PhonePe Blogs Main Featured Image

Trust & Safety

నకిలీ యాప్ లతో తస్మాత్ జాగ్రత్త!

PhonePe Regional|1 min read|27 April, 2021

URL copied to clipboard

విశ్వాన్ని ఏకం చేసిన నేటి ప్రపంచంలో మన మొబైల్ ఫోన్ అన్ని రకాల వ్యక్తిగత, విలువైన సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునే సాధనంగా నిలుస్తోంది. అయినప్పటికీ, హ్యాకర్లు మరియు మోసగాళ్లు మన వ్యక్తిగత సాధనాల భద్రతకు భంగం కలిగించేందుకు కొత్త మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు.

సైబర్ దాడుల గురించి, మీరు ఎలా సురక్షితంగా ఉండగలరో మరిన్ని వివరాలు తెలుసుకోండి.

సైబర్ ముప్పుకు సంబంధించి ఇటీవలి అప్ డేట్ల ప్రకారం, మీ మొబైల్ ఫోన్ పై పట్టు సాధించడం కోసం నకిలీ యాప్ ల రూపంలో వైరస్/ట్రోజన్లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నారు. దానిద్వారా దురుద్దేశ ప్రయోజనాల కోసం సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

ఈ వైరస్/ట్రోజన్లు చట్టబద్ధమైన ఫోటో ఎడిటింగ్, టెక్స్ట్ ఎడిటింగ్, పేమెంట్, బ్యాంకింగ్, గేమింగ్ యాప్ లుగా తప్పుగా చూపుతున్నారు.

ఇన్ స్టాల్ చేసిన వెంటనే, మీ సమాచారాన్ని నింపుకున్న ఈ యాప్ లను హ్యాకర్లు మీకు తెలియకుండానే మీ ఫోన్ లో అనేక విధులను చేపట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ కు యాక్సెస్ కావడం, సిస్టం అలెర్ట్ లను మార్చడం, అదనపు ప్యాకేజీలను ఇన్ స్టాల్ చేసుకోవడం, రీబూట్ పైన ఆటో-ఇనిషియేట్, పరిచయాలను చూపించు, మీడియా ఫైళ్లు, చిత్రాలను తీసుకోవడం, మీ ప్రస్తుత ప్రదేశాన్ని గుర్తించడం, లాక్ స్క్రీన్ కోడ్లు, OTP వివరాలతో కూడిన యాప్ పిన్ లు & SMSలను చదవడం లాంటివి చేస్తారు.

మీ సాధనాన్ని భద్రపరచుకుని, డేటాను సురక్షితంగా ఉంచేందుకు ఈ చిట్కాలను గుర్తుంచుకోండి!

  1. నమ్మకం లేని మూలాల నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడం లేదా ఇన్ స్టాల్ చేసుకోవడం చేయవద్దు. Google Play Store & App Store లాంటి నమ్మకమైన మూలాల నుంచి డౌన్ లోడ్ చేసిన యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోండి.
  2. యాప్ అనుమతులను పరిశీలించి, యాప్ ప్రయోజనాలకోసం సంబంధిత సందర్భాన్ని కలిగిన అనుమతులను మాత్రమే మంజూరు చేయండి.
  3. మీ ఫోన్ సెట్టింగ్ లోని “నమ్మకం లేని వనరులు”నుంచి యాప్ ల ఇన్ స్టలేషన్ ను నిర్వీర్యం చేయాలని గుర్తుంచుకోండి.
  4. పబ్లిక్ వై-ఫై నెట్ వర్క్ లను ఉపయోగించడాన్ని నివారించండి. అవసరం లేని సమయంలో మీ వై-ఫై కనెక్షన్ ను స్విచాఫ్ చేయండి. వైరస్ సోకిన యాప్ లను పంపిణీ చేసేందుకు పబ్లిక్ పాయింట్లలో దుర్మార్గ వైఫై యాక్సెస్ పాయింట్లు ఉండవచ్చు.
  5. గుర్తింపు పొందిన సేవా సంస్థ నుంచి సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసి, వాటిని క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి.
  6. మీరు ఒక యాప్ ను డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం ఏర్పడితే, ఇన్ స్టాల్ చేసేందుకు యాప్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడంకోసం పరిశీలించండి.
  7. టెక్స్ట్ సందేశాలలో లింక్ లపై క్లిక్ చేయడం లేదా తెలియని వనరుల నుంచి ఇమెయిలర్లలో జోడించిన జిప్ ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకోవడం చేయవద్దు.
  8. మీ బ్రౌజర్ లో ఫైళ్లను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించే వెబ్ పేజీలను వెంటనే మూసివేయండి.

Keep Reading