ఈ క్రెడిట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ నియమ, నిబంధనలు (“TOUలు”) అనేవి PhonePe లిమిటెడ్ (గతంలో ‘PhonePe ప్రైవేట్ లిమిటెడ్’ అని పిలిచేవారు) మరియు/లేదా దాని అనుబంధ సంస్థల (ఇకపై సమిష్టిగా “PhonePe ప్లాట్‌ఫామ్” అని పిలుస్తారు) యాజమాన్యంలోని / ఆపరేట్ చేస్తున్న వెబ్‌సైట్(లు), మొబైల్ అప్లికేషన్ మరియు/లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల యాక్సెస్, వినియోగానికి వర్తించే నియమ, నిబంధనలను వివరిస్తాయి. PhonePe లిమిటెడ్ (గతంలో ‘PhonePe ప్రైవేట్ లిమిటెడ్’ అని పిలిచేవారు), కంపెనీల చట్టం, 1956 నిబంధనల ప్రకారం స్థాపితమైంది, దీన్ని ఇకపై “కంపెనీ” / “PhonePe” అని పిలుస్తారు.
ఈ నియమ, నిబంధనలు (TOUలు), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం రూపొందిన ఎలక్ట్రానిక్ రికార్డ్, అలానే ఇవి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యాయి, వీటిపై ఎలాంటి ఫిజికల్ లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
మీరు సర్వీస్‌లను (కింద వీటిని నిర్వచించిన మేరకు) పొందడానికి PhonePe ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడం ద్వారా లేదా సర్వీస్‌లను పొందడానికి PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీ సమాచారాన్ని రిజిస్టర్ చేయడం ద్వారా, మీరు (ఇకపై “మీరు” లేదా “మీ” అని పిలుస్తారు) సాధారణ నియమ, నిబంధనలు, PhonePeప్రైవసీ పాలసీ, అలానే PhonePe ఫిర్యాదుల పరిష్కార పాలసీకి కట్టుబడి ఉండటానికి అంగీకరించడంతో పాటు, ఈ నియమ, నిబంధనలకు (TOUలకు) కట్టుబడి ఉండటానికి సమ్మతి తెలుపుతున్నారు, వీటిలోని ప్రతి అంశమూ ఈ నియమ, నిబంధనల్లో (TOUల్లో) చేర్చినట్లుగానే పరిగణించడమవుతుంది, అలానే ఈ నియమ, నిబంధనల్లో (TOUల్లో) (సమిష్టిగా “ఒప్పందం” అని పిలుస్తారు) అంతర్భాగంగా పరిగణించడమవుతుంది.
దయచేసి నియమ, నిబంధనల (TOUల) లేటెస్ట్ వెర్షన్‌ను సమీక్షించడం కోసం ఎప్పటికప్పుడు ఈ పేజీకి వస్తూ ఉండండి. ముందస్తు నోటీసు లేకుండా, మా సొంత అభీష్టానుసారం, ఏ సమయంలోనైనా నియమ, నిబంధనలను (TOUలను) మార్చడానికి లేదా సవరించడానికి మాకు హక్కు ఉంది, అలానే మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం యాక్సెస్ చేస్తున్నా లేదా ఉపయోగిస్తున్నా, ఎప్పటికప్పుడు మేము సవరించిన నియమ, నిబంధనలను (TOUలను) మీరు అంగీకరించారనే భావించడమవుతుంది.
దయచేసి ఈ నియమ, నిబంధనలను (TOUలను) జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఉన్న నియమాలకు మీరు తెలిపిన అంగీకారం అనేది, ఇక్కడ నిర్వచించిన ప్రయోజనం నిమిత్తం మీకు, కంపెనీకి మధ్య ఒప్పందాన్ని ఏర్పరుస్తుంది.
- సర్వీస్‌ల పూర్తి వివరాలు, అంగీకారం
- వివిధ బ్యాంక్‌లు/బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (“ఆర్థిక సంస్థలు”) జారీ చేసిన క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్‌లు (“సర్వీస్‌లు”)తో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా కొన్ని ఫైనాన్షియల్ ప్రోడక్ట్‌లు/సర్వీస్‌లకు PhonePe ఇందుమూలంగా యాక్సెస్‌ను సులభతరం చేస్తుంది.
- వాణిజ్యపరంగా సహేతుకమైన ప్రయత్న ప్రాతిపదికన సర్వీస్‌లు అందుతాయి, అలానే మీ సొంత అభీష్టానుసారమే సర్వీస్‌లను పొందడంలో పాల్గొంటున్నారని మీరు అంగీకరిస్తున్నారు.
- క్రెడిట్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియలో మీరు అందించిన ఏదైనా సమాచారం/డాక్యుమెంట్/వివరాలను మీ దరఖాస్తును ప్రాసెస్ చేసే నిమిత్తం ఆర్థిక సంస్థలకు షేర్ చేయడానికి మీరు ఇందుమూలంగా PhonePeకు మీ అనుమతిని ఇస్తున్నారు.
- మీ KYC మరియు/లేదా ఇతర కస్టమర్ వివరాలను అత్యంత శ్రద్ధగా పరిశీలించడానికి (డ్యూ డిలిజెన్స్‌కు) ఆర్థిక సంస్థ పూర్తిగా బాధ్యత వహిస్తుంది, అలానే మీ క్రెడిట్ కార్డ్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి అదనపు సమాచారం/డాక్యుమెంట్లు/వివరాలను వారికి షేర్ చేయవలసి రావచ్చు. అటువంటి డేటా/సమాచారాన్ని సేకరించి ఆర్థిక సంస్థలకు సమర్పించడానికి మేము వీలు కల్పించవచ్చు.
- మీ దరఖాస్తును క్షుణ్ణంగా, శ్రద్ధగా పరిశీలించి, ఆమోదించాల్సిన మరియు/లేదా తిరస్కరించాల్సిన పూర్తి బాధ్యత ఆర్థిక సంస్థలదే.
- క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడంలో PhonePe పాల్గొనదు, అలానే వాటిని జారీ చేయడానికి మరియు/లేదా ఏదైనా క్రెడిట్ కార్డ్ జారీ అయిన తర్వాత ఏదైనా సహకారం అందించడానికి బాధ్యత వహించదు.
- క్రెడిట్ కార్డ్ జారీ లేదా మెయింటెనెన్స్‌కు సంబంధించి ఏవైనా ఫీజులు లేదా ఛార్జీలను మీకు, మీ ఆర్థిక సంస్థకు మధ్య అంగీకారం కుదిరిన నియమాల ప్రకారం ఆ క్రెడిట్ కార్డ్‌ను జారీ చేసిన ఆర్థిక సంస్థ నేరుగా వసూలు చేస్తుంది
- మీకు Rupay క్రెడిట్ కార్డ్‌ను జారీ చేస్తే, ఇక్కడ పేర్కొన్న నియమ, నిబంధనల ప్రకారం ఆ Rupay క్రెడిట్ కార్డ్‌ను మీ UPI అకౌంట్‌కు మీరు లింక్ చేసుకోవచ్చు.
- మీరు పొందే సర్వీస్‌లకు లేదా ఇతరత్రా చర్యలకు సంబంధించి, ఉమ్మడి మార్కెటింగ్ ప్రయోజనాల కోసం/వివిధ సర్వీస్‌లను అందించడానికి/రిపోర్ట్ జనరేషన్‌కు మరియు/లేదా మీకు వివిధ వాల్యూ యాడెడ్ సర్వీస్‌లను అందించడానికి అవసరమైన మేరకు, మీ సమాచారాన్ని తన గ్రూప్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ఇతర థర్డ్ పార్టీలకు షేర్ చేయడానికి మీరు కంపెనీకి అధికారం ఇచ్చి, అంగీకారం తెలుపుతున్నారు.
- వర్తించే చట్టం అనుమతించిన మేరకు, సర్వీస్ అప్‌డేట్లు, సమాచారం/ప్రచార ఇమెయిల్‌లు మరియు/లేదా ప్రోడక్ట్ ప్రకటనలకు సంబంధించి PhonePe లేదా దాని థర్డ్ పార్టీ వెండర్లు/బిజినెస్ పార్ట్‌నర్లు/మార్కెటింగ్ అనుబంధ సంస్థలు లేదా ఆర్థిక సంస్థల నుండి ఇమెయిల్‌లు, టెలిఫోన్ మరియు/లేదా SMS ద్వారా కమ్యూనికేషన్‌లను పొందడానికి మీరు అంగీకరిస్తున్నారు.
- వర్తించే చట్టం అనుమతించిన మేరకు, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌పై, ఆ మొబైల్ నంబర్‌ను వర్తించే చట్టం కింద డోంట్ డిస్టర్బ్ (“DND”) / నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (“NCPR”) జాబితా కింద, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (“TRAI”) రూపొందించిన నియమాలు, నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసినప్పటికీ, అన్ని కమ్యూనికేషన్లను పొందడానికి మీరు అంగీకరించి, సమ్మతి తెలుపుతున్నారు, ఈ ప్రయోజనం నిమిత్తం, మీ సమాచారాన్ని కంపెనీ గ్రూప్ కంపెనీలు, కంపెనీ థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఏదైనా ఆథరైజ్డ్ ఏజెంట్లకు షేర్ చేయడానికి/వెల్లడించడానికి కంపెనీకి మరింత అధికారం ఇస్తున్నారు.
- అన్ని కమ్యూనికేషన్లను సరిగ్గానే పంపుతున్నామని నిర్ధారించుకోవడం కోసం PhonePe సహేతుకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కాంటాక్ట్ సమాచారంపై ఉన్న ఏవైనా పరిమితులు, DND జాబితా కింద ఫోన్ నంబర్ రిజిస్టర్ అవ్వడం, ఇమెయిల్ డేటా స్టోరేజ్ తగినంత లేకపోవడం, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వద్ద తలెత్తిన ఎర్రర్లు వంటి సమస్యల వల్ల కమ్యూనికేషన్లను పంపడంలో వైఫల్యాలు ఉండవచ్చు. పైన పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకుని, ఏవైనా కమ్యూనికేషన్లు మీకు అందకపోవడానికి PhonePe బాధ్యత వహించదు లేదా PhonePeను బాధ్యలుగా చేయకూడదు.
- PhonePe అన్ని కమ్యూనికేషన్లను పూర్తి నమ్మకంతోనే చేస్తున్నప్పటికీ, PhonePe చేసే ఏదైనా కమ్యూనికేషన్ ఖచ్చితత్వం, సమర్ధత, లభ్యత, చట్టబద్ధత, చెల్లుబాటు, విశ్వసనీయత లేదా పరిపూర్ణతకు సంబంధించి ఎటువంటి ప్రాతనిధ్యం వహించదు లేదా ఎలాంటి వారంటీని ఇవ్వదని, అంటే స్పష్టంగా తెలపడం లేదా ఆ అర్థం వచ్చేలా చెప్పదని దయచేసి గమనించండి. PhonePe చేసిన ఏదైనా కమ్యూనికేషన్‌తో ఏదైనా ఉపయోగం ఉండటం వల్ల లేదా దానిపై ఆధారపడటం వల్ల ఏ వ్యక్తికైనా కలిగే ఏదైనా నష్టం లేదా హానికి PhonePe ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు లేదా PhonePeను బాధ్యులను చేయకూడదు.
- మా చట్టపరమైన బాధ్యతలను పాటించడానికి, వివాదాలను పరిష్కరించడానికి, అలానే సర్వీస్‌లను అందించడానికి మనం కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి అవసరమైన మేరకు PhonePe మీ సమాచారాన్ని భద్రపర్చకుని, ఉపయోగిస్తుంది.
- క్రెడిట్ కార్డ్‌లతో పాటు వాటికి అనుసంధానించిన సర్వీస్‌లు అన్నింటినీ ఆర్థిక సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి, అలానే దరఖాస్తు తిరస్కరణ, ప్రోడక్ట్/సర్వీస్‌ల జారీని ఆర్థిక సంస్థలు తిరస్కరించడం/ఆలస్యం చేయడం, జారీ తర్వాత వాటి పనితీరు, క్రెడిట్ కార్డ్‌లు/క్రెడిట్ సౌకర్యాల వినియోగం లేదా సర్వీసింగ్ వంటి వాటికి PhonePe బాధ్యత వహించదు. ఆర్థిక సంస్థలతో మీకున్న సంబంధంలో PhonePeకు ఏ విధంగానూ ప్రమేయం ఉండదు, ఆ సంబంధం మీకు, ఆర్థిక సంస్థల మధ్య కుదిరిన అంగీకార సంబంధిత నియమ, నిబంధనల ప్రకారం స్వతంత్రంగా ఉంటుంది.
- జారీ/ఆఫర్ వర్తింపు, జారీ తర్వాత పనితీరు మొదలైన వాటికి సంబంధించిన అంశాలకే పరిమితం కాకుండా, సర్వీస్‌లు, లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ సౌకర్యాలు లేదా FD-ఆధారిత క్రెడిట్ కార్డ్‌లు/సౌకర్యాలకు సంబంధించి PhonePe ఎటువంటి వారంటీ లేదా హామీని ఇవ్వదు.
- PHONEPE ప్లాట్‌ఫామ్ లైసెన్స్, యాక్సెస్
PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌లపై అన్ని చట్టపరమైన, టైటిల్, ప్రయోజనాల హక్కులు PhonePeకు ఉన్నాయని మీరు గుర్తించి అంగీకరిస్తున్నారు, ఆ హక్కుల్లో PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌ల్లో భాగమైన ఏవైనా మేధో సంపత్తి హక్కులు (ఆ హక్కులు రిజిస్టర్ అయినా లేదా కాకపోయినా) ఉన్నాయి. కంపెనీ గోప్యంగా భావించిన సమాచారం సర్వీస్‌ల్లో ఉండవచ్చని, అలానే కంపెనీ మంజూరు చేసిన ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మీరు అలాంటి సమాచారాన్ని బయటపెట్టకూడదని మీరు అంగీకరిస్తున్నారు. PhonePe ప్లాట్‌ఫామ్ కంటెంట్‌లు, అంటే దాని “లుక్ అండ్ ఫీల్ ” (ఉదా. టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజ్‌లు, లోగోలు, బటన్ ఐకాన్‌లు), ఫొటోగ్రాఫ్‌లు, ఎడిటోరియల్ కంటెంట్, నోటీసులు, సాఫ్ట్‌వేర్, అలానే కంపెనీ మరియు/లేదా దాని థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు/వారి లైసెన్సర్ల యాజమాన్యంలో ఉన్న/లైసెన్స్ పొందిన ఇతర మెటీరియల్‌తో సహా వీటన్నింటికీ, సందర్భానుసారం, వర్తించే కాపీరైట్, ట్రేడ్‌మార్క్, ఇతర చట్టాల ప్రకారం తగిన విధంగా వారి రక్షణ (ప్రొటెక్షన్) ఉంటుంది.
PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి కంపెనీ మీకు పరిమితమైన లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది. ఈ లైసెన్స్‌లో మరొక వ్యక్తి, విక్రేత లేదా ఏదైనా ఇతర థర్డ్ పార్టీకి ప్రయోజనం చేకూర్చడం కోసం ఏ రకమైన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడం లేదా కాపీ చేయడం లేదా ఏదైనా సోర్స్ కోడ్‌ను తెలుసుకోవడం, సవరించడం, రివర్స్ ఇంజినీర్ చేయడం, రివర్స్ అసెంబుల్ చేయడం లేదా ఇతరత్రా విధానాలను ప్రయత్నించడం, విక్రయించడం, కేటాయించడం, సబ్‌లైసెన్స్ చేయడం, భద్రతా ప్రయోజనాన్ని మంజూరు చేయడం లేదా సర్వీస్‌ల్లో ఏదైనా హక్కును బదిలీ చేయడం వంటివి ఉండవు. మీరు ఏవైనా అనధికారిక పద్ధతులను వినియోగిస్తే, మీకు గతంలో మంజూరైన అనుమతి లేదా లైసెన్స్ రద్దు అవుతుంది.
PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా, కింది చర్యలకు పాల్పడరని మీరు అంగీకారం తెలుపుతున్నారు: (i) PhonePe ప్లాట్‌ఫామ్ లేదా దాని కంటెంట్‌లను ఏదైనా వాణిజ్య ప్రయోజనం కోసం ఉపయోగించడం; (ii) డిమాండ్‌ను ఊహించి ఏదైనా ఊహాజనిత, తప్పుడు లేదా మోసపూరిత లావాదేవీ లేదా ఏదైనా లావాదేవీ చేయడం; (iii) మా స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా ప్రయోజనం కోసం ఏదైనా రోబో, స్పైడర్, స్క్రాపర్ లేదా ఇతర ఆటోమేటెడ్ మార్గాలను లేదా ఏదైనా మాన్యువల్ ప్రక్రియను ఉపయోగించి PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏదైనా కంటెంట్ లేదా సమాచారాన్ని యాక్సెస్ చేయడం, పర్యవేక్షించడం లేదా కాపీ చేయడం; (iv) PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏదైనా ఎక్స్‌క్లూజన్ హెడర్‌లలోని పరిమితులను ఉల్లంఘించడం లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌కు యాక్సెస్‌ను నిరోధించడానికి లేదా పరిమితం చేయడానికి ఉపయోగించే ఇతర చర్యలను దాటవేయడం (బైపాస్ చేయడం) లేదా పరిమితం చేయడం లేదా తప్పించుకోవడం; (v) మా మౌలిక సదుపాయాలపై, మేము అసమంజసమని లేదా అసమానమని భావించే స్థాయిలో పెద్ద భారాన్ని మీరు మోపడం లేదా విధించేలా ఏదైనా చర్యకు పాల్పడటం; (vi) మా నుండి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా ప్రయోజనం కోసం PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏదైనా భాగానికి (ఏదైనా సర్వీస్‌ను కొనుగోలు చేసే పాత్(మార్గం)తో సహా, దీనికే పరిమితి కాకుండా) డీప్-లింక్ చేయడం; లేదా (vii) మా ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏదైనా భాగాన్ని “ఫ్రేమ్”, “మిర్రర్” చేయడం లేదా ఏదైనా ఇతర వెబ్‌సైట్‌లో చేర్చడం లేదా (viii) ఏవైనా మోసపూరిత అప్లికేషన్లను ప్రారంభించడం లేదా కంపెనీ/ఆర్థిక సంస్థలు లేదా ఏదైనా థర్డ్ పార్టీ(లు)ని మోసం చేయడానికి/థర్డ్ పార్టీపై మోసం మోపడానికి PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం; ఇంకా (ix) PhonePe మరియు/లేదా ఆర్థిక సంస్థలకు ఏదైనా తప్పుడు, అసంపూర్ణమైన లేదా తప్పులున్న సమాచారం/డేటాను అందించడం.
- ప్రైవసీ పాలసీ
PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా, PhonePe ప్రైవసీ పాలసీలో మేము వివరించిన విధంగా మీ సమాచారాన్ని ఉపయోగించడానికి మీరు ఇందుమూలంగా సమ్మతిస్తున్నారు. మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసినప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ ఎలా ట్రీట్ చేస్తుందో ఈ ప్రైవసీ పాలసీ వివరిస్తుంది.
- మీ రిజిస్ట్రేషన్/అకౌంట్
PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు ఒక కట్టుబడి ఉండాల్సిన ఒప్పందంలోకి ప్రవేశించడానికి అర్హులని, అలానే సర్వీస్‌లను యాక్సెస్ చేయడం / పొందడంపై భారతదేశ చట్టాలు లేదా ఏదైనా ఇతర సంబంధిత అధికార పరిధి మీపై నిషేధం విధించలేదని మీరు ధ్రువీకరిస్తున్నారు. PhonePe ప్లాట్‌ఫామ్‌ను కేవలం మీ కోసం మాత్రమే మీరు ఉపయోగించాలి.
మీ అకౌంట్‌ను ఎవరైనా అనధికారికంగా ఉపయోగించినా లేదా ఏదైనా భద్రతా ఉల్లంఘన జరిగినా, వాటి గురించి వెంటనే కంపెనీకి తెలపడానికి మీరు అంగీకరిస్తున్నారు. కంపెనీకి నేరుగా ఆపాదించిన కారణాల వల్ల మాత్రమే అటువంటి అనధికారిక యాక్సెస్ జరిగిందని నిరూపితమైతే తప్ప, మిగిలిన ఏ కారణం వల్లనైనా ఏదైనా అనధికారిక వినియోగం లేదా యాక్సెస్ సంభవిస్తే, కంపెనీని బాధ్యులను చేయకూడదని మీరు అంగీకరిస్తున్నారు.
మీ గురించి నిజమైన, ఖచ్చితమైన, ప్రస్తుత, పూర్తి సమాచారాన్ని అందించడానికి మీరు హామీ ఇస్తున్నారు, అలానే మీ సమాచారంలో ఏదైనా మారితే (కాంటాక్ట్ వివరాలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా) వెంటనే తెలపడానికి/అప్‌డేట్ చేయడానికి, ఆ సమాచారాన్ని ఎల్లప్పుడూ తాజాగా, ఖచ్చితంగా ఉంచడానికి మీరు హామీ ఇస్తున్నారు, ఎందుకంటే ఇది కంపెనీలో లేదా కంపెనీ ద్వారా సర్వీస్‌లను అందించడంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ గుర్తింపును తప్పుగా చెప్పకూడదని లేదా చట్టవిరుద్ధంగా PhonePe ప్లాట్‌ఫామ్‌కు యాక్సెస్ ఇవ్వడం లేదా ప్లాట్‌ఫామ్‌లో సర్వీస్‌లను ఉపయోగించడం వంటివి చేయకూడదని అంగీకరిస్తున్నారు. ఆర్థిక సంస్థ(ల) నియమాలతో సహా, మీరు ఎంచుకున్న సర్వీస్‌ల కొనుగోలుకు/పొందడానికి అదనపు నియమ, నిబంధనలు వర్తిస్తాయి. దయచేసి ఈ అదనపు నియమ, నిబంధనలను జాగ్రత్తగా చదవండి.
- కస్టమర్ వివరాలను అత్యంత శ్రద్ధగా పరిశీలించాల్సిన (డ్యూ డిలిజెన్స్) ఆవశ్యకతలు
PhonePe ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా ఆర్థిక లావాదేవీ చెయ్యడానికి, మా ఆర్థిక సంస్థలు క్లయింట్/కస్టమర్ డ్యూ డిలిజెన్స్ మెజర్‌లను (కస్టమర్ వివరాలను అత్యంత శ్రద్ధగా పరిశీలించే చర్యలు) చేపట్టడానికి, KYC ప్రయోజనం కోసం తప్పకుండా అవసరమైన సమాచారాన్ని మిమ్మల్ని అడిగి తీసుకోవడానికి మీరు అంగీకరించి, అనుమతిని ఇస్తున్నారు. కస్టమర్‌గా, క్రెడిట్ కార్డ్ లేదా ఇతర ఫైనాన్స్ ప్రోడక్ట్‌ల కోసం మీరు చేసుకున్న అభ్యర్థనను ఆర్థిక సంస్థలకు పంపే ప్రక్రియను సులభతరం చేయడానికి, అలానే వర్తించే మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (“PMLA”), దాని కింద రూపొందించిన నియమాలు, నిబంధనల ప్రకారం ఆ సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఓ కస్టమర్‌గా మీకు ఉంది. ఆర్థిక సంస్థ(లు) ప్రతి కస్టమర్/యూజర్‌ను గుర్తించడానికి, అలానే మీకు, అలాంటి ఆర్థిక సంస్థ(ల) మధ్య ఏ ఉద్దేశంతో అయితే సంబంధం ఏర్పడిందో, దాని స్వభావ ఉద్దేశ్యాన్ని నిర్ధారించడానికి కావాల్సినంత సమాచారాన్ని పొందవచ్చు. PMLAతో సహా వర్తించే చట్టాల కింద ఉండే అవసరాలు, పాటించాల్సిన బాధ్యతలకు అనుగుణంగా కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అవసరాలకు సంబంధించి తనను తాను సంతృప్తి పరచుకోవడానికి, కంపెనీ అటువంటి ప్రక్రియను సులభతరం చేస్తుందని, మెరుగైన డ్యూ డిలిజెన్స్ చర్యలను (ఏదైనా డాక్యుమెంటేషన్‌తో సహా) మరింత సులభతరం చేస్తుందని మీరు అంగీకరించి, సమ్మతిస్తున్నారు, మీ సమాచారం/డేటా/వివరాలను ఆర్థిక సంస్థలకు కంపెనీ షేర్ చేస్తుందని మీరు అర్థం చేసుకుని, స్పష్టంగా అంగీకరిస్తున్నారు. మీరు ఆర్థిక సంస్థల సంతృప్తి మేరకు సమాచారం/డేటా/వివరాలను అందించడంలో విఫలమైతే, మీరు ఆర్థిక సంస్థల ప్రోడక్ట్‌లు/సర్వీస్‌లు/ఆఫర్లను పొందలేకపోవచ్చు అని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. KYC, కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను ఆర్థిక సంస్థలు తమ సొంత అభీష్టానుసారం నిర్వహిస్తాయి, అలానే కంపెనీ దీనికి బాధ్యత వహించదు మరియు/లేదా కంపెనీని బాధ్యులను చేయకూడదు.
- అర్హతా ప్రమాణాలు
మీరు 18 (పద్దెనిమిది) సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల భారతదేశ నివాసి అని, అలానే కంపెనీ అందించే సర్వీస్‌లను పొందడానికి, భారతదేశ కాంట్రాక్ట్ (ఒప్పంద) చట్టం, 1872లో పేర్కొన్న విధంగా ఒప్పందం కుదుర్చుకునే సామర్థ్యం మీకు ఉందని మీరు ప్రకటించి, ధృవీకరిస్తున్నారు.
- సమర్పించిన కంటెంట్
మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో డేటా, సమాచారంతో సహా ఏదైనా కంటెంట్‌ను షేర్ చేసినప్పుడు లేదా సమర్పించినప్పుడు, PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీరు పోస్ట్ చేసే/అందించే మొత్తం కంటెంట్‌కు మీరే పూర్తిగా బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. PhonePe ప్లాట్‌ఫామ్‌లో లేదా దాని ద్వారా మీరు అందుబాటులో ఉంచాలని ఎంచుకున్న ఏ కంటెంట్‌కూ కంపెనీని బాధ్యులను చేయకూడదు. కంపెనీ సొంత అభీష్టానుసారం, అటువంటి కంటెంట్‌ను సర్వీస్‌ల్లో చేర్చవచ్చు (పూర్తిగా లేదా పాక్షికంగా లేదా సవరించిన రూపంలో), PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీరు సమర్పించే లేదా అందుబాటులో ఉంచే అటువంటి కంటెంట్‌ను కాపీ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, బహిరంగంగా ప్రదర్శించడానికి, సవరించడానికి, దాన్ని ఉపయోగించి కంటెంట్ వర్క్‌ను క్రియేట్ చేయడానికి, ఆ మెటీరియళ్లను లేదా ఆ కంటెంట్‌లోని ఏదైనా భాగాన్ని సబ్‌లైసెన్స్ చేయడానికి మీరు కంపెనీకి శాశ్వతమైన, రద్దు చేయలేని, వెనక్కి తీసుకోలేని, ప్రపంచవ్యాప్త వినియోగానికి, రాయల్టీ రహిత, ప్రత్యేకం కాని లైసెన్స్‌ను మంజూరు చేస్తారు. మీరు సమర్పించే కంటెంట్‌కు మీరే పూర్తి బాధ్యత వహించాలని మీరు అంగీకరిస్తున్నారు. మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌లో లేదా దాని ద్వారా కింది అంశాలను పోస్ట్ చేయడం లేదా ప్రసారం చేయడంపై నిషేధం ఉంది: (i) ప్రచార (పబ్లిసిటీ) హక్కులను మరియు/లేదా ప్రైవసీని ఉల్లంఘించే లేదా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఏదైనా చట్టవిరుద్ధమైన, బెదిరింపు, అవమానకరమైన వ్యాఖ్య, పరువు నష్టం కలిగించే, అశ్లీలమైన, పోర్నోగ్రఫీ లేదా ఇతర మెటీరియల్ లేదా కంటెంట్; (ii) ఏదైనా కమర్షియల్ మెటీరియల్ లేదా కంటెంట్ (నిధుల అభ్యర్థన, ప్రకటనలు లేదా ఏదైనా వస్తువు లేదా సర్వీస్‌ల మార్కెటింగ్‌తో సహా, కానీ వీటికే పరిమితం కాదు); ఇంకా (iii) ఏదైనా థర్డ్ పార్టీకి చెందిన ఏదైనా కాపీరైట్, ట్రేడ్‌మార్క్, పేటెంట్ హక్కు లేదా ఇతర యాజమాన్య హక్కును ఉల్లంఘించే, దుర్వినియోగపర్చే లేదా ఉల్లంఘించే ఏదైనా మెటీరియల్ లేదా కంటెంట్. పైన పేర్కొన్న పరిమితుల ఉల్లంఘన వల్ల కలిగే ఏవైనా నష్టాలకు లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌లో మీరు కంటెంట్‌ను పోస్ట్ చేయడం వల్ల కలిగే ఏదైనా ఇతర హానికి (ఇబ్బందులకు) మీరు మాత్రమే బాధ్యత వహించాలి.
- థర్డ్ పార్టీ లింక్‌లు/ఆఫర్లు
PhonePe ప్లాట్‌ఫామ్‌లో ఇతర వెబ్‌సైట్‌లు లేదా రిసోర్స్‌ల లింక్‌లు ఉండవచ్చు. ఈ ఎక్స్‌టర్నల్ సైట్‌లు లేదా రిసోర్స్‌ల లభ్యతకు కంపెనీ బాధ్యత వహించదని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. ఈ సైట్‌లు లేదా రిసోర్స్‌ల్లో కనిపించే లేదా అందుబాటులో ఉన్న ఏదైనా కంటెంట్, ప్రకటనలు, ప్రోడక్ట్‌లు లేదా ఇతర మెటీరియల్‌ను కంపెనీ ఎండార్స్ (అవి నాణ్యమైనవని చెప్పదు) చేయదు, అలానే వాటికి బాధ్యత వహించదు లేదా బాధ్యత తీసుకోదు. అటువంటి సైట్లు లేదా రిసోర్స్‌ల ద్వారా అందుబాటులో ఉన్న ఏదైనా కంటెంట్, వస్తువులు లేదా సర్వీస్‌లను ఉపయోగించడం లేదా వాటిపై ఆధారపడటం వల్ల లేదా దానికి సంబంధించి కలిగిన లేదా జరిగిందని క్లెయిమ్ చేసిన ఏదైనా నష్టం లేదా హానికి కంపెనీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహించదని లేదా కంపెనీని బాధ్యులను చేయకూడదని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
- వారంటీ బాధ్యతా నిరాకరణ
PhonePe ప్లాట్‌ఫామ్‌లో చేర్చిన లేదా యాక్సెస్ చేయగల సర్వీస్‌లు, ఇతర కంటెంట్‌ను (థర్డ్ పార్టీల కంటెంట్‌తో సహా) వినియోగించడం వల్ల కలిగే నష్టానికి మీరు పూర్తి బాధ్యతను వహించే ముందుకు వెళ్తున్నారని అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. సర్వీస్‌లు “ఉన్నవి ఉన్నట్లుగా”, అలానే “అందుబాటులో ఉన్న విధంగా” అందుతాయి. PhonePe ప్లాట్‌ఫామ్‌లో లేదా సర్వీస్‌ల్లోని కంటెంట్ ఖచ్చితత్వం, విశ్వసనీయత లేదా పరిపూర్ణతకు సంబంధించి (థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు స్పాన్సర్ చేసినా చేయకపోయినా) కంపెనీ ఎటువంటి ప్రాతినిధ్యాలు, వారంటీలు లేదా హామీలు ఇవ్వదు, ఇంకా ఏదైనా నిర్దిష్ట ప్రయోజనానికి ఎలాంటి భంగం వాటిల్లదని లేదా ఫిట్‌నెస్‌కు ఢోకా లేదనేటటువంటి ఏవైనా వారంటీలను స్పష్టంగా నిరాకరిస్తుంది.
సర్వీస్‌లకు సంబంధించిన అన్ని రకాల వారంటీలను, ఆ వారంటీలు సర్వీస్‌ల్లో భాగమైన లేదా యాక్సెస్ చేయగల మొత్తం సమాచారం, ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, ఇంకా ఇతర కంటెంట్‌కు (థర్డ్ పార్టీల కంటెంట్‌తో సహా) సంబంధించినవి అయినా, అలానే కంపెనీ స్పష్టంగా తెలిపినా లేదా సూచించినా, వర్తకం చేసుకోవచ్చని, నిర్దిష్ట ప్రయోజనానికి ఎలాంటి భంగం వాటిల్లదని లేదా ఫిట్‌నెస్‌కు ఢోకా లేదని తెలిపే వారంటీలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా, అన్నింటినీ స్పష్టంగా నిరాకరిస్తుంది.
కంపెనీ, దాని సర్వీస్ ప్రొవైడర్లు, అనుబంధ సంస్థలు, ఆర్థిక సంస్థలు (i) మీరు సర్వీస్‌లకు అర్హులని, (ii) సర్వీస్‌లు మీ అవసరాలను తీరుస్తాయని, (iii) సర్వీస్‌లు అంతరాయం లేకుండా, సకాలంలో, సురక్షితంగా లేదా లోపాలు లేకుండా ఉంటాయని, (iv) సర్వీస్‌లను ఉపయోగించి పొందే ఫలితాలు ఖచ్చితమైనవి లేదా నమ్మదగినవని, (v) సర్వీస్‌ల ద్వారా మీరు కొనుగోలు చేసిన లేదా పొందిన ఏవైనా ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, సమాచారం లేదా ఇతర సామగ్రి నాణ్యత మీ అంచనాలను అందుకుంటుందని, ఇంకా (vi) టెక్నాలజీలో ఏవైనా ఎర్రర్లు ఉంటే, వాటిని సరిదిద్దుతామని ఎలాంటి హామీని ఇవ్వవు.
రిజిస్ట్రేషన్/మెంబర్‌షిప్ లేదా బ్రౌజింగ్ ఫీజు కోసం ఎప్పుడైనా ఏదైనా ఫీజును వసూలు చేసే పూర్తి హక్కు కంపెనీకి ఉంది. కంపెనీ వసూలు చేసే అన్ని ఫీజులను మీకు తెలియజేయడమవుతుంది, అలానే వాటిని ప్రచురించిన/పోస్ట్ చేసిన వెంటనే అవి ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తాయి. కంపెనీ వసూలు చేసే అన్ని ఫీజులు, ఏవైనా ఉంటే, భారతీయ రూపాయల్లోనే ఉంటాయి.
ఇక్కడ పేర్కొన్న సర్వీస్‌ల్లో భాగంగా ఆర్థిక సంస్థల నుండి పొందిన క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి PhonePe ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న ఏదైనా పేమెంట్ పద్ధతి/పద్ధతుల ద్వారా ప్రయోజనం పొందుతున్నప్పుడు, కింద పేర్కొన్న కారణాలకే పరిమితం కాకుండా, ఏవైనా కారణాల వల్ల మీకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించే ఏదైనా నష్టం లేదా హానికి సంబంధించి కంపెనీ బాధ్యత వహించదు లేదా నష్టాన్ని పూడ్చే బాధ్యతను తీసుకోదు:
- ఏదైనా లావాదేవీ/లు చేయడానికి అధికారం(ఆథరైజేషన్) లేకపోవడం, లేదా
- లావాదేవీ వల్ల ఉత్పన్నమయ్యే ఏవైనా పేమెంట్ సమస్యలు, లేదా
- మీరు ఉపయోగిస్తున్న పేమెంట్ పద్ధతులు (క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసాలు మొదలైనవి) చట్టవిరుద్ధమైనవి అవ్వడం;
- మరేదైనా కారణం(ల) వల్ల లావాదేవీని తిరస్కరించడం
మీ/మీ లావాదేవీ విశ్వసనీయతపై PhonePe సంతృప్తి చెందకపోతే, భద్రత లేదా ఇతర కారణాల వల్ల అదనపు వెరిఫికేషన్‌ను నిర్వహించే హక్కు PhonePe ప్లాట్‌ఫామ్‌కు ఉంది.
ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లను అందించడంలో ఆర్థిక సంస్థలు విఫలమైతే లేదా ఆలస్యం చేస్తే, దాని వల్ల మీకు కలిగే ఏదైనా నష్టం లేదా హానితో సహా, దేనికీ కంపెనీ ఎటువంటి బాధ్యత వహించదు, అలానే కంపెనీని బాధ్యులను చేయకూడదు. భారతదేశం ప్రాదేశిక సరిహద్దుల వెలుపల ప్రోడక్ట్‌లు/సర్వీస్‌లను డెలివరీలు చేయకూడదు.
- బాధ్యతా పరిమితి
ఈ మొత్తం ప్రక్రియలో కంపెనీకి పరిమిత పాత్ర ఉందని, అది మీకు, ఆర్థిక సంస్థలకు మధ్య ఒక ఫెసిలిటేటర్‌గా మాత్రమే పనిచేస్తుందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఆర్థిక సంస్థల క్రెడిట్ కార్డ్/క్రెడిట్ సౌకర్యంతో మీకు ఏదైనా సమస్య తలెత్తితే, వర్తించే చట్టాలు, క్రెడిట్ కార్డ్ డాక్యుమెంట్లు లేదా మీరు, ఆర్థిక సంస్థలు ఏర్పాటు చేసుకున్న/అంగీకరించిన నియమ, నిబంధనల ప్రకారం మీ హక్కులు అమలు అవుతాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. కంపెనీ మరియు/లేదా కంపెనీ గ్రూప్ సంస్థలను ఏ వివాదంలోనూ పార్టీగా చేర్చకూడదు మరియు/లేదా కంపెనీ మరియు/లేదా కంపెనీ గ్రూప్ సంస్థలపై ఏ క్లెయిమ్‌నూ వేయకూడదని మీరు అంగీకరించి, హామీ ఇస్తున్నారు.
పై పేరాకు ఉన్న సాధారణ అర్థాన్ని మార్చకుండా, అలానే దాని విస్తారమైన పరిధికి పరిమితులు విధించకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ మరియు/లేదా కంపెనీ గ్రూప్ సంస్థలు, దాని అనుబంధ సంస్థలు, ఉప సంస్థలు, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు, పార్ట్‌నర్లు, లైసెన్సర్లు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలకు బాధ్యత వహించరు, వీటిలో లాభాలు లేదా ఆదాయాల నష్టం, సదభిప్రాయం పోవడం, వ్యాపారానికి అంతరాయం కలగడం, వ్యాపార అవకాశాలకు నష్టం వాటిల్లడం, డేటా నష్టం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టం, ఇంకా ఒప్పందం, నిర్లక్ష్యం, హక్కుల అతిక్రమణ లేదా ఇతరత్రా కారణాల వల్ల కలిగిన నష్టాలు, సర్వీస్‌లను ఉపయోగించడం లేదా పొందలేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే నష్టాలు ఉన్నాయి, కానీ వీటికే పరిమితం కాదు.
- నష్టపరిహారం
మీరు కంపెనీ, దాని అధికారులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, అనుబంధ సంస్థలు, ఉప సంస్థలు, జాయింట్ వెంచర్లు, ఉద్యోగులకు ఏవైనా క్లెయిమ్‌లు, చర్యలు, డిమాండ్లు, రికవరీలు, నష్టాలు, హాని, జరిమానాలు, పెనాల్టీలు లేదా ఇతర ఖర్చులు లేదా ఏదైనా రూపంలో ఉన్న లేదా రకమైన వ్యయాలు, వీటిలో సహేతుకమైన న్యాయవాదుల ఫీజులు, లేదా మీరు నియమ, నిబంధనలను (TOUలను) ఉల్లంఘించడం వల్ల కలిగిన లేదా దానికి సంబంధించిన, ఏదైనా చట్టాన్ని లేదా థర్డ్ పార్టీ హక్కులను ఉల్లంఘించడం లేదా PhonePe ప్లాట్‌ఫామ్/సర్వీస్‌లను మీరు ఉపయోగించడం, ఇంకా ఆర్థిక సంస్థలు అందించే క్రెడిట్ కార్డ్‌లు/క్రెడిట్ సౌకర్యం/ప్రోడక్ట్‌లను ఉపయోగించడం వంటి వాటి వల్ల కలిగే నష్టాల నుండి హాని కలగకుండా నష్టపరిహారం చెల్లించాలి, నష్టం నుండి రక్షణ కల్పించాలి, నష్టానికి దూరంగా ఉంచాలి.
- అదనపు నియమ, నిబంధనలు
PhonePe ప్లాట్‌ఫామ్, ఈ నియమ, నిబంధనలు (TOUలు), ఒప్పందం మరియు/లేదా ఏవైనా సంబంధిత పాలసీలు, ఒప్పందాలకు మీకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే ఎప్పుడైనా మార్పులు చేసే హక్కు కంపెనీకి ఉంది. ఈ నియమ, నిబంధనలు (TOUలు) మరియు/లేదా ఏదైనా అప్‌డేట్ చేసిన ఒప్పందం వెర్షన్ పోస్ట్ చేసిన వెంటనే అమల్లోకి వస్తుంది. అప్‌డేట్లు/మార్పుల కోసం ఈ నియమ, నిబంధనలు(TOUలు) మరియు/లేదా ఒప్పందాన్ని క్రమం తప్పకుండా సమీక్షించడం మీ బాధ్యతే అని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. మీరు సర్వీస్‌లు/PhonePe ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం ఉపయోగిస్తుంటే ఆ మార్పులను అంగీకరిస్తున్నారని, ఎప్పటికప్పుడు సవరించిన నియమాలకు కట్టుబడి ఉండే ఒప్పందం కుదుర్చుకున్నారని అర్థం. మీరు మార్పులకు అంగీకరించకపోతే, దయచేసి మీరు సర్వీస్‌ల వినియోగాన్ని నిలిపివేయవచ్చు.
మీకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే సర్వీస్‌లను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే లేదా ఆపివేసే హక్కు కంపెనీకి ఉంది. సర్వీస్‌ల్లో ఏదైనా మార్పు చేయడం లేదా సర్వీస్‌లను నిలిపివేయడం వల్ల కలిగే ఇబ్బందులకు కంపెనీ మీకు ఏ విధంగానూ బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు.
మీరు సర్వీస్‌లను చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం లేదా చట్టవిరుద్ధమైన, వేధించే, అవమానకరమైన (అవాస్తవమైన, ఇతరులకు హాని కలిగించే), మరొకరి ప్రైవసీకి భంగం కలిగించే, దుర్వినియోగపర్చే, బెదిరించే లేదా అశ్లీలమైన, మరొకరి హక్కులను ఉల్లంఘించే లేదా మీకు చెందని విషయాలను ప్రసారం చేయడానికి ఉపయోగించకూడదని మీరు అంగీకరిస్తున్నారు.
- సాధారణ నియమాలు
ఈ నిబంధనల్లో ఏవైనా చెల్లనివి, నిరర్ధకమైనవి లేదా ఏదైనా కారణం వల్ల అమలు చేయలేనివిగా తేలితే, ఈ నిబంధనల్లో ప్రతిబింబించే విధంగా పార్టీల ఉద్దేశాలను అమలు చేయడానికి కోర్టు ప్రయత్నించాలని పార్టీలు అంగీకరిస్తున్నాయి, అలానే అమలు చేయలేని నిబంధనను, మిగిలిన వాటితో వేరు (సపరేట్) చేయడమవుతుంది, అంతే తప్ప ఇది మిగిలిన ఏదైనా నిబంధన చెల్లుబాటును, అమలు చేసే సామర్థ్యాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయదు. శీర్షికలను (హెడింగ్‌లను) కేవలం రెఫరెన్స్ కోసం మాత్రమే పేర్కొన్నాము, అవి ఆయా విభాగాల పరిధిని లేదా స్కోప్‌ను పరిమితం చేయవు. PhonePe ప్లాట్‌ఫామ్ కేవలం భారతదేశంలోని యూజర్ల కోసమే. ఈ నియమ, నిబంధనలు (TOUలు), ఒప్పందం, అలానే మీకు, కంపెనీకి మధ్య ఉన్న సంబంధాలు భారతదేశ చట్టాల ప్రకారం అమలవుతాయి. ఈ నియమ, నిబంధనల (TOUల) వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్ లేదా వివాదాంశాన్ని పరిష్కరించడానికి బెంగళూరులోని కోర్టులు ప్రత్యేక అధికార పరిధిని కలిగి ఉంటాయి. మీరు లేదా ఇతరులు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో కంపెనీ విఫలమైనంత మాత్రాన, తదుపరి ఉల్లంఘనలు లేదా ఈ తరహా ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే హక్కును కంపెనీ కోల్పోదు (హక్కు రద్దు కాదు). ఒప్పందంతో పాటు మీరు క్షుణ్ణంగా చదివి, అర్థం చేసుకోవాల్సిన ఈ నియమ, నిబంధనలు (TOUలు) మీకు, కంపెనీకి మధ్య పూర్తి ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి, అలానే PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌లను మీరు వినియోగించే విధానాన్ని నియంత్రిస్తాయి.
- ఫిక్స్‌డ్ డిపాజిట్-ఆధారిత క్రెడిట్ కార్డ్‌లకు వర్తించే నియమ, నిబంధనలు
- పైన పేర్కొన్న నియమ, నిబంధనలకు అదనంగా, కింది నియమ, నిబంధనల ప్రకారం మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ (“FD“) ఆధారిత క్రెడిట్ కార్డ్ వినియోగం / దరఖాస్తు అమలు అవుతుందని మీరు అర్థం చేసుకున్నారు.
- Upswing ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (“Upswing”) యాజమాన్యంలోని టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ (“Upswing ప్లాట్‌ఫామ్”) ద్వారా, కింది జాబితాలోని FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(లు) యాక్సెస్‌ను కంపెనీ అందిస్తుంది:
- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ WISH క్రెడిట్ కార్డ్.
- మీకు FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(లు)ను అందించడం కోసం, PhonePe ప్లాట్‌ఫామ్‌లో Upswing ప్లాట్‌ఫామ్ లింక్‌లు లేదా రీడైరెక్షన్ ఫంక్షనాలిటీలు ఉంటాయి.
- FD ఆధారిత క్రెడిట్ కార్డ్(లు)ను పొందడాన్ని ఎంచుకోవడం ద్వారా, మీరు Upswing ప్లాట్‌ఫామ్‌కు రీడైరెక్ట్ అవ్వడానికి స్పష్టంగా అంగీకరించి, సమ్మతిస్తున్నారు, అలానే Upswing ప్లాట్‌ఫామ్ PhonePe సొంత ప్లాట్‌ఫామ్ కాదని / దాన్ని ఆపరేట్ చేయదని, వీటికి ఏ విధంగానూ PhonePe బాధ్యత వహించదని అర్థం చేసుకున్నారు.
- Upswing, కార్డ్ జారీ చేసే ఆర్థిక సంస్థ(లు) మధ్య కుదిరిన ఏర్పాట్ల ప్రకారం, సంబంధిత కార్డ్‌ను జారీ చేసే ఆర్థిక సంస్థ(లు), Upswing ద్వారా FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(లు)ను అందిస్తుందని (స్తాయని) మీరు మరింతగా అర్థం చేసుకుని, గుర్తించి, అంగీకరిస్తున్నారు.
- మీరు Upswing ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసి, ఉపయోగించడం అనేది Upswing అదనపు నియమ, నిబంధనలకు లోబడి ఉంటుందని మీరు మరింత అర్థం చేసుకుని, గుర్తించి, అంగీకరిస్తున్నారు. అలానే అప్‌డేట్లు/మార్పుల కోసం ఆయా నియమ, నిబంధనలను క్రమం తప్పకుండా సమీక్షించాల్సిన పూర్తి బాధ్యత మీదే.
- FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(లు) కోసం చేసిన దరఖాస్తు ఫారమ్‌ను Upswing ప్రత్యేకంగా నిర్వహిస్తుందని, దీని కోసం సంబంధిత ఆర్థిక సంస్థ నుండి అధికారికంగా ఆమోదాన్ని పొందిందని మీరు అర్థం చేసుకుని, గుర్తించి, అంగీకరిస్తున్నారు. PhonePe ప్లాట్‌ఫామ్‌లో FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(లు)కు దరఖాస్తు చేసుకోవాలని ఎంచుకున్న తర్వాత, మీరు Upswing ప్లాట్‌ఫామ్‌కు రీడైరెక్ట్ అవుతారు.
- FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(లు)కు సంబంధించి మీరు అందించిన ఏదైనా సమాచారం/డాక్యుమెంట్/వివరాలను సంబంధిత FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(లు)ను జారీ చేసే ఆర్థిక సంస్థ తరపున Upswing సేకరిస్తోంది.
- మీరు Upswing ప్లాట్‌ఫామ్‌లో లేదా ఏదైనా ఆర్థిక సంస్థకు డేటా, సమాచారంతో సహా ఏదైనా కంటెంట్‌ను షేర్ చేసినప్పుడు లేదా సమర్పించినప్పుడు, మీరు Upswing ప్లాట్‌ఫామ్‌లో లేదా ఏదైనా ఆర్థిక సంస్థకు సమర్పించే కంటెంట్ ఖచ్చితత్వం, పరిపూర్ణతకు మీరే పూర్తిగా బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. Upswing ప్లాట్‌ఫామ్‌లో లేదా ఏదైనా ఆర్థిక సంస్థకు అందుబాటులో ఉంచడానికి మీరు ఎంచుకున్న ఏదైనా కంటెంట్‌కు కంపెనీని బాధ్యులను చేయకూడదు.
- FD-ఆధారిత క్రెడిట్ కార్డ్ జారీకి సంబంధించి సెక్యూరిటీని (పూచీకత్తును) క్రియేట్ చేసే ఉద్దేశంతో సంబంధిత ఆర్థిక సంస్థ మిమ్మల్ని FDని క్రియేట్ చేయమని కోరవచ్చని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతి తెలుపుతున్నారు. ఇదంతా కూడా మీతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ ఆర్థిక సంస్థ నియమ, నిబంధనల ప్రకారం ఉంటుంది. FD క్రియేషన్, FDపై వడ్డీ పేమెంట్, FD అమౌంట్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందే విత్‌డ్రా చేసుకోవడం, అలానే FDకి సంబంధించిన ఏవైనా ఇతర కార్యకలాపాల్లో కంపెనీ పాల్గొనదు మరియు/లేదా వాటికి బాధ్యత వహించదు. FD సంబంధిత అన్ని కార్యకలాపాలకు ఆర్థిక సంస్థలు మాత్రమే బాధ్యత వహిస్తాయి, అలానే ఏదైనా FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(ల)కు సంబంధించి ఏదైనా ఆర్థిక సంస్థ అందించే FD సౌకర్యాన్ని మీరు ఉపయోగించడం అనేది మీకు, సంబంధిత ఆర్థిక సంస్థ(ల) మధ్య అంగీకారం కుదిరిన నియమాల ప్రకారం ఉంటుంది.
- ఈ మొత్తం ప్రక్రియలో కంపెనీకి పరిమిత పాత్ర ఉందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు, అది మీకు, ఆర్థిక సంస్థలకు మధ్య ఒక ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తోంది. ఆర్థిక సంస్థలు అందించే FD లేదా క్రెడిట్ కార్డ్ సౌకర్యాలకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే, వర్తించే చట్టాలు, FD, క్రెడిట్ కార్డ్ డాక్యుమెంట్లు మరియు/లేదా మీకు, ఆర్థిక సంస్థలకు మధ్య వర్తించే నియమ, నిబంధనల ప్రకారం మీ హక్కులు అమలు అవుతాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
- FD-ఆధారిత క్రెడిట్ కార్డ్(లు)ను మీరు వినియోగించడానికి సంబంధించిన ఏవైనా సందేహాలు మరియు/లేదా ఫిర్యాదులను సంబంధిత ఆర్థిక సంస్థకు తెలపాలి, వాటికి పరిష్కారం ఆ ఆర్థిక సంస్థ ఫిర్యాదుల పరిష్కార విధానాల (గ్రీవెన్స్ రిడ్రెసల్ పాలసీల) ప్రకారం లభిస్తుంది. PhonePe పాత్ర, ఏదైనా ఉంటే, ఆయా సందర్భాలను బట్టి, Upswing మరియు/లేదా ఆర్థిక సంస్థ నుండి వచ్చిన ప్రతిస్పందనలను (సందేశాలను) ‘ఉన్నది ఉన్నట్లుగా’ మీకు తెలపడానికి/అందించడానికి మాత్రమే పరిమితమవుతుంది.