PhonePe Blogs Main Featured Image

Trust & Safety

టాపప్ మోసం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

PhonePe Regional|1 min read|07 May, 2021

URL copied to clipboard

టాపప్ మోసం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

మీ బ్యాంకు లేదా రిజర్వు బ్యాంకు లేదా ఇ-కామర్స్ వెబ్‌సైట్, చివరకు ఒక లాటరీ పథకం ప్రతినిధినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి మీకు కాల్ చేస్తారు. మీనుంచి కొన్ని వివరాలు సేకరించిన తర్వాత మీ 16 అంకెల కార్డు సంఖ్యను, CVVని పంచుకోవాలని వారు కోరుతారు. ఆ కాల్ విశ్వసనీయమైందని భావించి మీరు ఆ సమాచారాన్ని వారికి అందించారనుకుందాం.

ఆ తర్వాత ఒక కోడ్ తో కూడిన SMS మీకు అందుతుంది. బ్యాంకు ప్రతినిధి మళ్లీ మీకు కాల్ చేసి, ధృవీకరణ కోసం ఈ కోడ్ పంచుకోవాలని మిమ్మల్ని కోరుతారు. ఆ పని చేస్తే చాలు, మోసపూరిత వ్యక్తి వాలెట్‌కు మీ ఖాతానుంచి సొమ్ము టాపప్ చేయబడుతుంది. ఆ వెంటనే మీ ఖాతాలో ఈ మొత్తం మాయమవుతుంది. మీ డబ్బు మోసానికి గురైన విషయాన్ని మీరు గ్రహిస్తారు.

ముఖ్య గమనిక– PhonePe ఎన్నడూ రహస్యమైన లేదా వ్యక్తిగతమైన వివరాలు కోరదు. phonepe.com డొమైన్ నుంచి వస్తే తప్పించి phonepe నుంచి వచ్చినట్టు చెప్పుకుంటున్న మెయిళ్లన్నిటినీ పట్టించుకోకండి. మోసం జరుగుతున్నట్టు మీకు అనిపిస్తే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

అప్పుడు ఏం జరిగి ఉంటుంది?

  • మీకు కాల్ చేసిన బ్యాంకు అధికారి మోసగాడు. మీరు అందించిన వివరాలు అతనికి మీ బ్యాంకు ఖాతానుంచి వాలెట్‌ను టాపప్ చేసేందుకు ప్రయత్నించేందుకు వీలు కల్పించాయి.
  • పేమెంట్ట్‌ను అంగీకరిస్తున్నట్టు చెప్పడం కోసం మీరు అందుకున్న OTP వారికి కావాల్సి వచ్చింది. మీరు దానిని పంచుకున్న వెంటనే, మోసగాడు టాపప్ చేసేందుకు ముందుకు వెళ్లారు.
  • మీ ఖాతాలోని సొమ్ముతో మోసగాడి వాలెట్ టాపప్ చేయబడింది. దానిని అతను వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.
  • మీ సొమ్మును వివిధ ఖాతాలకు పంపించడం ద్వారా చోరీకి గురైన సొమ్మును తిరిగి పొందడాన్ని అధికారులకు మరింత సంక్లిష్టం చేసింది.

సురక్షితంగా ఉండడం ఎలా:

  • బ్యాంకు ఖాతా వివరాలను (కార్డు సంఖ్య, గడువు తేదీ, పిన్) ఎవరితోనూ పంచుకోవద్దు.
  • SMS లేదా ఇతర మార్గాల ద్వారా మీరు అందుకునే OTPలు లేదా మరేదైనా ఇతర కోడ్లను పంచుకోవద్దు.
  • బ్యాంకు నుంచి చెబుతూ మీకు తెలియని నెంబర్ నుంచి ఎవరైనా కాల్ చేసి, మీ వివరాలను కోరితే ఆ కాల్‌ను ప్రోత్సహించవద్దు. వెంటనే కాల్ కట్ చేయండి.
  • ఫోన్ ద్వారా వచ్చే సూచనలను అనుసరించకండి. దానికి బదులు ఇమెయిల్ ద్వారా సూచనలు పంపాలని కాలర్‌ను కోరండి.
  • ఇమెయిల్ పంపిన వారి డొమైన్‌ను పరిశీలించండి. అది [XYZ]@gmail.com లేదా మరేదైనా ఇమెయిల్ సేవా సంస్థ డొమైన్ అయితే ఆ మెయిల్‌ను పట్టించుకోకండి. ఇమెయిల్ డొమైన్ బ్యాంకు వాస్తవ డొమైన్‌తో సరిపోయిందా చూసుకోండి. అన్ని బ్యాంకు ఇమెయిళ్లు సురక్షితమైన https డొమైన్ నుంచి మాత్రమే వస్తాయి.

Keep Reading