PhonePe Blogs Main Featured Image

Trust & Safety

నకిలీ పేమెంట్ స్క్రీన్ షాట్ల బాధితుడు కాకుండా నివారించడంలో మీకు సహాయపడే మార్గదర్శక కరదీపిక

PhonePe Regional|2 min read|24 August, 2023

URL copied to clipboard

స్క్రీన్ షాటేనా లేదా స్కామ్ షాటా? నకిలీ స్క్రీన్ షాట్ మోసాలు మర్చంట్లకు, ప్రత్యేకించి, జన రద్దీ నిండిన ఫుడ్ స్ట్రీట్ లేదా వందలాది మందితో కిటకిటలాడే సంతలు లాంటి చోట్ల ఉంటే మర్చంట్లకు నిజమైన సమస్యగా నిలుస్తోంది. ఇలాంటి చోట్ల పేమెంట్ నిర్ధారణకు అంగీకారం తెలపడం అనేది కాస్త సవాల్ తో కూడుకున్న విషయమే. ఈ బలహీనతే అమాయకులను బాధితులుగా చేసుకునే అవకాశాన్ని మోసగాళ్లకు అందిస్తోంది.

ఒక నకిలీ స్క్రీన్ షాట్ మోసం విషయంలో పేమెంట్ ప్రాసెస్ చేయబడిందని, డబ్బు మొత్తం బాధితుని ఖాతాకు జమ చేయబడిందని బాధితుడిని మోసగించేలా ఒక పేమెంట్ నిర్ధారణ స్క్రీన్ షాట్ ను మోసగాడు రూపొందిస్తారు.

ఆన్ లైన్ పేమెంట్ల స్వీకరణ అనేది నిశ్చయంగా నగదును చేతితో తీసుకెళ్లడం, డబ్బు నిర్వహణ లాంటి ప్రధాన సమస్యలను పరిష్కరిస్తుంది. అయినప్పటికీ, మోసపూరిత చర్యలు మనకు విసుగు తెప్పించడంతో పాటు నష్టాలకు కూడా గురి చేయవచ్చు. మరింత అప్రమత్తంగా ఉండడం, బాధితుడిగా కాకుండా నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడమే దీనితో పోరాడేందుకు మార్గం కాగలదు.

మోసగాళ్లు నకిలీ స్క్రీన్ షాట్లను ఎలా రూపొందిస్తారు?

ఒరిజినల్ పేమెంట్ నిర్ధారణ సందేశం//యాప్ పేజీని సరి చేయడం ద్వారా నకిలీ స్క్రీన్ షాట్లను రూపొందించేందుకు వీలు కల్పించే వెబ్ సైట్లు, యాప్ లను కనుగొనడం చాలా సులభం. గూగుల్ సెర్చ్ లో శోధిస్తే చాలు. ఇలాంటి మోసాలకు పాల్పడేందుకు మోసగాళ్లకు చాలా తేలికగా పెద్ద సంఖ్యలో ఆప్షన్లు కనిపిస్తాయి.

మోసం చేసే సన్నివేశాలు

పేమెంట్ నిర్ధారణ కోసం నకిలీ స్క్రీన్ షాట్లను ఉపయోగించే కొన్ని బాగా తెలిసిన సన్నివేశాలు కింద ఇవ్వబడ్డాయి. ఇలాంటి వలలో చిక్కుకోకుండా చూసేందుకు మీఈ వీటిని ఒకసారి చదవండి.

  • ఆఫ్ లైన్ మర్చంట్లు అని తప్పుదోవ పట్టించడం: పేమెంట్ నిర్ధారణను చెక్ చేసేందుకు మర్చంట్ ఒకవేళ చాలా బిజీగా ఉండడం లేదా పరధ్యాసలో ఉండడం వల్ల తరచూ ఇలా జరుగుతుంది. మర్చంట్ నుండి ఉత్పత్తులు లేదా సేవలు అందుకోవడానికి మోసగాళ్లు నకిలీ స్క్రీన్ షాట్ ను ఉపయోగించడానికి ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటారు.
  • ఆన్ లైన్ వ్యాపారాల్లో మోసానికి పాల్పడడం: కస్టమర్ బేస్ ను నిర్మించి, మంచి కస్టమర్ అనుభవాన్ని నిర్వహించేందుకు ప్రతి ఆర్డర్ పైన ఆధార పడే కొత్త ఇన్ స్టాగ్రామ్ వ్యాపారం తరహాలోని మరికొన్ని సందర్భాలను పరిశీలిస్తే, నోటిఫికేషన్ అందకున్నా పేమెంట్ నిర్ధారణను పంపినట్టు వ్యక్తిని నమ్మించేలా మోసగాళ్లు నిర్బంధిస్తారు. తర్వాత పేమెంట్ అందుతుందని ఆశించి, వారు ఉత్పత్తి లేదా సేవను అందిస్తారు. తాము ఒక మోసగాడి చేతిలో వంచనకు గురయ్యామని బాధితుడు గ్రహించడానికి వారికి ఎంతోసేపు పట్టదు.
  • నగదు బదిలీ కోసం నగదు చెల్లించడం: నగదు అవసరం తీవ్రంగా ఉన్నట్టు నటిస్తూ, మోసగాళ్లు తమకు నగదు ఇస్తే ఆన్ లైన్ పేమెంట్ చేస్తామని చెప్పి ప్రాధేయపడుతుంటారు. ఆ విధంగా వారు బాధితుల ఖాతా వివరాలు తెలుసుకుని, వారి నుండి డబ్బు రికవర్ చేసేందుకు ఒక నకిలీ లావాదేవీ స్క్రీన్ షాట్ ను చూపిస్తారు.
  • వ్యక్తుల మధ్య నగదు బదిలీ: బాధితునికి పొరపాటుగా డబ్బు పంపామనే సాకుతో వారు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పంపి, పదేపదే కాల్ చేస్తుంటారు. డబ్బును తిరిగి పంపడానికి అంగీకరించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తూ, బాధితులు డబ్బును బదిలీ చేసేలా ఒత్తిడి తీసుకువస్తారు.

స్క్రీన్ షాట్ మోసం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు

  1. ఉత్పత్తి లేదా సేవను అప్పగించే ముందు ఎప్పుడూ పేమెంట్ నిర్ధారణ సందేశాన్ని ధృవీకరించండి. మీ లావాదేవీ చరిత్రను మరొక్కసారి చెక్ చేసుకోవడం ద్వారా మీరు దీనిని చేయవచ్చు.
  2. స్క్రీన్ షాట్లపై ఆధారపడవద్దు. పేమెంట్లను సరిచూసుకోవడంలో స్క్రీన్ షాట్లు సహాయపడుతాయి కానీ వాటితో కూడా తప్పుదారి పట్టించవచ్చు. దీనికి బదులు, మీరు రిజిస్టర్ చేసిన బ్యాంక్ నుండి ఇమెయిల్ లేదా SMS నోటిఫికేషన్లు లాంటి ఇతర పేమెంట్ నిర్ధారణ సూచికలు వచ్చాయా అని చెక్ చేసుకోండి.
  3. మర్చంట్ విషయంలో అయితే, వాయిస్ సందేశం ద్వారా పేమెంట్లను తెలిపే స్మార్ట్ స్పీకర్ ఎన్నటికీ తప్పు కాదు.

నకిలీ స్క్రీన్ షాట్ స్క్రా బాధితులు అయితే మీరు ఏం చేయాలి

PhonePeలో ఒక మోసగాడి ద్వారా మీరు మోసానికి గురైతే మీరు వెంటనే కింది మార్గాల్లో సమస్యను లేవనెత్తవచ్చు.:

  • PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి, “have an issue with the transaction/లావాదేవీతో ఒక సమస్య ఉంది” ఆప్షన్ కింద ఒక సమస్యను లేవనెత్తండి.
  • PhonePe కస్టమర్ కేర్ నెంబర్: సమస్యను లేవనెత్తేందుకు మీరు PhonePe కస్టమర్ కేర్ విభాగాన్ని 80–68727374/022–68727374లో సంప్రదించవచ్చు. ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ టికెట్ లేవనెత్తి, మీ సమస్య విషయంలో సహాయం చేస్తారు.
  • వెబ్ ఫారం సమర్పణ: PhonePe యొక్క వెబ్ ఫారంను ఉపయోగించి కూడా మీరు టికెట్ లేవనెత్తవచ్చు, https://support.phonepe.com/
  • సోషల్ మీడియా: PhonePe సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా మీరు మోసపూరిత సంఘటనలను నివేదించవచ్చు.
    Twitter — https://twitter.com/PhonePeSupport
    Facebook — https://www.facebook.com/OfficialPhonePe
  • సమస్య నివేదన: ప్రస్తుతమున్న ఫిర్యాదుపై మీ సమస్యను నివేదించేందుకు, మీరు https://grievance.phonepe.com/కు లాగిన్ అయి, ఇదివరకే లేవనెత్తిన టికెట్ ఐడిని పంచుకోవచ్చు.
  • సైబర్ సెల్: చివరగా, మీరు మీరు దగ్గర్లో ఉన్న సైబర్ నేరాల విభాగం వద్ద మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను నివేదించవచ్చు లేదా https://www.cybercrime.gov.in/ లో ఫిర్యాదును ఆన్ లైన్ లో రిజిస్టర్ చేయవచ్చు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ను 1930లో సంప్రదించవచ్చు.

ముఖ్యమైన గమనిక — PhonePe ఎలాంటి రహస్య లేదా వ్యక్తిగత వివరాలను కోరదు. phonepe.com డొమైన్ నుండి రాకుంటే PhonePe నుండి వచ్చినట్టు పేర్కొనే ఎలాంటి మెయిళ్లను పట్టించుకోకండి. ఏదైనా మోసం జరిగినట్టు మీరు అనుమానిస్తే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading