PhonePe Blogs Main Featured Image

Trust & Safety

లోన్ మోసాలను గుర్తించడం మరియు వాటినుండి తప్పించుకోవడం

PhonePe Regional|2 min read|25 July, 2022

URL copied to clipboard

లోన్ మోసాలను గుర్తించడం మరియు వాటినుండి తప్పించుకోవడం

రుణ భావన అనేది మన తక్షణ అవసరాలను తీర్చుకునేందుకు డబ్బును అప్పుగా తీసుకోవడానికి మనల్ని అనుమతిస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగం కోల్పోవడం లేదా వైద్య చికిత్సలు లాంటి అత్యవసర సమయాల్లో తిరిగి చెల్లించేలా ఈ అప్పులు తీసుకుంటారు. ఇలాంటి సులభంగా మోసాలకు గురికాగల అమాయక ప్రజలను మోసగాళ్లు గురి చేసుకుంటారు. లోన్ ఇస్తామని నమ్మించి, వారి డబ్బును దోచేస్తారు.

లోన్ మోసం అంటే ఏమిటి?

లోన్ మోసంలో, తాము కోరుకున్న లోన్ ను త్వరగా, సులభంగా ఇప్పిస్తామని అవసరార్థులకు మోసగాడు నమ్మకం కలిగిస్తాడు. బాధితుడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, దానికి తగ్గట్టు మోసగాళ్లు ఒక నయవంచక ప్లాన్ సిద్ధం చేస్తారు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఒక ప్రముఖ బ్యాంక్ లో లోన్ కోసం అప్లై చేసేందుకు తగినట్టు మంచి క్రెడిట్ స్కోర్ లేకున్నా, చాలా తక్కువ కాల వ్యవధిలో ఒక పెద్ద మొత్తం అప్పుగా కావాల్సి వస్తే, నిమిషాల్లో వారి అవసరాలకు తగ్గట్టుగా లోన్ పొందడంలో సహాయపడుతానని మోసగాళ్లు ఆ బాధితుడిని తెలివిగా నమ్మిస్తారు.

లోన్ మోసానికి గురి కావడం వల్ల ప్రధానంగా రెండు పరిణామాలు తలెత్తుతాయి. మోసగాడు కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించని సెక్యూరిటీగా ముందే చెల్లించమని అడుగుతారు. లేదా ప్రాసెసింగ్ ఫీజు, లేట్ ఫీజు, వడ్డీ తదితరాల పేరుతో ఒక పెద్ద మొత్తాన్ని లాక్కుంటారు. -అంతిమంగా బాధితునికి భారీ నష్టాలు కలుగజేస్తారు.

లోన్ మోసం ఎలా జరుగుతుంది?

లోన్ మోసగాళ్లు రుణ అవసరాలు తీరని వారిని దోచుకుంటారు. అప్పు విషయంలో ఎలాంటి చిక్కుముడులు లేవనే రీతిలో ఆఫర్ చేయడం ద్వారా బలహీనులైన రుణ గ్రహీతలను లక్ష్యంగా చేసుకుంటారు. వారు మిమ్మల్ని SMS, ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తారు. చాలావరకు మీ వివరాలను నింపి, తక్షణ లోన్ కు ఆమోదం పొందడం కోసం ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతారు.

యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీ ఫోన్‌లో అన్నిటినీ-అంటే మీ పూర్తి కాంటాక్ట్‌ల జాబితా, ఫోటోలు, వీడియోలకు యాక్సెస్ కావాలని వారు కోరుతారు. మీ ఆధార్, పాన్, చిరునామా, మీకు అవసరమైన మొత్తం లాంటి ప్రాథమిక వివరాలను మీరు నింపిన వెంటనే, మీ ఖాతాలో నగదు జమ కావడం కనిపిస్తుంది.

ఈ లోన్లు సంక్లిష్టమైన నియమ, నిబంధనల కింద అందించడుతాయి. ప్రారంభదశల్లో ఈ విషయం మనకు తెలియజేయబడవు. తక్కువ వడ్డీ రేటు అనే హామీతో వారు బాధితులను మోసపుచ్చుతారు. తర్వాత ఆ తక్కువ వడ్డీ రేటు పరిమిత కాలం వరకేనని, ఆ తర్వాత అమితంగా పెరిగాయని చెబుతారు. ఈ విషయాన్ని లోన్ పంపిణీ సమయంలో చెప్పరు. ఈ అధిక వడ్డీ రేట్లతో పాటు, లోన్లను తిరిగి చెల్లించనందుకు ఈ మోసపూరిత తక్షణ లోన్ కంపెనీలు రోజువారీ ప్రాతిపదికన భారీ అపరాధాలు వసూలు చేస్తాయి. దాంతోపాటు అధిక ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర అపరాధాలను కూడా విధిస్తాయి.

కొందరు మోసగాళ్లు 3 నెలల బ్యాంక్ స్టేట్ మెంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు ప్రతులు లాంటివి అడుగుతుండగా, మరికొందరు వాటిని అడగరు. అయినప్పటికీ, రెండు సందర్భాల్లోనూ, లోన్ మొత్తం నిమిషాల్లోనే పంపిణీ చేయబడుతాయి. త్వరగా లోన్ ఇప్పిస్తామని చెప్పుకునే యాప్‌లు బాధితుల ఫోన్ నుండి పూర్తి సమాచారానికి యాక్సెస్ అందుకుంటాయి. దానిని మోసగాళ్లు మరింత డబ్బును పొందేందుకు ఆ వ్యక్తి పేరును ఉపయోగించుకుంటాయి. లేదా ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడేందుకు వినియోగించుకుంటాయి.

ఇలాంటి లోన్ మోసాలకు గురై, ఆఫర్ చేస్తున్నడబ్బును అందుకుంటున్న బాధితులను రికవరీ ఏజెంట్లు లోన్ వసూలు కోసం వేధిస్తుంటారు. అసభ్యకరమైన సందేశాలు, అశ్లీల చిత్రాలు, దుర్భాష పదజాలం, అసభ్యకరమైన టెక్స్ట్ సందేశాలు ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి కాంటాక్ట్ జాబితాలోని ఇతరులకు పంపబడుతాయి.

లోన్ మోసాన్ని నివారించేందుకు సహాయపడే హెచ్చరిక సందేశాలు

లోన్ మోసానికి పాల్పడే వారు మిమ్మల్ని సంప్రదించేటప్పుడు మీకు వెంటనే వారిని పసిగట్టేలా హెచ్చరిక చేసే కొన్ని సందేశాలు కింద ఇవ్వబడ్డాయి:

  • రుణదాత సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ అయి ఉండదు. ఏదైనా ప్రముఖ బ్యాంక్ లేదా NBFCతో వారికి సంబంధం ఉండదు.
  • యాప్ స్టోర్‌లో ఆ లోన్ యాప్ ధృవీకరించబడలేదు. లోన్ నియమ, నిబంధనల వివరాలను అది వెల్లడించదు. లోన్ ఆమోదం పొందడానికి ముందు మీ క్రెడిట్ నివేదికను చెక్ చేయరు.
  • రుణదాత రిజిస్టర్ చేయబడి ఉండరు. వారికి భౌతిక కార్యాలయ చిరునామా కానీ, చట్టబద్ధమైన వెబ్‌సైట్ కానీ ఉండదు.
  • లోన్ బట్వాడా చేయకముందే లోన్ ఫీజు డిమాండ్ చేయబడుతుంది.
  • క్రెడిట్ పరిశీలన జరగదు. క్రెడిట్ ఫ్రీ లోన్ అని మీకు తెలియజేయబడుతుంది.
  • రుణదాత అతి తక్కువ వడ్డీ రేటుతో లోన్ అందిస్తారు. అది పరిమిత కాలం వరకు మాత్రమే చెల్లుతుంది.

లోన్ మోసాల నుండి తప్పించుకునే విధానం:

  • మీ కార్డు వివరాలను ఎవ్వరితోనూ ఫోన్, ఇమెయిల్ లేదా ఇతర మార్గాల ద్వారా పంచుకోవద్దు.
  • రుణదాత విశ్వసనీయతను తెలుసుకునేందుకు వారి భౌతిక చిరునామా మరియు వారి వెబ్ సైట్‌ను పరిశీలించండి.
  • ఏదైనా OTP లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవద్దు.
  • మోసాలు ఎప్పుడూ ఏదో ఒక అనుమానాస్పదమైన రీతిలో ప్రయోజనం కలిగించేలా ఉంటుంది కాబట్టి లోన్ ను అర్థం చేసుకోండి.

ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎన్నడూ రహస్యమైన లేదా వ్యక్తిగతమైన సమాచారాన్ని కోరదు. Phonepe.com డొమైన్ నుండి రాకుంటే PhonePe నుంచి వచ్చినట్టు చెప్పుకునే ఏ ఇమెయిళ్లనూ పట్టించుకోవద్దు. మోసం జరిగినట్టు మీకు అనుమానం కలిగితే, దయచేసి మమ్మల్ని support.phonepe.com లో సంప్రదించండి లేదా https://cybercrime.gov.in/ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Keep Reading