Privacy Policy

PHONEPE UPI వినియోగ నియమాలు

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াবাংলাहिन्दीಕನ್ನಡଓଡ଼ିଆ
< Back
  • పరిచయం
  • నిర్వచనాలు
  • రిజిస్ట్రేషన్
  • NRE/NRO బ్యాంక్ అకౌంట్​తో లింక్ చేసిన UPI
  • యూజర్ బాధ్యతలు, కర్తవ్యాలు
  • PhonePe UPI ద్వారా పేమెంట్లు
  • UPI - OS నేటివ్ బయోమెట్రిక్ అథెంటికేషన్
  • UPI ఇంటర్నేషనల్
  • UPI ఫారిన్ ఇన్‌వార్డ్‌ రెమిటెన్స్
  • UPI Lite
  • UPI - ATM - ఇంటరాపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్
  • PhonePe UPI ద్వారా క్రెడిట్ లైన్
  • UPI సర్కిల్
  • UPI ఆటోపే, రిజర్వ్ పే
  • ఛార్జీలు
  • లావాదేవీ పర్యవేక్షణ
  • ఫిర్యాదుల పరిష్కారం
  • నష్టపరిహారం & బాధ్యత
  • రద్దు చేయడం, ఇతర చర్యలు
  • పాలక చట్టం & న్యాయ పరిధి
  • బాధ్యతా నిరాకరణలు

ఈ డాక్యుమెంట్‌ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, అలానే దాని కింద రూపొందించిన నియమాలు, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం సవరించిన వివిధ చట్టాలలోని ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు / రికార్డులకు సంబంధించి సవరించిన నిబంధనల ప్రకారం రూపొందించిన ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ రూపంలోని ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్. ఈ డాక్యుమెంట్‌ను PhonePe సాధారణ నియమ, నిబంధనలు (“నియమాలు”)తో కలిపి చదవాలి. వీటికే పరిమితం కాకుండా, ఇందులో PhonePe గోప్యతా విధానం (“గోప్యతా విధానం”), PhonePe ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచిన ఇతర పాలసీలు/నియమ, నిబంధనలు ఉంటాయి, వీటిని ఎప్పటికప్పుడు సవరించవచ్చు. ఇందులో ఉపయోగించిన క్యాపిటలైజ్డ్ పదాలకు, వాటికి వేరే నిర్వచనాలు ఇవ్వకపోతే, వాటికి కేటాయించిన అర్థాలే వాడుకలో ఉంటాయి.

పరిచయం

arrow icon

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (“UPI”) అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్మించిన ఒక పేమెంట్ ప్లాట్‌ఫామ్‌. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లు/పేమెంట్ అకౌంట్ల (కింద వాటి నిర్వచనం ఇచ్చాము) మధ్య తక్షణమే ఆన్‌లైన్ పేమెంట్లకు అనుమతించే పలు అంశాలలో ఇది ఒకటి. ఈ ఆన్‌లైన్ పేమెంట్లను సులభతరం చేయడానికి UPI ఒక ఆర్కిటెక్చర్, ప్రామాణిక API స్పెసిఫికేషన్ల సమితిని అందిస్తుంది. ఇది ఇంటరాపరేబిలిటీని (ఒకదానితో ఒకటి అనుసంధానమైన పనిచేయడం), మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, అన్ని NPCI సిస్టమ్‌లలో సరళమైన, ఒకే రకమైన ఇంటర్‌ఫేస్‌ను అందించే లక్ష్యంతో పనిచేస్తుంది.

ఈ PhonePe UPI వినియోగ నియమ, నిబంధనలు (“UPI వినియోగ నియమాలు”) అనేవి UPI కింద జరిగే పేమెంట్లను నియంత్రిస్తాయి, ఈ UPI అనేది 2008లో స్థాపితమైన ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్, ఈ పేమెంట్‌ సర్వీస్‌ ప్లాట్‌ఫామ్‌ను NPCI అభివృద్ధి చేసింది, ఇది UPI సర్వీస్‌లకు సెటిల్‌మెంట్/క్లియరింగ్ హౌస్/రెగ్యులేటరీ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. PhonePe యాప్ (కింద దీని నిర్వచనం ఇచ్చాము) అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్, ఇది UPIకి కనెక్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్‌ను నోటిఫై చేసిన పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు/PSP/PSP బ్యాంక్‌లు (కింద వీటి నిర్వచం ఇచ్చాము) ద్వారా PhonePe లిమిటెడ్ (గతంలో PhonePe ప్రైవేట్ లిమిటెడ్​ అని పిలిచేవారు) (“PhonePe/ మేము/ మా/ మాది”) అందిస్తోంది, కంపెనీల చట్టం, 1956 కింద రిజిస్టర్ అయిన ఈ కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం ఆఫీస్-2, ఫ్లోర్ 5, వింగ్ A, బ్లాక్ A, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, బెల్లందూర్ విలేజ్, వర్తూర్ హోబ్లి, ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు సౌత్, బెంగళూరు, కర్ణాటక, ఇండియా, 560103 చిరునామాలో ఉంది. “PhonePe” (“PhonePe UPI”) బ్రాండ్ పేరుతో ఈ UPI సర్వీస్‌లు అందుతున్నాయి.

PhonePe అనేది స్పాన్సర్ PSP బ్యాంక్‌లు అయిన Yes బ్యాంక్‌ లిమిటెడ్., యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్., ICICI బ్యాంక్‌ లిమిటెడ్. ద్వారా పేమెంట్లను సులభతరం చేయడానికి NPCI నుండి అధికారం పొందిన TPAP (కింద దీని నిర్వచనం ఇచ్చాము). PhonePe అనేది UPI పేమెంట్ వ్యవస్థలో ఒక సర్వీస్‌ ప్రొవైడర్‌, అలానే PSP బ్యాంక్‌ల ద్వారా UPIలో పాల్గొంటుంది.

సాధారణ నియమాలు లేదా ఈ UPI వినియోగ నియమాల మధ్య ఏదైనా వైరుధ్యం ఏర్పడితే, ఆ వైరుధ్యం ఉన్న మేరకు ఈ UPI వినియోగ నియమాలు మాత్రమే తుదిగా అమలవుతాయి. మేము ఎప్పుడైనా PhonePe వెబ్‌సైట్(లు) మరియు/లేదా PhonePe యాప్(ల)లో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను పోస్ట్ చేసి UPI వినియోగ నియమాలను సవరించవచ్చు. అప్‌డేట్ చేసిన ఈ UPI వినియోగ నియమాల వెర్షన్‌ను పోస్ట్ చేసిన వెంటనే, అవి అమల్లోకి వస్తాయి. PhonePe UPI సర్వీస్‌లను ఉపయోగించడం కోసం, అప్‌డేట్‌లు / మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ UPI వినియోగ నియమాలను సమీక్షించడం మీ బాధ్యత. “మీరు”, “మీది”, “మీ”, “ఎండ్ యూజర్”, “కస్టమర్”, “యూజర్” అంటే PhonePe యాప్‌తో పేమెంట్లు చేయడానికి, అందుకోవడానికి PhonePe UPIని ఉపయోగించే వ్యక్తి అని అర్థం.

నిర్వచనాలు

arrow icon

“వర్తించే చట్టం” అంటే ఫారిన్ ఎక్స్‌ఛేంజ్‌ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 (“FEMA”), NPCI రూపొందించిన మార్గదర్శకాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (“RBI”) లేదా UPI సర్వీస్‌ల షరతులకు సంబంధించి పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్లకు వర్తించే ఏదైనా రెగ్యులేటర్ జారీ చేసిన మార్గదర్శకాలతో సహా అన్ని వర్తించే చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలు, చట్టబద్ధమైన లేదా ప్రభుత్వ నోటిఫికేషన్లు, అలానే పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్లు జారీ చేసిన వర్తించే నియమ, నిబంధనలు అని అర్థం.

“బ్యాంక్ అకౌంట్ / పేమెంట్ అకౌంట్” అంటే రెగ్యులేటెడ్ ఎంటిటీ (నియంత్రిత సంస్థ) అందించే ఏదైనా బ్యాంక్ అకౌంట్ లేదా ఇతర పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌లు అని అర్థం, వీటిలో సొమ్మును నిల్వ చేయవచ్చు మరియు/లేదా వీటి నుండి సొమ్మును డెబిట్ చేయవచ్చు లేదా వీటికి క్రెడిట్ చేయవచ్చు. PhonePe UPIని ఉపయోగించి లావాదేవీలను నిర్వహించడానికి ఈ అకౌంట్లు మూలాధారం.

“బయోమెట్రిక్ క్రెడెన్షియల్స్” అంటే మీ వేలిముద్రలు లేదా ముఖ లక్షణాలు వంటి మీ ప్రత్యేక శారీరక గుర్తులు అని అర్థం. PhonePe యాప్‌లో PhonePe UPIని ఉపయోగించి చేసే పేమెంట్‌ను ఆథరైజ్ చేయడం కోసం మీ గుర్తింపును ధృవీకరించడానికి వీటిని ఉపయోగించవచ్చు. ఈ బయోమెట్రిక్ క్రెడెన్షియల్స్ అనేవి మీ డివైస్​లో మీరు భద్రపరుచుకున్న క్రెడెన్షియల్స్.

“ఇష్యూయర్‌(లు)” అంటే RBI నియంత్రించే బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు అని అర్థం, ఇవి PhonePe UPI సర్వీస్‌లను పొందడం కోసం యూజర్ ఉపయోగించే బ్యాంక్ అకౌంట్ లేదా పేమెంట్ అకౌంట్​ను జారీ చేస్తాయి, అందిస్తాయి, అనుమతిస్తాయి లేదా నిర్వహిస్తాయి.

“NPCI” అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది RBI నుండి అధికారాన్ని పొందిన పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్. UPI పేమెంట్ సిస్టమ్‌ NPCI యాజమాన్యంలో ఉంది, అలానే UPI పేమెంట్ సిస్టమ్‌ను NPCI  నిర్వహిస్తుంది.

“పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్/ PSP/ PSP బ్యాంక్” అంటే UPI ఫ్రేమ్‌వర్క్ కింద పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించడానికి అధికారం పొందిన బ్యాంకింగ్ కంపెనీ అని అర్థం. ఎండ్ యూజర్లకు UPI సర్వీస్‌లను అందించడానికి TPAPలను PSPలు నియమించుకుంటాయి.

“PhonePe అకౌంట్” అంటే మీరు PhonePeలో సైన్-అప్/రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీరు క్రియేట్‌ చేసే అకౌంట్​ అని అర్థం. ఈ అకౌంట్​ అనేది మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను (కింద దీని నిర్వచనం ఇచ్చాము) యాక్సెస్ చేయడానికి, PhonePe సర్వీస్‌లను (కింద వీటి నిర్వచనం ఇచ్చాము) బ్రౌజ్ చేయడానికి, PhonePe UPIని ఉపయోగించి పేమెంట్ చేయడానికి, PhonePe యాప్‌లో మేము అందుబాటులోకి తెచ్చిన ఇతర ఫీచర్లను యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

“PhonePe యాప్” అంటే మర్చంట్లు, సర్వీస్‌ ప్రొవైడర్‌లతో సహా తన యూజర్లకు PhonePe సర్వీస్‌లను అందించడానికి PhonePe/ PhonePe ఎంటిటీల ద్వారా హోస్ట్ చేసిన మొబైల్ అప్లికేషన్(లు) అని అర్థం.

“PhonePe ప్లాట్‌ఫామ్‌” అంటే PhonePe లిమిటెడ్‌ (గతంలో PhonePe ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు) లేదా ఇతర PhonePe ఎంటిటీల యాజమాన్యంలో ఉన్న/సభ్యత్వం పొందిన/ఉపయోగించిన ఏదైనా ప్లాట్‌ఫామ్‌ అని అర్థం. దీని కింద వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్‌లు, పరికరాలు, URLలు/లింక్‌లు, నోటిఫికేషన్లు, చాట్‌బాట్ లేదా యూజర్లకు PhonePe సర్వీస్‌లను అందించడానికి ఉపయోగించే మరేదైనా కమ్యూనికేషన్ మాధ్యమం ఉంటాయి, కానీ వీటికే పరిమితం కాదు.

“PhonePe సర్వీస్‌లు” అంటే PhonePe మరియు/లేదా PhonePe ఎంటిటీలు అందిస్తున్న / అందించబోయే అన్ని సర్వీస్‌లు అని అర్థం. ఇందులో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్లు (PPIలు), గిఫ్ట్ కార్డ్‌లు, పేమెంట్ అగ్రిగేషన్/గేట్‌వే, రీఛార్జ్‌లు, బిల్లు పేమెంట్లు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్‌ సహా, వీటికే పరిమితం కాకుండా, తదితర అంశాలు ఉంటాయి.

“TPAP” అంటే థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అని అర్థం. ఇది ఎండ్ యూజర్లకు UPI ఆధారిత పేమెంట్ లావాదేవీలను సులభంగా నిర్వహించడం కోసం, UPI నిబంధనలకు అనుగుణంగా ఉండే యాప్(ల)ను అందించే సంస్థ.

“UPI పిన్” అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్. యూజర్ బ్యాంక్ అకౌంట్​ నుండి నగదును డెబిట్ చేయడం కోసం, ఇష్యూయర్‌ ఆథరైజ్ చేసేందుకు వీలు కల్పించే ఆథరైజేషన్ క్రెడెన్షియల్స్‌గా దీన్ని యూజర్ సెట్ చేసుకుంటారు. ఇది 4-6 అంకెలు ఉండే న్యూమరిక్ పిన్ మాత్రమే.

“UPI నంబర్” అంటే 8-10 అంకెల సంఖ్య, దీనికి ఎలాంటి UPI హ్యాండిల్ (@PSP) ఉండదు. ఇది మీ VPAకి (కింద దీని నిర్వచనం ఇచ్చాము) ప్రాక్సీగా పనిచేస్తుంది, దీన్ని మీరు ఎంచుకోవచ్చు. డిఫాల్ట్‌గా, మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను మీ UPI నంబర్‌గా PhonePe కాన్ఫిగర్ చేయవచ్చు, లేదా మీరు ఎంచుకున్న ఇతర 8-10 అంకెల సంఖ్యను కూడా ఉపయోగించవచ్చు.

“VPA” అంటే మీ బ్యాంక్ అకౌంట్​కు లింక్ చేయగల, అలానే NPCI వద్ద రిజిస్టర్ చేసిన ఒక ప్రత్యేకమైన వర్చువల్ పేమెంట్ అకౌంట్ అని అర్థం.

రిజిస్ట్రేషన్

arrow icon

PhonePe అకౌంట్ ఉండి, రిజిస్టర్ చేసుకున్న యూజర్లకు PhonePe యాప్‌లో PhonePe UPI సౌకర్యం అందుతుంది. PhonePe UPIని రిజిస్టర్ చేసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి, మీ యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్‌తో లింక్ చేసిన మీ సొంత బ్యాంక్ అకౌంట్​/పేమెంట్ అకౌంట్​ ఉండాలి.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది UPI మార్గదర్శకాల కింద NPCI నిర్వచించిన, నియంత్రిస్తున్న ఒక ప్రామాణిక ప్రక్రియ, ఇది ఎప్పటికప్పుడు మారవచ్చు. PhonePe ఒక TPAP హోదాలో, NPCI ఎప్పటికప్పుడు నిర్దేశించిన ప్రక్రియను అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా మీ మొబైల్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడం, మీ ఫోన్ నుండి ఒక ప్రత్యేకమైన SMS పంపడం ద్వారా UPIలో మీ బ్యాంక్ అకౌంట్​​ను వెరిఫై, వ్యాలిడేట్, రిజిస్టర్, లింక్ చేయడం, అలాగే VPAని క్రియేట్‌ చేయడం జరుగుతాయని మీరు అర్థం చేసుకున్నారు.

వర్తించే చట్టాల కింద అనుమతి ఉంటేనే తప్ప, PhonePe మీ VPAతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్​​/పేమెంట్ అకౌంట్​​ నంబర్‌ను స్టోర్ చేయదు. అయితే, VPAని కింది వాటి కోసం ఉపయోగించవచ్చు:

  • మీ PhonePe యాప్‌తో, QR కోడ్‌ను స్కాన్ చేసి, మర్చంట్ లొకేషన్లలో పేమెంట్ చేయడానికి.
  • మర్చంట్ వెబ్‌సైట్లు/యాప్‌లలో ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి.
  • PhonePe సర్వీస్‌ల వినియోగం కోసం పేమెంట్లు చేయడానికి.

UPI రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా మీ పేరు, మొబైల్ నంబర్, బ్యాంకింగ్ సమాచారంతో సహా మీరు అందించిన వివరాలు PSP బ్యాంక్, NPCI సురక్షిత లైబ్రరీలో పొందుపరిచి, నిర్వహించడమవుతుంది. ఆ విధంగా సమాచారాన్ని పంపడానికి మీరు సమ్మతిని ఇస్తున్నారు, అలానే వర్తించే చట్టాల కింద అనుమతించిన మేరకు ఈ డేటాను స్టోర్ చేయడానికి, ఉపయోగించడానికి, నిర్వహించడానికి PhonePe, PSP బ్యాంక్‌లు, NPCIకి అధికారం ఇస్తున్నారు.

పలు VPA(లు), బ్యాంక్ అకౌంట్(లు):

PhonePe యాప్‌లో రిజిస్టర్‌ అయిన యూజర్‌గా, మీకు PhonePe యాప్‌లో పలు బ్యాంక్ అకౌంట్లను/ పేమెంట్ అకౌంట్లను లింక్ చేయడానికి, ప్రతి బ్యాంక్ అకౌంట్​​​కు VPA(ల)ను ఎనేబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకే బ్యాంక్ అకౌంట్​ను పలు VPA(లతో) లింక్ చేయవచ్చు. లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఒక ప్రైమరీ VPAని ఎంచుకునే ఆప్షన్ మీకు ఉంటుంది; అయితే, ప్రైమరీ VPA సర్వర్‌లలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా పేమెంట్ పూర్తవ్వడం కోసం PhonePe అందించిన సెకండరీ VPAలను ఉపయోగించవచ్చు. ఇన్‌వార్డ్‌ ఫండ్‌లను (మీకు వచ్చే నగదును) పొందడానికి మీ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్​ను గుర్తించే, మార్చుకునే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది.

NRE/NRO బ్యాంక్ అకౌంట్​తో లింక్ చేసిన UPI

arrow icon

భారతదేశంలోని బ్యాంక్‌లలో నాన్-రెసిడెంట్ ఇండియన్ (“NRI”) యూజర్లకు ఉన్న నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (“NRE”) / నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (“NRO”) బ్యాంక్ అకౌంట్​లతో లింక్ అయిన భారతీయేతర మొబైల్ నంబర్లతో నాన్-రెసిడెంట్ ఇండియన్ (“NRI”) యూజర్లు రిజిస్టర్ చేసుకుని, PhonePe యాప్‌ను ఉపయోగించవచ్చు/యాక్సెస్ చేయవచ్చు. NRI యూజర్లు తమకు వర్తించే చట్టాలకు అనుగుణంగా భారతీయ NRE/NRO బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నారని, అలానే నిర్వహణ కూడా జరుగుతోందని నిర్ధారించుకోవాలి, అయితే వారి KYCని ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. NRI యూజర్ల వ్యక్తిగత, పేమెంట్ డేటాతో సహా మొత్తం డేటా/సమాచారాన్ని, వర్తించే చట్టాలకు అనుగుణంగా స్టోర్ చేసి, యాక్సెస్ చేసి, ప్రాసెస్ చేయడమవుతుంది.

యూజర్ బాధ్యతలు, కర్తవ్యాలు

arrow icon

మీరు PhonePe UPIలో రిజిస్టర్ చేసుకుని, ఉపయోగిస్తున్నప్పుడు మరియు/లేదా దాని ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు, కింది వాటికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలి:

  1. మీ సరైన బ్యాంక్ అకౌంట్​, పేమెంట్ అకౌంట్​ను లింక్ చేయడానికి మీరు మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి.
  1. మీ మొబైల్ నంబర్‌నే ప్రాథమిక గుర్తింపుగా పరిగణించడమవుతుంది కాబట్టి, అది ఒకవేళ మారితే, PhonePe యాప్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్/పేమెంట్ అకౌంట్​​లో కూడా మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
  1. మీరు మీ PhonePe అకౌంట్‌తో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను మార్చినట్లయితే, మీరు మీ కొత్త మొబైల్ నంబర్‌ను మళ్ళీ PhonePeలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వీస్‌ను తిరిగి ప్రారంభించడానికి, మీరు మీ కొత్త మొబైల్ నంబర్‌ను మీ ఇష్యూయర్‌ వద్ద కూడా రిజిస్టర్ చేయాలి.
  1. మీ OTP, UPI ​పిన్, బ్యాంక్ అకౌంట్/పేమెంట్ అకౌంట్​​​కు సంబంధించిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచడానికి మీరు మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి. ఇటువంటి సమాచారాన్ని ఇతరులకు ఇవ్వడం అనధికారిక వినియోగానికి దారితీయవచ్చు, దీనికి PhonePe బాధ్యత వహించదు.
  1. PhonePe యాప్‌లో అందించిన బ్యాంక్ అకౌంట్/పేమెంట్ అకౌంట్, ఇతర వివరాలకు, అలాగే PhonePe UPIలో మీరు చేసే మరియు/లేదా ఆథరైజ్ చేసే ఏదైనా పేమెంట్ అభ్యర్థనకు, లబ్ధిదారుని యాడ్ చేయడానికి, VPAలను టైప్ చేయడానికి, రివ్యూ చేయడానికి, ఉద్దేశించిన గ్రహీతలను వ్యాలిడేట్ చేయడంతో సహా PhonePe యాప్‌ను ఏ విధంగానైనా వినియోగించడానికి మీరే పూర్తి బాధ్యత వహించాలి. PhonePe యాప్‌లో మీరు ఎంటర్‌ చేసే సమాచారం సరైనదా కాదా అని మేము వెరిఫై చేయము.
  1. మీరు అందించిన ఏదైనా సమాచారం అసత్యమైనది, తప్పులున్నది, ప్రస్తుత కాలానికి సంబంధించనది లేదా అసంపూర్తిగా ఉన్నది అయినా, లేదా ఏదైనా సమాచారం అసత్యమైనది, తప్పులున్నది, ప్రస్తుత కాలానికి సంబంధించనది లేదా అసంపూర్తిగా ఉన్నది లేదా ఈ UPI వినియోగ నియమాలు లేదా నియమాలకు అనుగుణంగా లేదని భావించడానికి మాకు తగిన కారణాలు ఉన్నా, మీ PhonePe అకౌంట్‌ను నిరవధికంగా నిలిపివేయడానికి లేదా రద్దు చేయడానికి లేదా మీ PhonePe యాప్ లేదా PhonePe సర్వీస్‌లు లేదా PhonePe UPI యాక్సెస్‌ను బ్లాక్ చేయడానికి లేదా అవసరమైన ఇతర చర్యలు తీసుకోవడానికి మాకు హక్కు ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు.
  1. మీ లావాదేవీలకు సంబంధించిన మొత్తం రహస్యమైన డేటా, బ్యాంక్ అకౌంట్/పేమెంట్ అకౌంట్ వివరాలు, మా వద్ద ఉన్న ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారం అంతటినీ అందుబాటులో ఉన్న అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను ఉపయోగించి రక్షించేలా, రహస్యంగా ఉంచేలా మేము చూసుకుంటాము. ఈ UPI వినియోగ నియమాలతో పాటు, మీరు పంపిన మొత్తం డేటా/సమాచారాన్ని మా గోప్యతా విధానం ప్రకారం కూడా నియంత్రిస్తాము.
  1. ఫండ్ బదిలీ/UPI లావాదేవీ పూర్తి కావడంలో ఏదైనా ఆలస్యం జరిగినా, లేదా మీరు ఫండ్ బదిలీని నిర్వహించే సమయంలో జరిగిన పొరపాటు వల్ల కలిగే ఎటువంటి నష్టానికైనా PhonePe, PSP బ్యాంక్ లేదా UPI పేమెంట్ వ్యవస్థలోని మరే ఇతర సిస్టమ్ పార్టిసిపెంట్లు బాధ్యత వహించరని మీరు అంగీకరిస్తున్నారు.
  1. లావాదేవీ తిరస్కరణలు, అలానే ఛార్జీలను (ఏవైనా ఉంటే, అంటే ఇష్యూయర్‌ ఒకవేళ విధిస్తే) నివారించడానికి, మీ బ్యాంక్ అకౌంట్(లు)/పేమెంట్ అకౌంట్(ల)లో తగినంత అమౌంట్‌ అందుబాటులో ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత.
  1. నిర్ధారించిన UPI నంబర్‌ను ఉపయోగించి, మీకు ఫండ్స్ వచ్చేలా చేయడం కోసం, ‘న్యూమరిక్ UPI ఐడి మ్యాపర్’పై NPCI జారీ చేసిన సర్క్యులర్‌తో సహా, అది జారీ చేసిన అన్ని సర్క్యులర్ల అమలు ప్రకారం, అలానే NPCI అవసరాలకు అనుగుణంగా, NPCI నిర్వహించే సెంట్రలైజ్డ్ మ్యాపర్(ల)లో PhonePe మిమ్మల్ని ఆన్‌బోర్డ్  చేస్తుందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. NPCI నిర్వచించిన, అనుమతించిన నిబంధనల పరిధిలో, PhonePe యాప్‌లో మీరు స్పష్టంగా ఇచ్చిన సమ్మతితో, మీ తరపున NPCI సెంట్రలైజ్డ్ మ్యాపర్(ల)లో ఈ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను PhonePe చేస్తుందని మీరు అంగీకరించి, సమ్మతిస్తున్నారు. ఈ ప్రక్రియ NPCI ఉత్తర్వుల ప్రకారం జరుగుతుంది, ఇందులో మీ UPI వివరాలను (UPI సంబంధిత సర్వీస్‌లను అందించడానికి PhonePe సేకరించిన, నిర్వహించిన వివరాలు) NPCIకి పంపడం, అలానే PhonePe యాప్‌లో కేటాయించిన మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ / VPAని మీ UPI నంబర్‌కు లింక్ చేయడం వంటివి ఉంటాయి. ఇది మీ UPI నంబర్‌కు వచ్చే పేమెంట్లను అందుకునేందుకు మీకు అనుమతిని ఇస్తుంది. PhonePe యాప్‌లో ప్రాసెస్ చేసిన మీ UPI నంబర్ మ్యాపింగ్‌ను డీ-లింక్ చేసే ఆప్షన్‌ను PhonePe మీకు అందిస్తుంది. ఇతర UPI యూజర్ల నుండి ఫండ్స్‌ను పొందడానికి మీరు మరింత స్పష్టంగా అంగీకారం తెలుపుతున్నారు, అలానే PhonePe భాగస్వామ్య PSP బ్యాంక్‌ల ద్వారా మీ లింక్ చేసిన ప్రైమరీ బ్యాంక్ అకౌంట్​​​కు అటువంటి ఫండ్ బదిలీ లావాదేవీలను PhonePe సులభతరం చేయడానికి మీరు సమ్మతిస్తున్నారు.
  1. కొంతమంది కస్టమర్ల విషయానికి వస్తే, మీ UPI నంబర్‌ అనేది PhonePe కాకుండా, ఇతర బ్యాంక్/థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ జారీ చేసిన VPAతో (“థర్డ్ పార్టీ VPA”), NPCI నిర్వహించే సెంట్రలైజ్డ్ మ్యాపర్‌పై లింక్ చేసి/స్టోర్ చేసి ఉంటే, అప్పుడు అటువంటి థర్డ్ పార్టీ VPAతో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్​కే ఫండ్స్‌ను PhonePe సెటిల్ చేస్తుంది. దీని ప్రకారం, థర్డ్ పార్టీ VPAతో లింక్ అయిన మీ UPI నంబర్‌కు ఏదైనా ఫండ్ బదిలీ చేసినట్లయితే, ఆ అమౌంట్ థర్డ్ పార్టీ VPAతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కే సెటిల్‌ అవుతుంది.
  1. మీరు మీ UPI నంబర్‌ను థర్డ్ పార్టీ VPA నుండి PhonePe యాప్‌లో కేటాయించే VPAకి పోర్ట్ చేసుకోవచ్చని, అలానే ఏ సమయంలోనైనా PhonePe యాప్‌లో మీ స్పష్టమైన సమ్మతిని తెలిపి NPCI సెంట్రల్ మ్యాపర్‌లో కూడా దాన్ని మార్చుకోవచ్చని మీరు స్పష్టంగా అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
  1. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి ఆర్థికేతర అవసరాల కోసం మీరు UPIని ఉపయోగించడంపై NPCI కొన్ని పరిమితులను విధించవచ్చని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. NPCI అమలు చేసే ఇటువంటి పరిమితులకు లోబడి ఉండేందుకు మీరు ఇందుమూలంగా అంగీకరిస్తున్నారు.
  1. వర్తించే చట్టాలకు లోబడి, PhonePe UPI ద్వారా ప్రాసెస్ అయిన అన్ని లావాదేవీలు PhonePe నుండి మీకు రీపండ్ కావు, అలానే PhonePe UPI ద్వారా మీరు వాటిని వెనక్కి తీసుకురాలేరు.

PhonePe UPI ద్వారా పేమెంట్లు

arrow icon

ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి డబ్బును బదిలీ చేయడం కోసం లేదా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ మర్చంట్ల నుండి వస్తువులు, సర్వీస్‌లను కొనుగోలు చేయడం కోసం PhonePe UPIని ఉపయోగించవచ్చు. PhonePe ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప, PhonePe UPIతో చేసే పేమెంట్లను ఆథరైజ్ చేయడానికి మీ మొబైల్/డివైస్​లో మీ UPI పిన్​ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఎనేబుల్ చేస్తే తప్ప, ఏదైనా లావాదేవీ చేసే సమయంలో మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండేలా చూసుకోవాలి. అయితే, ఈ సదుపాయాన్ని అన్ని లావాదేవీలకు PhonePe అందించకపోవచ్చు.

PhonePe ప్లాట్‌ఫామ్‌లో PhonePe సర్వీస్‌ల కోసం పేమెంట్లు చేసేటప్పుడు, మీరు PhonePe UPIని ఉపయోగించి పేమెంట్లు చేయవచ్చు.

మర్చంట్ పేమెంట్లకు మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ ఎంపికల్లో PhonePe UPI కూడా ఒక ఎంపిక అయినప్పుడు, అలాంటి సందర్భాల్లో PhonePe UPIతో కొనుగోలు చేసిన వస్తువులు / సర్వీస్‌లకు మేము ఎటువంటి బాధ్యత వహించము, అలానే వాటికి సంబంధించిన ఎటువంటి బాధ్యతనైనా స్పష్టంగా నిరాకరిస్తున్నాము.

UPI లావాదేవీలు PhonePe, యూజర్, ఇష్యూయర్‌, పేమెంట్ పార్టిసిపెంట్లు నిర్ణయించిన లేదా వర్తించే చట్టబద్ధమైన షరతుల కింద సూచించిన లావాదేవీ పరిమితులకు లోబడి ఉంటాయి. అంతేకాకుండా, PhonePe, ఇష్యూయర్‌, PSP బ్యాంక్ లేదా ఇతర పేమెంట్ పార్టిసిపెంట్లు తమ సొంత పాలసీలు, అసెస్‌మెంట్‌ ఆధారంగా లావాదేవీలను (పూర్తిగా లేదా పాక్షికంగా) తిరస్కరించవచ్చు/నిలిపివేయవచ్చు.

మేము మీ లావాదేవీ వివరాలను PhonePe యాప్‌లోని – “హిస్టరీ” విభాగంలో అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తాము. మీరు అన్ని లావాదేవీలను సమీక్షించాల్సి ఉంటుంది, ఒకవేళ మీరు ఏదైనా పొరపాటున జరిగిన లేదా అనధికారిక లావాదేవిని గుర్తించినట్లయితే, “హిస్టరీ” విభాగానికి వెళ్లి, సంబంధిత లావాదేవిని ఎంచుకుని లేదా PhonePe ఫిర్యాదు పరిష్కార పాలసీలో వివరించిన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ప్రకారం వెంటనే PhonePe కస్టమర్ సహాయ విభాగానికి తెలియజేయాలి. అయితే, మీరు ఉపయోగించే బ్యాంక్ అకౌంట్/పేమెంట్స్ అకౌంట్ ఆధారంగా మీ లావాదేవీలను మీ ఇష్యూయర్‌ రికార్డ్ చేస్తారని దయచేసి గమనించండి. అటువంటి బ్యాంక్ అకౌంట్/పేమెంట్స్ అకౌంట్ ద్వారా మీరు జరిపిన UPI లావాదేవీలకు సంబంధించి మీకు కావాల్సిన ఏదైనా సమాచారం/రికార్డులు/స్టేట్‌మెంట్ల కోసం మీరు మీ ఇష్యూయర్‌ను సంప్రదించవలసి ఉంటుంది.

UPI – OS నేటివ్ బయోమెట్రిక్ అథెంటికేషన్

arrow icon

UPI- OS నేటివ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ అనేది యూజర్లు తమ బయోమెట్రిక్ వివరాలను (ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడి వంటివి) ఉపయోగించి UPI లావాదేవీలను ప్రాసెస్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పేమెంట్ చేసే విధానం అనేది సాధారణ UPI లావాదేవీలను పోలి ఉంటుంది, కానీ ఇక్కడ యూజర్‌ UPI పిన్​కు బదులుగా బయోమెట్రిక్ వివరాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యాన్ని కేవలం ఎంపిక చేసిన ఇష్యూయర్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. మీ ఇష్యూయర్‌ ఈ ఫీచర్‌ను అనుమతిస్తే మాత్రమే మీకు ఇది PhonePe యాప్‌లో కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించడం అనేది వర్తించే చట్టాలు, మీ ఇష్యూయర్‌ నియమ, నిబంధనలు, ఈ UPI వినియోగ నియమాలకు (ToU) లోబడి ఉంటుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, మీరు PhonePe యాప్‌లోని సంబంధిత విభాగంలో మీ UPI పిన్​ను ఉపయోగించి మీ బయోమెట్రిక్ వివరాలను యాక్టివేట్ చేయాలి. ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత, వర్తించే చట్టాల ప్రకారం నిర్దేశించిన పరిమితులకు లోబడి, మీరు మీ బయోమెట్రిక్ క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించి UPI పేమెంట్లను ఆథరైజ్ చేయవచ్చు.

మీ డివైస్​లో సేవ్ చేసిన ఏ బయోమెట్రిక్ వివరాలతోనైనా UPI లావాదేవీని ఆథరైజ్ చేయవచ్చని, అలానే మీ బయోమెట్రిక్ వివరాల వినియోగాన్ని నిర్వహించే పూర్తి బాధ్యత మీదేనని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. మీరు ఉపయోగించే బయోమెట్రిక్ క్రెడెన్షియల్స్‌ను PhonePe; PSP బ్యాంక్; NPCI లేదా ఏ ఇతర థర్డ్‌ పార్టీ యాక్సెస్‌ చేయలేదు. ఈ బయోమెట్రిక్ క్రెడెన్షియల్స్‌ అనేవి కేవలం అథెంటికేషన్‌ కోసం మాత్రమే ఉపయోగపడతాయి, అలానే ఇవి పూర్తిగా మీ డివైస్‌ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే ప్రాసెస్ అవుతాయి.

PhonePe యాప్‌లో తెలిపిన పద్ధతులు/ప్రక్రియలను అనుసరించి, మీరు ఎప్పుడైనా ఈ ఫీచర్‌ను నిలిపివేయవచ్చు. ఒకవేళ మీరు మీ ఫోన్‌ను మార్చినా, లేదా మీ ఫోన్‌లో రిజిస్టర్ అయి ఉన్న బయోమెట్రిక్ వివరాలను మార్చినా, ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. ఇలా డియాక్టివేట్ అయిన తర్వాత, మీరు PhonePe యాప్‌లో ఈ UPI- OS నేటివ్‌ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ ఫీచర్‌ను మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు.

UPI ఇంటర్నేషనల్

arrow icon

విదేశాలకు ప్రయాణించే యూజర్లు, వీలైన చోట్ల, అలానే ఎంపిక చేసిన ప్రాంతాల్లో, ఆయా దేశాల్లోని మర్చంట్లకు UPIతో పేమెంట్లు చేయడానికి ‘UPI ఇంటర్నేషనల్’ ఫీచర్ అనుమతిని ఇస్తుంది. దీని పేమెంట్ ప్రక్రియ సాధారణ UPI మర్చంట్ లావాదేవీల మాదిరిగానే ఉంటుంది; ఇక్కడ యూజర్ ఒక QR కోడ్‌ను (సందర్భాన్ని బట్టి, UPI గ్లోబల్ QR, లోకల్ QR, స్టాటిక్ లేదా డైనమిక్ QR) స్కాన్ చేసి, అమౌంట్‌ను ఎంటర్‌ చేసి, UPI పిన్​తో ఆథరైజ్ చేస్తారు.

ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, యూజర్లు తమ UPI పిన్​ను ఉపయోగించి ‘ఇంటర్నేషనల్ పేమెంట్స్’ను యాక్టివేట్ చేసుకోవాలి. అయితే ఈ యాక్టివేషన్‌ను ఏ ప్రాంతంలో అయినా (అంటే భారతదేశంలో లేదా విదేశాల్లో) చేయవచ్చు. ఒకవేళ యూజర్లు యాక్టివేషన్‌ కాక ముందే ఇంటర్నేషనల్‌ QRని స్కాన్ చేస్తే, మొదట UPI ఇంటర్నేషనల్ యాక్టివేషన్‌ను పూర్తి చేశాకనే, పేమెంట్‌ను పూర్తి చేయమని మిమ్మల్ని అడుగుతుంది. యూజర్ అభ్యర్థన ఆధారంగా, వారు ఎంచుకున్న బ్యాంక్ అకౌంట్​లను UPI ఇంటర్నేషనల్ లావాదేవీల కోసం PhonePe యాక్టివేట్ చేస్తుంది. ఒకసారి యూజర్ దీన్ని ఎనేబుల్ చేశాక, కేవలం 3 నెలల కాలవ్యవధికి మాత్రమే UPI ఇంటర్నేషనల్ యాక్టివ్‌గా ఉంటుంది, అంటే 3 నెలలు ముగియగానే యాక్టివేషన్ ఆటోమేటిక్‌గా డిసేబుల్ అవుతుంది. యూజర్లు ఈ 3 నెలల గడువు ముగియక ముందే PhonePe యాప్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లి, UPI పిన్‌ అథెంటికేషన్ ద్వారా ఈ ఫీచర్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అలా డీయాక్టివేట్ చేసిన తర్వాత, ఎప్పుడైనా UPI ఇంటర్నేషనల్ ఫీచర్‌ను మళ్ళీ యూజర్లు యాక్టివేట్ చేసుకోవచ్చు.

అన్ని UPI ఇంటర్నేషనల్ లావాదేవీలకు, లావాదేవీ జరుగుతున్న దేశంలో వాడుకలో ఉన్న స్థానిక కరెన్సీలోనే అమౌంట్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో అమల్లో ఉన్న ఫారెక్స్ రేట్లు, మార్క్ అప్‌ ఆధారంగా ఆ అమౌంట్ భారతీయ రూపాయల్లో కూడా కనిపిస్తుంది. PhonePe యాప్‌లోని లావాదేవీ హిస్టరీలో, ప్రతి లావాదేవీ వివరాలతో పాటు, అది UPI ఇంటర్నేషనల్ పేమెంట్ అని గుర్తించడానికి ఒక ‘ఐడెంటిఫైయర్’ ఉంటుంది. మీ ఇష్యూయర్‌ విధించే ఏదైనా ప్రాసెసింగ్ ఫీజుతో సహా, UPI ఇంటర్నేషనల్ లావాదేవీలకు వర్తించే అన్ని ఛార్జీలకు మీరు సమ్మతిని తెలుపుతున్నారు.

UPI ఫారిన్ ఇన్‌వార్డ్‌ రెమిటెన్స్

arrow icon

UPI ఫారిన్ ఇన్‌వార్డ్‌ రెమిటెన్స్ ఫీచర్ అనేది ఎంపిక చేసిన దేశాల్లో అందుబాటులో ఉంది, అలానే ఎంపిక చేసిన దేశాల్లో ఉన్న చెల్లింపుదారు, వారి సొంత మొబైల్ అప్లికేషన్‌తో చేసే పేమెంట్లను మీరు అందుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీరు PhonePe యాప్‌లోని “అనుమతులు” విభాగంలో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే, మీ PhonePe యాప్ ద్వారా క్రాస్‌ బోర్డర్‌ (సరిహద్దులు దాటి) పేమెంట్లను పొందేలా చేయడం కోసం మీ VPA, అకౌంట్ నంబర్‌, బ్యాంకింగ్ పేరు, IFSC కోడ్ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని అంతర్జాతీయ పేమెంట్/రెమిటెన్స్ భాగస్వాములకు పంపేందుకు PhonePeకు చెందిన PSP బ్యాంక్‌లకు మీరు సమ్మతిని ఇచ్చినట్లే అవుతుంది. మీ PhonePe యాప్‌లోని “అనుమతులు” విభాగానికి వెళ్లి, మీరు ఎప్పుడైనా మీ సమ్మతిని వెనక్కి తీసుకోవచ్చు.

ఫారిన్ ఇన్‌వార్డ్‌ రెమిటెన్స్‌లకు సంబంధించి RBI రూపొందించిన చట్టాలతో సహా, వర్తించే అన్ని చట్టాలకు లోబడి ఉండటానికి మీరు మాత్రమే పూర్తి బాధ్యత వహిస్తారని మీరు స్పష్టంగా అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.

UPI ఫారిన్ ఇన్‌వార్డ్‌ రెమిటెన్స్‌కు సంబంధించిన బాధ్యతా నిరాకరణలు, అదనపు నియమాలు:-

  • ఫారిన్ ఇన్‌వార్డ్‌ లావాదేవీల హిస్టరీ అంతా మీ బ్యాంక్ అకౌంట్​లలో మాత్రమే కనిపిస్తుంది. ఫారిన్ ఇన్‌వార్డ్‌ లావాదేవీల హిస్టరీ మీ PhonePe యాప్‌లో కనిపించదు. ఏదైనా లావాదేవీ విజయవంతం కావడం లేదా విఫలమవ్వడం గురించి ఎటువంటి నిర్ధారణ, మెసేజ్‌లు లేదా లావాదేవీ అలెర్ట్‌లను అందించడానికి PhonePe బాధ్యత వహించదు. ఇటువంటి సందేహాలు లేదా ఫిర్యాదులకు సంబంధించి, దయచేసి మీ ఇష్యూయర్‌ను సంప్రదించండి.
  • మీరు మనీ లాండరింగ్ వ్యతిరేక (యాంటీ-మనీ లాండరింగ్‌), తీవ్రవాద ఆర్థిక సాయం నిరోధక (కౌంటర్ టెర్రరిజం ఫైనాన్సింగ్‌) నిబంధనలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.
  • ఫారిన్ ఇన్‌వార్డ్‌ లావాదేవీల కింద జరిగే ఎటువంటి లావాదేవీలను లేదా చెల్లింపుదారులను PhonePe వెరిఫై చేయదు, చెక్‌ చేయదు లేదా పర్యవేక్షించదు.

అన్ని ఫారిన్ ఇన్‌వార్డ్‌ లావాదేవీల విషయంలో, చెల్లింపుదారు తన స్థానిక కరెన్సీలోనే నగదును చెల్లిస్తారు, అయితే అది మీకు (అంటే, డబ్బును పొందేవారికి) భారతీయ కరెన్సీలో మాత్రమే అందుతుంది. ఈ లావాదేవీ విలువ మీ నగదును పొందే బ్యాంక్ అకౌంట్/ఇష్యూయర్ ప్రస్తుత కరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌ రేట్ల ప్రకారం నిర్ణయమవుతుంది; ఈ కన్వర్షన్‌ ప్రక్రియలో PhonePeకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ విషయంలో మీకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే, దయచేసి మీ ఇష్యూయర్‌ను సంప్రదించండి.

arrow icon

UPI Lite

arrow icon

RBI మరియు/లేదా NPCI ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలతో సహా, వర్తించే చట్టాలకు లోబడి, మేము మీకు PhonePe యాప్‌లో ‘UPI Lite’ (UPI Lite) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. UPI Lite అనేది చిన్న అమౌంట్ల లావాదేవీల కోసం NPCI ఎనేబుల్ చేసిన ఒక ‘ఆన్-డివైస్ వాలెట్’. ఇష్యూయర్లు ఎవరూ UPI Lite‌ను ఎనేబుల్‌/సపోర్ట్ చేయకపోవచ్చు. మీ PhonePe యాప్‌లో లింక్ చేసిన ఒకే ఒక బ్యాంక్ అకౌంట్​ను మాత్రమే మీరు UPI Lite‌కు ఎనేబుల్ చేసుకోగలరు (దీన్ని ఇకపై “UPI Lite సౌకర్యం” అని పిలుస్తారు). ఈ UPI Lite సౌకర్యాన్ని పొందడానికి లేదా దాని వినియోగాన్ని కొనసాగించడానికి, మీరు మీ PhonePe యాప్‌లో ‘అప్లికేషన్ లాక్’ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం కోసం PhonePeకు అనుమతిని ఇవ్వాలని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. దీనికి అనుగుణంగా, ఒకవేళ ఈ లాక్‌ను డిసేబుల్ చేస్తే, UPI Lite సౌకర్యాన్ని ఉపయోగించడానికి మీరు వెంటనే మీ ఫోన్ సెట్టింగ్‌లను మార్చుకోవాలి. ఒకసారి ఎనేబుల్ చేసిన తర్వాత, ఫేస్ ఐడి, బయోమెట్రిక్స్ లేదా PhonePe యాప్ భద్రత కోసం మీరు క్రియేట్‌ చేసిన పాస్‌కోడ్ వంటి మార్గాల ద్వారా మీరు యాప్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

UPI Lite సౌకర్యాన్ని ఎనేబుల్ చేయడానికి, మీరు PhonePe యాప్‌లోని నిర్దిష్ట విభాగంపై నొక్కి/ట్యాప్‌ చేసి, UPI Lite వాలెట్‌లో నిధులను జమ చేయాల్సి ఉంటుంది. PhonePe యాప్‌లోని ఆ నిర్దిష్ట విభాగాన్ని నొక్కడం/ట్యాప్‌ చేయడం ద్వారా, UPI Lite సౌకర్యాన్ని ఎనేబుల్ చేయడానికి మీరు మీ సమ్మతిని తెలిపినట్లుగా అవుతుంది. మీ UPI ​పిన్‌‌ను ఉపయోగించి, PhonePe యాప్‌లో UPI Lite‌కు లింక్ చేసిన మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే నిధులను జమ చేయవచ్చు. మీరు PhonePe యాప్‌లోని UPI Lite ద్వారా జరిగే ప్రతి లావాదేవీ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు. మీ UPI Lite‌లో ఉపయోగించని బ్యాలెన్స్‌ను మీరు ఎప్పుడైనా UPI Lite‌కు లింక్ చేసిన మీ సోర్స్‌ బ్యాంక్ అకౌంట్​​​కు తిరిగి విత్‌డ్రా చేసుకోవచ్చు. UPI Lite‌లో జమ చేసి ఉంచిన ఏ అమౌంట్‌కూ వడ్డీ ఉండదు. UPI Lite సౌకర్యం కేవలం డెబిట్ లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగించడమవుతుంది. UPI Lite‌కు చేసిన అన్ని క్రెడిట్ లావాదేవీలు (రీఫండ్‌లు, మొదలైనవి సహా) ఆన్‌లైన్‌లోని యూజర్ బ్యాంక్ అకౌంట్​​లోనే ప్రాసెస్ అవుతాయి. UPI Lite ద్వారా పేమెంట్లు చేయడానికి మీరు UPI ​పిన్‌ను ఎంటర్‌ చేయవలసిన అవసరం లేదు. అయితే, UPI Lite‌తో చేసే లావాదేవీలకు కొన్ని పరిమితులు వర్తిస్తాయి. ఆ వర్తించే లావాదేవీల పరిమితులు కింది విధంగా ఉంటాయి లేదా NPCI ఎప్పటికప్పుడు నిర్ణయించే ఇతర పరిమితులు వర్తిస్తాయి:

  • UPI Lite సౌకర్యాన్ని ఉపయోగించి చేసే ప్రతి లావాదేవీ విలువపై గరిష్ఠ పరిమితి 1,000/- రూపాయలు.
  • ఒక రోజులో UPI Lite సౌకర్యాన్ని ఉపయోగించి చేసే అన్ని లావాదేవీల మొత్తం విలువపై గరిష్ఠ పరిమితి 10,000/- రూపాయలు.
  • ఏ సమయంలోనైనా UPI Lite‌లో ఉంచుకోగలిగే గరిష్ఠ బ్యాలెన్స్‌ 5,000/- రూపాయలు.

పైన పేర్కొన్న లావాదేవీల పరిమితులను మీకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మార్చవచ్చు.

PhonePe యాప్‌లో సూచించిన దశలు/విధానాలను అనుసరించి, ఎప్పుడైనా UPI Lite సౌకర్యాన్ని డిసేబుల్ చేసే హక్కు మీకు ఉంది. ఒకసారి UPI Lite సౌకర్యాన్ని డిసేబుల్ చేసిన తర్వాత, అందులో మిగిలి ఉన్న బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా మీ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్​​లో జమ అవుతుంది.

మీరు మీ మొబైల్ పరికరంలోని ఆపరేటింగ్ సిస్టమ్‌ను మార్చే ముందు (అంటే ఆండ్రాయిడ్ నుండి iOSకి లేదా iOS నుండి ఆండ్రాయిడ్‌కు మార్చినప్పుడు), PhonePe యాప్‌లో సూచించిన దశలను అనుసరించి, ఆ డివైస్​లో తప్పనిసరిగా UPI Lite సౌకర్యాన్ని డిసేబుల్‌ చేయాలి. ఒకవేళ కొత్త మొబైల్‌లోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కూడా మీ పాత డివైస్‌లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ అయితే, ఈ దశ అవసరం లేదు. మీ పాత మొబైల్ డివైస్​లో UPI Lite సౌకర్యాన్ని మీరు డిసేబుల్ చేయలేకపోతే, మీ కొత్త మొబైల్ డివైస్​లో మీ UPI Lite ఫెసిలిటీ బ్యాలెన్స్‌ను మీరు ఉపయోగించలేకపోవచ్చు, అలానే అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ను మీ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్​​​కు బదిలీ చేయడానికి మీరు మీ ఇష్యూయర్​ను సంప్రదించవలసి ఉంటుంది. ఈ విషయంలో PhonePe బాధ్యత వహించదు.

UPI – ATM – ఇంటరాపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్

arrow icon

మేము ఈ నియమాల ప్రకారం, ఎంపిక చేసిన ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ల (“ATM(ల)”) వద్ద కార్డ్‌లెస్ నగదు విత్‌డ్రా సౌకర్యాన్ని (“సౌకర్యం”) మీరు పొందేలా మీకు అనుమతిని ఇవ్వవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి, వర్తించే చట్టాల ప్రకారం మరియు/లేదా ఇష్యూయర్ సూచించిన విధంగా, మీకు కొన్ని అర్హతా ప్రమాణాలు ఉండాలి, అవేంటంటే: (i) UPI-ATM సౌకర్యాన్ని ఎనేబుల్ చేసిన అర్హతగల బ్యాంక్‌లో కస్టమర్ అయ్యి ఉండాలి, (ii) ఈ సౌకర్యం అందుబాటులో ఉన్న ATMని ఉపయోగించాలి; (iii) PhonePe UPIలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి (ఈ సౌకర్యం కోసం UPIని ఒక పేమెంట్ ఆప్షన్‌గా ఉపయోగించడానికి); మరియు/లేదా (iv) NPCI లేదా RBI లేదా ఇష్యూయర్ (సందర్భాన్ని బట్టి) నిర్దేశించిన ఇతర ప్రమాణాలను సంతృప్తిపర్చాలి.

పైన పేర్కొన్న ప్రమాణాలను మీరు సంతృప్తి పరిస్తే, నగదును విత్‌డ్రా చేయడం కోసం, అలాంటి అర్హత ఉన్న ATM వద్ద మీరు ఉన్నప్పుడు, అక్కడ మీకు “UPI నగదు విత్‌డ్రా” అనే ఎంపికను ఎంచుకుని, విత్‌డ్రా అమౌంట్‌ను ఎంటర్‌ చేసే అవకాశం ఉంటుంది. అవసరమైన అమౌంట్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత, ATM స్క్రీన్‌పై ఒక సింగిల్ యూజ్(ఒక్కసారే ఉపయోగించగల) డైనమిక్ QR కోడ్ కనిపిస్తుంది. మీరు మీ రిజిస్టర్డ్ VPA ద్వారా PhonePe యాప్‌ను ఉపయోగించి ఆ QR కోడ్‌ను స్కాన్ చేయాలి, అలానే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుండి నగదును విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్​ను ఎంచుకోవాలి.

పైన పేర్కొన్న వాటిని ఎంచుకున్న తర్వాత, మీ PhonePe యాప్‌లో మీ UPI పిన్‌తో లావాదేవీని ఆథరైజ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. అథెంటికేషన్ విజయవంతమైన తర్వాత, మీ PhonePe యాప్‌లో, అలానే ATM మెషీన్‌లో స్క్రీన్‌పై ఒక నిర్ధారణ కనిపిస్తుంది. ఆ ATM నుండి నగదు వస్తుంది, అలానే ఆ నగదును తీసుకోవాలని ATM స్క్రీన్‌పై మీకు సూచన కనిపిస్తుంది (అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నుండి నగదు డెబిట్ అయినట్లుగా మీ ఇష్యూయర్ నుండి మీకు సమాచారం అందుతుంది).

ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు డెబిట్ అయినప్పటికీ, ఏదైనా కారణం(ల) వల్ల లావాదేవీ విజయవంతం కాకపోతే, ఆ సమస్యకు పరిష్కారం కోసం మరియు/లేదా మీ అకౌంట్ నుండి డెబిట్ అయిన అమౌంట్‌ను వెనక్కి తీసుకురావడం కోసం మీరు తప్పనిసరిగా మీ ఇష్యూయర్‌ను సంప్రదించాలి. ఈ విషయంలో PhonePeకి ఎటువంటి బాధ్యత ఉండదు.

నగదును విత్‌డ్రా చేస్తున్నప్పుడు, ఆ నగదు ATM నుండి బయటకు వచ్చి, మీరు దాన్ని తీసుకునే వరకు ATMను విడిచి వెళ్లకూడదని దయచేసి గమనించండి. నగదు విత్‌డ్రా చేయడానికి సంబంధించి NPCI / RBI లేదా మీ ఇష్యూయర్ నిర్దేశించిన లావాదేవీ పరిమితులకు మీరు లోబడి ఉండాలి (వీటిని మీకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఎప్పటికప్పుడు మార్చవచ్చు). ఇంకా, ఈ సౌకర్యం కింది పూర్తి చేసిన లావాదేవీలను మీరు మీ PhonePe యాప్‌లోని ‘హిస్టరీ’ విభాగంలో, అలానే మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో చూడవచ్చు.

మీరు వీటికి అంగీకారం తెలుపుతున్నారు: (i) PhonePe ఈ సౌకర్యాన్ని కేవలం తన యాప్‌లో మాత్రమే అందిస్తోంది, ఈ సౌకర్యం అందుబాటులో ఉన్న అర్హతగల ATMల గురించి PhonePe వద్ద ఎటువంటి సమాచారం ఉండదు. సంబంధిత ATMలో ఈ సౌకర్యం ఉందో లేదో చెక్‌ చేసుకోవడం మీ బాధ్యత; (ii) అథెంటికేషన్ విజయవంతమైన తర్వాత (మీ PhonePe యాప్, ATM మెషీన్ ద్వారా నిర్ధారణ వచ్చిన తర్వాత) బయటకు వచ్చిన నగదును తీసుకోవాల్సిన బాధ్యత మీదే, అలానే అందుకున్న నోట్లు: (a) పాడైపోయినవి, దెబ్బతిన్నవి లేదా నకిలీవి కావని, అలానే (b) మీరు విత్‌డ్రా చేయాలనుకున్న అమౌంట్‌కు సరిపడా నోట్లు ఉన్నాయా లేదా చెక్‌ చేసుకోవాలి, ఈ విషయంలో PhonePeకు ఎలాంటి బాధ్యతా ఉండదు. ఈ సౌకర్యం వినియోగానికి, నగదు విత్‌డ్రాకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, మీరు నేరుగా మీ ఇష్యూయర్‌ను సంప్రదించండి.

PhonePe UPI ద్వారా క్రెడిట్ లైన్

arrow icon

మీ ఇష్యూయర్ మీకు క్రెడిట్ లైన్‌ను మంజూరు చేసినట్లయితే, ఈ నియమాల ప్రకారం ఆ క్రెడిట్ లైన్‌ను (“క్రెడిట్ లైన్‌”) PhonePe UPIకి లింక్ చేసే అవకాశాన్ని మేము మీకు కల్పించవచ్చు. PhonePe UPIకి క్రెడిట్ లైన్‌ను లింక్ చేయడానికి సంబంధించి, PhonePe యాప్‌లో నిర్దేశించిన కొన్ని దశలను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ క్రెడిట్ లైన్ విజయవంతంగా PhonePe UPIకి లింక్ అయిన తర్వాత, క్రెడిట్ లైన్ ద్వారా పేమెంట్లను అందుకునే ఎంపిక చేసిన మర్చంట్లకు మీరు పేమెంట్లు చేయవచ్చు. మీ PhonePe అకౌంట్​​​కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌తో అనుసంధానమైన క్రెడిట్ లైన్‌ను మాత్రమే మీరు మీ PhonePe UPIకి లింక్ చేయగలరని దయచేసి గమనించండి.

ఈ సౌకర్యానికి సంబంధించి, PhonePe ఎనేబుల్ చేసిన ఇష్యూయర్ల జాబితాను మీరు PhonePe యాప్‌లోని సంబంధిత విభాగంలో చూడవచ్చు. మీకు క్రెడిట్ లైన్‌ను మంజూరు చేసిన ఇష్యూయర్‌ను మీరు ఎంచుకున్న తర్వాత, PhonePe మీ క్రెడిట్ లైన్ వివరాలను పొందుతుంది. ఈ ప్రయోజనం నిమిత్తం, మీ క్రెడిట్ లైన్ వివరాలను వెరిఫై చేయడానికి మీ ఫోన్ నుండి ఒక SMSను మీ మొబైల్ నెట్‌వర్క్ పంపడానికి మీరు అంగీకరిస్తున్నారు, అయితే దీనికి సాధారణ SMS ఛార్జీలు వర్తించవచ్చు. అవసరమైన దశలు పూర్తయిన తర్వాత, ఆ క్రెడిట్ లైన్‌కు సంబంధించి ఒక ప్రత్యేకమైన VPA క్రియేట్‌ అవుతుంది, అలానే ఆ క్రెడిట్ లైన్ మీ PhonePe యాప్‌కు లింక్ అవుతుంది. మీ ఇష్యూయర్ మంజూరు చేసిన ఇటువంటి పలు క్రెడిట్ లైన్(ల)ను, పైన పేర్కొన్న విధంగా, PhonePe యాప్‌లోని PhonePe UPIకి యాడ్‌ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది.

VPA క్రియేట్‌ అయిన తర్వాత, PhonePe యాప్‌కు లింక్ చేసిన మీ క్రెడిట్ లైన్‌కు UPI పిన్‌ను సెట్ చేయడానికి, PhonePeలో అందుబాటులో ఉన్న ఏవైనా పద్ధతు(ల)లో ఏదో ఒకటి మీరు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న పద్ధతి ప్రకారం, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ మొదలైన వాటితో సహా క్రెడిట్ లైన్‌కు సంబంధించిన వివరాలను వెరిఫై చేయమని, అలానే మీ క్రెడిట్ లైన్‌కు UPI పిన్‌ను సెట్ చేయమని PhonePe మిమ్మల్ని అడగవచ్చు.

PhonePe UPIతో క్రెడిట్ లైన్ పేమెంట్లను స్వీకరించే ఎంపిక చేసిన మర్చంట్లకు పేమెంట్లు చేయడం కోసం, మీరు మీ UPI పిన్​ను ఎంటర్‌ చేసి లేదా మీ బయోమెట్రిక్ క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించి అటువంటి పేమెంట్లను ఆథరైజ్ చేయాలి. PhonePe UPIతో లింక్ అయిన మీ క్రెడిట్ లైన్‌ను కేవలం అనుమతించిన మర్చంట్లకు పేమెంట్లు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారని, అలానే ఇతర పేమెంట్లు (వ్యక్తులకు డబ్బు బదిలీ, బ్యాంక్ అకౌంట్ బదిలీ/నగదు విత్‌డ్రా వంటి వాటితో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా) చేయడానికి ఉపయోగించరని మీరు అంగీకరిస్తున్నారు.

అంతేగాక, మీరు కింది వాటికి కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు: (i) మీ ఇష్యూయర్ నిర్దేశించిన క్రెడిట్ లైన్ పరిమితి, (ii) UPI లావాదేవీలకు వర్తించే ఏవైనా లావాదేవీ పరిమితి(లు); (iii) మీ క్రెడిట్ లైన్ వినియోగానికి వర్తించే ఇతర నియమ, నిబంధనలు/ఇష్యూయర్ నియమ, నిబంధనలు.

వీటికి అదనంగా, PhonePe యాప్‌లో లింక్ చేసిన మీ క్రెడిట్ లైన్‌కు సంబంధించి ‘అందుబాటులో ఉన్న క్రెడిట్ లైన్ బ్యాలెన్స్’ను చెక్‌ చేసే ఎంపిక మీకు ఉంటుంది. ఈ సౌకర్యం కింద, మీ ఇష్యూయర్ అందించిన విధంగా ‘అందుబాటులో ఉన్న క్రెడిట్ లైన్ బ్యాలెన్స్’ను మేము ‘ఉన్నది ఉన్నట్లుగా’ చూపెడతామని, దానికి సంబంధించి ఏవైనా వ్యత్యాసాలు, లోపాలు లేదా అసమానతలు ఉంటే, వాటికి మేము ఎలాంటి బాధ్యత వహించబోమని మీరు అర్థం చేసుకున్నారు. PhonePe UPIతో లింక్ అయిన క్రెడిట్ లైన్‌తో చేసిన పేమెంట్ల హిస్టరీని మీరు PhonePe యాప్‌లోని ‘హిస్టరీ’ విభాగంలో చూడవచ్చు.

మీరు కింది వాటికి అంగీకరిస్తున్నారు:

  1. మీకు, మీ ఇష్యూయర్‌కు మధ్య కుదిరిన ఒప్పంద నియమాల ప్రకారం మీ ఇష్యూయర్ ఈ క్రెడిట్ లైన్‌ను మంజూరు చేస్తారు. మీ క్రెడిట్ లైన్ అర్హతను లేదా అర్హతా ప్రమాణాలను నిర్ణయించడంలో, క్రెడిట్‌ లైన్‌కు సంబంధించిన క్రెడిట్ పరిమితిని నిర్దేశించడంలో మరియు/లేదా వాటికి సంబంధించిన ఏవైనా రిస్క్‌ల విషయంలో PhonePeకి ఎటువంటి పాత్ర లేదు. PhonePe కేవలం మీ క్రెడిట్ లైన్‌ను PhonePe యాప్‌లోని PhonePe UPIకి లింక్ చేసుకునే సదుపాయాన్ని మాత్రమే కల్పిస్తుంది. మీకు, మీ ఇష్యూయర్‌కు మధ్య కుదిరిన ఒప్పంద నియమా(ల)ను నిర్ణయించడంలో లేదా వెరిఫై చేయడంలో ఉన్న రిస్క్‌లకు గానీ, లేదా ఆ క్రెడిట్ లైన్‌కు సంబంధించిన మరే ఇతర అంశాలకు గానీ మేము బాధ్యత వహించము.
  1. ఈ సౌకర్యం కింద PhonePe UPIతో లింక్ చేసిన క్రెడిట్ లైన్‌ను ఉపయోగించి మీరు ఖర్చు చేసే ఏ అమౌంట్‌ అయినా, సంబంధిత మర్చంట్‌కు చేసిన పేమెంట్‌గా మాత్రమే పరిగణించడమవుతుంది. క్రెడిట్ లైన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను, మీ ఇష్యూయర్ జారీ చేసిన బిల్లు(లలో) పేర్కొన్న గడువు తేదీలోపు, మీ ఇష్యూయర్(లు) నిర్దేశించిన పద్ధతులు/నియమాల ప్రకారం మీరు తిరిగి చెల్లించాలి. ఈ ప్రక్రియలో PhonePeకి ఎటువంటి సంబంధం లేదు.

PhonePe యాప్‌లో PhonePe UPI ద్వారా మీ క్రెడిట్ లైన్‌ను ఉపయోగించి మీరు ఆథరైజ్ చేసిన లావాదేవీలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే, వాటిని UPI వినియోగ నియమాలోని ఫిర్యాదుల పరిష్కారం విభాగంలో పేర్కొన్న పద్ధతి ప్రకారం, అలానే UPI లావాదేవీలకు సంబంధించి NPCI (ఎప్పటికప్పుడు) నిర్దేశించే ఇతర ప్రక్రియల ప్రకారం పరిష్కారమవుతుంది. ఏవైనా రీఫండ్‌లు/రివర్సల్స్‌ అనేవి UPI లావాదేవీలకు వర్తించే కాలవ్యవధి ప్రకారం మరియు/లేదా మర్చంట్ పాలసీ/నియమాల ప్రకారం జరుగుతాయి. ఒకవేళ మీరు PhonePe యాప్‌లో క్రెడిట్ లైన్ ఉపయోగించి చేసిన పేమెంట్లకు సంబంధించి ఏవైనా రీఫండ్‌లు వస్తే, అవి మీకు, మీ ఇష్యూయర్‌కు మధ్య కుదిరిన ఒప్పంద నియమాల ప్రకారం క్రెడిట్ లైన్‌లో జమ అవుతాయి/సర్దుబాటు అవుతాయి.

arrow icon

UPI సర్కిల్

arrow icon

NPCI మరియు/లేదా RBI ఎప్పటికప్పుడు జారీ చేసిన వర్తించే మార్గదర్శకాలు, అలానే ఈ నియమ, నిబంధనలకు లోబడి, PhonePe యాప్‌లో ‘UPI సర్కిల్’ ఫీచర్‌ను పొందే సదుపాయాన్ని PhonePe మీకు కల్పించవచ్చు.

UPI సర్కిల్‌ ద్వారా, ఒక ప్రైమరీ యూజర్ తన UPI ఐడిని, సెకండరీ యూజర్ UPI ఐడితో లింక్ చేయవచ్చు. దీని వల్ల, ప్రైమరీ యూజర్ తరపున సదరు సెకండరీ యూజర్ UPI పేమెంట్లు/లావాదేవీలు చేయడానికి వీలవుతుంది.

ప్రైమరీ యూజర్, సెకండరీ యూజర్ మధ్య జరిగే ఈ అనుసంధానం అనేది PhonePe యాప్‌లో అందుబాటులో ఉన్న మేరకు, ‘ఫుల్ డెలిగేషన్’ లేదా ‘పార్షియల్ డెలిగేషన్’ ప్రాతిపదికన ఉండవచ్చు.

సందర్భాన్ని బట్టి, వేరే అర్థాలు ఏవీ లేకపోతే, కింది పదాలకు ఇక్కడ పేర్కొన్న అర్థాలు వర్తిస్తాయి.

  • “ఫుల్ డెలిగేషన్”: ప్రతి లావాదేవీని ప్రైమరీ యూజర్ ఆథరైజ్ చేయాల్సిన అవసరం లేకుండా, సెకండరీ యూజర్ స్వయంగా UPI లావాదేవీలను ప్రారంభించి, పూర్తి చేయడానికి ప్రైమరీ యూజర్ అనుమతిని ఇచ్చే విధానం అని అర్థం. ఫుల్ డెలిగేషన్ విషయంలో, NPCI సూచించిన గరిష్ఠ పరిమితి వరకు UPI లావాదేవీలను పూర్తి చేయడానికి సెకండరీ యూజర్‌కు ప్రైమరీ యూజర్ అనుమతిని ఇవ్వవచ్చు.
  • “పార్షియల్ డెలిగేషన్”: UPI లావాదేవీలను సెకండరీ యూజర్ ప్రారంభించడానికి ప్రైమరీ యూజర్ అనుమతిని ఇచ్చే విధానం అని అర్థం. అయితే ఇందులో, ప్రతి లావాదేవీని ప్రైమరీ యూజర్ తన UPI పిన్​ను ఎంటర్‌ చేసి ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది. పార్షియల్ డెలిగేషన్ విషయంలో, ప్రస్తుతం ఉన్న UPI పరిమితుల వరకు లావాదేవీలను పూర్తి చేయడానికి సెకండరీ యూజర్‌కు ప్రైమరీ యూజర్ అనుమతిని ఇవ్వవచ్చు.
  • “ప్రైమరీ యూజర్” : PhonePe యాప్‌లో UPI ఆధారిత సర్వీస్‌లను/సౌకర్యాలను పొందుతూ, తన బ్యాంక్ అకౌంట్ నుండి UPI సర్కిల్ ఫీచర్ ద్వారా UPI పేమెంట్లు చేయడానికి సెకండరీ యూజర్‌కు అధికారాన్ని ఇచ్చే వ్యక్తి అని అర్థం.
  • “సెకండరీ యూజర్”: ప్రైమరీ యూజర్ బ్యాంక్ అకౌంట్ నుండి UPI సర్కిల్ లావాదేవీలు చేయడానికి, సదరు ప్రైమరీ యూజర్ నుండి లేదా మరొక UPI యాప్‌ను ఉపయోగిస్తున్న ప్రైమరీ యూజర్ నుండి అనుమతి పొందిన వ్యక్తి అని అర్థం.

మీరు కింది వాటిని అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు: 

మీరు ప్రైమరీ యూజర్ అయితే:

సెకండరీ యూజర్ UPI ఐడిని మీ UPI ఐడితో లింక్ చేయడానికి ముందు, వారి QR కోడ్ లేదా UPI ఐడిని వెరిఫై చేయడానికి, అలానే సరైన వ్యక్తినే సెకండరీ యూజర్‌గా ఆథరైజ్ చేస్తున్నామని నిర్ధారించుకోవడానికి వీలుగా మీ కాంటాక్ట్ లిస్ట్ నుండి వారి నంబర్‌ను ఎంచుకోవడం వంటి వాటికి మీరే పూర్తిగా బాధ్యత వహించాలి.

సెకండరీ యూజర్ ఎవరో, వారి గుర్తింపు ఏంటో మీకు తెలుసని, అలానే UPI సర్కిల్‌ను ఉపయోగించే క్రమంలో మీరు, మీరు అనుమతి ఇచ్చిన సెకండరీ యూజర్, వర్తించే భారతీయ చట్టాలకు లోబడి ఉంటారని హామీ ఇస్తున్నారు. 

మీ UPI ఐడితో లింక్‌ అయిన బ్యాంక్ అకౌంట్ నుండి ఫుల్ డెలిగేషన్ లేదా పార్షియల్ డెలిగేషన్ ద్వారా UPI లావాదేవీలు చేయడానికి సెకండరీ యూజర్‌కు అనుమతిని ఇచ్చే బాధ్యత పూర్తిగా మీదే. తదనుగుణంగా, మీరు యాడ్ చేసిన/ఆథరైజ్ చేసిన సెకండరీ యూజర్ చేసే అన్ని లావాదేవీలకు, చర్యలకు, ఒకవేళ సెకండరీ యూజర్ UPI సర్కిల్‌ను PhonePe యాప్‌లో గానీ లేదా మరే ఇతర UPI యాప్‌లో గానీ ఉపయోగిస్తున్నా సరే, మీరే బాధ్యత వహించాలి. 

ఫుల్ డెలిగేషన్ ప్రాతిపదికన సెకండరీ యూజర్ UPI ఐడిని లింక్ చేయడానికి:

  • మీకు, సెకండరీ యూజర్‌కు మధ్య ఉన్న బంధం (అంటే, కుటుంబ సభ్యుడు – పిల్లలు/తల్లిదండ్రులు/భార్య లేదా భర్త/తోబుట్టువులు/ఇతర కుటుంబ సభ్యులు లేదా ఇంటి పనివారు లేదా చిన్న వ్యాపార ఉద్యోగి) గురించి ఖచ్చితమైన వివరాలను అందించే బాధ్యత మీదే.
  • ఫుల్ డెలిగేషన్ ప్రాతిపదికన లింక్ చేయడానికి ముందు, మీరు సెకండరీ యూజర్ వివరాలను (అంటే సెకండరీ యూజర్‌ గుర్తింపును నిరూపించే అధికారికంగా వ్యాలిడ్‌ అయ్యే డాక్యుమెంట్‌ రకం, దాని విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) అందించాల్సి ఉంటుందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
  • సెకండరీ యూజర్ సమాచారాన్ని వేరొకరికి తెలపడంతో సహా, ఈ నియమ, నిబంధనల ప్రకారం అవసరమైన పనులను పూర్తి చేయడానికి కావాల్సిన సమ్మతిని, అనుమతిని ఆ సెకండరీ యూజర్ నుండి మీరు పొందుతున్నారని నిర్ధారిస్తున్నారు.
  • మీరు అందించిన సెకండరీ యూజర్ వివరాలు సరైనవని, ప్రామాణికమైనవని మీరు నిర్ధారిస్తున్నారు.
  • సెకండరీ యూజర్‌కు సంబంధించి మీరు అందించే ఏదైనా డాక్యుమెంట్‌ మరియు/లేదా సమాచార ప్రామాణికత, ఖచ్చితత్వం, విశ్వసనీయతకు మీరు మాత్రమే బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు.
  • ఫుల్ డెలిగేషన్ లింకేజ్ అనేది సెకండరీ యూజర్ సమ్మతికి లోబడి ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు; అంటే (i) మీరు పంపిన అటువంటి సెకండరీ యూజర్ వివరాల నిర్ధారణకు (ii) ఫుల్ డెలిగేషన్ లింకేజ్‌ను అంగీకరించడానికి సెకండరీ యూజర్‌ సమ్మతి కావాలి.
  • UPI సర్కిల్ ఫీచర్‌కు సంబంధించి మీరు ఏదైనా థర్డ్ పార్టీకి చెందిన వ్యక్తిగత డేటా లేదా సమాచారాన్ని వేరొకరికి పంపడం వల్ల కలిగే నష్టాల నుండి (థర్డ్ పార్టీ క్లెయిమ్‌లతో సహా) PhonePeకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా రక్షించడానికి, ఆ నష్టాలకు బాధ్యత వహించడానికి మీరు అంగీకరిస్తున్నారు.

ఒక ప్రైమరీ యూజర్ గరిష్ఠంగా ఐదుగురు సెకండరీ యూజర్లను నియమించుకోవచ్చు, అయితే ఒక సెకండరీ యూజర్ కేవలం ఒక్క ప్రైమరీ యూజర్ నుండి మాత్రమే అనుమతిని పొందగలరు. 

UPI సర్కిల్ కోసం సెకండరీ యూజర్‌కు ఇచ్చిన అనుమతిని మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా వెనక్కి తీసుకోవచ్చు. UPI సర్కిల్ కింద సెకండరీ యూజర్ చేసిన అన్ని లావాదేవీలను మీరు PhonePe యాప్, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో చూడవచ్చు. 

UPI సర్కిల్ ఫీచర్‌ను ఉపయోగించి మీరు యాడ్‌ చేసిన/అనుమతించిన సెకండరీ యూజర్ చేసిన అనధికార లావాదేవీలకు NPCI లేదా PhonePe బాధ్యత వహించవు. UPI సర్కిల్‌ను ఉపయోగించి సెకండరీ యూజర్ చేసే లావాదేవీలను PhonePe వెరిఫై చేయదు లేదా పర్యవేక్షించదు; మీరు ఇచ్చిన అనుమతి ఆధారంగానే లావాదేవీలను పూర్తి చేస్తుంది/ప్రాసెస్ చేస్తుంది. 

వర్తించే చట్టం లేదా UPI, UPI సర్కిల్‌కు వర్తించే ఏవైనా నియమ, నిబంధనలను పాటించడంలో మీరు లేదా సెకండరీ యూజర్ లేదా మరే ఇతర వ్యక్తి చేసే ఏదైనా పని లేదా పొరపాట్ల వల్ల కలిగే నష్టాలకు, విధ్వంసానికి లేదా ఆర్థిక బాధ్యతలకు PhonePe మీకు లేదా సెకండరీ యూజర్‌కు లేదా ఇతర వ్యక్తికి జవాబుదారీ కాదు. మీరు యాడ్‌ చేసిన/ఆథరైజ్ చేసిన సెకండరీ యూజర్ కొనుగోలు చేసిన/పొందుతున్న ప్రోడక్ట్‌లు/సర్వీస్‌లకు PhonePe ఎటువంటి బాధ్యత వహించదని మీరు అర్థం చేసుకున్నారు. సెకండరీ యూజర్‌ PhonePe యాప్‌లో లేదా మరేదైనా UPI యాప్‌లో UPI సర్కిల్‌ను ఉపయోగిస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, దానికి సంబంధించిన అన్ని బాధ్యతలను PhonePe స్పష్టంగా తిరస్కరిస్తుంది.

PhonePe ఎప్పటికప్పుడు నిర్దేశించే నిర్ణీత కాల వ్యవధిలో, UPI సర్కిల్ ద్వారా PhonePe యాప్‌లో ఎటువంటి లావాదేవీలు జరగని పక్షంలో, ఏ సెకండరీ యూజర్‌కైనా ఇచ్చిన అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసే లేదా శాశ్వతంగా రద్దు చేసే హక్కు PhonePeకు ఉంటుంది.

మీరు ఒక సెకండరీ యూజర్ అయితే:

UPI సర్కిల్‌ను ఉపయోగించే క్రమంలో, వర్తించే భారతీయ చట్టాలకు, UPI, UPI సర్కిల్‌కు వర్తించే నియమ, నిబంధనలను పాటిస్తారని మీరు హామీ ఇస్తున్నారు. 

ఈ నియమ, నిబంధనలు PhonePe యాప్‌ను ఉపయోగించే ప్రతి సెకండరీ యూజర్‌కు వర్తిస్తాయి; మిమ్మల్ని ఎవరైనా ప్రైమరీ యూజర్ యాడ్ చేశారా లేదా మరొక UPI యాప్‌కు చెందిన ప్రైమరీ యూజర్ యాడ్ చేశారా అన్న దానితో సంబంధం లేకుండా ఇవి వర్తిస్తాయి.

మీ UPI ఐడిని ప్రైమరీ యూజర్ UPI ఐడికి లేదా UPI సర్కిల్ కింద మిమ్మల్ని యాడ్‌ చేసిన/అనుమతిని ఇచ్చిన మరో UPI ప్రైమరీ యూజర్‌కు లింక్ చేయాలనే అభ్యర్థనను మీరు ఆమోదించడం ద్వారా, మీ పేరు, ఫోన్ నంబర్, UPI ఐడి, లావాదేవీ వివరాలను ప్రైమరీ యూజర్‌తో లేదా మరొక UPI యాప్ ప్రైమరీ యూజర్‌కు (UPI సర్కిల్ కింద మిమ్మల్ని యాడ్‌ చేసిన/అనుమతి ఇచ్చిన యూజర్‌), UPI సర్కిల్ లావాదేవీల ప్రాసెసింగ్‌లో పాల్గొన్న ఇతర థర్డ్ పార్టీలకు పంపడానికి ఇందుమూలంగా అంగీకరిస్తున్నారు.

సంబంధిత ప్రైమరీ యూజర్ అందించిన మీ సమాచారం మరియు/లేదా డాక్యుమెంట్లు సరైనవని, ప్రామాణికమైనవని మీరు నిర్ధారించి, అంగీకరిస్తున్నారు.

మీరు ఎప్పుడైనా PhonePe యాప్‌లో ప్రైమరీ యూజర్ (UPI సర్కిల్ కింద మిమ్మల్ని యాడ్‌ చేసిన/అనుమతి ఇచ్చిన వ్యక్తి) నుండి మీ UPI ఐడిని డీ-లింక్ చేసుకోవచ్చు.

ఒక సెకండరీ యూజర్‌గా మీరు PhonePe యాప్‌ను ఉపయోగించి చేసే UPI లావాదేవీల వల్ల లేదా వాటికి సంబంధించి తలెత్తే ఏవైనా, అన్ని నష్టాల నుండి (థర్డ్ పార్టీ క్లెయిమ్‌ల వల్ల కలిగే నష్టాలతో సహా) PhonePeకి ఎటువంటి నష్టం కలగకుండా పరిహారం చెల్లించడానికి, ఎటువంటి హాని కలగకుండా చూసేందుకు మీరు అంగీకరిస్తున్నారు.

UPI సర్కిల్‌కు సంబంధించిన ఇతర నియమాలు:

ఫుల్ డెలిగేషన్ పద్ధతిలో UPI సర్కిల్ ద్వారా లావాదేవీలు చేయడానికి, ఏ సమయంలోనైనా నెలకు గరిష్ఠంగా ₹15,000/- (పదిహేను వేల రూపాయలు), అలానే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా ₹5,000/- (ఐదు వేల రూపాయలు) పరిమితి ఉంటుంది.

ఫుల్ డెలిగేషన్ పద్ధతిలో, ఒక సెకండరీ యూజర్ UPI ఐడిని ప్రైమరీ యూజర్ UPI ఐడితో గరిష్ఠంగా 5 (ఐదు) సంవత్సరాలు, కనిష్ఠంగా 1 (ఒక) నెల కాలపరిమితి వరకు లింక్ చేయవచ్చు.

పైన పేర్కొన్న లావాదేవీ పరిమితులు, కాలవ్యవధులను NPCI మరియు/లేదా RBI ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఎప్పటికప్పుడు మార్చవచ్చు.

పైన ప్రత్యేకంగా పేర్కొన్నవి మినహా, PhonePe UPIకి సంబంధించి ఇక్కడ పేర్కొన్న అన్ని నియమాలు UPI సర్కిల్‌కు కూడా వర్తిస్తాయి. ఈ విభాగం అంటే UPI సర్కిల్, PhonePe UPI వినియోగ నియమాల (UPI సర్కిల్ విభాగాన్ని మినహాయించి) మధ్య ఏదైనా వైరుధ్యం ఉంటే, ఈ విభాగంలోని నియమాలే తుదిగా అమలవుతాయి. UPI సర్కిల్‌ను ఉపయోగించి ఆథరైజ్ చేసిన లావాదేవీలకు సంబంధించిన వివాదాలు అన్నీ PhonePe UPIకి వర్తించే ప్రక్రియ ప్రకారం పరిష్కారమవుతాయి.

ప్రైమరీ యూజర్‌తో సెకండరీ యూజర్‌ UPI ఐడిని విజయవంతంగా ఆథరైజ్ చేసి, లింక్ చేసిన తర్వాత, 30 (ముప్పై) నిమిషాల కూలింగ్ పీరియడ్ ఉంటుంది, ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలను చేయడానికి అనుమతి ఉండదు. అంతేకాకుండా, ప్రైమరీ యూజర్‌తో సెకండరీ యూజర్‌ UPI ఐడిని లింక్‌ చేసిన మొదటి 24 గంటల పాటు, లింకింగ్‌ విజయవంతమైన 24 గంటల పాటు, లావాదేవీల పరిమితి ₹. 5000/-గా ఉంటుంది.

పార్షియల్ డెలిగేషన్ కోసం ప్రస్తుతం ఉన్న సాధారణ UPI పరిమితులు వర్తిస్తాయి.

UPI సర్కిల్ ఫీచర్‌ను పొందడానికి మరియు/లేదా వినియోగాన్ని కొనసాగించడానికి వీలుగా మీరు మీ PhonePe యాప్‌లో ‘అప్లికేషన్ లాక్’ సౌకర్యాన్ని ఎనేబుల్ చేసేందుకు PhonePeకి అనుమతి ఇవ్వవలసి ఉంటుందని మీరు అంగీకరించి, అర్థం చేసుకున్నారు. దీనికి తగ్గట్లుగా, ఒకవేళ అది డిసేబుల్ చేసి ఉంటే, UPI సర్కిల్ ఫీచర్‌ను ఉపయోగించడానికి లేదా వినియోగాన్ని కొనసాగించడానికి వీలుగా మీ PhonePe యాప్‌ను లాక్ చేయడం కోసం, PhonePeను ఎనేబుల్ చేసేందుకు, మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లను వెంటనే మార్చవలసి ఉంటుంది. ఒకసారి ఎనేబుల్ చేసిన తర్వాత, మీరు మీకు నచ్చిన పద్ధతిని ఉపయోగించి, అంటే ఫేస్ ఐడి, బయోమెట్రిక్స్, యాప్ కోడ్ మొదలైన పద్ధతుల్లో PhonePe యాప్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

ఈ విభాగంలో దీనికి విరుద్ధంగా ఏది ఉన్నప్పటికీ, PhonePe తన పూర్తి అభీష్టానుసారం, మీకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, ఎప్పుడైనా UPI సర్కిల్ సర్వీస్‌లకు మీకు ఉన్న యాక్సెస్‌ను నిలిపివేసే లేదా రద్దు చేసే, లేదా మీ PhonePe యాప్ పాస్‌వర్డ్ లేదా UPI పిన్‌ను మార్చమని మిమ్మల్ని కోరే హక్కు PhonePeకు ఉంది.

UPI ఆటోపే, రిజర్వ్ పే

arrow icon

ఈ ఫీచర్ల ద్వారా, యూజర్‌ ఆమె/అతని బ్యాంక్ అకౌంట్ నుండి భవిష్యత్తులో జరగబోయే డెబిట్‌(లు) లావాదేవీలను ముందుగానే ఆథరైజ్‌ చేయవచ్చు. ఈ ఫంక్షనాలిటీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌లో అందుబాటులో ఉన్నాయి: https://www.phonepe.com/te/terms-conditions/autopay

సాధారణ సమాచారం: UPI పార్టిసిపెంట్ల పాత్రలు, బాధ్యతలు

NPCI:

  1. UPI ప్లాట్‌ఫామ్‌ NPCI యాజమాన్యంలో ఉంది, అలానే UPI ప్లాట్‌ఫామ్‌‌ను NPCI నిర్వహిస్తుంది.
  2. UPIకి సంబంధించి నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలు, పార్టిసిపెంట్ల సంబంధిత పాత్రలు, బాధ్యతలు, లయబిలిటీలను NPCI నిర్దేశిస్తుంది. ఇందులో లావాదేవీల ప్రాసెసింగ్, సెటిల్‌మెంట్, వివాదాల నిర్వహణ, సెటిల్‌మెంట్‌కు సంబంధించిన క్లియరింగ్ కట్-ఆఫ్‌లు కూడా ఉంటాయి.
  3. UPIలో ఇష్యూయర్లు, PSP బ్యాంక్‌లు, TPAPలు, PPI ఇష్యూయర్లు, ఇతర పార్టిసిపెంట్ల భాగస్వామ్యాన్ని NPCI ఆమోదిస్తుంది.
  4. NPCI సురక్షితమైన, భద్రతతో కూడిన, సమర్థవంతమైన UPI వ్యవస్థను, నెట్‌వర్క్‌ను అందిస్తుంది.
  5. UPIలో పాల్గొనే సభ్యులకు ఆన్‌లైన్ లావాదేవీల రూటింగ్, ప్రాసెసింగ్, సెటిల్‌మెంట్ సర్వీస్‌లను NPCI అందిస్తుంది.
  6. NPCI నేరుగా లేదా థర్డ్ పార్టీ ద్వారా, UPI పార్టిసిపెంట్లపై ఆడిట్‌ను నిర్వహించవచ్చు, అలానే UPIలో వారు పాల్గొనడానికి సంబంధించిన డేటా, సమాచారం, రికార్డులను అడగవచ్చు.
  7. నివేదికలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఛార్జ్‌బ్యాక్‌లను పంపడానికి, అలానే UPI లావాదేవీల స్టేటస్‌ను అప్‌డేట్ చేయడానికి కావాల్సిన సిస్టమ్ యాక్సెస్‌ను UPIలో పాల్గొనే బ్యాంక్‌లు/సంస్థలకు NPCI కల్పిస్తుంది.

PSP బ్యాంక్:

  1. PSP బ్యాంక్ అనేది UPIలో సభ్యత్వం ఉన్న బ్యాంక్, ఇది UPI పేమెంట్ సౌకర్యాన్ని పొందడానికి, అలానే అదే సౌకర్యాన్ని TPAPకు (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌కు) అందించడానికి UPIతో లింక్‌ అవుతుంది, తద్వారా TPAP, ఎండ్ యూజర్లు/కస్టమర్లు/మర్చంట్లు UPI పేమెంట్లు చేయడానికి, అందుకోవడానికి వీలు కల్పిస్తుంది.
  2. PSP బ్యాంక్ తన సొంత యాప్ ద్వారా లేదా TPAP యాప్ ద్వారా, ఎండ్ యూజర్లు/కస్టమర్లను UPIలో ఆన్‌-బోర్డ్ చేసి, రిజిస్టర్ చేస్తుంది, అలాగే వారి బ్యాంక్ అకౌంట్లను వారి సంబంధిత UPI నంబర్లకు లింక్ చేస్తుంది.
  3. ఎండ్ యూజర్ రిజిస్ట్రేషన్ సమయంలో, తన సొంత యాప్ ద్వారా లేదా TPAP యాప్ ద్వారా సదరు యూజర్‌ను అథెంటికేట్‌ చేసే బాధ్యత PSP బ్యాంక్‌దే.
  4. PSP బ్యాంక్ తన యూజర్లకు/కస్టమర్లకు TPAPకు చెందిన UPI యాప్ అందుబాటులో ఉండేలా చేయడం కోసం, TPAPలను ఎంగేజ్ చేసి, వాటిని ఆన్‌బోర్డ్‌ చేస్తుంది.
  5. TPAP, దాని సిస్టమ్‌లు UPIలో పనిచేసేందుకు తగినంత సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత PSP బ్యాంక్‌పై ఉంటుంది.
  6. UPI యాప్ భద్రత, UPI లావాదేవీల డేటాతో సహా ఎండ్ యూజర్/కస్టమర్ సమాచారం, డేటా సమగ్రతను కాపాడటం కోసం, TPAPకు చెందిన UPI యాప్, సిస్టమ్‌లను ఆడిట్ చేశారని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత PSP బ్యాంక్‌పై ఉంటుంది.
  7. UPI లావాదేవీలను సులభతరం చేయడం కోసం సేకరించిన లావాదేవీల డేటాతో సహా మొత్తం పేమెంట్ డేటాను భారతదేశంలో మాత్రమే PSP బ్యాంక్ నిల్వ చేయాలి.
  8. కస్టమర్‌ UPI నంబర్‌తో లింక్ చేయడానికి, UPIలో అందుబాటులో ఉన్న బ్యాంక్‌లు/అకౌంట్​లు/ఇన్‌స్ట్రుమెంట్ల జాబితా నుండి తమకు నచ్చిన ఏ బ్యాంక్ అకౌంట్​నైనా ఎంచుకునే అవకాశాన్ని కస్టమర్లందరికీ కల్పించాల్సిన బాధ్యత PSP బ్యాంక్‌కు ఉంటుంది.
  9. ఎండ్ యూజర్/కస్టమర్ లేవనెత్తే ఫిర్యాదులు, వివాదాలను పరిష్కరించడానికి, ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత PSP బ్యాంక్‌కు ఉంటుంది

PhonePe (TPAP):

  1. PhonePe ఒక సర్వీస్ ప్రొవైడర్, ఇది PSP బ్యాంక్(ల) ద్వారా ఒక TPAPగా UPIలో పాల్గొంటుంది.
  2. UPIలో TPAP పాల్గొనడానికి సంబంధించి, PSP బ్యాంక్, NPCI నిర్దేశించిన అన్ని నిబంధనలు, ఆవశ్యకతలను పాటించాల్సిన బాధ్యత PhonePeపై ఉంటుంది.
  3. తమ సిస్టమ్‌లు UPIలో సమర్థవంతంగా పనిచేయడానికి తగినంత సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత PhonePeకు ఉంటుంది.
  4. UPIలో PhonePe పాల్గొనడానికి సంబంధించి, UPIకి సంబంధించి ఏదైనా చట్టబద్ధమైన లేదా రెగ్యులేటరీ సంస్థ నిర్దేశించిన అన్ని వర్తించే చట్టాలను, అలానే ఈ విషయానికి సంబంధించి NPCI జారీ చేసిన అన్ని సర్క్యులర్లు, మార్గదర్శకాలను పాటించాల్సిన బాధ్యత PhonePeకు ఉంటుంది. 
  5. UPI లావాదేవీలను సులభతరం చేయడం కోసం సేకరించిన లావాదేవీల డేటాతో సహా మొత్తం పేమెంట్ డేటాను, భారతదేశంలో మాత్రమే PhonePe నిల్వ చేయాలి.
  6. RBI, NPCI కోరినప్పుడు, UPIకి సంబంధించిన PhonePe డేటా, సమాచారం, సిస్టమ్‌లను పరిశీలించడానికి, అలానే  ఆడిట్ నిర్వహించడానికి RBI, NPCI, అలానే RBI/ NPCI నామినేట్ చేసిన ఇతర ఏజెన్సీలకు సహకరించాల్సిన బాధ్యత PhonePeకు ఉంటుంది.
  7. PhonePe యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పరిష్కార సదుపాయం ద్వారా, అలానే PhonePe తగినదని భావించే ఏవైనా ఇతర మార్గాలు, అంటే ఈమెయిల్, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌, IVR వంటి మార్గాల ద్వారా ఫిర్యాదులను పంపే అవకాశాన్ని PhonePe తన ఎండ్ యూజర్/కస్టమర్‌కు కల్పిస్తుంది.

ఛార్జీలు

arrow icon

PhonePe అకౌంట్​ను క్రియేట్‌ చేయడానికి PhonePe తన యూజర్ల నుండి ఎటువంటి ఫీజును వసూలు చేయదు; అయితే, వర్తించే చట్టాలకు లోబడి, ఎప్పటికప్పుడు ఫీజుల పాలసీని మార్చే హక్కు మాకు ఉంది. మేము ఏదైనా కొత్త సర్వీస్‌లకు ఫీజులను (వర్తించే పన్నులతో సహా) ప్రవేశపెట్టవచ్చు లేదా ప్రస్తుతం ఉన్న సర్వీస్‌లకు ఫీజులను సవరించవచ్చు/ప్రవేశపెట్టవచ్చు. ఫీజు(ల)లో ఏవైనా మార్పులు చేస్తే, దానికి తగ్గట్లుగా PhonePe యాప్/వెబ్‌సైట్/PhonePe ప్లాట్‌ఫామ్‌‌లో మీకు కనిపిస్తాయి, అలానే మార్పులు పోస్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా అమలులోకి వస్తాయి. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప, UPI ఇంటర్నేషనల్‌కు సంబంధించి, అన్ని ఫీజులను భారతీయ రూపాయలలో పేర్కొనడమవుతుంది. కొన్ని UPI లావాదేవీల కోసం మీ ఇష్యూయర్ మీ నుండి స్వల్ప లావాదేవీ ఫీజును వసూలు చేయవచ్చు – అటువంటి ఛార్జీల గురించి దయచేసి మీ ఇష్యూయర్‌ను సంప్రదించి తెలుసుకోండి.

లావాదేవీ పర్యవేక్షణ

arrow icon

రిస్క్ ఉన్న లావాదేవీలను గుర్తించడానికి PhonePe మీ కార్యకలాపాలను, లావాదేవీలను సమీక్షించవచ్చు. ఈ ప్రయత్నాల్లో మాకు సహాయం చేయడానికి మేము థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు చేసిన ఏదైనా లావాదేవీ అనుమానాస్పదంగా/అసాధారణంగా ఉన్నా, లేదా మరేదైనా కార్యకలాపం అనుమానాస్పదంగా లేదా అసాధారణంగా ఉందని మాకు అనుమానం కలిగినా, మేము మీ PhonePe UPI/PhonePe యాప్ యాక్సెస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయవచ్చు, లేదా మేము తగినదని భావించే ఏదైనా ఇతర చర్యలు తీసుకోవచ్చు.

రిస్క్ మేనేజ్‌మెంట్, మోసం జరిగిందనే అనుమానం కలగడం, చట్టవిరుద్ధమైన లావాదేవీలు, నిషేధిత వస్తువుల కొనుగోలు/విక్రయం, కాంప్రమైజ్ అయిన (ఇదివరకే వాటి క్రెడెన్షియల్స్‌ మోసగాళ్లకు తెలిసిన) లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కార్డ్‌లు లేదా UPI లేదా బ్యాంక్ అకౌంట్​లను ఉపయోగించడం, ఛార్జ్‌బ్యాక్‌లు/ఫిర్యాదులు వంటి కారణాల వల్ల లేదా వర్తించే చట్టాల ప్రకారం నిర్దేశించిన ఇతర కారణాల వల్ల, లేదా మాకు/ఇష్యూయర్/NPCI/RBIకి సరైనదనిపించిన ఇతర కారణాల వల్ల మీ లావాదేవీ తిరస్కరించవచ్చు. మేము దీనిపై మరింత విచారణ చేసి, మీ PhonePe అకౌంట్​ను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు లేదా తగిన ఇతర చర్యలను మేము తీసుకోవచ్చు. మేము అటువంటి లావాదేవీని, అలానే మీ వివరాలను, వర్తించే చట్టం ప్రకారం లేదా చట్టం నిర్దేశించిన మేరకు, ఏదైనా చట్టాన్ని అమలు చేసే సంస్థలు (లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు), ఇతర రెగ్యులేటరీ అధికారులు సహా సంబంధిత అధికారులకు నివేదించవచ్చు.

ఫిర్యాదుల పరిష్కారం

arrow icon

PhonePe మా స్పాన్సర్ PSP బ్యాంక్‌లు, NPCIతో త్రైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకుంది, వీటి ప్రకారం, PhonePe యాప్ ద్వారా కస్టమర్ల ఫిర్యాదులు/సమస్యల నమోదుకు, అలానే వాటి పరిష్కారానికి సహకరించాల్సిన బాధ్యత మాకు ఉంది.

మా ద్వారా ఆన్‌-బోర్డ్‌ అయిన కస్టమర్లందరూ, వారికి తలెత్తే UPI సంబంధిత అన్ని ఫిర్యాదులు/సమస్యల కోసం మొట్టమొదటిగా మమ్మల్నే సంప్రదించాలి. ఒకవేళ మేము మీ ఫిర్యాదును/సమస్యను పరిష్కరించలేకపోతే, మీరు ఆ ఫిర్యాదును ఇక్కడ వివరించిన క్రమంలో పంపాలి: మొదటగా PSP బ్యాంక్‌ను సంప్రదించాలి, ఆ తర్వాత మీ ఇష్యూయర్‌ను (మీ అకౌంట్​ ఉన్న బ్యాంక్‌ను) సంప్రదించాలి, అప్పటికీ పరిష్కారం కాకపోతే NPCIని సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఈ మార్గాలన్నింటినీ ఉపయోగించిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ మరియు/లేదా డిజిటల్ లావాదేవీల నిమిత్తం నియమించిన అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.

పైన పేర్కొన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలకు సంబంధించిన కాంటాక్ట్ వివరాల కోసం దయచేసి కింది సమాచారాన్ని చూడండి:

a)  PhonePeకి ఫిర్యాదు చేయండి:

  • PhonePe యాప్‌లో: మీరు సంబంధిత UPI లావాదేవీని ఎంచుకుని, దానికి సంబంధించి ఫిర్యాదును లేవనెత్తవచ్చు.
  • ఒకవేళ సదరు UPI లావాదేవీ PhonePe యాప్‌లో జరిగినట్లయితే, అన్ని రకాల UPI సంబంధిత ఫిర్యాదులను/సమస్యలను మీరు PhonePe లోనే నమోదు చేయవచ్చు.
  • మీరు ఒకసారి PhonePe యాప్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ ఫిర్యాదు స్టేటస్‌ను నేరుగా యాప్‌లోనే చూసుకోవచ్చు లేదా PhonePe మీకు అందుబాటులోకి తెచ్చిన ఇతర మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఇతర TPAP యాప్‌ ద్వారా UPI లావాదేవీ చేసి ఉంటే, దయచేసి సదరు యాప్ ద్వారానే ఫిర్యాదును నమోదు చేయండి.

b) PSP బ్యాంక్‌కు ఫిర్యాదును పంపండి

  • ఒకవేళ మీ ఫిర్యాదు/సమస్య ఇంకా పరిష్కారం కాకపోతే, తదుపరి స్థాయి ఫిర్యాదును సంబంధిత PSP బ్యాంక్‌కు పంపవచ్చు. మీరు కింది కాంటాక్ట్‌ వివరాల ద్వారా PSP బ్యాంక్‌ను సంప్రదించవచ్చు:
    • Yes బ్యాంక్ లిమిటెడ్ https://www.yesbank.in/contact-us
    • యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ https://www.axisbank.com/contact-us
    • ICICI బ్యాంక్ లిమిటెడ్ https://www.icicibank.com/complaints/complaints.page

c) మీ ఇష్యూయర్‌కు ఫిర్యాదును పంపండి:

  • ఒకవేళ PSP బ్యాంక్ కూడా మీ ఫిర్యాదును పరిష్కరించలేకపోతే, పరిష్కారం కోసం మీ బ్యాంక్ అకౌంట్​/పేమెంట్ అకౌంట్​ ఉన్న ఇష్యూయర్​ను మీరు సంప్రదించవచ్చు. మీ బ్యాంక్‌కు సంబంధించిన కాంటాక్ట్‌ వివరాలు వారి అధికారిక బ్యాంకింగ్ వెబ్‌సైట్లు లేదా యాప్‌లలో ఉంటాయి, వాటిని వెతికి చూడండి.

d) NPCIకి ఫిర్యాదును పంపండి:

  • ఒకవేళ మీ ఇష్యూయర్ కూడా మీ ఫిర్యాదును పరిష్కరించలేకపోతే, మీరు NPCIని సంప్రదించవచ్చు. NPCI కాంటాక్ట్‌ వివరాలను ఈ లింక్‌లో ఇచ్చాము: 
    • https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism

e) ఫిర్యాదును అంబుడ్స్‌మన్ ఛానెళ్లకు లేవనెత్తండి:
పైన పేర్కొన్న మార్గాలన్నింటినీ ఉపయోగించిన తర్వాత కూడా, ఒకవేళ మీ ఫిర్యాదులు 30 రోజుల్లోపు మీరు సంతృప్తి చెందేలా పరిష్కారం కాకపోతే, కస్టమర్లు కింది చిరునామా ద్వారా RBI అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు:

  • అంబుడ్స్‌మన్ ఫిర్యాదు నమోదు చేసే పోర్టల్: https://cms.rbi.org.in/
  • టోల్-ఫ్రీ ఫోన్. నెం: 14448
  • ఇమెయిల్ ఐడి: [email protected]
  • చిరునామా – సెంట్రలైజ్డ్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్ – 160017

రిజర్వ్ బ్యాంక్ – ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌, 2021 గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి స్కీమ్‌ కాపీకి సంబంధించిన లింక్‌ను చూడండి. – RBI ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌, స్కీమ్‌ ముఖ్యాంశాలు.

arrow icon

నష్టపరిహారం & బాధ్యత

arrow icon

ఏ సందర్భంలోనైనా, PhonePe UPI, PhonePe సర్వీసెస్, PhonePe ప్లాట్‌ఫామ్‌ మరియు/లేదా PhonePe యాప్‌ను ఉపయోగించడం వల్ల లేదా ఉపయోగించలేకపోవడం వల్ల తలెత్తే ఎటువంటి పరోక్ష, పర్యవసానమైన, ఆకస్మిక, ప్రత్యేక లేదా శిక్షార్హమైన నష్టాలకు లేదా బాధ్యతలకు (చట్టబద్ధమైన వాటితో సహా), అంటే లాభాలు లేదా రాబడి నష్టం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాల నష్టం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టంతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, ఒప్పందం, నిర్లక్ష్యం, హక్కుల అతిక్రమణ లేదా ఇతర కారణాల వల్ల తలెత్తినప్పటికీ, వీటికి PhonePe బాధ్యత వహించదు. ఒకవేళ భరించాల్సిన బాధ్యత ఏదైనా PhonePeకు ఉన్నట్లయితే, అది ఏ సందర్భంలోనైనా సదరు వివాదానికి కారణమైన ‘చెల్లుబాటు అయ్యే లావాదేవీ’ అమౌంట్‌కు లేదా వంద రూపాయలకు (₹100), వీటిలో ఏది తక్కువైతే ఆ అమౌంట్‌ను మించకూడదు.

మీరు PhonePe UPI/ PhonePe ప్లాట్‌ఫామ్‌/ PhonePe యాప్/ PhonePe సర్వీస్‌లను ఉపయోగించడం వల్ల, లేదా ఈ UPI వినియోగ నియమాలు (ToU), గోప్యతా పాలసీ, ఇతర నియమాలు, ఇతర పాలసీల ఉల్లంఘన వల్ల, లేదా మీరు ఏదైనా వర్తించే చట్టాలను లేదా థర్డ్ పార్టీ హక్కులను (మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనతో సహా) ఉల్లంఘించడం వల్ల తలెత్తే ఎటువంటి క్లెయిమ్, డిమాండ్ లేదా చర్యల విషయంలో (సమంజసమైన న్యాయవాది ఫీజులతో సహా) PhonePe, PhonePe సంస్థలు, దాని యజమానులు, లైసెన్సీలు, (వర్తించే మేరకు), సంబంధిత అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు మీరు నష్టపరిహారం చెల్లించాలి, అలానే వారికి ఎటువంటి హాని కలగకుండా మీరే బాధ్యత వహించాలి.

రద్దు చేయడం, ఇతర చర్యలు

arrow icon

మీరు ఏవైనా వర్తించే చట్టాలను ఉల్లంఘించారని, లేదా ఏదైనా UPI వినియోగ నియమాలు (ToU) /నియమాలు, లేదా PhonePe యాప్/PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీకు వర్తించే ఇతర నియమ, నిబంధనలను ఉల్లంఘించారని మేము నిర్ధారించినట్లయితే, లేదా నియంత్రణ సంస్థలు/ప్రభుత్వ లేదా ఇతర అధికారులు ఆదేశించినట్లయితే, లేదా PhonePe తగినదని భావించే ఇతర కారణాల మేరకు, PhonePe తన ఏకైక అభీష్టానుసారం, మీకు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మీ PhonePe అకౌంట్‌ను రద్దు చేయవచ్చని లేదా నిలిపివేయవచ్చని, మరియు/లేదా PhonePe యాప్/PhonePe ప్లాట్‌ఫామ్/PhonePe సర్వీస్‌లకు, లేదా దానిలోని ఏ విభాగానికైనా, లేదా PhonePe UPIను పూర్తిగా లేదా ఏదైనా విభాగానికి మీ యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చని లేదా నిషేధించవచ్చని, లేదా మేము సముచితమని భావించే ఇతర చర్యలు తీసుకోవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.

మీరు చర్యలు చేయడం/చర్యలు చేపట్టకపోవడం వల్ల PhonePeకు నష్టాలు సంభవిస్తే, అంటే కేవలం ఆర్థిక నష్టాలకే పరిమితం కాకుండా, ఏవైనా నష్టాలు సంభవించినట్లయితే, పైన పేర్కొన్న పరిస్థితులలో మేము అవసరమని భావించిన మేరకు నివారణ చర్యలు తీసుకోవచ్చని కూడా మీరు అంగీకరిస్తున్నారు.

మీ సమాచారం/డేటా నిర్వహణ అంతా మీ గోప్యతా విధానం, వర్తించే చట్టాల ప్రకారం జరుగుతుంది. PhonePeతో మీ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా, వర్తించే చట్టాల ప్రకారం లేదా NPCI ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల మేరకు లేదా మా పాలసీల ప్రకారం నిర్దేశించిన కాలవ్యవధి వరకు, మీ పేరు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, VPAలు, ఏదైనా లావాదేవీల లేదా ఇతర సమాచారం వంటి మీ రిజిస్ట్రేషన్ సమాచారాన్ని PhonePe తన వద్ద ఉంచుకోవచ్చు.

పాలక చట్టం & న్యాయ పరిధి

arrow icon

ఈ UPI వినియోగ నియమాలు (ToU), వీటి కింద ఉండే హక్కులు, బాధ్యతలు, పార్టీల మధ్య సంబంధాలు, అలానే ఈ UPI వినియోగ నియమాలు కింద లేదా దీనికి సంబంధించి తలెత్తే అన్ని అంశాలు, అంటే వాటి నిర్మాణం, చెల్లుబాటు, పనితీరు లేదా రద్దుతో సహా, భారత గణతంత్ర దేశపు చట్టాలకు లోబడి ఉంటాయి, అలానే వాటి ప్రకారమే అర్థం చేసుకోవాలి. ఈ UPI వినియోగ నియమాలకు సంబంధించి తలెత్తే అన్ని అంశాలపై బెంగళూరు, కర్ణాటకలోని కోర్టులకు మాత్రమే ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది.

బాధ్యతా నిరాకరణలు

arrow icon

PhonePe యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా ఉపయోగించడం వల్ల మాత్రమే మీకు PhonePe UPI పొందే హక్కు ఆటోమేటిక్‌గా లభించదని మీరు అర్థం చేసుకున్నారు.

UPI, PhonePe UPI, PhonePe ప్లాట్‌ఫామ్‌ నాణ్యత, అలానే లభ్యత గురించి మేము ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు. ఇందులో నిర్దిష్ట ప్రయోజనం కోసం సరిగ్గా సరిపోతుందని, క్రయవిక్రయాలకు పనికొస్తుందని, లేదా థర్డ్ పార్టీల మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన జరగదనే హామీలతో సహా మరే ఇతర హామీలు ఉండవు. PhonePe UPI సర్వీస్‌లు “ఉన్నవి ఉన్నట్లుగా”, “అందుబాటులో ఎలా ఉంటే అలా”, అలానే అన్ని లోపాలతో పాటుగా మీకు అందుతాయి.

PhonePe కేవలం లావాదేవీలను సులభతరం మాత్రమే చేస్తుంది, లావాదేవీలలో ఓ పార్టీగా వ్యవహరించట్లేదు. నిర్ణీత ప్రక్రియ ప్రకారం లావాదేవీలను నిర్వహించడానికి, ప్రాసెస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము, అయితే, UPI, ఇంకా PhonePe UPIకి సంబంధించిన అన్ని బాధ్యతలను, అంటే లావాదేవీల వైఫల్యం, UPI, PhonePe UPI లేదా PhonePe ప్లాట్‌ఫామ్ అందుబాటులో లేకపోవడం, ఏదైనా ప్రతిస్పందన లేకపోవడం, ఆలస్యం, వ్యవస్థల వైఫల్యం మరియు/లేదా లావాదేవీల చట్టబద్ధత వంటి వాటితో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, తదితర బాధ్యతలను  PhonePe నిరాకరిస్తుంది; UPI, PhonePe UPI, PhonePe ప్లాట్‌ఫామ్, PhonePe సర్వీస్‌లు, లావాదేవీలు మొదలైన వాటిలో తలెత్తే ఏదైనా లోపం, వైఫల్యం, అంతరాయం లేదా అందుబాటులో లేకపోవడానికి PhonePe బాధ్యత వహించదు. ఏదైనా లావాదేవీ వల్ల తలెత్తే ఏవైనా సమస్యలకు సంబంధించి, దయచేసి మీ ఇష్యూయర్‌ను సంప్రదించండి. అన్ని లావాదేవీలు తప్పనిసరిగా చెల్లింపుదారు, నగదును అందుకునే వ్యక్తి మధ్యనే జరుగుతాయి, PhonePeకు ఎటువంటి బాధ్యత ఉండదు.

మా వద్ద ఉన్న మీ లావాదేవీ రికార్డులు, అలానే మేము నిర్వహించే ఇతర లాగ్‌లు అనేవి సదరు లావాదేవీకి, మీ UPI/ PhonePe UPI వినియోగానికి తుది ఆధారంగా, మీరు కట్టుబడి ఉండే సాక్ష్యంగా నిలుస్తాయి.