PhonePe Blogs Main Featured Image

Trust & Safety

QR కోడ్ మోసాల బారి నుంచి కాపాడుకోండి!

PhonePe Regional|1 min read|12 May, 2021

URL copied to clipboard

QR కోడ్ మోసాల బారి నుంచి కాపాడుకోండి!

డిజిటల్ పేమెంట్లు కోట్లాది మంది భారతీయులకు జీవితాన్ని సులభతరం చేసింది. అయినప్పటికీ, పేమెంట్ మోసాల ఉదంతాలు కూడా పెరుగుతున్నాయి. మీ కార్డు లేదా బ్యాంకు ఖాతా వివరాలు లేకున్నా మోసగాళ్లు మిమ్మల్ని మోసం చేస్తారనే విషయం మీకు తెలుసా? అలాంటి మోసాలలో ఒకటే QR కోడ్ మోసం.

QR కోడ్ మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోండి:
మోసగాళ్లు వాట్సాప్ లేదా ఏదైనా చిత్రం షేరింగ్ యాప్‌లో QR కోడ్ చిత్రాన్ని పంపిస్తారు. మీ బ్యాంకు ఖాతాలో ఉచిత నగదు రివార్డులను అందుకోవడం కోసం కోడ్‌ను స్కాన్ చేయాలని, మొత్తాన్ని ప్రవేశపెట్టాలని, మీ UPI పిన్ ప్రవేశపెట్టాలని ఆ సందేశం మిమ్మల్ని కోరుతుంది. దీనికి బదులుగా, మీ UPI పిన్ ప్రవేశపెడితే సరిపోతుందని మిమ్మల్ని కోరుతూ, ముందుగానే పాపులేట్ చేసిన మొత్తంతో ఒక QR కోడ్‌ను పంపుతారు. మీరు ఆ పని చేసిన వెంటనే, మీ ఖాతా నుంచి డబ్బు డెబిట్ చేయబడుతుంది.

ఒక మోసపూరిత సందేశం ఎలా ఉంటుందనడానికి కింది ఉదాహరణను చూడవచ్చు:

దయచేసి గుర్తుంచుకోండి: PhonePeలో నగదు అందుకోవడానికి మీరు ‘పే’ చేయడం లేదా మీ ‘UPI’ ప్రవేశపెట్టడం ఎన్నడూ చేయాల్సిన పని లేదు. మీరు ఇలాంటి సందేశాలను అందుకుంటే, స్పందించవద్దు. దానికి బదులు ఆ ఫోన్ నెంబర్‌ను, మోసగాళ్ల ఇతర వివరాలను నివేదించేందుకు యాప్‌లోని PhonePe సేవా విభాగాన్ని సంప్రదించండి.

మోసాలనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకోండి:
PhonePe ఎన్నడూ మీ ఆంతరంగిక వివరాలను కోరదు. PhonePe ప్రతినిధి అని చెప్పుకుంటూ ఎవరైనా అలాంటి వివరాలను తెలపాలని మిమ్మల్ని కోరితే, దయచేసి మీకు ఒక ఇమెయిల్ పంపాలని వారిని కోరండి. @phonepe.com డొమైన్ నుంచి వచ్చే ఇమెయిళ్లకు మాత్రమే స్పందించండి.

  • PhonePe వినియోగదారు సేవా విభాగం నెంబర్ల కోసం గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితరాల్లో శోధించకండి. PhonePe వినియోగదారు సేవా విభాగాన్ని సంప్రదించడానికి ఏకైక మార్గం support.phonepe.comలోకి వెళ్లడమే.
  • PhonePe సేవా విభాగం నుంచి చేస్తున్నట్టు చెప్పే ధృవీకరించని మొబైల్ నెంబర్లకు కాల్ చేయడం లేదా స్పందించడం చేయవద్దు.
  • వివిధ సామాజిక మాధ్యమ వేదికలలోని మా అధికారిక ఖాతాలలో మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.
    ట్విట్టర్ హ్యాండిళ్లు: https://twitter.com/PhonePe
    https://twitter.com/PhonePeSupport
    – ఫేస్‌బుక్ ఖాతా: https://www.facebook.com/OfficialPhonePe/
  • మీ కార్డు లేదా ఖాతా వివరాలు ఎవరికైనా తెలిసిందని అనుమానం వస్తే,:
    – support.phonepe.comకు నివేదించండి.
    – మీకు సమీపంలో ఉన్న సైబర్ సెల్‌ను సంప్రదించి, పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Keep Reading