PhonePe Blogs Main Featured Image

Trust & Safety

సోషల్ ఇంజనీరింగ్ మోసాలనుంచి సురక్షితంగా ఉండండి

PhonePe Regional|2 min read|10 May, 2021

URL copied to clipboard

సోషల్ మీడియా వినియోగదారు సేవల్ని మీకు మరింత దగ్గరగా తీసుకొచ్చింది. ఒక సమస్యకు పరిష్కారం కావాల్సినప్పుడల్లా, మీరు సులభంగా లాగిన్ అయి, వినియోగదారు సేవా విభాగం ప్రతినిధితో నేరుగా సంభాషించవచ్చు.

కొన్ని సందర్భాల్లో, ఈ సంభాషణల సందర్భంగా మీ వ్యక్తిగత వివరాలను సురక్షిత మార్గంలో పంచుకోవడానికి బదులు సామాజిక మాధ్యమ వేదికల్లో పోస్టింగ్ చేసే పరిస్థితికి దారి తీయవచ్చు. ఈ వివరాలను మోసగాళ్లు సులభంగా దుర్వినియోగం చేస్తారు.

ముఖ్య గమనిక- PhonePe ఎన్నడూ రహస్యమైన లేదా వ్యక్తిగతమైన వివరాలు కోరదు. phonepe.com నుంచి రాని పక్షంలో phonepeనుంచి వచ్చినట్టు పేర్కొనే అన్ని మెయిళ్లను పట్టించుకోవద్దు. మోసం జరుగుతున్నట్టు అనుమానం కలిగితే, వెంటనే దయచేసి, మీ బ్యాంకును సంప్రదించగలరు.

సోషల్ ఇంజనీరింగ్ మోసం అంటే ఏమిటి?

మోసగాళ్లు మిమ్మల్ని నమ్మించడంకోసం మీ వ్యక్తిగత వివరాలను ఉపయోగించుకునే సమయంలో సోషల్ ఇంజనీరింగ్ చోటు చేసుకుంటుంది. మోసగాళ్లు తరచూ ఏదో సమస్యపై మీకు సహాయం చేస్తున్నట్టుగా నటించడం ద్వారా మీ నమ్మకాన్ని పొందుతారు. వాస్తవంగా, వాళ్లు మీ డబ్బును దోచుకోవడంకోసం మీ వ్యక్తిగత వివరాలను ఉపయోగించుకుంటున్నారన్నదే అసలు సంగతి.

సోషల్ ఇంజనీరింగ్ మోసం ఎలా జరుగుతుంది?

  1. మోసగాళ్లు మీ బ్యాంకుకు చెందిన వినియోగదారు సేవా విభాగం ప్రతినిధులని చెప్పుకుని మీకు ఫోన్ చేస్తారు. మీ నమ్మకాన్ని పొందడంకోసం సామాజిక మాధ్యమంలో మీరు పంచుకున్న వివరాలను వారు ఉపయోగించుకుంటారు. అలాగే మీ డెబిట్ కార్డు వివరాలను కోరుతారు.
  2. ఆ తర్వాత లావాదేవీని పూర్తి చేయడంకోసం OTPని అందించాలని ఆ మోసగాళ్లు మిమ్మల్ని కోరుతారు. దాంతో మీ డెబిట్ కార్డును ఉపయోగించి వారి వాలెట్‌ను టాపప్ చేసుకుంటారు.
  3. లావాదేవీ పూర్తయిన వెంటనే, మోసగాళ్లు ఆ డబ్బును వారి వాలెట్ నుంచి వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకుంటారు.

దయచేసి గమనించగలరు: ఒక వాస్తవ వినియోగదారు సేవా విభాగం ప్రతినిధి మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు పూర్తి వివరాలను లేదా OTPని ఎన్నడూ కోరరు. వారు అధికారిక ల్యాండ్‌లైన్ నంబర్లనుంచి మాత్రమే మిమ్మల్ని సంప్రదిస్తారు కానీ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయరు. మీ బ్యాంకు అధికారిక డొమైన్ నుంచి పంపని ఇమెయిళ్లను మీరు పట్టించుకోనవసరం లేదు.

మీరు సురక్షితంగా ఉండేందుకు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఎన్నడూ OTPలు, పిన్ నంబర్లను లేదా SMSలు లేదా ఇతర మార్గాల ద్వారా మీరు అందుకునే ఏదేని ఇతర కోడ్లను ఇతరులతో పంచుకోవద్దు.
  • ప్రజా వేదికలపై మీ ఖాతా సంఖ్యను లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వివరాలను ఎన్నడూ పంచుకోవద్దు.
  • బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి, తెలియని నంబర్ నుంచి మీకు కాల్ చేసి, మీ వ్యక్తిగత వివరాలు అడిగితే, వారిని ప్రోత్సహించవద్దు. వెంటనే కాల్ కట్ చేయండి.
  • ఇమెయిల్ పంపిన వారి డొమైన్ పరిశీలించండి. అది [XYZ]@gmail.com లేదా ఏదేని ఇతర ఇమెయిల్ సేవా సంస్థ డొమైన్ నుంచి వచ్చి ఉంటే, ఆ మెయిల్ ను పట్టించుకోవద్దు. ఇమెయిల్ డొమైన్, బ్యాంకు వాస్తవ డొమైన్ సరిపోయాయా అని నిర్ధారించుకోండి. అన్ని బ్యాంకు ఇమెయిళ్లు ఒక సురక్షితమైన https డొమైన్ నుంచి మాత్రమే వస్తాయి.

సురక్షితంగా లావాదేవీలు జరపడం గురించిన వీడియోను వీక్షించండి: https://youtu.be/rHZ57O9X8kk

Keep Reading