈ పథకం ద్వారా PhonePe సంస్థలోని మొత్తం 2200 ఉద్యోగులకు వాటాలు కేటాయించబడ్డాయి. తద్వారా విజయం సాధించడం ద్వారా లభించిన ఫలితాలను అందరు ఉద్యోగులు అందుకుంటారు.

ఉమ్మడి కార్యాచరణ, దీర్ఘకాలిక లక్ష్యం మరియు సంస్థను ముందు నిలపడం లాంటి వాటిని ప్రోత్సహించే దిశగా మేము రూపొందించిన వేతన సిద్ధాంతంలో కీలక భాగమే PhonePe వాటా హక్కు పథకం. ప్రతి భారతీయుడికి ఆర్థిక సేవలను అందించే క్రమంలో మార్పును తీసుకువస్తున్న సాధనంగా టెక్నాలజీని ఉపయోగించాలని PhonePe దృఢ నిశ్చయంతో ఉంది. ఆర్థికం, ఆర్థిక సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందే పక్షంలో అందరూ అభివృద్ధి దిశగా పయనించగలరని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. అందరికీ ఈ అనుకూలతను కార్యాచరణలోకి తీసుకురావడంలో ముఖ్యమైన అంశంగా ఇది ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవహారాలను అనుసరించి, ఆర్థిక విపణిని విస్తరించడం ద్వారా అందరికీ అవకాశాన్ని ఏర్పరచనున్నాము. తద్వారా ఒక ప్రత్యక్ష విజయ వలయం ఏర్పడుతుంది. ఈ సిద్ధాంతాన్ని మా సంస్థ అంతర్గత కార్యాచరణలోనూ అమలు చేస్తున్నాము. 

సరళీకరణ మరియు అందరికీ ప్రయోజనం అనే సూత్రం ఆధారంగా మా సంస్థను నిర్వహిస్తున్నాము. ఒక్కో కార్యాచరణ సంబంధం ప్రత్యక్ష ప్రయోజనాలను అందించేదిగానే ఉంటుంది. సంస్థలో ఒక్కొక్కరి విజయమే ప్రాథమికంగా సంస్థ విజయానికి కారణమవుతోంది. వ్యక్తి గతంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అది సంస్థ విలువను మరింత పెంచుతుంది. సంస్థ విలువ పెరిగినప్పుడు అది అందులో పనిచేసే ఒక్కో ఉద్యోగికీ ఎక్కువ ప్రయోజనాలు అందుకోవడంలో సహాయపడుతుంది. ఒక్కొక్కరికీ తగినంత ప్రయోజనాలు కలుగుతున్నందున అంతర్గత పోటీలను అది నివారిస్తుంది. 

ఒక్కొక్కరి పని సామర్థ్యం ఆధారంగా వేతనం అందించడాన్ని నివారించి ఈ పద్ధతిని మా సంస్థ వేతన సిద్ధాంతం అనుసరిస్తోంది. దానికి బదులుగా సంస్థ దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించే రీతిలో ESOP అంశాన్ని ఉపయోగించనున్నాము. అన్ని స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు కనీసం 5000 అమెరికా డాలర్ (USD) ESOP అని నిర్ణయించడం ద్వారా మా సంస్థ అభివృద్ధికి వారు సహాయపడినందుకు ప్రయోజనాన్ని అందరు ఉద్యోగులు అందుకునేలా చూస్తున్నాము. -— Karte Ja, Badhte Ja. సంస్థలో ఉద్యోగి స్థితి మెరుగుపడుతున్నప్పుడు వారి వార్షిక వేతనంలో ESOP ఒక భాగంగా చేర్చబడుతుంది. అంటే, వారి వేతనంలో ఎక్కువ భాగం సంస్థ అభివృద్ధి ప్రాతిపదికన ఉంటుంది. ఇది సంస్థను ముందు నిలపడంకోసం అందరూ కృషి చేసేలా ప్రోత్సహిస్తుంది. సంస్థ విజయమే వారి విజయం కాగలదు.

మేము ప్రవేశపెట్టిన ఈ పథకం మా ఉద్యోగులకు కొత్త విషయాలు నేర్చుకోవడం, ఎదగడం, ప్రత్యక్ష తాకిడిని ఏర్పరచడంకోసం అవకాశాన్ని అందిస్తోంది. వృత్తి పరంగా ఆసక్తి కలిగిన వారికి సన్నిహితంగా మెలగడం ద్వారా చాలా సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కుని, పరిష్కరించడానికి కూడా మేము అవకాశమిస్తున్నాము. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, ఉన్నత పనితీరును ప్రదర్శించడంపైనా శ్రద్ధ చూపే రీతిలో ఒక పారదర్శకమైన, వినూత్న వాతావరణం కలిగిన ఒక సమతల సంస్థ నిర్మాణాన్ని అందిస్తున్నాము. సంపదను పెంచడం కోసం  PhonePe సంస్థ విజయ యాత్రలో పాలు పంచుకోవడంలోనూ ఈ హక్కు వాటా పథకం అవకాశమిస్తుంది.!

Keep Reading