PhonePe Blogs Main Featured Image

Trust & Safety

కొవిడ్-19 స్కామ్‌ల నుండి జాగ్రత్తగా, సురక్షితంగా ఉండటం

PhonePe Regional|3 min read|09 August, 2021

URL copied to clipboard

భారతదేశంలో కొవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభించిన నాటి నుండి, కొందరు దోపిడీదారులు ప్రజలను మభ్యపెట్టి తెలియని ఖాతాలు, ఫోన్ నంబర్‌లకు డబ్బు పంపేలా చేసి మోసం చేస్తున్నారు. హాస్పిటల్ పడకల కోసం, ఆక్సిజన్ కోసం, వ్యాక్సిన్ల కోసం సాయం కావాలంటూ అడిగి, ఈ దోపిడీదారులు ప్రజలను దోచుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితులలో జాగ్రత్త వహించడం ఎలానే వివరించే PhonePe మార్గదర్శకాలను ఇక్కడ చేర్చాము.

కొవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్

మొదటి వ్యాక్సిన్ కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేస్తామని లేదా ప్రభుత్వ డేటాబేస్‌ను అప్‌డేట్ చేస్తామని చెబుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి, మోసం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జరిగేది చాలా సింపుల్.

  • ప్రజలకు, ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వారికి కాల్ చేసి, వాళ్లు కొవిడ్-19 మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో అని తెలుసుకుంటారు.
  • వ్యాక్సిన్ తీసుకున్నామని చెప్పిన వారికి, డేటాబేస్ అప్‌డేట్ చేస్తున్నామని చెబుతూ వారి మొబైల్ ఫోన్‌లకు OTP నంబర్‌లు పంపించి, వాటిని చెప్పాలని కోరతారు.
  • మొదటి వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పిన వారికి, వ్యాక్సిన్ కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేస్తామని చెప్పి, వారి మొబైల్ ఫోన్లకు OTP పంపించి, చెప్పమంటారు.

ఈ రెండు-దశల ప్రక్రియ చూడటానికి పెద్దగా హానికరంగా అనిపించకపోవచ్చు. కానీ మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP నంబర్‌ను షేర్ చేయడం వల్ల మీ ఫోన్‌లో ఉన్న యాప్‌లు లేదా ముఖ్యమైన సమాచారాన్ని నేరగాళ్లు హ్యాక్ చేయగలుగుతారు. అలా చేయడం వల్ల పరిణామాలు తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది.

సోషల్ మీడియాలో వెరిఫై చేయబడిన(డని) లీడ్స్

కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో, వ్యాక్సిన్ల కోసం, ఇతర ట్రీట్‌మెంట్ పరికరాల కోసం ధృవీకరించిన విక్రేతల గురించి, అందుబాటులో ఉన్న హాస్పిటల్ బెడ్‌ల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌ల వర్షం కురిసింది.

ఈ పోస్ట్‌లలోని సమాచారాన్ని ఉపయోగించుకుని, ఎంతోమంది దోపిడీదారులు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీదారులుగా నటించి మెడికేషన్ ఛార్జీల పేరిట ప్రజలను అడ్డంగా దోచుకున్నారు.

వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉచిత కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అంటూ మాల్ వేర్ లింక్ ఉన్న సందేశాలను WhatsApp, SMSలలో షేర్ చేశారు. దీని వల్ల నేరగాళ్లు మీ పరికరాన్ని, అలాగే అందులో ఉన్న ఖాతాలను యాక్సెస్ చేయగలిగారు.

సోషల్ మీడియాలో ఇంజక్షన్‌ల గురించి, అత్యవసర మెడికల్ వస్తువుల గురించి ప్రచారమైన తప్పుదోవ పట్టించే ప్రకటనల వల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఇది వరకే ఉన్న వారి ఆందోళనను ఈ ప్రకటనలు రెట్టింపు చేశాయి.

అలాగే Facebook, Instagramలలో తప్పుడు ప్రొఫైల్‌లు, హ్యాండిల్‌లతో “ధృవీకరించిన లీడ్స్” అంటూ మందులు, ఆక్సిజన్ సిలిండర్‌లు అమ్మిన నకిలీ డాక్టర్ల చేతుల్లో కూడా ఎంతోమంది మోసపోయారు.

అంతేకాకుండా ఇంజక్షన్‌ల కోసం, పరిమితంగా దొరికే మందుల కోసం ముందస్తుగా పేమెంట్ చేయాలని కోరి, డబ్బు అందిన తర్వాత నంబర్ బ్లాక్ చేయడం లేదా వారి నంబర్ మార్చడం చేసి కూడా ఈ దోపిడీదారులు ప్రజల్ని మోసం చేశారు.

మోసపూరిత వెబ్‌సైట్‌లను గుర్తించి, కొవిడ్-సంబంధిత సహాయ నిధులకు విరాళాలు ఇవ్వడం ఎలా?

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి భారతదేశమంతా ముందుకు కదిలింది, ఆ క్రమంలో బాధితులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు. బాధితులకు సహాయం చేసే ఏదైనా సంస్థకు మీరు డబ్బును విరాళంగా ఇవ్వాలనుకుంటే, మీరు సంబంధిత సంస్థకు చెందిన వెబ్‌సైట్‌కు వెళ్లి, వారు ఏం చేస్తారు, కొవిడ్ బాధితులకు సహాయం చేస్తామంటూ వారు చెబుతున్న దానికి, వారి వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌కు మ్యాచ్ అవుతోందో లేదో చెక్ చేసుకోండి.

ఆ వెబ్‌సైట్ అడ్రస్‌ ప్రారంభంలో ‘HTTPS’ ఉందా లేదా ‘HTTP’ ఉందా అని చెక్ చూడండి. ‘HTTPS’ అని ఉన్న వెబ్‌సైట్‌కు SSL సర్టిఫికెట్ ఉందని అర్థం, అంటే అది ‘HTTP’ అని ఉన్న వెబ్‌సైట్ కంటే సురక్షితమైనదని గుర్తుంచుకోండి. అయినప్పటికీ, మీరు ఆ సంస్థ వ్యాలిడిటీ గురించి సందిగ్ధంలో ఉన్నా, మీ డబ్బును వెరిఫై చేయబడిన ఖాతాలకు సరైన ప్రయోజనాలకు ఉపయోగపడేలా విరాళం ఇవ్వాలనుకుంటున్నా PhonePe యాప్‌ను ఉపయోగించి, ‘విరాళం’ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.

PhonePe యాప్ ద్వారా విరాళం ఇవ్వడం ఎలా?

మీరిచ్చే విరాళం, ధృవీకరించిన NGOలకే అందేలా PhonePe ధృవీకరిస్తుంది. ఆయా స్వచ్ఛంద సంస్థల వివరాలను తన సైట్‌లో పేర్కొంటుంది. కింది దశలను అనుసరించి PhonePeలో లిస్ట్ చేసిన NGOలకు మీరు విరాళం ఇవ్వవచ్చు.

దశ 1: మీ PhonePe హోమ్ స్క్రీన్‌లో ‘రీఛార్జ్ & బిల్లుల పేమెంట్’ ట్యాబ్‌ కింద ‘విరాళం’ ట్యాబ్‌ను ట్యాప్ చేయండి.

దశ 2: లిస్ట్‌లో అందుబాటులో ఉన్న NGOలు, ఇతర సంస్థలలో దేనికి మీరు విరాళం ఇవ్వాలని అనుకుంటున్నారో దానిని ఎంచుకోండి.

దశ 3: మీ పేరు, ఇమెయిల్ చిరునామా ప్రవేశపెట్టండి.

దశ 4: విరాళం మొత్తాన్ని ప్రవేశపెట్టండి.

దశ 5: లిస్ట్ చేసిన పేమెంట్ మోడ్‌ల నుండి ఎంచుకోండి. మీరు UPI, మీ డెబిట్ కార్డ్ లేదా మీ PhonePe వాలెట్ ద్వారా విరాళం ఇవ్వవచ్చు.

దశ 6: ‘విరాళం’ ట్యాబ్‌ను ట్యాప్ చేసి, పేమెంట్‌ను ఆథరైజ్ చేయండి.

PhonePeను ఉపయోగించి మోసపూరిత ఫోన్ నంబర్‌లను వెరిఫై చేయడం

మీ వివరాలను అడుగుతూ, వారంటీ లేని రివార్డ్‌లను అందిస్తామంటూ మీకు వచ్చే మోసపూరిత లేదా స్పామ్ కాల్‌లను గుర్తించగల మీ సామర్థ్యం ద్వారా ఇతరులకు కూడా అవగాహన కల్పించవచ్చు. మెడికల్ కేర్, ఆక్సిజన్ అందిస్తామంటూ మీకు కాల్స్ గానీ, వెరిఫై చేయబడని కాంటాక్ట్‌లు గానీ వస్తున్నట్లయితే, అవి నమ్మశక్యంగా ఉన్నట్టు మీకు అనిపించకపోతే, https://www.phonepe.com/security/covid-frauds/ వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేసి, ఇతరులకు మోసపూరిత కాల్స్ చేసిన నంబర్‌లను చెక్ చేయండి. అలాగే, మీకు ఏ నంబర్ నుండి కాల్ వచ్చిందో, దానిని ఈ లింక్‌లో అప్‌డేట్ చేసి, కాల్స్ ద్వారా జరిగే మోసాల గురించి ఇతరులకు తెలియజేసి సహాయపడవచ్చు.

గుర్తుంచుకోండి: మీ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతూ లేదా మీ OTP/CVV లేదా UPI MPIN లాంటి సున్నితమైన సమాచారాన్ని కోరుతూ చేసే కాల్స్‌ను ఎప్పటికీ PhonePe ఆమోదించదు.

మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేయాల్సినవి, చేయకూడనివి

చేయాల్సినవి: ఫేక్ ఫోన్ కాల్స్ బారిన పడి మోసపోకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదు. అందుకోసం మీరు ఇవి తప్పకుండా ‘చేయాలి

  • తెలియని వ్యక్తికి డబ్బు పంపే ముందు, వారి వివరాలను చెక్ చేయండి
  • డబ్బు పంపే ముందు అకౌంట్ హోల్డర్ పేరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కాంటాక్ట్ వివరాలు మొదలైనవి వెరిఫై చేయండి.
  • ఎవరో ఏదో సిఫార్సు చేశారని, థర్డ్-పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి నమ్మశక్యమైన, వెరిఫై చేయబడిన యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేయండి.
  • తెలియని వ్యక్తికి మీరు డబ్బును పంపినట్లయితే వెంటనే మీ బ్యాంక్‌కు లేదా సైబర్ సెల్‌కు రిపోర్ట్ చేయండి.
  • ఆ డబ్బు అందుకున్న వ్యక్తి భవిష్యత్తులో మళ్లీ మీ దగ్గరి నుండి డబ్బు రిక్వెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆ వ్యక్తి నంబర్‌ను మీ ఫోన్‌లో బ్లాక్ చేయండి, అలాగే PhonePe ప్లాట్‌ఫామ్‌లో ఆ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్ చేయండి.
  • మీ PhonePe యాప్‌లోకి లాగిన్ చేసి, అందులో “సహాయం” సెక్షన్‌లో ఉన్న “అకౌంట్ సెక్యూరిటీ & మోసపూరిత కార్యకలాప రిపోర్టింగ్” ఆప్షన్‌ను ఉపయోగించి ఆ మోసపూరిత సంఘటనను రిపోర్ట్ చేయండి. ప్రత్యామ్నాయంగా, support.phonepe.com వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేయవచ్చు.
  • ఏ UPI యాప్‌లోనైనా మీరు డబ్బును అందుకోవడానికి ఎలాంటి UPI PINను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి.

చేయకూడనివి: మోసగాళ్లు మీ డబ్బును దొంగిలించకుండా ఉండాలంటే, మీరు చేయకూడనివి ఇవే

  • మీ UPI PIN, OTPలను ఎవరితోనూ షేర్ చేయకండి. PhonePe ఉద్యోగులు వ్యక్తిగత వివరాలను ఎన్నటికీ అడగరు.
  • Twitter, Facebook, LinkedIn, Instagramలలో ఉన్న మీ సోషల్ మీడియా సమాచారాన్ని షేర్ చేయకండి.
  • గుర్తుతెలియని విక్రేతలు వివిధ ప్రోడక్ట్‌లు లేదా వస్తువులపై అందించే ఆకట్టుకునే ఆఫర్ల ఉచ్చులో పడకుండా స్వీయ నియంత్రణను పాటించండి.
  • మీ బ్యాంక్ వివరాలను అడిగే ఏ ఫారమ్‌లనూ నింపకండి.
  • పేమెంట్‌లను పంపడానికి లేదా అందుకోవడానికి Screen Share, Anydesk, Teamviewer లాంటి బయటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయకండి.
  • సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా వేదికలలో షేర్ అయ్యే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించకండి. బదులుగా, హెల్ప్‌లైన్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను చెక్ చేయండి.
  • తెలియని చిరునామాల నుండి వచ్చిన ఇమెయిల్‌లకు రిప్లయి ఇవ్వకండి. తెలియని లింక్‌లపై క్లిక్ చేయకండి.

PhonePe కస్టమర్ సపోర్ట్‌ను అధికారికంగా సంప్రదించడానికి https://support.phonepe.com/ లింక్‌పై క్లిక్ చేయండి లేదా 24*7 కస్టమర్ కేర్ సపోర్ట్‌ కోసం 0806–8727–374 లేదా 0226–8727–374 నంబర్‌ల వద్ద మా అధికారులను సంప్రదించండి.

మీ సహాయం కోసం

వివిధ సోషల్ మీడియా వేదికలలో ఉన్న మా అధికారిక ఖాతాల ద్వారా మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.

Keep Reading