PhonePe Blogs Main Featured Image

Trust & Safety

మోసపూరితమైన సబ్‌స్క్రిప్షన్ మ్యాండేట్‌లను గుర్తించే విధానం

PhonePe Regional|2 min read|19 May, 2026

URL copied to clipboard

సబ్‌స్క్రిప్షన్ మ్యాండేట్‌ లేదా ఆటోపే అనేది ఆటోమేటిక్‌గా పనిచేసే ఆదేశం, అంటే OTT సబ్‌స్క్రిప్షన్‌లు, యుటిలిటీ బిల్లులు లేదా EMI పేమెంట్లు వంటి రికరింగ్ పేమెంట్లకు మీ అకౌంట్‌ నుండి నిధులను ఆటోమేటిక్‌గా డెబిట్‌ చేయమని మీరు మీ బ్యాంక్‌కు ఇచ్చే అనుమతి వంటిది. సబ్‌స్క్రిప్షన్ మ్యాండేట్‌లు అనేవి రికరింగ్ పేమెంట్లను మీరు మాన్యువల్‌గా షెడ్యూల్ చేసి, పేమెంట్లు చేయడానికి బదులుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా, సులభంగా పేమెంట్లు చేసే సౌకర్యాన్ని కల్పిస్తాయి, అయితే ఈ డిజిటల్ సౌలభ్యంతో కొన్ని సైబర్‌ సెక్యూరిటీ ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.

మోసగాళ్లు ఆటోపే ఫీచర్‌ను దుర్వినియోగం చేసి, ఏదో ఒక లేదా నకిలీ ఫోన్ నంబర్ నుండి మీకు నకిలీ కలెక్ట్ రిక్వెస్ట్‌లు లేదా మ్యాండేట్‌ అప్రూవల్స్ పంపుతారు, అవి “విద్యుత్ బిల్లు పెండింగ్”, “లాటరీ ట్యాక్స్‌ ప్రాసెసింగ్” లేదా “KYC అప్‌డేట్ ఫీజు” వంటివి అని వారు మభ్యపెట్టవచ్చు, వాటిని మీరు తొందరపాటులో క్లిక్ చేస్తారని వారి నమ్మకం.

మోసపూరితమైన మ్యాండేట్‌ను గుర్తించే విధానం

మోసపూరితమైన మ్యాండేట్‌ అభ్యర్థనకు ఎల్లప్పుడూ కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉంటాయి. వాటిని గుర్తించడానికి మీరు ఈ అంశాలను గమనించాలి:

  1. వన్‌టైమ్ లేదా రికరింగ్ పేమెంట్ రకం: మీరు ఒక్కసారి మాత్రమే (వన్-టైమ్) విద్యుత్ బిల్లును చెల్లిస్తున్నట్లయితే, అప్రూవల్ అభ్యర్థనపై “రికరింగ్” అనే పదం మీకు ఎప్పటికీ కనిపించకూడదు. అందుకే దాన్ని ఆమోదించే ముందు మెసేజ్‌ను జాగ్రత్తగా చదవండి. అలాగే, ఆ ​​అభ్యర్థన అనేది వెరిఫై చేసిన బిల్లర్‌ (BESCOM లేదా Jio వంటి సంస్థల) నుండి వచ్చిందా లేదా ఏదో ఒక మొబైల్ నంబర్ నుండి వచ్చిందా అని చెక్‌ చేయండి. PhonePeలో, వెరిఫై చేసిన బిల్లర్లకు ఆకుపచ్చ టిక్ గుర్తు ఉంటుంది.
  2. వెరిఫై చేయండి: ఏదైనా మ్యాండేట్‌ నిజమైనదా లేక మోసపూరితమైనదా అనే విషయంలో మీకు సందేహం ఉంటే, మీ PhonePe ప్రొఫైల్ > ఆటోపే సెట్టింగ్‌లుకు వెళ్లండి. అక్కడ మీకు తెలియని ఏదైనా మ్యాండేట్‌ కనిపిస్తే, వెంటనే దాన్ని తొలగించండి.
  3. సోర్స్‌: నిజమైన మ్యాండేట్‌లు సాధారణంగా మర్చంట్‌ యాప్‌లోనే ప్రారంభమవుతాయి (ఉదాహరణకు, Netflix యాప్‌లో ఆటోపే కోసం PhonePeను ఎంచుకోవడం వంటివి). మోసపూరితమైన మ్యాండేట్‌లు సాధారణంగా ఏదో ఒక SMS లింక్ లేదా పాప్-అప్ రూపంలో ఉంటాయి.

ఓ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, డబ్బును పొందడానికి మీరు మీ UPI పిన్‌ను ఎప్పుడూ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా “మీ రీఫండ్ పొందడానికి ఈ QR కోడ్‌ను స్కాన్ చేయండి” అని చెబితే, వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే అర్థం.

PhonePe పంపే ప్రీ-డెబిట్ నోటిఫికేషన్‌

PhonePeలో, మీ అకౌంట్‌ నుండి డబ్బు డెబిట్ అయినప్పుడు మీరు ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి కాకూడదనే భావిస్తాము. అందుకే మేము ఒక సురక్షితమైన లేయర్‌ను రూపొందించాము: అదే ’24-గంటల రిమైండర్’. ఇది ఎలా పనిచేస్తుందో కింద చదివి తెలుసుకోండి:

  1. హెచ్చరిక: PhonePeలో మీరు సెటప్ చేసిన ఏ రికరింగ్ ఆటోపేకు అయినా, నిర్ణీత డెబిట్‌ గడువుకు 24 గంటల ముందే మీకు ఒక నోటిఫికేషన్‌ను పంపుతాము.
  2. అవకాశం: మీకు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, “అవునూ! నేను ఆ యాప్‌ను ఇప్పుడు వాడట్లేదు కదా!” అని మీకు అనిపిస్తే, ఆటోపేను తొలగించడానికి మీకు 24 గంటల సమయం ఉంటుంది. మీరు మీ PhonePe ప్రొఫైల్ > ఆటోపే సెట్టింగ్‌లుకు వెళ్లి, ఆ మ్యాండేట్‌ను తొలగించవచ్చు.

PhonePe భద్రతా చిట్కా: మీరు ఆటోపేను పాజ్ చేయొచ్చనే విషయం మీకు తెలుసా? మీరు విహార యాత్రకు వెళ్తున్నా లేదా ఏదైనా సర్వీస్‌ వినియోగాన్ని కొద్ది రోజులు ఆపాలనుకున్నా, మీరు దాన్ని పూర్తిగా రద్దు చేయవలసిన అవసరం లేదు. తాత్కాలికంగా అమౌంట్‌ డెబిట్‌ కాకుండా ఆపడం కోసం మీ ఆటోపే సెట్టింగ్‌లుకు వెళ్లి ‘పాజ్ చేయండి’ బటన్‌ను నొక్కితే సరిపోతుంది.

మీరు సబ్‌స్క్రిప్షన్ మ్యాండేట్‌ మోసానికి గురైతే ఏమి చేయాలి?

మీరు ఏదైనా మోసానికి గురయ్యారని మీకు అనుమానం కలిగితే, వెంటనే మీ PhonePe యాప్‌లోని “ఆటోపే సెట్టింగ్‌లు”ను చెక్‌ చేసి, ఆ మ్యాండేట్‌ను రద్దు చేయండి. ఇలాంటి సమయాల్లో ప్రతి సెకను ఎంతో కీలకం, అందుకే వెంటనే దీని గురించి ఫిర్యాదు చేయండి. 

PhonePeలో రిపోర్ట్ చేయడం: 

  • PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి.
  • కస్టమర్ కేర్: PhonePeకు 80–68727374 లేదా 022–68727374 నంబర్లకు కాల్ చేయండి.
  • సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి: 
  • ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.

అధికారులకు రిపోర్ట్ చేయండి:

  •  సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్​లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా  1930కు కాల్ చేయండి.
  • టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సాప్ మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.

ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్​లను విస్మరించండి. మీకు మోసానికి గురైనట్టు అనుమానమైతే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading