
Trust & Safety
కొత్త బెనిఫిషియరీలకు పేమెంట్లు చేసేటప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను అర్థం చేసుకోండి
PhonePe Regional|3 min read|17 September, 2026
మీరు సోషల్ మీడియాలో వస్తువులు కొనుగోలు చేసే ఒక బయర్-సెల్లర్(కొనుగోలుదారు-విక్రేత) గ్రూప్‌లో ఉన్నారనుకోండి. మీరు ఒక మంచం కావాలని ఒక పోస్ట్ పెట్టారు. కొన్ని నిమిషాల్లోనే, ఆ గ్రూప్‌లో లేని ఒక వ్యక్తి నుండి మీకు మెసేజ్ వస్తుంది. మీ అవసరానికి సరిగ్గా సరిపోయే మంచం తన వద్ద ఉందని అని చెబుతాడు. ఆ వ్యక్తి మీకు కాల్ చేసి, కొనేందుకు వేరేవాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారని, వెంటనే పేమెంట్ చేయాలని పట్టుబడతారు. మీరు అతనితో మాట్లాడి సగం అమౌంట్ అడ్వాన్స్‌గా, మిగిలినది మంచం డెలివరీ అయ్యాక ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. అడ్వాన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి వారు ఒక నంబర్ షేర్ చేస్తారు. మీరు PhonePeలో డబ్బులు పంపడానికి ట్రై చేసినప్పుడు, యాప్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా పేమెంట్ చేసేస్తారు.
ఇలాంటి లేదా దీనికి సమానమైన పరిస్థితిలో ఏం తప్పు జరగవచ్చు?
మనం తరచుగా కొత్త బెనిఫిషియరీలకు ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉంటాం. కాబట్టి కొత్తగా ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అర్థం చేసుకోవడం వల్ల, మీరు సాధ్యమయ్యే మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటూ మీ డిజిటల్ పేమెంట్ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది: తొందరపెట్టడం మరియు దుర్వినియోగం చేయడం
- నకిలీ అత్యవసర పరిస్థితిని సృష్టించడం: స్కామర్లు నకిలీ అత్యవసర పరిస్థితులని సృష్టిస్తారు. ఆఫర్ సమయం అయిపోతోందని, సర్వీస్ స్లాట్ చేజారిపోతుందని లేదా అత్యవసరంగా రీఫండ్ వస్తుందని వారు మిమ్మల్ని నమ్మేలా చేస్తారు. ఈ అత్యవసర పరిస్థితి మిమ్మల్ని సాధారణ జాగ్రత్తలను మరచిపోయేలా చేసి, వెంటనే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.
- సెక్యూరిటీ అలర్ట్‌లను పక్కన పెట్టించడం: డబ్బులు వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయాలని స్కామర్లు సృష్టించే నకిలీ హడావుడి వల్ల, యూజర్లు తమ స్వంత విచక్షణను పక్కన పెట్టి, PhonePe యాప్‌లోని ముఖ్యమైన సెక్యూరిటీ వార్నింగ్‌లను విస్మరిస్తారు.
- అన్-వెరిఫైడ్ సెల్లర్లు(విక్రేతలు) పూర్తి పేమెంట్ ముందే అడగడం: ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ యాప్‌లలో ఉండే అన్-వెరిఫైడ్(గుర్తింపు లేని) ఆన్‌లైన్ సెల్లర్లు వస్తువులు లేదా సర్వీస్‌లను పంపడానికి ముందే పూర్తి పేమెంట్ చేయాలని పట్టుబడతారు. ఒకసారి ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక, వారు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా మాయమైపోవడానికి ఇది అవకాశం ఇస్తుంది.
ఒక్క చిన్న పొరపాటు వల్ల జరిగే అసలు నష్టం
- ఇన్‌స్టంట్ పేమెంట్లు: మీ ఆర్థిక భద్రతను కాపాడుకోవడమే అత్యంత ముఖ్యం – మీరు ఒక్కసారి UPI పిన్ ఎంటర్ చేస్తే, ఆ ట్రాన్స్‌ఫర్ పూర్తయినట్లేనని మరియు పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందడం చాలా కష్టమని, కొన్నిసార్లు అసాధ్యమని గ్రహించాలి.
- ఆర్థిక నష్టం: ఉనికిలో లేని సర్వీస్‌లు, నకిలీ వస్తువులు లేదా మోసపూరిత ప్రాసెసింగ్ ఫీజుల పేరిట డబ్బులు పోగొట్టుకోవడం చాలా బాధాకరం. పైగా ఆ డబ్బుని తిరిగి పొందే మార్గం దాదాపుగా ఉండదు.
సురక్షితమైన ట్రాన్సాక్షన్ల కోసం పాటించాల్సిన ఆచరణాత్మక నియమాలు
- తొందరపెట్టడాన్ని ఎల్లప్పుడూ ఒక హెచ్చరికగా భావించండి: అసలైన వ్యాపారాల వారు లేదా వ్యక్తులు వివరాలను వెరిఫై చేసుకోవడానికి మీకు సమయం ఇవ్వకుండా, వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయాలని ఎప్పుడూ ఒత్తిడి చేయరు. తొందరపెట్టడమే మొదటి మరియు స్పష్టమైన డేంజర్ సిగ్నల్.
- ప్రతిసారీ పేరును సరిచూసుకోండి: పే బటన్ ప్రెస్ చేసే ముందు, కన్ఫర్మేషన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న రిజిస్టర్డ్ పేరును గమనించండి. మీరు ఎవరికి లేదా ఏ బిజినెస్‌కి అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ పేరుతో ఇది మ్యాచ్ కాకపోతే, మీరు ఆ ట్రాన్సాక్షన్‌ను వెంటనే ఆపేయవచ్చు.
- సాధారణ మానవ తప్పిదాలను/స్పెల్లింగ్ పొరపాట్లను పరిగణనలోకి తీసుకోండి: UPI ద్వారా పంపే డబ్బు క్షణాల్లో అవతలి వారికి చేరిపోతుంది మరియు దాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే మొదటిసారి పేమెంట్ చేసేటప్పుడు వివరాలను రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
- డబ్బులు అందుకోడానికి ఎలాంటి చర్య అవసరం లేదు: ఇది చాలా సింపుల్ విషయం – మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు అందుకోవడానికి మీరు ఎలాంటి QR కోడ్‌ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, UPI పిన్ ఎంటర్ చేయనవసరం లేదు, లేదా ఫోన్ OTPని షేర్ చేయాల్సిన పనిలేదు.
- యాప్ పాప్-అప్‌లు మరియు నోటిఫికేషన్‌లను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు: మీ పేమెంట్ యాప్ ఏదైనా అకౌంట్‌ను హై-రిస్క్ అని లేదా కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ అని ఫ్లాగ్ చేస్తే, ఆ వార్నింగ్‌ను క్లోజ్ చేయకుండా ఆగి ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. PhonePe వంటి యాప్‌లు హై-రిస్క్ నంబర్లు, స్పామ్ ట్యాగ్‌లు లేదా కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ల కోసం పాప్-అప్ వార్నింగ్‌లను చూపిస్తాయి.
- మొదటిసారి బెనిఫిషియరీలకు ఎప్పుడూ పూర్తి అమౌంట్ చెల్లించవద్దు: పేమెంట్లు చేసేటప్పుడు, విడతలవారీగా పేమెంట్ చేసేందుకు, డెలివరీ సమయంలో పేమెంట్ చేసేందుకు అడగండి లేదా స్పష్టమైన బయర్ ప్రొటెక్షన్ పాలసీలను అందించే గుర్తింపు పొందిన ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించండి.
ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు అనుమానాస్పదంగా అనిపించే అనేక సంకేతాలు ముందే కనిపిస్తాయి – సరైన సమాచారంతో సిద్ధంగా ఉండటం మరియు తదుపరి ఏం చేయాలో తెలుసుకోవడమే ఇక్కడ కీలకం!
మీరు మోసానికి గురైతే ఏమి చేయాలి
మీరు ఏమైనా మోసానికి గురయ్యారని అనుమానం వస్తే, వెంటనే ఫిర్యాదు చేయండి. ప్రతి క్షణం చాలా విలువైనది.
PhonePeలో రిపోర్ట్ చేయడం:
- PhonePe కస్టమర్ కేర్: 080-68727374 / 022-68727374 నంబర్లకు కాల్ చేయండి.
- లాగిన్ స్థాయి సమస్యలు : https://support.phonepe.com/ ద్వారా టికెట్‌ను రైజ్ చేయండి
- సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి:
- Twitter: PhonePe Support
- Facebook: PhonePe Official
- ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.
అధికారులకు రిపోర్ట్ చేయండి:
- సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా 1930కు కాల్ చేయండి.
- టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా WhatsApp/Telegram మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.
ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్స్‌ను విస్మరించండి. మీరు మోసపోయారని భావిస్తే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.
