PhonePe Blogs Main Featured Image

Trust & Safety

SMS స్పూఫింగ్ మోసం సంకేతాలను జాగ్రత్తగా గమనించకుంటే అంతే సంగతులు

PhonePe Regional|2 min read|24 July, 2023

URL copied to clipboard

మనం పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్న కాలంలో నివసిస్తున్నాము. మన జీవితంలోని ప్రతి కోణం ఇప్పుడు డిజిటల్ మయం అవుతోంది. కిరాణా సరకులు, తాజా ఆహారం నిమిషాల వ్యవధిలో డెలివరీ అవుతుండగా, పేమెంట్లు మరియు బ్యాంకింగ్ పనులు కొన్ని క్లిక్‌ల వ్యవధిలో జరిగిపోతున్నాయి. అయినప్పటికీ సౌకర్యం అనేది కొన్ని రిస్కులను తీసుకువస్తోంది. వీటి పట్ల అప్రమత్తంగా ఉంటే మాత్రమే మనం మోసాలకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చు.

అమాయక బాధితులు తమ కష్టార్జితాన్నంతా మోసపోయే విధంగా మోసగాళ్లు నిరంతరం కొత్త పద్ధతులను రూపొందిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు తాజాగా SMS స్పూఫింగ్ పేరుతో కొత్త రకం మోసానికి తెరలేపారు. మీ UPI ఖాతాను చేజిక్కించుకునేందుకు మోసగాళ్లను అనుమతించే రీతిలో ఈ మోసం జరుగుతుంది.

SMS స్పూఫింగ్ అంటే ఏమిటి?

ఏదైనా UPI యాప్‌లో మీరు ఖాతాను రూపొందించినప్పుడు, అది ఒక SMS సాయంతో ప్రమాణికీకరణ చేయబడుతుంది. ఈ ప్రమాణికీకరణ జరిగిన తర్వాత, UPI ఖాతా మీ పరికరానికి లింక్ చేయబడుతుంది. దీనినే సాధనం కట్టు (డివైజ్ బైండింగ్) అని అంటారు. ఈ పరికర బంధన సందేశాన్ని ఫార్వార్డ్ చేసేందుకు SMS ఫార్వార్డింగ్ యాప్ లను ఉపయోగించడం ద్వారా ఒక బాధితుడి UPI ఖాతాను చేజిక్కించుకునేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు. వారు దీనిని అనేక మార్గాల్లో చేస్తారు. ఇటీవల వారు పాటిస్తున్న ఒక ఉమ్మడి పద్ధతి ఏమిటంటే- మీ పరికరానికి ఓ మాల్‌వేర్‌ను పంపుతారు. అది వర్చువల్ మొబైల్ నంబర్‌కు ఆ బంధన సందేశాన్ని(బైండింగ్ మెసేజ్‌ను) ఫార్వార్డ్ చేస్తుంది.

SMS స్పూఫింగ్ మోసం ఎలా జరుగుతుందో తెలుసా

  1. హాస్పిటల్, కొరియర్, రెస్టారెంట్ తదితరాల పేరుతో రూపొందించిన వాట్సాప్ ఖాతాల ద్వారా మోసగాళ్లు మోసపూరిత ఫైల్స్ ను బాధితులు కాగల వారికి పంపుతారు.
  2. ఆ మోసపూరిత లింక్ పై బాధితులు క్లిక్ చేసిన వెంటనే, మాల్ వేర్ వారి సాధనంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది బ్యాంక్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్‌కు SMSలను ఫార్వార్డ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇలాంటి మోసాలు జరిగే సమయంలో, ఇది ఒక వర్చువల్ మొబైల్ నెంబర్ అవుతుంది.
  3. దీంతో, మోసగాళ్లు UPI రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. బాధితునికి సాధనం కట్టు (డివైజ్ బైండ్) SMS పంపబడుతుంది. ఒక హానికరమైన యాప్ UPI రిజిస్ట్రేషన్‌ను ప్రారంభిస్తూ బ్యాంక్‌కు ఆ SMSను ఫార్వార్డ్ చేస్తుంది
  4. ఆ తర్వాత మోసగాడు వర్చువల్ నెంబర్ ద్వారా UPI రిజిస్ట్రేషన్ ను ప్రామాణికీకరణ చేసుకుని, తమ ఫోన్‌ ద్వారా బాధితుడి UPI ఖాతాను కట్టుబాటులోకి తెచ్చుకుంటారు.
  5. లావాదేవీలు చేపట్టేందుకు, మోసగాడు సామాజిక మాధ్యమ ఇంజనీరింగ్ ట్రిక్కులను ఉపయోగించి, ‘MPIN’ను అన్వేషించి, అనధికారిక UPI లావాదేవీలు జరపవచ్చు.

కాబట్టి, మీ ఖాతాను, డబ్బును సురక్షితంగా ఉంచుకునే క్రమంలో ఎలాంటి అనుమానాస్పద లింక్ లపై ఎన్నడూ క్లిక్ చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

భద్రత విషయానికి వస్తే, PhonePe ఎలాంటి లావాదేవీల వైఫల్యం లేకుండా రోజువారీ ప్రాతిపదికన అనేక కోట్ల లావాదేవీలకు రక్షణతో వీలు కల్పిస్తుంది. మూడంచెల భద్రతలో కిందివి ఉంటాయి:

  1. లాగిన్ పాస్ వర్డ్: యాప్ కు భద్రతకోసం మొదటి పొర లాగిన్ పాస్ వర్డ్.
  2. PhonePe యాప్ లాక్: PhonePe యాప్ ను ఉపయోగించడం ప్రారంభించేందుకు, మీ వేలిముద్ర ఐడి, ముఖం ఐడి లేదా నెంబర్ లాక్ ను ఉపయోగించి, మీరు అన్ లాక్ చేయాల్సి ఉంటుంది.
  3. UPI పిన్: PhonePeలో ప్రతి పేమెంట్ కు, అంటే రూ.1 కానీ లేదా రూ. 1 లక్ష కానీ, UPI పిన్ లేకుంటే ఏ పేమెంట్ కూడా బయటకు వెళ్లదు.

కాబట్టి, PhonePe అన్ని పేమెంట్లను సురక్షితంగా, భద్రంగా చేసేందుకు అన్ని జాగ్రత్తలను తీసుకుంటుంది.

SMS స్పూఫింగ్ మోసాలను నివారించడం ఎలా

  • అనుమానాస్పద లింక్ లపైన క్లిక్ చేయవద్దు. దాంతో పాటు వచ్చే మాల్ వేర్ మీ ఫోన్ లోని యాప్ లను చేజిక్కించుకుంటుంది.
  • క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు నెంబర్, కార్డ్ ముగింపు తేదీ, CVV, OTO తదితరాలైన రహస్య సమాచారాన్ని PhonePe అధికారులు సహా ఎవ్వరితోనూ ఎన్నడూ పంచుకోవద్దు.
  • చివరగా, రిపోర్ట్ చేసి బ్లాక్ చేయడం – ఈ నెంబర్లను రిపోర్ట్ చేసి, బ్లాక్ చేయడం అన్నిటికన్నా అత్యుత్తమం.

మీ UPI ఖాతా రిజిస్ట్రేషన్ ను ప్రారంభించేందుకు ఒక మోసగాడు ప్రయత్నిస్తే, మీరు ఏం చేయాలి

PhonePe యాప్ లో ఒక స్కామర్ ద్వారా మీరు డూప్ చేయబడితే, మీరు కింది మార్గాల్లో వెంటనే సమస్యను లేవనెత్తవచ్చు.:

  1. PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు సమస్యను లేవనెత్తడానికి PhonePe కస్టమర్ కేర్ నంబర్‌కు 80–68727374 / 022–68727374కు కాల్ చేయవచ్చు, కస్టమర్ కేర్ ఏజెంట్ టిక్కెట్‌ను అందజేసి, మీ సమస్యకు సహాయంగా పోస్ట్ చేయవచ్చు.
  2. వెబ్‌ఫారమ్ సమర్పణ: మీరు PhonePe వెబ్‌ఫారమ్, https://support.phonepe.com/ని ఉపయోగించి, “PhonePeలో UPI పేమెంట్ల రిజిస్ట్రేషన్ ను ప్రారంభించలేదు” ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా కూడా, టిక్కెట్‌ను లేవనెత్తవచ్చు.
  3. సోషల్ మీడియా: మీరు PhonePe యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మోసపూరిత సంఘటనలను నివేదించవచ్చు.
  4. ఫిర్యాదు: ఇప్పటికే ఉన్న ఫిర్యాదుపై ఫిర్యాదును నివేదించడానికి, మీరు https://grievance.phonepe.com/కి లాగిన్ చేసి, గతంలో లేవనెత్తిన టికెట్ ఐడిని పంచుకోవచ్చు.
  5. సైబర్ సెల్: చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌లో మోసం ఫిర్యాదులను నివేదించవచ్చు లేదా https://www.cybercrime.gov.in/లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు లేదా 1930లో సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.

ముఖ్య గమనిక — PhonePe రహస్య లేదా వ్యక్తిగత వివరాలను ఎన్నడూ కోరదు. phonepe.com డొమైన్ నుండి రాకుంటే PhonePeనుండి వచ్చినట్టు చెబుతున్న అన్ని మెయిళ్లను విస్మరించండి. మోసం ఉన్నట్టు అనుమానిస్తే, దయచేసి అధికారులను వెంటనే సంప్రదించండి.

Keep Reading