PhonePe Blogs Main Featured Image

Trust & Safety

సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్: నకిలీ ఐడెంటిటీలతో కేటుగాళ్లు చేసే మోసాలు ఏలా ఉంటాయో తెలుసా..?

PhonePe Regional|3 min read|26 May, 2026

URL copied to clipboard

మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం అయిపోయిందని, బిల్లులు కట్టలేదని వరుసగా పలు బ్యాంక్​ల నుండి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఊహించుకోండి. ఈ నెలలో మీరు అంతగా ఖర్చు చేయలేదని మీకు ఖచ్చితంగా తెలుసు, అదే విషయాన్ని బ్యాంక్​లకు చెబుతారు. కానీ పదే పదే కాల్స్ రావడంతో, మీరు మరిన్ని వివరాలు అడిగితే అసలు విషయం బయటపడుతుంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మీ ఫోన్ నంబర్ మరియు PAN వివరాలను మరొకరి వివరాలతో కలిపి ఒక నకిలీ ఐడెంటిటీని సృష్టించి, దాని ద్వారా అనధికారిక పేమెంట్లు చేశారని మీకు అర్థమవుతుంది. ఇదే సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్.

మీ ఐడెంటిటీ అనేది మీకున్న అత్యంత విలువైన ఆస్తి. ఓటు వేయాలన్నా, వాహనం నడపాలన్నా, లావాదేవీలు చేయాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా లేదా పన్నులు చెల్లించాలన్నా మీ  ఐడెంటిటీ మీకు కీలకం. అందుకే, మీ జీవితంలోని ఇతర విలువైన వస్తువులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో, మీ  ఐడెంటిటీని కూడా అంతే భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

మోసగాళ్లు మీ  ఐడెంటిటీని దుర్వినియోగం చేస్తూ మీ కష్టార్జితాన్ని ఎలా దోచుకుంటున్నారో ఈ బ్లాగ్ ద్వారా వివరంగా తెలుసుకుందాం.

సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్ అంటే ఏమిటి?

సాధారణ గుర్తింపు(ఐడెంటిటీ) దొంగతనంలో, మోసగాడు నేరుగా మీ ఐడెంటిటీని దొంగిలించి మీలాగే నటిస్తాడు. కానీ సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్ అనేది అంతకంటే తెలివైన పద్ధతి. ఇందులో నేరస్థులు కొంత నిజమైన సమాచారాన్ని, మరికొంత నకిలీ సమాచారాన్ని కలిపి, అసలు ఉనికిలో లేని ఒక కొత్త వ్యక్తిని సృష్టిస్తారు.

మోసగాళ్లు ఆధార్ లేదా PAN వంటి నిజమైన గుర్తింపు(ఐడెంటిటీ) వివరాలను తీసుకుని, వాటికి కల్పిత పేర్లను లేదా సంబంధం లేని,చెల్లని లేదా ఖాళీ అడ్రస్‌లను జత చేస్తారు. దీనివల్ల వాస్తవ ప్రపంచంలో లేని ఒక పూర్తి ఐడెంటిటీ తయారవుతుంది. ఇది ఎంత సహజంగా ఉంటుందంటే, ఆర్థిక సంస్థలు కూడా ఆ వ్యక్తిని నిజమైన కస్టమర్ అని నమ్మేస్తాయి.

సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది

మోసగాళ్లు ఒక కల్పిత ఐడెంటిటీని సృష్టిస్తారు, కానీ సృష్టించిన వెంటనే దానిని వాడరు. బదులుగా, ఆ ఐడెంటిటీ నిజమైనదేనని నమ్మించడానికి చాలా సమయం వెచ్చిస్తారు. వారు అనుసరించే పద్ధతి ఇలా ఉంటుంది:

  1. సాధారణంగా సీనియర్ సిటిజన్లు వంటి తమ క్రెడిట్ వివరాలను పెద్దగా పట్టించుకోని వారి ఆధార్ లేదా PAN నంబర్లను దొంగిలించి పని మొదలుపెడతారు. 
  2. వారు చిన్న చిన్న లోన్లు లేదా స్టోర్ కార్డ్‌ల కోసం అప్లై చేస్తారు. ఒకవేళ ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయినా, ఆ నకిలీ వ్యక్తి పేరు మీద ఒక క్రెడిట్ ప్రొఫైల్ తయారవుతుంది. 
  3. చిన్న చిన్న బిల్లులను సకాలంలో చెల్లిస్తూ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకుంటారు. కొన్నిసార్లు వేరే అకౌంట్లలో కో-జాయినీగా లేదా ఆథరైజ్డ్ యూజర్‌గా చేరి నమ్మకాన్నిపెంచుతారు. 
  4. క్రెడిట్ లిమిట్ గరిష్ట స్థాయికి చేరుకోగానే, అన్ని అకౌంట్ల నుండి అమౌంట్ వాడేసి మాయమైపోతారు.

ఆ లావాదేవీలు చేసిన ‘వ్యక్తి’ అసలు ఉనికిలో లేకపోవడంతో, బ్యాంక్​లు ఎవరినీ పట్టుకోలేవు.

ఈ మోసం వల్ల అసలైన ప్రభావం ఆ ఐడెంటిటీ దొంగిలించబడిన బాధితులపై పడుతుంది. మీ ఐడి ఇలాంటి సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్‌కు ఆధారంగా ఉపయోగించినట్లయితే, మీకు అది ఏళ్ల తరబడి తెలియకపోవచ్చు. మీరు ఎప్పుడైనా కార్ లోన్ లేదా స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, మీ PAN కార్డ్​పై భారీ మొత్తంలో ఉన్న “ఘోస్ట్ డెట్” (దొంగ అప్పు)తో ముడిపడి ఉండటం వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినప్పుడు మాత్రమే మీరు మోసపోయారని గ్రహిస్తారు.

PhonePe మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది

ఇలాంటి మోసాలను గుర్తించడానికి PhonePe నిపుణుల పర్యవేక్షణతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగిస్తుంది. సింథటిక్ ఐడెంటిటీలు సాధారణంగా ఒకే రకమైన పద్ధతులను అనుసరిస్తూ యంత్రాల్లా ప్రవర్తిస్తాయి. PhonePe సిస్టమ్స్ వీటిని సులభంగా పసిగట్టగలవు. నిజమైన యూజర్లు ఎప్పుడూ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు మర్చంట్లతో కనెక్ట్ అయి ఉంటారు. వాస్తవ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని అకౌంట్ ఏదైనా కనిపిస్తే, మా సిస్టమ్ వెంటనే హెచ్చరిస్తుంది. మా KYC వెరిఫికేషన్ సిస్టమ్ మీ ఐడిని కేవలం చదవడమే కాకుండా,ఒక నకిలీ పాత్రని సృష్టించడానికి డాక్యుమెంట్‌లోని ఒక్క అంకెను లేదా ఫోటోను డిజిటల్‌గా మార్చినా సరే, ఆ మార్పులను సులభంగా గుర్తించగలదు.

మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం ఎలా

సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్ బారిన పడకుండా మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

  • మీ క్రెడిట్ హెల్త్‌ను గమనిస్తూ ఉండండి: మీ క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయండి. మీకు తెలియని లోన్ లేదా క్రెడిట్ ఎంక్వైరీ ఏదైనా కనిపిస్తే, మీ ఐడి ఎక్కడో దుర్వినియోగం అవుతోందని అర్థం చేసుకోండి. 
  • మీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా ఉంచండి: మీ ఆధార్ మరియు PAN వివరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వెరిఫై చేయబడని సోషల్ మీడియా గ్రూపుల్లో మీ ఐడిల ఫోటోలను ఎప్పుడూ షేర్ చేయకండి. 
  • బయోమెట్రిక్ లాక్‌లను వాడండి: మీ PhonePe సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడి ఎనేబుల్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి. ఇది భద్రతకు ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఒకవేళ మీరు మోసపోతే ఏమి చేయాలి

మీరు ఒక స్కామ్ ద్వారా మోసపోయారని అనుమానం వస్తే, వెంటనే దాని గురించి రిపోర్ట్ చేయండి. ఇక్కడ ప్రతి సెకను ఎంతో కీలకం.

PhonePeలో రిపోర్ట్ చేయడం:

  • PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి.
  • కస్టమర్ కేర్: PhonePeకు 80–68727374 లేదా 022–68727374 నంబర్లకు కాల్ చేయండి.
  • సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి:
  • ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి

అధికారులకు రిపోర్ట్ చేయండి:

  •  సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్​లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా  1930కు కాల్ చేయండి.
  • టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సాప్ మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.

ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్​లను విస్మరించండి. మీకు మోసానికి గురైనట్టు అనుమానమైతే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading