PhonePe Blogs Main Featured Image

Trust & Safety

డిజిటల్-ఫర్-ఫిజికల్ క్యాష్ స్కామ్: ఫిజికల్ క్యాష్ ఇచ్చి UPI ట్రాన్స్‌ఫర్లు ఎందుకు అంగీకరించకూడదు?

PhonePe Regional|3 min read|11 September, 2026

URL copied to clipboard

మీరు ఒక షాపు నడుపుతున్నట్లయితే, చిల్లర కావాలని అడిగే వాళ్లు మీకు కొత్తేమీ కాదు. ఈ డిజిటల్ పేమెంట్ల యుగంలో, ఇది ఒక కొత్త రూపం దాల్చింది. ప్రజలకు చిల్లర అవసరం లేకపోయినా, డిజిటల్ మనీ పంపి, క్యాష్ ఇవ్వమని అడుగుతుంటారు. ఇది చూడటానికి సాధారణంగానే అనిపించినా, కేటుగాళ్లు మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేసి సులభంగా డబ్బు సంపాదిస్తారు.

ఈ మోసం ఎలా జరుగుతుందో, అలాగే మిమ్మల్ని మీరు ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో ఈ బ్లాగ్ స్పష్టంగా వివరిస్తుంది.

మీ బిజినెస్ కోసం UPI

ఈ డిజిటల్- ఫర్-ఫిజికల్ క్యాష్ స్కామ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు, PhonePeలో మర్చంట్లకు ఉపయోగపడే డిజిటల్ పేమెంట్స్ విభాగమైన  PhonePe Business గురించి కొద్దిగా తెలుసుకుందాం.

డిజిటల్ పేమెంట్లు రాకముందు నుంచి మీరు షాపు నడుపుతున్నట్లయితే, పేమెంట్లు క్యాష్ నుండి డిజిటల్‌కి ఎలా మారాయో మీరు స్వయంగా చూసే ఉంటారు. ఒక కప్పు టీకి చేసే చిన్న ట్రాన్స్‌ఫర్ల నుండి పెద్ద రిటైల్ బిల్స్ వరకు, UPI QR కోడ్‌లు పేమెంట్లు అందుకోడాన్ని చాలా సులభతరం చేశాయి.

కస్టమర్ల నుండి వస్తువులు లేదా సర్వీసుల కోసం పేమెంట్లు అందుకోడానికి PhonePe మర్చంట్లకు ప్రత్యేకమైన QR కోడ్‌లను అందిస్తుంది. ఇవి అనుమతించిన బిజినెస్ సర్వీసుల కోసం మాత్రమేనని గుర్తుంచుకోవడం ముఖ్యం. అయితే, క్యాష్‌కు బదులుగా పేమెంట్లు అందుకోడానికి QR వాడకం పెరగడాన్ని మేము గమనించాము. ఈ రకంగా డిజిటల్ కరెన్సీని క్యాష్‌గా మార్చుకోవడానికి QR కోడ్‌ను ఉపయోగించే పద్ధతినే QR ఫర్ ATM సర్వీసెస్ అంటారు.

ఒక వ్యాపారిగా, మీరు సహాయం చేసే ఉద్దేశంతోనో లేదా బిజినెస్ ప్రయోజనాల కోసమో ఇలా చేస్తున్నప్పటికీ, అలాంటి పనులతో అనేక ప్రమాదాలు ఉన్నాయి. QR కోడ్‌ల ద్వారా పేమెంట్లు అందుకోవడం తక్షణమే పూర్తయి సురక్షితంగా అనిపించినప్పటికీ, మర్చంట్ టెర్మినల్స్‌ను దుర్వినియోగం చేయడం వల్ల బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడం, ఆర్థిక నష్టం మరియు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదురవుతాయి.

డిజిటల్-ఫర్-ఫిజికల్ క్యాష్ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది

ఒక కస్టమర్ మీ షాపుకి వస్తాడు. తాను తీవ్రమైన టెన్షన్‌లో ఉన్నానని, వెంటనే ₹5,000 కావాలని అడుగుతాడు. క్యాష్ ఇస్తే UPI ద్వారా మీకు ఆ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్తాడు. మీరు సహాయం చేస్తే మీకు కొంత “కమిషన్” ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడు. మంచి మనసున్న మీరు, ఎలాగూ మీకు క్యాష్ తిరిగొస్తుంది కదా, డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంక్‌కి వెళ్లే పని తప్పిందని భావించి అతను అడిగిన డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటారు.

మోసగాళ్లు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా ఎలా మలచుకుంటారు:

సన్నివేశం 1: ₹5,000 ట్రాన్స్‌ఫర్ చేసినట్లు చూపించడానికి మోసగాడు ఒక నకిలీ పేమెంట్ యాప్‌ని ఉపయోగిస్తాడు. అతను మీకు ఒక నకిలీ పేమెంట్ కన్ఫర్మేషన్ స్క్రీన్‌ని చూపించి, హడావుడి చేస్తూ మీ వద్ద నుండి క్యాష్ తీసుకుంటాడు. అసలు ఎలాంటి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ కాలేదని, మీరు మోసపోయారని తర్వాత మీ అకౌంట్ చూసుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది.

సన్నివేశం 2: మోసగాడు లావాదేవీని పూర్తి చేస్తాడు, అంటే UPI ద్వారా ₹5,000 ట్రాన్స్‌ఫర్ చేసి మీ నుండి క్యాష్ తీసుకుంటాడు. అతనికి క్యాష్ ఇవ్వడం ద్వారా మీరు ఆ లావాదేవీని పూర్తి చేశారనడానికి మీ వద్ద ఎటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్ ఉండదు కాబట్టి, సదరు మోసగాడు ఛార్జ్‌బ్యాక్ రైజ్ చేసే అవకాశం ఉంది. ఛార్జ్‌బ్యాక్‌పై దర్యాప్తు పూర్తయ్యే వరకు – దీనికి మీరు ప్రూఫ్‌లు సమర్పించాల్సి ఉంటుంది – మీ అకౌంట్‌పై హోల్డ్ లేదా పరిమితులు విధించవచ్చు, దీనివల్ల మీకు నేరుగా వ్యాపారంలో మరియు ఆర్థికంగా నష్టం జరుగుతుంది.

సన్నివేశం  3: మోసగాడు దొంగిలించిన క్రెడిట్ కార్డ్, హ్యాక్ చేసిన UPIలో RuPay అకౌంట్ లేదా సైబర్ క్రైమ్ బాధితుడి నుండి కొల్లగొట్టిన డబ్బుతో QR పేమెంట్ చేస్తే, మీ మర్చంట్ అకౌంట్ మనీ లాండరింగ్‌తో లింక్ అవుతుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) మరియు రెగ్యులేటరీ అథారిటీల మార్గదర్శకాల ప్రకారం, మీరు సహాయం చేసిన ఆ కస్టమర్ లాంటి బాధితులెవరైనా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరియు MHA నిబంధనల ప్రకారం చట్ట అమలు సంస్థలు విచారణ చేపడతాయి. విచారణ పూర్తయ్యే వరకు మీ మర్చంట్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. ఇలా మీరు తెలియకుండానే ఒక స్కామ్‌లో భాగమై, మీ వ్యాపారం వారాలు లేదా నెలల తరబడి మందగించేలా చేసుకుంటారు.

అయితే కొద్దిపాటి జాగ్రత్తలు, అలవాట్లు పాటించడం ద్వారా ఈ మూడు పరిస్థితుల నుండి సులభంగా బయటపడవచ్చు అనేది ఊరటనిచ్చే అంశం.

డిజిటల్-ఫర్-ఫిజికల్ క్యాష్ మోసం బారిన పడకుండా ఉండటం ఎలా

మీ వ్యాపార నిర్వహణ సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే మీరు RBI మార్గదర్శకాలు కూడా పాటించాలి. ఈ పద్ధతులు మీ వ్యాపారాన్ని సాఫీగా నడిపించుకోవడానికి సహాయపడతాయి.

1. వ్యాపార లావాదేవీలను వ్యాపారానికి మాత్రమే పరిమితం చేయండి

మీ మర్చంట్ అకౌంట్ అనేది ప్రత్యేకంగా మీ వ్యాపార కార్యకలాపాల కోసం రూపొందించబడిన ఒక శక్తివంతమైన సాధనం. మీరు అందించే అసలైన సరుకులు లేదా సేవలకు బదులుగా డబ్బులు అందుకోడం లాంటి నిజమైన లావాదేవీల కోసం మాత్రమే దీనిని ఉపయోగించండి.

  • క్యాష్ ఇవ్వకండి: ఒక వ్యాపారిగా, నిజమైన అమ్మకం  కోసం తప్ప మీ మర్చంట్ అకౌంట్ ద్వారా డబ్బును అందుకోడం లేదా ఇవ్వడం వంటివి ఎప్పుడూ చేయకూడదు.
  • మీ టీమ్‌కి అవగాహన కల్పించండి: కేవలం వ్యాపార అవసరాల కోసం మాత్రమే పేమెంట్లు స్వీకరించాలని మీ ఉద్యోగులకు తెలియజేయండి.
  • పారదర్శకతను పాటించండి: అవాంఛిత వివాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రతి లావాదేవీని సార్థకంగా మరియు పారదర్శకంగా ఉంచండి.

2. ATM సేవలు & క్యాష్ మార్పిడిని నివారించండి

PhonePe మర్చంట్లు ATM-సంబంధిత సేవలు లేదా క్యాష్ మార్పిడి వంటి కార్యకలాపాలు నిర్వహించడాన్ని ప్రోత్సహించము

  • ఎందుకు?: మర్చంట్ అకౌంట్ల ద్వారా క్యాష్ విత్‌డ్రావల్స్ లేదా మార్పిడులు చేయడం వల్ల నిబంధనల ఉల్లంఘన మరియు లావాదేవీల జవాబుదారీతనం లోపించడం వంటి తీవ్రమైన ప్రమాదాలు ఎదురవుతాయి.
  • పర్యవసానం: మర్చంట్ పాలసీ పరిధిలోకి రాని కార్యకలాపాలలోకి ప్రవేశించడం మన ప్లాట్‌ఫామ్ సమగ్రతకు భంగం కలిగించవచ్చు. అందువల్ల, విధానాన్ని ఉల్లంఘిస్తే మర్చంట్ అకౌంట్‌ను సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా బ్లాక్ చేయడం జరుగుతుంది.

3. మీ స్వంత డివైస్​లో మాత్రమే పేమెంట్లను వెరిఫై చేయండి 

మోసగాళ్ళు పేమెంట్ పూర్తి చేసినట్లు నమ్మించడానికి నకిలీ స్క్రీన్‌షాట్‌లను, నకిలీ పేమెంట్ కన్ఫర్మేషన్ స్క్రీన్‌లను చూపిస్తుంటారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి, ఎల్లప్పుడూ మీ సొంత డివైస్‌లో పేమెంట్ రసీదును (నోటిఫికేషన్‌) సరిచూసుకోండి. అవతలి వ్యక్తులు చూపించే స్క్రీన్‌షాట్‌లు లేదా పాప్-అప్‌లను నమ్మకుండా, మీ సొంత PhonePe యాప్‌ని చెక్ చేసుకోండి లేదా అమౌంట్ క్రెడిట్ అయినట్లు వచ్చే SMS లేదా బ్యాంక్ నోటిఫికేషన్ కోసం చూడండి.

మీరు మోసానికి గురైతే ఏమి చేయాలి

మీరు ఏమైనా మోసానికి గురయ్యారని అనుమానం వస్తే, వెంటనే ఫిర్యాదు చేయండి. ప్రతి క్షణం చాలా విలువైనది.

PhonePeలో రిపోర్ట్ చేయడం:

  • PhonePe Business యాప్: సహాయ కేంద్రానికి వెళ్ళి సహాయం బటన్‌పై క్లిక్ చేయండి
  • PhonePe కస్టమర్ కేర్: 080-68727374 / 022-68727374 నంబర్లకు కాల్ చేయండి.
  • లాగిన్ స్థాయి సమస్యలు : https://support.phonepe.com/ ద్వారా టికెట్‌ను రైజ్ చేయండి
  • సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి:
  • ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.

అధికారులకు రిపోర్ట్ చేయండి:

  • సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్​లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా  1930కు కాల్ చేయండి.
  • టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సాప్,టెలిగ్రామ్  మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.

ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్స్‌ను విస్మరించండి. మీరు మోసపోయారని భావిస్తే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading