
Trust & Safety
KYC మోసం ద్వారా ఐడెంటిటీ చోరీ: సురక్షితంగా ఉండడం ఎలా?
PhonePe Regional|5 min read|21 July, 2025
మీరు బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలలో అకౌంట్‌ను క్రియేట్ చేసేటప్పుడు, వారు మీ ఐడెంటిటీని వెరిఫై చేయాలని మిమ్మల్ని కోరుతారు. ఆధార్, PAN లేదా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన ఇతర డాక్యుమెంట్లను సమర్పించే KYC ప్రాసెస్ రూపంలో ఇది జరుగుతుంది.
ప్రస్తుతం, ఆర్థిక సంస్థలు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను “డిజిటల్ KYC” రూపంలో నిర్వహిస్తున్నాయి. డిజిటల్ KYC అంటే కస్టమర్ లైవ్ ఫోటోలు, వారి డాక్యుమెంట్లు లేదా వారి దగ్గర ఉన్న ఆధార్ ప్రూఫ్‌ను క్యాప్చర్ చేసి, పరిశీలించడం, ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ నిర్వహించడానికి వీలులేని సందర్భాల్లో డిజిటల్ KYC ఉపయోగపడుతుంది.
KYC మోసం ద్వారా ఐడెంటిటీ చోరీ మరియు అకౌంట్ సస్పెన్షన్ స్కామ్‌లు అంటే ఏమిటి?
KYC ఐడెంటిటీ దొంగతనంలో, మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు లేదా నకిలీ ఐడెంటిటీలను క్రియేట్ చేసి, వాటిని ఉపయోగించి KYC ప్రాసెస్‌ను మోసపూరితంగా పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, వారు మీ అకౌంట్లను అనధికారికంగా యాక్సెస్ చేస్తారు లేదా మీ KYCని ఉపయోగించి కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేయడం, మీ పేరు మీద లోన్లు, క్రెడిట్ కార్డ్‌లను తీసుకోవడం వంటివి చేస్తారు, ఇవి క్రమంగా మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి, మీ పరువు పోయేలా చేస్తాయి.
నేటి డిజిటల్ ప్రపంచంలో ఐడెంటిటీ దొంగతనం ఒక పెద్ద ముప్పుగా మారింది, ముఖ్యంగా మోసగాళ్లు KYC ప్రాసెస్లను పూర్తి చేయడం కోసం, అలానే మీ అకౌంట్లను నియంత్రించడం కోసం దొంగిలించిన లేదా నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగిస్తే ఈ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఈ ముప్పు KYCకి సంబంధించిన అకౌంట్ సస్పెన్షన్ స్కామ్‌ల వరకు కూడా వ్యాపిస్తుంది. ఇది భయాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ఉపయోగించే సోషల్ ఇంజనీరింగ్ పద్ధతి. ఇందులో భాగంగా మోసగాళ్లు తీవ్రమైన ఒత్తిడితో కూడిన పరిస్థితులను సృష్టిస్తారు. మీ KYC డాక్యుమెంటేషన్ పూర్తి కాలేదని లేదా వాటి గడువు ముగిసిపోయిందని చెబుతూ, మీ పేమెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లేదా డిజిటల్ వాలెట్ తక్కువ సమయంలోనే (ఉదాహరణకు 24 గంటల్లో) శాశ్వతంగా బ్లాక్ లేదా సస్పెండ్ అవుతుందని మిమ్మల్ని సంప్రదిస్తారు. సాధారణంగా ఆలోచించే సమయం ఇవ్వకుండా మిమ్మల్ని కంగారు పెట్టి, మీ సున్నితమైన ఆర్థిక వివరాలను దక్కించుకోవడం లేదా మీ అకౌంట్ యాక్సెస్‌ను పొందడమే వీరి ముఖ్య ఉద్దేశం.
ఐడెంటిటీ చోరీ మరియు KYC మోసం అనేక రకాల పరిస్థితులలో జరిగే అవకాశం ఉంది:
- సందర్భం 1: వివిధ రకాల ఫిషింగ్ పద్ధతుల ద్వారా మోసగాళ్లు మీ వ్యక్తిగత ఐడెంటిటీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది.
మంచి రాబడి ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లతో మోసగాడు అర్జున్‌ను సంప్రదించాడు. ముందుకు వెళ్లడానికి, అర్జున్ తన వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని ఆ మోసగాడు అడిగాడు. ఆ మోసగాడిని నమ్మి, తన ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితంగా నిర్వహిస్తారనే ఉద్దేశంతో అర్జున్ తన అకౌంట్ వివరాలను, OTPలను షేర్ చేశాడు. ఈ విధంగా దొంగిలించిన సమాచారాన్ని ఉపయోగించి, ఆ మోసగాడు అర్జున్ అకౌంట్‌లోకి లాగిన్ అయి అక్రమ లావాదేవీలు చేశాడు.
- సందర్భం 2: మీది కాని ఒక అకౌంట్‌కు సంబంధించి KYC ప్రాసెస్ పూర్తి చేసేలా మోసగాళ్లు మిమ్మల్ని నమ్మించవచ్చు. ఆ తర్వాత, మీకు తెలియకుండానే ఆ అకౌంట్‌ను మోసపూరిత కార్యకలాపాల కోసం వారు దుర్వినియోగం చేస్తారు.
డేవిడ్‌కు లోన్ ఇప్పిస్తానని చెప్పి ఒక మోసగాడు సంప్రదించాడు. డేవిడ్ పేరు మీద కాకుండా, మోసగాడి పేరు మీదనే ఇప్పటికే క్రియేట్ చేసి ఉన్న అకౌంట్ కోసం KYC ప్రాసెస్ పూర్తి చేయాలని ఆ మోసగాడు డేవిడ్‌ను కోరాడు. లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఇది కూడా ఒక భాగమే అని నమ్మి డేవిడ్ దానికి అంగీకరించాడు. KYC కోసం తన వ్యక్తిగత వివరాలను సబ్మిట్ చేశాడు, దీంతో తెలియకుండానే ఆ అకౌంట్‌పై పూర్తి కంట్రోల్‌ను ఆ మోసగాడికి ఇచ్చేశాడు. ఆ తర్వాత మోసగాడు ఆ అకౌంట్‌ను ఫ్రాడ్ లోన్ ట్రాన్సాక్షన్ల కోసం దుర్వినియోగం చేశాడు, దీనివల్ల డేవిడ్ విషయం తెలియకుండానే తీవ్రమైన ప్రమాదంలో పడ్డాడు.
- సందర్భం 3: లాగిన్ వివరాలను సేకరించడానికి, బ్యాంక్ లేదా యాప్‌ల నుండి వచ్చినట్లు ఉండే అత్యవసర హెచ్చరికల మెసేజ్‌లను మోసగాళ్లు పంపుతుంటారు.
అర్ధరాత్రి వేళ “PP-ALERT” అనే ఐడితో వచ్చిన ఒక అత్యవసర SMS నిషా ఫోన్‌కు వచ్చింది. తీవ్రమైన ఒత్తిడిని సృష్టించేలా, ఆ మెసేజ్‌లో ఒక షార్ట్ లింక్ ఉంది: “అర్జెంట్: మీ KYC పూర్తి కాలేదు. తదుపరి 15 నిమిషాల్లో మీ ఆధార్‌ను వెరిఫై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటే మీ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్ అవుతుంది మరియు మీ ఫండ్స్ జప్తు చేయబడతాయి.” కంగారుపడి నిషా ఆ లింక్‌ను క్లిక్ చేసి, ఒక నకిలీ వెబ్ పేజీకి వెళ్లి తన నంబర్ మరియు వచ్చిన OTPని ఎంటర్ చేసింది. కానీ ఆ మోసగాళ్లు ఆ దొంగిలించిన వివరాలతో వేరే నగరం నుండి ఆమె అకౌంట్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు, PhonePe బ్యాకెండ్ సెక్యూరిటీ సిస్టమ్ రంగంలోకి దిగింది. PhonePe Protect తక్షణమే ఆ పరిచయం లేని డివైస్‌ను, అనుమానాస్పద లోకేషన్ మార్పును గుర్తించింది. అది ఆ లాగిన్ ప్రయత్నాన్ని పూర్తిగా బ్లాక్ చేసి, నిషా అసలు ఫోన్‌కు ఒక రియల్-టైమ్ ఇన్-యాప్ నోటిఫికేషన్‌ను పంపింది: “అనుమానాస్పద లాగిన్ ప్రయత్నం బ్లాక్ చేయబడింది. మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోండి.”
- సందర్భం 4: ఒక మోసగాడు కాంప్లైయన్స్ టీమ్ ఎగ్జిక్యూటివ్‌లా నటిస్తూ, అకౌంట్ బ్లాక్ అవుతుందని భయపెట్టి, స్క్రీన్-షేరింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించడం ద్వారా “త్వరిత పరిష్కారం” చూపిస్తానని చెబుతాడు.
“KYC కాంప్లైయన్స్ డెస్క్ నుండి అంజలి” అని పరిచయం చేసుకున్న ఒక కాలర్ విక్రమ్‌కు కాల్ చేసి, తప్పనిసరి ఆడిట్ కారణంగా అతని వాలెట్ సస్పెండ్ అయిందని హెచ్చరించింది. అతను సహకరిస్తే రెండు నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తానని నమ్మించి, ఒక రిమోట్-యాక్సెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని చెప్తూ: “QuickVerify టూల్‌ను ఇన్‌స్టాల్ చేసి, నేను లైన్‌లో ఉన్నప్పుడే మీ PhonePe యాప్‌ను ఓపెన్ చేయండి. మా సిస్టమ్ మీ వివరాలను సురక్షితంగా సింక్ చేసి, మీ వాలెట్ సస్పెన్షన్‌ను తొలగిస్తుంది” అని చెప్పింది. విక్రమ్ ఆమె మాటలు నమ్మి, బ్యాక్‌గ్రౌండ్‌లో స్క్రీన్-షేర్ యాప్ రన్ అవుతుండగానే PhonePeని ఓపెన్ చేయగానే, యాప్‌లోని ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్ వెంటనే అలర్ట్ అయింది. డివైస్ గార్డ్ ఆ స్క్రీన్-మిర్రరింగ్ సెషన్‌ను గుర్తించడమే కాకుండా, సిస్టమ్ ఆ సోషల్ ఇంజనీరింగ్ మోసాన్ని వెంటనే పసిగట్టింది. మోసగాడు ఎలాంటి సున్నితమైన వివరాలను చూడకుండా PhonePe తక్షణమే స్క్రీన్‌ను బ్లాకౌట్ చేసింది మరియు ఒక స్పష్టమైన హెచ్చరికతో ఇంటర్‌ఫేస్‌ను ఫ్రీజ్ చేసింది: “అనుమానాస్పద స్కామ్ గుర్తించబడింది.”
KYC మోసం, అకౌంట్ స్వాధీనాన్ని సూచించే ప్రమాద హెచ్చరికలు
- మీరు అభ్యర్థించకుండానే అకౌంట్ ఓపెన్ చేయడం గురించి ఊహించని కాల్‌లు లేదా ఇమెయిల్‌లు రావడం.
- మీరు ఆథరైజ్ చేయని లావాదేవీలకు సంబంధించిన అలెర్ట్‌లు లేదా SMS నోటిఫికేషన్లు రావడం.
- మీరు ఎప్పుడూ అప్లై చేయని క్రెడిట్ కార్డ్‌లు లేదా బిల్లులు రావడం.
- మీ బ్యాంక్ లేదా ఆర్థిక అకౌంట్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది తలెత్తడం.
- నమ్మశక్యంగా లేని ఆకర్షణీయమైన ఆఫర్‌లను చూపి, ప్రజల గుర్తింపును (ఐడెంటిటీ) దొంగిలించి మోసం చేయడం
- మీ KYC అప్‌డేట్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ లేదా సస్పెండ్ అవుతుందని హెచ్చరిస్తూ SMS, వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా పంపే అర్జెంట్ URLలు.
ఐడెంటిటీ చోరీ, KYC మోసం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే మార్గాలు
- మీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచండి: ఫోన్, ఇమెయిల్ లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా సున్నితమైన డాక్యుమెంట్లు లేదా OTPలను ఎప్పుడూ షేర్ చేయవద్దు. అకౌంట్ సస్పెండ్ కాకుండా ఉండటానికి తప్పనిసరి అని చెప్పినా కూడా, మీ OTPలు, UPI పిన్లు లేదా ATM పిన్‌లను ఎవరితోనూ షేర్ చేయకండి.
- ఫిషింగ్ ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండండి: అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా నమ్మదగని వెబ్‌సైట్‌లలో సమాచారాన్ని షేర్ చేయడం లాంటివి చేయకండి. మీ అకౌంట్ బ్లాక్ లేదా సస్పెండ్ అవుతుందని చెబుతూ SMS, వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా వచ్చే URLలపై క్లిక్ చేయకండి.
- మీ అకౌంట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి: ఏదైనా అనధికార యాక్సెస్ జరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లు, క్రెడిట్ రిపోర్ట్‌లు, అకౌంట్ యాక్టివిటీలను ఎప్పటికప్పుడు చెక్ చేయండి.
- బలమైన అథెంటికేషన్‌ను ఉపయోగించండి: సాధ్యమైన చోట టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ను ఎనేబుల్ చేయండి.
- కమ్యూనికేషన్ సరిచూసుకోండి: ఆర్థిక సంస్థల నుండి మీకు ఊహించని విధంగా కాంటాక్ట్ వస్తే, వారి అధికారిక కాంటాక్ట్ ఛానెళ్ల ద్వారా వారి ఐడెంటిటీని సరిచూసుకోండి. మీకు వచ్చిన సాధారణ SMS హెచ్చరికలలో ఉన్న నంబర్‌లకు కాల్ చేయకుండా, కేవలం వెరిఫై చేసిన యాప్‌లో ఉన్న అధికారిక నంబర్‌ల ద్వారా మాత్రమే కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించండి. అకౌంట్ సస్పెన్షన్ గురించి అత్యవసరంగా వచ్చే ఏవైనా మెసేజ్‌లను మూసివేసి, నిజమైన నోటిఫికేషన్‌ల కోసం మీ ఫోన్ మెనూ నుండి నేరుగా అధికారిక యాప్‌ను ఓపెన్ చేసి చెక్ చేయండి.
- స్క్రీన్-షేరింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి: నమ్మదగిన కస్టమర్ కేర్ బృందాలు ఎప్పుడూ థర్డ్-పార్టీ అప్లికేషన్‌లను (ముఖ్యంగా రిమోట్ డెస్క్‌టాప్ లేదా స్క్రీన్-షేరింగ్ యాప్‌లను) ఇన్‌స్టాల్ చేయమని మిమ్మల్ని కోరవు.
- డాక్యుమెంట్లు దుర్వినియోగానికి గురైతే వెంటనే సమాచారమివ్వండి: మీ ఐడి ప్రూఫ్‌లను ఎవరైనా దుర్వినియోగిస్తే, సంబంధిత అధికారులకు, సంస్థలకు సమాచారమివ్వండి.
- అధికారిక KYC ఛానెళ్లను మాత్రమే ఉపయోగించండి: అధికారిక వెబ్‌సైట్లు లేదా వెరిఫై చేసిన ఏజెంట్ల ద్వారానే KYCని పూర్తి చేయండి.
PhonePe మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది
- ఇంటెలిజెంట్ రిస్క్ స్కోరింగ్ ఇంజిన్లు: ప్రతి లావాదేవీని మరియు లాగిన్ ప్రయత్నాన్ని రియల్-టైమ్‌లో అంచనా వేయడానికి PhonePe బ్యాకెండ్ సిస్టమ్‌లు మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్‌లను ఉపయోగిస్తాయి. ఒక అనుమానాస్పద లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే పరిచయం లేని డివైస్ నుండి లాగిన్ జరిగితే, సిస్టమ్ ఆ యాక్టివిటీని ఫ్లాగ్ చేయవచ్చు లేదా బ్లాక్ చేయవచ్చు.
- యాప్-కేంద్రీకృత ప్రక్రియలు: నిజమైన KYC అభ్యర్థనలు మరియు అకౌంట్ అప్‌డేట్‌లు కేవలం అధికారిక అప్లికేషన్ యొక్క సురక్షితమైన పరిధిలో మాత్రమే ప్రాసెస్ అయ్యేలా PhonePe చూస్తుంది. టెక్స్ట్ మెసేజ్‌లలో పంపే ఎక్స్టర్నల్ వెబ్ లింక్‌ల ద్వారా KYC పూర్తి చేయమని వారు వినియోగదారులను ఎప్పటికీ ఒత్తిడి చేయరు.
- యాప్ హెచ్చరికలు: వినియోగదారు కొత్త డివైస్ నుండి లాగిన్‌ను ఆమోదించడం లేదా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం వంటి అధిక రిస్క్ ఉన్న పనిని చేయడానికి ప్రయత్నించినప్పుడు, PhonePe యాప్ స్పష్టమైన హెచ్చరికలను ప్రదర్శిస్తుంది. ఇది మోసగాళ్ళు సృష్టించే అత్యవసర ఒత్తిడికి వినియోగదారులు లొంగిపోకుండా కాపాడుతుంది.
ఏదైనా PhonePe అకౌంట్‌లో మీ ఐడెంటిటీ సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగిస్తే ఏమి చేయాలి?
PhonePeలో మోసం జరిగిందని లేదా మీరు స్కామ్‌కు గురయ్యారని మీకు అనుమానం కలిగితే, కింది మార్గాల్లో సమస్యను తెలపండి, దీని వల్ల త్వరగా చర్య తీసుకోగలుగుతారు:
- PhonePe కస్టమర్ కేర్ నంబర్: 80–68727374 లేదా 022–68727374కు కాల్ చేసి, PhonePe కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. కస్టమర్ కేర్ ఏజెంట్ మీ కోసం టికెట్ క్రియేట్ చేసి, మీకు మరింత సహాయం చేస్తారు.
- సోషల్ మీడియా: మోసపూరిత ఘటనల గురించి మీరు PhonePe అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో తెలపవచ్చు:
- Twitter: https://twitter.com/PhonePeSupport
- Facebook: https://www.facebook.com/OfficialPhonePe
- ఫిర్యాదు పరిష్కార విభాగం: మీ వద్ద ఇప్పటికే ఫిర్యాదుకు సంబంధించిన టికెట్ ఉంటే, మీరు ఈ లింక్‌ను: https://grievance.phonepe.com/ ఓపెన్ చేసి, టికెట్ ఐడితో ఫిర్యాదు చేయవచ్చు.
అధికారులకు సమాచారం ఇవ్వండి
- సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా 1930కు కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వొచ్చు.
- టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DOT): ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్ లేదా ఏదైనా మోసపూరిత అభ్యర్థన వచ్చినా సంచార్ సాథీ పోర్టల్‌కు వెళ్లి, ఛక్షు సౌకర్యం ద్వారా వాటి గురించి మీరు ఫిర్యాదు చేయవచ్చు.
గమనిక: ఈ సమాచారం మొదట జులై 2025లో ప్రచురించాము. ప్రస్తుతం ఉన్న నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా, అక్టోబర్ 2026లో దీనిని పూర్తిగా పరిశీలించి అప్‌డేట్ చేశాము.
