PhonePe Blogs Main Featured Image

Trust & Safety

PhonePeలో డిజిటల్ పేమెంట్లను సురక్షితంగా చేయండి

PhonePe Regional|3 min read|05 May, 2021

URL copied to clipboard

కొవిడ్-19 మహమ్మారి భారతదేశంలో డిజిటల్ పేమెంట్ల స్వీకరణలో అసాధారణ వృద్ధికి దారి తీసింది. పేమెంట్లు చేయడం కోసం ఇక ఎంత మాత్రమూ ఇంటి నుంచి బయటకు రావడం, బారులు తీరిన క్యూలలో నిల్చోవడం లాంటి అవసరం లేకపోవడమూ PhonePe లాంటి డిజిటల్ పేమెంట్ యాప్ లు జీవితాలను సులభతరం చేశాయి. PhonePeను ఉపయోగించి, వినియోగదారులు డబ్బు పంపడం, అందుకోవడం, తమ మొబైల్, DTH, డేటాకార్డులు రీఛార్జ్ చేయడం, వినియోగ పేమెంట్లు చేయడం, బంగారం కొనడం, ఇంకా తమ ఆన్ లైన్ కొనుగోళ్లకోసం దూరం నుంచి పే చేయడం వీలవుతుంది.

భద్రత విషయానికి వస్తే, PhonePe మీకు ట్రిపుల్ రక్షణ ఇస్తుంది. ఎలాంటి లావాదేవీల వైఫల్యాలు లేకుండా రోజువారీ ప్రాతిపదికన కోట్లాది లావాదేవీలకు వీలు కల్పిస్తోంది. ఈ ట్రిపుల్ లేయర్ రక్షణలో కిందివి ఉన్నాయి:

  • లాగిన్ పాస్ వర్డ్: యాప్ కోసం కల్పించిన భద్రతలోని మొదటి లేయర్. మీ యాప్ ఒక నిర్షిష్ఠ ఫోన్ మరియు నెంబర్ కు మ్యాప్ చేయబడుతుంది. మీ ఫోన్ లేదా నెంబర్ ను మీరు మార్చితే, మీరు యాప్ ను తిరిగి అంగీకరించాల్సి ఉంటుంది.
  • PhonePe యాప్ లాక్: PhonePe యాప్ ఉపయోగాన్ని ప్రారంభించడానికి, మీరు మీ వేలి ముద్ర ఐడి, ముఖ ఐడి లేదా నెంబర్ లాక్ ఉపయోగించి దానిని అన్ లాక్ చేయాల్సి ఉంటుంది.
  • UPI పిన్: PhonePeలో ప్రతి పేమెంట్ కోసం 1 రూపాయి అయినా లేదా 1 లక్ష అయినా, UPI పిన్ లేకుండా పేమెంట్ పంపలేరు.

డిజిటల్ పేమెంట్లు సురక్షితమైనవి, సౌలభ్యమైనవే అయినప్పటికీ, వివిధ రకాల మోసాల గురించి అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. వినియోగదారుల కష్టార్జితాన్ని దోచుకునేందుకు మోసగాళ్లు ఎలాంటి దారులు వెతుకుతున్నారనే విషయంపై నిరంతరం నిఘా వేయక తప్పదు. తాజాగా చోటు చేసుకుంటున్న మోసాల రకాలు, సురక్షితంగా లావాదేవీ జరిపేందుకు మీరు చేయాల్సినవి కింద ఇవ్వబడ్డాయి:

  1. లోన్ మోసం: లోన్ మోసగాళ్లు రుణం కావాల్సిన వారి అవసరాలను బలహీనంగా చేసుకుని, వారిని మోసగించే ఉద్దేశంతో లోన్ ఆఫర్ చేయడం ద్వారా దోపిడీ్కి పాల్పడుతున్నారు. సెక్యూరిటీ పేరుతో ముందుగా కొంత మొత్తం చెల్లించాలని కోరుతూ, వాటిని తిరిగి ఎప్పటికీ ఇవ్వకపోవడం లేదా ప్రాసెసింగ్ ఫీజు, లేట్ ఫీజు, వడ్డీ లాంటి వాటి పేరుతో పెద్ద మొత్తంలో లాగేసుకోవడం చేస్తూ, బాధితులకు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నారు.

2. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ మోసం: క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించే క్రమంలో, మోసగాళ్లు బిల్లులు క్లియర్ చేసేందుకు వారి బ్యాలెన్స్ ఉపయోగించుకునేందుకు వారి బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పంచుకునేలా చేయడం ద్వారా మోసగాళ్లు బాధితులను దోచుకుంటున్నారు. డబ్బు అవసరమైన సమయంలో తమను దూరపు బంధువు/కుటుంబ స్నేహితులు, వ్యాపార ప్రొఫెషనల్స్ గా చూపించుకుని అమాయక ప్రజల క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని వారు దొంగిలిస్తున్నారు.

3. సోషల్ మీడియా వ్యక్తి మార్పు మోసం: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా మోసానికి కామన్ ప్లేస్ గా మారింది. సులభంగా డిజిటల్ గుర్తింపు చోరీ సర్వసాధారణంగా జరుగుతోంది. మీ లేదా మీకు తెలిసిన వారి నకిలీ ప్రొఫైల్ ను మోసగాళ్లు రూపొందించి, వాటిని మీ నెట్ వర్క్ లోని వ్యక్తుల నుండి డబ్బు కోరడం కోసం ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, మోసగాళ్లు తిరస్కరించలేని విధంగా అత్యవసరమైన స్థితిని సృష్టించి, మీ జాబితాలోని వ్యక్తులకు అభ్యర్థనలను పంపేందుకు కూడా మీ ఖాతాను హ్యాక్ చేస్తారు.

4. డబ్బు రెట్టింపు మోసం: డబ్బు రెట్టింపు మోసాలు ఒక వ్యక్తి యొక్క డబ్బు రాత్రికి రాత్రే రెట్టింపు కాగలదని నమ్మిస్తాయి. డబ్బును రెట్టింపు చేసే పరిమిత కాల ఆఫర్ గా వచ్చే ఒక నకిలీ లింక్ సృష్టించడం ద్వారా లేదా మొదట్లో బాధితుల యొక్క కొంత డబ్బును రెట్టింపు చేసి, నమ్మకాన్ని కలగజేసి, వారు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలని నిర్ణయించిన తర్వాత అంతిమంగా వారిని దోచుకోవడమో జరుగుతుంది.

5. ఉద్యోగాల మోసం: ఉద్యోగార్థులు ఇటీవలి కాలంలో బాగా పెరగడం వల్ల ఉద్యోగ మోసాలను ఒక నిరంతర ప్రక్రియగా మార్చాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగింలించాలనే ఉద్దేశ్యంతో మోసగాళ్లు నకిలీ ఉద్యోగ ఆఫర్లను పోస్ట్ చేయడం లేదా మీ సాధనం యొక్క భద్రత ఉల్లంఘనకు దారి తీసే లింక్ లను రూపొందించడం ద్వారా వీటిని చేస్తున్నారు.

సురక్షితమైన డిజిటల్ పేమెంట్ల ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే, సురక్షితంగా ఉంటూ, మోసాల్ని నివారించే పద్ధతులను ఇక్కడ మీరు చూడండి.:

మోసాన్ని నివారించడానికి చేయాల్సినవి & చేయకూడనివి:

  • కార్డ్ నెంబర్, ముగింపు తేదీ, పిన్, OTP తదితరాలు లాంటి రహస్య వివరాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. PhonePe ప్రతినిధిగా చెప్పుకునే ఎవరైనా అలాంటి వివరాలను మిమ్మల్ని అడిగితే, ఇమెయిల్ పంపాలని దయచేసి అడగండి. @phonepe.com డొమైన్ నుండి వస్తున్న ఇమెయిళ్లకు మాత్రమే స్పందించండి.
  • PhonePeలో నుండి డబ్బు అందుకోవడం కోసం మీరు ‘పే చేయడం’ లేదా మీ UPI పిన్ ప్రవేశపెట్టడం అవసరం లేదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
  • PhonePeలో డబ్బు అందుకోవడానికి QR కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదని ఎల్లవేళలా దయచేసి గుర్తుంచుకోండి.
  • ‘పే చేయి’ లేదా మీ UPI పిన్ ప్రవేశపెట్టే ముందు మీ PhonePe లో ప్రదర్శించిన లావాదేవీ సందేశాన్ని దయచేసి చాలా జాగ్రత్తగా చదవండి.
  • Screenshare, Anydesk, Teamviewerలాంటి థర్డ్ పార్టీ యాప్ లను డౌన్ లోడ్ చేయడం, ఇన్ స్టాల్ చేయడం చేయవద్దు.
  • Google, Twitter, FB తదితరాలలో PhonePe కస్టమర్ సహాయ విభాగం నెంబర్ల కోసం శోధించకండి. PhonePe కస్టమర్ సహాయ విభగాన్ని సంప్రదించడానికి ఏకైక అధికారిక మార్గం https://phonepe.com/en/contact_us.html
  • వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లో మా అధికారిక ఖాతాలలో మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.
  • Twitter హ్యాడిళ్లు: https://twitter.com/PhonePe_ https://twitter.com/PhonePeSupport
  • Facebook ఖాతా: https://www.facebook.com/OfficialPhonePe/
  • వెబ్: support.phonepe.com
  • PhonePe సహాయ విభాగంగా చెప్పుకునే ధృవీకరించని మొబైల్ నెంబర్లకు ఎన్నడూ కాల్ చేయడం లేదా స్పందించండం చేయవద్దు.
  • ధృవీకరణ లేకుండా ఏదైనా SMS లేదా ఇమెయిల్ సందేశంలో వెబ్ సైట్ లింక్ లను క్లిక్ చేయకండి.
  • క్రమపద్ధతిలో లేని కాలర్ సలహాపై ఎలాంటి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోకండి.
  • ధృవీకరించుకోకుండా చిన్న పాటి లావాదేవీలను అంగీకరించకండి.
  • KYC ధృవీకరణ కోసం క్లెయిమ్ చేయగల SMS ద్వారా వచ్చే నెంబర్ కు కాల్ చేయవద్దు.
  • బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీల ప్రతినిధులుగా తమను చెప్పుకునే తెలియని నెంబర్ల నుండి వచ్చే కాల్ లను తీయవద్దు.
  • మీ ప్రభుత్వ గుర్తింపు, మీ UPI ఐడి, మీ బ్యాంక్ ఖాతా నెంబర్, మీ పిన్, మీ వన్-టైమ్ పాస్ వర్డ్ లేదా మీ రెగ్యులర్ పాస్ వర్డ్ లాంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో పంచుకోవద్దు.

మోసగాడు మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరేం చేయాలి?

PhonePeలో మోసానికి సంబంధించిన వివాదాన్ని లేవనెత్తేందుకు కస్టమర్ పాటించాల్సిన అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి :

  1. PhonePe యాప్: సహాయ విభాగానికి వెళ్లి “లావాదేవీతో సమస్య ఉంది” ఆప్షన్ కింద ఒక సమస్యను లేవనెత్తండి.

2. PhonePe కస్టమర్ కేర్ నెంబర్: మీరు ఒక సమస్యను లేవనెత్తేందుకు PhonePe కస్టమర్ కేర్ విభాగాన్ని 80–68727374 / 022–68727374లో కాల్ చేయవచ్చు. ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ ఒక టికెట్ లేవనెత్తి, మీ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతారు.

3. వెబ్ ఫారం సమర్పణ: మీరు PhonePe వెబ్ ఫారం ఉపయోగించి కూడా ఒక సమస్యను లేవనెత్తవచ్చు — https://support.phonepe.com/

4. సోషల్ మీడియా: PhonePe యొక్క సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా మోసపూరిత సంఘటనలను నివేదించవచ్చు.:

5. సమస్య పరిష్కార విభాగం: ప్రస్తుతమున్న ఫిర్యాదును పరిష్కారం కోసం నివేదించేందుకు, మీరు https://grievance.phonepe.com/కు లాగిన్ అయి, గతంలో లేవనెత్తిన టికెట్ ఐడిని పంచుకోండి.

6. సైబర్ సెల్: చివరగా, మీరు మీకు దగ్గర్లో ఉన్న సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదులను లేవనెత్తవచ్చు. లేదా https://www.cybercrime.gov.in/లో ఆన్ లైన్ ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు. లేదా సైబర్ క్రైమ్ విభాగం హెల్ప్ లైన్ నెంబర్ 1930లో సంప్రదించవచ్చు.

Keep Reading