Trust & Safety
మోసగాళ్లు పారిపోవాల్సిందే: విద్యుత్ మోసాలను నివారించేందుకు మార్గదర్శి
PhonePe Regional|3 min read|25 September, 2023
డిజిటల్ పురోగతి ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రస్తుత తరుణంలో బిల్లులు, ఖర్చులను నిర్వహించేందుకు ఆన్ లైన్ పేమెంట్లు ఒక సౌకర్యవంతమైన పద్ధతి అయింది. అయినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం ముందుకు వచ్చినట్టే, సైబర్ నేరస్తుల యుక్తులు కూడా రూపాంతరం చెందుతున్నాయి.
భారతదేశంలో ఆన్ లైన్ విద్యుత్ బిల్ పేమెంట్ మోసం జరిగే ప్రమాదం పెరుగుతుండడంపై ఈ బ్లాగ్ దృష్టి సారించింది. దాని వివిధ రూపాలు, ప్రమాదకరమైన పర్యవసానాలు, డిజిటల్ శకంలో సురక్షితంగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తోంది.
డిజిటల్ పేమెంట్ల పెరుగుదల:
భారతదేశ డిజిటల్ రూపాంతరం చెందడం వల్ల విద్యుత్ బిల్ పేమెంట్లు సహా ఆన్ లైన్ లావాదేవీలలో వేగవంతమైన వృద్ధి చెందుతుంది. డిజిటల్ వేదికలలో సౌకర్యం, వేగం, సామర్థ్యాన్ని అందించి, వినియోగదారులు వారి ఇళ్ల నుండే బిల్లులను సెటిల్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఆన్ లైన్ విద్యుత్ బిల్ పేమెంట్ మోసం పరిచయం మరియు రూపాలు:
విద్యుత్ బిల్లు పే చేయలేదని, దానిని వెంటనే క్లియర్ చేయాలనే సందేశంతో మోసగాళ్లు సాధారణంగా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. చివరి నెల బిల్లు ఇంకా పే చేయలేదు కాబట్టి వారి ఇంటి కరెంట్ సరఫరా ఈ రోజు రాత్రి నిలిపివేయబడుతుందని హెచ్చరికను విద్యుత్ శాఖ నుండి వచ్చినట్టుగా ఆ సందేశం పంపుతారు.
ఉదా :
ప్రియమైన వినియోగదారా, మీ విద్యుత్ శక్తి ఈ రోజు రాత్రి 8.30 గంటలకు ఆపివేయబడుతుందని విద్యుత్ కార్యాలయం నుండి సందేశం. ఎందుకంటే, మీ ఇదివరకటి నెల బిల్ అప్ డేట్ కాలేదు కాబట్టి, దయచేసి, మా విద్యుత్ ఆఫీసర్ ను 824*****59లో వెంటనే సంప్రదించండి. ధన్యవాదాలు.
రూపాలు:
ఫిషింగ్ మోసాలు:
వినియోగదారులను మోసం చేసే దిశగా వారి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని చేజిక్కించుకునేందుకు సైబర్ నేరస్తులు మోసపూరిత ఇమెయిళ్లు, టెక్స్ట్ సందేశాలు లేదా నకిలీ వెబ్ సైట్లను ఉపయోగిస్తారు. అనుమానం ఏర్పడని బాధితులు మోసగాళ్లకు మోసపూరిత బిల్లులను పే చేయడం జరగవచ్చు.
మాల్‌వేర్ దాడులు:
కళంకిత సాఫ్ట్ వేర్ సాధనాలలోకి చొచ్చుకుపోయి, పేమెంట్ వివరాలు సహా సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తుంది. హ్యాకర్లు ఆన్ లైన్ లావాదేవీలను ఛేదించి, పేమెంట్ ప్రక్రియలను తప్పుదారి పట్టిస్తుంది.
నకిలీ పేమెంట్ పోర్టళ్లు:
కల్పిత విద్యుత్ బిల్లుల పేమెంట్లను సేకరించేందుకు మోసగాళ్లు ప్రామాణికంగా కనిపించే పేమెంట్ పోర్టల్‌లను సృష్టిస్తారు. వినియోగదారులు, తాము చట్టబద్ధమైన పేమెంట్లు చేస్తున్నామని భావించి, ఈ స్కామ్‌ల బారిన పడతారు.
సేవా సంస్థలు లాగా నటించడం:
స్కామర్‌లు, ఫోన్ కాల్‌లు లేదా ఇమెయిల్‌ల ద్వారా విద్యుత్ సేవా సంస్థలులా నటించి, వినియోగదారులకు బిల్లులు బాకీ ఉన్నాయని క్లెయిమ్ చేయవచ్చు. మోసపూరిత మార్గాల ద్వారా వెంటనే పేమెంట్లు చేయమని వారు వినియోగదారులను నిర్దేశిస్తారు.
ఆన్‌లైన్ విద్యుత్ బిల్లు పేమెంట్ మోసం యొక్క పర్యవసానాలు:
ఆర్థిక నష్టం:
బాధితులు తెలియకుండానే సైబర్ నేరగాళ్లకు డబ్బును బదిలీ చేస్తారు, ఫలితంగా వెంటనే ద్రవ్య నష్టాలు సంభవిస్తాయి.
గుర్తింపు చౌర్యం: వ్యక్తిగత, ఆర్థిక సమాచారం చోరీకి గురి కావడం గుర్తింపు చౌర్యానికి, తదనంతర ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది.
గోప్యత ఉల్లంఘన:
తప్పుడు వ్యక్తుల వద్దకు సున్నితమైన డేటా దొరకడం గోప్యతతో రాజీ పడగలదు. ఇది వినియోగదారులకు ఇతర మోసాలు చేయడానికి గురి కావచ్చు.
నివారణ ప్రమాణాలు:
మూలాలను ధృవీకరించుకోండి:
ఆన్‌లైన్ పేమెంట్ల కోసం చట్టబద్ధమైన విద్యుత్ సేవా సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను మాత్రమే ఉపయోగించండి.
సమాచారంతో ఉండండి: సైబర్ సెక్యూరిటీ ట్రెండ్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సాధారణ స్కామ్‌ల గురించి మీకు మీరే అవగాహన చేసుకోండి.
URLలను చెక్ చేయండి:
వెబ్‌సైట్ URL “https://”, ప్యాడ్‌లాక్ గుర్తును కలిగి ఉంటే సురక్షిత కనెక్షన్ సూచిస్తుంది.
పేమెంట్ అభ్యర్థనలను ధృవీకరించండి:
ఏదైనా లావాదేవీలు చేసే ముందు పేమెంట్ అభ్యర్థనల ప్రామాణికతను, పంపిన వారి సమాచారాన్ని డబుల్ చెక్ చేయండి.
సురక్షిత కమ్యూనికేషన్ ఛానెళ్లు:
పేమెంట్ సంబంధిత సందేహాలు లేదా ఆందోళనలకోసం చట్టబద్ధమైన కస్టమర్ సహాయ విభాగం ఛానెళ్లతోనే కమ్యూనికేట్ చేస్తున్నారా అని సరి చూసుకోండి.
అధికారిక యాప్‌లను ఉపయోగించండి:
అధికారిక యాప్ స్టోర్‌లు మరియు ధృవీకరించబడిన మూలాల నుండి మాత్రమే UPI యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
URLలను చెక్ చేసుకోండి: చట్టబద్ధత మరియు భద్రత కోసం వెబ్‌సైట్ URLలను ధృవీకరించండి (“https” మరియు ప్యాడ్‌లాక్ చిహ్నం కోసం చూడండి).
రెండు-అంశాల ప్రామాణికీకరణ (2FA):
అవసరమైనవప్పుడల్లా మీ ఆన్‌లైన్ ఖాతాలకు అదనపు భద్రత దశను చేర్చడానికి 2FAను ఎనేబుల్ చేయండి.
సమాచారాన్ని పంచుకోవడం నివారించండి: వ్యక్తిగత, ఆర్థిక లేదా పాస్ వర్డ్ సంబంధిత సమాచారాన్ని ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా పంచుకోవద్దు.
నివేదిత సంఘటనలు:
మీరు ఆన్‌లైన్ విద్యుత్ బిల్లు పేమెంట్ మోసాన్ని అనుమానించినట్లయితే, వెంటనే మీ విద్యుత్ సేవా సంస్థకు, స్థానిక పోలీసు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ల వంటి సంబంధిత అధికారులకు నివేదించండి.
UPI-ఆధారిత మోసంతో పోరాడేందుకు ప్రయత్నాలు:
అవగాహన ఉద్యమాలు:
UPI సంబంధిత మోసం, సురక్షిత ఆచరణల గురించి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రచారోద్యమాలు నిర్వహిస్తాయి.
యాప్ సెక్యూరిటీ: అనధికారిక యాక్సెస్, మోసాన్ని నివారించేందుకు పేమెంట్ యాప్ లు నిరంతరం తమ భద్రతా చర్యలను విస్తరిస్తుంటాయి.
ముగింపు:
విద్యుత్ బిల్లుల కోసం ఆన్‌లైన్ పేమెంట్ సౌలభ్యం వినియోగదారుల జీవితాలను సులభతరం చేసింది, అయితే మరింత అప్రమత్తత కావాలి. సైబర్ నేరగాళ్లు ఆర్థిక ప్రయోజనాల కోసం డిజిటల్ మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. సమాచారం ఇవ్వడం ద్వారా, ఉత్తమ అభ్యాసాలను అనుసరించడం, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో ఆన్‌లైన్ విద్యుత్ బిల్లు పేమెంట్ మోసాల బారి నుండి మీ ఆర్థిక మరియు వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంలో మీరు సహాయపడవచ్చు.
విద్యుత్ మోసంలో బాధితుడు అయితే మీరు ఏం చేయాలో తెలుసా:
విద్యుత్ స్కామ్ లేదా మోసంలో బాధితుడు అయినట్టు మీకు సందేహం కలిగితే, నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ చేసేందుకు,మరిన్ని నష్టాలు జరగకుంటా నివారించేందుకు త్వరిత చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. కింది చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించవచ్చు:
- PhonePe యాప్: సహాయ విభాగానికి వెళ్లి, “లావాదేవీతో ఒక సమస్య ఉంది” ఆప్షన్ లో ఒక సమస్యను లేవనెత్తండి.
- PhonePe కస్టమర్ కేర్ నెంబర్: మీరు PhonePe కస్టమర్ కేర్ విభాగాన్ని 80–68727374/022–68727374లో సంప్రదించి, ఒక సమస్యను లేవనెత్తవచ్చు. ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ ఒక టికెట్ లేవనెత్తి, మీ సమస్య విషయంలో సహాయం చేయవచ్చు.
- వెబ్ ఫారం సమర్పణ: PhonePe వెబ్ ఫారంను ఉపయోగించి కూడా మీరు టికెట్ లేవనెత్తవచ్చు, https://support.phonepe.com/
- సోషల్ మీడియా: PhonePe సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా మోసపూరిత సంఘటనలను మీరు నివేదించవచ్చు.
ట్విటర్ — https://twitter.com/PhonePeSupport
ఫేస్ బుక్ — https://www.facebook.com/OfficialPhonePe - సమస్య నివేదన: ప్రస్తుతమున్న ఫిర్యాదుపై సమస్యను నివేదించేందుకు, మీరు https://grievance.phonepe.com/ కు లాగిన్ అయి, గతంలో లేవనెత్తిన టికెట్ ఐడిని పంచుకోండి.
- సైబర్ సెల్: చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ విభాగంలో మోసపూరిత ఫిర్యాదులను నివేదించవచ్చు లేదా you can report fraud complaints at the nearest Cyber Crime cell or register a complaint online at https://www.cybercrime.gov.in/ లో ఆన్ లైన్ ఫిర్యాదు రిజిస్టర్ చేయవచ్చు లేదా 1930లో సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చు.
ముఖ్య గమనిక — PhonePe ఎలాంటి రహస్య లేదా వ్యక్తిగత వివరాలను కోరదు. phonepe.com డొమైన్ నుండి రాకుంటే PhonePe నుండి వచ్చినట్టు పేర్కొనే ఎలాంటి మెయిళ్లను పట్టించుకోకండి. ఏదైనా మోసం జరిగినట్టు మీరు అనుమానిస్తే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.