Investments
అధిక లాభం పొందడానికి సులువైన మార్గం!
PhonePe Regional|2 min read|26 July, 2021
స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులున్నా మదుపు చేయడం కొనసాగించండి
స్టాక్ మార్కెట్ పరిస్థితులను అంచనా వేయడం అసాధ్యమే, కానీ దీర్ఘకాల మదుపులు చేసి ఓపికగా వాటి మీద ఆధారపడటం ద్వారా మంచి లాభాలను పొంది, మీ ఆస్తిని పెంపొందించుకోవచ్చు.
ఈక్విటీ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వృద్ధిని అందించే ఫండ్స్ మీద మీరు మదుపు చేసినప్పుడు, ఆ మదుపు వల్ల వచ్చే లాభాలనేవి, మదుపు చేసిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాల మీద ఎంతగానో ఆధారపడతాయి. మార్కెట్‌లో కలిగే తాత్కాలిక హెచ్చుతగ్గుల వల్ల ప్రభావితం కాకుండా ఉండటం అలవాటు చేసుకుని, దీర్ఘకాలం పాటు మదుపు చేయండి.
ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వారిలో నాలుగో వ్యక్తి అయిన అమెరికన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఇలా అన్నారు, “స్టాక్ మార్కెట్ అనేది ఓపిక లేని వారి దగ్గరి నుండి ఓపిక ఉన్న వారికి డబ్బును బదిలీ చేసే ఒక పరికరం.”
దీర్ఘకాలిక మదుపు వల్ల కలిగేే ప్రయోజనాలను తెలియజేసే ఒక ఉదాహరణను ఇక్కడ చేర్చాము.
కింద చూపినట్లుగా 4 గ్రూప్‌లకు చెందిన ఈక్విటీ ఫండ్ ఇన్వెస్టర్‌లు ఉన్నారనుకుందాం.
- గ్రూప్ 1: 3 నెలల పాటు మదుపు
- గ్రూప్ 2: 1 ఏడాది పాటు మదుపు
- గ్రూప్ 3: 5 ఏళ్ల పాటు మదుపు
- గ్రూప్ 4: 10 ఏళ్ల పాటు మదుపు
వీరిలో ప్రతి ఇన్వెస్టర్ ₹10,000లను వివిధ కాలాల్లో మదుపు చేశారనుకుందాం. ఇప్పుడు, ఒక్కొక్కరి మదుపు కాలం ముగిసే నాటికి, వారు మదుపు చేసిన ₹10,000 మొత్తం సగటున ఎంతగా వృద్ధి అవుతుందో చూద్దాం.
ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకున్న ఇతర ముఖ్యాంశాలు:
10 ఏళ్ల పాటు మదుపు చేసిన వారిలో 50% కంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్‌లు వారు మదుపు చేసిన మొత్తానికి నాలుగు రెట్లు సంపాదించారు, అలాగే 98% మంది ఇన్వెస్టర్‌ల డబ్బు 10 ఏళ్ల కాలంలో కనీసం రెండు రెట్లు అయింది.
కేవలం 3 నెలల పాటు మాత్రమే మదుపు చేసిన ఇన్వెస్టర్‌లలో, 1/3వ వంతు మంది నష్టాలు చవిచూశారు, కేవలం 10% మంది ఇన్వెస్టర్‌లు మాత్రమే 20% కంటే ఎక్కువగా కచ్చితమైన లాభాలు పొందగలిగారు.
నేర్చుకున్న అంశం: దీర్ఘకాలం మదుపు చేసిన ఇన్వెస్టర్‌లు కచ్చితంగా తమ ఆస్తులను గణనీయమైన స్థాయిలో పెంచుకోగలిగారు. మీరు ఎంత ఎక్కువ కాలం మదుపు చేస్తే, అంత ఎక్కువగా మీరు లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ఈక్విటీ లేదా హైబ్రిడ్ ఫండ్స్ లాంటి వృద్ధి సంబంధ ఫండ్‌లలో మదుపు చేసి & ఎక్కువ కాలం పాటు (కనీసం 5 ఏళ్లు) మదుపు చేస్తూనే ఉండండి. దీర్ఘకాలం పాటు మదుపు చేయడం వల్ల, మీ డబ్బు నిరంతరంగా పెరిగి, పెద్దమొత్తంలో కచ్చితమైన లాభాలు గడించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు పథకానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను చదవండి.
PhonePe Wealth Broking Private Limited | AMFI — రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ARN- 187821.