< Back
ఫిక్స్‌డ్ డిపాజిట్లు – నియమ, నిబంధనలు
ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు – నియమ, నిబంధనలు (“నియమ, నిబంధనలు”) అనేవి ఎప్పటికప్పుడు సవరించే ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తుల మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ – 2021’లోని రూల్ 3 ప్రకారం ప్రచురించిన, అలాగే ఎప్పటికప్పుడు సవరించే ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం – 2000’తో కలిపి చదవవలసిన, కంప్యూటర్‌లో జనరేట్ అయిన ఎలక్ట్రానిక్ రికార్డు. దీనిపై ఎటువంటి నేరుగా చేసిన లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
ఇక్కడ ఉపయోగించిన అన్ని క్యాపిటలైజ్డ్ పదాలకు కింద ఉన్న సెక్షన్ Bలో (నిర్వచనాలు) ఆపాదించిన అర్థాలు ఉంటాయి.
- పరిచయం
- PhonePe లిమిటెడ్ (గతంలో ‘PhonePe ప్రైవేట్ లిమిటెడ్’ అని పిలిచేవారు) (“PhonePe”) అనేది ఆర్థిక సంస్థల నుండి మీరు పొందాలని ప్రతిపాదించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సంబంధిత ప్రోడక్ట్‌లు/సర్వీస్‌ల కోసం Upswing ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి మీకు (“మీకు”) వీలు కల్పించే సర్వీస్‌ను అందిస్తుంది.
- ఈ సర్వీస్‌ను పొందడం కోసం మీరు తదుపరి దశలను పూర్తి చేసే ముందు ఈ నియమ, నిబంధనలలోని ప్రతి ఒక్క విషయాన్నీ జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఈ నియమ, నిబంధనలలో మీ చట్టపరమైన హక్కులు, పరిహారాలు, బాధ్యతల గురించి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ నియమ, నిబంధనలు మీకు, PhonePeకు మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే అగ్రిమెంట్‌ను ఏర్పరుస్తాయి, అలాగే ఈ సర్వీస్‌ను మీరు పొందడాన్ని, ఉపయోగించడాన్ని నియంత్రిస్తాయి. ఈ సర్వీస్ అనేది Upswing మరియు/లేదా సంబంధిత ఆర్థిక సంస్థకు చెందిన ఏవైనా నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండటానికి లోబడి ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు. ఒకవేళ మీకు ఈ నియమ, నిబంధనలు అర్థం కాకపోయినా లేదా వాటిలోని ఏ భాగాన్ని అయినా మీరు అంగీకరించకపోయినా, మీరు ఈ సర్వీస్‌ను ఉపయోగించడానికి ముందుకు కొనసాగకూడదు. ఈ సర్వీస్‌ను పొందుతున్నా లేదా ఉపయోగిస్తున్నా మీరు ఈ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండటానికి అంగీకరించి, సమ్మతిస్తున్నారని అర్థం.
- నిర్వచనాలు
- “ఆర్థిక సంస్థలు” అంటే Upswing పార్ట్‌నర్ బ్యాంక్‌లు / ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు అని అర్థం;
- “ఫిక్స్‌డ్ డిపాజిట్” అంటే Upswing ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్థిక సంస్థలు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్, అలాగే సంబంధిత ప్రోడక్ట్‌లు/సర్వీస్‌లు అని అర్థం;
- “PhonePe ప్లాట్‌ఫామ్” అంటే PhonePe మరియు/లేదా దాని అనుబంధ సంస్థలు డెవలప్ చేసిన, సొంతం చేసుకున్న మరియు/లేదా నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్/సాఫ్ట్‌వేర్ అప్లికేషన్/ప్లాట్‌ఫామ్/వెబ్‌సైట్ అని అర్థం.
- “సర్వీస్” అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లను పొందడం కోసం PhonePe ప్లాట్‌ఫామ్‌లో Upswing ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసే అవకాశాన్ని మీకు కల్పించే PhonePe సర్వీస్ అని అర్థం;
- “Upswing” అంటే ‘Upswing ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అని అర్థం;
- “Upswing ప్లాట్‌ఫామ్” అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌తో పూర్తి స్థాయిలో అనుసంధానమైన, అలాగే Upswing డెవలప్ చేసిన, సొంతం చేసుకున్న మరియు/లేదా నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్/సాఫ్ట్‌వేర్ అప్లికేషన్/ప్లాట్‌ఫామ్/వెబ్‌సైట్ అని అర్థం, అయితే దీన్ని PhonePe నియంత్రించదు/నిర్వహించదు/పర్యవేక్షించదు;
- నియమ, నిబంధనలు
- మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)ను యాక్సెస్ చేసే ప్రయోజనాల నిమిత్తం, PhonePe ప్లాట్‌ఫామ్‌లో Upswing ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన లింక్‌లు లేదా మిమ్మల్ని ఆ ప్లాట్‌ఫామ్‌కు తీసుకెళ్లే ఏర్పాట్లు ఉంటాయి.
- ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)ను యాక్సెస్ చేయాలని ఎంచుకోవడం ద్వారా, మీరు Upswing ప్లాట్‌ఫామ్‌కు ఆటోమేటిక్‌గా వెళ్లడానికి స్పష్టంగా అంగీకరించి, సమ్మతిస్తున్నారు, అలాగే Upswing ప్లాట్‌ఫామ్‌ను PhonePe సొంతం చేసుకోలేదని / నిర్వహించట్లేదని, అలాగే వీటి విషయంలో ఏ రకంగానూ బాధ్యత వహించదని మీరు అర్థం చేసుకున్నారు.
- మీరు ఆర్థిక సంస్థల నుండి పొందేందుకు ప్రతిపాదించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి, మిమ్మల్ని Upswingతో అనుసంధానించడానికి PhonePe కేవలం ఒక ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తూ, ఈ సర్వీస్‌ను అందిస్తుంది.
- Upswing, అలాగే సదరు ఆర్థిక సంస్థ(ల) మధ్య ఏర్పాటైన వ్యవస్థల ప్రకారం, సంబంధిత ఆర్థిక సంస్థ(లు) Upswing ద్వారా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)ను అందిస్తున్నాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి PhonePe ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఏదైనా సమాచారాన్ని, సంబంధిత ఆర్థిక సంస్థ(లు) ఇచ్చిన సమాచారం ప్రకారమే Upswing అందిస్తుంది. PhonePe అటువంటి సమాచారాన్ని ‘ఉన్నది ఉన్నట్లుగా’ చూపుతుంది.
- ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)కు సంబంధించి PhonePe ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఏదైనా సమాచారాన్ని, మీకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే Upswing ఎప్పటికప్పుడు అందించే సమాచారం ప్రకారం PhonePe మార్చవచ్చు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)కు సంబంధించి PhonePe ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఏదైనా సమాచారంపై ఆధారపడాలని ఎంచుకోవడం ద్వారా, ఆ సమాచారంపై మీరు ఆధారపడటానికి సంబంధించి PhonePeపై మీకు ఉండబోయే ఏవైనా, అన్ని క్లెయిమ్‌లు, చర్యలు తీసుకునే హక్కులు మరియు/లేదా పరిహారాలను (చట్టం ప్రకారం లేదా ఇతరత్రా మార్గాల్లో) మీరు స్పష్టంగా వదులుకుంటున్నారని అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)కు సంబంధించిన ఏదైనా సమాచార ఖచ్చితత్వం, పరిపూర్ణత లేదా వినియోగానికి సరిపోవడం వల్ల లేదా దానికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిణామాలకైనా PhonePe స్పష్టంగా అన్ని బాధ్యతలను నిరాకరిస్తుంది, అలాగే ఏ విధంగానూ జవాబుదారీగా ఉండదు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్(ల) కోసం మీరు నింపే అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా Upswing నిర్వహిస్తుందని, ఇదే విషయం నిమిత్తం కావాల్సిన అధికారిక అనుమతులను సంబంధిత ఆర్థిక సంస్థ(ల) నుండి పొందిందని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు. PhonePe ప్లాట్‌ఫామ్ ద్వారా Upswing ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్(ల) కోసం పెట్టే అప్లికేషన్లను, ఆయా ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందించే సంబంధిత ఆర్థిక సంస్థలే ఆమోదిస్తాయి.
- Upswing ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)ను బుక్ చేయడం అనేది మీకు, Upswingకు, సంబంధిత ఆర్థిక సంస్థ(ల)కు మధ్య జరిగే ఒక స్వతంత్ర లావాదేవీ అని, అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)ను క్రియేట్ చేయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)పై వడ్డీని చెల్లించడం, మెచ్యూరిటీకి ముందే ఫిక్స్‌డ్ డిపాజిట్ అమౌంట్‌ను విత్‌డ్రా చేయడంలో, అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)కు సంబంధించిన ఇతర కార్యకలాపాల్లో PhonePe ప్రమేయం ఉండదని మరియు/లేదా బాధ్యత వహించదని మీరు అర్థం చేసుకుని, అంగీకరించి, సమ్మతిస్తున్నారు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించి కింద పేర్కొన్న సర్వీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, సంబంధిత ఏ సర్వీస్‌లను అయినా నెరవేర్చేందుకు PhonePe బాధ్యత వహించదు:
- Upswing ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉండటం మరియు/లేదా పనిచేస్తుండటం;
- Upswing ప్లాట్‌ఫామ్‌లో అందించిన ఏదైనా సమాచార ఖచ్చితత్వం మరియు/లేదా సంపూర్ణత;
- ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్(ల)ను విజయవంతంగా క్రియేట్ చేయడం/బుక్ చేయడం, అలాగే మీ ఫిక్స్‌డ్ డిపాజిట్(ల) బుకింగ్ ప్రక్రియలో మీకు ఎదురయ్యే ఏవైనా సమస్యలను పరిష్కరించడం;
- ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఇవ్వడం / కస్టమర్‌కు సహాయం అందించడం;
- ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి Upswing మరియు/లేదా సంబంధిత ఆర్థిక సంస్థ(లు) ఏదైనా సర్వీస్‌ను రద్దు చేయడం;
- Upswing మరియు/లేదా ఏవైనా ఆర్థిక సంస్థలు అందించే ఏవైనా సర్వీస్‌లు మీ అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వడంతో సహా, అవి పనిచేసే విధానం;
- మీ ఫిక్స్‌డ్ డిపాజిట్(ల) వినియోగానికి సంబంధించిన ఏవైనా సందేహాలు మరియు/లేదా ఫిర్యాదులను సంబంధిత ఆర్థిక సంస్థ దృష్టికే తీసుకెళ్లాలి, అలాగే వాటిని సదరు ఆర్థిక సంస్థ ఫిర్యాదు పరిష్కార పాలసీల ప్రకారమే పరిష్కరించడమవుతుంది. ఈ ప్రక్రియలో ఒకవేళ PhonePe పాత్ర ఏదైనా ఉంటే, అది Upswing మరియు/లేదా ఆర్థిక సంస్థ నుండి అందిన స్పందనలను, అవి ‘ఎలా అందితే అలా’ మీకు తెలపడానికి మాత్రమే పరిమితమవుతుంది.
- ఫిక్స్‌డ్ డిపాజిట్(ల) అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా మీ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడం కోసం మీరు అందించిన ఏదైనా సమాచారం/డాక్యుమెంట్/వివరాలను Upswing మరియు/లేదా సంబంధిత ఆర్థిక సంస్థకు పంపడానికి మీరు ఇందుమూలంగా PhonePeకు మీ సమ్మతిని ఇస్తున్నారు.
- మీ KYC మరియు/లేదా ఇతర డ్యూ డిలిజెన్స్‌ను (నిశిత పరిశీలనను) నిర్వహించడానికి ఆర్థిక సంస్థ మాత్రమే పూర్తి బాధ్యత వహిస్తుంది, అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం మీ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడం కోసం అదనపు సమాచారం/డాక్యుమెంట్లు/వివరాలను పంపమని వారు కోరవచ్చు. అటువంటి డేటా/సమాచారాన్ని సేకరించి ఆర్థిక సంస్థలకు సమర్పించే సౌకర్యాన్ని మేము కల్పించవచ్చు.
- వర్తించే చట్టం అనుమతించిన మేరకు, సర్వీస్‌ల అప్‌డేట్‌లు, సమాచారం/ప్రమోషనల్ ఇమెయిల్‌లు మరియు/లేదా ప్రొడక్ట్ ప్రకటనలకు సంబంధించి PhonePe లేదా దాని థర్డ్-పార్టీ వెండర్లు/బిజినెస్ పార్ట్‌నర్లు/మార్కెటింగ్ అనుబంధ సంస్థలు లేదా ఆర్థిక సంస్థలు నుండి ఇమెయిల్‌లు, టెలిఫోన్ మరియు/లేదా SMS ద్వారా కమ్యూనికేషన్లను పొందడానికి మీరు అంగీకరిస్తున్నారు.
- వర్తించే చట్టం అనుమతించిన మేరకు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (“TRAI”) రూపొందించిన నియమ, నిబంధనలతో సహా, వర్తించే చట్టం ప్రకారం డు నాట్ డిస్టర్బ్ (“DND”) / నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (“NCPR”) జాబితా కింద మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌పై అన్ని కమ్యూనికేషన్లను పొందడానికి మీరు అంగీకరించి, సమ్మతిస్తున్నారు. ఈ ప్రయోజనం నిమిత్తం, మీ సమాచారాన్ని కంపెనీ గ్రూప్ కంపెనీలు, కంపెనీ థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్ లేదా ఎవరైనా అధీకృత ఏజెంట్లకు పంపడానికి/వెల్లడించడానికి మీరు కంపెనీకి మరింత అధికారం ఇస్తున్నారు.
- అన్ని కమ్యూనికేషన్లను సరిగ్గా పంపించడం కోసం PhonePe తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కాంటాక్ట్ సమాచారంపై ఏవైనా పరిమితులు, DND జాబితా కింద ఫోన్ నంబర్ రిజిస్టర్ అయి ఉండటం, ఇమెయిల్ డేటా స్టోరేజ్ నిండిపోవడం, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల తరఫున తలెత్తిన లోపాలు వంటి సమస్యల వల్ల కమ్యూనికేషన్లను పంపడంలో విఫలం కావచ్చు. పైన పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకుని, ఏవైనా కమ్యూనికేషన్లు అందకపోతే దానికి PhonePe బాధ్యత వహించదు లేదా జవాబుదారీ కాదు.
- Upswing, సంబంధిత ఆర్థిక సంస్థ(ల)తో మీకున్న సంబంధం అనేది మీకు, సదరు ఆర్థిక సంస్థ(ల)కు మధ్య అంగీకారం కుదిరిన వారి సంబంధిత నియమ, నిబంధనల ప్రకారం స్వతంత్రంగా నిర్వహించడమవుతుంది, దీనిలో PhonePeను ఏ రకంగానూ భాగం చేయకూడదు.
- PhonePe ప్లాట్‌ఫారమ్‌కు లైసెన్స్, యాక్సెస్
- PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌లపై, అలాగే PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌లలో ఉన్న ఏవైనా మేధో సంపత్తి హక్కులపై (ఆ హక్కులను రిజిస్టర్ చేసినా లేదా చేయకపోయినా) అన్ని చట్టపరమైన, యాజమాన్య హక్కులు, అలాగే ప్రయోజనాలపై పూర్తి హక్కులు PhonePeకు ఉంటాయని అంగీకరించి, సమ్మతిస్తున్నారు. ఈ సర్వీస్‌ల్లో ‘గోప్యమైన సమాచారం’ అని కంపెనీ పేర్కొన్న సమాచారం ఉండవచ్చని, అలాగే కంపెనీ నుండి ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా మీరు సదరు సమాచారాన్ని బయటకు వెల్లడించకూడదని మీరు స్పష్టంగా అంగీకరిస్తున్నారు. PhonePe ప్లాట్‌ఫామ్ రూపు, రేఖలు (ఉదాహరణకు టెక్స్ట్, గ్రాఫిక్స్, ఇమేజ్‌లు, లోగోలు, బటన్ ఐకాన్లు), దానిలోని ఫోటోగ్రాఫ్‌లు, ఎడిటోరియల్ కంటెంట్, నోటీసులు, సాఫ్ట్‌వేర్, ఇతర మెటీరియల్‌తో సహా, మొత్తం కంటెంట్‌పై, సందర్భాన్ని బట్టి కంపెనీ మరియు/లేదా దాని థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు/వారి లైసెన్సర్‌లకు యాజమాన్య హక్కు ఉంటుంది లేదా లైసెన్స్ ఉంటుంది, అలాగే వర్తించే కాపీరైట్, ట్రేడ్‌మార్క్, ఇతర చట్టాల కింద తగిన విధంగా వారు పరిరక్షిస్తున్నారు.
- PhonePe ప్లాట్‌ఫామ్, సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి PhonePe ఇందుమూలంగా మీకు పరిమితమైన లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది. అయితే ఈ లైసెన్స్‌లో మరో వ్యక్తి, వెండర్ లేదా ఏదైనా ఇతర థర్డ్-పార్టీ ప్రయోజనం నిమిత్తం ఏదైనా సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడం లేదా కాపీ చేయడం లేదా దాని ఆధారంగా కొత్తది తయారు చేయడం, సవరించడం, రివర్స్ ఇంజనీరింగ్ చేయడం, రివర్స్ అసెంబుల్ చేయడం లేదా ఏదైనా సోర్స్ కోడ్‌ను తెలుసుకోవడానికి ఇతర రూపాల్లో ప్రయత్నించడం, విక్రయించడం, కేటాయించడం, సబ్‌లైసెన్స్ ఇవ్వడం, భద్రతా ప్రయోజనాన్ని కల్పించడం లేదా సర్వీస్‌ల్లోని ఏదైనా హక్కును ఇతర రూపాల్లో బదిలీ చేయడం వంటివి భాగం కావు. మీరు ఏ రూపంలోనైనా అనధికారికంగా ఉపయోగించినట్లయితే మీకు మంజూరు చేసిన అనుమతి లేదా లైసెన్స్ రద్దు అవుతుంది.
- PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా, కింది పనులను చేయకూడదని మీరు అంగీకరిస్తున్నారు: (i) PhonePe ప్లాట్‌ఫామ్‌ను లేదా దాని కంటెంట్‌లను ఏదైనా వాణిజ్య ప్రయోజనం కోసం ఉపయోగించడం; (ii) ఊహాజనిత, తప్పుడు లేదా మోసపూరిత లావాదేవీని చేయడం లేదా డిమాండ్‌ను ఊహించి ఏ లావాదేవీనైనా చేయడం; (iii) PhonePe నుండి పొందిన స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా ప్రయోజనం నిమిత్తం రోబోట్, స్పైడర్, స్క్రాపర్ లేదా ఇతర ఆటోమేటెడ్ మార్గాలను లేదా ఏదైనా మాన్యువల్ ప్రక్రియను ఉపయోగించి PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏదైనా కంటెంట్ లేదా సమాచారాన్ని యాక్సెస్ చేయడం, పర్యవేక్షించడం లేదా కాపీ చేయడం; (iv) PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏవైనా ఎక్స్‌క్లూజన్ హెడర్‌లలోని పరిమితులను ఉల్లంఘించడం లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌కు యాక్సెస్‌ను నిరోధించడానికి లేదా పరిమితం చేయడానికి ఏర్పాటు చేసిన ఇతర చర్యలను దాటవేయడం, పరిమితం చేయడం లేదా అడ్డదారిలో తప్పించుకోవడం; (v) PhonePe మౌలిక సదుపాయాలపై, PhonePe తన విచక్షణ ప్రకారం అన్యాయమైన లేదా అసమానమైన భారం అని భావించిన స్థాయిలో పెద్ద భారాన్ని మోపే లేదా మోపగల ఏదైనా చర్యను చేపట్టడం; (vi) PhonePe నుండి పొందిన స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా ప్రయోజనం నిమిత్తం PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏ విభాగానికైనా (ఏదైనా ప్రొడక్ట్/సర్వీస్ కొనుగోలుకు తీసుకెళ్లే ‘పర్చేస్ పాత్’తో సహా, కానీ దీనికే పరిమితం కాకుండా) డీప్-లింక్ చేయడం; లేదా (vii) PhonePe నుండి పొందిన ముందస్తు రాతపూర్వక ఆథరైజేషన్ లేకుండా PhonePe ప్లాట్‌ఫామ్‌లోని ఏ భాగాన్ని అయినా ఏదైనా ఇతర వెబ్‌సైట్‌లోకి “ఫ్రేమ్”, “మిర్రర్” చేయడం లేదా ఇతర పద్ధతుల్లో పంపడం; లేదా (viii) కంపెనీ/ఆర్థిక సంస్థలు లేదా ఏదైనా థర్డ్-పార్టీ(ల)తో/వారిపై ఏవైనా మోసపూరిత చర్యలకు పాల్పడటానికి మోసపూరితమైన అప్లికేషన్లను మొదలుపెట్టడం లేదా PhonePe ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం; ఇంకా (ix) PhonePe మరియు/లేదా ఆర్థిక సంస్థలకు ఏదైనా తప్పుడు, అసంపూర్ణమైన లేదా అసత్యమైన సమాచారాన్ని/డేటాను ఇవ్వడం.
- గోప్యతా విధానం. PhonePe ప్లాట్‌ఫామ్‌ను మీరు ఉపయోగించడం ద్వారా, PhonePe గోప్యతా విధానంలో పేర్కొన్న విధానంలో మీ సమాచారాన్ని వినియోగించడానికి మీరు ఇందుమూలంగా సమ్మతిని తెలుపుతున్నారు. మీరు PhonePe ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసినప్పుడు PhonePe మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిర్వహిస్తుందో ఈ గోప్యతా విధానం వివరిస్తుంది.
- సర్వీస్ నాణ్యతకు సంబంధించి, కింద పేర్కొన్న వాటితో సహా, కానీ వాటికే పరిమితం కాకుండా, స్పష్టమైన లేదా ఆ అర్థం వచ్చేలా ఎలాంటి వారెంటీని PhonePe ఇవ్వదు:
- సర్వీస్ మీ అవసరాలను తీరుస్తుంది;
- సర్వీస్ ఎలాంటి అంతరాయాలు లేకుండా, సకాలంలో లేదా ఎర్రర్లు లేకుండా అందుతుంది;
- సర్వీస్‌కు సంబంధించి మీరు పొందే ఏవైనా ప్రొడక్ట్‌లు, సమాచారం లేదా మెటీరియల్ మీ అవసరాలను తీరుస్తాయి.
- మొత్తం ప్రక్రియలో కంపెనీ పాత్ర పరిమితమైనదని, ఇది మీకు, Upswingకు, అలాగే ఆర్థిక సంస్థలకు మధ్యలో కేవలం ఒక ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఆర్థిక సంస్థలు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తిన సందర్భంలో, వర్తించే చట్టాలు, Upswing, అలాగే సంబంధిత ఆర్థిక సంస్థల నియమ, నిబంధనల ప్రకారం మీ హక్కులు అమలవుతాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన ఏదైనా వివాదంలో PhonePe మరియు/లేదా PhonePe గ్రూప్ సంస్థలను ఒక పార్టీగా చేర్చకూడదని మరియు/లేదా PhonePe మరియు/లేదా PhonePe గ్రూప్ సంస్థలపై ఎటువంటి క్లెయిమ్ చేయకూడదని మీరు స్పష్టంగా అంగీకరించి, దానికి బాధ్యత వహిస్తున్నారు.
- ఈ సర్వీస్ అనేది “ఉన్నది ఉన్నట్లుగా”, “అందుబాటులో ఉన్న మేరకు” అనే ప్రాతిపదికన అందుతుంది, అలాగే ఇది క్రయవిక్రయాలకు తగినదని, ఏదైనా నిర్దిష్ట ప్రయోజనానికి సరిగ్గా సరిపోతుందని, అలాగే హక్కుల అతిక్రమణ ఉండదని చెప్పే వారెంటీలతో సహా అన్ని వారెంటీలను PhonePe స్పష్టంగా నిరాకరిస్తుంది. ఈ సర్వీస్‌ను, PhonePe ప్లాట్‌ఫామ్‌ను, Upswing ప్లాట్‌ఫామ్‌ను లేదా ఏదైనా లింక్ చేసిన వెబ్‌సైట్‌ను ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే లేదా Upswing మరియు/లేదా ఆర్థిక సంస్థల ప్రోడక్ట్‌లు/సర్వీస్‌ల వల్ల లేదా Upswing మరియు/లేదా ఏదైనా ఆర్థిక సంస్థ తీసుకునే ఇతర చర్య వల్ల లేదా సర్వీస్ అందించడం / అందించకపోవడం వల్ల లేదా PhonePe అనుబంధ సంస్థలు లేదా బిజినెస్ పార్ట్‌నర్లు తీసుకునే మరేదైనా ఇతర చర్య వల్ల కలిగే ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యేక లేదా పర్యవసాన నష్టాలు, లాభాలకు గండిపడటం, వినియోగించే అవకాశాన్ని కోల్పోవడం, వ్యాపారానికి అంతరాయం కలగడం, లేదా ఇతర ఆర్థిక నష్టాలు, ప్రోగ్రామ్‌లు లేదా ఇతర డేటాను కోల్పోవడంతో సహా, కానీ వీటికి మాత్రమే పరిమితం కాకుండా, ఒప్పందం, నిర్లక్ష్యం లేదా ఇతర చర్యలలో భాగంగా కలిగే ఎలాంటి నష్టాలకైనా, అటువంటి నష్టాలు సంభవించే అవకాశం ఉందని మీకు ముందుగానే తెలియజేసినప్పటికీ, ఏ విధంగానైనా దెబ్బతిన్న ఏ పార్టీకైనా PhonePe ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబుదారీగా ఉండదు.
- Upswing మరియు/లేదా ఆర్థిక సంస్థలకు కావాల్సిన వ్యక్తిగత సమాచారంతో సహా, పైన పేర్కొన్న సమాచారాన్ని పంపడం మరియు/లేదా వెల్లడించడం వల్ల, లేదా ఈ నియమ, నిబంధనలను మీరు ఉల్లంఘించడం వల్ల PhonePe, దాని అనుబంధ సంస్థలు, మరియు దాని/వారి సంబంధిత డైరెక్టర్లు, వాటాదారులు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు ఎదుర్కొనే, భరించే లేదా లోబడి ఉండాల్సిన ఏవైనా, అలాగే అన్ని క్లెయిమ్‌లు, బాధ్యతలు, డిమాండ్‌లు, నష్టాలు, ఖర్చులు, వ్యయాలు (సహేతుకమైన అటార్నీ ఫీజులతో సహా), రెగ్యులేటరీ చర్యలు, జరిమానాలు, పెనాల్టీలు లేదా దెబ్బతినడాల నుండి వారిని విముక్తులను చేసి, వారికి నష్టపరిహారం చెల్లించడానికి మీరు బేషరతుగా, స్పష్టంగా అంగీకారాన్ని తెలుపుతున్నారు.
- ఈ నియమ, నిబంధనలు భారతదేశ చట్టాలకు లోబడి అమలవుతాయి, అలాగే వీటి వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా వివాదానికి సంబంధించి బెంగళూరులో ఉన్న కోర్టుల ప్రత్యేక అధికార పరిధికి లోబడి ఉంటాయి.
- మీ నుండి ముందస్తు రాతపూర్వక సమ్మతిని తీసుకోకుండానే, ఇందులో పేర్కొన్న తన హక్కులను మూడవ వ్యక్తికి బదిలీ చేసే హక్కు PhonePeకు ఉంది. PhonePe నుండి పొందిన ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా ఈ నియమ, నిబంధనల కింద మీకు ఉండే హక్కులను మరియు/లేదా బాధ్యతలను మీరు ఏ వ్యక్తికీ / సంస్థకూ బదిలీ చేయకూడదు.
- ఈ నియమ, నిబంధనలలోని ఏదైనా నిబంధన అనేది వర్తించే చట్టాల ప్రకారం ఉల్లంఘించేలా ఉన్నా లేదా చట్టవిరుద్ధం, చెల్లనిది లేదా అమలు చేయలేనిదిగా మారినా, అటువంటి ఉల్లంఘన, చట్టవిరుద్ధత, చెల్లకపోవడం లేదా అమలు చేయలేకపోవడం అనేది మొత్తం నియమ, నిబంధనలను చెల్లనివిగా చేయదని మీరు గుర్తించి, అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. సదరు నిబంధనను చెల్లుబాటు అయ్యేలాగా, చట్టబద్ధమైనదిగా, అమలు చేయడానికి వీలుగా అవసరమైన మేరకు సవరించినట్లుగా భావించడమవుతుంది, ఒకవేళ అటువంటి సవరణ ఏదీ దాన్ని చెల్లుబాటు అయ్యేలాగా, చట్టబద్ధమైనదిగా, అమలు చేయదగినదిగా మార్చకపోతే, అప్పుడు ఈ నియమ, నిబంధనల నుండి చెల్లని నిబంధనను తొలగించినట్లుగా భావించాలి, అంతేగాక ఈ నియమ, నిబంధనలలోని ఒడంబడికలు లేదా నిబంధనల చెల్లుబాటు, చట్టబద్ధత, అమలుపై ఎటువంటి ప్రభావం ఉండదు, అలాగే పార్టీల హక్కులు, బాధ్యతలను తదనుగుణంగా అన్వయించి, అమలు చేయడమవుతుంది.
- PhonePe ప్లాట్‌ఫామ్‌లో మరియు/లేదా PhonePe ప్లాట్‌ఫామ్ ద్వారా Upswing ప్లాట్‌ఫామ్‌లో అందించిన సర్వీస్‌కు సంబంధించిన ఏదైనా సమాచారంతో సహా, కానీ దానికే పరిమితం కాకుండా, అందించిన సమాచారం, కంటెంట్ అనేది మీకు, PhonePeకు మధ్య ఎటువంటి కన్సల్టెన్సీ లేదా మరే ఇతర వృత్తిపరమైన సంబంధాన్ని ఏర్పరచదని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. సర్వీస్‌ను PhonePe అందించడం అనేది మీకు లేదా మరే ఇతర పార్టీకి ఎలాంటి చట్టపరమైన, అకౌంటింగ్, ట్యాక్స్, కన్సల్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ లేదా ఇతర అడ్వైజరీ సర్వీస్‌లను అందించడంగా భావించకూడదు.
- సర్వీస్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి ఫిర్యాదు పరిష్కార పాలసీని చూడండి.
- మీకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, ఈ సర్వీస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే లేదా ఆపివేసే హక్కు PhonePeకు ఉంది. సర్వీస్‌లో చేసిన ఏవైనా మార్పులు, చేర్పులు లేదా సర్వీస్‌ను నిలిపివేయడానికి సంబంధించి PhonePe మీకు ఏ రకంగానూ జవాబుదారీ కాదు లేదా బాధ్యత వహించదు.
- ఈ నియమ, నిబంధనలను PhonePe తన సొంత అభీష్టానుసారం ఎప్పటికప్పుడు సవరించవచ్చు.