PhonePe Blogs Main Featured Image

Trust & Safety

పేమెంట్ మోసాల్లో రకాలు & సురక్షితంగా ఉండేందుకు అత్యుత్తమ పద్ధతులు

PhonePe Regional|4 min read|11 May, 2021

URL copied to clipboard

పేమెంట్ మోసాల్లో రకాలు & సురక్షితంగా ఉండేందుకు అత్యుత్తమ పద్ధతులు

డిజిటల్ పేమెంట్ పద్ధతుల విస్తరణ మానవ జీవితాలను నిజంగా చాలా సులభతరం చేసింది. డబ్బు పంపేందుకు, మీ బిల్లులు అన్నిటినీ చెల్లించేందుకు, రీఛార్జి చేసేందుకు, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు, మీ స్థానిక కిరాణా దుకాణాలలో తక్షణ పేమెంట్లు చేయడం లాంటి అన్ని పనులకూ పేమెంట్ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. వీటిని ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల నగదుపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేసింది.

డిజిటల్ పేమెంట్ పద్ధతులు మానవ జీవితాలకు ఒక పెద్ద వరంగా ఉంటున్నప్పటికీ, మోసగాళ్లు పదేపదే మోసపూరిత లావాదేవీలు చేసేలాా మనల్ని ప్రేరేపించేందుకు పదేపదే కొత్త మార్గాలకోసం వెతుకుతున్నారు.

PhonePeలో మోసాలను నివారించే ప్రయత్నాల గురించి, మోసంలోని రకాలు, వాటినుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనే దాని గురించి తెలుసుకునేందుకు ఈ కథనం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

PhonePeలో మోసపూరిత నివారణ ప్రయత్నాలు

PhonePeలో మీ లావాదేవీ అనుభవాన్ని అత్యంత సురక్షితమైనదిగా, భద్రమైనదిగా చేసే దిశగా మేము నిరంతరం కృషి చేస్తున్నాము. మోసగాళ్లకు అర్థం కాని రీతిలో ఉంచేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని బలమైన రిస్క్, మోస నివారణ ప్రక్రియలను మేళవిస్తున్నాము.

PhonePe ఖాతా & లావాదేవీ భద్రత: వేదికను భద్రమైనదిగా, సురక్షితమైనదిగా చేసేందుకు, మేము ఒక ఖాతా నుంచి వచ్చే అన్ని ఖాతాలను, లావాదేవీలను సరిచూస్తాము. ఈ మదింపులు వివిధ దశల్లో చేపట్టబడుతాయి. PhonePeలో కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే, వారి ఫోన్ నెంబర్ OTP ద్వారా సరి చూడబడుతుంది. అంతేకాక అన్ని UPI లావాదేవీలకూ ఒక MPIN / పాస్ వర్డ్ ఉంటుంది. కొత్త సాధనం నుంచి ఏదైనా లాగిన్ జరిగితే, OTP ధృవీకరణ ద్వారా సరిచూడబడుతుంది.

అనుమానాస్పద స్వభావాలను, సూచనలను కలిగిన హైరిస్క్ లావాదేవీలను కూడా వేదికను యాక్సెస్ చేసుకోనివ్వకుండా మేము బ్లాక్ చేస్తాము.

రిస్క్ దర్యాప్తులు: మా రిస్క్ దర్యాప్తుల బృందం వివిధ మార్గాల ద్వారా నివేదిస్తున్న మోసపూరిత సంఘటనలపై విచారణ చేపట్టి, కస్టమర్లు, వెండార్లు, భాగస్వాములు, బయటి ఏజెన్సీలకు సహాయాన్ని అందిస్తుంది. ఈ బృందం మోసపూరిత లావాదేవీలను ఛేదించడం ద్వారా మోసగాళ్ల నుంచి ఖచ్చితమైన రక్షణ అందించేదిగా కూడా నిలుస్తుంది.

మోసాన్ని నివారించేందుకు సాంకేతిక సామర్థ్యాలు: అన్ని మోసపూరిత లావాదేవీ వివరాలను లెక్కలోకి తీసుకునేలా IP, ప్రదేశాల మధ్య సమన్వయం తదితరాలు లాంటి తక్షణ సంకేతాలను అందుకుంటాము. అనుమానాస్పద యూజర్లను పట్టుకోవడం కోసం యూజర్ కార్యకలాపం, సాధనం, ఉపకరణం లాంటి చారిత్రక సమాచారాన్ని కూడా మేము పరిశీలిస్తాము.

చట్ట అమలు ఏజెన్సీలతో భాగస్వామ్యాలు: దేశవ్యాపాతంగా ఉన్న వివిధ చట్ట అమలు ఏజెన్సీల సైబర్ క్రైమ్ విభాగాలతో కలసి పని చేస్తాము. మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను అందుకోవడం, ఆ లావాదేవీలను ఛేదించడంపై సంబంధిత సమాచారాన్ని అందించడం ద్వారా మేము వారికి సహాయపడుతాము. అలాగే మోసపూరిత వినియోగదారులను PhonePeను యాక్సెస్ చేసుకోనివ్వకుండా నివారిస్తాము. మోసపూరిత వినియోగదారులుగా గుర్తించిన వారందరి వివరాలతో కూడిన నెగటివ్ డేటాబేస్‌ను కూడా మేము నిర్వహిస్తాము.

మోసాలను నివారించడానికి చేయాల్సినవి & చేయకూడనివి:

  • కార్డు నెంబర్, ముగింపు తేదీ, పిన్, OTP లాంటి రహస్య వివరాలను ఎవ్వరితోనూ పంచుకోకండి. PhonePe ప్రతినిధిమని చెబుతూ ఎవరైనా మిమ్మల్ని ఈ వివరాలు కావాలని కోరితే, దయచేసి ఇమెయిల్ పంపాల్సిందిగా వారిని కోరండి. @phonepe.com డొమైన్ నుంచి వచ్చే ఇమెయిళ్లకు మాత్రమే స్పందించండి.
  • PhonePeలో డబ్బు అందుకోవడానికి మీరు ‘పే’ చేయాల్సిన అవసరం కానీ, మీ UPI పిన్‌ను‌‌ ప్రవేశపెట్టాల్సిన అవసరం కానీ ఉండదని ఎప్పుడూ గుర్తుంచుకోండి.
  • స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లను‌‌ డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేయవద్దు.
  • గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితరాలలో PhonePe వినియోగదారు సేవా విభాగం నెంబర్ల కోసం శోధించకండి. PhonePe వినియోగదారు సేవా విభాగాన్ని సంప్రదించడానికి ఏకైక అధికార మార్గం https://phonepe.com/en/contact_us.html మాత్రమే.
  • వివిధ సామాజిక మాధ్యమ వేదికలలోని మా అధికారిక ఖాతాలలో మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.

ట్విట్టర్ హ్యాండిల్స్: https://twitter.com/PhonePe

https://twitter.com/PhonePeSupport

ఫేస్‌బుక్ ఖాతా : https://www.facebook.com/OfficialPhonePe/

వెబ్: support.phonepe.com

  • PhonePe సహాయ విభాగమని చెప్పుకుంటూ వచ్చే ధృవీకరించని మొబైల్ నెంబర్లకు కాల్ చేయడం లేదా స్పందించడం చేయవద్దు.

మోసగాళ్లు సంప్రదిస్తే, మీరు ఏం చేయాలి?

  • సంఘటన గురించి వెంటనే మీకు సమీపంలో ఉన్న సైబర్ క్రైమ్ కేంద్రానికి నివేదించి, సంబంధిత వివరాలు (ఫోన్ నెంబర్, లావాదేవీ వివరాలు, కార్డు నెంబర్, బ్యాంకు ఖాతా తదితరాలు)ను పోలీసులకు సమర్పించి, FIR దాఖలు చేయండి.
  • మీ PhonePe యాప్‌కు లాగిన్ అయి, ‘సహాయం’కు వెళ్లండి. ‘ఖాతా భద్రత సమస్య/మోసపూరిత కార్యకలాపాన్ని నివేదించండి’ కింద మోసపూరిత సంఘటనను మీరు నివేదించవచ్చు.

వివిధ రకాల మోసాల గురించి క్లుప్తంగా తెలుసుకుందామా:

నగదు అభ్యర్థన మోసం : ‘అభ్యర్థన’ ఫీచర్ పేమెంట్ అభ్యర్థనను పంపేందుకు ప్రజలను అనుమతిస్తుంది. ‘పే’ బటన్ క్లిక్ చేసి, మీ UPI పిన్ ప్రవేశపెట్టడం ద్వారా మరో వినియోగదారుకు మీరు డబ్బును పంపించవచ్చు. డబ్బు అందుకోవడం కోసం మీ

‘నగదు అందుకోవడం కోసం మీ UPI పిన్ ప్రవేశపెట్టండి, “పేమెంట్ విజయవంతమైంది. ₹. Xxx అందుకోండి” తదితరాలు లాంటి సందేశాలతో నకిలీ పేమెంట్ అభ్యర్థనలను పంపించడం ద్వారా మోసగాళ్లు ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తారు.

నగదు అభ్యర్థన మోసం గురించి మరిన్ని వివరాలను ఇక్కడ చదవండి.

నగదు అందుకునే మోసం కోసం QR కోడ్ స్కాన్: మోసగాళ్లు వాట్సాప్ లాంటి మల్టీమీడియా యాప్‌ల ద్వారా ఒక QR కోడ్ పంచుకుంటారు. నగదు అందుకోవడం కోసం QR కోడ్‌ను స్కాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్ ఏదీ లేదని గుర్తుంచుకోండి. దయచేసి ఇలాంటి అభ్యర్థనలపై ముందుకు సాగవద్దు. అలాగే వీటిని పంపిన వారి నెంబర్ మరియు ఇతర వివరాలను నివేదించండి.

థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్ మోసం: లావాదేవీ విషయంలో మీరు ఎదుర్కుంటున్న సమస్యలను హైలైట్ చేసేందుకు వినియోగదారులు తరచూ సామాజిక మాధ్యమ మార్గాలను ఉపయోగిస్తారు. కంపెనీ ప్రతినిధులమని చెప్పుకుంటూ మోసగాళ్లు వినియోగదారులకు కాల్ చేయడం లేదా సంప్రదించడం చేస్తారు. స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని వాళ్లు వినియోగదారులను కోరుతారు. ఫోన్ కెమెరా ముందు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును పెట్టాలని కోరుతారు. తద్వారా “PhonePe ధృవీకరణ వ్యవస్థ” ఆ వివరాలను స్కాన్ చేసుకోగలదు. కార్డువివరాలను అందుకున్న వెంటనే, మోసగాళ్లు నిధులను తమ సొంత ఖాతాకు బదిలీ చేసుకునేందుకు OTP SMSను అందుకుంటారు.

థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్ల మోసం గురించి మరింత తెలుసుకోండి.

ట్విట్టర్ మోసం: అసలు PhonePe customer care handle లో వినియోగదారులు పోస్ట్ చేస్తున్న అంశాలను (క్యాష్ బ్యాక్ అందుకోవడం, నగదు బదిలీలు తదితరాలకు సంబంధించిన ట్వీట్లు) మోసగాళ్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ, వెంటనే స్పందిస్తారు. PhonePe హెల్ప్‌లైన్ నెంబర్లు అంటూ నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లను ట్వీట్ చేయడాన్ని వినియోగదారులను మాయ చేయడం కోసం వారు ఉపయోగించే ఎత్తుగడలలో ఒకటిగా నిలుస్తోంది. కస్టమర్లు ఈ నకిలీ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి, కార్డు మరియు OTP వివరాలను పంచుకుంటారు.

ట్విట్టర్ మోసాల గురించి మరింత చదవండి.

డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు లేదా టాప్-అప్ మోసం: ఇలాంటి సందర్భాల్లో, మోసగాళ్లు మీ బ్యాంకు లేదా RBI లేదా ఇ-కామర్స్ సైట్ లేదా చివరకు ఒక లాటరీ పథకం ప్రతినిధులమని చెప్పుకుని మీకు కాల్ చేస్తారు. మీ 16 అంకెల కార్డు నెంబర్, CVVని పంచుకోవాలని మిమ్మల్ని వారు కోరవచ్చు. దీంతో మీరు SMS రూపంలో OTPని అందుకుంటారు. మోసగాళ్లు మీకు తిరిగి కాల్ చేసి, ధృవీకరణ ప్రయోజనాల కోసం ఈ OTPని కోరుతారు. మీరు ఈ వివరాలను పంచుకున్న వెంటనే, మీ ఖాతా నుంచి డబ్బు మోసగాళ్ల వాలెట్‌కు టాప్-అప్ చేయబడుతుంది.

టాప్-అప్ మోసాల గురించి మరింత చదవండి.

సోషల్ ఇంజనీరింగ్ మోసం: సోషల్ ఇంజనీరింగ్ అనేది తమను నమ్మించేలా మిమ్మల్ని మాయ చేసేందుకు మీ వ్యక్తిగత వివరాలను మోసగాళ్లు ఉపయోగించుకునేటప్పుడు సోషల్ ఇంజనీరింగ్ మోసం జరుగుతుంది. మీ బ్యాంకుకు చెందిన వినియోగదారు సేవా విభాగానికి చెందిన వారమని చెప్పుకుని, మోసగాళ్లు మీకు కాల్ చేస్తారు. మీ నమ్మకాన్ని పొందడం కోసం సామాజిక మాధ్యమంలో మీరు పంచుకున్న వివరాలను (పుట్టిన తేదీ, ప్రదేశం తదితరాలను) వారు ఉపయోగించుకుంటారు. తద్వారా మీ సున్నితమైన బ్యాంకు ఖాతా లేదా కార్డు సమాచారాన్ని పంచుకోవాలని కోరుతారు. ఆ తర్వాత లావాదేవీని పూర్తి చేయడం కోసం OTPని అందించాలని కోరుతారు. తద్వారా మీ డెబిట్ కార్డును ఉపయోగించి వారి వాలెట్‌ను టాప్ అప్ చేసుకుంటారు.

సోషల్ ఇంజనీరింగ్ మోసాల గురించి మరింత చదవండి.

SIM మార్పిడీ మోసం: SIM మార్పిడీ అవకతవకల్లో మీ వ్యక్తిగత వివరాలను ఉపయోగించుకుని, మీ పోన్ నెంబర్ కోసం మోసగాళ్లు కొత్త సిమ్ కార్డును అందుకుంటారు. ఇలా చేయడం ద్వారా వారు మీ బ్యాంకు ఖాతానుంచి పేమెంట్లను అంగీకరింపజేసుకోవడం కోసం అవసరమైన OTPలకు యాక్సెస్ కూడా పొందుతారు. మీ మొబైల్ ఆపరేటర్‌గా చెప్పుకుని, మోసగాళ్లు మీకు కాల్ చేస్తారు. మీ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు SMSను ఫార్వార్డ్ చేయాలని కోరుతారు. ఈ SMS కొత్త సిమ్ వెనుక వైపున ఉన్న 20 అంకెల నెంబర్‌ను కలిగి ఉంటుంది. ఈ SMS మీ ప్రస్తుత సిమ్‌ను డీయాక్టివేట్ చేసి, డూప్లికేట్ సిమ్‌ను‌‌‌‌ యాక్టివేట్ చేస్తుంది.

స్విమ్ మార్పిడీ మోసం గురించి మరింత చదవండి.

Keep Reading