Trust & Safety
సోషల్ మీడియా వ్యక్తి మార్పు మోసం
PhonePe Regional|2 min read|09 December, 2022
నేడు సోషల్ మీడియా ప్రపంచం నలుమూలల్లోని వ్యక్తులను కలిపే వేదికగా అవతరించింది. ఇది ఒక ముఖ్యమైన సమాచార, వార్తల వనరుగా కూడా నిలుస్తోంది. మన రోజువారీ జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది.
సోషల్ మీడియా వ్యక్తిగత మార్పు మోసం అనేది డిజిటల్ గుర్తింపు చౌర్యం రూపంగా ఉంటుంది. అది సోషల్ ఇంజినీరింగ్ విస్తృత విభాగంలో ఉంటుంది. మీ లేదా మీకు తెలిసిన వ్యక్తుల నకిలీ ప్రొఫైల్ ను రూపొందించి, ఆ తర్వాత దీనిని ఇతరుల నుండి డబ్బును లేదా సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే ప్రక్రియ.
సోషల్ మీడియా వ్యక్తి మార్పు మోసం ఎలా జరుగుతుంది :
- బాధితుల పేరు, ఫోటోలను యథాతథంగా కలిగిన చోరీ సమాచారాన్ని ఉపయోగించి మోసగాళ్లు సోషల్ మీడియాలో ఒక నకిలీ ప్రొఫైల్ ను రూపొందిస్తారు. బాధితులు తమను నమ్మే విధంగా కొన్ని విశ్వసనీయమైన వ్యాపార సంస్థ పేరును ఉపయోగించుకుని, ఒక నకిలీ ప్రొఫైల్స్ రూపొందించడం కూడా వారికి షరా మామూలే.
- కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు నకిలీ ఖాతాను ఉపయోగించుకుని, అభ్యర్థన పంపుతారు.
- మోసగాళ్లు అత్యవసర ప్రయోజనాలకోసం డబ్బు అడగడం ద్వారా ఎల్లవేళలా తొందరపాటు భావనను ప్రదర్శిస్తారు. వారి ఆదుర్దా చూసి, డబ్బును బదిలీ చేయడం ద్వారా కస్టమర్లు వలలో చిక్కుకుంటారు.
- కొన్ని సందర్భాల్లో, మోసగాళ్లు మీ సొంత ఖాతా ( ఉదా. Instagram లేదా Facebook )ను కూడా హ్యాక్ చేసి, మీ అనుచరుల జాబితా నుండి డబ్బు కోసం అభ్యర్థనలను పంపవచ్చు. ఇలా చేయడం ద్వారా, బాధితులు ఈ అభ్యర్థన ఒక చట్టబద్ధమైన ఖాతానుండే వచ్చిందని భావించి, డబ్బు పోగొట్టుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఆ ఖాతాకు యాక్సెస్ కూడా కోల్పోతారు. దీనిబారిన పడే చాలామంది కస్టమర్లు తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు.
సోషల్ మీడియా మోసాల నుండి తప్పించుకోవడం ఎలా :
- అనుమానాస్పద లింక్ లపైన క్లిక్ చేయవద్దు. ఇలాంటి లింక్ లపైన క్లిక్ చేయడం వల్ల మీరు మీ సోషల్ మీడియా ఖాతాకు యాక్సెస్ ను కోల్పోవాల్సి వస్తుంది.
- ప్రొఫైల్ వివరాలు బూటకంగా ఉండే ఏలాంటి ఖాతాతోనూ ఎన్నడూ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.
- ఫోన్, ఇమెయిల్ లేదా ఎలాంటి ఇతర మార్గాల్లోనూ మీ కార్డు వివరాలను ఎన్నడూ పంచుకోవద్దు.
- సమాచారం యొక్క విశ్వసనీయతను ఎప్పుడూ అధికారిక వర్గాలు లేదా కంపెనీ వెబ్‌సైట్ నుండి ధృవీకరించుకోవాలి. ఏదైనా వ్యాపార సంస్థ సైట్ నుండి ఒక అభ్యర్థన వచ్చినప్పుడు ఆ వ్యాపార సంస్థ పేరు, వెబ్‌సైట్‌ను వారి అధికారిక వెబ్ సైట్ నుండి సరి చూసుకోండి. ఎందుకంటే, నకిలీ వ్యాపార సంస్థ ప్రొఫైల్ పేరు లేదా వెబ్‌సైట్‌లో అంతగా గుర్తు పట్టని విధమైన మార్పు ఉంటుంది. ( www.facebook.com మరియు www.facebooks.com )
ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎన్నడూ రహస్యమైన లేదా వ్యక్తిగతమైన వివరాలు అడగదు. phonepe.com డొమైన్ నుండి రానివైతే, PhonePe నుంచి పంపుతున్నామని చెప్పే మెయిల్స్ అన్నిటినీ పట్టించుకోవద్దు. మోసం జరుగుతున్నట్టు మీకు అనుమానం వస్తే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.