PhonePe Blogs Main Featured Image

Trust & Safety

క్యాష్ బ్యాక్ మోసాలతో తస్మాత్ జాగ్రత్త!

PhonePe Regional|2 min read|26 April, 2021

URL copied to clipboard

మీరు PhonePeకు చెందినదిగా పేర్కొనే ఒక లింక్‌తో కూడిన ఒక SMS సందేశాన్ని అందుకుంటారు. దానిని క్లిక్ చేసి, ఉత్తేజకరమైన క్యాష్‌బ్యాక్ రివార్డ్‌లను అన్‌లాక్ చేసుకోవాలని మిమ్మల్ని కోరుతారు. ఈ లింక్ సరైందేనా, దీనిని క్లిక్ చేసి రివార్డ్ క్లెయిమ్ చేయొచ్చా అనే సందేహం మీకు కలుగుతుంది. ఆ తర్వాత అలా చేయవద్దని మీరు నిర్ణయించుకుంటారు. అది చాలా గొప్ప నిర్ణయం!

రివార్డును క్లెయిమ్ చేయడం కోసం లింక్ పై క్లిక్ చేసి, అందులో పేర్కొన్న దశలను అనుసరించి ఉంటే, వినియోగదారులను మోసం చేయడం కోసం గాలం వేసేందుకు వెనుకాడని మోసగాళ్లతో మీరు డబ్బును కోల్పోయి ఉంటారు. క్యాష్‌బ్యాక్ అందుకోవడానికి మీ UPI పిన్ను ప్రవేశపెట్టమని కోరే ఏ సందేశాన్ని అయినా మీరు పట్టించుకోరాదు.

క్యాష్ బ్యాక్ ఆఫర్లు మరియు స్క్రాచ్ కార్డుల ద్వారా గిఫ్ట్ లు గెలుచుకోవచ్చని చెప్పి మోసగాళ్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. మీకు కొంత మంది ఆఫర్లతో కూడిన నకిలీ లింక్ లను పంపవచ్చు లేదా నకిలీ సామాజిక మాధ్యమాల పేజీలలో క్యాష్ బ్యాక్ కు సంబంధించిన పోస్ట్ లు కూడా మీకు కనిపించవచ్చు. ఈ ఆఫర్ నిజమైనదేనని నమ్మెలా మిమ్మల్ని మోసగించే రీతిలో ఈ లింక్‌లు మరియు సామాజిక మాధ్యమ పేజీలను తెలివిగా PhonePe యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు లోగోను పోలి ఉండేలా రూపొందిస్తున్నారు. కొంతమంది మోసగాళ్లు మీకు కాల్ చేసి, మీ నోటిఫికేషన్‌లు / బెల్ ఐకాన్ లో కనిపించే పేమెంట్ లింక్‌ను అంగీకరించడం ద్వారా PhonePe యాప్ లో క్యాష్‌బ్యాక్‌ను అందుకోవడానికి కొన్ని దశలను పూర్తి చేయమని కూడా మిమ్మల్ని కోరవచ్చు.

PhonePe క్యాష్ బ్యాక్ ఎలా పనిచేస్తుంది?

  • PhonePe క్యాష్ బ్యాక్ మీ వాలెట్ కు తనంతతానుగా జమ చేయబడుతుంది.

క్యాష్ బ్యాక్ ను క్లెయిమ్ చేయడానికి లేదా అంగీకరించడానికి ఎలాంటి అదనపు చర్య అవసరం లేదు. PhonePe ఫోన్ కాల్ లు లేదా లింక్ ల మార్గంలో క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్ లను అందించదు. క్యాష్‌బ్యాక్‌ ఇస్తామని హామీ ఇచ్చే ఏదైనా URLలు, సామాజిక మాధ్యమ పోస్ట్ లు లేదా ఫోన్ కాల్స్ వస్తే, అవి తప్పకుండా తప్పుదారి పట్టించేవే.

  • PhonePeలో క్యాష్ బ్యాక్ లేదా రివార్డులను అందుకోవడానికి మీ UPI పిన్ ను మీరు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు.

క్యాష్ బ్యాక్ అందుకోవడానికి వినియోగదారుల UPI పిన్ ను ప్రవేశపెట్టమని ఎన్నడూ కోరదు. మీ బ్యాంక్ ఖాతా నుండి మీరు డబ్బును పంపినప్పుడు మాత్రమే UPI పిన్ కావాల్సి వస్తుంది. క్యాష్ బ్యాక్ అందుకోవడానికి మీ UPI పిన్ ను ప్రవేశపెట్టమని మిమ్మల్ని అడిగితే, లావాదేవీని వెంటనే తిరస్కరించండి. support.phonepe.comలో మాకు నివేదించండి.

  • మీ PhonePe యాప్ హోం పేజీలోని “అన్ని ఆఫర్లను చూడండి” విభాగంలో అన్ని క్యాష్ బ్యాక్ మరియు ఇతర ఆఫర్లు పేర్కొనబడి ఉంటాయి.

నిజమైన PhonePe క్యాష్ బ్యాక్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఈ విభాగాన్ని చూడండి. ఏదైనా లావాదేవీని చేసే ముందు నియమ, నిబంధనలతో పాటు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదవండి.

మోసగాళ్ల నుండి సురక్షితంగా ఉండడానికి చిట్కాలు:

తెలిసిన మూలాల నుండి వచ్చే పేమెంట్ అభ్యర్థనను మాత్రమే అంగీకరించండి.

మీ UPI ఐడి తెలిసిన ఎవరైనా పేమెంట్ అభ్యర్థనలను పంపవచ్చు. తెలియని మూలాల నుండి వచ్చే పేమెంట్ అభ్యర్థనలను తిరస్కరించండి. మీ UPI ఐడి నుండి మీ ఫోన్ నెంబర్ తెలిసిన ఎవరైనా డబ్బు కోసం అభ్యర్థించవచ్చు.

“మీ UPI ఐడిని కనుగొనడానికి, మీ PhonePe యాప్ లోని ప్రొఫైల్ విభాగంకు వెళ్లి “నా UPI ఐడి.” కింద చూడండి. మీ డీఫాల్ట్ PhonePe UPI ఐడి yourphonenumber@ybl.”

అపరిచితుల నుండి వచ్చే నకిలీ కాల్స్/పేమెంట్ అభ్యర్థనలను పట్టించుకోకండి.

PhonePe ప్రతినిధులుగా చెప్పుకున్నా కూడా, మీకు క్యాష్‌బ్యాక్ ఇవ్వజూపే కాలర్స్ లను ప్రోత్సహించవద్దు. ఒక స్నేహితుడు/కుటుంబ సభ్యుడు అని చెప్పుకుని, తెలియని నెంబర్ నుంచి మీరు కాల్ అందుకున్నప్పుడు, ఏదైనా పేమెంట్ లావాదేవీలను చేయడానికి ముందు దయచేసి వారు మీకు బాగా తెలుసా అని సరి చూసుకోండి.

గుర్తుంచుకోండి: PhonePe అధికారులు సహా ఎవరితోనూ UPI పిన్, OTP, CVV మరియు కార్డ్ వివరాలు లాంటి రహస్య సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు.

Keep Reading