PhonePe Blogs Main Featured Image

Trust & Safety

లాటరీ స్కామ్‌లను అర్థం చేసుకోవడం, గుర్తించడం, వాటినుండి తప్పించుకునే విధానం

PhonePe Regional|2 min read|12 December, 2023

URL copied to clipboard

లాటరీవైపే కన్నెత్తి చూడని మీకు ఆశ్చర్యం కలిగించే రీతిలో ఒక లాటరీలో జాక్‌పాట్‌ను కొట్టారని పేర్కొంటూ, ఒక ఉత్సాహభరితమైన ఇమెయిల్ లేదా ఫోన్ కాల్‌ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా! అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది: మీ బహుమతిని క్లెయిమ్ చేయడానికి, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కొంత మొత్తాన్ని చెల్లించాలని వారు కోరుతారు. ఇది విల్లీ వోంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి గోల్డెన్ టిక్కెట్‌ను గెలుచుకోవడం లాంటిది, చాక్లెట్ ఉచితం కాదని తెలుసుకోవడానికి మాత్రమే – మీరు ముందస్తుగా చెల్లించాలి!

లాటరీ స్కామ్ అంటే ఏమిటి?

లాటరీ స్కామ్ అనేది ఒక రకమైన మోసం, ఇది ఊహించని రీతిలో వచ్చే ఇమెయిల్ నోటిఫికేషన్, ఫోన్ కాల్ లేదా మెయిల్‌తో మొదలవుతుంది. మీరు లాటరీ టిక్కెట్‌లో పెద్ద మొత్తంలో డబ్బును గెలుచుకున్నారని వివరిస్తూ, నిర్దిష్ట ఫోన్ నంబర్ లేదా ఏజెంట్ ఇమెయిల్ చిరునామాను సంప్రదించమని కోరుతుంది. వాస్తవంగా ఆ ఫోన్ నెంబర్ లేదా ఇమెయిల్ చిరునామా మోసగాడికి చెందినది. ఏజెంట్‌ను సంప్రదించిన తర్వాత, లాటరీ బహుమతిని అందుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించమని బాధితులను కోరుతుంది.

ప్రమాద హెచ్చరికలు

స్కామ్‌ను జరగవచ్చనే పరిస్థితుల్లో వాటిని గుర్తించడంలో సహాయపడే కొన్ని ప్రమాద హెచ్చరికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి, మీరు జాగ్రత్తగా ఉండటానికి, ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇవి సహాయపడతాయి:

 • అయాచిత నోటిఫికేషన్‌లు: మీరు ఏ లాటరీలోనూ చురుగ్గా పాల్గొనకుండానే లాటరీ నోటిఫికేషన్‌లను వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు ప్రవేశించకనే లాటరీని గెలుపొందడం గురించి మీరు విన్నట్లయితే, మరింత జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా, మీరు లాటరీలో ఇష్టపూర్వకంగా చేరినప్పుడు మాత్రమే చట్టబద్ధమైన విజయాలు లభిస్తాయి. 
 • ముందస్తు పేమెంట్లు: విశ్వసనీయమైన లాటరీలు ఏవీ ముందస్తుగా ఫీజు చెల్లించమని విజేతలను కోరవు. మీరు నిజంగా లాటరీ గెలిచి ఉంటే, మీ బహుమతిని క్లెయిమ్ చేసుకునే ముందు ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు బహుమతి గెలిచారు, కానీ ముందస్తుగా డబ్బు చెల్లించాలని ఎవరైనా కోరితే, మీరు చట్టబద్ధంగా లాటరీ గెలవలేదనడానికి అది ఒక సంకేతం. 
 • నిజం అయితే చాలా మంచిదే: ఇది నిజం కావడం చాలా బాగుంది అని అనిపిస్తే, అది బహుశా అలాగే కావచ్చు. మీరు ఆ విషయం విని, ఎగిరి గంతులేసే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.
 • తొందరపెట్టే యుక్తులు: వారు త్వరగా పని చేయమని ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండండి. బాధితులను ఎక్కువగా ఆలోచింపనివ్వకుండా లేదా సలహా తీసుకోనివ్వకుండా నిరోధించడానికి స్కామర్‌లు తరచుగా ఈ తొందరపెట్టే యుక్తులను ఉపయోగిస్తారు.
 • సరిపోలని సంప్రదింపు సమాచారం: మీకు అందించిన సంప్రదింపు వివరాలు లాటరీ నిర్వాహకులు అని భావించే వారి అధికారిక సమాచారంతో సరిపోలలేదా అని చెక్ చేయండి. చట్టబద్ధమైన లాటరీలు నిలకడైన, ఖచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి.
 • వ్యాకరణ దోషాలు: అధికారిక కమ్యూనికేషన్ లో వ్యాకరణ, స్పెల్లింగ్ దోషాలపై శ్రద్ధ పెట్టండి. నిజమైన సంస్థలు సాధారణంగా తమ ఉత్తర, ప్రత్యుత్తరాలలో ఒక ప్రొఫెషనల్ ప్రమాణాన్ని అనుసరిస్తుంటాయి.
 • రహస్య పేమెంట్ పద్ధతులు: గిఫ్ట్ కార్డులు లేదా బ్యాంకు ఖాతాల మధ్య నేరుగా జరిగే బదిలీలు లాంటి అసాంప్రదాయ లేదా గుర్తు పట్టని పద్ధతుల ద్వారా పేమెంట్ చేయాలని వారు బలవంతపెడితే, అది చాలావరకు స్కామ్ గానే ఉంటుంది. విశ్వసనీయ సంస్థలు సురక్షితమైన, పారదర్శకమైన పేమెంట్ పద్ధతులను ఉపయోగిస్తాయి.
 • అధికారిక వెబ్‌సైట్ లేదు: అధికారిక వెబ్‌సైట్ లేకపోవడం అనేది ఒక ప్రమాద హెచ్చరిక. స్థిరపడిన లాటరీలు సాధారణంగా సమాచారాన్ని అందించడానికి, వాటి చట్టబద్ధతను ధృవీకరించడానికి ప్రొఫెషనల్ ఆన్‌లైన్ ఉనికిని కలిగి ఉంటాయి.
 • ఫిర్యాదులు ఉన్నాయా అని చెక్ చేయండి: లాటరీ సంస్థకు సంబంధించి ఏవైనా స్కామ్‌లు లేదా ఫిర్యాదులు ఉన్నాయా అని ఆన్‌లైన్‌లో చూడండి. ఇతరులు స్కామ్‌కు గురైనట్లయితే, మీరు కూడా స్కామ్ చేయబడేందుకు చాలావరకు అవకాశం ఉంది.
 • అనవసరమైన వ్యక్తిగత సమాచారం: మీ బ్యాంక్ వివరాలు లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్ లాంటి అనవసరమైన వ్యక్తిగత సమాచారం కోరితే అప్రమత్తంగా ఉండండి. చట్టబద్ధ లాటరీలు వేటికీ బహుమతులు అందించడానికి విస్తృతమైన వ్యక్తిగత సమాచారం అవసరం లేదు.

మీరు ఒక లాటరీ స్కామ్ బాధితులైతే ఎలా ఫిర్యాదు చేయాలి:

ఒక లాటరీ స్కామ్ లో మీరు బాధితులు అయినట్టు అనుమానం వస్తే, ఎక్కువ నష్టం జరుగకుండా దాని ప్రభావాన్ని తగ్గించడానికి, భవిష్యత్తు నష్టాలను నివారించడానికి వెంటనే చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన చర్యలు కింద ఇవ్వబడ్డాయి:

 • PhonePe యాప్: సహాయ విభాగానికి వెళ్లి, “ఇతరాలు” కింద ఒక సమస్యను లేవనెత్తండి. సంఘటనను నివేదించడానికి ‘ఖాతా భద్రత & మోసపూరిత కార్యకలాపాన్ని ఎంచుకుని, సరైన ఆప్షన్ ఎంచుకోండి.
 • PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు ఒక సమస్యను లేవనెత్తడానికి PhonePe కస్టమర్ కేర్ విభాగానికి 80–68727374/022–68727374లో కాల్ చేయవచ్చు. ఆ తర్వాత కస్టమర్ కేర్ విభాగం ఏజెంట్ టికెట్ లేవనెత్తి, మీ సమస్య విషయంలో సహాయపడుతారు.
 • వెబ్‌ఫారం సమర్పణ: మీరు PhonePe వెబ్‌ఫారం, https://support.phonepe.com/ను ఉపయోగించి కూడా సమస్యను లేవనెత్తవచ్చు.
 • సోషల్ మీడియా: మీరు PhonePe సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా కూడా మోసపూరిత సంఘటనలపై ఫిర్యాదు చేయవచ్చు
  • ట్విటర్ — https://twitter.com/PhonePeSupport
  • ఫేస్‌బుక్ — https://www.facebook.com/OfficialPhonePe
 • సమస్య: మీ ప్రస్తుత ఫిర్యాదుపై సమస్య ఏర్పడితే దానిపై ఫిర్యాదు చేసేందుకు మీరు https://grievance.phonepe.com/కు లాగిన్ అయి, గతంలో లేవనెత్తిన టికెట్ ఐడిని పంచుకోండి.
 • సైబర్ సెల్: చివరగా, మీరు మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రెమ్ సెల్ వద్ద మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/లో అన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు రిజిస్టర్ చేయవచ్చు లేదా 1930లో సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎన్నడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను కోరదు. phonepe.com డొమైన్ నుండి రాకుంటే PhonePe వచ్చినట్టు పేర్కొనే ఏ మెయిల్‌లనూ పట్టించుకోవద్దు. మోసం జరుగుతున్నట్టు అనుమానం వస్తే, దయచేసి వెంటనే సంస్థ అధికారులను సంప్రదించండి.

Keep Reading