PhonePe Blogs Main Featured Image

Trust & Safety

PhonePeలో వ్యాపారం నిర్వహిస్తున్నారా?

PhonePe Regional|3 min read|17 July, 2020

URL copied to clipboard

మీ సంపాదనలను సురక్షితం చేసుకోండి. మర్చంట్ మోసాలతో తస్మాత్ జాగ్రత్త

డిజిటల్ పేమెంట్ పద్ధతుల విస్తరణ మానవ జీవితాలను నిజంగా సులభతరం చేసింది. డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి, మీ అన్ని బిల్లులు పే చేయడానికి, మొబైల్/DTHలను రీఛార్జి చేయడానికి, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి, స్థానిక కిరాణా దుకాణాల్లో తక్షణ పేమెంట్లు చేయడానికి యాప్‌లను ఉపయోగిస్తుండడం నగదుపై ఆధారపడే పరిస్థితిని ఉనికిలో లేకుండా చేసింది.

డిజిటల్ పేమెంట్ పద్ధతులు ఒక పెద్ద వరంగా ఉన్నప్పటికీ, మోసగాళ్లు కూడా అదే రీతిలో వినియోగదారులను మాత్రమే కాక రిటైల్ వర్తకులను కూడా మోసం చేయడమే కాక నకిలీ లావాదేవీలు జరిపేందుకు మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.

కిరాణా దుకాణాల వర్తకులను మోసగాళ్లు ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం మోసం చేస్తున్నారనే సందర్భాలు కింద ఇవ్వబడ్డాయి.

స్క్రీన్ షేరింగ్ యాప్‌ల ద్వారా మోసాలు

మర్చంట్ రోజువారీ విక్రయాలను పరిశీలించాలనే నెపంతో మోసగాళ్లు పేమెంట్స్ కంపెనీకి చెందిన కాల్ ప్రతినిధులుగా నటిస్తారు. సంభాషణ సందర్భంగా, మోసగాళ్లు మర్చంట్ కార్డు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అందుకునేందుకు లేదా మర్చంట్ ఫోన్‌ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత మర్చంట్ల కష్టార్జితాన్ని చేజిక్కించుకునేందుకు ముందుకు వెళతారు.

ఉదాహరణ:

మోసగాడు: సాంకేతిక లోపాల కారణంగా, మీ వినియోగదారులు గడచిన కొన్ని రోజులుగా చేసిన లావాదేవీలను మేము రికార్డు చేయలేదని తెలపడం కోసం విక్రయ సహాయక బృందం నుంచి నేను కాల్ చేస్తున్నాను. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీ సమస్యను పరిష్కరించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చేయాల్సిన వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

  1. మీ బ్యాంకు ఖాతా/ డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు వివరాలు/ BHIM UPI PIN
  2. మీ సమస్యను మేము పరిష్కరించడం కోసం ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు లింక్ పైన క్లిక్ చేయండి. <Anydesk / ScreenShare లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకునేందుకు ఒక లింక్ ను మోసగాళ్లు మర్చంట్ కు పంపిస్తారు.>

వారి విజ్ఞప్తికి వర్తకుడు లొంగి, వివరాలు పంచుకోవడంతో పాటు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఆ యాప్ ను వర్తకుడు ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే వర్తకుడి ఫోన్‌పై మోసగాడు పట్టు సాధించి, వాళ్ల డబ్బును తస్కరిస్తారు.

క్యాష్‌బ్యాక్ లేదా ఆఫర్ స్కీమ్ మోసాలు

మర్చంట్ పేమెంట్ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులుగా నటిస్తూ మోసగాళ్లు మర్చంట్లకు కాల్ చేసే సందర్బాలు కూడా ఉన్నాయి. ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మర్చంట్‌ను తప్పుదోవపట్టించాలనే ఉద్దేశ్యంతో ఈ కాల్‌ను మోసగాళ్లు ప్రారంభిస్తారు.

సన్నివేశం 1

మోసగాడు — నేను మర్చంట్ సేవా విభాగం నుంచి కాల్ చేస్తున్నాను. ఈ వారం ఒక ప్రత్యేక క్యాష్‌బ్యాక్ స్కీమ్ నడుస్తోంది. ఈ లింక్ కు పేమెంట్ చేసి క్యాష్‌బ్యాక్‌ను నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి అందుకోండి.

  • 500 రూపాయలను పే చేసి, వెయ్యి రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందుకోండి.
  • పది వేల రూపాయలు పే చేసి, 15వేల రూపాయల క్యాష్ బ్యాక్ అందుకోండి.

ఈ ఆఫర్ కు లొంగిపోతున్న మర్చంట్ మొదటి లావాదేవీ చేసి, మోసగాడి నుంచి వెయ్యి రూపాయలు అందుకుంటారు. ఆ తర్వాత పెద్ద మొత్తాన్ని బదిలీ చేయాలని మోసగాడు మర్చంట్ ను కోరుతారు. మరింత ఎక్కువ క్యాష్‌బ్యాక్‌ వస్తుందనే ఆశతో, వర్తకుడు పది వేల రూపాయలను బదిలీ చేసినప్పుడు, మోసగాడు కాల్ కట్ చేసి, మాయమవుతారు.

సన్నివేశం 2

మోసగాళ్లు ప్రత్యేక ఆఫర్లు లేదా స్కీమ్‌లతో మర్చంట్లకు కాల్ చేసి QR కోడ్ ఉపయోగించడం ద్వారా వారి డబ్బును మాయం చేస్తారు.

ఉదాహరణ:

మోసగాడు — ఈ వారం ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ పథకాన్ని నడుపుతున్నాము. మీ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు మేము పంపిన QR కోడ్ ద్వారా పే చేయండి.

  • వంద రూపాయల లావాదేవీతో రెండు వందల రూపాయలు మీ బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేయబడుతుంది.
  • పదివేల రూపాయల లావాదేవీకి, మీ బ్యాంకు ఖాతాకు 20వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ నేరుగా జమ చేయబడుతుంది. ఇప్పుడే ప్రయత్నించండి!

వర్తకుడు ఆ ఆఫర్ మాయలో పడి, మోసగాడు పంపే QR ద్వారా వంద రూపాయల లావాదేవీ జరిపి, 200 రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందుకుంటారు. వర్తకుడు ఎక్కువ మొత్తాన్ని పే చేసిన వెంటనే, మోసగాడు కాల్ డిస్ కనెక్ట్ చేసి, ఎలాంటి డబ్బు ఇవ్వకనే మాయమవుతాడు.

గూగుల్ ఫారాల ద్వారా మోసాలు

ఇక్కడ, వివిధ కారణాలను పేర్కొంటూ మోసగాడు ఒక గూగుల్ ఫారాన్ని పంపించి, డబ్బును తస్కరిస్తాడు.

ఉదాహరణ:

మోసగాడు: నేను వర్తక సహాయ విభాగం నుంచి కాల్ చేస్తున్నాను. మీ వివరాలు కొన్ని మా సిస్టంలో అప్‌డేట్ కాలేదు కాబట్టి మేము కొన్ని రోజుల పాటు మీ ఖాతాను సస్పెండ్ చేయాల్సి రావచ్చు అని తెలుపుతున్నాను. దీన్ని నివారించడం కోసం దయచేసి, ఇప్పుడు ఈ లింక్ పైన క్లిక్ చేసి, మీ వివరాలతో గూగుల్ ఫారాన్ని నింపండి అని చెబుతారు.

వర్తకుడు దానితో సంతృప్తి చెంది. ఖాతా నెంబర్, UPI పిన్, రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్, పేరు, ఇమెయిల్ ఐడి తదితర వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని కోరే ఆ పత్రాన్ని నింపుతారు. వర్తకులు నింపిన ఈ సమాచారాన్ని మోసగాళ్లు దుర్వినియోగం చేసుకుని, వారి డబ్బును తస్కరిస్తారు.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

  1. పిన్ లు మరియు OTPలను పంచుకోవడం కానీ, తెలియని వసూలు అభ్యర్థనను అంగీకరించకండి.
  2. తెలియని సంస్థలకు పే చేయడం లేదా వాటి నుంచి వచ్చే వసూలు అభ్యర్థనను అంగీకరించడం లేదా పేమెంట్ పంపడం చేయవద్దు.
  3. తెలియని సంస్థల నుంచి వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లు లేదా ఉచిత కానుకలను అంగీకరించవద్దు.
  4. ఎలాంటి ఫారాన్ని నింపడం కానీ, బ్యాంకు వివరాలు, పిన్ తదితరాలైన సున్నితమైన సమాచారాన్ని అప్‌డేట్ చేయడం ఎన్నడూ చేయవద్దు.
  5. తెలియని వ్యక్తికి లేదా వర్తకుడి నుంచి వచ్చే వసూలు అభ్యర్థనను అంగీకరించే ముందు లేదా వారికి డబ్బు పంపే ముందు వారి వివరాలను పరిశీలించండి.
  6. డబ్బు అందుకోవడం కోసం మీ UPI పిన్‌ను ప్రవేశపెట్టకండి.
  7. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక వేదికల్లో మిమ్మల్ని గుర్తించే సమాచారాన్ని ఎన్నడూ పంచుకోకండి. వాటిని మోసగాళ్లు దుర్వినియోగం చేయవచ్చు.
  8. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన వసూలు అభ్యర్థనను మీరు అంగీకరించడం వల్ల మీ ఖాతానుంచి మీ డబ్బు తీసివేయబడితే, వెంటనే సైబర్ సెల్ లేదా బ్యాంకుకు వెంటనే నివేదించండి.
  9. PhonePe యాప్‌లో మోసగాళ్ల నెంబర్‌ను బ్లాక్ చేయండి.
  10. PhonePe యాప్‌లో మోసపూరిత సంఘటనలను నివేదించండి. మోసపూరిత లావాదేవీపై క్లిక్ చేయండి. “PhonePe సహాయ విభాగాన్ని సంప్రదించండి”పై క్లిక్ చేసి, ఫిర్యాదు చేయండి.

Keep Reading